మీరు ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లి అక్కడ బరువులు ఎత్తుతూ చేసే వ్యాయామాల వల్ల మతిమరపు (డిమెన్షియా) వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు ఫిన్‌ల్యాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. మరీ ముఖ్యంగా బెంచ్‌ప్రెస్ (బెంచ్‌మీద పడుకొని బరువులు ఎత్తుతూ చేసే వ్యాయామం) చేసే వారికి పెద్దవయసులోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుందని వారు పేర్కొంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్రన్ ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు వందలాది మంది పెద్దవయసు వారిపై చాలాకాలంపాటు నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా ఈ విషయాలు తెలిశాయి.
Comments
Please login to add a commentAdd a comment