Exercise
-
క్రీడల మంత్రి... సైకిల్ సవారీ...
న్యూఢిల్లీ: దేశం నుంచి ఊబకాయాన్ని పారద్రోలాలంటే ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ... ‘ఊబకాయంపై అవగాహన అత్యవసరం. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు రోజువారీ జీవితంలో వ్యాయామం ఎంతో ముఖ్యం. సైక్లింగ్ అతి సులువైన ఎక్స్‌ర్‌సైజ్. దీని వల్ల ఆరోగ్యం మెరుగవడంతో పాటు... పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి రోజూ సైక్లింగ్ చేసే వాళ్లు కాలుష్యాన్ని నివారించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు’ అని అన్నారు. ఈ సందర్భంగా మాండవీయ సైకిల్ తొక్కి ప్రజల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఐసీసీఐ, సీఐఐ ప్రతినిదులు పాల్గొన్నారు. ప్రతి వారం ఒక్కో రంగానికి చెందిన ఔత్సాహికులు ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొంటున్నారు. గతంలో ఆర్మీ అధికారులు, పోస్ట్మెన్లు, వెల్నెస్ నిపుణులు ఇలా పలు రంగాలకు చెందిన వాళ్లు ఇందులో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఒలింపియన్ అర్జున్‌లాల్ జాట్ మాట్లాడుతూ... ‘ఒక అథ్లెట్‌గా ప్రజల్లో ఆరోగ్యంపై వస్తున్న అవగాహన చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆదివారం ఉదయం పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించడం ఆహ్వానించదగ్గ విషయం. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ దిశగా ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపుతోంది’ అని అన్నారు. మరోవైపు గువాహటిలోని భారత క్రీడా ప్రాధికార సంస్థ కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో భారత మెడికల్ అసోసియేషన్‌కు చెందిన వందలాది మంది వైద్యులు పాల్గొని ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఓవరాల్‌గా దేశంలోని 4,200 కేంద్రాల్లో ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఒక్క రోజే దేశంలో 1200 ప్రాంతాల్లో ఈ ర్యాలీలు జరిగినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి దేశ ప్రజలతో తన మనసులోని మాటలు పంచుకునే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగాగా ఆదివారం నరేంద్ర మోదీ ఒబేసిటీ గురించి ప్రస్తావించారు. ఊబకాయాన్ని పారదోలేందుకు వంట నూనెల వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని దేశ ప్రజలకు సూచించారు. -
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!
బరువు తగ్గడం అనేది అనుకున్నంత సులువు కాదు. అలాగని అంత కష్టమూ కాదు. కావాల్సిందల్లా పట్టుదల. దృఢమైన నిశ్చయం ఉంటే ఈజీగా బరువు తగ్గవచ్చు. అయితే దీనికి ముందు బరువు పెరగడానికి గల కారణాలను విశ్లేషించు కోవాలి. బీఎంస్ ఇండెక్స్ ఆధారంగా ఎంత బరువున్నదీ లెక్కించు కోవాలి. దాని ప్రకారం ఎంత తగ్గాలి నిర్ణయించు కుని, జీవనశైలి మార్పులను చేసుకొని ప్రణాళికా బద్ధంగా ప్రయత్నిస్తే ఫలితం దక్కుతుంది.బరువు తగ్గాలనుకునేవారు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. పౌష్టికాహారం, వ్యాయామం, నిద్ర, తగినన్ని నీళ్లు లాంటివి చాలా అవసరం. కొన్ని ఆహార నియమాలుకీరదోసకాయ, బీర, సొరలాంటి వాటర్ కంటెంట్ ఎక్కువున్న కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి కొంచెం తిన్నా, కడుపు నిండినట్టు అనిపిస్తుంది. పైగా వేసవిలో శరీరాన్నిహైడ్రేటెడ్గా ఉంచుతాయి కూడా.తాజా ఆకు కూరల్లోని విటమిన్ సీ, విటమిన్ కే ఉంటాయి. బరువు తగ్గడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. కొత్తిమీర, పుదీనా కూడాచాలామంచిది.తక్కువ కేలరీలు ఉండే బీట్రూట్, కేరట్లలో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ వ్యవస్థ సైతం మెరుగుపడుతుంది. వేగంగా బరువు తగ్గుతారు. (వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్‌లు)లో కేలరీ పండ్లల్లో యాపిల్ చాలా ముఖ్యమైనది. ఇందులోని ఫైబర్, వాటర్ కంటెంట్ బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చ, పైనాపిల్, స్ట్రాబెర్రీ, ద్రాక్షతో పాటు జామ పండ్లను కూడా తీసుకోవచ్చు.రోజుకు 800 కేలరీల తక్కువ తింటే వారానికి 1.5-2 కేజీల వరకు బరువు తగ్గవచ్చు. సాధారణ భోజనానికి ప్రత్యామ్నాయంగా సూప్‌లు, షేక్‌లు, బార్లు వంటివి ఉపయోగపడతాయి. రోజుకు అవసరమైన అన్ని పోషకాలను పొందేలా చూసుకోవాలి.సాధారణంగా మహిళలకు రోజుకు 1,200 నుండి 1,500 కేలరీలు ,పురుషులకు 1,500 నుండి 1,800 కేలరీలు తీసుకోవచ్చు. మిల్లెట్స్, ఓట్స్, మొలకలొచ్చిన గింజలు, నూనెకు బదులుగా నెయ్యి, బాదం, అవకాడో లాంటివి కూడా చాలా మంచిది. ఇదీ చదవండి : ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?అడపాదడపా ఉపవాసంఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రోజులో 16 గంటల పాటు లేదా వారంలో 24 గంటలు ఏమీ తినకుండా ఉండటం. అంటే రాత్రి 9 నుంచి పగలు ఒంటిగంట వరకూ లేదా వారికి వీలైన 16 గంటల సమయంలో ఏమీ తినకూడదు. వీలును బట్టి ఈ 16 గంటలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బరువు ఎంత తగ్గాము అనేదిచూసుకుంటూ ఉంటే ఇంకొంచెం ఉత్సాహంగా ఉంటుంది. వ్యాయామం వేగంగా బరువు తగ్గడం అంటే వ్యాయామం ద్వారా ఎక్కువ తగ్గించుకోవడమే. ఏ రకమైన డైట్ పాటించినా, వ్యాయామం మాత్రం తప్పనిసరి. అరగంట నుంచి గంటదాకా నడక, యోగా లాంటివి తప్పకుండా చేయాలి. నోట్: అయితే కొన్ని జెనెటిక్ కారణాలు, అనారోగ్య పరిస్థితులుంటే వైద్యులను సంప్రదించి తగిన సూచనలు సలహాలు పాటించాలి. త్వరగా బరువు తగ్గాలనుకునే వారు వైద్యుల సలహా తీసుకోవాలి. కొంతమంది స్వయంగా వేగంగా బరువు తగ్గడం సురక్షితం కాకపోవచ్చు అని గమనించుకోవాలి. అలాగే తీవ్రమైన ఆహార మార్పులు, శారీరక శ్రమ ద్వారా నెమ్మదిగా బరువు తగ్గే వ్యక్తుల కంటే చాలా త్వరగా బరువు తగ్గే వ్యక్తులు కాలక్రమేణా బరువును తిరిగి పొందే అవకాశం చాలా ఎక్కువ. -
‘హెల్త్’ ఛేంజర్!
సాక్షి, అమరావతి: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు వ్యాయామం చక్కటి చికిత్సగా మారుతోంది. శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కీలక భూమిక పోషిస్తోంది. అందుకే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వ్యాయామంపై ఆసక్తి పెరుగుతోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు జిమ్‌ల బాట పడుతున్నారు. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఒక సంస్థ ‘యూకే యాక్టివ్’ పేరుతో చేసిన పరిశోధనలో ఈ విషయాలు గుర్తించారు.ప్రమాదంలో గాయపడటం వల్ల వచ్చే సమస్యలు, ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య రుగ్మతల నుంచి కాపాడటంలో జిమ్‌లు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఈ పరిశోధనలో గుర్తించారు. ‘దాదాపు దీర్ఘాకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ జిమ్‌లకు వెళుతున్నవారిలో 77శాతం మంది శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారు. ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు, నిద్ర సమస్యలను అధిగమించేందుకు, ఆరోగ్య సూత్రాలు పాటించాలనే ఆకాంక్షలతో జిమ్ సభ్యత్వాలు తీసుకుంటున్నారు’ అని ఆ సర్వేలో తేలింది. ఇదే పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఉందని ఆ సర్వే వెల్లడించింది.మరికొన్ని సర్వేల్లో తేలిన ముఖ్యాంశాలు⇒ వ్యాయామం వల్ల కలిగే ఉపయోగాల గురించి మరి కొన్ని సంస్థలు కూడా తమ పరిశోధనల్లో గుర్తించిన అంశా లను ఇటీవల వెల్లడించాయి.⇒ క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం ద్వారా టైప్–2 డయాబెటిస్ నుంచి బయటపడవచ్చని స్పోర్ట్ ఇంగ్లండ్ వెల్లడించింది. నిరాశ వంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న కేసులు కూడా వ్యాయామం వల్ల గణనీయంగా తగ్గుతున్నాయని పేర్కొంది.⇒ఫిట్నెస్ సేవలను విస్తృతం చేయడం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను అందరూ గుర్తించాలని స్పోర్ట్ ఇంగ్లాండ్ సూచించింది.⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ గత ఏడాది విడుదల చేసిన డేటా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 31శాతం మంది వ యోజనులు... అంటే సుమారు 180కోట్ల మంది అవసరమైన శారీరక శ్రమ స్థాయి కన్నా దిగువన ఉన్నారని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2030 నాటికి ఆ సంఖ్య 35శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. ⇒ ఈ క్రమంలో వారానికి కనీసం 75–150 నిమిషాలకు పైగా తీవ్రమైన శారీరక శ్రమ లేదా దానికి సమానమైన పని చేయాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.⇒ శారీరక నిష్క్రియాత్మకత వల్ల పెద్దలు గుండెపోటు, స్ట్రోకులు, టైప్–2 డయాబెటిస్, రొమ్ము, పెద్ద పేగు క్యాన్సర్లు వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ⇒ భారతీయుల్లో ఎక్కువ మంది ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి 60శాతం మంది పెద్దలు అనారోగ్యం బారినపడతారని లాన్సెట్ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళలు తగినంత శారీరకంగా చురుగ్గా లేరని తేల్చింది. -
రోజంతా కూర్చొనే ఉంటే ఎంత సేపు వ్యాయమం చేయాలో తెలుసా..!
ప్రస్తుతం చాలామటుకు కూర్చొని చేసే డెస్క్ జాబులే. దీంతో గంటలకొద్ది కంప్యూటర్ల ముందు కూర్చొండిపోవడంతో చాలామంది పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో ఎక్కువమంది బాధపడటానికి కూడా కారణం ఇదే అని చెప్పొచ్చు. అలా ఎక్కువసేపు కూర్చొవడంతో పిరుదుల వద్ద కండరాలు బిగిసుకుపోయి ఉండిపోతాయి. దీంతోపాటు కాళ్లు, తొడలు, పొత్తుకడుపులో ఫ్యాట్ కూడా పేరుకుపోతుంటుంది. దీంతో ఊబకాయం, గుండెజబ్బులు, అకాల మరణం వంటి అనారోగ్యం బారినపడుతున్నారు చాలామంది. అయితే ఈసమస్యను అధిగమించడానికి ఎంత సేపు వ్యాయమం చేస్తే మంచిదో తాజా అధయనాల్లో పరిశోధకులు వెల్లడించారు. ఎంత వ్యవధి వ్యాయమాలు మనకు హెల్ప్ అవుతాయో సవివరంగా వివరించారు. అవేంటో చూద్దామా..!.ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను భర్తీ చేయడానికి సరైన వ్యాయామం వ్యవధి జస్ట్ 40 నిమిషాలేనట. ప్రతిరోజూ '40 నిమిషాల వరకు సాధారణమైన వ్యాయమాల నుంచి శక్తిమంతమైన వ్యాయమాలు చేస్తే సరిపోతుందట. పదిగంటలు నిశ్చలంగా ఒకే చోట కూర్చోనేవారు ఇలా జస్ట్ 40 నిమిషాలు వ్యాయమానికి కేటాయిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని ధీమాగా చెబుతున్నారు పరిశోధకులు. దీనికోసం నాలుగు వేర్వేరు దేశాల్లో మొత్తం 40 వేల మందికి పైగా వ్యక్తులపై ఫిట్నెస్ ట్రాక్‌ని విశ్లేషించారు. వారిలో సూమారు 30 నుంచి 40 నిమిషాలు సాధారణ వ్యాయమాలతో మొదలై అధిక తీవ్రత వ్యాయమాలతో పూర్తి చేసిన వ్యక్తుల్లో ఎలాంటి అనారోగ్య ప్రమాదాలు ఉండవని తేలింది. వారిపై దుష్ర్పభావాలు గణనీయంగా తగ్గినట్లు వెల్లడైందని అన్నారు. ఎక్కువ గంటలు కూర్చొని పనిచేసే వ్యక్తుల ముఖ్యంగా సైక్లింగ్, వాకింగ్, తోటపని వంటివి చేస్తే వారిపై ఎలాంటి అనారోగ్యం ప్రభావం ఉండదని అన్నారు.తప్పనిసరిగా చేయవల్సినవి.. ప్రతి గంటకు 5 నిమిషాలు నడవడం. చిన్న చిన్న విరామాలు తీసుకోవడం. అలాగే తుంటి, నడుమ భాగాలను సాగదీయడం వంటివి చేస్తే ఎక్కువసేపు కూర్చొవడం వల్ల ఎముకలు పట్టేసినట్లు అనిపించవట.అలాగే బరువు వ్యాయామాలు చేయడం వల్ల బాడీ తేలికగా ఉంటుందట. స్క్వాట్లు, పుష్ అప్లు కండరాలను సక్రియం చేస్తాయి, జీవక్రియనున పెంచుతాయి. సాధ్యమైనంత వరకు స్టాండింగ్ డెస్క్‌ను ఉపయోగించడం వల్ల ఎక్కువసేపు కూర్చొవడాన్ని నిరోధించొచ్చుమెట్టు ఎక్కడం వంటివి కూడా మంచి ఫలితాన్ని అందిస్తాయట. ఈ కొత్త పరిశోధన బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలను మనకున్న పరిమితుల్లోనే సులభంగా అధిగమిద్దాం ఆరోగ్యంగా ఉందాం.(చదవండి: రాయల్ డెజర్ట్ "మైసూర్ పాక్" ఎవరు తయారు చేశారో తెలుసా..!) -
బోసు బాల్‌తో నటి కొత్త కసరత్తులు వైరల్ : అసలేంటీ బోసు బాల్ ఎక్స్‌ర్‌సైజ్?
బరువు తగ్గడానికి శరీరాన్ని దృఢంగా ఆ మార్చుకోవడానికి వ్యాయామం ఒక్కటే మార్గం. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనేది వారి వారి వ్యక్తిగత అవసరాలు, ఇష్టా ఇష్టాలమీద ఆధారపడి ఉంటుంది. యోగా, వాకింగ్, జాకింగ్ లాంటి వాటితో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది బోస్ బాల్ వ్యాయామం. బోసు బాల్ (BOSU Ball) వ్యాయామం మొత్తం శరీరాన్ని పటిష్టంగా మారుస్తుంది. శరీరంతోపాటు, జీవిత సమన్వయ సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. తాజాగా బోసు బాల్ వ్యాయామాన్ని అలవోకగా చేస్తోంది నటి శిల్పా శెట్టి (Shilpa Shetty Kundra).యోగాసనాలు, జిమ్‌లో కసరత్తులతో అభిమానుల ఆకట్టుకునే శిల్పా బోసు బాల్ మీద చాలా బ్యాలెన్సింగ్ వ్యాయామాలుచేస్తున్న వీడియోను మండేమోటివేషన్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.బోసు బాల్ వ్యాయామం శరీరంలోని అన్ని కండరాలను బలోపేతం చేస్తుందని శిల్పా చెప్పుకొచ్చింది. సమతుల్యతను, బ్యాలెన్సింగ్ మెరుగుపరుస్తుందని తెలిపింది. క్రియాత్మక ఫిట్నెస్ను పెంచుతుందని, అలాగే పట్టు తప్పి పడిపోవడం, గాయాల ప్రమాదాలను తగ్గిస్తుందని తెలిపింది.ఎలా చేస్తారు?ఒక ప్లాస్టిక్ బేస్‌మీద రబ్బరు బంతిని అమరుస్తారు. దీనిమీద స్క్వాట్స్, పుష్ అప్ప్, జంపింగ్, ప్లాంక్స్, హాప్స్, షోల్డర్ టాప్స్, మౌంటైన్ క్లైంబర్స్ఇలాచాలా రకాల వ్యాయామాలను చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. బరువు కూడా తొందరగా తగ్గుతారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) బౌన్స్ అవుతున్న బంతిమీద వ్యాయామం అంటే అన్ని కండరాలను యాక్టివేట్ చేస్తుంది. శరీరాన్ని ఎలా నియంత్రించుకోవాలో అలవడుతుంది. బోసు బాల్ వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి మంచిది. సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పుష్-అప్స్, జంప్స్ చేయడంలో వల్ల టోన్ల్ బాడీ సొంతం చేసుకోవచ్చు. వివిధ రకాల కండరాల సమూహాలను లక్ష్యంగా 15 నిమిషాల పాటు చేస్తే చేయాలి.45-60 నిమిషాలు మంచి ఫలితం ఉంటుంది. మెదడికి, శరీరానికి మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. మానసిక బలం చేకూరుతుంది. బోసు బాల్ వ్యాయామాలు, ప్రయోజనాలుబోసు బాల్ వ్యాయామంతో అనేక రకాల(health benefits) ప్రయోజనాలున్నాయి. నిజానికి ఈ వ్యాయామం శారీరక బలానికి ఒక పరీక్ష లాంటిది. ఇది ఒక్కసారి అలవాటైతే చక్కని శరీర సౌష్టవంతోపాటు దేహ దారుఢ్యంగా కూడా పెరుగుతుంది, బ్రహ్మాండమైన ఫిట్నెస్ మన సొంతమవుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలుఆరంభంలో సరియైన నిపుణుడు, లేదా శిక్షకుడి ఆధ్వర్యంలో వీటిని చేయాల్సి ఉంటుంది. బోసు బంతితో వ్యాయామం చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ప్రధాన విషయం ఏమిటంటే ఈ బాల్‌పై ఎలాంటి ఎక్స్‌ర్‌సైజ్ చేసినా, తొందర పడకుండా, నిదానంగా బ్యాలెన్సింగ్‌ను అలవర్చుకోవాలి. భుజాలు వెనుకకు, తల తటస్థంగా ఉండేలా సరియైన భంగిమలో ఉండాలి. బంతిపై నిలబడి ఉన్నప్పుడు మోకాళ్లను వదులుగా ఉంచుకోవాలి. ఇది బాల్ పై కదలికల సమయంలో, లేదా కొంచెం వంగినపుడు పడిపోకుండా సహాయపడుతుంది ఇవీ చదవండి: 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయంపెళ్లై పాతికేళ్లు : ఆంటీ కోసం అంకుల్ రొమాంటిక్ డ్యాన్స్! వైరల్వీడియో -
Sonnalli Seygall Tips: గర్భం ధరించినప్పుడు.. ఇలా చేస్తే నార్మల్ డెలివరీ!
ఇటీవల కాలంలో చాలామటుకు సీజేరియన్లే కానీ నార్మల్ డెలివరీ ఎవరికో గానీ అవ్వడం లేదు. ఎవరికైనా నార్మల్ డెలివరీ అయ్యిందంటే చాలు అవునా..! అని ఆశ్చర్యపోతున్న రోజులివి. చాలామంది కాబోయే తల్లులు సైతం సుఖ ప్రసవం అన్న ఆలోచనకే తావివ్వడం లేదు. ఎందుకంటే సాధారణ ప్రసవంలో ఉండే నొప్పులకు భయపడి సీజేరియన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సర్జరీల వల్ల ఎదురయ్యే దీర్ఘకాలిక సమస్యల గురించి ఆలోచించడం లేదని ఆరోగ్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. అయితే సెలబ్రిటీలు సైతం ప్రస్తుతం నార్మల్ డెలివరీకే ప్రాధన్యాత ఇస్తున్నారు. అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల తోపాటు గర్భధారణ వ్యాయామాలు కూడా చేస్తున్నారు. ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడడ్ నటి సోనాలి సెగల్ సైతం నార్మల డెలివరీకే ప్రాధాన్యత ఇవ్వండి అని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆరోగ్య స్ప్రుహని కలిగిస్తోంది. తాను గర్భం ధరించినప్పుడూ చేసిన వ్యాయామాలు, తీసుకున్న జాగ్రత్తలు గురించి కూడా షేర్ చేశారు. అవేంటంటే..బాలీవుడ్ ప్రముఖ నటి సోనాలి సెగల్(Sonnalli Seygall) ఆమె భర్త ఎల్ సజ్నాని దంపతులు నవంబర్27, 2024న షుకర్ అనే ఆడ శిశువుకి జన్మనిచ్చిన సంగతి తెలిసింది. ఆమె ఇన్‌స్టా వేదికగా కాబోయే తల్లలు గర్భం దాల్చినప్పటి నుంచే నార్మల్ డెలివరీ(Normal delivery)కి సిద్ధం అయ్యేలా దైనందిన దినచర్యలో మార్పులు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆ టైంలో ప్రెగ్నెన్సీ(Pregnancy)కి అనుగుణమైన వ్యాయామాలు చేయడం మంచిదన్నారు. తాను కూడా గర్భం ధరించినప్పుడూ తొమ్మిదో నెల వరకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన వ్యాయామాలు చేసినట్లు తెలిపింది. గర్భం చివరి దశ వరకు స్విస్ బాల్ వ్యాయామాలు(Swiss ball exercises) చేయాలని, అవి కోర్ బలం అందించి ప్రసవం తేలిగ్గా అయ్యేందుకు ఉపకరిస్తుందని చెబుతోంది. ఆ సమయంలో ఉండే నడుమ నొప్పులను నివారించడానికి ఈ వ్యాయామాలు తోడ్పడతాయని అన్నారు. ముఖ్యంగా తొమ్మిదో నెలలో డెలివరీకి సిద్ధం అయ్యేలా శరీరాన్ని రెడీ చేసేలా నిపుణలు సమక్షంలో వ్యాయామాలు చేయడం మంచిదని సూచించింది. సీ సెక్షన్ రేటు పెరుగుతున్నందున తాను నార్మల్ డెలివరీకే మొగ్గు చూపినట్లు తెలిపారు. ఈస్విస్ బాల్‌తో చేసే ఎనిమిది దశల వ్యాయామాలు సాధారణ ప్రసవా అయ్యేలా కటి భాగాన్ని రెడీ చేస్తుందట. అదెలాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో సోనాలి వివరించారు. అలాగే గర్భం చివరి దశలో శిశువు శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చేలా ఆరోగ్యంగా ఉండటం, సౌకర్యవంతమైన వర్కౌట్లు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసవం క్రిటికల్‌గా ఉందన్న సమయంలో తప్పించి, చాలామటుకు ప్రతి మహిళ నార్మల్ డెలివరీ అయ్యేలా తగిన జాగ్రత్తలు ముందు నుంచి తీసుకోవాని అంటోంది సోనాలి సెగల్. అదే మహిళ ఆరోగ్యానికి అన్ని విధాల మంచిదని చెబుతోంది. కాగా సోనాలి సెగల్.. ప్యార్ కా పంచనామా సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. వెడ్డింగ్ పులావ్, ప్యార్ కా పంచనామా 2, హైజాక్, జై మమ్మీదీ, జో తేరా హై వో మేరా హై చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె బ్లాక్ కరెన్సీ, నూరని చెహ్రా, బూండి రైతా సినిమాలతో బీజీగా ఉంది. View this post on Instagram A post shared by Sonnalli A Sajnani (@sonnalliseygall) (చదవండి: పచ్చని పల్లెలో మెచ్చే సర్పంచులు..!) -
ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే ఇలా చేయండి!
శరీరం తేలికగా కదలటానికి, చురుకుగా ఉండటానికి ఎముకలు బలంగా ఉండటం ఎంతైనా అవసరం ఎముకలు బలహీనపడితే.. విరగడం, ఆస్టియోపోరోసిస్ ముప్పు పెరుగుతుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవన శైలిమార్పులతోపాటు, వ్యాయామాన్ని కూడా క్రమం తప్పకుండా చేయాలి. ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి, అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదాన్ని నివారించగల శక్తి అధో ముఖానికి ఉంది. రోజూ ఈ ఆసనాన్ని దినచర్యలో భాగం చేస్తూ ఉంటే మైండ్, బాడీ చురుకుదనం పెరుగుతుంది. ఇలా వేయాలి....∙మ్యాట్ పైన లేదా నేలపైన నిటారుగా నిల్చొని చేతులను పైకి స్ట్రెచ్ ఉంచాలి. తర్వాత నడుం భాగం వంచుతూ, చేతులను పూర్తిగా నేలమీద ఆనించాలి. ∙చేతులను పాదాలకు దూరంగా తీసుకెళుతూ త్రికోణాకారంలో ఉండాలి.కాలి వేళ్ల మీద ఉంటూ మడమలను పైకి లేపాలి. శరీర బరువు చేతులు, కాలి ముని వేళ్ల మీద ఉంటుంది. ∙నిమిషం సేపు ఇదే భంగిమలో ఉండాలి. తిరిగి యధాస్థితికి రావాలి. ఇలా ఒకటి నుంచి 3 సార్లు ఈ ఆసనాన్ని పునరావృతం చేయాలి.ఈ ఆసనం వేయటానికి మొదట్లో కాస్త కష్టంగా వున్నా రోజూ సాధన చేస్తూ ఉంటే సులువవుతుంది. వెన్నెముక, కాళ్ళను బలోపేతం చేస్తుంది. అదే విధంగా ఏకాగ్రత పెంచి, ఒత్తిడి నుండి రిలీఫ్‌ని ఇస్తుంది. అజీర్తి సమస్యలు దూరమవుతాయి. నడుము నొప్పి తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్ సమస్య నుండి రక్షిస్తుంది. సైనస్, ఆస్తమా, పీరియడ్స్‌లో వచ్చే సమస్యల నుంచి రిలీఫ్‌ని ఇస్తుంది. ఇన్ని ప్రయోజనాలని ఈ ఆసనం ద్వారా పొందవచ్చు. ఎముకలు దృఢంగా ఉండటానికి ఏం చేయాలి?ఎముకలు దృఢంగా ఉండాలంటే.. సమతుల్య, పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి.కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు సమృద్ధిగా లభించే ఆహారం తినాలి.పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు తినాలి.విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారాలు తినాలి.బాల్యంలో ఎముకలు దృఢంగా ఉండటానికి పోషకాలు తీసుకోవడం ముఖ్యం.వ్యాయామం చేయడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.మెనోపాజ్ దాటిన స్త్రీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.ఎముకలు, కండరాలను బలోపేతం చేసేలా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.ఇదీ చదవండి: టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి -
ఏకంగా 28 కేజీలు తగ్గింది : ఎలా ఉండేది..ఎలా అయ్యింది?!
అందరికీ తెలుసు బరువు తగ్గడం అంత ఈజీకాదు అని. కానీ ఆచరించడంలో విఫలమవుతూంటారు. అనుకున్నది సాధించాలంటే తగిన కృషి ఉండాలి. ఆ కృషిని కష్టంగా కన్నా ఇష్టంగా, పట్టుదలగా చేయడం ముఖ్యం. అలా దీక్షగా ప్రయత్నించిన పోషకాహార నిపుణురాలు దీక్ష బరువు తగ్గింది. నమ్మలేక పోతున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.వృత్తిపరంగా పోషకాహార నిపుణురాలు అయిన దీక్షఏకంగా 28 కిలోల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సందర్బంగా తీసుకున్న జాగ్రత్తలు, ఆహార నియమాలతో తన వెయిట్‌లాస్ జర్నీని ప్రభావితం చేసిన అంశాలను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది.“మీరు ఇంటర్నెట్లో చూసే ప్రతిదాన్ని నమ్మొద్దు; మీరు ఈ దినచర్యను అనుసరించడం ప్రారంభిస్తే బరువు తగ్గడం మొదలవుతుంది. నేను 28 కిలోల బరువు తగ్గాను, నేను మళ్ళీ చేయాల్సి వస్తే, నేను ఇలాగే చేస్తాను,” అంటూ ఒక రీల్లో వివరాలను తెలిపింది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన జర్నీని స్నిప్పెట్లను పంచుకోవడం దీక్షకు అలవాటు.ఇదీ చదవండి: కుమారుడి ఒకే ఒక్క మాటకోసం : ఏకంగా 22 కిలోలు తగ్గాడు! అయిదు సూత్రాలువేగంగా బరువు తగ్గాలని ప్రయత్నించకండి. నెమ్మదిగా, స్థిరంగా తగ్గితేనే ఆ బరువు మెయింటైన్ అవుతుంది. లేదంటే ఎంత తొందరగా తగ్గితే.. అంత వేగంగా మళ్లీ బరువు పెరుగుతారు.బ్యాలెన్స్ డైట్ ముఖ్యం. మధ్య మధ్యలో ఇష్టమైనవి తింటూనే, సుగర్ని దూరం పెట్టండి. రాత్రి పూట తొందరగా భోజనం ముగించండి.కచ్చితంగా ఉండాలి. బరువు తగ్గడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించేటప్పుడు ఇది అవసరం. ఆహారం, వాకింగ్, వ్యాయామం, నీరు తీసుకోవడం, నిద్ర అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక వేళ కొంచెం ఎక్కువ ఫుడ్ తింటే ఎక్కువ వ్యాయామం చేయాలని నిబంధనను మనకు మనం విధించుకోవాలి. View this post on Instagram A post shared by Diksha - Certified Nutritionist | Integrative Health Coach | (@a.l.i.g.n_) దీక్ష -ఆహారంఉదయం పానీయం: ధనియాలు, సెలెరీ గింజలు ,అల్లం, జీరాతో చేసిన వాటర్ అల్పాహారం: 2 గుడ్లు , కొన్ని ఉడికించిన పుట్టగొడుగులు, కూరగాయలు , పుదీనా చట్నీతో పెసరట్టుటిఫిన్కి, భోజనానికి మధ్య : బాదం పాలు కాఫీ. కొబ్బరి నీళ్లు ఇది కూడా ఆప్షనల్.లంచ్: చికెన్ , హమ్మస్ (ఉడికించిన బఠానీవెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం , ఉప్పు కలిపిన మిశ్రమంపై కొద్దిగా ఆలివ్ ఆయిల్ చల్లాలి) సలాడ్.సాయంత్రం స్నాక్: అవసరం అనుకుండే గుప్పెడు వేయించిన శనగలు, ఏదైనా పండు, అయిదారు నట్స్డిన్నర్ : బాగా ఉడికిన చికెన్ . పాలకూర సూప్, 1/2 కప్పు ఉడికించిన మొలకలుబరువు తగ్గడాన్ని ప్రభావితం చేసే విషయాల్లో ఆహారం ఒక్కటేకాదు. ఇతర అంశాలు కూడా ఉన్నాయంటూ దీక్ష చెప్పుకొచ్చింది. బరువు తగ్గే క్రమంలో ఆహారం ఒక భాగం. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, సరైన నిద్ర చాలా అవసరం. వారానికి 4-5 రోజులు కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయండి.రోజుకు 10 వేల అడుగులు నడవాలి. ప్రతిరోజూ 3 లీటర్ల దాకా కు నీరు త్రాగాలి. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. ముఖ్యమైనవి, పెద్దగా పట్టించుకోనివి నిద్ర ,ఒత్తిడి. నిజానికి ఇవి గేమ్ ఛేంజర్లు అంటుంది దీక్ష. -
కుమారుడి ఒకే ఒక్క మాటకోసం : ఏకంగా 22 కిలోలు తగ్గాడు!
పిల్లలకోసం, పిల్లల కోరికమేరకు కొండ మీది కోతిని తెమ్మన్నా తేవడానికి సిద్ధంగా ఉంటారు తల్లిదండ్రులు. పిల్లల సంతోషం కోసం ఎంత కష్టమైనా భరించడానికి సన్నద్దమవుతారు. అలా 40 ఏళ్ల తండ్రి చేసిన సాహసం గురించి వింటే ఔరా అంటారు. నిబద్దతతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించాడు. క్షణం ఆలస్యం చేయకుండా అంతటి ఆశ్చర్యకరమైన స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి మరి..సుమిత్ దబాస్ (40) రీటైల్ మేనేజర్‌గా పనిచ్తేస్తున్నారు. తన ఆరోగ్యం గురించి లేదా శరీరం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అప్పటికి అతను బరువు 90 కిలోలు. గతంలో ఉన్నంత బలం లేదు. అయితే ఏడేళ్ల కుమారుడి కోరిక మేరకు 40 ఏళ్ల వయసులో సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా 22 కిలోల బరువు తగ్గి సిక్స్‌ప్యాక్ బాడీ సాధించాడు అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా ఏమీ సాగలేదు. క్రమశిక్షణతో ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని, వ్యాయామం సాయంతో అనుకున్నది సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. ఇంతకీ కొడుకు కోరిక ఏమిటంటేకానీ అతని కొడుకు నివాన్ ఒక రోజు తండ్రిని చూసి "నాన్న, మీ బలమైన శరీరాన్ని ఎప్పుడూ చూడలేదు. మీరు మళ్ళీ ఫిట్ బాడీని పొందగలరానా స్నేహితులకు చూపించాలని ఉంది’’ అన్నాడు. అంతే ఎలి అయినా సిక్స్ ప్యాక్‌తో ఫిట్ బాడీ సాధించాలనుకున్నాడు.సుమిత్‌కు క్రికెట్ అతనికి ఇష్టమైన ఆట. కానీ అంత పెద్ద భారీ కాయంతో క్రికెట్ ఆడే ఓపిక లేదు. ప్రొఫెషనల్ పర్సనల్ ట్రైనర్ అయిన సుమిత్, తన బరువు తగ్గే ప్రయాణంలో, మనస్తత్వాన్ని మార్చుకోవడం ముఖ్యమని కూడా అర్థమైంది. View this post on Instagram A post shared by Sumit Dabas (@sumitdabas2020)తొలి అడుగుతొలి ఆరు నెలలు విపరీతంగా కష్టపడ్డాడు. కానీ చాలా అర్థమైంది. జీవనశైలి మార్పులుతో 15 కిలోల బరువు తగ్గి 90 కాస్త 75కి వచ్చింది. కానీ ఇంకా తగ్గాలి. కండలు రావాలి. సిక్స్ ప్యాక్ బాడీ రావాలంటే, ప్రొఫెషనల్ ట్రైనర్ అవసరమని గ్రహించాడు.హేమంత్ అనే ఫిట్నెస్ కోచ్ ఆధ్వర్యంలో ట్రాక్‌లోకి వచ్చింది. అధిక ప్రోటీన్, తక్కువ కేలరీల ఆహారాన్ని సిద్ధం చేశాడు. ఇక వ్యాయామం విషయానికి వస్తే, సుమిత్ హెవీ ఎక్సర్సైజ్ల మక్కువ పెంచుకున్నాడు. ఇదే కండల నిర్మాణంలోనూ మొత్తం శారీరక రూపాన్ని అందంగా మార్చడంలో తోడ్పడింది అంటాడు కండలు తిరిగిన దేహంతో సుమిత్.మొత్తానికి ఏడాది కష్టం తరువాత ఇపుడు సుమిత్ బరువు 68 కిలోలు. తన కొడుకుకు గర్వకారణమైన తండ్రిగా నిలిచాడు. తన పిల్లలతో ఆడుకోవడమైనా, తనకు ఇష్టమైన క్రీడ క్రికెట్ ఆడటమైనా, గతంలో కష్టంగా కాకుండా, ఇష్టంగా,హాయిగా ఆడుతున్నాడు. ఈ వెయిట్ లాస్ జర్నీలో సహకరించిన కుటుంబానికి, కోచ్‌కీ సుమిత్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతి దశలోనూ తన భార్య , కుమార్తె ప్రోత్సహించారని, నివాన్ ఉత్సాహం తన బరువు తగ్గే ప్రయాణాన్ని సులభతరం చేసిందని సుమిత్ చెప్పాడు.బరువు తగ్గాలనుకునే వారికి సుమిత్ ఇచ్చే చిట్కాలు ఏమిటి?చీట్ మీల్ తీసుకున్నా లేదా అప్పుడప్పుడు వ్యాయామం దాటవేసినా పెద్దగా బాధపడకండి. చేయాల్సిన దానిపై దృష్టిపెట్టి, ముందుకు సాగండి. పట్టుదలగా లక్ష్యం వైపు సాగండికుటుంబం, స్నేహితులు , కోచ్ సహాయం తప్పనిసరిగా తీసుకోండి. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది...బరువు తగ్గడం అనేది రాత్రికి రాత్రే అయ్యే పనికాదు. సుదీర్ఘకాలంపాటు పట్టుదలగా క్రమశిక్షణతో చేయాలి.ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి, ఏ దశలోనూ ప్రయత్నాన్ని వదులుకోవద్దు. -
2025లో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ..బెస్ట్ టిప్స్!
చిరకాలం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం చాలా ముఖ్యం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. 2025లోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, జీవనశైలి మార్పులు ఆరోగ్యంపై ఎంత ప్రభావితం చేస్తాయనే దానిపై పెరుగుతున్న అవగాహనతో, ప్రోటీన్లు, ఒమేగా-3లు, విటమిన్లు , ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలకు ప్రాధాన్యత గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇదే మన భవిష్యత్ ఆనందానికి, ఆరోగ్యానికి బలమైన పెట్టుబడి.పోషకాహారం అంటే కేలరీలను లెక్కించడం గురించి మాత్రమే కాదు. అది శరీరానికి ఎంత అవసరమో తెలుసుకోవడం. ఆరోగ్యంగా ఉండటానికి శక్తితోపాటు సూక్ష్మపోషకాల కోసం సరైన మాక్రోన్యూట్రియెంట్లు ఉండేలా చూసుకోవాలంటున్నారు. అబాట్, న్యూట్రిషన్ బిజినెస్, మెడికల్ & సైంటిఫిక్ అఫైర్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి ఠాకూర్. ఆహారపు అలవాట్ల పట్ల మరింత శ్రద్ధ వహిస్తున్నందున, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇది ఆరోగ్యకరమైన ఆహార విధానాలకు దారితీస్తుంది. ముఖ్యంగా నోటి పోషక పదార్ధాలు (ONS) పోషకాహార లోపాలను పూరించడానికి, పోషకాహార లోపాన్ని నివారించడానికి సహాయపడుతంది. ముఖ్యంగా ఆకలి లేని వారికి, పోషకాహార లోపం ఉన్నవారికి,పోషకాలను గ్రహించడంలో ఇబ్బంది ఉన్న వ్యక్తులకు ఇది సాయపడుతుంది.పోషకాహారం & అభివృద్ధి చెందుతున్న పోషక అవసరాలను అర్థం చేసుకోవడంపోషకాహారం అంటే ఏంటి అనేది అస్పష్టంగా ఉండిపోతున్నప్పటికీ, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి పోషకాహారం చాలా అవసర అనేది మనందరికీ తెలుసు. శాకాహారం పాలియో డూట్, గ్లూటెన్-రహిత , కీటో డైట్ వంటివి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇందులో దేన్ని ఎంచుకోవాలనేది కష్టంగా అనిపించినా, సమతుల్యమైన ఆహారం అందరికీ శ్రయస్కరం అనేది అధ్యయనాలతోపాటు అందరూ అంగీకరించే విషయం.ఎదుగుతున్న క్రమంలో వివిధ దశల ఆధారంగా పోషక అవసరాలు పెరుగుతాయి. ఉదాహరణకు, పిల్లలకు పెరుగుదలకు అధిక మొత్తంలో కొన్ని పోషకాలు అవసరం, పెద్దలు కండబలం, ఎముక సాంద్రతను నిర్వహించడంపై దృష్టి పెట్టాలి. అదే వద్ధులైతే కండరాల నష్టాన్ని నివారించేలా, ఎక్కువ ప్రోటీన్ , అభిజ్ఞా పనితీరును నిర్వహించడానికి విటమిన్‌డీ, బీ 12 అదనపు విటమిన్లు అవసరం పడుతుంది. ఈ మార్పులను గుర్తించడం అనేది చాలా ముఖ్యమైనది.పెద్దల ఆహారం-ముఖ్యమైన పోషకాలుప్రోటీన్: ఇది కండరాల మరమ్మత్తుకు పెరుగుదలకు మద్దతు ఇస్తుంది . పప్పు (కాయధాన్యాలు), చిక్పీస్, కిడ్నీ బీన్స్ (రాజ్మా), పనీర్ (కాటేజ్ చీజ్), గుడ్లు ,చికెన్ ద్వారా దీన్ని పొందవచ్చు.కార్బోహైడ్రేట్లు: శరీరానికి ప్రాథమిక శక్తి వనరు అయిన కార్బోహైడ్రేట్లు సాధారణంగా బియ్యం, గోధుమ రోటీ, పోహా, ఓట్స్, చిలగడదుంపల్లో లభిస్తాయి.ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు: గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంతోపాటు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి అవిసె గింజలు (ఆల్సి), వాల్నట్లు, ఆవనూనె , ఇండియన్ మాకేరెల్ (బంగ్డా) లేదా రోహు వంటి చేపల ద్వారా అందుతాయి.ఫైబర్: ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్, మిల్లెట్ వంటి తృణధాన్యాలు, జామ ,ఆపిల్ వంటి పండ్లు, పాలకూర , బ్రోకలీ వంటి కూరగాయలు, ఇంకా సైలియం పొట్టు (ఇసాబ్గోల్)లో లభిస్తుందివిటమిన్లు:విటమిన్ డి: ఎముకల ఆరోగ్యానికి కాల్షియం శోషణకు సహాయపడుతుంది. పాలు, పెరుగు,సూర్యకాంతి ద్వారా పొందవచ్చువిటమిన్ ఇ: యాంటీఆక్సిడెంట్, కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. బాదం, పొద్దుతిరుగుడు గింజలు, ఆవ ఆకూరలో ఉంటుంది.విటమిన్ సి: రోగనిరోధక పనితీరుకు,ఆరోగ్యానికి అవసరం, నారింజ ,యు నిమ్మకాయలు, ఆమ్లా (ఇండియన్ గూస్బెర్రీ), జామ వంటి సిట్రస్ పండ్లలో లభిస్తుందివిటమిన్ బి6: మెదడు ఆరోగ్యం , జీవక్రియకు ముఖ్యమైనది, అరటిపండ్లు, బంగాళాదుంపలు, పొద్దుతిరుగుడు విత్తనాలలో లభిస్తుందివిటమిన్ బి12: నాడీ పనితీరుకు, రక్త కణాల ఉత్పత్తికి ముఖ్యమైనది, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు,బలవర్థకమైన తృణధాన్యాలలో లభిస్తుందిఖనిజాలు:కాల్షియం: ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది, పాలు, పెరుగు, రాగి (Finger millets) నువ్వుల గింజల్లో ఎక్కువ లభిస్తుంది.ఐరన్: జీవక్రియ ప్రక్రియలకు మద్దతు ఇస్తుంది. పాలకూర, మెంతి ఆకులు ((Fenugreek), బెల్లం (గుర్), పప్పుధాన్యాలు (పప్పు) ద్వారా లభిస్తుందిజింక్: రోగనిరోధకశక్తి, గాయాలను నయం చేయడంలో సాయపడుతుంది. గుమ్మడికాయ గింజలు, చిక్పీస్ . బజ్రా వంటి తృణధాన్యాలలో లభిస్తుంది.రోజువారీ భోజనం ఎలా ఉండాలంటే..సామెత చెప్పినట్టుగా "రాజులాగా అల్పాహారం, యువరాజులాగా భోజనం, బిచ్చగాడిలా రాత్రి భోజనం’’ ఉండాలి. కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్లు ఎక్కువ ఉండాలి. కొవ్వులు జీర్ణం కావడం కష్టం కాబట్టి, వాటిని అల్పాహారం , భోజనంలో తీసుకోవాలి. అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి భోజనం తేలిగ్గా ఉండాలి. ఆహారానికి మధ్యలోచాలా విరామం తర్వాత తీసుకునే భారమైన అల్పాహారం శక్తివంతమైందిగా ఉండాలి. అయితే పరగడుపున శరీరంలోని మలినాలను బైటికి పంపేందుకు గోరువెచ్చని నీరుతాగిలి. సీజన్‌ను బట్టి కూరగాయలు, పప్పుధాన్యాల నుండి తయారు చేసిన పోహా, ఉప్మా, దోస, ఇడ్లీ లేదా చీలా పవర్పేక్డ్ కార్బోహైడ్రేట్స్‌ను తీసుకోవచ్చు.2025లో చిన్న చిన్న మార్పులు, భారీ లాభాలు చిన్న మార్పులు మన మొత్తం ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలకు దారితీస్తాయిసమతుల ఆహారంపై దృష్టిపెట్టడంప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడంహైడ్రేడెట్గా ఉండటం, అంటే రోజుకు సరిపడినన్ని నీళ్లు తాగడం.పోషకాహారం తీసుకుంటూ ఎముకలు కండరాల బలాన్ని పెంచుకునేందుకు క్రమం తప్పని వ్యాయామం. ఆరోగ్య సంరక్షణలో శారీరక శ్రమ చాలా కీలకం. వారానికి కనీసం రెండుసార్లు బలమైన వ్యాయామాల వల్ల సమతుల్యత మెరుగుపడుతుంది. నడక, ఈత లేదా యోగా వంటివి ఫిట్‌నెస్‌కు దోహదం చేస్తాయి.ఈ ఏడాదిలో ఆరోగ్యకరమైన జీవనంపై దృష్టి పెడదాం. శరీరానికి బలాన్నిచ్చే ఆహారాన్ని, చురుకునిచ్చే వ్యాయామాలను, సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించే మార్పులను స్వీకరిద్దాం. తద్వారా సమిష్టిగా జీవితాన్ని ఆరోగ్యకరంగా, సంతోష కరంగా మార్చుకుందాం. ఇదీ చదవండి: కొత్త బంగారు లోకం.. అనాథ చిన్నారులకు ఆహ్వానం -
37 కిలోలు తగ్గి, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన గృహిణి
వెయిట్ లాస్ జర్నీ అంత ఈజీగా సాగదు. మరీ ముఖ్యంగా పెళ్లి, పిల్లలు తరువాత విపరీతంగా పెరిగిన బరువును తగ్గించుకోవడం మహిళలకు కత్తిమీద సామే. ఎంతో పట్టుదల కావాలి. అలా 37 కిలోల బరువును తగ్గించుకొని ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా అవతరించిందో గృహిణి. అసాధ్యం కాదు అనుకున్న దాన్ని సాధ్యం చేయడంలో ఉన్న కిక్కే వేరు అంటున్న ఆ గృహిణి గురించి తెలుసుకుందామా...!బరువు తగ్గే క్రమంలో 36 ఏళ్ల తనుశ్రీ అనే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ తన స్ఫూర్తిదాయకమైన ప్రయాణం సోషల్ మీడియాను ఆకర్షిస్తోంది. అంకితభావం , పట్టుదలతో ఆమె సాధించిన విజయంపై ప్రశంసలు లభించాయి. View this post on Instagram A post shared by Tanusree Srcd (@livefitwithtanu) బాల్యం నుంచీ బొద్దుగానే ఉం డే తనుశ్రీ తన ఇరవైలలో,ముఖ్యంగా గర్భం దాల్చిన తర్వాత బాగా బరువు పెరిగిపోయింది. దీంతో పెరిగిన తన శరీరాన్ని చూసుకొని ఆశ్చర్యపోయింది. దీంతో తన కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గిపోతున్నాయని గమనించింది. తన ఆరోగ్యం, విశ్వాసాన్ని తిరిగి పొందాలని నిశ్చయించుకుని రంగంలోకి దిగింది. View this post on Instagram A post shared by Tanusree Srcd (@livefitwithtanu) తల్లిగా, గృహిణిగా ఇంటి బాధ్యతలను మోస్తూనే గత ఆరేళ్లకుపైగా పట్టుదలగా ఆహార నియమాలు, ఇంట్లోనే సులువైన వ్యాయాయాలు ఆచరించింది. తాను అనుకున్నది సాధించింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే వెనక్కి తగ్గలేదు. ఒక ప్రణాళికగాబద్దంగా తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటూ, గృహోపకరణాలతోనే క్రియేటివ్‌గా వ్యాయామాలను చేసింది. జీవనశైలి మార్పులతో పాటు స్వీయ సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చింది. తను అనుకున్న ఫిట్నెస్ లక్ష్యాన్ని చేరుకుంది.ఈ వీడియో చేసిన నెటిజన్లు ఆమెను కొనియాడారు. భలే చేంజ్ కనిపించింది. శారీరకంగా , మానసికంగా తన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకునే, ప్రేమించే వ్యక్తి కంటే అందమైనది ఇంకేముంటుంది. మంచి పనిచేస్తున్నారు..ఇలాగే ముందుకెళ్లండి అంటూ ఆమె ఫాలోయర్లు ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. ‘‘ఇంతకు ముందులా గృహస్థంగా, అమాయకంగా కాకుండా, ఇపుడు నమ్మకంగా, బలంగా, అందంగా కనిపిస్తున్నారు.కష్టే ఫలి అంటే ఇది కొందరు వ్యాఖ్యానించారు. "అద్భుతం, మీలోని మార్పు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ స్ఫూర్తి చాలా ప్రశంసనీయం నా భార్య కూడా 2018 సంవత్సరంలో అచ్చం ఇలాంటి విజయాన్నే సాధించిందని మరో యూజర్ కామెంట్ చేశారు. -
పట్టుదలగా చేస్తే.. గుట్టలాంటి బెల్లీ ఫ్యాట్ దెబ్బకి...!
కొండలాంటి పొట్టను కరిగించుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారా? ఎంత కష్టపడినా బెల్లీ ఫ్యాట్ తగ్గడంలేదని ఆందోళనలో ఉన్నారా? మరి అలాంటివారికి చక్కగా ఉపయోగపడే పురాతన యుద్ధ కళలు, ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరైన జపాన్‌లో ఆచరించే కొన్ని వర్కౌట్స్ గురించి తెలుసు కుందాం రండి!ఆహార అలవాట్లలో మార్పులతోపాటు కొన్ని జపనీస్ వ్యాయామాలు బెల్లీ ఫ్యాట్‌ను కరిగించు కునేందుకు, బాడీ ఫిట్‌గా ఉండేందుకు ఉపకరిస్తాయి.సుమో స్క్వాట్స్జపనీస్ ప్రొఫెషనల్ రెజ్లర్ల మ్యాచ్‌కు ముందు పొట్ట, తొడలపై భారం పడేలా కొన్ని భంగిమలను ప్రదిర్శిస్తారు. దాదాపు అలాంటివే ఈ సుమో స్క్వాట్స్పాదాలను వెడల్పుగా చాచి,నడుముపై భారం వేసి, భుజాలను స్ట్రెచ్ చేసి, రెండు చేతులను దగ్గరగా చేర్చి నమస్కారం పెడుతున్న ఫోజులో నిలబడాలి. ఇపుడు, పొత్తికడుపు, కాలి కండరాలపై భార పడుతుంది. ఈ భంగిమలో కనీసం 30 సెకన్ల పాటు నిలబడి, తిరిగి యథాస్థితిలోకి రావాలి.తెనుగుయ్ టైడో (టవల్ స్వింగ్స్)అత్యంత ప్రభావవంతమైన, సులభంగా నిర్వహించగల జపనీస్ వ్యాయామాలలో ఒకటి, టవల్ స్వింగ్‌లు కడుపు, పొత్తికడుపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. కండరాలను బలపరుస్తాయి.పాదాలను వెడల్పుగా ఉంచి, భుజాలు స్ట్రెచ్అయ్యేలా చేతులను వెడల్పుగా చాచి నిల బడాలి. ఇపుడు రెండు చేతలుతో ఒక టవల్‌ను రెండు వైపులా పట్టుకొని స్వింగ్ చేయాలి. కనీసం 2 నిమిషాలు చేయాలి. సౌలభ్యాన్ని ఈ సమయాన్ని పెంచుకోవచ్చు.రేడియో టైసో..కాళ్లు, చేతులు వేగంగా కదిలిస్తూ, శరీరాన్ని ముందుకు, వెనక్కి వంచుతూ వ్యాయామాలు చేస్తారు. ఇవి వివధ శరీర భాగాల్లోనే కాకుండా పొట్ట, నడుము చుట్టు ఉండే కొవ్వును అద్భుతంగా కరిగిస్తాయి. లంగ్ అంట్ టో టచ్కుడి కాలిని మడిచి, ఎడమ కాలిని సాధ్యమైనంత ముందుకు చాపాలి. కుడిచేత్తో కుడి కాలి తొడమీద సపోర్టు తీసుకుని, నడుమును వంచి ఎడమచేతితో ఎడమ కాలి బొటన వేలి తాకాలి. ఇలా విరామం తీసుకుంటూ ఇలా రెండువైపులా చేయాలి.హూలాహూప్నడుము చుట్టూ ఒక పెద్ద రింగ్ ధరించి హూలాహూప్ వర్కౌవుట్ చేస్తారు. పొట్ట భాగంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. కాళ్లు, చేతులు, కోర్ కండరాలు ధృడంగా తయారవుతాయి.నోట్: క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేయడం కాదు. శరీరం సమతుల్యంగా, ఫిట్‌గా ఉండటానికి కూడా దోహదం చేస్తాయి. ఇండోర్ వర్కౌట్స్, ఔట్‌డోర్ వర్కౌట్స్‌తో కొవ్వులను సులభంగా కరిగించుకోవచ్చు. అయితే కొంత మందికి కొన్ని ఆరోగ్య పరిస్థితులు, వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు, జీవనశైలిగా కారణంగా అనుకున్నంత సులువు కాకపోవచ్చు. దీనికి వైద్య నిపుణుల సలహాలను తీసుకోవాల్సి ఉంటుంది. -
అనన్య పాండేలాంటి నాజూకు నడుము కావాలంటే...!
బాలీవుడ్ నటి అనన్య పాండే ఫిట్నెస్ ప్రియురాలు. యోగా నుండి పైలేట్స్ వరకు, వివిధ రకాల వ్యాయామాలతో చెక్కిన శిల్పంలా తన శరీరాన్ని మల్చుకుంటుంది. తన వర్కౌట్స్‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఇటీవల ఆమె ఫిట్నెస్ శిక్షకురాలు , ప్రెండ్ అయిన నమ్రతా పురోహిత్ వర్కవుట్ ( పైలేట్స్) చేస్తున్న ఫోటోను షేర్ చేసి,ఆమెపై ప్రశంసలు కురిపించింది. క్రమం తప్పకుండా, నిబద్ధతతో పనిచేస్తే మంచి ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించింది. అనన్య లాగా, నాజూకైన నడుము కావాలనుకుంటున్నారా? అయితే ఆమె చేసే పైలేట్ష్తోపాటు కొన్ని రకాల యోగాసనాలనూ ఇక్కడ చూద్దాం.సైడ్ ప్లాంక్ ట్విస్ట్: నడుముకు అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం ఇది. పక్కకు పడుకుని, తలను ఒక చేతితో పట్టుకుని, ఆపై నడుము భాగం కదలకుండా, పాదాల మధ్య ఎడం ఉంచి, మరొక చేతిని నిలువుగా పైకి లేవాలి. కొద్ది సేపు ఈ స్థితిలో ఉండి, తరువాత యథాస్థితికి రావాలి. అలాగే బోర్లా పడుకుని, మోచేతులపై భారం వేసి, బొటన వేళ్లపై బాడీని కొద్దిగా పైకి లేపాలి. ఇదేస్థితిలో బాడీని రెండు వైపులా మెల్లిగా ట్విస్ట్ చేయాలి. ఇలాంటి రిక్లైనింగ్ మోకాలి ట్విస్ట్, సిజర్స్ క్రిస్ క్రాస్ లాంటి కొన్ని వ్యాయామాలతో మాత్రమే కాదు, కొన్ని రకాల యోగసనాల ద్వారాకూడా నడుము దగ్గర పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగి నాజూగ్గా తయారవుతారు.త్రికోణాసనం..త్రికోణాసనం నడుము దగ్గర కొవ్వు కరిగించడానికి, బరువును కంట్రోల్లో ఉంచడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. త్రికోణాసనం వేయడానికి ముందుగా పాదాలను వీలైనంత ఎడంగా పెట్టి, నిటారుగా నిల్చోవాలి. చేతులను రెండు వైపులకు తిన్నగా చాచాలి. నడుమును పక్కకు వంచి, ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని తాకాలి. కుడి చేతిని పైకి నిలువుగా చాచాలి. శ్వాస వదులుతూ తలను పైకెత్తి కుడి చేయిని చూడాలి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. తర్వాత నడుమును పక్కకు వంచుతూ కుడి చేత్తో కుడి పాదాన్ని తాకాలి. ఎడమ చేయిని పైకి నిలువుగా చాచాలి. శ్వాస వదులుతూ తలను పైకెత్తి ఎడమ చేయిని చూడాలి. శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి.నౌకాసనంనౌక మాదిరిగా ఈ ఆసనం ఉంటుంది గనుక దీనికి ఆపేరు. ఈ ఆసనం వేయడానికి ముందుగా కాళ్లు ముందుకు చాపాలి. తొడల దగ్గర చేతులతో పట్టుకుని కాళ్లను పైకి లేపి పిరుదుల మీద బ్యాలెన్స్ చేస్తూ శరీరాన్ని కొంచెం వెనక్కి వంచాలి. మెల్లగా రెండు చేతులను మోకాళ్ల దగ్గర పట్టుకుని కాళ్లను ఇంకాస్త పైకి లేపి. తలకి సమాంతరంగా ఉండేలా చూడాలి. పాదాలు తల కంటే ఎత్తుకు వెళ్లకూడదు. మెల్లగా రెండు చేతులనూ తీసేసి కాళ్లను అలా గాల్లోకి ఉంచాలి. చేతులను ముందుకు చాచాలి. శరీర బరువంతా పిరుదుల మీద ఉంటుంది. ఇలా హిప్స్ మీద బరువు నిలుపుతూ ,నెమ్మదిగా కాళ్లను కిందికి దించాలి. సుమారుగా పది నుంచి ఇరవై క్షణాల పాటు ఆ భంగిమలో ఉంటే మంచిది. మధ్యలో స్వల్ప విరామం తీసుకుని మళ్లీ దీన్ని రిపీట్ చేయాలి.మత్స్యాసనంమత్స్యాసనం వేయండానికి ముందుగా ప్రశాంతంగా కూర్చోండి. ఆ తర్వాత కాళ్లను తిన్నగా చాపాలి. ఎడమ కాలిని మడిచి, మడాన్ని కుడి పిరుదు వద్దకు తీసుకెళ్లాలి. ఎడమ మోకాలిని కుడి పాదానికి తాకించాలి. వెన్నెముక నిటారుగా బిగపట్టినట్టు కాకుండా రిలాక్స్డ్గా ఉండాలి. ఎడమ చేతిని కుడి మోకాలి పక్కనుంచి తీసుకెళ్లి కుడి పాదపు చీలమండను పట్టుకోవాలి. వీపు పై భాగాన్ని కుడివైపునకు తిప్పండి. మీకు వీలైనంత వరకూ మాత్రమే చేయండి. కుడిచేతిని వెనుకవైపు పెడుతున్నప్పుడు కుడి భుజం మీది నుంచి చూడండి. మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ శరీరమంతటినీ రిలాక్స్‌గా ఉంచుతూ ఈ పోజ్‌లో కొంతసేపు ఉండండి.ధనురాసనంయోగా మ్యాట్‌పైన బోర్లా పడుకొని, రెండు మోకాళ్లనూ వెనక్కు మడిచి ఉంచాలి. రెండు చేతులనూ వెనక్కి తీసుకెళ్లి కుడిచేత్తో కుడికాలి మడాన్ని, ఎడమచేత్తో ఎడమకాలి మడాన్ని పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పొత్తికడుపు, పొట్ట మీద ఒత్తిడి మనకు తెలుస్తుంది. తర్వాత పొట్ట మీద బరువు మోపుతూ పైకి లేవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండి, మెల్లగా శ్వాస వదులుతూ యథాస్థితికి వచ్చి, తలను, కాళ్లను కింద పెట్టేయాలి. అలా మూడు నుంచి నాలుగుసార్లు ఈ ఆసనం చేయాలి. తొందరగా ఫలితం కనబడాలంటే.. రోజులో రెండు సార్లు ఒక గంట పాటు , ఆసనానికి మధ్య స్వల్ప విరామం తీసుకుంటూ నిదానంగా ఈ ఆసనాలను వేయాలి. నోట్ :యోగాసనాలు ఎపుడూ కూడా హడావిడిగా చేయకూడదు. శ్వాసనిశ్వాసలను నియంత్రణలో ఉంచుకుంటూ నిదానంగా చేయాలి. అలాగే యోగసనాలను ప్రారంభించే ముందు యోగా నిపుణుల సలహాలను తీసుకోవాలి. -
హీరోయిన్ రకుల్ ప్రీత్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట!
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధపెడుతోంది. ముఖ్యంగా జాకీ భగ్నాన్తో పెళ్లి తరువాత జంటగా అనేక ఆసనాలు, వ్యాయామాలు చేస్తూ సోషల్ మీడియాలో అనేక వర్కౌట్ వీడియోలుపోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రముఖ పోడ్కాస్టర్ , యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన వివరణాత్మక డైట్ ప్లాన్ గురించి వివరించింది.రకుల్ ప్రీత్ సింగ్ డైట్ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగుతుందిట. ఆ తరువాత దాల్చినచెక్క నీరు లేదా పసుపు నీటిని తీసుకుంటుందట. ఆపై నానబెట్టిన బాదం గింజలు ఐదు, వాల్నట్ తీసుకుంటుందట. ఆ తరువాత ఘీ కాఫీ తాగుతానని చెప్పుకొచ్చింది రకుల్. వర్కవుట్ పూర్తి చేసిన తరువాత అల్పాహారం మాత్రం భారీగా తీసుకుంటుందట. ముఖ్యంగా ప్రోటీన్ స్మూతీలోగా పోహా (అటుకులు) లేదా మొలకలు లేదా గుడ్లని తీసుకుంటుందట. తన డైట్ గురించి రకుల్ ఇంకా ఇలా వివరించింది. భోజనం సాధారణంగా అన్నం లేదా జొన్న రొట్టె, కూర ,చేపలు లేదా చికెన్ వంటి కొన్ని రకాల ప్రోటీన్లు, సాయంత్రం 4:35 గంటలకు స్నాక్స్‌గా ప్రోటీన్ చియా సీడ్స్ పుడ్డింగ్, పండు, పెరుగు, పీనట్ బటర్ వంటివి తీసుకుంటుందట. డిన్నర్‌ను ఏడు గంటలకు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని కూడా తెలిపింది. అది కూడా మధ్యాహ్నం తినే దాని కంటే కాస్త తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేలా డిన్నర్‌ను ప్లాన్ చేసుకుంటుంది. -
ఫిట్.. సెట్..
సొగసైన శరీరాకృతి అందరూ కోరుకుంటారు. అయితే దానికి మన వంతుగా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నామన్నదే ముఖ్యం. ఎవరైనా నిత్యం వ్యాయామం చేస్తూ, జిమ్ ట్రైనర్స్ సూచనలు పాటిస్తే మెరుగైన ఆకృతిని సొంతం చేసుకోవచ్చు. దీనికి ఆహారపు అలవాట్లు, శరీరతత్వం, ఉద్యోగ సమయం, ఆరోగ్యం పరిస్థితులు, తదితర అంశాలు సైతం శరీరంపై ప్రభావం చూపిస్తాయి. నగరంలో యువత, మహిళలు అధిక శాతం మంది జిమ్ బాట పడుతున్నారు. ఇందులో కొంత మంది ప్రాథమిక వ్యాయామానికే పరిమితం అవుతుండగా, మరికొంత మంది మాత్రం తమ శరీరంలోని వివిధ అవయవాలకు సంబంధించిన ప్రత్యేక వ్యాయామాలపై దృష్టి పెడుతున్నారు. ట్రైనర్స్ ఏం చెబుతున్నారు? ఎలాంటి డైట్ పాటించాలి? తెలుసుకుందాం..! నగర యువత అత్యధిక శాతం మంది తమ శరీరాకృతిని ఆరు పలకల ఆకృతిలోకి మార్చుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పొట్ట ప్రదేశంలో అనవసరమైన కొవ్వులను కరిగించుకోడానికి ఆబ్డామిన్ స్ట్రెచ్చెస్, క్రంచెస్ వంటి వ్యాయామాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పొట్ట భాగం సరైన ఆకృతిలోకి వస్తోంది. జంపింగ్ స్వా్కట్స్ చేయడం వల్ల బరువుని తగ్గించుకోవచ్చు. ఎత్తుకు సరిపడేంతగా సన్నబడడం, షోల్డర్స్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తున్నారు. శరీరంలో వృధాగా పేరుకుపోయే కొవ్వులు, కేలరీలను కరిగించేందుకు బర్పీస్ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. మౌంటెనింగ్, క్లైంబింగ్స్ వంటివి ఫ్లాట్ స్టొమక్ని అందిస్తాయి. డంబెల్స్‌తో డిఫరెంట్ సెట్స్.. చూడచక్కని షోల్డర్స్ కోసం డంబెల్స్‌తో వర్కౌట్ చేయాలి. బెంచ్ ప్రెస్ చేయడం వల్ల గుండె భాగంపై ప్రభావం కనిపిస్తుంది. చెస్ట్ కండరాలు స్పష్టమైన అమరికతో ఆకర్షిణీయంగా తయారవుతాయి. వీపు వైపు బలంగా, ఫిట్‌గా ఉండాలంటే పుల్ డౌన్, నడుము బలంగా తయారవడానికి డెడ్ లిఫ్ట్ వర్కౌట్ చేయాలి. ప్లాంక్ ఫోశ్చర్పై పరుగు తీస్తే గుండె కొట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ వ్యాయామాలు ముఖ్యంగా భుజాలు, గుండె భాగం, కాళ్లపై ప్రభావం చూపిస్తాయి. మజిల్స్ బలంగా తయారై, శరీరాన్ని ఫ్లెక్సిబిలిటీగా ఉంచుతుంది. మహిళలను వేధిస్తున్న అధిక బరువు.. ఇటీవలి కాలంలో జిమ్‌లకు వస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పిల్లలు పుట్టిన తరువాత మహిళలు బరువు పెరుగుతున్నారు. ఇంట్లో సరైన వ్యాయామం లేకపోవడంతో వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. బెల్లీఫ్యాట్ తగ్గించుకోవడం, గుండె భాగం ఫిట్‌గా ఉండటం, నడుము బలంగా తయారు కావడానికి వ్యాయామాలు చేస్తున్నారని ట్రైనర్స్ పేర్కొంటున్నారు.శరీరం దృఢంగా ఉండాలంటే.. శరీరం దృఢంగా, బలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజం. అయితే బిజీ సిటీ లైఫ్‌లో ఆహారపు అలవాట్లు, కాలుష్యం, నిద్ర అనేక అంశాలు శరీర పటుత్వంపై ప్రభావం చూపిస్తాయి. సరైన వ్యాయామం చేయకుంటే అనేక వ్యాధులకు మనం ఆహ్వానం పలికినట్లే అవుతుంది. శరీరం ఫిట్‌గా ఉండేందుకు క్రాస్ ఫీట్, బరీ్పస్, జంపింగ్ తదితర వ్యాయామాలు చేయడం మంచిది. శరీర కండరాలు సరైన ఆకృతిలో పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఆహారపు క్రమశిక్షణ అవసరం. బయట చిరు తిళ్లు, నూనె వంటకాలకు దూరంగా ఉండాలని జిమ్ ట్రైనర్స్ సూచిస్తున్నారు.శరీరం ఫిట్‌గా తయారైంది.. రెండేళ్లుగా నిత్యం జిమ్ చేస్తున్నాను. వారంలో కనీసం మూడు రోజులు 60 నుంచి 70 కిలో మీటర్ల వరకూ పరుగెత్తుతాను. గతంలో కిడ్నీలో స్టోన్స్, అల్సర్, ఛాతీలో నొప్పి వంటి సమస్యలు బాధించేవి. వ్యాయామం చేయడం మొదలు పెట్టిన తర్వాత సుమారు 20 కిలోల వరకూ బరువు తగ్గాను. ఇప్పుడు శరీరం ఫిట్‌గా తయారైంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే రాష్త్ర స్థాయి పరుగు పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాను. – శ్రీశైలంగౌడ్, బండ్లగూడక్రమశిక్షణ అవసరం.. యువతలో ఎక్కువ మంది జిమ్ చేసే సమయంలో శరీరాకృతి కోసం అడుగుతున్నారు. పెద్దలు సాధారణ వ్యాయామాలపై దృష్టిసారిస్తున్నారు. మహిళలు సన్నబడటం, బెల్లీ ఫ్యాట్, బరువు తగ్గించుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. డైట్ పాటించాలి. మాంసాహారానికి దూరంగా ఉండాలి. కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ప్రతి రోజూ కనీసం అరగంట సమయం నడక, పరుగు తీయడం మంచిది. – సద్దాం, జిమ్ ట్రైనర్ -
అద్భుతమైన ‘5’ టిప్స్‌తో 72 కిలోలు బరువు తగ్గింది!
బరువు తగ్గడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అలాగని అంత కష్టమూ కాదు. బాడీ తత్వాన్ని తెలుసుకుని సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులతో మనం కోరుకున్న బరువు లక్ష్యాన్ని చేరు కోవచ్చు. ఈ విషయాన్ని అంబర్ క్లెమెన్స్ మరోసారి నిరూపించారు. పట్టుదలగా, నిబద్దతగా కొన్ని రకాల నియమాలను పాటించి రెండేళ్లలో ఏకంగా 160 పౌండ్లు (72 కిలోలు) బరువును తగ్గించుకుంది. అంతేకాదు తగ్గిన బరువును స్థిరంగా కొనసాగిస్తోంది. ఈ ప్రయాణంలో తాను అనుసరించిన ముఖ్యమైన సూత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Amber Clemens (@amber_c_fitness)విజయవంతంగా బరువు తగ్గడం అనేది అలవాట్లను మార్చుకోవడంతో మొదలవుతుంది అంటుంది అంబర్. అంతకుముందు పిచ్చి పిచ్చిగా డైటింగ్ చేశానని, ఆ తరువాత తాను అనుసరించిన పద్దతి, ఆహార నియమాల మూలంగా చక్కటి ఫలితం సాధించానని తెలిపింది. ముఖ్యంగా ప్రతిరోజూ చేసే ఐదు విషయాలను పంచుకుంది. ప్రతి భోజనంతో కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకుంటుంది. అలాగే స్నాక్స్‌గా ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. అలా ఆమె రోజువారీ తీసుకోవాల్సిన ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఎక్కువ నీళ్లు తాగడం చేయడం వలన మంచి ఫలితం సాధించానని చెప్పుకొచ్చింది. అద్భుతమైన 5 టిప్స్రోజుకి 7-10 వేల అడుగులు నడవడం: చిన్న అడుగులు పెద్ద మార్పులకు నాంది పలుకుతాయి. రోజూ నడవడం అలవాటుగా చేసుకుంటే అద్భుతాలు చేయవచ్చు. తన రోజుకి మరింత శారీరక శ్రమ కలిగేలా ఎక్కువగా నడవడం,లిఫ్ట్ లేదా ఎలివేటర్‌కు బదులుగా నడుచుకుంటూ వెళ్లానని అంబర్ చెప్పింది.3 లీటర్ల నీరు తాగడం: హైడ్రేషన్ కీలకం, కనీసం మూడు లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా , ఆరోగ్యంగా ఉంటుందని చెబుతోంది అంబర్.25-30 గ్రాముల ప్రోటీన్: ప్రతి భోజనంతో, అంబర్ కనీసం 25-20 గ్రాముల ప్రోటీన్‌ను తీసుకుంటుంది. స్నాక్స్ కోసం, ఆమె 5-10 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. ఇది ఆమె రోజువారీ ప్రోటీన్ తీసుకోవడం లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడిందట.ముందస్తు ప్లాన్ : రోజు రాత్రి ఆహారాన్ని ముందస్తుగా తినడం లాంటివి చేసింది. రేపు ఏం తినాలి అనేది ముందుగానే నిర్ణయించుకొని సిద్ధం చేసుకోవడం కూడా ఇందులో భాగంగా పాటించింది.కొద్దిగా స్వీట్: అలాగే స్వీట్స్ తినాలనే తన కోరిక మేరకు రాత్రి డెజర్ట్ లేదా టిఫిన్‌లో కొద్దిగా ఏదైనా తీపిని జోడించినట్టు తెలిపింది. అలాగే వ్యాయామాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేయాలనీ, రోజుకి కనీసం 30 నిమిషాలు, వారానికి నాలుగు సార్లు చేయాలి. దీంతోపాటు మంచి నిద్ర ఉంటే చాలు బరువు తగ్గడం ఈజీ అంటోంది ఈ ఫిట్నెస్ కోచ్. -
ఈ వర్కౌట్లతో బెల్లీ ఫ్యాట్ మాయం..! సన్నజాజి తీగలా నడుము..
చాలామంది మహిళలు బెల్లీఫ్యాట్‌తో ఇబ్బంది పడుతుంటారు. ప్రసవానంతరం లేదా ఒబెసిటీ కారణంగానో బానపొట్టలా నడుము, పొట్ట మధ్య గ్యాప్ లేనివిధంగా కలిసిపోయినట్లుగా ఉంటుంది. దీంతో నలుగురులోకి వచ్చినప్పుడూ కాస్త ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఈ సమస్యను జస్ట్ ఈ నాలుగు వ్యాయమాలతో చెక్ పెట్టొచ్చంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిధి శర్మ ఓ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో తాను ఆ వ్యాయమాలతో సుమారు 20 కిలోల బరువు తగ్గినట్లు పేర్కొంది. ఇంతకీ ఏంటా వర్కౌట్లు అంటే..రిధి శర్మ పొట్టప్రాంతంలో పేరుకునే అధిక కొవ్వు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం అని అంటోంది. ఆ ప్రాంతంలో సెల్యూట్ అనే కొవ్వుని తగ్గించుకోవడానికి ఈ వ్యాయామాలు తప్పక సహాయపడతాయని చెబుతోంది. తాను ఆ వర్కౌట్ల తోనే బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోగలిగానని అంటోంది. అంతేగాదు తన నడుము కొలతల్లో కూడా మంచి మార్పులు చూశానని చెబుతోంది. వారానికి కనీసం నాలుగు నుంచి ఐదు సార్లు చేయడం వల్లే మంచి ఫలితాలను పొందినట్లు పేర్కొంది. కనీసం నాలుగు నుంచి ఐదు వారాలు క్రమంతప్పకుండా చేస్తేనే ఇదంతా సాధ్యమని నమ్మకంగా చెబుతోంది రిధి. చేయాల్సిన యామాలు..అబ్ హోల్డ్: దీన్ని నేలపై వేయాలి. ఇది తల కాళ్లు దగ్గరకు వస్తున్నట్లుగా వంచడం. ప్లాంక్ ట్విస్ట్: ఇది వెన్నెముకకు మద్దతు ఇచ్చేలా కోర్ కండరాలను బలపరుస్తుందివీ సైకిల్స్: నేలపైకూర్చొని కాళ్లను సైకిల్ తొక్కుతున్నట్లుగా కదపాలిలెగ్ డ్రాప్: ఇది నేలపై పడుకుని కాళ్లను సైకిల్ తొక్కుతున్నట్లుగా చెయ్యాలి. దీంతోపాటు రోజుకి ఎనిమిది వేల నుంచి పది వేల వరకు అడుగులు వేసేలా వాకింగ్ చేయాలి. భోజనంలో 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూడాలిప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటంరాత్రి ఏడు గంటలకు లోపే డిన్నర్ పూర్తి చేయడంసుమారు ఏడు నుంచి 8 గంటల వరకు నిద్ర పోవడంతదితరాలను పాటిస్తే బెల్లీఫ్యాట్ తగ్గడమే గాక ఆరోగ్యంగా ఉంటారని చెబుతోంది రిధి శర్మ. View this post on Instagram A post shared by Ridhi Sharma | Fitness & Lifestyle (@getfitwithrid)గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులను లేదా వైద్యులను సంప్రదించి పాటించటం ఉత్తమం. (చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే : ఒకరు పొడగరి, మరొకరు అత్యంత పొట్టి..) -
తొమ్మిది పదుల వయసులోనూ ఫిట్‌గా, ఆరోగ్యంగా..
ఈ బామ్మ ఫిట్నెస్ విషయంలో అందరికీ స్ఫూర్తి. ఈ ఏజ్‌లోనూ ఎంతో చలాకీగా వ్యాయామాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది. రెస్ట్ తీసుకునే వయసులో తనకు వీలైన విధంగా సింపుల్ వ్యాయామాలు చేస్తున్నారు. అదికూడా ఏ రోజు స్కిప్ చేయకుండా చేస్తుందట. ఫిటనెస్ పట్ల ఆమె కనబరుస్తున్న నిబద్ధతకు సలాం కొట్టకుండా ఉండలేరు. వృద్ధాప్యంలోనూ మంచి ఫిట్నెస్తో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?. ఈ బామ్మలా చలాకీగా వ్యాయమాలు చేయాలంటే..ఫిట్నెస్కి నిజమైన స్ఫూర్తి 90 ఏళ్ల జే. ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా చక్కగా వ్యాయామాలు చేస్తుంది. చాలా చురుకుగా తన దినచర్యను పూర్తిచేస్తుంటుంది. జే 30 స్క్వాట్లు (సపోర్ట్ కోసం ఫ్రిజ్‌ని పట్టుకుని మరీ..) 25 సిట్-అప్లు, 30-సెకండ్ ప్లాంక్ , పదివేల అడుగులు నడవడం తదితరాలన్నింటిని చేస్తుంది. మాములుగా అయితే ఎవ్వరైనా ఓ రెండు, మూడు రోజులు చేసి వదిలేస్తారు. కానీ ఈ బామ్మ అలాకాదు. ప్రతిరోజూ చక్కగా వ్యాయామాలు చేస్తుంది. ఇలా ఫిట్‌గా ఉండేందుకు వర్కౌట్లు చేయడం ముఖ్యం అని చేతల్లో చూపించింది జెనీ బామ్మ. వృద్ధాప్యంలో కూడా జే బామ్మలానే చక్కగా వీలైనన్నీ వ్యాయామాలు చేస్తే అనారోగ్యం బారిన పడరు, పైగా హాయిగా చివరి రోజులు సాగిపోతాయి. ఈ సందర్భంగా వృద్ధులు ఈజీగా వేయగలిగే సింపుల్ వ్యాయామాలను చూద్దామా..!. చైర్ స్క్వాట్లు: కాలు కండరాలను బలోపేతం చేయడానికి, సమతుల్యతకు స్క్వాట్లు మంచివి. ఇవి లేచి నిలబడి, కూర్చీలోంచి నెమ్మదిగా కూర్చవడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి ఉండదు. పైగా సులభంగా చేయగలుగుతారు. వాల్ పుష్-అప్స్: ఇవి ఎగువ శరీర బలాన్ని మెరుగుపరుస్తాయి. కానీ వృద్ధులు నేలకు బదులు గోడను ఆసరా చేసుకుని చెయ్యొచ్చు. కూర్చునే మార్చింగ్: కూర్చీలో కూర్చొని ఆర్మీ మాదిరిగా మార్చింగ్ చేస్తే.. రక్త ప్రసరణ మెరుగుపరడటమే గాక కాలు కండరాలు బలోపేతమవుతాయి.లైట్ వెయిట్స్తో ఆర్మ్ రైజ్‌లు: భుజం ఎత్తుకు చేతులు ఎత్తడం వల్ల భుజాల పైభాగంలో ఉన్న కండరాలు బలపడతాయి. చీలమండల భ్రమణాలు: కూర్చీలో కూర్చొని మడమలను ముందుకు వెనుకకు సవ్య-అపసవ్య దిశల్లో తిప్పడం వల్ల కాళ్లో చక్కటి రక్తప్రసరణ జరిగి.. అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నడక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. View this post on Instagram A post shared by Certified Nutritionist and Fitness Coach (@theresa_moloney) (చదవండి: ట్రంప్ గెలుపుతో ఊపందుకున్న ఫోర్ బీ ఉద్యమం..!భగ్గుమంటున్న మహిళలు) -
డెస్క్ జాబ్ చేస్తున్నారా, ప్రమాదం పొంచివుంది : ఈ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయండి!
డెస్క్ జాబ్ చేసేవాళ్లు ఎక్కువ పని గంటలు కూర్చునే ఉండాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు నడుము, పొట్ట దగ్గర కొవ్వు పేరుకు పోతుంటుంది. చెయిర్లో కూర్చుని చేసే అనుకూలమైన వ్యాయామాలను సాధన చేయడం వల్ల పొట్ట భాగం ఫిట్‌గా అవుతుంది. దీంతో పాటు వెన్నుకు, కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాలు ఇవి...సీటెడ్ లెగ్ లిఫ్ట్స్: కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. కుర్చీ సీటు భాగాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. పాదాలను నేలకు ఆనించి, మోకాళ్లను వంచకుండా నిటారుగా ఉంచాలి. ఒక కాలిని నేలకు అలాగే ఉంచి, మరొక కాలును పైకి ఎత్తాలి. కుర్చీ సీటుకు సమంగా ఉండేలా కాలిని ఎత్తి, కొన్ని సెకన్లు ఉంచి, తిరిగి నేల మీద ఉంచాలి. ఆ తర్వాత మరో కాలును కూడా అదే విధంగా చేయాలి. ఈ వ్యాయామం వల్ల తొడల భాగం బలంగా అవుతుంది. చెయిర్‌కు ఉన్న హ్యాండిల్స్‌ను చేతులతో పట్టుకొని, దానిపైన కూర్చోవాలి. మోకాళ్లను మడిచి, ఛాతీ వరకు తీసుకొని, పాదాలను కుర్చీకి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. వెన్నును నిటారుగా ఉంచాలి. మోకాళ్లను కొన్ని సెకన్ల పాటు అదే పొజిషన్లో ఉంచాలి. దీని వల్ల పొట్ట కింది భాగం కండరాలు ఫిట్‌గా అవుతాయి. అదనపు కొవ్వు తగ్గుతుంది. ఆబ్లిక్యూ ట్విస్ట్: చెయిర్లో నిటారుగా కూర్చొని, రెండు చేతులతో తలకు రెండువైపులా సమాంతరంగా, భుజాలను నిటారుగా ఉంచాలి. అదే భంగిమలో ఉండి, ఒకసారి కుడి వైపుకి తిరిగి, కొన్ని సెకన్లు అలాగే ఉండాలి. మరోసారి ఎడమ వైపుకు తిరిగి కొన్ని సెకన్లు ఉండాలి. నడుము భాగంలో ఉన్న కండరాలకు తగినంత శక్తి లభిస్తుంది. సీటెడ్ క్రంచెస్: చెయిర్ పైన కూర్చొని, దాని హ్యాండిల్స్‌ను బలంగా పట్టుకొవాలి. కాళ్లను, వెన్నును నిటారుగా ఉంచి, చెయిర్ మీద నుంచి కొద్దిగా అదే భంగిమలో పైకి లేవాలి. కొన్ని సెకన్లలో తిరిగి యధా స్థితికి రావాలి. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు, పై భాగం కండరాల పనితీరులో వేగం పెరుగుతుంది. టో టచెస్: చెయిర్ మీద కూర్చొని పాదాలను నిటారుగా నేలకు ఉంచాలి. నడుము భాగాన్ని వంచుతూ తలను మోకాళ్లవైపుగా తీసుకువచ్చి, చేతులను పాదాలకు ఆనించాలి. కొన్ని సెకన్లు అలాగే ఉండి, తిరిగి యధా స్థితికి రావాలి. ఈ వ్యాయామం ద్వారా శరీరానికి స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది.సీటెడ్ బైస్కిల్ పెడల్స్: చెయిర్లో ముందుకు వచ్చి కూర్చోవాలి. పూర్తి బ్యాలెన్స్ చూసుకొని, కాళ్లను సైకిల్ పెడల్ తొక్కినట్టుగా కదలికలు చేయాలి. ఈ వ్యాయామ లక్ష్యం కాలి కండరాలకు బలం చేకూర్చడం అని దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనన్ని సార్లు ఈ వ్యాయామం చేయచ్చు. -
నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!
ఈజీగా బరువు తగ్గడం అనేది లేటెస్ట్ హాట్ టాపిక్. అందుకే ఇన్‌ప్లూయెన్సర్లు, సెలబ్రిటీలు తమ వెయిట్ లాస్ జర్నీలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూఉంటారు. తాజాగా ఫిట్నెస్ ఇన్‌ప్లూయెన్సర్ రిధిశర్మ ఎలాంటి కఠినమైన డైట్ పాటించకుండానే విజయ వంతంగా 20 కిలోల బరువును తగ్గించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.రిధి శర్మ అందించిన వివరాల ప్రకారం పీసీఓఏస్ సమస్యతో బాధపడుతున్నప్పటికీ, జిమ్‌కు వెళ్లకుండా, ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ తనబరువును గణనీయంగా తగ్గించుకుంది. రిధి శర్మ పాటించిన నిబంధనల్లో మరో ముఖ్యమైన అంశం ఇంట్లో తయారు చేసుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం. నో ఫాస్ట్‌ఫుడ్, ఇంటి ఫుడ్డే ముద్దుచక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంది. రోజూ నడవడం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి చక్కటి జీవనశైలి మార్పులపై దృష్టి పెట్టడం ద్వారా ఆమె దీనిని సాధించింది. అనవసరమైన క్యాలరీలు తీసుకోకుండా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారమే తీసుకుంది. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే టోఫు, పన్నీర్, సోయా, చిక్కుళ్ళు , గింజధాన్యాలు, తింటే శక్తిని పెంచుకోవడంతో కడుపు నిండిన భావన కలుగు తుందని రిధి శర్మ వివరించారు. View this post on Instagram A post shared by Ridhi Sharma | Fitness & Lifestyle (@getfitwithrid)>ఇంట్లోనే వ్యాయామంజిమ్ మెంబర్షిప్ కోసం ఖర్చు చేయడం మానేసిన శర్మ, వారాంతంలో మినహా ప్రతి రోజూ 30-40 నిమిషాల ఇంట్లోనే వ్యాయామాలు చేసింది. యోగా మ్యాట్, రెండు డంబెల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్‌తో దీన్ని సాధించానని చెప్పారు. తన వ్యాయామంలో పైలేట్స్ (కండరాలకుబలంచేకూర్చే ఆసనాలు) స్ట్రెంత్ ట్రైనింగ్, పైలేట్స్ కూడా ఉండేవని తెలిపారు.కంటినిడా నిద్రప్రతీ రోజు 7 నుంచి 8 గంటలు చక్కటి నిద్ర ఉండేలా జాగ్రత్త పడిందట. ఇదే బరువు తగ్గే తన ప్రయాణంలో, రికవరీలో ఇది కీలకమైన పాత్ర పోషించిందని తెలిపింది. వాకింగ్ తన జర్నీలో పెద్ద గేమ్ ఛేంజర్ అని, రోజుకు 7 వేల నుంచి 10 వేల అడుగులు నడిచానని రిధి తెలిపింది. కేవలం కడుపు మాడ్చుకోవడం కాకుండా, శ్రద్ధగా వ్యాయామం చేసి ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటూ 20 కేజీల బరువు తగ్గినట్టు చెప్పింది రిధి.నోట్: బరువు తగ్గడం అనేది శరీర పరిస్థితులు, ఆరోగ్యం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఉపవాసం ఉండటం ఒఒక్కటే పరిష్కారం కాదు. కచ్చితంగా ఏదో ఒక వ్యాయామం చేయాలి. అందుకే బరువు తగ్గాలనుకుంటే, ఎందుకు బరువు పెరుగుతోందనే కారణాలను విశ్లేషించుకొని, నిపుణుల సలహా తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా బరువు తగ్గే ప్లాన్ చేసుకోవాలి. -
గంటలకొద్దీ కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్ వర్కౌట్స్ ఇవే!
డెస్క్ జాబ్ చేసేవాళ్లు ఎక్కువ పని గంటలు కూర్చోనే ఉండాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు నడుము, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం సహజం. చెయిర్లో లేదా యోగా మ్యాట్ మీద కూర్చుని చేసే వ్యాయామాలు కొన్ని ఉంటాయి. వీటిని సాధన చేయడం వల్ల పొట్ట భాగం చదునుగా అవుతుంది. దీంతోపాటు వెన్నుకు, కండరాలకు బలం చేకూర్చే వ్యాయామాల గురించి తెలుసుకొని, ఆచరణ లో పెడదాం.. సీటెడ్ లెగ్ లిఫ్ట్స్కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. కుర్చీ సీటు భాగాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. పాదాలను నేలకు ఆనించి, మోకాళ్లను వంచకుండా నిటారుగా ఉంచాలి. ఒక కాలిని నేలపై అలాగే ఉంచి, మరొక కాలును పైకి ఎత్తాలి. కుర్చీ సీటుకు సమంగా ఉండేలా కాలిని ఎత్తి, కొన్ని సెకన్లు ఉంచి, తిరిగి నేల మీద ఉంచాలి. ఆ తర్వాత మరో కాలిని కూడా అదేవిధంగా చేయాలి. ఈ వ్యాయామం వల్ల తొడల భాగం బలంగా అవుతుంది. కుర్చీ హ్యాండిల్స్‌ను చేతులతో పట్టుకొని, దానిపైన కూర్చోవాలి. మోకాళ్లను మడిచి, ఛాతీ వరకు తీసుకొని, పాదాలను కుర్చీకి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. వెన్నును నిటారుగా ఉంచాలి. మోకాళ్లను కొన్ని సెకన్లపాటు అదే పొజిషన్లో ఉంచాలి. దీనివల్ల పొట్ట కింది భాగం కండరాలు ఫిట్‌గా అవుతాయి. అదనపు కొవ్వు తగ్గుతుంది. ఈ ఎక్సర్సైజులు చేసేటప్పుడు చెయిర్ గట్టిగా, ఎలాంటి లోపాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఆబ్లిక్ ట్విస్ట్నిటారుగా కూర్చొని, రెండు చేతులతో తలకు రెండువైపులా సమాంతరంగా, భుజాలను నిటారుగా ఉంచాలి. అదే భంగిమలో ఉండి, ఒకసారి కుడి వైపుకి తిరిగి, కొన్ని సెకన్లు అలాగే ఉండాలి. మరోసారి ఎడమ వైపుకు తిరిగి కొన్ని సెకన్లు ఉండాలి. నడుము భాగంలో ఉన్న కండరాలకు తగినంత శక్తి లభిస్తుంది. సీటెడ్ క్రంచెస్చెయిర్ పైన కూర్చొని, దాని హ్యాండిల్స్‌ను బలంగా పట్టుకొవాలి. కాళ్లను, వెన్నును నిటారుగా ఉంచి, చెయిర్ మీద నుంచి అదే భంగిమలో కొద్దిగా పైకి లేవాలి. కొన్ని సెకన్లలో తిరిగి యధాస్థితికి రావాలి. ఇదేవిధంగా ఐదారుసార్లు ఈ వ్యాయామాన్ని చేయచ్చు. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు, పై భాగం కండరాల పనితీరులో వేగం పెరుగుతుంది. సీటెడ్ బైస్కిల్ పెడల్స్ చెయిర్లో ముందుకు వచ్చి కూర్చోవాలి. పూర్తి బ్యాలెన్స్ చూసుకొని, కాళ్లను సైకిల్ పెడల్ తొక్కినట్టుగా కదలికలు చేయాలి. ఈ వ్యాయామ లక్ష్యం కాలి కండరాలకు బలం చేకూర్చడం అని దృష్టిలో పెట్టుకోవాలి. వీలైనన్ని సార్లు ఈ వ్యాయామం చేయచ్చు. టో టచెస్కూర్చొని పాదాలను నిటారుగా నేలకు ఉంచాలి. నడుము భాగాన్ని వంచుతూ తలను మోకాళ్లవైపుగా తీసుకువచ్చి, చేతులను పాదాలకు ఆనించాలి. కొన్ని సెకన్లు అలాగే ఉండి, తిరిగి యధాస్థితికి రావాలి. ఈ వ్యాయామం ద్వారా శరీరానికి స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది. (చదవండి: ఈ మోతాదులో ఉప్పు తీసుకుంటే గుండె, కిడ్నీ వ్యాదులను నివారించొచ్చు..!) -
Exercise: వారానికి ఒక్కరోజు!
నిత్యం పని ఒత్తిడితో సతమతమవుతున్న నగర యువత వ్యాయామంపై దృష్టి పెడుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారానికి ఒక్కరోజైనా కసరత్తులు చేయడానికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందుతున్నారని నగర వాసులపై నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు రెగ్యులర్‌గా జిమ్ చేసే వారితో సమానంగా ఫలితాలను పొందుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సెలవు రోజుల్లో అవకాశాన్ని బట్టి జిమ్‌కు వెళ్లడం, క్రీడల పట్ల నగర యువత ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా మానసిక ప్రశాంతతో పాటు, శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటున్నామంటున్నారు. పనిదినాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ, రాత్రి 7 గంటల తరువాత జిమ్ టైమింగ్స్ కావాలని కోరుకుంటున్నారు. దీంతో ఆ సమయంలో బిజీబిజీగా మారుతున్నాయి. దీంతో స్లాట్స్ దొరకడం కష్టంగా ఉందని చెబుతున్నారు. సెలవు రోజుల్లో జిమ్‌కు వచ్చే వారి తాకిడి కూడా ఎక్కువగా ఉంటుందని, ఎక్కువ సమయం జిమ్ చేయడానికి మొగ్గుచూపుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.సర్వేలు చెప్పేదేంటి!..ఇటీవల ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం వారంలో ఒక్క రోజైనా వ్యాయామం చేసే వారి చేతికి యాక్సిలరో మీటర్ అమర్చి సుమారు 90 వేల మంది ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషిచింది. ఈ నివేదికల ప్రకారం దాదాపు నిత్యం వ్యాయామం చేసిన వారితో సమానంగా వారంలో ఒక్క రోజైనా కనీసం రెండున్నర గంటల నుంచి 3 గంటల పాటు వ్యాయామం చేసేవారు సమాన ప్రయోజనాలు పొందుతున్నారని తేలింది. వారంలో గంటన్నర కంటే తక్కువ వ్యాయామం చేసిన వారిలో జీర్ణకోశ, నాడీ వ్యవస్థ, మానసిక రోగాలు వంటివి మొత్తం 678 రోగాలను గుర్తించారు. అదే సమయంలో నిత్యం వ్యాయామం చేసేవారు, వారంలో వీలు చూసుకుని ఒక్క రోజైనా రెండున్నర గంటలకుపైగా వ్యాయామం చేసే వారిలో సుమారు 200 రకాల రోగాలు తక్కువగా ఉన్నాయని తేలింది. వ్యాయామం చేసిన వారిలో అధిక రక్తపోటు సమస్య 23 శాతం నుంచి 28 శాతం తక్కువగా ఉంటే, మధమేహం మాత్రం 43 శాతం నుంచి 48 శాతం తక్కువగా వస్తుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.షిఫ్ట్ డ్యూటీలతో ఇబ్బంది.. డ్యూటీలో షిఫ్ట్‌ల సిస్టం ఉంటుంది. నైట్ షిఫ్ట్ ఉంటే పగలంతా నిద్రపోవడం వల్ల జిమ్‌కు వెళ్లడం కుదరడం లేదు. ఇటువంటి సందర్భంలో సెలవు రోజుల్లో స్లాట్ బుక్ చేసుకుంటాను. కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు వర్కౌట్ చేస్తాను. సాధారణ షిఫ్ట్‌లు ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం సమయంలో రోజుకు ఒక గంట సమయం జిమ్ కోసం కేటాయిస్తాను. – శిరీష, సాఫ్ట్వేర్ ఉద్యోగిసెలవు రోజుల్లో స్లాట్స్‌కు డిమాండ్ .. సెలవు రోజుల్లో ఎక్కువ మంది జిమ్‌కు వస్తుంటారు. ఉదయం, సాయంత్రం స్లాట్స్ బిజీగా ఉంటాయి. అటువంటి సమయంలో జిమ్ ట్రైనర్‌గా ఎక్కువ మందిని డీల్ చేయాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లో అంతగా ఫ్లోటింగ్ ఉండదు. అటువంటి సమయంలో సహచర సిబ్బంది జిమ్‌ను మేనేజ్ చేసుకోగలుగుతారు. నేను రెండు గంటలకు తగ్గకుండా జిమ్ చేస్తాను. జిమ్ చేయడంపై మక్కువతో విడిచిపెట్ట లేకపోతున్నా. ఉద్యోగం, జిమ్ రెండింటినీ మేనేజ్ చేస్తున్నాను. – రాహుల్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, జిమ్ ట్రైనర్ -
విశాఖ తీరంలో కళ్లుచెదిరే విన్యాసాలు (ఫోటోలు)
-
అమోదయోగ్యమైన నడక ఎంత?
అన్ని వయసుల వారికీ వాకింగ్ నిర్ద్వంద్వంగా అందరికీ మేలు చేసే వ్యాయామం. పైగా అది ఎవరైనా చేయగలిగే చాలా తేలికైన ఎక్సర్సైజ్. పైగా దీనికి ఎలాంటి వ్యాయామం ఉపకరణాలూ, పరికరాలూ అక్కర్లేదు. వ్యాయామం చేయగలిగే ఏ వయసు వారైనా అలాగే మహిళలైనా, పురుషులైనా వాకింగ్ చేయాల్సిన సగటు దూరమెంతో, ఎంత నడిస్తే దేహం మీద దాని ప్రభావం పడి, మంచి ఆరోగ్యం సమకూరుతుందో లెక్కలు వేశారు యూఎస్‌కు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వారి సిఫార్సుల ప్రకారం రోజుకు ఎనిమిది కిలోమీటర్లు మంచిదని చెబుతున్నారు. (వాళ్ల లెక్కల ప్రకారం 5 మైళ్లు). ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్న ప్రకారం వారానికి 150 నిమిషాల పాటు నడక గానీ లేదా ఏరోబిక్స్గానీ చేయడం మంచిది. నడర అయితే రోజుకు 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తూ వారంలో కనీసం ఐదు రోజుల పాటైనా ఈ వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే రోజులో కనీసం 4 నుంచి 5 కిలోమీటర్లు నడవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలన్నది డబ్ల్యూహెచ్‌వో లెక్క. ఏ లెక్కలు ఎలా ఉన్నా... ఎత్తుకు తగినట్లుగా బరువు తగ్గి, మంచి ఫిట్నెస్ సాధించడం కోసం అందరూ రోజూ ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడవాలని పలు ఆరోగ్య సంస్థల అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల గరిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయన్నది ఆ అధ్యయనాల మాట. ఇది అందరి లెక్క అయినప్పుడు అందరూ ఇన్ని దూరాలు నడవగలరా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా... దీనికి సమాధానమిస్తూ టీనేజ్‌లో ఉన్న పిల్లలు, యువత చాలా వేగంగా ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు దూరాలు నడవాలనీ, అయితే మధ్యవయస్కులు మొదలు కాస్త వయసు ఎక్కువగా ఉన్నవారు నెమ్మదిగా నడవాలని సూచిస్తున్నారు. మరీ ఎక్కువ వయసుతో వృద్ధాప్యంలో ఉన్నవారు మాత్రం రోజూ 2 నుంచి 4 కిలోమీటర్లు నడిస్తే చాలన్నది ఆ అధ్యయన సంస్థల సూచన. ఇక ఆరు నుంచి పదిహేడేళ్ల వరకు ఉన్న చిన్నారులు రోజుకు కనీసం 60 నిమిషాల పాటైనా వేగంతో కూడిన నడక లేదా కాస్త శ్రమ కలిగించే వ్యాయామాలు చేయాలంటున్నారు.అసలు ఎందుకు నడవాలి?ఈ ప్రశ్న వచ్చినప్పుడు నడక వల్ల కలిగే వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలే సమాధానాలుగా నిలుస్తాయంటున్నాయి ఆరోగ్య పరిశోధక సంస్థలు. నడక వల్ల ఒత్తిడి తగ్గడం, మూడ్స్ మెరుగుపడటం, శక్తిసామర్థ్యాలు పెరగడం, బరువు తగ్గడం, కండరాలు బలంగా మారడం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు వాటికి అవసరమైన పోషకాలు అందడం, వాటి ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. -
Health: రిలీఫ్.. మెనోపాజ్ ఎక్సర్సైజ్!
మెనోపాజ్ అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన దశ. ఇది సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య కాలంలో సంభవించే రుతుక్రమ ముగింపును సూచిస్తుంది. హార్మోన్లు.. ప్రధానంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి తగ్గుదల వల్ల ఒంట్లో వేడి, మానసిక అలజడి, నిద్ర పట్టకపోవడం, బరువు పెరగడం వంటివి సంభవిస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు చాలామంది ‘ఇది ఈ సమయంలో సహజమే, భరించాలి మరి’ అని చెబుతుంటారు. అయితే, మెనోపాజ్ దశనూ ఆహ్లాదంగా గడిపేయాలంటే నిపుణులు సూచనలను పాటించడం మేలు.ప్రధానంగా శారీరక శ్రమ వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎండార్ఫిన్ విడుదల ద్వారా మానసిక స్థితి బాగవుతుంది. ఎముకలను బలోపేతం చేయడం ద్వారా బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో΄÷రోసిస్) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం, ఏరోబిక్స్ వంటివి హాయినిచ్చే నిద్రను, పనిచేయగలిగే సామర్థ్యాన్నీ పెంచుతాయి. మెనోపాజ్ సమయం లో ఉపశమనం కలిగించే ఈ 8 వ్యాయామాలను ఒక అలవాటుగా మార్చుకోవాలి.1. వాకింగ్..నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడే ప్రభావ వంతమైన వ్యాయామం ఇది. జీవక్రియలు మందగించినప్పుడు ఇది కీలకంగా పనిచేస్తుంది. ఒత్తిడిని నివారిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.2. యోగా..ఆందోళనను తగ్గించడంలో యోగా ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని యోగ భంగిమలు కీళ్ల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. విశ్రాంతిని, మంచి నిద్రను ΄÷ందడంలో సహాయపడతాయి.3. పవర్ ట్రెయినింగ్..మెనోపాజ్ వల్ల కలిగే కండరాల క్షీణతను ఎదుర్కోవడానికి పవర్ ట్రెయినింగ్ సహాయపడుతుంది. ఎముక సాంద్రత మెరుగవుతుంది. ఆస్టియో΄÷రోసిస్ వంటి ఎముకల వ్యాధి వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువులు ఎత్తడం వల్ల కండరాల శక్తి పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది.4. ఈత..మెనోపాజ్ దశలో స్విమ్మింగ్ అనేది శరీరమంతటికీ పనికి వచ్చే వ్యాయామంగా చెప్పుకోవచ్చు. ఇది కీళ్లపై సున్నితంగా పనిచేస్తుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు ఉండి, రుతుక్రమం ఆగిన మహిళలకు చాలా ఉపశమనంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది. శరీరంలో వేడి ఆవిర్లు వచ్చినట్లు అనిపించే భావనను తగ్గించి, శరీరాన్ని చల్లబరచడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది.5. పిలాటిస్..శరీర భంగిమలను సరిచేయడానికి ఉపకరించే ఆధునిక వ్యాయామ పద్ధతులను పిలాటిస్ అంటారు. ప్రత్యేక సాధనాల తో ఈ వ్యాయామాలు చేస్తారు. కండరాల బలాన్ని పెంచడానికి, నొప్పులను తగ్గించడానికి సున్నితమైన కదలికల ద్వారా శరీరంపై ఎక్కువ ఒత్తిడిని కలిగించకుండా ఈ వ్యాయామాలు చేస్తారు.6. నృత్యం..చురుకుగా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించడానికి డ్యాన్స్ ఒక ఆహ్లాదకరమైన మార్గం. డ్యాన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. సామాజికంగానూ నలుగురిని కలిసేలా చేస్తుంది. ఒంటరితనం భావాలను తగ్గిస్తుంది.7. తాయ్ – చి..తాయ్– చి వ్యాయామంలో కదలికలు నెమ్మదిగా ఉన్నా శారీరక ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం రుతుక్రమం ఆగిన మహిళలకు ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.8. సైక్లింగ్..హిప్ కింది భాగానికి బలం చేకూరుతుంది. ఎండార్ఫిన్ల విడుదల ద్వారా మానసిక స్థితి మెరుగవుతుంది. ఈ వ్యాయామాలు మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.ఇవి చదవండి: ఇంటి రూఫ్.. మొక్కలు సేఫ్..! -
నడుం ఆకృతి మార్చే మత్స్యాసనం!
బాడీ ఫిట్నెస్ కోసం వివిధ రకాల డైట్లు, వ్యాయామాలు చేస్తుంటారు. ముఖ్యంగా యోగాసనలు శరీరాకృతిని మంచిగా ఉంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతాయి. అందుకే చాలమంది యోగాసనాలు వేసేందుకే ఆసక్తి చూపిస్తారు. అందులో మత్స్యాసనం ది బెస్ట్ ఆసనంగా పేరు. ముఖ్యంగా నడుం ఆకృతిని మంచిగా ఉంచడంలో కీలకంగా ఉంటుంది. దీన్నీ చేపల భంగిమ లేదా చేప ఆకృతి వ్యాయామం అని అంటారు. ఈ వ్యాయమం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి నిపుణులు సైతం చెబుతున్నారు. ఏమంటున్నారంటే..కిగాంగ్ నిపుణుడు బామా కిమ్ ఈ వ్యాయమం వెన్నుముక అమరికను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుందని అన్నారు. ఈ వ్యాయామం బరువు తగ్గడానికే కాకుండా నడుము ఆకృతిని నాజుగ్గా మారుస్తుందని చెప్పారు. ఈ మత్స్యాసనం శరీరానికి చాల ప్రయోజనాలని అందిస్తుందని అన్నారు. ఇది భారీ బరువుతో కూడిన ఆసనం కాదు కాబట్టి నడుమపై పరిమిత వ్యవధిలోనే బరువుని ప్రభావితం చేస్తుంది. అందులనూ ఈ భంగిమలో కాళ్లను బాగా విస్తరించి చేతులు, తలపై బరువును బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనంలో ఎక్కవ భారాన్ని తలపై మోపకుండా చేతులపై బ్యాలెన్స్ అయ్యేలా చూసుకోవాలి. కలిగే ప్రయోజనాలు..జీర్ణ ఆరోగ్యం: ఇది ఉదర అవయవాలను ప్రేరేపించి జీర్ణక్రియ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. వెన్నెముక అమరిక: ఇది వెన్నెముక మెరుగ్గా ఉండేలా చేస్తుంది. నడుమ వద్ద కొవ్వు పేరుకోకుండా చూస్తుంది. నరాల పనితీరు: మెడ,వెనుక భాగాన్ని సాగదీయడం ద్వారా, ఇది నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.రక్త ప్రసరణ: ఇది గుండె,ఊపిరితిత్తులకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.జాయింట్ పెయిన్ రిలీఫ్: ఇది కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను సాగదీయడం, సడలించడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్యల నుంచి మంచి ఉపశమనం అందిస్తుంది.సురక్షితమేనా?"చేపల భంగిమ సాధారణంగా ప్రారంభకులకు సురక్షితం.కానీ వారు అదనపు మద్దతు కోసం కుషన్ వంటి ఆధారాలను ఉపయోగించాలి. ఐతే మెడ సమస్యలు, తీవ్రమైన వెన్ను సమస్యలు లేదా గుండె సమస్యలు ఉన్నవారు దీనిని ప్రయత్నించే ముందు వ్యక్తిగత వైద్యుల సలహాలు, సూచనల మేరుకు ప్రయత్నించాలి.గర్భిణీ స్త్రీలు లేదా వెన్నెముక గాయాలు ఉన్నవారు ఈ భంగిమను నివారించాలి ఈ ఆసనంలో తలపై ఎక్కువ బరువు పడకుండా చూసుకోవాలి. అలాగే లోతుగా శ్వాస తీసుకుని కొద్దిసేపు అలానే ఉండాలి. ఈ క్రమంలో అసౌకర్యం లేదా నొప్పి వస్తే తక్షణమే వ్యాయామం ఆపేసి ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: అలియా-రణబీర్ ఇష్టపడే వంటకాలివే..!) -
యుద్ధానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా.. ఈ వారియర్పోజ్!
యుద్ధానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా ఈ యోగా భంగిమలు ఉంటాయి. అందుకే, దీనిని వారియర్ పోజ్ అంటారు. ఈ యోగ భంగిమలో ఒక కాలి తుంటి భాగం ముందుకి ఉంటుంది. మరొక కాలు వెనక్కి చాపి, మునివేళ్ల మీద ఉంచాలి. చేతులను తలమీదుగా నిటారుగా ఉంచి, నమస్కారం చేసినట్టుగా కలపాలి. దృష్టి రూఫ్ వైపుగా ఉండాలి. కొద్దిగా వెనక్కి వంగడం వల్ల వెన్నెముక సాగుతుంది. భుజాలు, ఇరువైపులా శరీర కదలికలు ఈ భంగిమలో ఉంటాయి.అంతర్గత సామర్థ్యానికి ప్రతీకగా చెబుతుంటారు కాబట్టి దీనిని వీరభద్ర ఆసనం అని కూడా అంటారు. దీనిని రోజూ సాధన చేయడం వల్ల తుంటి, కాళ్లు, చీలమండలం, పాదాల ఎముకలకు బలం చేకూరుతుంది. కండరాలను టోనింగ్ చేస్తుంది. కాళ్లలో శక్తి సమకూరుతుంది. బలం, ఏకాగ్రత, ధైర్యం వంటి మానసిక స్థైర్యం ఈ ఆసన సాధన వల్ల కలుగుతాయి. శ్వాస తీసుకుంటూ, నెమ్మదిగా వదులుతూ ఐదు సార్లు ఈ ఆసనాన్ని సాధన చేయాలి. అన్ని వయసుల వారు చేయచ్చు. ఆర్థరైటిస్ మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.– జి.అనూష, యోగా నిపుణులు -
యోగం: విల్లులా వంచుదాం!
వెన్నెముక కండరాలను బలోపేతం చేయడంలోనూ, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలోనూ.. ఎన్నో ప్రయోజనాలను అర్ధచక్రాసన ద్వారా పొందవచ్చు. ఈ ఆసనం విల్లు భంగిమను పోలిఉంటుంది. అర్ధ చక్రం (హాఫ్ వీల్ ఆసన) అంటే సగం చక్రం అన్నమాట.చురుకైన కండరాలు..దీనిని సాధన చేయడానికి మ్యాట్‌పైన నిటారుగా నిల్చోవాలి. చేతులను, తలను భుజాల నుంచి వెనక్కి తీసుకుంటూ నడుమును వంచాలి. దీని వల్ల వెన్ను భాగం సాగుతుంది. ఎంత వీలైతే అంతగా నడుము భాగాన్ని ముందుకు, తల భాగాన్ని వెనక్కి వంచుతూ కాళ్లను నిటారుగా ఉంచాలి. దీంతో కండరాలన్నీ పూర్తి చురుగ్గా అవుతాయి. వెనుకకు వంగేటప్పుడు దీర్ఘ శ్వాస పీల్చుకొని, నెమ్మదిగా వదలాలి. అదే విధంగా యధాస్థితికి చేరుకున్నప్పుడు దీర్ఘశ్వాస తీసుకుంటూ, వదలాలి. మూడు నుంచి ఐదు సార్లు..సాధారణంగా శ్వాస తీసుకునేటప్పుడు సమతుల్యతను కోల్పోకుండా ఉండేలా చూసుకోవాలి. మూడు నుంచి ఐదు సార్లు ఈ భంగిమను తిరిగి చేయాలి. తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం కేటాయించాలి. ఈ ఆసనం వల్ల వెన్నెముక నొప్పి తీవ్రత తగ్గుతుంది. కడుపుపై ఒత్తిడి పెరిగి, అదనపు కొవ్వు తగ్గిపోతుంది. ఊబకాయంపై ప్రభావంతంగా పనిచేస్తుంది. హృదయ స్పందన రేటును సమర్థంగా నిర్వహిస్తుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది.– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ -
క్యాన్సర్ కాటుకు వర్కవుట్.. ఫిట్ ఫర్ టాట్!
హీనా ఖాన్ ప్రముఖ నటి. హిందీ టీవీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. కెరీర్ కాంతిపుంజంలా వెలుగుతున్న కాలంలో అనారోగ్యం ఆమె మీద దాడి చేసింది. ఆమె తాను బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించేటప్పటికే మూడవ దశకు చేరినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే క్యాన్సర్ బారిన పడినందుకు ఏ మాత్రం కుంగిపోవడంలేదు. కీమోథెరపీ చేయించుకుంటూ తన ఆరోగ్యంతోపాటు ఫిట్నెస్ మెయింటెయిన్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా జిమ్‌కెళ్తోంది. వివరాల్లోకి వెళితే...కాళ్లు మొద్దుబారుతున్నాయి..కీమోథెరపీ బాధలు, న్యూరోపతిక్ పెయిన్‌ను భరిస్తూ కూడా హెల్దీ లైఫ్ స్టయిల్‌ను అనుసరిస్తోంది. ‘కీమోథెరపీ దేహాన్ని పిండేస్తుంది. వర్కవుట్స్ చేసేటప్పుడు కాళ్లు పట్టుతప్పుతున్నాయి, ఒక్కసారిగా పడిపోతున్నాను’ అని ఒక పోస్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం లేదామె. మెంటల్, ఫిజికల్ వెల్నెస్ కోసం నొప్పుల బాధలను పళ్లబిగువున భరిస్తూ వ్యాయామం చేస్తోంది. ‘అనారోగ్యంతో కుంగిపోయిన వ్యక్తిలా అభివర్ణించుకోవడం నాకిష్టం లేదు. పడినప్పటికీ తిరిగి లేచి నిలబడాలి. వర్కవుట్ చేసే ప్రతిసారీ ‘గెట్టింగ్ బ్యాక్ అప్... అని నాకు నేను చెప్పుకుంటాను.అలా చెప్పుకోకపోతే మానసిక శక్తి రాదు. మానసిక శక్తి లోపిస్తే వ్యాయామం చేయడానికి దేహం సహకరించదు’ అని తన ఇన్‌స్టా్రగామ్ ఫాలోవర్స్‌తో పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె రకరకాల వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఒక వీడియోలో జుత్తును తల నుంచి చివరి వరకు నిమిరి అరచేతిలోకి వచ్చిన జుత్తును చూపించింది. గుండు గీసుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. మరొక వీడియోలో వర్షంలో గొడుగు వేసుకుని, ప్రోటీన్ షేక్ ఉన్న ఫ్లాస్క్ పట్టుకుని జిమ్ ఆవరణలో ప్రవేశించింది. గొడుగు మూస్తూ హాయ్ అని పలకరించి విక్టరీ సింబల్ చూపించి జిమ్ గదిలోకి వెళ్లడంతో వీడియో పూర్తయింది. ‘స్టే స్ట్రాంగ్’ అంటూ ఆమె ఫ్లయింగ్ కిస్ విసిరి వీక్షకులకు మనోధైర్యాన్నిచ్చింది.మీ ఆదరణకు కృతజ్ఞతలు..సోషల్ మీడియాలో ఫాలోవర్స్ నుంచి అందుతున్న ఆదరణకు ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ ‘మీ అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతతో ఉంటాను. ఈ చాలెంజ్‌లో నేను గెలుస్తాను’ అన్నది. కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. అనారోగ్యం వస్తే డీలా పడిపోకూడదు. పోరాడి గెలవాలి అనే సందేశం ఇస్తున్న ఆమె వీడియోలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి. వైద్యం ఎంతగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ, క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్న తర్వాత సాధారణ వ్యక్తుల్లాగే క్వాలిటీ లైఫ్‌ను లీడ్ చేయడం మనచేతుల్లోనే ఉందని సమాజానికి ధైర్యం చెబుతున్న వారిలో హీనాఖాన్ ఒకరు.ఫిట్నెస్ చాలెంజ్..అమెరికాలోని స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ సూచనల మేరకు... తేలికపాటి వ్యాయామాలు... రిలాక్స్డ్ బైకింగ్ (గంటకు ఐదు మైళ్లకంటే తక్కువ వేగంతో సాఫీగా ఉన్న నేల మీద సైక్లింగ్), స్లో వాకింగ్ (చదునుగా ఉన్న నేల మీద గంటకు మూడు మైళ్లకంటే తక్కువ వేగంతో నడవడం). చిన్న చిన్న ఇంటిపనులు, తాయ్ చాయ్ (దేహాన్ని నిదానంగా కదిలిస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోవడం), ప్లేయింగ్ క్యాచ్ (బాల్‌ను లేదా ఫ్రిస్బీ ప్లేట్‌ను గురి చూసి విసరడం)తీవ్రమైన వ్యాయామాలు...బైకింగ్... (గంటకు పది మైళ్లకు మించకుండా సైక్లింగ్), బ్రిస్క్ వాక్ (గంటకు మూడు నుంచి నాలుగున్నర మైళ్ల వేగం), ఇంటి పనుల్లో బరువైనవి కూడా, యోగసాధన, టెన్నిస్ వంటి ఆటలు.– అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీలు... క్యాన్సర్ పేషెంట్లు వారానికి 150 నుంచి 300 నిమిషాలపాటు వ్యాయామం చేయాలని, రోజుకు అరగంట చొప్పున వారానికి ఐదు రోజుల వర్కవుట్ షెడ్యూల్ ఉండాలని చెప్తున్నాయి. -
గర్భిణీలు వ్యాయామం చేయాలా? వద్దా?
బిడ్డకు జన్మనివ్వడం అంటే అంత అషామాషీ వ్యవహారం కాదు. గర్భం దాల్చింది మొదలు శరీరంలో అనేక శారీరక మార్పులు చోటు చేసుకుంటారు. హార్మోన్లలో తేడాలొస్తాయి. వాంతులు, మార్నింగ్ సిక్నెస్ లాంటివి మరింత ఇబ్బందిపెడతాయి. వీడికి తోడు అనేక ఏం తినాలి? ఇలా ఎందుకు అయింది? ఇదేమైనా ప్రమాదమా? లోపల బేబీ బాగానే ఉందా? బిడ్డ బాగానే ఎదుగుతోందా? వ్యాయామం చేయాలా? వద్దా? ఇలా సవాలక్ష సందేహాలు కాబోయే తల్లుల బుర్రల్ని తొలుస్తూ ఉంటాయి? బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లి మంచిపోషకాహారం తీసుకోవడం ముఖ్యం. కానీ గర్భధారణ సమయంలోవ్యాయామం చేయడం కూడా అవసరం. అయితే ఎలాంటి వ్యాయామం చేయాలి అనేది పెద్ద ప్రశ్న.అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG) ప్రకారం, గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం వలన తేలిగ్గా ప్రసవం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ముందస్తు జననాలను నివారించవచ్చు.గర్భం దాల్చడం అపురూపమే కానీ, కనీస శారీక శ్రమ చేయకూడనంత కాదు. గర్బిణీలు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, కొన్ని వ్యాయామాలు చేయడంద్వారా సుఖ ప్రసవం జరుగుతుంది. కటి కండరాలు, ఎముకలు బలంగా మారి ప్రసవం తర్వాత కొలుకునే సమయాన్ని కూడా తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నమాట. అధిక బరువు , గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం లేదా ప్రీఎక్లంప్సియా వంటి అధిక రక్తపోటు రుగ్మతలు దరి చేరవు. ఆందోళన, ఒత్తిడిని తేలికపాటి వ్యాయామం తగ్గిస్తుంది. పొట్ట పెరుగుతున్నపుడు వచ్చే నడుం నొప్పి తగ్గుతుంది. ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఇప్పుడు చూద్దాం.గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడానికి ముందు మీ గైనగాలజిస్ట్ సలహా తప్పకుండా తీసుకోవాలి. వారి సలహా మేరకు నాలుగో నెల నుంచి సాధారణం వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి. రోజంతా ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత మంచిది. ప్రజారోగ్య మార్గదర్శకాల ప్రకారం గర్భిణీలు వారానికి సుమారు 150 నిమిషాలు (లేదా రోజుకు 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు) వాకింగ్ చేయవచ్చు. వార్మ్-అప్ ,కూల్-డౌన్ వ్యాయామాలు ఎంచుకోవాలి. మానసిక, శారీరక ఆరోగ్యంకోసం తేలికపాటి యోగా చేయవచ్చు.గర్భధారణ సమయంలో పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయాలి. గర్భాశయం, మూత్రాశయం, ప్రేగులకు మద్దతు ఇచ్చే కండరాలను బలోపేతం చేస్తాయి.ట్రైనర్స్ సహాయంతో ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చు. తల్లి స్నానం చేసేటపుడు, పొట్టమీద ఒకసారి వేడి నీళ్లు (సమవేడి) మరోసారి చల్ల నీళ్లను పోసుకుంటూ వాటర్ థెరపీలా చేసుకోవాలట. దీని వల్ల బిడ్డ నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటుందని చెబుతారు. అరగంట సమయానికి పరిమితం కావడం మంచిది. ఏదైనా తేడాగా అనిపించినా, అలసటగా అనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే సడన్‌గా లేవడం, కూర్చోవడం, ఒక్కసారిగా కిందినుంచి పైకి బరువులు ఎత్తకూడదు. ఏ వ్యాయామం అయినా, మితంగా చేయడం ముఖ్యం. అలసిపోయే దాకా చేయకూడదు. గర్భవతిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. మధ్యాహ్నం భోజనం తరువాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. బీపీ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. అలాగే కడుపులో బిడ్డ కదలికలను నిరంతరం గమనిస్తూ ఉండాలి. -
జాను శీర్షాసనం.. తల నుంచి మోకాలి వరకు!
తల నుంచి మోకాలి వరకు ఉండే ఈ భంగిమను జాను శీర్షాసన అంటారు. ‘జాను’ అంటే మోకాలు ‘శీర్ష’ అంటే తల. ఈ ఆసనాన్ని వేసే ముందు మ్యాట్ పైన సుఖాసనంలో కూర్చోవాలి.ఒక కాలును ముందుకు చాపి, చేతులతో ఆ కాలిపాదాన్ని పట్టుకోవాలి. తలను మోకాలి మీదుగా ఉంచాలి. మడిచి ఉన్న రెండవ కాలుపాదం మరొక కాలును తాకినట్టుగా, ΄÷ట్ట దగ్గరగా ఉండాలి. ఈ ఆసనంలో ఎక్కువ సేపు ఉండటం వల్ల వెన్నెముక సాగినట్టుగా, దిగువ శరీరం అంతా రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. జీర్ణక్రియ, శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తుంది. నడుము నొప్పి, ఒత్తిడి, నిరాశ, అలసటపై ప్రభావం చూపుతుంది.అధిక బరువుకు:మొదట్లో ఈ ఆసనం వేస్తున్నప్పుడు కొంత సవాల్‌గా అనిపిస్తుంది. ఎక్కువ ఒత్తిడి లేకుండా మెల్లగా ప్రయత్నించడం వల్ల ఈ భంగమను సాధన చేయవచ్చు. ఒక కాలును ఒకసారి రెండవ కాలును మరొకసారి 5 సార్లు మార్చుతూ చేయాలి. రోజూ పరగడపున పది సార్లు ఈ ఆసనం వేయడం వల్ల అధికబరువు, గ్యాస్ట్రిక్, మధుమేహం సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. రోజులో ఉండే ఒత్తిడి నుంచి కూడా త్వరగా రిలాక్స్ అవుతారు.సూచన:గర్భిణులు, హెర్నియా, ఆస్తమా, స్పాండిలోసిస్, స్లిప్డ్ డిస్క్ వంటి సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు లేదా యోగా నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే సాధన చేయాలి.– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ఇవి చదవండి: నైట్ బ్రషింగ్ తప్పనిసరి.. లేదంటే ఈ సమస్యలు రావచ్చు! -
కుర్చీకి అతుక్కుపోతే అంతే సంగతులు
ఏ వయసు వారైనా రోజుకు తగినంత శారీరక శ్రమ చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. చదువు, పనిలో ఎంత బిజీగా ఉన్నా శారీరక శ్రమను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. శరీరాన్ని కాస్త అటూఇటూ కదల్చాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సూచిస్తోంది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), ఐసీఎంఆర్ కలిసి డైట్రీ గైడెన్స్ ఫర్ ఇండియా పేరిట మెరుగైన ఆరోగ్యం కోసం 17 మార్గదర్శకాలను ఇటీవల వెల్లడించాయి. సంపూర్ణ ఆరోగ్యం కోసం శారీరక శ్రమ, యోగా, వ్యాయామంపై పలు సిఫార్సులు చేశాయి. – సాక్షి, అమరావతిప్రతి కొద్ది గంటలకు కదలిక ఉత్తమంఎంత బిజీగా ఉన్నా పనిచేసే ప్రదేశాల్లో, ఇతర సందర్భాల్లో కుర్చీకే అతుక్కోపోవడం సరికాదు. ప్రతి కొన్ని గంటలకు ఒకసారి శరీరాన్ని కదల్చాలని ఐసీఎంఆర్ సూచించింది. పని చేసే ప్రదేశాల్లో స్టాడింగ్ డెస్క్ ఉపయోగించాలి. లేదంటే ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిలబడాలి. అదే విధంగా ప్రతి కొన్ని గంటలకు లేచి 5 నుంచి 10 నిమిషాలు అటూఇటూ నడవాలని పేర్కొంది. ఇంట్లో, పని ప్రదేశాల్లో ఫోన్ మాట్లాడేప్పుడు నడుస్తూ ఉండాలి. లిఫ్ట్, ఎలివేటర్‌కు బదులు మెట్లను వినియోగించాలి. టీవీ చూస్తున్నప్పుడు కుర్చీకే పరిమితం కాకూడదు. టీవీల్లో వచ్చే కమర్షియల్ బ్రేక్ సమయంలో లేచి తిరగాలి.30 నుంచి 60 నిమిషాల వ్యాయామం⇒ 19 నుంచి 60 ఏళ్ల వయసు వారు రోజుకు 30 నుంచి 60 నిమిషాల పాటు మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి.⇒ వారంలో ఐదు రోజులు వ్యాయామం తప్పనిసరి.⇒ వయసు, ఆరోగ్య స్థితిగతులను పరిగణనలో ఉంచుకుని ఏరోబిక్ ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ వంటి ఇతర శారీరక శ్రమ చేయాలి.⇒ ఇదే తరహాలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు కూడా వారం మూడు, అంతకంటే ఎక్కువ రోజులు శారీరక శ్రమను ఐసీఎంఆర్ సూచించింది.⇒ 5–19 ఏళ్ల పిల్లలు, యుక్త వయస్కులకు రోజుకు కనీసం 60 నిమిషాల ఇంటెన్సిటీ యాక్టివిటీని సూచించింది.భారత్‌లో డబ్ల్యూహెచ్‌వో సూచనలు అందుకోలేక పోయిన వారు.. (శాతం)సంపూర్ణ ఆరోగ్యం కోసం దైనందిన జీవనంలో వివిధ కార్యకలాపాలపై సిఫార్సులు ఇలా..లాన్సెట్ అధ్యయనం ఏం చెబుతోందంటే.. భారత్‌లోని 57 శాతం మహిళలు, 42 శాతం మంది పురుషులు ఫిజికల్ ఇనాక్టివ్‌గా ఉంటున్నట్టు తాజాగా ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాల్లోని డేటాను అధ్యయనం చేయగా భారత్ 12వ స్థానంలో ఉన్నట్టు స్పష్టమైంది. ప్రపంచ వ్యాప్తంగా 31 శాతం మంది పెద్దలు అంటే.. దాదాపు 1.8 బిలియన్ల మంది 2022లో ఇనాక్టివ్‌గా ఉంటున్నారు. 2010 నుంచి 2022 మధ్య 5 శాతం మేర ఈ స్థాయి పెరిగినట్టు తేలింది.వారానికి కనీసం 150 నిమిషాలు..ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారతీయుల్లో కూడా శారీరక శ్రమ తగ్గిపోతోంది. జీవన శైలి జబ్బుల బారినపడకుండా ఉండాలంటే వారానికి కనీసం 150 నిమిషాలు శారీరక శ్రమ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచిస్తోంది. -
ఈ యోగా.. సీతాకోక చిలుక రెక్కల్లా మన కాలి కదలికలు..
టీనేజ్ అమ్మాయిల నుంచి నడి వయసు స్త్రీల వరకు.. ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను పెంపొందిస్తూ, అధికబరువును నియంత్రించేలా చేస్తుంది బద్ధకోణాసనం. ఈ యోగా భంగిమలో సీతాకోక చిలుక రెక్కల్లా మన కాలి కదలికలు ఉంటాయి. కాబట్టి బటర్‌ఫ్లై ఆసనంగా కూడా దీనికి పేరు. ఉదయం లేదా సాయంత్రం రోజూ పది నిమిషాలు ఈ బటర్‌ఫ్లై ఆసనాన్ని సాధన చేస్తే మెరుగైన ప్రయోజనాలను పొందుతారు.కంప్యూటర్‌తో పని చేసేవాళ్లు వెన్ను, మెడ, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు సులువైన, తేలికైన సీతాకోక చిలుక ఆసనం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు.20 నుంచి 30 సార్లు..ముందుగా నేల మీద సుఖాసనంలో కూర్చోవాలి. రెండు పాదాలను మధ్యలోకి తీసుకొచ్చి, చేతులతో కాళ్ల వేళ్లను పట్టుకోవాలి. ఈ భంగిమలో కళ్లు మూసుకొని, శ్వాసపై దృష్టి కేంద్రీకరిస్తూ ఐదుసార్లు దీర్ఘశ్వాస తీసుకుంటూ, వదలాలి. తర్వాత కళ్లు తెరిచి, కాళ్లను మెల్లగా పైకి, కిందకు 20 నుంచి 30 సార్లు కదుపుతూ ఉండాలి.రోజూ ఉదయం ఇలా చేస్తుంటే వెన్నెముక దృఢంగా అవుతుంది. లోయర్ హిప్స్, బ్యాక్ కండరాల బలం పెరుగుతుంది. ΄÷ట్ట కండరాలలోనూ మార్పులు వస్తాయి. ఒత్తిడి తగ్గి మైండ్, బాడీ విశ్రాంతి పొందుతాయి. కాళ్ల ఎముకల సామర్థ్యం పెరుగుతుంది. రక్తసరఫరా మెరుగై వెన్ను, మెడ, తలనొప్పి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్ -
సంపూర్ణ జీవితం
భట్టి విక్రమార్క కథలో, విక్రమార్కుడి బుద్ధి కుశలతను మెచ్చి, వెయ్యేళ్లు పరిపాలించే సింహాసనాన్ని బహూకరిస్తాడు ఇంద్రుడు. అంటే వెయ్యేళ్ల ఆయువు. మరి నా సంగతేమిటని విక్రమార్కుడిని అడుగుతాడు సోదరుడు భట్టి. అన్నింటికీ వెన్నంటి ఉండే భట్టి సంగతి మరిచేపోయాడు విక్రమార్కుడు. దాంతో భట్టి ఆవేశంతో కాళికాదేవి తపస్సు చేసి, రెండు వేల ఏళ్లు బతికే వరం పొందుతాడు. మరి నా సంగతేమిటని అడుగుతాడు విక్రమార్కుడు. ఇద్దరు కలిసి కదా బతకాలి! అప్పుడు ఆలోచన చేస్తారు. సింహాసనం మీద వెయ్యేళ్లు కూర్చుని కదా పాలించమన్నది... అంటే అది ఆయువు పరిమితి కాదు, రాజ్యపాలన పరిమితి. అందుకే ఆరు నెలలు రాజ్య పాలన, ఆరు నెలలు అరణ్యవాస పథకం వేస్తారు. అలా భట్టి విక్రమార్కులు ఇద్దరూ రెండు వేల ఏళ్లు బతుకుతారు. ఒక్క భట్టి విక్రమార్కులేనా? రామాయణంలో దశరథుడు వేల ఏళ్లు బతికాడు. ఎందరో మునులు, రుషులు వేల ఏళ్లు తపస్సులోనే గడిపి ఎన్నో శక్తులు సాధించిన కథలున్నాయి. ఎప్పటికీ చనిపోని వరాలు పొందిన రాక్షసులు ఎందరో మన పురాణాల్లో ఉన్నారు. ఎప్పటికీ బతికివుండేలా దేవతలు అమృతాన్ని సేవించారు. చనిపోయినవాళ్లను అట్టే మళ్లీ పునర్జీవింపజేసే సంజీవని కథలు, గాయాలన్నీ మానిపోయి దృఢకాయులయ్యే లేపనాల గాథలు మనకున్నాయి. వేల ఏళ్లు బతకడం అంటే దాదాపుగా చావు లేకపోవడమనే! జీవితానికి అంతం పలికే చావు అనేదాన్ని తప్పించే అన్ని ప్రయత్నాలనూ మనిషి కనీసం కథల్లోనైనా, కలల్లోనైనా చేశాడనుకోవచ్చు.ఎప్పటికైనా చచ్చిపోతామనే వాస్తవం మనిషిని కలవరపెడుతుంది. సమస్త మానవాళి గురించి కాకపోయినా, కనీసం తన అయినవారు తనకు కాకుండాపోతారన్న చింత ఉండటంతోపాటు తానూ ఒకరోజు ఈ భూమ్మీద శూన్యంగా మిగిలిపోతాడన్నది జీర్ణం చేసుకోలేని చేదుమాత్ర. అన్ని మతాలూ మరణానంతర జీవితాలను వాగ్దానం చేయడంలో అందుకే విజయం సాధించి ఉంటాయి. చచ్చాక ఏమీ లేదు అనుకోవడం కంటే, ఆ పైనెక్కడో మళ్లీ బతుకుతాం అనేది ఒక ఊరట. అదే సమయంలో చిట్టచివర చావు అనేది ఉంటుందని తెలియడం కొంతమందికి ఒక రిలీఫ్ కూడా. లేకపోతే ఎంతకాలం ఈ రోజువారీ సంకెళ్ల లాంటి వ్యవహారాలను లాక్కురావడం? అందుకే మన పెద్దలు మళ్లీ పుట్టుక లేని ముక్తిని కోరుకున్నారు కాబోలు.సృష్టిలోని ప్రతి జీవికీ ఒక ఆయుఃప్రమాణాన్ని నిర్దేశించిన ప్రకృతి, మనిషికి 120 ఏళ్లు ఇచ్చింది. శతమానం భవతి అని పెద్దలు దీవిస్తుంటారుగానీ, దాన్ని నూరేళ్లు అనికాక, పూర్ణాయువుతో బతకమని దీవించడంగా అర్థం చేసుకోవచ్చు. అర్ధంతరంగా మరణించడం ఆ ప్రకృతి వరాన్ని పాడుచేసుకోవడమే. అర్ధంతర మరణం ఆధునిక మానవుడికి సంభవించడానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉన్నాయి. మృత్యువును, రోగాలను మోసం చేసి దీర్ఘకాలం బతగ్గలమా? మన ఆయుఃప్రమాణం కంటే చాలా ఏళ్ల పాటు బతకడాన్ని నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు సాధ్యం చేయనున్నాయా? మనిషి శాశ్వతత్వాన్ని సాధించగలడా? మన ఫిజియాలజీని మార్పు చేయడం ద్వారా జీవితకాలాన్ని పొడిగించవచ్చా? ఇలాంటి ప్రశ్నలను నోబెల్ పురస్కారం అందుకున్న వెంకీ రామకృష్ణన్ తన ‘వై వి డై: ద న్యూ సైన్స్ ఆఫ్ ఏజింగ్ అండ్ ద క్వెస్ట్ ఫర్ ఇమ్మోర్టాలిటీ’ పుస్తకంలో చర్చించారు. మనిషి శరీరం కోటానుకోట్ల కణాల నిర్మితం. ప్రతి కణంలో ఉండే డీఎన్ ఏ ప్రతిరోజూ లక్ష మార్పులకు గురవుతుంది. డీఎన్ ఏను నాలుగక్షరాల వర్ణమాలలో రాసిన సుదీర్ఘమైన కోడ్ అనుకుంటే, నెమ్మదిగా దాని కార్యకలాపంలో అంతరాయం రావడమే ముదిమి రావడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 బయోటెక్ కంపెనీలు ముదిమి, జీవితకాల పొడిగింపు మీద పని చేస్తున్నాయి. ‘యవ్వనంలో ఉన్నప్పుడు ధనికులం కావాలనుకుంటాం; ధనికులం అయ్యాక యవ్వనాన్ని కోరుకుంటాం. యవ్వనాన్ని కొనలేకపోయినా, కనీసం దానిమీద పరిశోధనలనైనా (ఏజింగ్ రీసెర్చ్) ధనికులు కొంటున్నా’రంటారు వెంకీ రామకృష్ణన్ . ఒకవేళ శాస్త్ర పరిశోధనలు ముదిమిని ఆపడంలో విజయం సాధించినా ఆ ఫలితాలు సంపన్నులకు తప్ప పేదవాళ్లకు తేలిగ్గా అందుబాటులోకి రావని చెబుతారు.ఈ శాస్త్రాలు, పరిశోధనలతో నిమిత్తం లేకుండా; ధనిక, పేద అనే తేడా లేకుండా జీవితాన్నే ఒక సాధనగా మలుచుకున్న కొన్ని ప్రాంతాల్లో మనుషులు సంపూర్ణ ఆయువును అనుభవిస్తున్నారు. ఒకినావా (జపాన్ ), సార్డీనియా (ఇటలీ), నికోయా (కోస్టా రికా), ఇకారియా (గ్రీస్), లోమ లిండా (కాలిఫోర్నియా, అమెరికా)... లాంటి ప్రదేశాల్లో ఎక్కువమంది వందేళ్లు బతకడమో, దీర్ఘకాలం బతకడమో కనబడుతుంది. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచంలో ‘బ్లూ జోన్స్’గా నిలుస్తున్నాయి. ‘లివ్ టు 100: సీక్రెట్స్ ఆఫ్ ద బ్లూ జోన్స్’ డాక్యుమెంటరీ ప్రయోక్త డాన్ బ్యూట్నర్... ఈ బ్లూ జోన్స్ అని నామకరణం చేయడమే కాకుండా, వాళ్ల దీర్ఘాయువు రహస్యాలను పరిశోధించారు. శారీరక కార్యకలాపాలు, తక్కువ ఒత్తిడి, స్థానికంగా దొరికే ఆహారాన్ని వినియోగించడం, బలమైన కుటుంబ, సామాజిక సంబంధాలు వీరిని ఆరోగ్యవంతులుగా ఉంచుతున్నాయని బ్యూట్నర్ చెబుతారు. రసాయనిక ఎరువులు వేయని పంటలు, 95 శాతం మొక్క ఆధారిత ఆహారం, ఎనభై శాతం మాత్రమే తిని కడుపులో కొంత ఖాళీ ఉంచుకోవడంతోపాటు, జీవితానికి ఒక ఉద్దేశం ఉంచుకోవడం వారిని ఉత్సాహవంతులుగా ఉంచే అదనపు విషయాలు. వెంకీ రామకృష్ణన్ అయినా, బ్లూ జోన్స్ శతాధికులైనా మనిషి ఆరోగ్యానికి కీలకమని చెప్పేవి మూడు: ఆహారం, వ్యాయామం, నిద్ర. ఇవైతే మన చేతిలోనే ఉన్నాయి. -
800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
బరువు తగ్గేందుకు, ఫిట్‌గా ఉండేందుక చాలామంది పలు రకాల వ్యాయామాలు చేస్తుంటారు. కొందరు ఏరోబిక్, సైక్లింగ్, కార్డియో వర్కౌట్లు, యోగా వంటివి చేస్తుంటారు. ఎవరికి వెసులుబాటుగా ఉండేవి వారు ఎంచుకుని మరీ క్రమతప్పకుండా చేస్తుంటారు. మరికొందరూ వేలు ఖర్చుపెట్టి మరీ ఫిట్నెస్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే కొన్ని రకాల అద్భుతమైన వ్యాయామాలు మన పూర్వీకాలం నుంచే ఉండేవి. ఐతే రాను రాను కొన్ని కనుమరుగయ్యిపోగా, మరికొన్నింటిని మనం గుర్తించకపోవడంతో తెలియకుండా పోయాయి. అలాంటి ఓ పురాతన వ్యాయామం తాజాగా వెలుగులోకి వచ్చింది. పైగా ఇది ఇప్పుడూ నెట్టింట తెగ ట్రెండింగ్‌గా మారింది. ఏంటా వ్యాయామం అంటే..చైనాకి సంబంధించిన 800 ఏళ్ల నాటి పురాతన వ్యాయామం ఇది. దీన్ని'బడువాంజిన్' అని పిలుస్తారు. ఈ వ్యాయామాన్ని సాధారణంగా వృద్ధులు ఎక్కువగా చేస్తుంటారు. అలాంటి వ్యాయామాన్ని ఇప్పుడు చైనా యువత ఆశ్రయిచడం విశేషం. దీన్ని వారు తమ రోజువారి దినచర్యలో భాగంగా చేసుకుని మరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది తమ మాసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి, అలసటను, ఒత్తిడిని దూరం చేస్తోందని చెబుతున్నారు. నిజానికి ఈ వ్యాయామం 960-1279ల నాటి సాంగ్ రాజవంశం కాలం నాటిది. చైనా ఆరోగ్యం అండ్ ఫిట్నెస్లకు సంబంధించిన పురాతన వ్యాయామాల్లో ఇది ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. ఇది ఎనిమిది ఆసనాలతో కూడిన వ్యాయామం. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన వ్యాయామాలకు అనుగుణంగా చేస్తుండాలి. అందువల్ల మనకు ఇది ఒకరకంగా ధ్యానం చేసినట్లుగా ఉండటమే గాక శరీరం శక్తిని, రక్తపోటుని నియంత్రించే చక్కటి శరీర సాగతీతలు ఉంటాయి. చైనాలోని షెన్జెన్, షాంఘై, బీజింగ్, గ్వాంగ్జౌ వంటి నగరాల్లో యువత దాదాపు 49 గంటలు పనిచేస్తారు. దీంతో యువత తీవ్రమైన అలసటకు, ఒత్తిడికి లోనవ్వడం జరుగుతుంది. అందువల్లే వారంతా ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఇప్పుడూ ఈ వ్యాయామాన్నే ఆశ్రయిస్తున్నారు. గతేడాది జర్మన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ పమేలా రీఫ్ బడువాన్జిన్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఈ వీడియోకి ఒక్కసారిగా మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. పైగా ఈ వ్యాయామం నెట్టింట తెగ ట్రెండింగ్‌గా మారింది. అంతేగాదు నెటిజన్లు మెడనొప్పితో బాధపడుత్ను వారికి ఈ వ్యాయామం అద్భుతంగా పనిచేస్తుందని, నిద్రనాణ్యత మెరుగుపడి రిఫ్రెష్‌గా ఉంటారని చెబుతున్నారు. Agréablement surpris par @PamelaReifYT qui pratique aussi le Baduanjin (Huit pièces de brocart), vieille gymnastique chinoise qui fait du bien à la santé. Programme sportif du weekend de plus en plus varié alors🤭 pic.twitter.com/zidpZ9dtOz— Yi Lien (@YiLien000) August 27, 2023 (చదవండి: ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!) -
పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
నేటి ఆధునిక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దీనికితోడు జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి ఉపవాసాలున్నా, జిమ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్న వారిని చూస్తూ ఉంటాం. అలాగే ఏం తిన్నా ఇక్కడికే.. అంటూ హీరోయిన్ సమంతా తరహాలో అద్దముందు నిలబడి డైలాగులుకొట్టే అమ్మాయిలు కూడా చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో జిమ్‌కెళ్లకుండానే, ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో, ఊబకాయం, బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ బటక్స్ సమస్యకు చెప్పవచ్చు.గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే గండమే!గంటల తరబడి టీవీలకు అతుక్కు పోకూడదు. పనిలో పడి అలాగే 8 నుంచి 10 గంటల పాటు కూర్చుని పని చేయకూడదు. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోతోంది. అలాగే కడుపు ఉబ్బరం వస్తుంది. కాబట్టి ప్రతి గంటకు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. మెట్లు ఎక్కడం, గుంజీలు తీయడం లాంటివి చేయాలి. దీంతో అవయవాలకు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామంఉదయం, సాయంత్రం లేదా మీకు వీలైన సమయంలో వేగంగా నడవడం, జాగింగ్, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ తప్పకుండా చేయాలి. స్నేహితులతో కలిసి మీకు నచ్చిన గేమ్స్ (క్రికెట్, టెన్నిస్, కబడ్డీ,ఇ తర) అవయవాలు పూర్తిగా కదిలేలా ఆడండి. శరీరమంతా చెమట పట్టేదాకా శ్రమిస్తే బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి పోతాయి.ఎముకలు, కండరాలు బలతంతా తయారవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతి ముఖ్యమైన డీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.తగినన్ని నీళ్లు, కంటినిండా నిద్ర: వ్యాయామం చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది , బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. నీటిని తాగడం వల్ల పొట్ట, పొత్తికడుపు కొవ్వు తగ్గుతుంది. చక్కటి నిద్ర కూడా మన బరువును ప్రభావితం చేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం.ఫైబర్ రిచ్ ఫుడ్స్: శరీర బరువు నియంత్రణలో ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. బరువు పెరగడం గురించి ఆందోళన మానేసి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి, ఈ రకమైన ఆహారాన్ని తినడం వల్ల మీ కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటల లోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి. బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.ఇంకా: ఒకేసారి కడుపు నిండా.. ఇక చాలురా బాబూ అనేంతగా తినవద్దు. అలాగే మైదాతో తయారుచేసిన పదార్థాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మద్యం, ధూమమానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. పొట్ట, పిరుదులు, పిక్కలు, భుజాలు లాంటి ప్రదేశాల్లో కొవ్వును కరిగించుకునేందుకు నిపుణుల సలహా మేరకు కొన్ని స్పాట్ రిడక్షన్ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యోగాలో కూడా ఇందుకోసం మంచి ఆసనాలు ఉన్నాయి. వాటినా ప్రాక్టీస్ చేయవచ్చు. నిజంగా వీటిని చిత్తశుద్ధిగా ఆచరిస్తే వారంలో బరువు తగ్గడం ఖాయం.నోట్: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు. ఏదైనా అనారోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
మధుమేహం ఒక తీవ్రమైన వ్యాధి. జీవన శైలి మార్పులు,క్రమం తప్పని వ్యాయామం, ఆహార నియమాలు దీనికి పరిష్కారం. ఒకసారి మధుమేహం బారిన పడితే జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్రమైన సమస్యలు తప్పవు.మధుమేహం వచ్చిందని భయపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. మధుమేహాన్ని నియంత్రించాలంటే తప్పనిసరిగా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.కొద్దిపాటి నడక, యోగాఉదయాన్నే లేదా రాత్రి నడక, యోగా, ధ్యానం చాలా అవసరం. ముఖ్యంగా డయాబెటిక్ సమస్య ఉన్నవారు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రకుపక్రమించకూడదు. కనీసం పది, ఇరవై నిమిషాలు నడక,వజ్రాసనం వంటి యోగాసనాలను అలవాటు చేసుకోవాలి. దీని బరువు అదుపులో ఉంటుంది. తద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం అనేది షుగర్ లెవల్స్ ఎలివేట్ కావడానికి ముఖ్యం కారణం. కాబట్టి తిన్న తర్వాత కనీస శారీరక శ్రమ చాలా అవసరంస్వీట్లకు, కొన్ని రకాల పండ్లుమామిడికాయ, పనస, అరటి లాంటి పండ్లకు చాలా దూరంగా ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క జామకాయ తప్ప ఏదీ తినకూడదు.. తిన్నా.. చాలాపరిమితంగా తీసుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. రాత్రి సమయంలో స్వీట్లు తినకపోవడం మంచిది. మంచి నిద్ర, నీళ్లు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటే రాత్రి నిద్ర కూడా పడుతుంది. డయాబెటిక్ రోగులు కనీసం 8 గంటలు నిద్రపోవాలి.అలాగే రాత్రి భోజనం చేసిన 1 గంట తర్వాత మీరు కనీసం 2 గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధించవచ్చు.రాత్రిపూట మొబైల్ స్క్రీన్లకు ఎంత దూరంగా ఉంటే మంచింది. రాత్రి పడుకుని టీవీ, మొబైల్ చూడటం వల్ల, మెడ నొప్పులు, తలనొప్పి వస్తాయి. మద్యపానం, ధూమపానం పూర్తిగా నిషేధించాలి. ఎప్పటికపుడు పరీక్షలు, వైద్యుల సలహాలుఒకసారి మన శరీరంలోకి మధుమేహం ఎంటర్ అయిందంటే అదొక హెచ్చరికలాగా భావించాలి. రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సలహా మేరకు మందులను వాడుతూ ఉండాలి.నోట్: డయాబెటిక్ వచ్చిందని భయపడకుండా, తగిన జాగ్రత్తలు పాటించాలి. వ్యాయామం, ఆహార నియంత్రణ లాంటి జీవన శైలి మార్పులు ఆరోగ్య జీవనానికి పునాది. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. పూర్తి సమాచారం, సందేహాలకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. -
జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
ఫిట్నెస్ కోసం వ్యాయామం చేస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆందోళన రేపుతోంది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు ఒక యువకుడు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ విషాదం చోటు చేసుకుంది.వారణాసికి చెందిన దీపక్ గుప్తా (32)గత పదేళ్లుగా జిమ్‌లో రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తుండేవాడు.పలు ఫిట్నెస్ పోటీలలో చురుకుగా పాల్గొనేవాడు. ఫిట్నెస్ అంటే ప్రాణం పెట్టే దీపక్ రోజూలాగానే జిమ్‌కెళ్లి వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన తలపోటుతో బాధపడినట్టుగా వీడియో ఫుటేజ్‌ని బట్టి తెలుస్తోంది. నేలపై పడకముందే తన తలని చేతుల్లో పెట్టుకుని కూర్చున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కిందపడిపోయిన దీపక్‌ను అక్కడున్న వారు లేపి కూర్చోబెట్టారు. నీళ్లు తాగించారు, వీపు, తలపై మసాజ్ చేశారు.అయినా గజ గజ వణికిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాత అతడి మృతికి ఖచ్చితమైన కారణం తెలియనుంది. -
ఈ వ్యాయామాలతో కొవ్వు కరిగి స్లిమ్‌గా అవ్వుతారు!
మహిళలు మూడు పదుల వయసు వచ్చేటప్పటికీ శరీరంలో కొవ్వు పేరుకుపోయి, అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. పైగా ఈ ఏజ్‌లోనే రకరకాల దీర్ఘవ్యాధుల బారినపడుతుంటారు చాలామంది. దీనికి చెక్‌పెట్టేలా ఫిట్‌గా ఉండాలంటే రోజువారి దినచర్యలో ఈ వ్యాయామాలను భాగం చేసుకోవాల్సిందే. బరువు తగ్గించే ప్రయాణంలో సమతుల్యమైన ఆహారంతో కూడిన డైట్ ఎంత ముఖ్యమో అలానే శరీరం ఫిట్‌గా ఉండేందుకు ఈ వ్యాయామాలు అంత అవసరం. ఆ వ్యాయమాలేమిటో చూద్దామా..!కార్డియో వర్కౌట్లు: ఇది అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. రన్నింగ్, జాగింగ్, స్కిప్పింగ్ రోప్ వంటి కార్డియో వ్యాయామాలను డైలీ లైఫ్‌లో భాగం చేసుకుంటే ఈజీగా కేలరీలు బర్న్ అవుతాయి. బహుళ కండరాలు ఈ వ్యాయమంలో నిమగ్నమవ్వడంతో హృదయ ఆరోగ్యం మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా శరీర కొవ్వును తగ్గించడంలోనూ, కేలరీల లోటును సృష్టించడానికి సహాయపడతాయి. ఇవి మనిషికి ఓర్పు, సమన్వయం, చురుకుదనాన్ని అందిస్తాయి. హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ): ఇది హృదయ స్పందన రేటును పెంచేలా చేసే వ్యాయామం. ఇది కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేస్తుంది. ముఖ్యంగా పర్వతారోహకులకు ఉపయోగపడే డైనమిక్ వ్యాయామం. ఇది జీవక్రియను పెంచి మొత్తం కొవ్వును కరిగేలా చేస్తాయి. వెయిల్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలు: స్క్వాట్లు, డెడ్‌లిఫ్ట్‌లు, పుష్ అప్లు వంటి వ్యాయామాల్లో కూడా బహుళ కండరాలు నిమగ్నం అవుతాయి. శరీర కొవ్వును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ప్రభావవంతమైన వ్యాయమాలు. జుంబా: వేగవంతంగా చేసే వ్యాయామాలు. ఓ ఆహ్లదభరితమైన వ్యాయామం ఇది. పూర్తి శరీరీ కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉండటమే గాక కేలరీలను బర్న్చేసి కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ను మెరుగుపరుస్తుంది. ఇవి శరీర కొవ్వుని సులభంగా కరిగించేస్తాయి. యోగా: యోగా అనేది చాలా పురాతనమైన అభ్యాసాలలో ఒకటి. ఇది మానవుల జీవనశైలి నాణ్యతను మెరుగుపరచడానికి, వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుంది. అంతేగాదు దీనిలో వివిధ శరీర భాగాలలో కొవ్వును కరిగించడానికి సహాయపడే నిర్దిష్ట యోగా ఆసనాలు ఉన్నాయి. సుమారు 15 నుంచి 20 నిమిషాల క్రమరహిత యోగా 30 ఏళ్లు పైబడిన స్త్రీలలో ప్రశాంతతను తీసుకురావడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.ఆరోగ్యకరమైన రీతిలో శరీర బరువు నిర్వహించడం అనేది క్రమంతప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, చక్కటి జీవనశైలి అనుసరించడం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అలాగే లావు తగ్గేందుకు స్పాట్ రిడక్షన్ వ్యాయామాలు అంటూ ఉండవనే విషయం గుర్తించుకోవాలి. ఆరోగ్యంగా ఉండేలా మంచి ప్రణాళికతో కూడిన వ్యాయామాలపై దృష్టిసారించడం ముఖ్యం అని గ్రహించాలి. (చదవండి: సమ్మర్ హీట్‌కి ఈ ఆటో డ్రైవర్ భలే చెక్ పెట్టాడు! నెటిజన్లు ఫిదా) -
వావ్..మనవళ్ల ముందే...రికార్డులు బద్దలు కొట్టింది!
ఒక బామ్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల స్టమక్ ప్లాంక్స్లో గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. కెనడాలోని అల్బెర్టాకు చెందిన ఒక బామ్మ డోనాజీన్ వైల్డ్ ఏకంగా 4.5 గంటల పాటు పొత్తికడుపు ప్లాంక్స్ చేసింది. 2019లో కెనడియన్ డానా గ్లోవాకాతో గతంలో నెలకొల్పిన రికార్డు కంటే కేవలం 10 నిమిషాలు ఎక్కువ ప్లాంక్స్ చేసిన ఈ రికార్డును అధిగమించింది. గతంలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఉన్నత పాఠశాలలోనే డోనాజీన్ ఈ ఘనతను సాధించడం విశేషం. దీంతో స్కూలు విద్యార్థులు, తన 12 మంది మనవళ్ల కేరింతల మధ్య ఈ రికార్డు సాధించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ టీనా షి రికార్డును పరిశీలించారు. మొదటి రెండు గంటలు త్వరగానే గడిచిపోయాయని, కానీ తర్వాతి రెండు గంటలు చాలా కష్టంగా గడిచాయని, ఇక చివరి గంటలోచుక్కలు కనిపించాయంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు డోనాజీన్. పదేళ్ల కఠిన ప్రాక్టీస్ తరువాత వరల్డ్ రికార్డ్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. విశేషం ఏమిటంటే ఆమె చేతుల్లో దీర్ఘకాలిక నొప్పి, తిమ్మిరితో బాధపడేవారు. దీన్నుంచి బయటపడేందుకు ప్రతీరోజూ ఇచేయడం మొదలు పెట్టారట. డోనాజీన్ ప్రతిరోజూ మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేసేదని, ఈ రికార్డులో భాగంగా దానిని ఆరు గంటలకు పెంచిందని చెప్పుకొచ్చారు ఆమె భర్త రాండీ. -
వేగంగా బరువు తగ్గేందుకు సింపుల్ చిట్కాలివిగో!
బరువు తగ్గడం అనుకున్నంత ఈజీ కాదు. దీనికి తగ్గ ఆహార నియమాలు, కమిట్మెంట్ చాలా అవసరం. ఎలా పడితే అలా డైటింగ్ చేయడం కాకుండా బాడీ తీరును అర్థం చేసుకుని, నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. బరువు తగ్గించే ప్రణాళికలకు సరైన ఆహార విధానం, జీవనశైలి పాటించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, జాగ్రత్తగా తినడం అవసరం. అయితే ఈ లక్ష్యాన్ని స్థిరమైన, ఆరోగ్యకరమైన పద్ధతిలో చేరుకోవడం అత్యవసరం. మీబాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉన్నదీ లెక్కించుకొని, దానిని బట్ట ప్రణాళిక వేసుకోవాలి. నో జంక్ ఫుడ్, నో సుగర్ పోషకాహారం, సమతుల్య ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాసెస్డ్ఫుడ్ సుగర్ పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. తక్కువ కేలరీలు ఎక్కువ శక్తినిచ్చే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలను తీసుకోవాలి. తొందరగా బరువు తగ్గాలంటే కాఫీ, టీలు పూర్తిగా మానేయ్యాలి. దీని బదులు, గ్రీన్ టీ, హెర్బల్ టీ తీసుకోవాలి. రాత్రి 7 గంటల తరువాత భోజనం వద్దు రాత్రి 7 గంటలకే భోజనం చేయాలి. ఒక పూట భోజనంలోపూర్తిగా ఉడికించిన కూరగాయలు తీసుకుంటే ఇంకా మంచి ఫలితం . కంప్యూటర్, టీవీ ముందు కూర్చుని చిరు తిండ్లు (చిప్స్ కానీ, ఇంట్లో చేసుకున్నవైనా) మన తిండి మర ఆడుతూనే ఉంటుందనేది గుర్తు పెట్టుకోండి. వ్యాయామం బరువు ఎంత తొందరగా అంత వ్యవధిని వ్యాయామాన్ని పెంచాలి. యోగా, నడక, ఏరోబిక్, సైక్లింగ్ వంటివి ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చూసుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి బరువు తగ్గే ప్రక్రియలో నీరు చాలా కీలక పాత్ర. రోజంతా బాగా హైడ్రేటెడ్‌గా ఉండటంతోపాటు, పరగడుపున,రాత్రి నిద్రపోయేముందు నీరు తాగాలి. ఇది జీర్ణక్రియకు, చర్మానికి మంచిది. నిద్ర తప్పనిసరి మీరు తగినంత మంచి నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ప్రతి రాత్రి 7 నుండి 9 గంటల నిద్రను లక్ష్యంగా పెట్టుకోవాలి. Exercises with weights to lose weight fast: pic.twitter.com/Bm2RcZxUru — Health & Fitness (@FitnessF0rWomen) March 26, 2024 -
ఎక్కువ శ్రమ లేకుండా.. బాడీ స్లిమ్‌గా ఎలా..!?
అధిక బరువు ఆరోగ్యానికే కాదు అందానికీ శత్రువే. ఆ బరువును తగ్గించుకోవడానికి మితాహారం.. వ్యాయామాలే మార్గం అంటారు ఫిట్నెస్ నిపుణులు. మితాహారం ఓకే.. అతికష్టమ్మీద నాలుకను చంపుకొని కడుపు కట్టుకోవచ్చు. కానీ మైండ్‌ని ఎంత ప్రిపేర్ చేసినా వ్యాయామానికి సిద్ధమవదు. ఓ పక్క బద్ధకం అడ్డొస్తుంది. అందుకే ఈ ఎక్సర్సైజ్ కుషన్ చూడండీ.. చాలా యూజ్ అవుతుంది. పెద్దగా శ్రమ లేకుండానే బాడీని స్లిమ్‌గా మారుస్తుంది. ఇది కాళ్లు, తొడలు, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును ఇట్టే కరిగిస్తుంది. శరీరం సన్నగా, అందంగా అవడానికి సహకరిస్తుంది. దీని సాయంతో వ్యాయామం చేస్తే.. కొవ్వు తగ్గి నాజూగ్గా మారుతారు. ఈ ఎక్సర్సైజర్కి ఇరువైపులా కాళ్లు పెట్టుకోవడానికి వీలుగా హోల్స్ ఉంటాయి. వాటిలోకి కాళ్లను జొప్పించి.. పడుకుని లేదా కూర్చుని చిత్రంలో చూపించిన విధంగా వ్యాయామం చేసుకోవచ్చు. దానివల్ల.. పొట్ట నుంచి కాళ్ల వరకూ పేరుకున్న కొవ్వు వేగంగా తగ్గుతుంది. ఈ టూల్‌ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. ఇది ఇంట్లో ఉంటే.. మీకు కావాల్సిందల్లా కాస్త స్థలం.. కొంత సమయం మాత్రమే. అవిరెండూ దొరికితే.. అందం, ఆరోగ్యం మీ సొంతం. పక్షవాతంతో బాధపడుతున్న కొందరు (కాస్త కదలికలున్నవారు) పేషెంట్స్ కూడా ఈ టూల్‌ని ఉపయోగించి.. వ్యాయామం చేసుకోవచ్చు. రెడ్ లేదా బ్లాక్ కలర్స్‌లో ఈ ఎక్సర్సైజ్ కుషన్ అందుబాటులో ఉంది. దీని ధర 51 డాలర్లు. అంటే 4,219 రూపాయలన్న మాట. ఇవి చదవండి: Naila Grewal: నా యాక్టింగ్‌కి 'టెలివిజనే' నాకు ప్రేరణ! -
ఇవి మార్చితే.. చావును ఏమార్చినట్టే!
మన నిత్య జీవన విధానం, అలవాట్లు వంటివి మన జీవితకాలంపై ప్రభావం చూపుతాయన్నది తెలిసిందే. మరి ఏయే అలవాట్లు, పద్ధతులు మార్చుకుంటే.. 'మరణం' మనకు ఎంతెంత దూరం జరుగుతుందో తెలుసా.. దానిపై ఓ విస్తృత అధ్యయనం జరిగింది. 2011-2013 మధ్య 40 నుం 90 ఏళ్ల మధ్య వయసున్న ఏడు లక్షల మందిపై జరిపిన పరిశోధనలో ఆరు కీలక అంశాలను గుర్తించారు. వీటిని పాటించని వారితో పోలిస్తే.. పాటిందే వారిలో మరణ ప్రమాదం ఎంతవరకు తగ్గుతుందన్నది తేల్చారు. ముఖ్యంగా వ్యాయామం చేయనివారితో పోలిస్తే.. వారంలో కనీసం 150 నిమిషాల సాధారణ వ్యాయామం లేదా 75 నిమిషాల కఠిన వ్యాయామం చేసేవారు. మరణానికి దూరంగా ఉంటారని గుర్తించారు. మానసిక ఒత్తిడి, ఆందో నియంత్రించుకోగలిగితే 29 శాతం, డ్రగ్స్‌కు దూరంగా ఉంటే 380 మరణం రిస్క్ ను తప్పించుకున్నట్టేనని తేల్చారు. చదవండి: Alexi Navalni: కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్ దేనిని పాటిస్తే మరణ ప్రమాదం ఎంత శాతం తగ్గుతుంది? -
చీరకట్టులో జిమ్ వర్క్ఔట్స్!
ఇటీవల కాలంలో చీర ధరించడాన్నే ట్రెండీగా ఫాలో అవుతోంది యువత. అందులోనూ చీర కట్టులో స్కూటర్ నడపడం, లేదా వ్యాయామాలు చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. నెటింట కూడా అలాంటి వీడియోలకే మంచి ఆదరణ ఉందని చెప్పొచ్చు. అంతేగాదు చీర కట్టులో ఎలాంటి పనులైన సునాయాసంగా చెయ్యొచ్చని నిరూపిస్తున్నారు. ఇక్కడ కూడా ఓ ఫిటెనెస్ కోచ్ చీరకట్టులో వర్క్ఔట్లు చేసి అందర్నీ ఆకర్షించింది. శారీ వర్కవుట్ వీడియోలతో ఇంటర్నెట్లో ఫేమ్ అయింది ఫిట్నెస్ కోచ్ రీనాసింగ్. చీరకట్టుతో ఫుష్–అప్స్, పుల్–అప్స్, స్వ్కాట్స్, జంప్స్లాంటి ఎక్సర్సైజులు చేస్తూ నెటిజనులను ఆకట్టుకొంటుంది. పాత, కొత్తా అనే తేడా లేకుండా ఆమె వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. రీనాసింగ్ తాజా వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 21.3 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ‘వర్కవుట్ల సమయంలో సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలని సిఫారసు చేసినప్పటికీ సౌకర్యంగా అనిపిస్తే చీర ధరించి వ్యాయామాలు చేయడం పొరపాటేమీ కాదు. అయితే గ్రిప్ తప్పకుండా ఉండడానికి అవసరమైన ఫుట్‌వేర్ ధరించాలి’ అంటుంది యోగా ట్రైనర్ అనూష రామ్. View this post on Instagram A post shared by Reena Singh (@reenasinghfitness) (చదవండి: మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే..!) -
కింగ్ చార్లెస్‌కి కేన్సర్..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కేన్సర్‌తో బాధపడుతున్న బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కోంది. ఆయన గత నెలలో ఆరోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లగా కేన్సర్‌గా నిర్దారణ అయినట్లు తెలిపింది. అయితే అది ఏ రకమైన కేన్సర్ అనేది వెల్లడించలేదు. సోమవారం నుంచి చికిత్స మొదలైందని, కాబట్టి కొద్ది రోజు ప్రజావిధుల నుంఇచ తప్పుకుంటారని పేర్కొంది. ఇక బ్రిటిఫ్ ప్రెస్ ప్రకారం ఆయన కెరిర్లో కొన్ని గాయాలు, రెండుసార్లు కరోనా మహమ్మారి బారిని పడటం మినహా రాజ అద్భుతమైన ఆరోగ్యకరమ జీవితాన్నే గడిపారు. ఆయన చక్రవర్తిగా 2022లో సింహాసనాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. పైగా బ్రిటిష్ చరిత్రలో రాజుగా పట్టాభిషేకం అయిన అంత పెద్ద వయసు వ్యక్తి కూడా ఆయనే. ఇక ఆయన లైఫ్‌స్టైల్ విషయానికి వస్తే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారని అంతరంగికులు చెబుతున్నారు. అందులోనూ ఆయన ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారని అంటునన్నారు. అలాంటి ఆయన ఈ కేన్సర్ మహమ్మారిన బారిన పడటం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆయన ఆహార అలవాట్లు ఎలా ఉండేవి? రోజూవారి దినచర్య ఎలా ఉంటుంది తదితర విశేషాల గురించి తెలుసుకుందామా!. ఆయన ఒకసారి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిజీ షెడ్యూల్‌కు ఆటంకం కలిగించే భోజనం లగ్జరీ లాంటిదని విశ్వసిస్తానని అన్నారు. అంతేగాదు ఆయన సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వంటివి చేస్తారని అధికారిక వర్గాల సమాచారం. 2018లో కార్లెస్ హౌస్‌లో తన 70వ పుట్టిన రోజు పురస్కరించుకుని తనకు సంబంధించిన 70 వాస్తవాల జాబితాలో తాను రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటానని అదికూడా అల్పహారం, రాత్రి భోజనం మాత్రమేనని చెప్పుకొచ్చారు. అంతేగాదు వారంలో రెండు రోజులు పూర్తిగా శాకాహారం భోజనం తింటానని, పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువుగా మొక్కల ఆధారిత ఆహారమే ఎక్కువగా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అల్పాహారంలో ఎక్కువగా చీజ్, ఉడకబెట్టిన గుడ్లు, పాలు, తేనేతో కూడిన డార్జిలింగ్ టీ తదితరాలే తీసుకుంటారని రాయల్ డైట్ పేర్కొంది. ఆయన ఎక్కువగా సేంద్రీయ ఉత్పత్తులనే ఇష్టపడతారని రాయల్ చెఫ్‌లు చెబుతున్నారు. ఇక ఫిట్నెస్ విషయానికి వచ్చేటప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయమాలు చేస్తారని ప్యాలెస్ పేర్కొంది. అలాగే కెనడియన్ ఎయిర్‌ఫోర్స్‌కి సంబంధించిన ఐదు ప్రాథమిక వ్యాయమాలను రోజుకు రెండుసార్లు చేస్తారని తెలిపింది. ముఖ్యంగా రెండు నిమిషాల స్ట్రెచింగ్ ఒక నిమిషం సిట్ అప్లు, మరో నిమిషం బ్యాక్ లెగ్ రైజ్‌లు పుష్ అప్లు 11 నిమిషాలు చేస్తారని వెల్లడించింది. వాటన్నింటి తోపాటు ఆరు నిమిషాల పాలు రన్నింగ్, ప్రతి 75 అడుగులకు డేగ జంప్‌లు చేయడం, వాతావరణం బాగుంటే ఎక్కువ సేపు బహిరంగ ప్రదేశంలో గడపడం వంటివి చేస్తారని రాయల్ ప్యాలెస్ పేర్కొంది. ఇంతలా పిట్‌నెస్‌గా ఉంటూ మంచి ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించనప్పటికీ కొన్ని రకాల వ్యాధులు ఎందుకు దాడి చేస్తాయనేది ఎవ్వరికీ అంతుపట్టని చిక్కు ప్రశ్న. నిజం చెప్పాలంటే వ్యాధికి రాజు, పేద అనే తారతమ్యం ఉండదేమో రావాలి, వేదన అనుభవించాలి అని ఉంటే టైంకి వచ్చి దాని ప్రభావం చూపించేస్తుందేమో కదూ!. View this post on Instagram A post shared by The Royal Family (@theroyalfamily) (చదవండి: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
జస్ట్ ఈమూడు వ్యాయామాలు చేయండి! బరువు తగ్గడం ఖాయం!
కొన్నిసార్లు ఎలాంటి వ్యాయామాలు చేసినా.. మంచి ఫలితం ఉండదు. శారీరక శ్రమ తప్ప పడుతున్న కష్టమంతా వృధా అనిపిస్తుంది. అలాంటి వాళ్ల కోసం ఈ మూడు వ్యాయమాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. చాలా సులభంగా బరువు తగ్గుతారు. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం తోపాటు మంచి ఫిట్నెస్గా ఉంటారు అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ అలీ కబ్బా. ఇంతకీ ఏంటా ఆ వ్యాయామాలు అంటే.. ఈ మూడు వ్యాయమాలు జస్ట్ 20 నిమిషాలు కనీసం కొన్ని పర్యాయాలు చొప్పున చేస్తే చాలు చక్కటి ఫలితం చాలా త్వరిగతగతిన కనిపిస్తుంది. దీనికి కావల్సిందల్లా కెటిల్‌బెల్స్, రోయింగ్ మెషిన్ ఉంటే చాలు. ఎలా చెయ్యాలంటే..? ముందుగా రోయింగ్ మెషిన్ పై మీరు కూర్చొని ముందుకు వెనక్కు రోప్ని పట్టుకుని వెళ్తుంటే అది మీ కండరాలను ఫిట్‌గా ఉంచడానికి ఉపయోగపడటమే గాక కాళ్లకి చేతులకి మంచి వ్యాయామంగా ఉంటుంది. మొత్తం బాడీ అంతా కదలుతుంది కాబట్టి కేలరీలు కూడా స్పీడ్‌గా తగ్గుతాయి. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కాళ్లు, చేతులు, భుజాలు బలోపేతం అవుతాయి. ఇక రెండోది కెటిల్ బాల్స్‌తో పుష్ అప్లు బాడీ ఫ్లాట్‌గా ఉండేలా చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ కరిగి పొట్ట ఫ్లాట్‌గా ఉంటుంది. బాడీ మొత్తం బ్యాలెన్సింగ్ చేసే వ్యాయామం కాబట్టి తొందరగా బరువు తగ్గడం ఈజీ అవుతుంది. ఒక వేళ కెటిల్ బాల్స్‌తో చేయడం కష్టమైతే అవి లేకుండా ఒట్టిగా నేలపైనే అయినా ట్రై చేయండి సరిపోతుంది. తదుపరి ఈ కెటిల్ బాల్స్‌ని పట్టుకుని పైకిలేపి వదలడం. దీనికి ముందుగా నుంచొని ముందుకు వంగి కాళ్లని ఏ మాత్రం వంచకుండా ఆ బాల్స్‌ని కింద నుంచి పైకి తీయడం, దించడం ఇలా ఓ 5 నిమిషాలు చేస్తే..భుజాలు, నడుం మంచిగా బలోపేతం అవుతాయి. మీ కటి భాగంలో కొవ్వు కరిగి తొడలు సన్నబడతాయి. ఈ మూడింటిని క్రమం తప్పకుండా కనీసం ఓ 20 నిమిషాలు చేస్తే ఫిట్‌గా ఉండటమే గాక బరువు తగ్గి నాజూగ్గా ఉండటం పక్కా అని చెబుతున్నారు బాడీ ట్రైయినర్ అలీ కబ్బా. View this post on Instagram A post shared by Ali Kabba - Personal Trainer (@amt.fitness) (చదవండి: చపాతీలు డయాబెటిక్ రోగులకు మేలు! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు
మనం కొత్తగా ఏదైన డైట్ లేదా వ్యాయామాలకు సంబంధించి మార్పులు తీసుకునేటప్పుడూ సమయపాలనే అనేది ముఖ్యం. అంటే.. ఇక్కడ రోజూ ఒకే టైంలోనే ఏదైనా చేయమని నొక్కి చెబుతుంటారు నిపుణులు. మన చిన్నప్పుడూ కూడా ఈ టైం కల్లా చదువుకోవడం పూర్తి చేసుకుని నిద్రపోండి అని మన పెద్దవాళ్లు పదేపదే చెబుతుంటారు. ఇలానే ఎందుకు? ఇది మన శరీరాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది తదితరాల గురించి తాజా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు గల కారణాలకు సరైన సమాధానం కూడా దొరికింది. మనం చేసే వ్యాయామం లేదా ఏదైన పని రోజూ ఒకే టైంలో చేస్తే చక్కటి ఫలితం ఉంటుందట. ఈ మేరకు మాంచెస్టర్ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో..ఏ వ్యక్తి అయినా వ్యాయామాన్ని ఇష్టారీతిలో తనకు కుదిరిన సమయంలో చేసిన వారి కంటే ఒక నిర్దేశిత టైంలో చేసిన వారిలోనే మెరుగైన పలితాలు కనపడటం గుర్తించారు. దీనికి గల కారణాల గురించి సాగిన పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మానవుని శరీరం బాహ్య వాతావరణంతో ప్రభావితవుతుంది. అందుకు తగ్గట్టుగా మన అంతర్గత శరీరీం స్కిరాడియన్ గడియారాన్ని సెట్ చేసుకుంటుందట. ఇక్కడ స్కిరాడియన్ గడియారం అంటే జీవక్రియ గడియారం. దీని అర్థం ఉదయం మేల్కోనగానే కాసేపు బద్ధకంగా అనిపించటం, తర్వాత ఆకలి.. ఆ తర్వాత రోజూవారి పనుల్లో నిమగ్నమవ్వడం ఒక లయబద్ధంగా మన మెదడు సిగ్నల్స్ పాస్ చేయడంతో ఆటోమెటిక్‌గా చేసుకుంటూ పోతున్న విధానాన్నే జీవగడియారం అంటారు. అంటే..ఇక్కడ మన జీవక్రియ గడియారానికి మన శరీర భాగాలకు మధ్య మెదడు అనే సెంట్రల్ గడియారం సమన్వయంతోనే ఇదంతా సాధ్యమవుతుంది. అందువల్ల సాయంత్రం చీకటి పడగానే ఆటోమెటిక్ నిద్రకు ఉపక్రమించడం, వెలుగు అనగానే బాడీ సెట్ రైట్ అయిపోయి లేవాలనే ఫీల్ కలగడం జరుగుతుంది. కాబట్టి మనిషి ఏదైనా డైట్ లేదా వ్యాయామం చేయాలనుకుంటే..రోజూ ఒక నిర్దేశిత టైంలో చేస్తే రిజల్ట్ బాగుండటమే గాక అనారోగ్యాల బారిన పడకుండా ఫిట్‌గా ఉండగలుగుతారని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడయ్యింది. అంతేగాదు రోజులో 24 గంటలు అనే రోజు చక్రానికి అనుగుణంగా మన బాడీ ప్రతిస్పందిస్తుంది. అదే శరీరంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారడం, రక్తంలో స్థాయిలు మార్పులు, తదితరాలకు కారణం అని పరిశోధకులు పేర్కొన్నారు. మన శరీరంలోని ఇతర భాగాలు గనుక మన జీవ గడియారం, సెంట్రల్ గడియారానికి అనుగుణంగా పనిచేయకపోయినప్పుడే అనారోగ్య సమస్యలు ఉత్ఫన్నమవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితే మన శరీరంలో చెడు కొలస్ట్రాల్‌కు కారణమని అన్నారు. అలాగే పగటిపూట మాగ్జిమమ్ తిరుగుతూ ఏదో ఒక పని చేస్తుంటాం. అందువల్ల మన వెన్నెముకలోని ఇంటర్వర్టెబ్రల్ డిస్క్‌ల నుంచి తుంటి, మోకాళ్లలోని మృదులాస్థి నుంచి నీరు బయటకు వచ్చి రోజూ ముగిసే సమయానికి కాస్త పొట్టిగా కనిపిస్తాం. ఇది రోజు ముగిసే సమయానికి మనల్ని కొంచెం పొట్టిగా కనిపించేలా చేస్తుంది. అదే రాత్రి విశ్రాంత తీసుకునే సమయంలో నీరు తిరిగి మన బాడీకి వస్తుంది మనం యథావిధిగా కనిపిస్తాం అని చెప్పారు. అందుకోసం తాము ఎలుకలపై అధ్యయనం చేయగా.. ఈ ఫలితాలను గుర్తించామని అన్నారు. మన డైట్‌కి సంబంధించి లేదా వ్యాయామం వంటివి చేసేటప్పుడూ వీలు కుదరినప్పుడల్లా చేస్తే డీసింక్రోనైజేషన్కి గురయ్యి ఫలితం సరిగా ఉండదు. పైగా మన ఇతర వ్యవస్థలపై ప్రభావం ఏర్పడి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అన్నారు. కాబట్టి మనం రోజూ శారీరక శ్రమకు సంబంధించి(వ్యాయామం తదితర పనులు) ఒకే సమయానికి చేయడం వల్ల శరీరంలోని ఇతర వ్యవస్థలన్ని సమన్వయం అయ్యి, గాయాల బారినపడకుండా ఉండటమే గాక వయసు రీత్య వచ్చే కీళ్ల సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా తగ్గుతుందని చెప్పుకొచ్చారు మాంచెస్టర్ పరిశోధకులు. (చదవండి: సరికొత్త ఔషధం..ఒక్క డోసు తీసుకుంటే చాలు.. దెబ్బకు కొలస్ట్రాల్ మాయం!) -
వ్యాయామం తక్కువుగా చేసినా చాలు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
చాలమంది వర్క్ఔట్లు ఎక్కువగా చేస్తుంటారు. త్వరితగతిన బరువు తగ్గాలని లేదా మంచి ఫలితాలు కనిపించాలంటే ఆ మాత్రం వర్క్ఔట్లు ఉండాలని అనుకుంటారు. అందుకోసం అని వాకింగ్లు కొన్ని రకాల వ్యాయమాలు తెగ చేసేస్తుంటారు. ఐతే తాజా పరిశోధనలో అందుకు భిన్నంగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. శాస్త్రవేత్తలు కూడా మితంగా వ్యాయామం చేస్తే చాలని తేల్చి చెప్పారు. మొన్నటి వరకు పదివేల అడుగులు వేస్తే బరువు తగ్గుతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని అడుగులు అవసరం లేదని అధ్యయనంలో వెల్లడైందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తక్కువ వ్యాయామంతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్పెట్టగలమా? పరిశోధనల్లో ఏం వెల్లడైంది తదితరాల గురించే ఈ కథనం!. స్పెయిన్‌లోని గ్రెనడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం..తక్కువ వ్యాయామంతోనే మంచి రిజల్ట్స్‌ని పొందొచ్చని ప్రభావంతంగా కూడా ఉంటుందని పరిశోధనలో తేలింది. వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం దాదాపు 60% తగ్గుతుందని కూడా వెల్లడైంది. ఈ మేరకు ఈ విషయాలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో వెల్లడించారు శాస్త్రవేత్తలు. అందుకోసం సుమారు లక్ష మందికి పైగా వ్యక్తులపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా పదివేల అడుగులు అవసరమని చెబతుంటారు. ఐతే అన్ని అడుగులు అవసరం లేదంటున్నారు. కేవలం రెండు కిలోమీటర్లు అనగా దాదాపు 2,700 అడుగులు చాలు వివిధ గుండె సంబంధిత సమ్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఎక్కువగా నడిచే వారిలో చాలా మంచి ప్రయోజనాలు కూడా కనిపించాయి. కానీ కొందరు ఎక్కువగా నడిస్తేనే మంచిదని భావించి బలవంతంగా చేస్తుంటారు. కానీ అదంతా అవసరం లేదంటున్నారు. రోజుకు రెండు కిలోమీటర్లు నడవండి, మంచి తృణ ధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి చాలు చాలా రుగ్మతలు నుంచి సులభంగా బయటపడతారని అంటున్నారు. అలాగే మగవాళ్లకు, ఆడవాళ్లకు వ్యాయామం ఎంత చేయాలనే వ్యత్యాసం ఏం ఉండదని పరిశోధనలో తేలిందన్నారు. తక్కువగా చేసిన మంచి ఫలితాలు ఉంటాయని భయపడాల్సి అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. అదే టైంలో ఎక్కువగా చేసేవారికి ఆరోగ్య మరింత మెరుగ్గా ఉండటమేగాక మరిన్ని ప్రయోజనాలు ఉండటాన్ని గుర్తించాం అని చెప్పారు. ఐతే ఈ పదివేల అడుగులు నడవడం అనేది జపాన్ నుంచి వచ్చింది టోక్యో ఒలంపిక్స్ నేపథ్యంలో వచ్చిందని. ఆటగాళ్లు మెరుగ్గా ఆడేలా ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారించేందుకు జపాన్ ఇలా పదివేల అడుగుల లక్ష్యాన్ని నిర్దేశించిందని పేర్కొన్నారు. సైన్సు పరంగా అది ఎక్కడ ఫ్రూవ్ కాలేదన్నారు. ఈ నెంబర్ ఫిగర్ అందరు గుర్తుంచుకునేందుకు సులభంగా ఉంటుందని ఇలా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. అందువల్ల ప్రతీరోజూ తక్కువ వ్యాయామం, సుమారు రెండు కిలోమీటలర్లు నడకతో కూడా పూర్తి ఫిట్నెస్గా ఉండగలమని నొక్కి చెబుతున్నారు. దీంతోపాటు వేళకు తినడం, కంటి నిండ నిద్రపోవడం వంటివి చేస్తే జీర్ణ వ్యవస్థ బాగొంటుంది. తద్వారా ఇతరత్ర సమస్యలు ఉత్ఫన్నం కావు అని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: 'ఒంటరితనం' రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రాణాంతకమా? వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
మోగిన మూడవ ప్రపంచ యుద్ధ ఘంటికలు? 200 హెలికాప్టర్లతో ఇరాన్ యుద్ధ విన్యాసాలు!
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య ఇరాన్ సైన్యం 200 హెలికాప్టర్లతో యుద్ధ విన్యాసాలు ప్రారంభించింది. ఇరాన్ మీడియా ఈ సమాచారాన్ని ప్రపంచం ముందు వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాల మధ్య ప్రణాళికాబద్ధంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్.. ఎస్ఫహాన్‌లో రెండు రోజుల సైనిక విన్యాసాలను ప్రారంభించారు. ఇరాన్ ఆర్మీ కమాండర్ ఒకరు ఇరాన్ ప్రభుత్వ మీడియాతో మాట్లాడుతూ ‘ఈ మాక్ డ్రిల్ వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇరాన్‌కున్న శత్రువులను హెచ్చరించడమేనని అన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధంలో హమాస్‌కు ఇరాన్ బహిరంగంగా మద్దతు ఇస్తోంది. ఇరాన్ సైన్యం యుద్ధ విన్యాసాలు చేపట్టిన నేపధ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఒక ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్‌కు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ‘గాజాపై ఇజ్రాయెల్ తన యుద్ధ నేరాలను ఆపకపోతే, ఆ దేశం ఇతర కూటములతో కూడా కూడా పోరాడవలసిన దుస్థితికి చేరుకుంటుందని, అప్పుడు ఆ దేశం ఎదుర్కోబోయే పరిస్థితులను ఆపడం అసాధ్యమని హెచ్చరించారు. కాగా ఇరాన్ హెచ్చరికలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉన్నాయని విశ్లేషకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘కృత్రిమ మేథ’ పక్కదారి పడితే? ‘ఓపెన్ ఏఐ’ చేయబోతున్నదిదే... -
వ్యాయామం, డైటింగ్లు చేసినా.. బరువు తగ్గకపోవడానికి కారణం..!
కొంతమంది మంచిగా వ్యాయామం, డైటింగ్ చేసిన ఒళ్లు తగ్గదు. పైగా వారికి కూడా ఎందుకిది దండగా అనే నిరాశ వచ్చేస్తుంది. కొందరూ భలే తగ్గుతారు. మరికొందరికి మాత్రం శరీరంలో కొంచెం కూడా మార్పు రానట్లు అనిపిస్తుంది. దీనికి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి కొన్ని సలహలు సూచనలు ఇచ్చారు. అవేంటంటే.. ఒళ్లు తగ్గకపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని హర్మోన్ల తేడా లేదా పీసీడీఓ సమస్య జన్యు పరమైన కారణాలు, అధికంగా ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయకపోవడం సరైన శారీరక శ్రమ లేక పోవడం నూనెలో బాగా వేగిన పదార్ధాలను తినడం, మెత్తని పదార్ధాలను తినడం, కార్బో హైడ్రేట్లు ( పిండి పదార్ధాలు) ఎక్కువగా తీసుకోవడం. ఆహార విహారాలతో బాటు మధ్యాహ్నం నిద్ర పోవడం శరీరంలోని వ్యాధులు, హైపో థైరాయిడ్, కొవ్వు బాగా పెరిగిపోవడం, రక్త నాళాల్లో కొవ్వు పేరుకు పోవడం, గుండె సమస్యలు తదితరాలు ఉన్నా. సరిగా నడవలేక పోవడం సంతాన లేమి మొదలైనవి. ఒళ్లడు తగ్గడం లేదని బాధపడేవాళ్లు.. ⇒ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కపాలభాతి ప్రాణాయామం చేయండి.ఇది బరువును తగ్గించడమే కాకుండా ముఖం మీద కాంతిని కూడా పెంచుతుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ⇒ మీరు తినే ఆహారంలో ఎక్కువ శాతం పచ్చి కాయగూరలు మరియు పండ్లు ఉండేలా చూసుకోండి. కనీసం 30% శాతం ఇవి ఉండాలి. ⇒ ఒక తమలపాకులో 5 నుంచి ఆరు మిరియాలు కలిపి చుట్టి రోజూ ఉదయం టిఫిన్‌కి ముందు తిని, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. ఇది ఒంట్లో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ⇒ కొద్దిగా కొత్తిమీర, 3 నుండి 4 చిన్న అల్లం ముక్కలు కలిపి నీళ్ళు వేసి మిక్సీకి వేసుకొని జ్యూస్ చేసుకోండి. అందులో 1 స్పూన్ తేనె మరియు సగం నిమ్మకాయ బద్దను పిండండి. ఇది రోజూ పరగడపున సేవించండి. సులువుగా బరువును తగ్గిస్తుంది. ⇒ రోజుకి కనీసం 25 నుండి 30 నిమిషాల వరకు చమట కక్కేలా గుంజీలు తీయడం, స్కిప్పింగ్ చేయడం, నడవడం లాంటివి చేయండి. ఇది అన్నిటికన్నా ఎంతో ముఖ్యం. ⇒ లావు తగ్గడానికి ఆయుర్వేదంలో చింత గింజలను ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి. పొద్దున బాగా పిసికి పొట్టు పోయిన తరువాత కొంచం నెయ్యి వేసి వేయించి, పొడి చేసి పెట్టుకోవాలి. అర స్పూను పొడిని పాలలో వేసి, చక్కర కలిపి తాగాలి. 40 రోజుల నుంచి100 రోజులు వాడాలి . ⇒ నేరుగా పట్టిన వాన నీటిని నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను పసుపు కలిపి తాగితే లావు తగ్గుతారు. స్థూలకాయులైతే.. ►తేనె 25 గ్రాములు గోరువెచ్చని నీళ్ళులో వేసుకుని ఒక గ్లాసు ఉదయం, సాయంత్రం పరగడుపున తాగాలి. ►వాయువిడంగాల పొడిని 2,3 గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం వేడి నీటితో తీసుకోవాలి. ►త్రిఫల చూర్ణము త్రికటు చూర్ణము రెండింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. పూటకు ఒకటిన్నర స్పూను చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ►ప్రతి రోజు అరస్పూను నుంచి ఒక స్పూను వరకు కరక్కాయ పొడిని రెండు పూటలా క్రమం తప్పకుండా తీసుకుంటే తగ్గిపోతుంది. పీసీఓడీ సమస్య ఉన్నవాళ్లు.. ప్రతి రోజు ఒక తిప్ప తీగ ఆకును తింటూ వుంటే లావు తగ్గడమే గాక శరీరంలోని భాగాలు, చర్మం లాంటివి వేలాడుతూ వుంటే ఒక సంవత్సరానికి గట్టి పడతాయి భోజనానికి అరగంట ముందు వేరుశనగ పప్పులకు చక్కెర కలిపి తింటే భోజనం తక్కువగా తింటారు. ఆహారానికి బదులుగా కేవలం ఆపిల్ పండ్లు మాత్రమే తింటే రోజులలో లావు తగ్గుతారు. (చదవండి: డయాబెటిస్ మందుల వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా! ఏకంగా చర్మం ఊడి..) -
మనసుకి వ్యాయామం
శరీరానికి సంబంధించి ఆహారంతో పాటు వ్యాయామం గురించి చాలామంది చెప్పటం, ఎంతోమంది అనుసరించటం గమనించవచ్చు. కాని, మనస్సు గురించి కొద్దిమంది వైద్యులు చెప్పినా పట్టించుకున్నవారి సంఖ్య అత్యల్పం. మనోవ్యాపారం జరిగేది మెదడులో. దానిని వాడక మూలన పడేస్తే అది మొద్దుబారిపోతుంది. అందుకే చాలామందికి మతిమరుపు వస్తూ ఉంటుంది. వయసు పైబడితే అది సహజం అనుకుంటారు. శరీరం చక్కగా ఉండాలని మందులు, అలంకారాలు చేసుకున్నప్పుడు మెదడుకి కూడా చేయాలని మర్చిపోతూ ఉంటారు. పైగా ఇంత వయసు వచ్చాక పరీక్షలు రాయాలా? ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలా? అని అడుగుతూ ఉంటారు. నిజమే కాని తన విషయాలు తనకి గుర్తు ఉండాలి కదా! ముందు వస్తువులు, మనుషుల పేర్లు మొదలైనవి మర్చిపోవటంతో మొదలై కొంతకాలానికి అవయవాలు కూడా తమ పని చేయటం మర్చిపోయే ప్రమాదం ఉన్నదట!ఆయువు ఉన్నంత కాలం ఒకరి మీద ఆధార పడకుండా తెలివితో ఉండటం ఎవరైనా కోరుకోవలసినదే! దీనికి చేయ వలసిన దల్లా మెదడుకి పని చెప్పి చేయిస్తూ ఉండటమే. ముందు నుండి ఆవిధంగా ఉంటే వృద్ధాప్యంలో మతిమరపు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని మానసిక వైద్యనిపుణులు చెప్పిన మాట. అప్పుడు మానవ జన్మ అనే అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా అనుభవించినట్టు అవుతుంది. దానికోసం కొన్ని మానసిక వ్యాయామాలు సహకరిస్తాయని చెప్పారు. మనస్తత్వ శాస్త్రవేత్తలు సూచించిన వాటిలో కొన్ని చూద్దాం. చదవటం, రాయటం, మాట్లాడటం, ఆలోచించటం, సమస్యలని పరిష్కరించటం మొదలైనవి. వీటి అన్నిటికీ మెదడుని ఉపయోగించక తప్పదు. 40 సంవత్సరాల తరువాత మెదడులో ఉన్న కణాలు పెరగవు. 60 సంవత్సరాల తరువాత తగ్గటం మొదలవుతుంది. కనుక క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తూ ఉంటుంది. కాని చదవటం, రాయటం వంటివి చేసే వారికి పెరగక పోయినా తరగవు. ఉపాధ్యాయులకి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండటానికి కారణం వారు చదువుతూ, రాస్తూ, మాట్లాడుతూ ఉండటమే. అందరికీ ఆ అవకాశం ఉండదు కదా! అందుకని చిన్నపిల్లల దగ్గర కూర్చుని చదివించ వచ్చు. వారికి కథలు చెప్ప వచ్చు. అసలు మాట్లాడటమే చాలు. బుర్రకి కావలసినంత పని. çపద వినోదాలు పూర్తి చేయటం, చదరంగం ఆడటం వంటి వాటిని చేయచ్చు. ఇప్పుడైతే అవన్నీ ఉన్నాయి. మరి, పూర్వం ఏం చేసేవారు? పొడుపు కథలు, చిక్కుప్రశ్నలు, జంటపదాల ఆట, వైకుంఠపాళీ, పులి – జూదం, పచ్చీసు, వామన గుంటలు, వైకుంఠపాళీ వంటి కాలక్షేపాలు, వినోదాలు ఉండేవి. ఇవన్నీ మెదడుకి చురుకుతనం కలిగించేవే. పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవారు. కొంతకాలం మాట్లాడకుండా ఉంటే, మాట్లాడటానికి కొంచెం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అందుకే వృద్ధులని,ఏదయినా కారణంతో జ్ఞాపకశక్తిని కోల్పోయిన వారిని తరచూ పలకరిస్తూ ఉండమని వాళ్ళని మాట్లాడేట్టు చేయమని వైద్యులు చెపుతారు. ఆనాటి వారు తమ కుటుంబ సమస్యలను తామే పరిష్కరించుకునే వారు. ఎవరి సమస్య అయినా అందరు పరిష్కరించటానికి కుస్తీ పట్టే వారు. ఇప్పుడు అందరికీ ఆలోచించటానికి బద్ధకం. కళ్ళు, చెవులు అప్పగించి కూర్చొనే అలవాటు ఎక్కువయింది. ఈనాడు ఎక్కడ పడితే అక్కడ కౌన్సిలింగ్ కేంద్రాలు తయారవటానికి కారణం మెదడుని పని చేయించకపోవటమే. శరీరం లాగానే మనస్సుకి కూడా సోమరితనం అలవాటు అయిపోయింది. నాకు ఏదైనా సమస్య వస్తే ఎవరో పరిష్కారం చూపించాలి, నా మెదడుని నేను కష్టపెట్టను అన్నది అలవాటు అయితే స్థబ్ధుగా తయారవుతారు. మెదడు తుప్పు పడుతుంది. తస్మాత్ జాగ్రత!! డా‘‘ ఎన్ అనంత లక్ష్మి -
15 తర్వాతే సమగ్ర నోటిఫికేషన్!
ప్రశ్నపత్రాల కూర్పు ఎవరికి? టీఆర్టీ పరీక్ష నిర్వహణ పబ్లిక్ సర్విస్ కమిషన్‌కు ఇవ్వడమా? ఎస్సీఈఆర్టీకి ఇవ్వడమా? అనే అంశంపై అధికారులు చర్చించారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తే పబ్లిక్ సర్విస్ కమిషన్ పరిధిలోకి తెచ్చే వీలుందని, ఆఫ్‌లైన్ విధానమైతే ఎస్సీఈఆర్టీకి అప్పగించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఎస్సీఈఆర్టీకి ఇవ్వడమే సరైన నిర్ణయమని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) విధివిధానాల రూపకల్పనపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సమక్షంలో ఉన్నతాధికారులు సోమవారం ఈ అంశంపై చర్చించారు. ఒకటీ రెండు రోజుల్లో వీటిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. ప్రతి జిల్లాలోనూ డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఏర్పాటు, వాటికి ఇవ్వాల్సిన అధికారాలపై అధికారులు చర్చించినప్పటికీ ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. టీఆర్టీని రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో డీఎస్సీలకు పరిమిత అధికారాలు మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమన్వయం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు పరీక్ష నిర్వహణ ప్రక్రియ మొత్తం రాష్ట్రస్థాయిలోనే కేంద్రీకృత వ్యవస్థలో నిర్వహించే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. అవసరమైతే రాష్ట్రస్థాయి పరీక్ష నిర్వహణకు ప్రత్యేక సమన్వయ కర్తలను నియమించాలని భావిస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో టీఆర్టీ పరీక్షకు చట్టపరమైన అడ్డంకులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం సూచించింది. దీంతో విధివిధానాల తయారీలో న్యాయ కోవిదుల సలహాలు కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ సెపె్టంబర్ 15 తర్వాతే వెలువడే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆన్‌లైనా? ఆఫ్‌లైనా? పరీక్ష నిర్వహణ మొదలుకొని, నియామక ప్రక్రియ వరకూ ఎవరి బాధ్యత ఏమిటనే దానిపై తొలుత వెలువడే ప్రభుత్వ జీవోలోనే స్పష్టత ఇవ్వాలని వాకాటి కరుణ అధికారులకు సూచించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పరీక్షల్లో ఏది ప్రయోజనం అనే అంశాన్నీ చర్చించారు. ఆన్లైన్ విధానంలో కొన్ని సమస్యలు వచ్చే వీలుందని అధికారులు భావిస్తున్నారు. టీఆర్టీ పరీక్ష భాషా పండితులకు, సబ్జెక్టు టీచర్లకు, ఎస్టీజీటీలకు విడివిడిగా నిర్వహిస్తారు. టీఆర్టీకి దరఖాస్తు చేసే వారి సంఖ్య దాదాపు 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ పరీక్ష విధానంలో ప్రశ్నపత్రం కూర్పు సమస్యలకు తావిస్తుందనే సందేహాలున్నాయి. ఒకేరోజు 4 లక్షల మందికి కంప్యూటర్ బేస్డ్గా పరీక్ష నిర్వహణ కష్టమని.ఒక్కో జిల్లాకు రెండు సెషన్స్ పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. అదే ఆఫ్‌లైన్‌లో అయితే రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు పరీక్ష నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల ఫలితాల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పోస్టులు, వెయిటేజీపై ఇంకా అస్పష్టత సమగ్ర నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 తర్వాతే వెలువడే వీలుందని అధికారులు అంటున్నారు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి? సబ్జెక్టుల వారీగా ఎన్ని ఉన్నాయి? రిజర్వేషన్ల వారీగా పోస్టుల విభజన, బ్యాక్లాగ్ పోస్టుల సంఖ్యపై ముందుగా స్పష్టత రావాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎస్జీటీలకు, ఎస్‌ఏలకు ఉండే అర్హతలపైనా అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు టెట్ అర్హులకు ఇవ్వాల్సిన వెయిటేజీ పైనా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమగ్ర నోటిఫికేషన్ వెలువడేందుకు మరికొంత సమయం పట్టే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. -
Bruce Lee Workout Plan: ఇదే బ్రూస్ లీ జిమ్ వర్క్అవుట్ ప్లాన్..
బ్రూస్ లీ.. ఈ పేరు విననివారు ఎవరూ ఉండరు. మార్షల్ ఆర్ట్స్ అనగానే ఎవరికైనా టక్కున బ్రూస్ లీ పేరు గుర్తుకు వస్తుంది. మార్షల్ ఆర్ట్స్‌లో ఇప్పటి వరకూ బ్రూస్లీ పేరును పడగొట్టే మొనగాడెవడూ లేడంటే అతిశయోక్తి కాదు. ఇంటర్నెట్లో బ్రూస్ లీ గురించి వెదుకులాట.. తన 32 ఏళ్ల జీవితంలో బ్రూస్ లీ అద్భుత ప్రతిభతలో ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు. ఈరోజు ప్రపంచమంతా బ్రూస్ లీని ఎంతో గౌరవ మర్యాదలతో చూస్తుంది. బ్రూస్ లీ 1940లో ఫ్రాన్సిస్కోలో జన్మించారు. నేటి కాలంలోనూ ఇంటర్నెట్లో బ్రూస్ లీకి సంబంధించిన అనేక విషయాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే లెక్కకు మించిన నెటిజన్లు తరచూ బ్రూస్ లీ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటారు. ఇటీవల బ్రూస్ లీకి సంబంధించిన 1965 నాటి వర్క్అవుట్ ప్లాన్ వైరల్‌గా మారింది. Bruce Lee early Training plan in 1965. pic.twitter.com/H1uLj49NFK — World Of History (@UmarBzv) May 17, 2023 బ్రూస్ లీ వర్క్అవుట్ ఇలా.. బ్రూస్ లీ వర్క్అవుట్ ప్లాన్ కెవుంగ్ జిమ్నాషియంతో ముడిపడివుంది. దీనిలో అతను ఏ వర్క్అవుట్ ఎన్నిసార్లు, ఎంతసేపు చేసేవాడనే వివరాలు ఉన్నాయి. ఈ వర్క్అవుట్ ప్లాన్ చూసినవారు ఈ రొటీన్‌ను ఫాలో చేయడం అంత సులభం కాదని వారు చెబుతున్నారు. ట్వీట్ చేసిన ఈ పోస్టులో బ్రూస్ లీకి సంబంధించిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో కనిపిస్తోంది. అతని ట్రైనింగ్ ప్రోగ్రాం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో కనిపిస్తోంది. ఈ ప్లాన్ చూసిన వారంతా.. ట్విట్టర్‌పై ఈ పోస్టును ‘వరల్డ్ ఆఫ్ హిస్టరీ’(@UmarBzv) పేరు గల పేజీలో షేర్ చేశారు. దానికి 1965లో బ్రూస్ లీ ఎర్లీ ట్రైనింగ్ ప్లాన్ అనే కామెంట్ రాశారు. ఈ పోస్టుకు 8 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కాయి. 70 వేలకుపైగా లైక్స్ పడ్డాయి. ఈ వర్క్అవుట్ ప్లాన్ చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతూ, దీనిని ఫాలో చేయడం అసాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. బ్రూస్ లీ వర్క్అవుట్ ప్లాన్‌ను పరిశీలించి ఈ ప్లాన్ పూర్తి చేసేందుకు 2 గంటల సమయం పడుతుందని లెక్కవేశారు. ఇది కూడా చదవండి: ఈ 8 రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలం నాటివి.. ఇప్పుడెలా ఉన్నాయో తెలిస్తే.. -
అదొక్కటే! ఎన్నో వ్యాయామాలకు సరిసాటి..
వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం అందరికీ తెలుసు. అయితే అందరికీ వ్యాయామం చేయడం కుదరకపోవచ్చు. కొందరికైతే కనీసం వాకింగ్ చేయడం కూడా కష్టమే అవుతుంటుంది వారున్న పరిస్థితులలో. అలాంటప్పుడు కనీసం ఇండోర్ సైక్లింగ్ లేదా స్టేషనరీ సైకిల్‌తో వ్యాయామం చేసినా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇండోర్ సైక్లింగ్ వల్ల ఏయే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.. ఇండోర్ సైక్లింగ్ శరీరాన్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గిస్తుంది ఇండోర్ సైక్లింగ్ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇండోర్ సైక్లింగ్ ఎన్నో రోగాల ముప్పు నుంచి కాపాడుతుంది. ఏరోబిక్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అలాగే హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది మీ గుండె కండరాలను బలోపేతం చేయడానికి, శరీరంలోకి రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయడానికి సహాయపడుతుంది. ఈ వ్యాయామాన్ని స్థిరంగా చేయడం వల్ల రక్త ప్రసరణ, ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. దీంతో అధిక రక్తపోటు పోటు సమస్యలు రావు. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది ఏ రకమైన కదలిక అయినా సరే శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. సైక్లింగ్ ఎఫెక్టీవ్ కేలరీల బర్నింగ్ వ్యాయామం. సైక్లింగ్ తో బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం.. 70 కిలోల బరువున్న వ్యక్తి ఇండోర్ సైక్లింగ్ వల్ల 250 నిమిషాల్లో 30 కేలరీలను కరిగించగలడు. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే జిమ్ముకు బదులుగా ఇంట్లో ఉండి ఇండోర్ సైక్లింగ్ చేస్తే సరి! అంతేకాదు ఈ సైకిల్‌ను తొక్కడం వల్ల మీ కాలి కదలికలు మెరుగుపడతాయి. ఫలితంగా కాళ్లలోని కండరాల సమూహాలు – క్వాడ్రిసెప్స్, గ్లూట్స్, తొడ కండరాలు కాలక్రమేణా బలంగా, టోన్ అయ్యేలా చేస్తాయి. ఇండోర్ సైక్లింగ్ మీ కీళ్లకు మంచిది ఇండోర్ సైక్లింగ్ ప్రభావవంతమైన తక్కువ–ప్రభావ వ్యాయామంగా పరిగణించబడుతుంది. ఇది వృద్ధులకు, మోకాలి, కీళ్ల నొప్పులు ఉన్నవారికి బాగా సహాయపడుతుంది. ఇది కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. మోకాలి సమస్య లేదా వెన్నునొప్పి ఉన్నవారు ఇండోర్ సైక్లింగ్‌కు ముుందు డాక్టర్‌తో మాట్లాడాలి. వైద్యుడి సలహా మేరకే ఈ సైకిల్‌ను తొక్కాలి. ఒత్తిడిని తగ్గిస్తుంది ఇండోర్ సైక్లింగ్ మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఏదో ఒక రూపంలో శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల మీ శరీరం ఎండార్ఫిన్లు అని పిలువబడే ఫీల్–గుడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. çకొన్ని అధ్యయనాల ప్రకారం.. సైక్లింగ్ డోపామైన్, సెరోటోనిన్ ను కూడా పెంచుతుంది. ఫలితంగా మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడి స్థాయులు కూడా తగ్గుతాయి. శక్తి సామర్థ్యాలను పెంచుతుంది ఇండోర్ సైక్లింగ్ మీ స్టామినాను పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తొక్కుతుంటే క్రమంగా అలసట తగ్గి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి, ఇతర వ్యాయామాలలో పాల్గొనడానికి ఎక్కువ శక్తి, సామర్థ్యాన్ని కలిగి ఉండటానికి సహాయపడుతుంది. (చదవండి: మనిషన్నవాడు ఏమైపోయాడో..ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిన హత్యాకాండలు!) -
వ్యాయామమే మంచి మందు
సాక్షి, అమరావతి: ప్రతి రోజూ అర గంటపాటు నడక, పరుగు, సైక్లింగ్, ఈత.. ఇలా ఏదో ఒకదాన్ని నిత్యకృత్యంగా చేసుకున్నవారు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిత్యం వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే చాలా వరకు వ్యాధులను దరి చేరకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు. కేవలం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి సైతం వ్యాయామాన్ని మించిన మందు లేదని వివరిస్తున్నారు. ఈ మేరకు అధ్యయనాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. మందుల కంటే కూడా వ్యాయామంతోనే 1.5 రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. శారీరకంగా చురుకుగా ఉంటే విచారం, ఆందోళన, బాధ తదితరాలు తక్కువ స్థాయిలోనే ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ మేరకు సౌత్ ఆ్రస్టేలియా యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా 1.28 లక్షల మందిని పరిశీలించారు. ఆయా మానసిక సమస్యలను అధిగమించడానికి మందులు, కౌన్సెలింగ్ కంటే కూడా శారీరక శ్రమ చేస్తే 1.5 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటోందని వెల్లడించారు. ఈ అధ్యయనం ఆధారంగా గుర్తించిన అంశాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో తాజాగా ప్రచురించారు. మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, నిరాశ, ఆందోళన, ఆత్మన్యూనతతో బాధపడేవారిని పరిశీలించారు. ఈ క్రమంలో శారీరక శ్రమ/వ్యాయామం చేసేవారిలో నిరాశ, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుముఖం పట్టాయని గుర్తించారు. తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్న గర్భిణులు, హెచ్ఐవీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులు వ్యాయామంతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నట్టు స్పష్టమైంది. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. దీంతో మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 2.5 ట్రిలియన్ డాలర్ల వ్యయం చేస్తున్నారు. ఈ వ్యయం 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. మంచి హార్మోన్లు పెరుగుతాయి నడక, వ్యాయామం, పరుగు, ఏరోబిక్స్ వంటివాటితో శరీరానికి మంచి చేసే హార్మోన్లు విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాయామం వల్ల శరీరంలోని అడ్రినాలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయని పేర్కొంటున్నారు. శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించే ఎండారి్ఫన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని అంటున్నారు. రోజూ అరగంట చేసినా మంచి ఫలితాలు.. ప్రస్తుతం అన్ని వయసులవారు తీవ్ర ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో రోజూ కనీసం అరగంట పాటు నడక, స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్, డ్యాన్సింగ్, ఏరోబిక్స్ వంటి వాటికి సమయం కేటాయించాలి. ఈ వ్యాయామం బీపీ, షుగర్, ఊబకాయం వంటివి రాకుండా శారీరక, మానసిక ఆరోగ్యాలకు మేలు చేకూరుస్తుంది. రోజూ శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో మంచి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి, నిరాశ, ఆందోళనల నుంచి దూరం కావచ్చు. – డాక్టర్ రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, విజయవాడ -
వ్యాయామం చేసి వచ్చాక.. గుండెపోటుతో యువకుడి మృతి
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామయ్యబౌళికి చెందిన సయ్యద్ మజిద్ హుస్సేన్ అలియాస్ జునేద్ (26) గురువారం రాత్రి జిమ్‌లో కొంతసేపు వ్యాయామం చేశాడు. అక్కడి నుంచి స్నూకర్ ఆడడానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. రాత్రి 11:30 గంటల సమయంలో ఛాతీలో నొప్పి వచ్చింది. వాంతులు కూడా చేసుకున్నాడు. సాధారణమైనదేనని భావించి ఇంటి ముందు వాకింగ్ చేయటం ప్రారంభించాడు. ఈక్రమంలో తీవ్ర గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కరోనా తర్వాత పోస్ట్‌కోవిడ్ సోకిన బాధితులతో పాటు ఇతరులకు సైతం ఇటీవల గుండెపోటు పెరిగాయి. సడెన్ కార్డియాక్ ద్వారా పలువురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో గుండె జబ్బులతో రోగులు బారులు తీరుతున్నారు. ముందస్తుగా గుర్తించడం ఎలా? సాధారణంగా గుండెపోటు వచ్చే వాళ్లకు కొన్ని లక్షణాలు కన్పిస్తుంటాయి. ప్రధానంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరాడక పోవడం, గుండె బరువు అనిపించడం, నీరసం, చెమటలు రావడం, చేతులు లాగడం వంటివి అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ముందస్తు చికిత్స తీసుకుంటే కార్డియాక్ అరెస్టు నుంచి బయటపడేందుకు అవకాశం ఉంది. దెబ్బకొడుతున్న జీవన శైలి గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్ని వర్గాల వ్యక్తులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవనం తప్పడం లేదు. సరైన ప్రణాళిక లేక వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. కొన్ని రకాల ఉద్యోగాల్లో లక్ష్యాలు ఉంటాయి. అందుకోవడానికి పరుగులు పెట్టాల్సిందే. వేళకు తిండి తినరు. తిన్నా జంక్‌ఫుడ్ అలవాటు పడుతున్నారు. కొందరైతే చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. చివరికి తీవ్ర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. చిన్న వయస్సులోనే హృద్రోగ ముప్పు తలెత్తుతోంది. వారంలో 4–5రోజులు బయటే తింటున్నారు. ఈ ఆహారంలో రుచికోసం అధిక మసాలాలు, నూనెలు వాడుతుంటారు. తరచూ ఇవి తినడంతో అధిక కేలరీలు శరీరంలోకి చేరుతాయి. అందుకు తగినట్లు వ్యాయామం లేకపోవడంతో ఊబకాయులుగా మారి చివరకు ఆ ప్రభావం గుండైపె చూపుతుంది. -
చిన్నవయసులోనే గుండెపోటు సంఘటనలు ఎందుకు?
గుండెపోటు విషయంలో ఇటీవలి కొన్ని అధ్యయనాల్లో తెలిసి వచ్చిన అంశం ఏమిటంటే... ఇది పెద్దవారిలో మాత్రమే కాదు... టీనేజర్లలో... ఆ మాటకొస్తే చిన్నారుల్లో సైతం కనిపిస్తుందని తేలింది. క్రమబద్ధమైన రీతిలో వ్యాయామం చేస్తూ, శిక్షణ పొందే యువ అథ్లెట్లలో సైతం గుండెపోట్లు కనిపించాయి. ఫిఫా (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్‌బాల్) రిజిస్ట్రీలో సైతం 2014 నుంచి 2018 మధ్యకాలంలో 617 మంది యువ అథ్లెట్లు గుండెపోటుతో కుప్పకూలిన దాఖలాలున్నాయి. అంతేకాదు... మనదేశంలో సైతం చాలా పెద్ద సెలబ్రిటీలు మొదలుకుని... మన వీధిలో మనకు తెలిసిన వారిలో అకస్మాత్తు గుండెపోట్లు కనిపించడం, వారు హఠాత్తుగా మరణించడం చాలా ఎక్కువగా కలవరపరిచే విషయాలే. అతి చిన్న వయసులోనే ఎందుకిలా గుండెపోట్లు? అతి చిన్నవయసులో గుండెపోట్లు కనిపించడానికి కొన్ని అండర్లైయింగ్ ఫ్యాక్టర్స్ దోహదపడుతున్నట్లు వెల్లడైంది. ♦ కుటుంబ చరిత్రలోనే చిన్నవయసులో గుండెపోటు సంఘటనలు ఉండటం. ♦ గుండె నిర్మాణంలోనే పుట్టుకతో తేడాలు ఉండటం. ♦ గుండెలో లయబద్ధంగా కొట్టుకోడానికి నిత్యం ఒకే రీతిలో విడుదలయ్యే ఎలక్ట్రిసిటీ కావాలి. అది సయనో ఏట్రియల్ నోడ్ అనే గుండెలోని ఓ కేంద్రం నుంచి వెలువడుతుంది. ఈ కరెంటు వెలువడటంలోని తేడాలు (అబ్నార్మాలిటీస్) కూడా ఇలా యువత అకస్మాత్తు మరణాలకు ఒక కారణమని అధ్యయనాల్లో తేలింది. కోవిడ్ నష్టాలూ కొంతవరకు కారణం... ఎలాగంటే...? కోవిడ్ అనంతరం వచ్చే కొన్ని సమస్యలు సైతం గుండెపోటుకు కారణమని కొన్ని అధ్యయనాల్లో తేలింది. గుండె కండరానికి ఇన్ఫ్లమేషన్ తెచ్చిపెట్టే ‘మయోకార్డయిటిస్ ’ సమస్య ఇందుకు ఓ ఉదాహరణ. ఛాతీలో నొప్పి, శ్వాస తగినంతగా అందకపోవడం వంటి లక్షణాలతో కనిపించే మయోకార్డయిటిస్ అన్నది అటు తర్వాత గుండె క్రమబద్ధంగా కొట్టుకునే లయను దెబ్బతీసేలా ‘అరిథ్మియాస్’, హార్ట్ఫెయిల్యూర్లతోపాటు మరికొన్ని ఇతర గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఇదొక్కటే కాదు... కోవిడ్ తర్వాత చాలామందిని పరిశీలించినప్పుడు వారి రక్తప్రసరణ వ్యవస్థలో / రక్తనాళాల్లో రక్తపు ఉండలు (క్లాట్స్) పెరగడం మరో అంశం. ఈ క్లాట్స్ ప్రధాన ధమనుల్లో వచ్చినప్పుడు, గుండెకు తగినంతగా పోషకాలు, ఆక్సిజన్ అందకుండా అడ్డుపడతాయి. ఇవి కూడా యువతలో గుండెపోట్లకు కారణం. ♦ ఇటీవల యువతలో మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోయింది. ఆదుర్దా పడటం, ఆందోళన చెందడం వంటి అంశాలు యాంగ్జైట్ టీకి దారితీస్తున్నాయి. దీనికి తోడు వైరస్ అనంతర పరిణామాల్లో సామాజిక సమస్యలుగా పరిగణించే ఉపాధి కోల్పోవడం, ఆర్థికంగా దెబ్బతినడం వంటి అంశాలూ యువతలో ఒత్తిడికి కారణమవుతున్నాయి. ఈ ఒత్తిడి అధిక రక్తపోటుకూ, గుండె వేగం పెరుగుదలకూ, గుండె లయ మార్పుచెందడానికి దోహదపడుతున్నాయి. ఇవన్నీ గుండె, రక్తప్రసరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ద్వారా యువతలో చాలా చిన్నవయసులోనే గుండెపోట్లకు దారితీస్తున్నాయి. ♦ దీనికి తోడు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలూ,ఇంకా కొనసాగుతున్న వర్క్‌ఫ్రమ్ హోమ్ వంటి పని అలవాట్లు యువతలో వ్యాయామలేమిని పెంచడంతో పాటు... రాత్రి తగినంతగా నిద్రలేకుండా పనిచేయడాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ నిద్రలేమి కూడా యువతలో గుండెపోట్లకు ఓ ప్రధాన కారణమే. ♦ వీటన్నింటికి తోడు మనలో ఒత్తిడినీ, యాంగ్జైట్ టీని పెంచే మరో అంశం కూడా ఉంది. నిజానికి తగిన సమయానికి కోవిడ్ వ్యాక్సిన్ రావడం వల్ల చాలా మరణాలు నివారితమయ్యాయి. పెద్దసంఖ్యలో జనం రక్షణ పొందారు. కానీ ఇటీవల పెరిగిన గుండెపోట్లను వ్యాక్సిన్‌తో ముడిపెడుతూ చాలా వదంతులు వెలువడుతున్నాయి. మానసిక ఒత్తిడిని పెంచడానికి ఇవీ కారణమవుతున్నాయి. నిజానికి ఈ గుండెపోట్లకూ, వ్యాక్సిన్ కూ సంబంధం ఉన్నట్లుగా ఏ విధమైన ఆధారాలూ ఇప్పటివరకు వెలువడలేదు. వీటిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. ♦ గుండెపోటుతో మృతి చెందినవారిలో నిర్దిష్ట కారణాలు కనుగొనేందుకు పోస్ట్‌మార్టమ్ అవసరం. యుక్తవయసు గుండెపోట్లను నివారించాలంటే...? ♦ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. క్రమంతప్పకుండా అలాగే శరీరానికి మితిమీరిన శ్రమకలిగించకుండా చేసే వ్యాయామాలు, మంచి ఆహారపు అలవాట్లు, పొగతాగడం, మద్యం వంటి అలవాట్ల నుంచి దూరంగా ఉండడంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. నష్టనివారణ కోసం ఎలాంటి పరీక్షలు అవసరమంటే...? ఇటీవల హఠాత్తుగా గుండెపోట్ల పెరుగుదల అన్నది ఇటు డాక్టర్లను, అటు సామాజికవేత్తలనూ బెంబేలెత్తిస్తోంది. దేశ ఆర్థికాభివృద్ధి, పురోగతికి కారణమైన యువత ఇలా అకస్మాత్తుగా మృతి చెందడం కుటుంబాలకే కాదు, దేశానికీ నష్టమే. అందుకే గుండెపోటు మరణాల పట్ల తగినంత అవగాహన, విషయపరిజ్ఞానం, మున్ముందు రాబోయే ఇక్కట్ల నుంచి తమను రక్షించుకునేలా చేయించుకోవాల్సిన తగిన వైద్యపరీక్షల వంటి అంశాల్లో నివారణ ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న వయసువారైనప్పటికీ, తమలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు తప్పనిసరిగా గుండె పరీక్షలు అంటే... ఈసీజీ, 2డీ ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ వంటివి డాక్టర్లు చెప్పిన విధంగా తగిన ఇంటర్వెల్స్‌లో చేయించుకోవాలి. ఇవేగాక ప్రాథమిక పరీక్షలైన బీపీ చెక్ అప్, కొలెస్ట్రాల్ స్థాయుల్ని తెలిపే రక్త పరీక్షలు, చక్కెర మోతాదు పరీక్షలు చేయించుకుని, డాక్టర్లు చెప్పిన విధంగా మందులు, జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ ప్రాణాలను కాపాడే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్)వంటివి అందరూ నేర్చుకోవాలి. దీనివల్ల అకస్మాత్తు గుండెపోటు మరణాలను చాలావరకు నివారించవచ్చు. ఈ సీపీఆర్‌పై సాధారణ ప్రజలందరికీ శిక్షణ ఇవ్వాలి. ♦ ఇక ప్రజలు ఎక్కువగా తిరగాడే కొన్ని కీలకమైన ప్రదేశాల్లో, కూడళ్లలో, సెంటర్లలో డీ–ఫిబ్రిలేటర్లను (ఆగిపోయిన గుండెను మళ్లీ స్పందించేలా చేసే ఉపకరణాలు) అమర్చాలి. గుండెపోటు ముప్పును తెచ్చిపెట్టే అంశాలేమిటంటే? మన దేశంలోని యువతలో ఇటీవల ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, కొవ్వు పదార్థాల వినియోగంలో పెరుగుదల... ఫలితంగా బరువు పెరగడం ఓ ప్రధాన ముప్పు. ♦ చాలా తక్కువ వయసులోనే గుండెపోటు ముప్పునకు కారణమయ్యే స్థూలకాయం, హైబీపీ (హైపర్‌టెన్షన్), మధుమేహం (డయాబెటిస్) పెరుగుదల కూడా మరో కారణం. ఒకప్పుడు ఈ తరహా జీవనశైలి సమస్యలు చాలా పెద్ద వయసువారిలోనే కనిపించేవి. కానీ ఇటీవల ఇవి చిన్నవయసు వారిలోనూ వస్తున్నట్లే... దీని చిట్టచివరి ప్రమాదకరమైన ఫలితమైన గుండెపోట్లూ యువతలో పెరుగుతున్నాయి. ♦ ఇటీవల యువత చేపడుతున్న వృత్తులన్నింటిలోనూ కదలకుండా కూర్చుని చేసే పనులే ఎక్కువగా ఉంటున్నాయి. కనీస కదలికలు కూడా కొరవడటం (సెడెంటరీ) అనే జీవనశైలి వల్ల ఈ ముప్పు యువతలో మరింతగా పెరుగుతోంది. ♦ ఈ అంశాలన్నీ కలగలసి చాలా చిన్నవయసులోనే గుండెపోటు ముప్పును తెచ్చిపెడుతున్నాయి. - డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
వద్దు‘లే..జీ’ నడవటం ఈజీ.. మరణాలకు నాలుగో ప్రధాన కారణం ఏంటో తెలుసా?
తాగి డ్రైవింగ్ చేయడం.. అతి వేగంతో వాహనాలు నడపటం.. సిగరెట్లు తాగడం వంటివి ఎలా ప్రాణాంతకమవుతాయో.. రోజంతా మంచంపై కూర్చోవడం.. ఎలాంటి కదలికలు లేకుండా ఉండటం కూడా అంతే ప్రాణాంతకమని మీకు తెలుసా. సోమరితనం మీ విలువైన కాలంతోపాటు మీ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. శరీరానికి తగినంత వ్యాయామం చేయకపోతే అకాల మరణాలు సంభవించే అవకాశాలు 500 రెట్లు అధికమని ‘ది లాన్సెట్’లో ప్రచురించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. నడక లేదా పరుగు వంటి సాధారణ వ్యాయామాలు చేయడానికి కూడా తీరిక లేని వ్యక్తి వ్యాధులను ఆహ్వానిస్తాడని వెల్లడించింది. సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఏ వయసు వారైనా తగినంత శారీరక శ్రమ చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంటినుంచి అడుగు బయట పెట్టగానే బైక్ లేదా కారెక్కి తుర్రుమని గమ్యస్థానానికి చేరుతున్న వారెందరో ఉన్నారు. ఒక్క క్లిక్‌తో గుమ్మం వద్దకే అగ్గిపెట్టె నుంచి అన్నిరకాల వస్తువులు వచ్చి చేరుతున్నాయి. దీంతో బద్ధకస్తులు పెరిగిపోతున్నారు. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్న వారి సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో నడక, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్ చేయడం లాంటి ఏదో ఒక వ్యాయామం చేసి తీరాలని వైద్యులు సూచిస్తున్నారు. భారం పెరిగిపోతోంది ప్రజలు బద్ధకిస్టులుగా మారడం.. ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికబుల్ (ఎన్సీడీ) వ్యాధులు దేశంలోను, రాష్ట్రంలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో 63 శాతం, రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్సీడీ వ్యాధులకు కారణమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్సీడీ నివారణ, నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 30 ఏళ్ల పైబడిన వారందరికీ స్క్రీనింగ్ నిర్వహించి.. వారి ఆరోగ్యంపై నిరంతర ఫాలో అప్ను వైద్య శాఖ చేపడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2.80 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా.. 55.41 లక్షల మందిలో రక్తపోటు లక్షణాలు వెలుగు చూశాయి. వీరిలో 16.28 లక్షల మందిలో సమస్య నిర్ధారణ అయింది. 5.46 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉండగా.. 5.14 లక్షల మందిలో సమస్య అదుపులోనే ఉంది. అదేవిధంగా 53.92 లక్షల మందిలో మధుమేహం సమస్య వెలుగు చూడగా.. 12.29 లక్షల మందికి సమస్య నిర్ధారణ అయింది. వీరిలో 4.17 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. 3.65 లక్షల మందిలో సమస్య అదుపులో ఉంది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఎన్సీడీ బాధితులపై వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా.. దీర్ఘకాలిక జబ్బుల బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలకు శారీరక శ్రమ ఆవశ్యకతను తెలియజేసి.. వారిని నడక, వ్యాయామం ఇతర కార్యకలాపాల వైపు మళ్లించడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థలు, ఎన్జీవోల సహకారాన్ని తీసుకుని వాకింగ్ ట్రాక్‌లు, గ్రౌండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించారు. పాఠశాల దశలోనే పిల్లల్లో వ్యాయామం, నడక రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మరణాలకు నాలుగో ప్రధాన కారణం బద్ధకమే ప్రజలు తగినంత శారీరక శ్రమ చేయకపోవడం మరణాలకు నాలుగో ప్రధాన కారణంగా ఉంటోందని డబ్ల్యూహెచ్‌వో సైతం హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలకు నాలుగు ప్రధాన కారణాలను పరిశీలిస్తే అధిక రక్తపోటు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో పొగాకు వినియోగం, మధుమేహం, శారీరక శ్రమ చేయకపోవడం వంటివి ఉంటున్నాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో ప్రజలు దీర్ఘకాలిక జబ్బులైన మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, క్యాన్సర్, గుండె సమస్యలు, మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. వీటిని నయం చేసుకోవడానికి ఏటా రూ.25 వేల కోట్ల మేర ఖర్చవుతోందని, పదేళ్లలో ఈ ఖర్చు రూ.2.50 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని గత ఏడాది ఓ నివేదికలో డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. పట్టణీకరణ పెరుగుదల, రవాణా సౌకర్యంలో మార్పులు, అవుట్డోర్ పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు అందుబాటులో లేకపోవడం, శారీరక శ్రమ ఆవశ్య కతపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ప్రజలను బద్ధకిస్టులుగా మార్చుతున్నాయి. ఇప్పటికే సమావేశం నిర్వహించాం ప్రజలకు వాకింగ్ చేయడానికి వీలుగా మైదానాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశం నిర్వహించాం. తమ గ్రౌండ్లను ఉదయం, సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరాం. వివిధ శాఖలను సమన్వయం చేసుకుని ప్రజల రోజువారి దినచర్యలో వాకింగ్, జాగింగ్, వ్యాయామం, ఇతర శారీరక శ్రమ కార్య కలాపాలను భాగం చేసేలా కార్యక్రమాలు చేపడతాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మార్పు రావాలి పాశ్చాత్య జీవన విధానానికి ప్రజలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అలవాట్లలో మార్పు రావాలి. మన పూర్వీకుల జీవన విధానాల్లోకి మనం వెళ్లాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, వ్యాయామం, ఈత ఇలా ఏదో ఒక శారీరక శ్రమ చేయాలి. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుప డుతుంది. ఊబకాయం నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ -
శారీరక శ్రమతోనే ఎన్సీడీ సమస్యలకు చెక్
సాక్షి, అమరావతి: బీపీ, షుగర్, ఇతర నాన్‌కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) నుంచి బయటపడడానికి నడక, వ్యాయామం వంటి శారీరకశ్రమే శరణ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. ఆయన సోమవారం మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్, ఎయిడెడ్, సాంకేతిక విద్యాసంస్థల యజమానులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీడీ సమస్యల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలను డ్రైవ్‌లా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. రోజూ ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నడక, వ్యాయామాలు చేసుకోవడానికి వీలుగా స్థలాలు, క్రీడామైదానాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. దీనిపై విద్యాసంస్థల యాజమాన్యాలు రెండు, మూడురోజుల్లో తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలపాలని కోరారు. రాష్ట్రంలో 1990లో 30 శాతం ఉన్న ఎన్సీడీ ప్రభావం ప్రస్తుతం 63 శాతానికి పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్సీడీ సమస్యలే ప్రధాన కారణమన్నారు. ఈ క్రమంలో ఎన్సీడీ సమస్యల కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. 30 ఏళ్లు పైబడిన వారికి వైద్యశాఖ స్క్రీనింగ్ చేసి ఆరోగ్య సమస్యలు గుర్తిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఐదుగురిలో ఒకరు బీపీ/షుగర్‌తో ఉన్నట్టు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, కమిషనర్ సురేష్‌బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం
-
శిక్షణ విన్యాసాల్లో అపశ్రుతి.... హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
కాబూల్: అప్గనిస్తాన్‌లో కాబూల్ శిక్షణా విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమెరికా తయారు చేసిన బ్లాక్‌హాక్ ఛాపర్ కూలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఒక అనుభవం లేని తాలిబన్ పైలెట్ ఆ అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన సంభవించింది. తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగనట్లు ధృవీకరించింది. ఈ ఛాపర్‌ని శిక్షణా విమానంగా పేర్కొంది. అయితే మంత్రిత్వశాఖ అదనంగా ఐదుగురు చనిపోయారని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి యునైటెడ్ స్టేట్స్ 2002 నుంచి 2017 మధ్య సుమారు రూ. 2 లక్షల కోట్లు విలువైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నైట్ విజన్ పరికరాలు, విమానాలు, నిఘా వ్యవస్థలతో సహా అఫ్గాన్ ప్రభుత్వానికి రక్షణాయుధాలను పంపింది. (చదవండి: ప్రపంచంలో అత్యంత వృద్ధ రైల్వే యూనియన్ నాయకుడిగా రికార్డు) -
పనుల్లో, ఆటల్లో భుజం గాయపడకుండా జాగ్రత్త పడండి!
భుజం దగ్గర ఉండేది కీలకమైన కీలు. పైగా నిద్రసమయంలో తప్ప... దాదాపుగా కదులుతూ ఉండే భాగం కావడంతో దానికి గాయమయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక ఆటల సమయంలోనైతే భుజం, అక్కడి కీలు నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. అందుకే భుజానికి గాయాలవడానికీ, దాంతో అనేక రకాల సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఉదాహరణకు భుజం గూడ తప్పడం (షోల్డర్ డిస్లొకేషన్), రొటేటర్ కఫ్ టేర్, స్లాప్ టేర్స్, టెండనైటిస్, టెండన్ రప్చర్స్ వంటివి. సాధారణంగా ఆటల్లో భుజం తాలూకు గూడ తప్పడం అనే సమస్య ఎక్కువగా వస్తుంటుంది. ఇలా జరిగినప్పుడు దాన్ని సరైన స్థానంలో అమర్చాల్సి ఉంటుంది. దాంతో పరిస్థితి చక్కబడుతుంది. ఇక గూడ తొలగడం అనే ఆ సమస్య నిత్యం జరుగుతూ ఉంటే ‘ఆర్థోస్కోపీ స్టెబిలైజేషన్’ అనే శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఆ శస్త్ర చికిత్స ద్వారా ఈ సమస్యను నిపుణులు చక్కదిద్దుతారు. భుజానికి వచ్చే సాధారణ సమస్యల నివారణ కోసం... ►క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల భుజం కండరాలు బలంగా మారి భుజానికి వచ్చే అనేక సమస్యలు నివారితమవుతాయి ►వ్యాయామంలో తన వీపు భాగంలో ఉండేవీ, వెనకవైపు కండరాలపై కూడా దృష్టిపెట్టడం కూడా అవసరం. చాలా మంది శరీరానికి ముందువైపు ఉన్న కండరాలు బలంగా రూపొందడానికీ, అవి అందంగా మంచి షేప్‌తో కనిపించడానికి తగిన ప్రాధాన్యమిస్తుంటారు. ఆ మేరకే వ్యాయామాలు చేస్తుంటారు. ►అయితే భుజం విషయంలో మాత్రం చేతులకు వెనకవైపున ఉండే కండరాలు కూడా బలంగా రూపొందే వ్యాయామాలు చేయాలి. అప్పుడే భుజం చాలాకాలంపాటు ఆరోగ్యంగా ఉంటుంది ►మధుమేహ వ్యాధిగ్రస్తులకు ‘ఫ్రోజెన్షోల్డర్’ అనే బాధాకరమైన కండిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకునేందుకు, ఫ్రోజెన్షోల్డర్ను నివారించుకునేందకు అవసరమైన వ్యాయామాలు చేయడం మంచిది ►కంప్యూటర్‌పై పనిచేసేవారు, వీడియోగేమ్స్ ఆడేవారు, టీవీ చూసేవారు, డ్రైవింగ్ చేసేవారు సరైన భంగిమలో కూర్చోవాలి. వారు నిటారుగా కూర్చొని పనిచేయడం వల్ల కండరాలపైనా, ఇరువైపుల ఉన్న భుజాలపైన సమంగా భారం పడుతుంది. అంతే తప్ప ఒకవైపు ఒంటి పనిచేయడం సరికాదు> ►భుజాలు బెణకడం వంటివి జరిగినప్పుడు అది తగ్గే వరుకు వ్యాయామాలు ఆపేసి, వేడినీటి కాపడం, ఐస్ కాపడం పెట్టాలి. ఇలా చేశాక రెండు రోజుల తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను కలవాలి. -
వ్యాయామం బోర్ కొట్టిందా? ఇలా చేయండి.. మామూలుగా ఉండదు మరి..
దొండపర్తి (విశాఖ దక్షిణ): జుంబా డ్యాన్స్‌కు క్రేజ్ పెరుగుతోంది. ఎప్పుడూ ఒకే రకం వ్యాయామాలు చేసి బోర్ కొట్టినవారంతా.. ఇప్పుడు జుంబా డ్యాన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. శ్రమపడినట్టు తెలియకుండానే శరీరానికి అవసరమైనంత వ్యాయామం అందిస్తుంది. పైగా ఆరోగ్యం మెరుగుపడేలా కూడా చేస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో జుంబా డ్యాన్స్ పై ఆసక్తి చూపుతున్నవారు క్రమంగా ఎక్కువ అవుతున్నారు. చదవండి: ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. ఇష్టపడి పెళ్లిచేస్కొని.. వ్యాయామం చేస్తూ.. కొన్నాళ్ల క్రితం వరకు మెట్రో నగరాలకే పరిమితమైన ఈ జుంబా క్రేజ్ ఇపుడు విశాఖకు కూడా పాకింది. దీనికి అనుగుణంగానే వరుణ్ గ్రూప్ జుంబా డ్యాన్స్ విశాఖవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చిందని జుంబా డ్యాన్స్ ట్రైనర్ మధుసింగ్ చెప్పారు. జుంబా డ్యాన్స్‌కు సంబంధించి ఆమె మరిన్ని వివరాలు చెప్పారు. అవి ఆమె మాటల్లోనే... అనేక ప్రయోజనాలు ►జుంబా డ్యాన్స్‌తో శ్రమ పడినట్లు తెలియకుండానే శరీరానికి అవసరమైనంత వ్యాయామం అందిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడేలా కూడా చేస్తుంది. ►జుంబా డ్యాన్స్ ఎరొబిక్స్ను పోలి ఉంటుంది. కొవ్వును అధిక స్థాయిలో కరిగించుకోడానికి ఉపకరిస్తుంది. ►బరువు తగ్గడంతో పాటు డ్యాన్స్‌తో తల నుంచి పాదాల వరకు ప్రతి అవయవం కదులుతుంది. ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. మెదడుకు కూడా ప్రశాంతతను అందిస్తుంది. ►ఊపిరితిత్తుల పవర్ పెరుగుతుంది. శ్వాస సంబంధిత సమస్యలను అధిగమించేలా చేస్తుంది. కండరాలు బలంగా ఉండేలా సహాయపడుతుంది. రెగ్యులర్‌గా ఈ డ్యాన్స్ చేయడం వల్ల వయస్సు మీద పడనీయకుండా కాపాడుతుంది. ►ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చేసే ఈ డ్యాన్స్‌తో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. జుంబా డ్యాన్స్ సెషన్స్‌ను ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. రోజూ ఉదయం 9 గంటల నుంచి 10 వరకు, సాయంత్రం 5 నుంచి 6 వరకు...తిరిగి 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు ఒక్కో బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నాం. ఎప్పుడూ ఒకేరకం వ్యాయామాలు చేసి బోర్ కట్టిన వారంతా ఇపుడు జుంబా డ్యాన్స్ వైపు మొగ్గు చూపుతుండడంతో విశాఖలో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించాం. ఆరోగ్యం.. మానసిక ఉల్లాసం.. జుంబా డ్యాన్స్ కార్డియోవాస్కులర్, ఫ్యాట్ బర్నింగ్ యాక్టివిటీగా చాలా ఫేమస్ అయింది. పిల్లలతో పాటు పెద్దలు, మధ్యవయస్సు మహిళలు కూడా జుంబాపై ఆసక్తి చూపిస్తున్నారు. జుంబా ద్వారా గుండెకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఏరోబిక్స్‌లో కన్నా జుంబా ద్వారా ఎక్కువ కేలరీలను బర్న్ చేయవచ్చు. ఒక గంటలో 300 నుంచి 400 క్యాలరీలను కరిగించుకోవచ్చు. అందుకే జుంబా వర్కౌట్ ద్వారా త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. – మధు సింగ్, జుంబా డ్యాన్స్ ట్రైనర్ -
ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. ఇష్టపడి పెళ్లిచేస్కొని.. వ్యాయామం చేస్తూ..
సాక్షి, పుంగనూరు (చిత్తూరు): ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆషాడమాసం తర్వాత హనీమూన్ వెళ్లాలని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. విధి వక్రించింది. వ్యాయామం చేస్తున్న యువకుడు గుండెపోటుకు గురై కుప్పకూలాడు. ఆషాడ మాసానికని పుట్టింటికి వెళ్లిన భార్య భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. పెళ్లి అయి మూడు నెలలు కూడా కాకుండానే కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. పుంగనూరు పట్టణానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి సుధాకర్‌రెడ్డి, భారతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎం.తేజవిష్ణువర్ధన్‌రెడ్డి (27) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ లావణ్యతో వివాహం జరిగింది. ఆషాడమాసం రావడంతో లావణ్య గత వారం పుట్టింటికి వెళ్లింది. తేజవిష్ణువర్ధన్ రెడ్డికి ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేసే అలవాటు. శనివారం ఉదయం సైక్లింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తండ్రి సుధాకర్‌రెడ్డి వెంటనే డాక్టర్ చైతన్యతేజారెడ్డికి సమాచారం అందించారు. ఆయన వచ్చి పరిశీలించి గుండెపోటుతో మృతిచెందినట్టు ధ్రువీకరించారు. భర్త మృతి విషయం తెలుసుకున్న లావణ్య గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. ఆషాడం పూర్తికాగానే తిరుమల దర్శనం చేసుకుని హనీమూన్‌కు వెళ్లేందుకు నూతన జంట ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే తేజవిష్ణువర్ధన్‌రెడ్డి మృతిచెందడంతో స్థానికులు కంటతడి పెట్టారు. చదవండి: (Varadapuram Suri: భూ కుంభకోణాల 'వరద'.. రంగంలోకి ఏసీబీ) యువకులు జాగ్రత్తలు పాటించాలి వ్యాయామం ఒక క్రమ పద్ధతిలో చేయాలి. ఎక్కువ సమయం చేయడం మంచిది కాదు. జిమ్‌లకు వెళ్లేవారు ముందుగా వైద్య పరీక్షలు చేసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ల సూచనల మేరకు వ్యాయామం చేయాలి. గుండెపై ఒత్తిడి తీవ్రం కావడం ద్వారా గుండెపోటుకు గురై క్షణాల్లోనే ప్రాణాలు కొల్పోతారు. – డాక్టర్ చైతన్యతేజారెడ్డి, ప్రముఖ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ -
ఎంత సంపాదిస్తే ఏం లాభం? వేళకు తిండి, కంటినిండా నిద్రా లేకుంటే!
Healthy Lifestyle Tips: ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజువారీ జీవితంలో క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తున్నారు చాలామంది. కొంత మంది అయితే మాడిపోతున్న పొట్టను పిజ్జా, బర్గర్లతోనో, బిస్కెట్లతోనో మాయ చేస్తూ, కూరుకుపోతున్న కళ్లను టీ చుక్కలతో బలవంతంగా తెరిపి'స్తూ నిద్రాహారాలు మాని మరీ పని చేస్తుంటారు. ఇలా బిజీ లైఫ్‌లో పడి చాలా మంది తమ ఆరోగ్యం పట్ల కనీస శ్రద్ధ చూపించడం కూడా మరచిపోతున్నారు. ఫలితంగా కడుపులో అల్సర్లు, గ్యాస్... లావుపాటి కళ్లద్దాలు, ఊబకాయాలతో రకరకాల రోగాల బారిన పడుతున్నారు. ఎంత సంపాదిస్తే ఏం లాభం? వేళకు తిండి, కంటినిండా నిద్రా, ఆ సంపాదనను అనుభవించేందుకు తగిన ఆరోగ్యం లేకపోతే! పరుగులు పెట్టడం తప్పదు, సంపాదించడమూ తప్పదు. అయితే జీవనశైలిలో తగిన మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా... ఆనందంగా జీవించవచ్చు. అందుకు తగిన మార్గాలివిగో... ప్రపంచంతో పాటు పోటీ పడి ముందుకు సాగటం అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన విషయం. ఇది కాదనలేని సత్యం. అయితే ఇదే సమయంలో ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపడం అత్యవసరం. ఇందుకోసం ప్రతి ఒక్కరు తమ కోసం తాము రోజూ కొంత సమయాన్ని విధిగా కేటాయించాలని, లేదంటే చిక్కుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యాయామంతో మొదలు పెట్టాలి కరోనా ప్రభావం వల్ల మొన్నటి దాకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు చాలా మంది. కొంతమంది ఇప్పటికీ అదే పద్ధతిలో ఉన్నారు. కొన్ని సంస్థలలో మాత్రం వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు వచ్చేలా, మిగిలిన రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించమని ఉద్యోగులకు చెబుతున్నారు. దీనితో కనీసం బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే.. తినడం, పనిచేయడం, పడుకోవడం వంటివి చేస్తున్నారు. దీనిమూలంగా ఒకవిధమైన లేజీనెస్, ఏదో పోగొట్టుకున్నట్లు అనిపించడం, ఇంటిలో చిన్న చిన్న కీచులాటలు తప్పడం లేదు. ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రతి రోజు ఉదయం లేవగానే రన్నింగ్, జాగింగ్ వంటివి చేయడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటే.. ఇంట్లోనే వీలైన వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా చిన్న చిన్న వ్యాయామాలు లేదా యోగా చేయడం ద్వారా.. పని ఒత్తిడి దూరమై, ప్రతి రోజూ కొత్తగా ప్రారంభించేందుకు వీలవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌ను బ్రేక్ చేయొద్దు: వ్యాయామం చేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి బద్ధకించవద్దు. ఇడ్లీ, దోసె, ఉప్మా, చపాతి, మొలకలు, పండ్ల ముక్కలు, కీరా ముక్కలు... ఇలా ఏదైనా సరే మీకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ తప్పకుండా చేయండి. టిఫిన్ తినకుండా పని చేయడం వల్ల నిస్సత్తువగా ఉండటం, పని మీద ఏకాగ్రత లేకపోవడం, పని చేయడానికి తగిన శక్తి లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాతే మీ పనిలోకి దిగండి. మంచి నీళ్లు తాగటం మంచిది శరీరంలో అన్ని క్రియలు సరిగ్గా జరగాలంటే నీరు చాలా అవసరం. అందుకే తరచూ నీళ్లు తాగటం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సమృద్ధిగా నీళ్లు తాగడం వల్ల చర్మం నిగ నిగలాడుతూ.. ఆరోగ్యంగా ఉంటుంది. దాహం అయితేనే నీళ్లు తాగడం అనేది కాకుండా... కనీసం గుక్కెడు నీళ్లతో గొంతు తడుపుకోవడమూ మంచిది. ఆహారంపై దృష్టి తప్పనిసరి ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చాలామంది ఒక సమయం అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటారు. అంతే కాదు, టైమ్ పాస్ కోసం స్నాక్స్ అంటూ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. రోజు టైమ్ టేబుల్ ఫిక్స్ చేసుకుని.. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్యలో స్నాక్స్ వంటివి తీసుకోవడం వల్ల ఆహారంలో రుచితో పాటు పోషకాలు కూడా ఉండేలా చూసుకోవడం అవసరం. రిలాక్సేషన్‌కు రిలాక్సేషన్ ఇవ్వకండి ఎంత పని చేసినా, మధ్య మధ్యలో కాసేపు సేదతీరడం అవసరం. లేదంటే మెదడు వేడెక్కి పనిమీద ధ్యాస తగ్గిపోతుంది. ఫలితంగా ఎక్కువ గంటలు పని చేసిన ట్లు అనిపిస్తుంది కానీ చేసిన పని కనిపించదు. ఒత్తిడి వద్దే వద్దు ఇంట్లోనే ఉండటం వల్ల చాలా మందికి ఒత్తిడి, ఆందోళన వంటివి పెరుగుతుండటం సాధారణ సమస్యగా మారింది. ఇందుకోసం ఒత్తిడిగా అనిపించినప్పుడు కాసేపు పనిని పక్కన పెట్టి.. ఇంట్లో వాళ్లతో మాట్లాడటం కాసేపు ప్రకృతిని ఆస్వాదించడం వంటివి చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌గా పక్కన పెట్టేయండి అన్నింటికీ మించి స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడకపోవడమే మంచిది. ఎందుకంటే, చాలా మంది ఫోన్ వాడుతూ టైమ్ ఎంతసేపు గడిచించో కూడా పట్టించుకోరు. అందుకే స్మార్ట్ ఫోన్‌ను స్మార్ట్‌గా వాడటం అలవాటు చేసుకోవాలి. ఎంతసేపు వాడుతున్నాం అనే విషయంపై దృష్టి సారించాలి. నిద్రను జోకొట్టకండి రోజంతా చురుకుగా ఉండాలంటే కంటినిండా నిద్ర పోవడం చాలా అవసరం. రోజూ 8 గంటలు నిద్రపోవడం వల్ల శరీరానికి కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. దీని ద్వారా మరుసటి రోజును తాజాగా, నూతనోత్సాహంతో ఆరంభించవచ్చు. మనం పైన చెప్పుకున్నవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లో ఉన్నవారికే అనిపించవచ్చు కానీ, రిటైర్ అయి విశ్రాంత జీవితం గడిపేవారు అయినా, ఇంటి వద్దే ఉండి కుటుంబ సభ్యుల కోసం పనులు చేస్తూ పనిలోనే లీనమైపోయే గృహిణులు అయినా... ఇలా ఎవరూ మినహాయింపు కాదు. చదవండి👉🏾 Vimala Reddy: టైమ్‌పాస్ కోసం బ్యూటీ కోర్స్ చేశా.. 2 గంటలకు ఆరున్నర వేలు వచ్చాయి.. ఆ తర్వాత.. -
చెమట పట్టడం మంచి లక్షణమే.. కానీ శరీర దుర్వాసనను తగ్గించాలంటే..
చెమట పట్టడం చాలా సాధారణమైన జీవక్రియ. మనం బాగా శారీరక శ్రమ చేసినప్పుడు లేదా బాగా ఆటలాడినప్పుడు లేదా టెన్షన్ పడినప్పుడు, భయపడ్డప్పుడు చెమట పడుతుంది. ఇది సాధారణ పరిస్థితులలో. అయితే వేసవిలో మాత్రం ఇలాంటి వాటì తో పనిలేదు. కేవలం వాతావరణంలోని వేడి కారణంగా చెమట పడుతుంది. ఇది చాలా చికాకుగా అనిపిస్తుంది. నిజానికి చెమట పోయడం అనేది మంచి లక్షణమే అయినప్పటికీ వేసవిలో తలెత్తే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కొన్ని మార్గాలు... ఒంటికి చెమటలు పట్టగానే చాలామంది చిరాకు పడతారు. నిజానికి అలా చెమట పట్టడం మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి ఏర్పాటు చేసిన ఓ అద్భుత ప్రక్రియ. వాతావరణంలోని వేడి వల్ల లేదా, వేసవి ఎండల వల్ల దేహంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరంలోని వ్యవస్థలన్నీ విఫలమయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భాల్లో చర్మం మీద చెమట పట్టేలా చేసి, ఆ వేడిమి నుంచి కాపాడి దేహం చల్లగా అయ్యేలా ఏర్పాటు చేసింది ప్రకృతి. అంటే చెమట మన ప్రాణాలు కాపాడటమే కాదు. శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఉండేలా చూసి దేహక్రియలన్నీ సక్రమంగా జరిగేలా చూసే అపూర్వమైన ప్రక్రియ. అయితే కొన్ని సందర్భాల్లో అధికంగా చెమట పట్టడం వల్ల కొన్ని ఇబ్బందులూ తలెత్తవచ్చు. వాటికి ఉపశమనం కోసం జాగ్రత్తలను తెలుసుకుందాం. చెమట వల్ల సమస్యలు ►నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా అనిపించడం, శరీర దుర్వాసన. ►పిల్లల్లో చెమట పట్టడం వల్ల పరీక్షలు రాసే సమయంలో ఒక్కోసారి జవాబు పత్రం చిరిగిపోయే ప్రమాదమూ ఉంటుంది. ►టెన్నిస్, క్రికెట్ వంటి ఆటలు ఆడే క్రీడాకారుల్లో ఇలాంటి సమస్య ఉంటే బ్యాట్ లేదా టెన్నిస్ రాకెట్ జారిపోతుంటాయి. అందువల్ల వారు మాటిమాటికీ తుడుచుకోవలసి వస్తుంది. ►ఆఫీసులో పని సక్రమంగా జరగకపోవడం ►నలుగురు కలిసే సోషల్ గ్యాదరింగ్స్‌లో అందరితోనూ కలవలేకపోవడం, షేక్‌హ్యాండ్ ఇవ్వలేకపోవడం చదవండి: Summer Tips: చెరకురసంలో అల్లం, నిమ్మకాయ, పుదీనా కూడా కలిపి తాగితే.. ► కొందరిలో నడుస్తుండగానే చెమటల కారణంగా చెప్పులు/పాదరక్షలు జారిపోతుంటాయి. అలాంటివారు బూట్లు వేసుకోవడం కొంత మెరుగు. అయితే ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన సాక్సులు వాడుతుండాలి. లేకపోతే ఈ చెమటకు తోడు మలినమైన మేజోళ్ల కారణంగా మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి ► రోజుకు రెండుసార్లు స్నానం చేయడం ►మాయిశ్చరైజర్ సబ్బులు వాడేవారిలో చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. ఇలాంటివారు నార్మల్ సబ్బులు వాడటం మంచిది. ►చెమటలు ఎక్కువగా పట్టేవారు దాన్ని తేలిగ్గా పీల్చుకునేలా కాటన్ / నూలు దుస్తులు «ధరించడం మంచిది. ►ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన బట్టలు ధరించాలి. శరీర దుర్వాసన ►శరీర దుర్వాసనను తగ్గించాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. క్యాల్షియం, మెగ్నీషియం కలిసి ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ►అందుకోసం పాలు, క్యారెట్, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకోవాలి. జింక్ తగినంత ఉంటే నోటి, శరీర దుర్వాసన తొలగిపోవడంతోపాటు శరీరం చురుగ్గా పనిచేసేట్టు చేస్తుంది. ►నిమ్మరసం సహజసిద్ధమైన డియోడరెంట్ గా పనిచేస్తుంది. ఇది అధిక చెమటనూ తగ్గిస్తుంది. ►గోధుమగడ్డి జ్యూస్ తాగడం లేదా పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు తదితర ఆహారాలను తినడం వల్ల చెమట ఎక్కువగా పట్టకుండా చూసుకోవచ్చు. ► ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు రెండు టీస్పూన్లు వెనిగర్, టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌లను కలిపి తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది. ► ప్రతిరోజూ ఒక గ్లాసు టమాటా జ్యూస్‌ను తాగడం వల్ల చెమట సమస్య చాలా వరకు తగ్గుతుంది. ►బిగుతుగా ఉండే సింథటిక్ వస్త్రాలు వద్దు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోండి. లో దుస్తుల్ని ఎప్పటికప్పుడు మార్చేయాలి. ► లో దుస్తులను వేడినీటిలో ఉతికి ఎండలో బాగా ఆరబెట్టువాలి. ►రోజుకు రెండుసార్లు కచ్చితంగా స్నానం చేయండి. బాహుమూలల్ని బాగా శుభ్రం చేసుకోండి. అవాంఛిత రోమాల్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ►డియోడరెంట్ వాడవచ్చు. లేదంటే టాల్కమ్ పౌడర్ రాసుకోవడం. ►ఆహారంలో అల్లం, వెల్లుల్లి, మసాలాల్ని బాగా తగ్గించాలి. శరీర ఉష్ణోగ్రతను పెంచే ఆహార పదార్థాలు, పానీయాలు తగ్గించాలి. తులసి, వేప ఆకులను కలిపి పేస్ట్ లా చేపి... స్నానం చేసేముందు ఒళ్లంతా బాగా రుద్దుకోవాలి. ఆపైన గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. కొన్నాళ్ల పాటు ఇలా చేస్తే చెమట సమస్య శాశ్వతంగా తీరిపోయే అవకాశం ఉంది. ►ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా ‘చెమట’లు పట్టిస్తుంటే ఓసారి స్కిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి వారి సలహాను బట్టి మందులు వాడటం ఉత్తమం. అంతేకానీ, అతిగా పట్టించుకున్నా, అసలు పట్టించుకోపోయినా ఇబ్బందే! చెమటలు ఎక్కువగా ఎందుకు పడతాయి? దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. శరీరం లో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయే వాళ్లలో చెమట సమస్య అధికంగా ఉంటుంది. థైరాయిడ్, డయాబెటిస్, హైపర్ టెన్షన్ లేదా కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు కూడా అధిక చెమటకు కారణమవుతాయి. ఎలా బయటపడాలి? ఇంట్లోనే కొన్ని చిట్కాలతో ఈ అధిక చెమట సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. మంచి నీళ్లు బాగా తాగడం, తేలికపాటి పోషకాహారం తీసుకోవడం, తినే ఆహారంలో విటమిన్ బి ఉండేలా చూసుకోవడం. (అరటిపండ్లు, గుడ్లు, గింజలు, ఆకుకూరలు ఈ జాబితాలో వస్తాయి.) ►రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్, టేబుల్ స్పూన్ తేనెను ఓ గ్లాసు నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ►నిమ్మకాయ రసాన్ని బాహుమూలల్లో రుద్దుకుని చల్లటి నీటితో కడిగేయాలి. ►కొబ్బరినూనెను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో రాస్తే అధిక చెమట నుంచి ఉపశమనం లభిస్తుంది. ►అలోవెరా జెల్లో చల్లదనాన్ని అందించే లక్షణం ఉంటుంది. ఈ జెల్‌ను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో నేరుగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ►బేకింగ్ సోడా వల్ల చెమట వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. బేకింగ్ సోడాను కొంచెం నీటిలో కలిసి బాహుమూలల్లో రుద్దుకుని కాసేపటి తరువాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ► బ్లాక్ టీలో ఉండే టానిక్ ఆసిడ్.. రక్తస్రావాన్ని ఆపే లక్షణాలతో పాటు, చెమటను ప్రభావవంతంగా అదుపులో పెడుతుంది. చల్లటి బ్లాక్ టీ లో ఓ శుభ్రమైన బట్టను ముంచి దాంతో బాహుమూలల్లో రుద్దుకోవడం వల్ల అధిక చెమట సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. -
ఎలాంటి వ్యాయామాలు గుండెకు మేలు ??
-
అయితే రిపేర్లు.. లేకుంటే చోరీలు!
సాక్షి నెట్వర్క్/హైదరాబాద్: యువతతోపాటు సాధారణ ప్రజానీకానికి వ్యాయామం పట్ల అవగాహన పెంచడం, వ్యాయామ పరికరాలను అందుబాటులో ఉంచడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘ఓపెన్ జిమ్’లు నిరుపయోగంగా మారిపోతున్నాయి. నిర్వహణ, పర్యవేక్షణ లోపం కారణంగా.. పరికరాలు తుప్పుపట్టి విరిగిపోతున్నాయి. ఉన్న పరికరాల్లో కూడా బేరింగ్స్‌లో గ్రీజు, ఆయిల్ వంటివి వేయకపోవడం సరిగా పనిచేయడం లేదు. ఇక కొన్నిచోట్ల పరికరాలు దొంగల పాలవుతుంటే.. ఇంకొన్నిచోట్ల అసాంఘిక కార్యకలాపాలకు ఓపెన్ జిమ్‌లు అడ్డాలుగా మారుతున్నాయి. లైట్లు, టాయిలెట్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతోనూ జనం ఓపెన్ జిమ్లవైపు రాని పరిస్థితి కూడా ఉంది. దశల వారీగా అన్ని పట్టణాల్లో.. వేలకు వేలు చెల్లించి ప్రైవేటు జిమ్‌లకు వెళ్లలేని వారికి ప్రయోజనం కలిగేలా రాష్ట్రం లో 2018 నుంచి ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మొదట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, తర్వాత 51 పట్టణాల్లో 307 జిమ్‌లను చేపట్టారు. అప్పటి నుంచీ దశల వారీగా.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో ఉన్న పార్కులు, వాకింగ్ ట్రాక్స్ ప్రాంతాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. వీటిలో పరికరాల ఏర్పాటు, నిర్వహణను పూర్తిగా మున్సిపాలిటీలకే అప్పగించారు. మున్సిపాలిటీలు సివిల్ వర్క్, టైల్స్ వంటివి సిద్ధం చేస్తే.. కాంట్రాక్టర్లు వ్యాయమ పరికరాలు అమర్చుతున్నారు. మంచి పరికరాలతో.. ఓపెన్ జిమ్‌లలో ఒక్కోచోట రూ.12 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చించి పరికరాలను అమర్చారు. పలుచోట్ల ఖరీదైన పరికరాలనూ ఏర్పాటు చేశారు. అబ్డామినల్ రైడర్, వర్టికల్ షోల్డర్ పుల్, లెగ్ ఎక్స్టెన్షన్, కర్ల్ మిషన్లు, షోల్డర్ ట్విస్టర్లు, పుల్ చైర్స్, చెస్ట్ పుష్ మిషన్లు వంటివి అమర్చారు. కొత్తలో యువకులతోపాటు నడి వయస్కులు, మహిళలు ఓపెన్ జిమ్‌లకు వచ్చినా.. తర్వాత వాటి నిర్వహణ లోపం, యంత్రాలు పాడైపోవడంతో వారిలో ఆసక్తి తగ్గిపోయింది. చాలాచోట్ల పిల్లల ఆటస్థలాలుగా ఓపెన్ జిమ్‌లు మారిపోయిన పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్లే నిర్వహణ చూడాల్సి ఉన్నా.. జిమ్ పరికరాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. కాంట్రాక్టులో పేర్కొన్న నిబంధనలను బట్టి.. పరికరాలు ఏర్పాటు చేసే కాంట్రాక్టర్లే ఐదేళ్ల వరకు నిర్వహణను కూడా చూడాల్సి ఉంది. పరికరాలు పాడైనా, తుప్పు పట్టినా సదరు కాంట్రాక్టరే కొత్తవి ఏర్పాటు చేయడమో, బాగు చేయడమో చేయాలి. కానీ ఇప్పటివరకు ఎక్కడా ఇది జరిగిన దాఖలాలు లేవు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఓపెన్ జిమ్‌లు మూణ్నాళ్ల ముచ్చటగానే మారిపోతున్నాయి. ఓపెన్ జిమ్‌లను స్థానిక యువతకు గానీ, అసోసియేషన్లకు గానీ అప్పగిస్తే మెరుగైన ఫలితం ఉంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ దిశగా కూడా తీసుకున్న చర్యలు లేవు. ఎక్కడ చూసినా అంతే.. ►నిజామాబాద్ పట్టణంలోని శివాజీనగర్, పాలిటెక్నిక్ కళాశాల, నాగారం, కంఠేశ్వర్ ప్రాంతాల్లో పరికరాలు దెబ్బతిన్నాయి. కామారెడ్డిలోని 5 జిమ్‌లలో నిర్వహణ లేక పరికరాలు చెడిపోతున్నాయని.. గోదాంరోడ్‌లోని జిమ్ రాత్రిపూట మందుబాబులకు అడ్డాగా మారిందని స్థానికులు చెప్తున్నారు. ►మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ మూడ్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది. జడ్చర్ల మున్సిపాలిటీలోని పద్మావతి కాలనీలో రెండేళ్ల క్రితం ఏర్పాటైన ఓపెన్ జిమ్‌ను కొన్ని రోజులుగా మున్సిపల్ అధికారులు మూసివేశారు. వనపర్తిలోనూ రెండు చోట్ల వృధాగా ఉన్నాయి. గద్వాల, అయిజ పట్టణాల్లోనూ ఓపెన్ జిమ్‌ల నిర్వహణ సరిగా లేదని స్థానికులు చెప్తున్నారు. ►మెదక్ జిల్లా కేంద్రంలోని వెంకట్రావ్‌నగర్ కాలనీలో ఉన్న ఓపెన్ జిమ్ నిర్వహణ సరిగా లేదు. సంగారెడ్డి జిల్లాలోనూ చాలా చోట్ల వ్యాయామ పరికరాలు దెబ్బతిన్నాయి. ►కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల పరిధిలో పెద్ద సంఖ్యలో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసినా.. నిర్వహణను గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గోదావరిఖని పీజీ కాలేజీ గ్రౌండ్లో ఓపెన్ జిమ్‌లోని వాకింగ్ ట్రాక్ దెబ్బతిన్నది. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన జిమ్‌లలో పరికరాలు దెబ్బతిన్నాయి. ►నల్లగొండ జిల్లా పరిధిలోని చాలా జిమ్‌లలో పరికరాలు తుప్పుపడుతున్నాయి. దేవరకొండలోని జిమ్‌లలో రబ్బర్ మ్యాట్లు ఊడిపోయి అధ్వానంగా తయారయ్యాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓపెన్ జిమ్‌లో పరికరాలన్నీ చోరీకాగా మిగిలిపోయిన ఇనుప స్తంభాలివి. ఇక్కడ ఎన్టీఆర్ మినీస్టేడియం, దివ్యనగర్ మినీపార్క్, మినీ ట్యాంక్ బండ్లపై లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. కానీ రక్షణ, పర్యవేక్షణ లేక కొద్ది నెలల్లోనే పరికరాలన్నీ ఒక్కొక్కటిగా దొంగల పాలయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో హౌసింగ్ బోర్డు పక్కన ఉన్న పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ఇది. ఇక్కడ 13 వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయగా.. ఐదు పరికరాలు పాడైపోయాయి. మరమ్మతుల కోసమని వాటిని నెల రోజుల కింద తీసుకెళ్లారు. ఇప్పటికీ తీసుకురాలేదు. ఇక జిమ్ కోసం ఏర్పాటు చేసిన మ్యాట్ సరిగా లేదు. నిర్వహణ సరిగా లేకపోవడంతో వ్యాయామం చేయడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు ఓపెన్ జిమ్‌లో ఉన్న ‘త్రీ పర్సన్ వెయిస్ట్ ట్రైనర్’. ఒకేసారి ముగ్గురు కూర్చుని నడుమును అటూ ఇటూ తిప్పుతూ వ్యాయామం చేసే ఈ పరికరంలో సీట్లు చోరీ అయ్యాయి. అంతేకాదు ఇక్కడి స్పిన్నర్ వీల్, ఇతర పరికరాల్లోని భాగాలను ఎవరో ఎత్తుకెళ్లారు. మరికొన్ని పరికరాలు విరిగిపోయాయి. కోదాడ గాంధీపార్కులోని ఓపెన్ జిమ్‌లో పాడైపోయిన పరికరానికి తాళ్లు కట్టి వినియోగిస్తున్న దృశ్యమిది. ఒకవేళ తాళ్లు తెగిపోయి కిందపడితే ఎలాగన్న ఆందోళన వ్యక్తమవుతున్నా.. అధికారులు వీటికి మరమ్మతులు చేయించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడే కాదు సూర్యాపేట జిల్లా పరిధిలోని ఇతర ఓపెన్జిమ్లలోనూ పరికరాలు పాడైపోతున్నాయని అంటున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రైటర్‌బస్తీలోని పంచతంత్ర పార్కు ఓపెన్ జిమ్‌లో వృథాగా పడి ఉన్న చెస్ట్ ప్రెస్సింగ్ పరికరం ఇది. ఇక్కడే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో చాలాచోట్ల ఓపెన్ జిమ్‌లలో పరికరాలు దెబ్బతిన్నాయి. తుప్పుపట్టి విరిగిపోయాయి. ఖమ్మంలోని ఎన్ఎస్పీ కెనాల్ యూపీహెచ్ కాలనీ వాక్‌వేలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు చెప్తున్నారు. సత్తుపల్లిలో జిమ్ పరికరాలు తుప్పుపట్టాయి. బూడిదగడ్డ ఏరియాలోని రాజీవ్ పార్కు, పాల్వంచ, కొత్తగూడెంలలో ఉన్న జిమ్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పర్యవేక్షణ లేక పాడైపోతున్నాయి గోదావరిఖని పీజీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌కు చాలా మంది వస్తున్నారు. కానీ అధికారుల పర్యవేక్షణ లేక పరికరాలు దెబ్బతింటున్నాయి. వాకింగ్ ట్రాక్ దెబ్బతిన్నది. లైట్లు లేవు. టాయిలెట్లను శుభ్రం చేయక దుర్వాసన వెదజల్లుతున్నాయి. – గోపాల్‌రెడ్డి, గోదావరిఖని పట్టించుకునే వారేలేరు నల్లగొండలో భారీ ఖర్చుతో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. కానీ పరికరాలు సరిగా పనిచేస్తున్నాయా, లేదా అని పట్టించుకునే వారు లేరు. జిమ్ పరికరాలు పాడైపోతున్నాయి. వెంటనే మరమ్మతులు చేయించాలి. – వీరబ్రహ్మచారి, నల్లగొండ -
షుగర్, అధికబరువుకు చెక్ చెప్పండిలా!
-
రోజుకు ఎన్ని వేల లీటర్ల గాలిని పీల్చుకొని వదులుతామో తెలుసా?
అధికంగా వాయు కాలుష్యం ఉండే ప్రాంతాల్లోని వారు వేగవంతమైన శ్వాస వ్యాయామాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒక శ్వాస ద్వారా ఎక్కువ మొత్తంలో గాలి పీల్చుకుంటే.. ఆ గాలితోపాటు కాలుష్యాన్నీ ఎక్కువగా పీల్చుకున్నట్టవుతుంది. అందుకే ఈ ప్రాంతవాసులు అలాంటి శ్వాస సంబంధమైన వ్యాయామాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. నిజానికి ఆరుబయట కన్నా ఇంట్లోనే వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. వంట, మరుగుదొడ్ల వినియోగం, పరిసరాల శుభ్రత కోసం వాడే రసాయనాలు, బొద్దింకలు, చెదలకు వాడే పురుగుమందులు, పెంపుడు జంతువులు వంటి వాటివల్ల గాలి బయటకన్నా ఇంట్లోనే ఎక్కువ కలుషితమవుతుంది. ఒకే ఒక్క మేలు ఏంటంటే బయట గాలిలో ఉండే దుమ్ము ఇంట్లో కొంచెం తక్కువగా ఉంటుంది. తలుపులు వేసుకొని ఒక గదిలోపల శ్వాస వ్యాయామం చేస్తున్న వ్యక్తి నిజానికి 2.5, పది మైక్రోమిలియన్ల సైజులోని అతి సూక్ష్మ కాలుష్య కణాలను కూడా పీల్చుకుంటాడు. ఆ కాలుష్యాలను ఊపిరితిత్తులు ఫిల్టర్ చేస్తాయి. ఈ క్రమంలో ఆ కాలుష్యం కొంత ఊపిరితిత్తుల్లో ఉండిపోతుంది. పర్యవసానంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులు, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు రావచ్చు. మన దేశంలో గాలి కాలుష్యం వల్ల మనిషి ఆయుష్షు అయిదు సంవత్సరాలు తగ్గిపోతోంది. ధూమపానాన్ని నిషేధించినట్లే అధిక కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో శ్వాస వ్యాయామాలు చేయడంపై కూడా ఆంక్షలు పెట్టడం మంచిది. ఎత్తయిన అంతస్తుల్లో నివసించే వ్యక్తి సాపేక్షంగా స్వచ్ఛమైన గాలిని పొందుతాడు.. ముఖ్యంగా చలికాలంలో. నేల నుంచి తక్కువ ఎత్తులోని గాలిలో కాలుష్య కారకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంటిపై అంతస్తుల్లో వ్యాయామం చేయడం మంచిది. వాయు కాలుష్యాన్ని ఫిల్టర్ చేయడంలో ముక్కు పాత్ర కీలకమైనది. అతి సన్నని ధూళి కణాలు ముక్కు రంధ్రాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. 10 మైక్రోమీటర్ల (మైక్రోమీటర్ అంటే మీటర్లో పది లక్షల వంతు) కంటే పెద్ద కణాలను మాత్రమే ముక్కు వడపోయగలదు. ఈ క్రమంలో 2.5 మైక్రోమీటర్ల కంటే సూక్ష్మమైన కణాలు ఈ ఫిల్టర్‌కు చిక్కకుండా నేరుగా శరీరం లోపలికి వెళ్లిపోతాయి. సాధారణ శ్వాస సమయంలో మనం ప్రతి శ్వాసతో 500 మి.లీ. గాలిని పీల్చుకుంటాం. నిమిషానికి సుమారు 12 శ్వాసలు తీసుకుంటామనుకుంటే నిమిషానికి 6 లీటర్ల గాలిని పీల్చుకుంటామన్నమాట. అంటే రోజుకు దాదాపు పది వేల లీటర్ల గాలిని ప్రతి ఒక్కరూ పీల్చుకొని వదులుతూ ఉంటాం. ఒక క్రీడాకారుడు సాధారణ వ్యక్తి కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటాడు. మన శరీరాలు సాధారణంగా నిమిషానికి 250 మిల్లీ లీటర్ల ప్రాణవాయువును ఉపయోగిస్తాయి. 2013లో ధూమపానం చేయని వారిపై జరిపిన ఒక అధ్యయనంలో.. యూరోపియన్లతో పోలిస్తే భారతీయుల ఊపిరితిత్తుల పనితీరు 30 శాతం తక్కువగా ఉందని తేలింది. శ్వాస ఆధారిత ధ్యానం లేదా ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు ముఖ్యంగా ఎక్కడ, ఎప్పుడు చేయాలో నేర్పించాలి. ఊపిరితిత్తులు ఎక్కువ శ్వాస సామర్థ్యంతో ఎంత ఆరోగ్యంగా ఉంటే కోవిడ్‌తో మనం అంత సమర్థవంతంగా పోరాడగలుగుతాం. -
బరువు పెరుగుతున్నా.. మానసిక చికాకులను ఆపడానికైనా అదే సరైన ఔషదం
బరువు పెరుగుతున్నట్టు అనిపించినా, మానసిక చికాకులను ఆపడానికైనా వ్యాయామం సరైన ఔషధంగా పనిచేస్తుంది. అందులోనూ కరోనా మహమ్మారి కాలంలో శరీరానికి తగినంత శక్తిని అందించడానికి కూడా వ్యాయామం ఎంతగానో తోడ్పడుతుందని తెలిసిందే. ఇక నేడు, రోజూ 8–9 గంటల పాటు ఉద్యోగం చేసేవారు తమ జీవన శైలిలో విపరీతమైన మార్పులను చవిచూస్తున్నారు. వీటన్నింటికీ సరైన సమాధానం శారీరక శ్రమను కలిగించే వ్యాయామం. వర్క్‌ఫ్రమ్ హోమ్ అయ్యాక బెడ్రూమ్, లివింగ్ రూమ్‌లలో పనిచేసే కొత్త సంస్కృతి వచ్చి చేరింది. ఈ గదులు సౌకర్యంగా అనిపించినా, వారి ఆరోగ్యంపై కనిపించని ప్రభావం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. చురుకుదనానికి.. నిద్రలో ఉన్నప్పుడు కూడా బరువు తగ్గడంలో సహాయపడే రోజువారీ అలవాటుగా వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి. శరీరం తన శారీరక కదలికలను తగ్గించుకున్నప్పుడు రకరకాల సమస్యలు, వ్యాధులు ఎలాంటి హెచ్చరిక లేకుండా వచ్చి చేరిపోతాయి. అప్పుడు శరీరానికి పని లేకుండా గంటలతరబడి కూర్చోవడం వల్ల ఆరోగ్యం ఎలా పాడైందో గ్రహిస్తారు. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత మహిళలు శారీరక శ్రమ తగ్గితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం వల్ల గుండె సమస్యలు, మధుమేహం, కీళ్లనొప్పులు.. మొదలైన ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుకోవచ్చు. నడకతో బలం కండరాలను బలపరచడంలోనూ, నిద్రను మెరుగుపరచడంలోనూ ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది నడక. అంతేకాదు ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అలై్జమర్స్ ప్రమాదాన్ని నివారిస్తుంది. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలపై జరిగిన ఒక అధ్యయనంలో ప్రతిరోజూ 30 నిమిషాల నడక వారి తుంటి పగుళ్ల ప్రమాదాన్ని 40 శాతం తగ్గించిందని గుర్తించారు. హార్వర్డ్ హెల్త్ రీసెర్చ్ ప్రకారం 70 కిలోలు ఉన్న వ్యక్తి 30 నిమిషాల పాటు (గంటకు ఆరున్నర కిలోమీటర్ల వేగంతో) నడిస్తే 167 కేలరీలు ఖర్చు చేస్తారని అంచనా వేశారు. హానికారకాలకు దూరం 30 నిమిషాల పాటు నడవడం సౌకర్యంగా ఉంటే నడకను సాధారణ జాగింగ్‌కు అప్‌గ్రేడ్ చేయవచ్చు. నడక కంటే జాగింగ్ ఇంకాస్త ప్రభావవంతంగా ఉంటుంది. ఇది హానికరమైన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. వాకింగ్లాగానే జాగింగ్ చేయడానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ప్రారంభించడానికి ఒక జత బూట్లు ఉంటే చాలు. బరువును తగ్గించే సైక్లింగ్ సైక్లింగ్ చేయడం వచ్చినా మూడు పదుల వయసు దాటిన తర్వాత దానిని దాదాపుగా మూలన పడేస్తారు మహిళలు. కానీ, 30 ఏళ్ల తర్వాతనే సైక్లింగ్ వలన శరీరానికి మరిన్ని ప్రయోజనాలు అందుతాయి. హార్వర్డ్ హెల్త్ ఉదహరించిన ఒక పరిశోధనా ప్రకారం శారీరక శ్రమ, బరువులో మార్పులను అధ్యయనం చేయడానికి పరిశోధకులు 16 సంవత్సరాల పాటు 18,000 మందికి పైగా మహిళలను గమనించారు. వీరి అధ్యయనంలో వ్యాయామం చేయని మహిళలు సగటున 20 పౌండ్ల బరువు పెరిగారు. అదే రోజూ 30 నిమిషాలు సైక్లింగ్ చేసిన వారు 20 పౌండ్ల బరువు తగ్గారు. దీనివల్ల సైక్లింగ్ మిగతా వాటికన్నా అదనపు ప్రయోజనాలు ఇస్తుందని నిరూపించారు. మెరుగైన ఆనందానికి.. ఈత అనేది వినోదంతో పాటు ఆరోగ్యకరమైన చర్య. ఈత హృదయ స్పందన రేటును పెంచుతుంది. కండరాలను టోన్ చేస్తుంది. శరీరానికి మొత్తం వ్యాయామం అందిస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి, ఇతర రకాల శారీరక శ్రమలు నొప్పిని తీవ్రతరం చేస్తాయి కానీ, ఈత మరిన్ని ప్రయోజనాలు అందిస్తుంది. ఆర్థ్రరైటిస్ ఉన్న వ్యక్తులకు కూడా ఈత ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. నీటి ఆధారిత వ్యాయామాల వల్ల కీళ్ల పనితనం మెరుగుపడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం.. ఇది శారీరక శ్రమకు రూపం మాత్రమే కాదు. మానసిక ఒత్తిడిని నివారిస్తుంది. బరువును తగ్గించడంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. యోగాలోని ధ్యానం అలై్జమర్స్ రాకుండా నిరోధించడమే కాదు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇతరులతో పోల్చితే యోగా చేసే వ్యక్తులు 43 శాతం తక్కువ వైద్య సేవలను ఉపయోగించుకుంటారని అధ్యయనాలు చూపుతున్నాయి. -
కందిరీగ నడుము కావాలా.. ఫ్యాటీ బెల్లీకి చెక్ చెప్పండిలా
సాక్షి, హైదరాబాద్: ఓవర్ వెయిట్, ఫ్యాటీ బెల్లీ ఇపుడివే చాలామందిని వేధిస్తున్నపెద్ద తలనొప్పి. మారుతున్న జీవన శైలి, కనీస వ్యాయామం లేకపోవడం, కంప్యూటర్‌కు అతుక్కుపోయే ఉద్యోగాలతో ఊబకాయానికి తోడు పొట్ట, నడుం చుట్టూ కొవ్వు పేరకుపోయి పెద్ద సమస్యగా మారిపోతోంది. దీంతో వయసుతో నిమిత్తంలేకుండా కుండలాగాపెరిగిన పొట్ట ముందుకొచ్చి మరీ వెక్కిరిస్తోంది. అంతేనా నచ్చిన డ్రెస్ వేసుకోవడానికి లేదు. బాడీషేప్ మారిపోయి అందవికారంగా ఉన్నామనే ఇన్ఫీరియారిటి. మరి ఈ సమస్యల్నింటికి పరిష్కారం ఏమిటో తెలియాలంటే.. స్లిమ్ అండ్ ట్రిమ్గా ఉండాలంటే ఈ వీడియో చూడాల్సిందే.. -
ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు
కెనడా: మీరు గంటలో ఎంత బరువును ఎత్తగలరో చెప్పగలరా అనంగానే ఆలోచనలో పడతాం. కానీ కెనడాకు చెందిన ఈ అథ్లెట్ కేవలం ఒక గంట వ్యవధిలో దాదాపు 13 వేల పౌండ్లు (5వేల కిలోగ్రాములు) బరువును ఎత్తి సరి కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. విన్నిపెగ్‌కు చెందిన నోలన్ డి లియోన్ ఫిట్నెస్ సెంటర్లో ఒక గంట పాటు 70-పౌండ్ల కెటిల్‌బెల్‌ను ఉపయోగించి టర్కిష్ వ్యాయామాలు చేశాడు. (చదవండి: చూడటానికి పంది రూపు... కానీ అది దూడ) అయితే ఇది సగటు ఆఫ్రికన్ ఏనుగు బరువు కంటే 5,900 కిలోగ్రాములు ఎక్కువ. ఈ మేరకు డి లియోన్ మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచటమే కాక మానిటోబాలోని మూడ్ డిజార్డర్స్ అసోసియేషన్‌కు మద్దతు ఇవ్వడం కోసమే ఈ రికార్డ్ నెలకొల్పడానికి ప్రయత్నించానని చెప్పాడు. అంతేకాదు ఒక ఫోటోగ్రాఫర్, ఇద్దరు న్యాయమూర్తుల సమక్షంలో సెషన్ మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ క్రమంలో అతను 184 వ్యాయామాలు పూర్తి చేశాడు. పైగా న్యాయనిర్ణేతలలో ఒకరు వైట్‌బోర్డ్‌పై ఒక్కో వ్యాయామాన్ని నమోదు చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు డి లియోన్ మూడ్ డిజార్డర్స్ అసోసియేషన్ ఆఫ్ మానిటోబా కోసం సుమారు మూడు వేల డాలర్లుకు పైగా సేకరించారు. అంతేకాదు ఈ ఏడాది మేలో కెనడియన్ క్రిస్ కాక్స్ నెలకొల్పిన టర్కిష్ గెట్-అప్‌తో(బరువులు ఎత్తే వ్యాయమం) 4,868 కిలోలు భారీ బరువు ఎత్తి నెలకొల్పిన గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా అధిగమించడం విశేషం. అంతేకాదు దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు డి లియోన్‌ను ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: చనిపోయిన సోదరుడి అస్థిపంజరంతోనే కలిసి ఉంటున్న సోదరులు) -
జిమ్ చేసి కండలు పెంచితే చాలా? గుండె కోసం ఏం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: గత 20 ఏళ్లలో యువతలో గుండెపోటు 200 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో మరణించేవారిలో దాదాపు 50శాతం మంది భారతీయులే. మరీ ముఖ్యంగా కోవిడ్-19 కారణంగా కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతుండటం గమనార్హం. గుండె సమస్యల కారణంగా 40-50 సంవత్సరాల వయస్సు వారే ఎక్కువగా చనిపోతున్నారు. ఫిట్‌గా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు కనిపిస్తూ కూడా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవలి కాలంలో నటుడు సిద్ధార్థ్ శుక్లా , నటి మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ వంటి ప్రముఖుల మరణాలే ఇందుకు ఉదాహరణ. ఆహార అలవాట్లు జీవనశైలిలో మార్పులే కారణమని అర్థం చేసుకోవడం ముఖ్యం. మన శరీరంలో అతి కీలకమైన గుండెకు ఒక్కసారి సమస్య వచ్చిందంటే.. దాన్ని సరి చేయడం అంత తేలిక కాదు. అందుకే నివారణే ముఖ్యం. రోజులు, నెలలు సంవత్సరాలబడి నిమిషానికి 70-80 సార్లు కొట్టుకునే గుండెను లైట్ తీసుకుంటే మూల్యం చెల్లించక తప్పదు. మన వాహనాల ఇంజీన్లను ఎలారిపేర్ చేస్తామో శుభ్రం చేసుకుంటామో,దాని కోసం ఎంత శ్రద్ధ పెడతామో మన హృదయంపై అంతకంటే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. టైం లేదు లాంటి కుంటి సాకులు చెబితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. టీవీ చూసేందుకు, పేపర్ చదివేందుకు, స్మార్ట్‌ఫోన్ కోసమే కాదు వ్యాయామంకోసం కూడా కొంత సమయాన్ని వెచ్చించాల్సిందే. గుండె జబ్బులకు ఒక ముఖ్యమైన కారకం ఒత్తిడి. తీవ్రమైన ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందని. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ధమనుల లోపలి పొరల్లో వాపుకు కారణమవుతుంది. అలాగే రక్తం గడ్డకట్టడంతో పాటు గుండెపోటుకు దారితీస్తుందని ప్రఖ్యాత కార్డియాలజిస్ట్‌లు చెబుతున్నారు. పోటీ ప్రపంచంలో కాలంతో పరిగెడుతున్న క్రమంలో జీవనశైలిలో స్పష్టమైన మార్పులతోపాటు ధూమపానం పెరుగుదలలాంటి ముఖ్యమైన మార్పులను మనం మర్చి పోకూడదు, అంటే వేళా పాళా లేని ఆహార అలవాట్లకు తోడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్, విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు, తీవ్ర ఒత్తిడి, డెడ్లైన్లు. దీనికి తోడు కాలుష్యం ముఖ్యంగా మెట్రో నగరాల్లో తన ప్రభావాన్ని భారీగానే చూపుతోంది. కాలుష్యంతో ధమనులవాపు, గుండెపోటు ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రతి భారతీయుడు యూరోపియన్ల కంటే మూడు రెట్లు, చైనీయుల కంటే ఆరు రెట్లు ఎక్కువ, జపనీస్ కంటే ఇరవై రెట్లు ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారు. అందులోనూ మధుమేహం ఉన్న వ్యక్తికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఆరు రెట్లు ఎక్కువ. ఆరోగ్యకరమైన గుండె కోసం వారానికి ఐదు సార్లు రోజుకు 45 నిమిషాలు వేగంగా నడవడంవల్ల గుండెపోటు వచ్చే అవకాశాలను 20శాతం తగ్గించవచ్చు. ఒకేసారి 45 నిమిషాలు సాధ్యం కాకపోయినా, ఉదయం 25 నిమిషాలు, సాయంత్రం 25 నిమిషాలుగా కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఒత్తిడిని జయించి, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మంచి వ్యాయామం కావాలి. గుండె ఆరోగ్యానికి నడక ఉత్తమమైంది. వాకింగ్, సైక్లింగ్‌తోపాటు యోగా, ఏరోబిక్స్‌ను మిక్స్ చేసి ఎక్సర్సైజ్ చేయవచ్చు. లిఫ్ట్ బదులు, మెట్లు ఎక్కండి. గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఇది మరో బెస్ట్ ఐడియా. టీ విరామాన్ని వ్యాయామ బ్రేక్‌గా మార్చుకోవడం మరో మార్గం. ఇందుకోసం ప్రతి ఆఫీసులో ట్రెడ్మిల్ ఏర్పాటు చేసుకోండి. అయితే రోజూ 10 నుండి -20కి.మీ రన్నింగ్ లేదా జాగింగ్‌కి చేస్తే గుండెకు, శరీరానికి హానికరం ఇది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. జిమ్‌లో విపరీతంగా కసరత్తు చేసి చక్కటి బాడీబిల్డింగ్ పెంచుకున్నంత మాత్రాన గుండె ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు అనేది గమనించాల్సిన ముఖ్య అంశం. 25 శాతం గుండె జబ్బులకు ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదు. 30-40శాతం మంది ఎలాంటి బ్లాక్స్ లేకుండానే గుండెపోటుకు గురవుతున్నారు. కుటుంబంలో ఎవరికైనా 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో గుండెపోటు వచ్చినా, ఆకస్మిక మరణం సంభవించినా ఆయా కుటుంబాల్లోని వారికి గుండె సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. అలాగే మధుమేహం, రక్తపోటుతో బాధపడేవారు, ధూమపానం అలవాటు ఉన్నవారు రెగ్యులర్ చెకప్స్ చేయించు కోవాలి. ఇది 20 సంవత్సరాల వయస్సులోనే మొదలు కావాలి. 30 సంవత్సరాల వయస్సులోపు వారు ప్రతి సంవత్సరం బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేయించుకోవాలి. -
కసరత్తు ఎక్కువైనా ప్రమాదమేనా..!
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇక్కడ దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే.. 40 ఏళ్ల వయసులో సిద్థార్థ్ గుండె పోటుతో మరణించడం కలవరపెడుతుంది. సాధారణంగా శారీరక శ్రమ లేకపోతే గుండెపోటు సమస్య తలెత్తుందని వైద్యులు చెబుతారు. అలాంటిది ఫిట్నెస్ ఫ్రీక్ అయిన సిద్థార్థ్ గుండెపోటుతో చనిపోవడం ఏంటనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. దీనికి నిపుణులు చెప్పే సమాధానం ఏంటంటే అతిగా వ్యాయామం చేయడం. అవును. అతిగా వ్యాయాయం చేయడం వల్లనే సిద్ధార్థ్ గుండెపోటు బారిన పడ్డాడు అంటున్నారు వైద్యులు. సాధారణంగా ప్రతి మనిషికి 30-45 నిమిషాల వ్యాయామం చాలు. కానీ సినీ ఇండస్ట్రీలో ఉన్న వారు గంటల తరబడి జిమ్‌కే పరిమితం అవుతారు. సిద్ధార్థ్ కూడా రోజు 3 గంటల పాటు వ్యాయామాలు చేసేవాడు. ఇంత అతి వ్యాయామం వద్దని డాక్టర్లు గతంలోనే సిద్ధార్థ్‌కు సూచించినప్పటికి అతడు వైద్యుల మాట వినలేదు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. (చదవండి: డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా?) అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం అతిగా వ్యాయామం చేయడం వల్ల సడెన్ కార్డియాక్ అరెస్ట్, సడెన్ కార్డియాక్ డెత్ వచ్చే అవకాశం పెరుగుతుంది వ్యాయామం చేసే సమయం మధ్యస్థంగా ఉండటం వల్ల ఫిట్‌గా ఉండటమే కాక మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని సూచించింది. ఈ క్రమంలో అతిగా వ్యాయామాలు చేసే వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. అలానే వ్యాయామం ఫిట్నెస్ యాప్‌ల మీద, సొంత నిర్ణయాల మీద ఆధారపడి కాకుండా.. నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిదని సూచిస్తున్నారు. -
ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్‌గా..
చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ చాలా త్వరగా పెరగాలనుకుంటారు. కాని పెద్దయ్యాక ఎప్పటికీ పాతికేళ్లవారిగానే ఉండిపోవాలనుకుంటారు. ఇది సహజం. ఎంతగా పెరిగినా కొందరిలో వయసు అంతగా కనిపించదు. అందరిలోనూ అలాగే జరగడానికి ఈ కింది పేర్కొన్న సూచనలు చాలావరకు ఉపకరిస్తాయి. పాటించి చూస్తే ప్రయోజనం ఉంటుందంటున్నారు వైద్యనిపుణులు. వృద్ధాప్య లక్షణాలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో ప్రధానమైనది జన్యు సంబంధమైన కారణాలు. ఇది తప్పించలేని కారణం. అయితే మిగతా కారణాలను ఈ కింది విధంగా చెప్పుకోవచ్చు. అవి... ♦ సాంక్రమిక రోగాలు (ఇన్ఫెక్షియస్ డిసీజెస్) ♦ ఆహార లోపాలు (న్యూట్రిషనల్ డెఫిషియెన్సీస్) ♦ హార్మోన్లలో మార్పులు. ఈ కారణాల్లోని చాలావాటిని మనం చక్కదిద్దుకోగలం. ఇదెలాగో చూద్దాం. ► ఆహారం : ఆహారం అనగానే మనం రోజూ రుచి కోసం, జిహ్వచాపల్యం కోసం తినే ఏది పడితే అది కాదు. అన్ని పోషకాలూ సమపాళ్లలో ఉండే ఆరోగ్యకరమైన ఆహారం. అందునా మరీ ఎక్కువ కారాలూ, మసాలాలూ, ఉప్పు లేని బ్లాండ్ డైట్. ఇలాంటి ఆహారం తీసుకునేవారు చాలాకాలం పాటు యౌవనంగా ఉంటారు. ఛదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా.. కొబ్బరి ప్రయత్నించండి! ►ఆకుపచ్చని ఆకుకూరలు : మనం తీసుకునే ఆహారంలో ముదురాకుపచ్చటి రంగులో ఉండే ఆకుకూరలు కాస్తంత ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి. వీటన్నింటిలోనూ చాలాకాలం పాటు దేహాన్ని ఆరోగ్యంగా ఉంచగల అన్ని రకాల విటమిన్లు, ఖనిజలవణాల్లాంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ ప్రతి కణపు ఆరోగ్యాన్ని చిరకాలం కొనసాగేలా చేయగలవు. అంతేకాదు.. ఎముకలను పటిష్టపరచడం, రక్తనాళాల్లో రక్తం సాఫీగా పయనించేలా చేయడం, మంచి చూపు, కొలస్ట్రాల్ తగ్గేలా చేయడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఇవన్నీ యౌవనాన్ని నిలుపుకునేందుకు దోహదపడేవే. చదవండి: ఆడ దోమలు మాత్రమే ఎందుకు కుడతాయో తెలుసా?! ►మంచి కొవ్వులు : చాలామంది కొవ్వులు అనగానే వాటిని నిరసించేలా చూస్తారు. కానీ కొవ్వులు చాలా కీలకమైన కార్యకలాపాలు నిర్వహిస్తాయి. దేహానికి హానిచేసే జంతుసంబంధిత కొవ్వులైన ట్రాన్స్‌ఫ్యాట్స్ కాకుండా బాదం, అవకాడో వంటి నట్స్ నుంచి లభ్యమయ్యే కొవ్వులన్నీ కీలకమైన జీవక్రియల్లో పాలుపంచుకుంటాయి. అంతేకాదు... కీలకమైన అవయవాలన్నింటిపైనా ఆరోగ్యకరమైన రీతిలో అలముకుని, వాటిని రక్షిస్తూ చాలాకాలం పాటు అవి దెబ్బతినకుండా చూస్తాయి. అవెంతకాలం నిరాటంకంగా పనిచేస్తాయో మన దేహం కూడా అంతేకాలం యౌవనంగా కనిపిస్తుంటుంది. ►నిద్ర : రోజులో కనీసం ఏడు నుంచి ఎమినిది గంటల పాటు మంచి ఆరోగ్యకరమైన నిద్రతో యౌవనంగా కనిపిస్తుంటారు. ►సానుకూలమైన ఆలోచనలు (పాజిటివ్ థాట్స్) : ప్రతి విషయాన్నీ సానుకూలమైన దృక్పథంలో చూడటం అన్నది చాలా రకాల ఒత్తిళ్లను నివారిస్తుంది. ఆశాభావంతో ఉన్నప్పుడు చాలా పనులు కూడా సానుకూలంగానే జరుగుతాయి. దాంతో సంతోషం చేకూరి ఒత్తిడి తొలగుతుంది. సరిగ్గా ఈ అంశమే ఏజింగ్ ప్రక్రియకు అడ్డుకట్ట వేస్తుంది. ►ప్రోబయాటిక్ ఫుడ్ : అన్ని రకాల ఆహారాలను మన శరీరానికి అందించి, ఆరోగ్యాన్ని కాపాడేది మన జీర్ణవ్యవస్థ. ఆ జీర్ణవ్యవస్థ ఆరోగ్యం బాగుంటే దేహమంతా బాగున్నట్టే. దాని ఆరోగ్యంగా ఉంచే ఆహారమే ‘ప్రోబయాటిక్ ఫుడ్’. మన జీర్ణవ్యవస్థలో ప్రతి చదరపు అంగుళం స్థలంలో మనకు మేలు చేసే కోటాను కోట్ల మంచి సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జీర్ణప్రక్రియ నిర్వహణకు తోడ్పడతాయి. ఆ ఆరోగ్యం చెక్కుచెదరకుండా ఉండటానికి పెరుగు, మజ్జిగ, పులిసేందుకు అవకాశమున్న ఇడ్లీ, దోసె వంటివి ఉపయోగపడతాయి. ► దానిమ్మ వంటి మంచి పండ్లు: పండ్లలో దానిమ్మను ‘సూపర్‌ఫుడ్’గా చెప్పవచ్చు. హానికరం కాని రీతిలో తగినంత పాళ్లలోనే చక్కెర, మంచి రుచి, ఇతరత్రా అన్ని రకాల ఖనిజలవణాలు వంటి వాటితో హైబీపీని నివారిస్తూ, గుండెను చాలాకాలం పాటు ఆరోగ్యకరమైన రీతిలో కాపాడుతుంది. చక్కెరపాళ్లు ఒకింత తక్కువగా ఉండే జామ, బొప్పాయి, నేరేడు వంటి పండ్లన్నీ మంచివే. వీటిని కాస్తంత ఎక్కువగా తీసుకుంటూ... వాటితోపాటు కేవలం అప్పుడప్పుడు మాత్రమే చక్కెరలు ఒకింత ఎక్కువగా ఉండే మామిడి, సపోటా వంటివి రుచికోసమే పరిమితంగా తీసుకుంటూ రుచుల సమతౌల్యం పాటిస్తే యౌవనం చాలాకాలం పాటు నిలకడగా ఉంటుంది. ► విటమిన్ డి : దీన్ని కేవలం ఓ విటమిన్‌లా చూడటానికి వీల్లేదు. ఎముకల ఆరోగ్యం మొదలుకొని, వ్యాధి నిరోధక శక్తి వరకు ప్రతి అంశంలోనూ దీని ప్రాధాన్యం ఎంతో ఉంటుంది. ఇది స్వాభావికంగా సూర్యరశ్మిలో దొరుకుతుందన్నది తెలిసిందే. అందుకే ఆరుబయట లేత ఎండలో ఉండటం వల్ల విటమిన్–డి దొరకడంతో పాటు ఆ వాతావరణంలో కాలుష్యం లేని వాయువులు పీల్చడం, ఆహ్లాదకరమైన రీతిలో ప్రకృతిని ఆస్వాదించడం.. ఇవన్నీ బహుముఖమైన ప్రయోజనాలు ఇవ్వడం ద్వారా మనిషిని యౌవనంగా ఉంచుతాయి. ► మంచి వ్యాయామం : మరీ అంతగా శారీరక శ్రమ పడకుండా ఉండేలా... అలాగే దేహం అలసిపోయేలా మంచి వ్యాయామాలు చేయడం వల్ల ప్రతి కణానికీ అవసరమైన ఆక్సిజన్ అందుతుంది. దాంతో కణాలన్నీ చాలాకాలం పాటు ఆరోగ్యంగా ఉంటాయి. అది జరగడం వల్ల మనిషి పూర్తిగా ఆరోగ్యంగా కనపడుతూ చాలాకాలం పాటు యౌవనంగా ఉండగలుగుతాడు. ► మంచి స్నానం : మంచి వ్యాయామం తర్వాత అవసరమైనది మంచి స్నానం. అంటే ఆహ్లాదకరమైన రీతిలో ప్రతి అవయవం శుభ్రమయ్యేలాంటి స్నానం అన్నమాట. ఇలాంటి స్నాన ప్రక్రియలో మన చర్మంపైన, దేహంపైన ఉన్న మృతకణాలన్నీ తొలగిపోతాయి. దాంతో బయటకు కనిపించేవన్నీ ఆరోగ్యకరమైన తాజా కణాలు మాత్రమే. అందుకే స్నానం తర్వాత వ్యక్తులు పరిశుభ్రంగా మాత్రమే కాదు... కొద్దిసేపు తేజోవంతంగా కూడా కనిపిస్తుంటారు. ►ఒత్తిడిని నివారించడం: ఇటు దేహంలో, అటు మనసుపైనా ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ అది శారీరకంగా ప్రభావం చూపెడుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ఎలాంటి ఒత్తిడీ లేని కొందరిని పరిశీలించినప్పుడు ఇది చాలావరకు వాస్తవమన్నది మనలో చాలామందికి తెలిసిన విషయమే. అందుకే ఒత్తిడికి ఎంతగా నివారిస్తే దేహం కూడా అంతే యౌవనంతో ఉంటుంది. ► ధ్యానం (మెడిటేషన్) : ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం (మెడిటేషన్) చేయడం వల్ల శరీరంలోని చాలా వ్యవస్థలు తేలిగ్గా మారతాయి. దాంతోపాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవక్రియల వేగం తగ్గుతుంది. మనసుకు ప్రశాంతత, జీవక్రియల వేగం తగ్గడం... ఈ రెండు అంశాలు వయసుకు కళ్లెం వేయడానికి ఉపకరిస్తాయి. పరిహరించాల్సినవి : పైన పేర్కొన్నవన్నీ పాటించాల్సినవి. అయితే పరిహరించాల్సినవీ కొన్ని ఉన్నాయి. అవే... చక్కెరలు, పొగతాగడం, ఆల్కహాల్... ఇతరత్రా వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇవన్నీ చర్మాన్ని బిగుతుగా ఉంచే కణాలను వదులుగా అయ్యేలా చేసేవే. దాంతో వృద్ధాప్య చిహ్నాలైన ముడుతలు, రింకిల్స్ వంటివన్నీ వయసు కంటే చాలా ముందుగానే వచ్చేస్తాయి. -
కోవిడ్ తర్వాత వాకింగ్ బెటరా? జాగింగ్ బెటరా?.. క్యాలరీల ఖర్చు ఎలా?
కరోనా తర్వాత వ్యాయామం ఆవశ్యకతను అందరూ చెబుతున్నారు. కానీ అధిక శ్రమతో కూడిన వ్యాయామం కంటే వాకింగ్ బెటర్ అంటున్నారు నిపుణులు. ‘కోవిడ్ ప్రధానంగా ఊపిరితిత్తులనూ, గుండెనూ దెబ్బతీస్తుంది. కాబట్టి... కరోనా అనంతర వ్యాయామం అంత కఠినంగా ఉండకూడదు’ అన్నదే వారి అభ్యంతరం. ఈ నేపథ్యంలో వ్యాయామ నిపుణులు, జీవనశైలి డాక్టర్లు ‘నడక’ను ఉత్తమమైన వ్యాయామంగా సూచిస్తున్నారు. కొందరికి ‘నడక’ ఓ వ్యాయామంగా రుచించదు. ఎందుకంటే దానితో త్వరగా కండరాలు ఫిట్‌గా అయినట్లు అనిపించకపోవడం, బరువు తగ్గడమనే ఫలితం అంత వేగంగా కనిపించకపోవడం లాంటివి వారిని ‘నడక’వైపునకు నడిపించవు. అయితే కోవిడ్ తర్వాత ‘నడకే’ అత్యంత ఉత్తమమైన వ్యాయామమనీ, అది మిగతా వ్యాయామాలకు ముందుమెట్టు అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం. ప్రశ్న: వ్యాయామం ఫలితాలు కండలు తిరగడం, కండరాలు బలంగా మారడం రూపంలో కనిపిస్తాయి. ఫిట్నెస్ తెలుస్తుంది. అయితే ఎంతగా నడిచినా ఆ ఫలితాలు ‘నడక’లో కనిపించవు కదా? జవాబు: నడకతో చక్కటి ఫిట్నెస్ ఫలితాలు కనిపిస్తాయి. వాకింగ్ తర్వాత సాధించిన ఫిట్నెస్ను పరీక్షించేందుకు పరీక్ష పెట్టుకోవచ్చు. అదేమిటంటే.. నడక మొదలు పెట్టడానికి ముందు 1 కిలోమీటర్ నడవడానికి ఎంత టైమ్ పట్టిందో, అదెంత సులువుగా జరిగిందో చూసుకోవాలి. కనీసం మూడు వారాల పాటు ‘నడక’ వ్యాయామం చేశాక... అదే కిలోమీటర్ నడవడానికి ఎంత సమయం పడుతోంది చూసుకోవచ్చు. సాధించిన ఫిట్నెస్ తెలుసుకోడానికి ఈ కింది ఛార్ట్ ఉపయోగపడుతుంది. ► వయసు 30 లోపు అయితే 1 కిలోమీటర్ నడకకు 10 నిమిషాలు చాలు. ► 30 నుంచి 39 లోపు... 1 కిలోమీటర్ నడకకు 12 – 13 నిమిషాలు. ► 40 నుంచి 49 లోపు... 1 కిలోమీటర్ నడకకు 15 నిమిషాలు. ► 50 నుంచి 69 లోపు... 1 కిలోమీటర్ను 18 నిమిషాల్లో నడిస్తే మంచి ఫిట్నెస్ ఉన్నట్లే. ► 70 – అంతకు పైబడ్డవారు 20 – 25 నిమిషాల్లో 1 కి.మీ. నడిస్తే మంచి ఫిట్నెస్తో ఉన్నట్టు లెక్క. ► కండరాలు పైకి కనిపించకపోయినా... స్టామినా, సామర్థ్యం ఇలా చక్కగా కనిపిస్తాయి. ప్రశ్న: రన్నింగ్‌తో పోలిస్తే వాకింగ్‌లో క్యాలరీలు అంతగా బర్న్ కావు కదా. జవాబు : అవును... నడక కంటే రన్నింగ్‌లో బర్న్ అయ్యే క్యాలరీలు ఎక్కువే. కానీ ఒకరు ఎంత దూరం పరుగెత్తగలరు? ఆ పరుగును ఎంత సేపు కొనసాగించగలరు. అదే నడక అయితే... ఒక నిర్ణీత వేగంతో ఎంతదూరమైనా ఆగకుండా నడవవచ్చు. అసలు వాస్తవాన్ని పరిశీలిద్దాం. ఒక గంట పాటు జాగింగ్ చేస్తే 700 క్యాలరీలు బర్న్ అవుతాయి. అదే బ్రిస్క్ వాకింగ్‌లో (వేగంగా నడిస్తే) గంటలో 600 క్యాలరీలు బర్న్ అవుతాయి. కానీ... ఓ స్థాయి ప్రాక్టిస్, ఫిట్నెస్ తర్వాత... ఆ నడకను ఎంతసేపైనా అలాగే కొనసాగించవచ్చు. ఫలితంగా సమయం పెరుగుతున్నకొద్దీ ఇలా వాకింగ్‌తో బర్న్ అయ్యే క్యాలరీలే ఎక్కువ. ప్రశ్న : బాగా పెద్ద వయసు వారు నడక అనే ఈ వ్యాయామాన్ని చేయడం మంచిదేనా? పైగా కరోనా వచ్చి తగ్గాక వారిలోని ఫిట్నెస్, వ్యాయామ సామర్థ్యాలు మరింత తగ్గుతాయి కాబట్టి ఆ వయసువారికి నడక మంచిదేనా? జవాబు : ఎంత పెద్ద వయసు వారైనా... వారు నడవగలిగే శక్తిసామర్థ్యాలతో ఉన్నప్పుడు నడక వ్యాయామాన్ని కొనసాగించడమే మంచిదే. అది వారి గుండె పనితీరు సామర్థ్యాన్ని పెంచి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒంట్లోని చక్కెర పాళ్లను అదుపులో ఉంచుతుంది. ఒళ్లునొప్పులను తగ్గిస్తుంది. నడకలో తమ వయసువారిని కలిసి కాసేపు సంభాషించడం, పిచ్చాపాటీ మాట్లాడటం వంటి ప్రక్రియల వల్ల సామాజిక బంధాలు పటిష్టంగా మారవడంతో పాటు, వారి మానసిక ఆరోగ్యమూ బాగుంటుంది. ప్రశ్న: వాకింగ్ అంటే ఉదయం పూటేనా? జవాబు: నడక ఏ సమయంలోనైనా మంచిదే. సాధారణంగా అందరూ ఉదయం పూట నడక తర్వాత రోజువారీ పనుల్లో మునిగిపోతారు. ఈ సౌలభ్యం కోసమే ఉదయం వేళలను ఎంచుకుంటారు. నడవాలనిపించినప్పుడు ఏ వేళల్లో నడిచినా ఫలితాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే పగటివేళ సూర్యకాంతిలో నడిస్తే... అదనంగా విటమిన్–డి కూడా దొరుకుతుంది. ప్రశ్న: నడుస్తున్నప్పుడు ఎంతగా చెమట పడితే అంతగా కొవ్వు కరుగుతుందా? జవాబు : చెమట పట్టడం విషయంలో ప్రతివ్యక్తికీ తేడాలుంటాయి. కొందరికి కొద్దిపాటి శ్రమకే చాలా త్వరగా, చాలా ఎక్కువగా చెమటలు పట్టవచ్చు. మరికొందరిలో దీనికి భిన్నంగా ఉండవచ్చు. ఎంత వేగంగా /ఎంత దూరం నడిస్తే అన్ని క్యాలరీలు దగ్ధమై కొవ్వు తగ్గుతాయి. అంతేతప్ప... చెమటకూ, కొవ్వుకూ సంబంధం ఉండదు. ప్రశ్న: ఎంత వాకింగ్ చేసినా ఓ పట్టాన బరువు తగ్గదు. వేగంగా బరువు తగ్గాలంటే బరువైన వ్యాయామాలు మంచివి కదా. జవాబు : బరువులెత్తడం, బరువైన వ్యాయామాలు చేయడం వల్ల వేగంగా బరువు తగ్గినట్లుగా అనిపించవచ్చు. కానీ వ్యాయామంలో కొద్దిగా గ్యాప్ వచ్చినా మళ్లీ వేగంగా బరువు పెరగవచ్చు. కానీ వాకింగ్‌తో ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గుతుంది. ప్రతి రోజూ 40 నిమిషాలకు తగ్గకుండా వారంలో కనీసం 5 రోజులైనా నడుస్తూ ఉంటే... అనారోగ్యకరమైన కొవ్వు కరుగుతుంది. తప్పక బరువు తగ్గుతారు. నడక సహాయంతో బరువు తగ్గాలనుకునేవారు మంచి సమతుల ఆహారమూ తీసుకోవడం అవసరం. ఇలాంటివారు కార్బోహైడ్రేట్స్, కొవ్వులున్న ఆహారాన్ని తగ్గించి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. అలాగే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా బరువు తగ్గడం అన్నది హైబీపీ నివారణకూ, గుండెజబ్బుల అదుపునకూ, మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రశ్న : ఇప్పుడు కరోనా వచ్చి తగ్గినవారు ఆరుబయట నడవటం కంటే ట్రెడ్మిల్ మీద నడవడమే మంచిదా? జవాబు: ఒకే వేగంతో ఒకే రకమైన సర్ఫేస్ మీద నడవడానికి ‘ట్రెడ్మిల్’ ఉపయోగపడుతుంది. ఎగుళ్లూ దిగుళ్లూ లేకుండా చూస్తుందంతే. నడక ఎక్కడైనా మంచిది. అయితే ఆరుబయటి ఉపరితలం అన్నిచోట్లా, అన్నివేళలా అంతే సమంగా ఉండకపోవచ్చు. వాతావరణం ఆహ్లాదంగా, ఆరోగ్యకరంగా బాగా ఉండి సర్ఫేస్ సమతలంగా ఉంటే అది ట్రెడ్మిల్ కంటే మంచిదే. కానీ ఇప్పుడున్న కరోనా నేపథ్యంలో ఆరుబయటి వాతావరణం అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఇంకా కొంతకాలం పాటు ట్రెడ్మిల్ అయితేనే మంచిది. ఎక్కడ నడవాలన్నది కేవలం పర్సనల్ ఛాయిస్. డా. సుధీంద్ర ఊటూరిలైఫ్స్టైల్ మెడిసిన్ స్పెషలిస్ట్ -
ఎక్సర్సైజ్ చేయడానికి టెర్రాస్ మీదకు వెళ్లి .. మాటల్లో పడి..
తిరువనంతపురం: ఉదయంపూట తన సోదరుడితో కలిసి అపార్ట్‌మెంట్‌పై వ్యాయామం చేస్తున్న యువతి.. అనుకోకుండా అదుపుతప్పి కిందపడింది. ఈ దుర్ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కొచ్చిలోని చిత్తోర్‌రోడ్డులో ఉన్న ఒక అపార్ట్మెంట్లో 18 ఏళ్ల ఐరిస్‌రాయ్, ఆమె సోదరుడు అలస్‌తో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో వీరిద్దరు కూడా తమ అపార్ట్మెంట్లోని భవనం పైకి వెళ్లి ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేస్తుంటారు. కాగా, ప్రతిరోజు మాదిరిగానే.. ఐరిస్‌రాయ్, తన సోదరుడితో కలిసి ఈ రోజు (గురువారం) ఉదయం వ్యాయామం చేయడానికి టెర్రాస్ పైకి వెళ్లింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి అక్కడ కొంచెం బురదగా ఉంది. ఆ టెర్రాస్‌కు పక్కన సెఫ్టీ వాల్స్‌కూడా లేదు. ఈ క్రమంలో.. ఆమె వ్యాయామం చేసి అలసిపోయి.. అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది. సోదరుడితో కలిసి మాటల్లో పడి .. ఎత్తైన ప్రదేశంలో ఉన్న విషయాన్ని మర్చిపోయింది. దీంతో ఒక్కసారిగా.. 9వ అంతస్తు నుంచి ఐరిన్ రాయ్ కిందకు జారిపడింది. ఈ సంఘటనతో అక్కడి వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమె అరుచుకుంటూ.. కిందపడింది. ఆమె ముక్కు,నోటిలో నుంచి రక్తం బయటకు వచ్చింది. దీంతో, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. యువతి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని కొచ్చి పోలీసు అధికారి విజయ్ శంకర్ తెలిపారు. -
వ్యాయామం చేయడం బద్దకంగా ఉందా.. జస్ట్ ఇలా చేయండి..
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరమేమీ లేదు. కానీ, ఆచరణకు వచ్చేసరికి అనేక సమస్యలు మొదలవుతాయి. అలాంటి వారికి యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు ఓ శుభవార్త తీసుకొచ్చారు. ఇంట్లోనే కాదు.. మనకు నచ్చిన చోట కూర్చుని రోజూ 30 నిమిషాల పాటు నిర్దిష్ట పద్ధతిలో శ్వాస తీసుకుంటే చాలు.. అది కాస్తా వ్యాయామానికి సరితూగే ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు. ఫొటోలో చూపినట్లు ముక్కును రెండు వైపులా మూసేసి.. నోటి ద్వారా మాత్రమే ఈ కొత్త శ్వాస ప్రక్రియ నడుస్తుంది. ‘హై రెసిస్టెన్స్ ఇన్‌స్పిరేటరీ మజిల్ స్ట్రెంగ్త్ ట్రెయినింగ్’ క్లుప్తంగా ఐఎంఎస్టీ అని పిలిచే ఈ తరహా శ్వాస ప్రక్రియ 1980లలోనే పరిచయమైనా దానివల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే తెలిశాయి. 50 నుంచి 79 ఏళ్ల వయసున్న 36 మందిపై తాము ప్రయోగం చేశామని, వారానికి ఆరు సార్లు చొప్పున ఆరు వారాల పాటు జరిగిన ఈ ప్రయోగాల్లో మంచి ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ డేనియల్ క్రెయిగ్ హెడ్ తెలిపారు. వీరిలో సగం మంది రోజూ అరగంటపాటు నోట్లో ఒక పరికరాన్ని ఉంచుకుని ఊపిరి పీల్చినప్పుడు వారి రక్తపోటు 9 పాయింట్ల వరకు తగ్గిందని వివరించారు. ఈ పద్ధతిని నిలిపేసిన తర్వాత కూడా చాలాకాలం పాటు ప్రయోజనాలు కొనసాగడం ఇంకో విశేషమని తెలిపారు. అంతేకాకుండా.. నాడుల్లోని ఎండోథీలియల్ కణాల పనితీరు 45 శాతం వరకు మెరుగుపడిందని పేర్కొన్నారు. రుతుస్రావం నిలిచిపోయిన వారికీ ఈ శ్వాస ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. జిమ్ సౌకర్యాలు లేనివారు ఈ పద్ధతిని ఉపయోగించుకుని ఏరోబిక్ వ్యాయామం ద్వారా కలిగే లాభాలను పొందొచ్చని చెప్పారు. -
కరోనాలో రిస్క్ తగ్గాలంటే... ఒళ్లు కదల్చండి..!
ఒళ్లు కదల్చని బద్దకం... వేళపాళ లేని తిండి.. కంటికి కరవైన కునుకు... ఆధునిక జీవనశైలి తాలూకూ మూడు ప్రధాన లక్షణాలివి. ఈ అలవాట్లతో మధుమేహం, గుండెజబ్బులు మాత్రమే కాదు.. రోగ నిరోధక శక్తి బలహీనపడి.... కరోనా మహమ్మారి బారిన పడే అవకాశాలూ బాగా పెరిగిపోయాయి. కానీ.. కేవలం వ్యాయామం ద్వారా మాత్రమే ఈ సమస్యను ఇట్టే అధిగమించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు! శరీరాన్ని చురుకుగా ఉంచడం ఆరోగ్యానికి మేలన్నది కొత్త విషయం ఏమీ కాదు. మనసుకు ఉల్లాసం కల్పించడం... బోలెడన్ని జబ్బులు రాకుం డా నివారించడం వ్యాయామం వల్ల కలిగే కొన్ని లాభాలని కూడా మనం చదువుకునే ఉంటాం. కారణాలేవైనా.. ఈ అంశాన్ని విస్మరించిన ఫలితంగానే చాలామంది కోవిడ్ బారిన పడ్డారన్నది కూడా నిష్టూర సత్యం. అందుకే.. క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం ద్వారా కోవిడ్ బారిన పడ్డా.. సమస్య జటిలం కాకుండా జాగ్రత్త పడవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్’ మెడిసిన్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. వారంలో ఎన్ని రోజుల పాటు మీరు ఓ మోస్తరు నుంచి కఠినమైన వ్యాయామం చేస్తారు? నడక, సైక్లింగ్, పరుగు వంటి రకరకాల వ్యాయామాలకు వారంలో ఎంత సమయం కేటాయిస్తారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే.. ఒక వ్యక్తి శారీరకంగా ఎంత చురుకుగా ఉన్నాడన్నది అర్థం చేసుకోవచ్చు. కోవిడ్‌కు, వ్యాయామానికి మధ్య ఉన్న సంబంధం తెలుసుకునేందుకూ ఈ ప్రశ్నలే ఆధారమయ్యాయి. పద్దెనిమిదేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు, కోవిడ్ కోరల్లో చిక్కుక్కున్న సుమారు 48 వేల మందికి ఈ ప్రశ్నలే వేసి వారిచ్చిన సమాధానాల ఆధారంగా వ్యాయామానికి, కోవిడ్‌కు ఉన్న లింక్‌ను అంచనా వేశారు శాస్త్రవేత్తలు. అమెరికాలో జరిగిన ఈ అధ్యయనంలో అన్ని ప్రాంతాల వారూ పాల్గొన్నారు. మూడుసార్లు వివరాల నమోదు దాదాపు పది నెలల అధ్యయన కాలంలో సర్వేలో పాల్గొన్న వారి నుంచి మూడుసార్లు వివరాలు సేకరించారు. వారానికి కనీసం 150 నిమిషాలపాటు ఏదో ఒకరమైన వ్యాయామం తప్పకుండా చేసిన వారు ఒక వర్గంగా పరిగణిస్తే... ఒళ్లు కదల్చకుండా వారానికి పది నిమిషాల కంటే తక్కువ సమయం కష్టపడ్డ వారు ఇంకో వర్గంగా లెక్కించారు. అప్పుడప్పుడు మాత్రమే వ్యాయా మం చేస్తూ వారంలో 11 నుంచి 149 నిమిషాలు దానికి వెచ్చించిన వారు మూడో వర్గమైంది. అధ్యయనంలో పాల్గొన్న వారి వయసు, స్త్రీనా? పురుషుడా?, ఏ ప్రాంతం వారు? ధూమపానం లేదా ఆ అలవాటు కారణంగా వచ్చే దగ్గు ఉందా? ఊబకాయులా? మధుమేహం, రక్త పోటు, గుండె, మూత్రపిండాల సమస్యలు ఉన్నాయా?.. ఇలా అన్ని రకాల ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈ మొత్తం సమాచారాన్ని విశ్లేషించినప్పుడు కోవిడ్ వ్యాధి తీవ్రతకు.. వ్యాయామం చేసే సమ యానికి గట్టి సంబంధాలే ఉన్నట్లు స్పష్టమైంది! రోజుకు కనీసం అరగంట... వారంలో అతితక్కువ సమయం వ్యాయామం చేసే వాళ్లు కోవిడ్ కారణంగా ఆసుపత్రిపాలయ్యేందుకు, ఐసీయూలో చేరే స్థాయికి ఆరోగ్యం పతనమయ్యేందుకు, ఆఖరుకు మరణానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. వారానికి దాదాపు 150 నిమిషాలు అంటే.. వారంలో ఐదు రోజులపాటు అరగంట సేపు వ్యాయామం చేసిన వాళ్లతో పోలిస్తే.. వ్యాయామం చేయని వారి పరిస్థితి ఇదన్నమాట. అప్పుడప్పుడూ వ్యాయామం చేసే వారు కూడా వ్యాధి నుంచి ఒక మోస్తరు రక్షణ పొందారని, కడుపులో చల్ల కదలకుండా ఉన్న వారికే సమస్యలు ఎక్కువగా వచ్చినట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రోజు నుంచే ఎక్కడ, ఎలా వీలైతే అలా శరీరానికి పని చెప్పండి. ఇల్లు శుభ్రం చేయడం మొదలుకొని జిమ్‌లో చేరి బరువులెత్తడం వరకూ ఏదో ఒకదాన్ని ఎంచుకుని క్రమం తప్పకుండా పాటించండి. ఎలాంటి వ్యాయామం చేయాలో తెలియదనుకుంటే.. రోజూ రెండు మూడు కిలోమీటర్లు వేగంగా నడిచినా (బ్రిస్క్ వాకింగ్) చాలు. ఆపాదమస్తిష్కమూ ప్రయోజనమే. ఒక్కమాటలో చెప్పాలంటే.. వ్యాయామం జిందాబాద్ అనేయండి!! – సాక్షి, హైదరాబాద్. -
కరోనా కాదు.. ముందు భయాన్ని వీడండి.. థింక్ పాజిటివ్
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్): మనోధైర్యంతో కరోనా మహమ్మారిని జయించారు.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా హోంక్వారంటైన్లో ఉంటూ పాజిటివ్ దృక్పథంతో ఆలోచించడంతో కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు చేయకుండా చిన్న చిట్కాలతో కరోనాను చిత్తు చేశారు. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగాతోపాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేసి శ్వాస సంబంధ సమస్యలు అధిగమించారు. కుటుంబసభ్యులు, బంధువులతో వీడియో కాలింగ్, ఛాటింగ్ చేస్తూ ఒంటరితనాన్ని దూరం చేస్తూ ఆనందంగా గడిపారు. తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవల్స్ తగ్గకుండా చూసుకున్నారు. వేడినీళ్లు మాత్రమే తాగుతూ, ఉప్పు, పసుపు వేసిన నీటిని గొంతులో పోసుకుని గార్గిల్ చేస్తూ, రెండు పూటలా ఆవిరిపట్టారు. గదిలో ఒంటరిగా ఉన్నామనే భావన మనసులోకి రానీయకుండా, ఒత్తిడి కలిగించే అంశాలను ఆలోచించకుండా, కుటుంబసభ్యుల సహాయ సహకారాలతో క్వారంటైన్‌ను మామూలు రోజుల్లాగే కామన్‌గా గడిపారు. గడువు ముగిసిన తర్వాత నిర్వహించిన వైద్యపరీక్షల్లో నెగిటివ్ రావడంతో కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. హోంఐసోలేషన్లో ఉంటూ కరోనాపై విజయం సాధించిన పలువురు సలహాలు, సూచనలతోపాటు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ధైర్యమే బతికించింది నా వయసు 65 ఏళ్లు.. మాది ఉమ్మడి కుటుంబం. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. టెస్ట్ చేయిస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. ఆస్పత్రిలో జాయిన్ చేస్తామంటే వద్దని, హోంఐసోలేషన్లో ఉంటానని చెప్పాను. తర్వాత కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. నలుగురం కలిసి అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో ఉన్నాం. పల్స్ ఆక్సిమీటర్ తెప్పించుకున్నా. ప్రతిరోజు ఉదయం ప్రాణాయామం, యోగా సాధన. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో వీడియో కాలింగ్, చాటింగ్ చేసుకుంటూ ఆనందంగా గడిపాను. 14 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే అందరికీ నెగిటివ్ వచ్చింది. – మణెమ్మ, శ్రీనివాసనగర్, సీతాఫల్మండి భయాందోళన వద్దు కరోనా పాజిటివ్ వస్తే భయాందోళన వద్దు. గతనెల 5వ తేదీన నాకు, మానాన్న నర్సింగ్‌రావుకు ఒకేరోజు జ్వరం వచ్చింది. ట్యాబ్లెట్లు వేసుకున్నాక జ్వరం తగ్గింది. వైద్యుల సూచన మేరకు కరోనా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. హోంక్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. మా నాన్న అందించిన ధైర్యంతో భయాన్ని పోగొట్టింది. ఆవిరి పట్టడం, కషాయం తాగడం, పోషకాహారం తినడంతోపాటు మనసుకు ఉత్సాహాన్ని ఇచ్చే సంగీతం, పాటలు వింటూ ఆనందంగా గడిపాం. అమ్మ సహకారంతో హోంక్వారంటైన్ పూర్తిచేశాం. తర్వాత నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. – లక్ష్మీప్రియ, ప్రైవేటు ఎంప్లాయి, న్యూబోయిగూడ జాగ్రత్తలు పాటించా.. నేను కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో నాల్గవ తరగతి కాంట్రాక్ట్ ఉద్యోగిని. కరోనా బాధితుల మధ్యే సేవలు అందిస్తుంటాను. ఈ క్రమంలో స్వల్ప అస్వస్థతకు గురికావడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ఇంట్లో భార్యతోపాటు ముగ్గురు చిన్నపిల్లలు, వృద్ధురాలైన అమ్మ ఉన్నారు. గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి ఇతర వైద్యులు ఆస్పత్రిలో బాధితులకు ఇచ్చే కౌన్సిలింగ్ గుర్తుకు వచ్చింది. అవసరమైతేనే ఆస్పత్రికి రావాలి. జాగ్రత్తలు పాటిస్తే సులభంగా తగ్గిపోతుంది. ఆ మాటలు గుర్తొచ్చి 14 రోజులు హోంక్వారంటైన్లో ఉన్నాను. ఇప్పుడు కరోనా నెగిటివ్ వచి్చంది. – గణపతి, గాంధీఆస్పత్రి స్టాఫ్ మెదడులో హార్మోన్ల సంఖ్య తగ్గి.. తీవ్రమైన భయాందోళనకు గురికావడం వల్లే కరోనా మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఒత్తిడి పెంచే అంశాలు వలన మెదడులోని హార్మోన్ల సంఖ్య తగ్గి శరీర అవయవాలు సక్రమంగా పనిచేయవు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వాటిని గుడ్డిగా నమ్మవద్దు. ముక్కులో నిమ్మరసం పిండుకుంటే కరోనా తగ్గుతుందని వీడియోను చూసిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కరోనా బాధితులు మధుర క్షణాలను మాత్రమే గుర్తుచేసుకుని ఆనందంగా ఉండాలి. గాంధీ ఆస్పత్రిలో ప్రతిరోజూ వందలాది మంది బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి ఆలోచన విధానంలో మార్పు తెచ్చి స్వస్థత చేకూర్చేందుకు కృషి చేస్తున్నాం. – జూపాక అజయ్‌కుమార్, సైకియాట్రిస్ట్ ( చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే: సీఎస్ ) -
కరోనా: ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది?
సాక్షి, హైదరాబాద్: ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. కరోనా కార్డియో పల్మనరీ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇది ప్రధానంగా శ్వాస సంబంధమైన వ్యాధి అని, గొంతులో వారం ఉంటుందని, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి వెళ్లి నాలుగైదు రోజుల్లో విజృంభిస్తుందని చెబుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు యోగాలో భాగమైన ప్రాణాయామం ఉపయోగపడుతుంది. కరోనా నివారించడానికి చేసే ప్రాణాయామాలు వేరు, వచ్చిన వారు చేయాల్సినవి వేరు. కొన్ని వ్యత్యాసాలతో వీటిని చేయాల్సి ఉంటుంది. కరోనా వచ్చినప్పుడు ప్రాణవాయువు వినియోగం చాలా పెరుగుతుంది. ఐసీయూలో ఉన్న వ్యక్తికి ప్రాణవాయువు అవసరం 25 లీటర్లు ఉంటే ఊపిరితిత్తులు పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి 3 లీటర్ల ప్రాణవాయువు మాత్రమే అవసరం. మామూలుగా మనం పీల్చుకునే గాలి ఊపిరితిత్తుల పైభాగంలోనే ఉంటుంది. అలాకాకుండా ఊపిరితిత్తుల కింది భాగంలోకి సక్రమంగా తీసుకెళ్లడానికి ప్రాణాయామం చేస్తాం. విభాగ ప్రాణాయామం ద్వారా పై, మధ్య, కింద భాగాలకు ప్రాణవాయువు తీసుకెళ్లగలం. తద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకుంటాం. గొంతు ద్వారా శ్వాసను పీల్చుకోవడమనే ఉజ్జాయి విధానం వల్ల ఆక్సిజన్ రక్తంలోకి వెళుతుంది. ప్రాణాయామంలోనే భాగాలైన అంగన్యాసం, కరన్యాసం వంటివి చేస్తే.. శ్వాసని అంతర్భాగంలోకి అంటే ఊపిరితిత్తుల వెనుక ముందు పక్కల ఇలా అన్ని చోట్లకూ పంపిస్తుంది. కోవిడ్‌కి గురైన వారు రెండున్నర సెకన్లు పీల్చుకోవడం, రెండున్నర సెకన్లు వదిలేయడం... ఇలా నిమిషానికి 12 ప్రాణాయామాలు చేస్తే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అది రాకుండా ఉండాలని చేసేవారు వేరే పద్ధతిలో చేయాల్సి ఉంటుంది. ప్రాణాయామం అనేది సులభమైన వ్యాయామం. -డా. ఏఎల్‌వీ కుమార్, యోగా గురు చదవండి: కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా? -
సన్నగా ఉన్నవాళ్లు వ్యాయామం చేయొద్దా?
సన్నగా ఉంటే వ్యాయామం అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ సన్నగా, పీలగా ఉన్నవాళ్లు కాస్త ఒళ్లు చేయాలంటే డైట్‌తో పాటు వ్యాయామం తప్పదు. సన్నగా ఉన్నవాళ్లు కోచ్ ఆధ్వర్యంలో ఎక్సర్సైజ్లు చేయాలి. ముఖ్యంగా కార్డియో వర్కవుట్స్ కన్నా స్ట్రెంత్ ట్రైనింగ్‌కి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరైనా సరే బెల్లీ బలంగా మారాలంటే క్రంచెస్ చేయాలి. మీ సామర్థ్యాన్ని బట్టి 20 సార్లు 3 సెట్లు లేదా 15 సార్లు 4 సెట్లు రోజూ చేస్తే మంచి ఫలితం తొందరగా కనిపిస్తుంది. స్కిప్పింగ్ ఇలా చేద్దాం! పది నిమిషాలు స్కిప్పింగ్ చేయడం ఎనిమిది నిమిషాల నడకకు సమానం. స్కిప్పింగ్‌కు మీరు ఎంచుకునే తాడు మీ ఎత్తుకు రెండింతలుండాలి. దానిని మీ పాదాలతో అదిమి పట్టి రెండు అంచులను మీ ఎత్తుకు సమానంగా ఇరువైపులా చూసుకుని మీ చేతులతో ముందుకు, వెనక్కు తిప్పి చూసుకోవాలి. అప్పుడే కాళ్లకు అడ్డం పడకుండా క్రమపద్ధతిలో స్కిప్పింగ్ చేయగలరు. ఒకేవిధమైన ఎక్సర్సైజ్లు కాకుండా కాంపౌడ్ ఎక్సర్ సైజ్ లు అంటే క్వాట్స్, డెడ్ లిప్ట్, బెచ్ ప్రెస్, మిలటరీ ప్రెస్, డంబెల్ రో ప్రయత్నించడం వల్ల కండరాలు పటిష్ఠంగా తయారై, తీరైన ఆకృతిలోకి మారతాయి. మొదటి రోజునుంచే వ్యాయామాలతో శరీరాన్ని ఎక్కువ శ్రమ పెట్టొద్దు, మోతాదును పెంచుకుంటూ వెళ్లాలి. అప్పుడే ఫిట్నెస్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. వావ్.. వాకింగ్! క్రమం తప్పక వాకింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనే హార్మోనులు విడుదలవుతాయి, ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రెగ్యులర్ వాకింగ్‌తో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. రోజూ అరగంట వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ముప్పు చాలావరకు తగ్గుతుంది, నిత్యం 10 వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బరువు ఈజీగా తగ్గుతారు. బూట్లు లేకుండా ఒట్టి పాదాలతో చేసే వాకింగ్‌తో మెంటల్ టెన్షన్ తగ్గుతుందని, ఇమ్యూనిటీ పెరుగుతుందని, హృద్రోగాల రిస్కు తగ్గుతుందని, మెన్సస్ టైంలో వచ్చే పొత్తికడుపు నొప్పులు నివారించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక్కడ చదవండి: కూరగాయలతోనే పొట్ట తగ్గించుకోండి నవ్వు మాత్రమే కాదు.. ఏడుపూ మంచిదే..! -
కొలెస్ట్రాల్ ఒంటికి హాని చేస్తుందా?
కొలెస్ట్రాల్ అనగానే అది హానికరమనే విధంగా నే చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు ఉంటాయి. అది చెడు కొలెస్ట్రాల్ అయినా, మంచి కొలెస్ట్రాల్ అయినా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్డిఎల్ అంటారు. వున శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరీక్షలో మన ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్), హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) మోతాదులు తెలుస్తాయి. ఎల్డీఎల్ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎల్‌డీఎల్‌ను ‘‘చెడు కొలెస్ట్రాల్’’ అని అంటారు. కానీ హెచ్‌డీఎల్ రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే హెడీఎల్ ను ‘‘వుంచి కొలెస్ట్రాల్’’ అని అంటారు. మన శరీరంలో ఎప్పుడు హెచ్‌డీఎల్ ఎక్కువగా, ఎల్డీఎల్ తక్కువగా ఉండాలి. గుడ్డులోని తెల్లసొన లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. పచ్చ సొనలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి తెల్లసొన తీసుకుని, పచ్చసొనను తగ్గించాల్సిందిగా డాక్టర్లు, ఆహారనిపుణులు చెబుతుంటారు. ఒకవేళ చెడు కొలెస్ట్రాల్ అంతగా లేనివారు మొత్తం గుడ్డును తినేయవచ్చు. కొలెస్ట్రాల్ కూడా ఉండాల్సిన మోతాదులో శరీరానికి అందాలి. అయితే అది తన మోతాదుకు మించకుండా చూసుకోవాలి. మంచి జీవనశైలితో మంచి ఆహార అలవాట్లతో సరైన వ్యాయామంతో చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో పెట్టుకోవచ్చు. -
సల్మాన్‌ఖాన్ కాదండీ.. ఇంతకీ ఎవరండీ?
తిండి కలిగినంత మాత్రాన ‘కండ’ కలదు... అనే విషయంలో గ్యారెంటీ ఏమీలేదు. తిండికి తగినట్లు తగిన వ్యాయామాలు చేయాలి. అప్పుడే కండ. లేనిచో ‘బొజ్జ కలదోయ్’ అనుకోవాల్సి వస్తుంది. ఫిన్నెస్పై శ్రద్ధ పెట్టడం అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి మస్తు మంచిది అనే విషయం తెలిసినా చాలామంది ‘ఆ..ఈ వయసులో ఏంచేస్తాం లెండి’ అని తప్పించుకుంటుంటారు. కొందరేమో ‘బిజీ’ అంటూ సాకులు వెదుక్కుంటారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌ను చూడండి. అతని వయసు 65 సంవత్సరాలు. ‘ఈ వయసులో ఏమిటీ’ అని ఎప్పుడూ అనుకోలేదు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూనే ఉంటారు. రకరకాల కసరత్తులతో చూడముచ్చటగా తీర్చిదిద్దుకున్న తన బాడీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఖేర్. ‘ఎన్నడూ ఒప్పుకోవద్దు ఓటమి’ అని కామెంట్ కూడా పెట్టారు. అంతే కదా మరి! చదవండి: పవన్ కల్యాణ్ అడిగితే.. ఆయనకు 4వ భార్యగా ఉంటా.. -
స్ట్రాంగ్ ఎవ్రీడే.. నో ఎక్స్క్యూజెస్
అనిల్ కపూర్‌కు ఇప్పుడు 64 వయసు. ఫొటోలో కనిపిస్తున్నది ఆయన భుజబలమే. 60 దాటినా ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో అనిల్ కపూర్ ఎప్పుడూ అశ్రద్ధ చేయక చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ముంబైలో ఉన్నా ఔట్‌డోర్ షూటింగ్లో ఉన్నా వ్యాయామం తప్పనిసరి. ‘స్ట్రాంగ్ ఎవ్రీడే’... ‘నో ఎక్స్క్యూజెస్’ అనేది ఆయన నినాదం. అంటే ప్రతిరోజూ మనం శక్తితో ఉండాలి. వ్యాయామం చేయకుండా ఉండేందుకు సాకులు చెప్పడం మానుకోవాలి అని ఆయన ఉద్దేశ్యం. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో మొన్న ఆయన ట్విటర్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ఉదయ్‌పూర్‌లో షూటింగ్లో ఉన్నా’ అని క్యాప్షన్ పెట్టారు. హోటల్ రూమ్‌లో తన బైసెప్స్‌ను చెక్ చేసుకుంటూ ఉన్నారాయన ఈ ఫొటోలో. (చదవండి: సీన్ తొలగించాల్సిందే) అనిల్ కపూర్ తాజాగా ‘ఏకె వెర్సస్ ఏకె’ సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి రివ్యూలు పొందింది. ప్రస్తుతం ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘జుగ్ జుగ్ జియో’ సినిమాలో నటిస్తున్నారు. దాని కోసమే ఉదయ్‌పూర్‌లో ఉన్నారు. ఇందులో నీతూ కపూర్, వరుణ్ ధావన్ నటిస్తున్నారు. దీని తర్వాత ఆయన రణ్‌బీర్ కపూర్ హీరోగా చేస్తున్న ‘యానిమల్’లో నటించనున్నారు. బాలీవుడ్లో అనిల్ కపూర్ నేటికీ స్టార్డమ్ తగ్గని హీరో. ఆ స్టార్డమ్ వెనుక ఆయన ఫిట్నెస్ ఉందని వేరే చెప్పాలా? -
సకాలంలో కాలేయాన్నికాపాడుకోండి!
మారుతున్న జీవనశైలిలో భాగంగా ఒకేచోట కూర్చుని చేసే వృత్తుల కారణంగానైనా... లేదా మన జీవనశైలిలో ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిన ఆల్కహాల్ తీసుకోవడం వల్లనైనా ఇటీవల ఫ్యాటీలివర్ డిసీజ్ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులోనూ గ్రేడ్‌లో ఉంటాయి. మొదటి లేదా రెండో గ్రేడ్ వరకు కేవలం మంచి ఆరోగ్యకరమైన నడవడిక, మన జీవనశైలిలో భాగంగా ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామంతో మొదటి, రెండో దశలోని ‘ఫ్యాటీ లివర్’ కండిషన్‌ను తేలిగ్గా అధిగమించవచ్చు. కానీ అంతకు మించి దాటితే మాత్రం కాలేయం పూర్తిగా కొవ్వుతో నిండిపోయి మొదటికే మోసం రావచ్చు. అప్పుడు కాలేయ మార్పిడి తప్ప మరో మార్గ ఉండకపోవచ్చు. అందుకే సకాలంలోనే గుర్తించి మొదటి లేదా రెండో దశలోనే ‘ఫ్యాటీ లివర్’ను నిలువరించాలి. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి, దానికి కారణాలేమిటి, దానితో వచ్చే అనర్థాలేమిటి వంటి అనేక అంశాపై అవగాహనను కలిగించేదే ఈ కథనం. ఈ మధ్యకాలంలో మన జీవనశైలిలో నగరీకరణ /పట్టణీకరణ జరుగుతున్న కొద్దీ మనం తీసుకునే ఆహారంలో క్యాలరీ లు చాలా ఎక్కువగా ఉండటం, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలు పెరుగుతున్నాయి. దానికి తోడు శారీరక శ్రమ ఎంతమాత్రమూ లేని వృత్తులే అన్నిచోట్లా ఉన్నాయి. ఫలితంగా స్థూలకాయం, డయాబెటిస్తో పాటు ఫ్యాటీలివర్ అనే కండిషన్ చాలామందిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే... మన పొట్టలో కుడిపైపున కాలేయం ఉంటుంది. మనం తీసుకుంటున్న ఆహారంలో క్యాలరీలు, చక్కెరలు పెరుగుతున్న కొద్దీ శరీర శ్రమకు వినియోగమైనవి పోగా... మిగతావన్నీ కాలేయంలో కొవ్వు రూపంలో నిల్వ అవుతాయి. దాంతో క్రమంగా కాలేయం కణాలు తమ సహజ గుణాన్నికోల్పోయి కొవ్వు పేరుకున్నట్లుగా అయిపోతుంటాయి. ఇలాంటి కండిషన్‌నే ఫ్యాటీలివర్ అంటారు. ఫ్యాటీలివర్... దశలు... ఫ్యాటీలివర్‌లో మూడు దశలు ఉంటాయి. మొదటి దశ : ఇది సాధారణ ఫ్యాటీ లివర్ వ్యాధి. ఇందులో కాలేయ కణాల మధ్య కొద్దిగా మాత్రమే కొవ్వు పేరుకుంటుంది. రెండో దశ: ఈ దశను నాష్ (ఎన్‌ఏఎస్‌హెచ్) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా దెబ్బతింటుంది. కొన్ని కాలేయ కణాలు సైతం నశిస్తాయి. కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉంటాయి. మూడో దశ : ఈ దశలో సిర్రోసిస్ వస్తుంది. అంటే కాలేయం పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోతుంద. పూర్తిగా కొవ్వులు నిండినట్లుగా అయిపోతుంది. ఈ దశలో కాలేయ మార్పిడి తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండదు. ఇది జరగకపోతే రోగి మనుగడే అసాధ్యం అవుతుంది. కారణాలివి... ఫ్యాటీలివర్‌లో మన ప్రమేయంతో నివారించుకోగలిగే కారణాలతో పాటు మనం నివారించలేని కారణాలూ ఉంటాయి. నివారించగల కారణాలు ఉదాహరణకు మద్యం అలవాటు ఉన్నవారిలో ఫ్యాటీ లివర్ కండిషన్ ఎక్కువ. మద్యం అలవాటును మానుకోవడం అన్నది మనం నివారించుకోగలిగే అంశం. అలాగే బరువు తగ్గించుకోవడం కూడా కొంతవరకు మన చేతుల్లో ఉన్నదే. ఇక మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు) తీసుకోవడం కూడా మనం నివారించుకోగలిగే అంశమే. నివారించుకోలేని కారణాలు మంచి జీవనశైలి మార్గాలతో వాటిని కొంతవరకు మాత్రమే నివారించగలిగినప్పటికీ డయాబెటిస్, నివారించుకోలేనంత బరువు పెరగడం అన్నవి మనం ప్రయత్నపూర్వకంగా నివారించలేని కారణాలు. శరీరం బరువు పెరుగుతున్న కొద్దీ కాలేయానికి నష్టం వాటిల్లుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. స్థూలకాయం ఉన్న 90 శాతం మందిలో మొదటి దశ ఫ్యాటీలివర్ కనిపించడం చాలా సాధారణ అంశం. అలాగే స్థూలకాయం ఉన్న 20 శాతం వ్యక్తుల్లో మనం రెండో దశగా పేర్కొనే ఎన్‌ఏఎస్‌హెచ్ దశ ఉంటోంది. ఫ్యాటీ లివర్ వచ్చిన వ్యక్తుల్లో దాదాపు 50 శాతం మందిలో డయాబెటిస్ ఉంటుంది. ఇక సిర్రోసిస్ దశకు చేరినవారిలో 95% మంది డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారే. ఫ్యాటీలివర్ వల్ల పరిణామాలు ∙ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతినిపోయే సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. ∙ఫ్యాటీ లివర్ దశల్లో మొదటిదశ నుంచి క్రమంగా రెండో దశ అయిన ఎన్ఏఎస్హెచ్కూ, అక్కడి నుంచే మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారి తీస్తుందని అనుకోడానికి లేదు. చాలా సందర్భాలలో పరిస్థితులు మొదటి దశ నుంచి నేరుగా మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారితీయవచ్చు. అందుకే ఫ్యాటీలివర్ కనిపించినప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాటీ లివర్ నివారణ మార్గాలు బరువు నియంత్రించుకోండి: మీరు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా బరువు ఉంటే మీ ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం: ఆహారంలో విధిగా తాజా ఆకుకూరలూ, కూరగాయలు, పండ్లు ఉండేలా జాగ్రత్త తీసుకోండి. నెయ్యి వంటి కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండండి. మాంసాహారంలో రెడ్‌మీట్‌కు బదులు స్కిన్ లేని చికెన్, చేపలు వంటివి తీసుకోండి. నూనెల్లో మంచినూనెకు బదులు ఆలివ్ ఆయిల్ వాడడం మేలు. పొట్టుతీయని తృణధాన్యాలు ఎక్కువగా వాడాలి. పాలిష్ చేసిన వాటికి బదులుగా పొట్టు తీయని బియ్యం, గోధుమలు ఎక్కువగా తీసుకోండి. డయాబెటిస్‌ను తప్పకుండా అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ తగ్గించుకోండి. ఇందుకోసం వ్యాయామంతో పాటు ఒకవేళ అవసరమైతే మందులు కూడా వాడాల్సి ఉంటుంది. దురలవాట్ల నుంచి దూరంగా ఉండండి: ఆల్కహాల్‌కు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. వ్యాయామం ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలకు తక్కువ కాకుండా వ్యాయామం చేయండి. శారీరక శ్రమ చేయడానికి అవకాశం ఉన్న చోట్ల ఒంటికి పని చెప్పండి. అంటే లిఫ్ట్‌కు బదులు మెట్లు ఉపయోగించడం, కొద్దిపాటి దూరాలకు వాహనం ఉపయోగించకపోవడం మంచిది. ఫ్యాటీలివర్ డిసీజ్ లక్షణాలు ∙తొలిదశల్లో సాధారణంగా ఫ్యాటీలివర్ రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకున్నవారిలో ఇది ఉన్నట్లు తెలుస్తుంది. ∙కొందరికి కుడివైపు పొట్ట పైభాగంలో (రిబ్కేజ్ కింద) పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. కాలేయం క్రమంగా పెరుగుతుండటం వల్ల కనిపించే పరిణామం ఇది. ఫ్యాటీలివర్ నిర్ధారణ పరీక్షలు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్‌తో చాలావరకు ఫ్యాటీలివర్ డిసీజ్ తెలుస్తుంది. దానితోపాటు లివర్ ఫంక్షన్ పరీక్ష చేయించాలి. దానితో ఏవైనా ఎంజైములు స్రవించడం వల్ల కాలేయం దెబ్బతిన్నదా అన్న సంగతీ తెలుస్తుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయులు, ట్రైగ్లిజరైడ్ పెరుగుదలనూ పరిశీలించే పరీక్షలు చేయించాలి. కొందరిలో లివర్ బయాప్సీ అవసరం. ఫ్యాటీ లివర్ వ్యాధికి చికిత్స ఆల్కహాల్ అలవాటు ఉన్నట్లయితే అది పూర్తిగా మానేయాలి. ఒకవేళ ఆల్కహాల్ లేనివారిలో కనిపిస్తే వారి జీవనశైలిలో మార్పులు, ఆహారంలో మార్పులు, వ్యాయామం వంటి మార్గాలను తప్పక అనసరించాలి. చాలా కొద్దిమందిలో మందులు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ∙రోగి వాడుతున్న ఏవైనా మందుల వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చిందేమో అని పరిశీలించి దానికి అనుగుణంగా మందులను మార్చడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. -
2021లో బాగుండాలంటే.. ఈ 5 మార్చుకోండి!
2020 ప్రతి ఒక్కరి జీవితాల మీద ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఊహించని మార్పులు తీసుకొచ్చింది. వేడుకలు దూరమయ్యాయి... ఇళ్లు ఆఫీసయ్యింది. సినిమాలు లేవు.. షికార్లు లేవు. మన జీవిన విధానంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. చాలా వరకు బయటి తిండి తగ్గించాము. ఇంటి భోజనానికి అందులోనూ.. ఆరోగ్యకరమైన ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. ఇవి మంచి విషయాలైతే.. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడం.. చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం వంటి సంఘటనలతో ఒత్తిడి, ఆందోళన పెరిగాయి. చాలా మందిలో మానసిక కుంగుబాటు ఎక్కువయ్యింది. మరి కొద్ది రోజుల్లో 2020కి ముగింపు పలకబోతున్నాం. ఇక 2021లో మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఐదు అలవాట్లను తప్పక మార్చుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. అవేంటో చూడండి.. మీలో కూడా ఈ లక్షణాలు ఉంటే మార్చుకుని వచ్చే ఏడాదిని సంతోషంగా గడపండి... ఫీలింగ్స్‌ని అణిచవేసుకుంటున్నాం.. దాదాపు ఈ ఏడాది ప్రతి ఒక్కరు ఈ పరిస్థితిని అనుభవించారు. మన ఎమోషన్స్‌ని కావాలని ఇగ్నోర్ చేసే పరిస్థితులను 2020లో ఎదుర్కొన్నాం. అయితే ఇలా ఫీలింగ్స్‌ని అణిచివేసుకోవడం మంచిదేనా అంటే.. కాదని అంటున్నారు నిపుణులు. అవసరానికి తగ్గట్లు ప్రస్తుతం మన భావాల్ని అణచివేసుకుంటూ పోతే భవిష్యత్తులో అది మన మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు. ఫీలింగ్స్‌ని అణిచి వేసుకోవడం వల్ల మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడమే కాక మైగ్రేన్, హై బీపీ వంటి అనారోగ్యాల బారిన పడతామంటున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్, ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు బానిసవుతామని హెచ్చరిస్తున్నారు. కనుక దగ్గరి వాళ్లతో మన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవడం.. లేదంటే ఓ పేపర్ మీద రాసుకుని.. ఆ పరిస్థితుల గురించి మనకు మనమే విశ్లేషించుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఇవేవి కాదంటే థెరపిస్ట్‌ని కలవమని సూచిస్తున్నారు. (చదవండి: న్యూ ఇయర్ నిర్ణయాలు కొనసాగాలంటే) అధిక ఒత్తిడి భరిస్తున్నాం.. మనం ఎదుర్కొనే సగం అనారోగ్యాలకి మూల కారణం ఒత్తిడికి గురవ్వడం. ఆందోళనని బయటకు వెళ్లడించడం ఎంతో మంచిది. ఇక మన బుర్రలో నడిచే విషయాల గురించి పట్టించుకోకపోతే.. వాటిని విశ్లేషించి ఓ కొలిక్కి రాకపోతే.. ఒత్తిడి పీక్స్‌కి వెళ్తుంది. దాంతో మన మెదడు కార్టిసాల్ అనే ఒక స్టెరాయిడ్ హార్మోన్ విడుదల చేస్తుంది. సాధారణంగా కార్టిసాల్ పని ఏంటంటే ఇది మన జీవక్రియ రోగనిరోధక ప్రతిస్పందనతో సహా శరీరమంతా విస్తృతమైన ప్రక్రియలను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదల అయితే.. ఇది మెదడు పని తీరును అడ్డుకుంటుంది. దాంతో రోజువారి జీవిన విధానం పూర్తిగా దెబ్బ తింటుంది. కనుక ఒత్తిడి లేవల్స్ పెరిగినప్పుడు తప్పకుండా బ్రేక్ తీసుకొండి. దాన్ని జయించడానికి ప్రతిరోజు యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకొండి. తీవ్రమైన ఆలోచనల నుంచి బయటపడేందుకు మీ మనసుకు నచ్చే పనులు చేయడం మంచిది అంటున్నారు నిపుణులు. తగినంత నిద్ర పోవడం లేదు... దురదృష్టవశాత్తు.. గత కొద్దేళ్లుగా మన నిద్ర అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఇది అనారోగ్యకరమైన పద్ధతి అని తెలిసినప్పటికి మార్చుకోలేకపోతున్నాం. మంచి మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఎనిమిది గంటల నిద్ర పొందడం చాలా ముఖ్యం. వాస్తవానికి, ది స్లీప్ హెల్త్ ఫౌండేషన్ చేసిన పరిశోధనలో 60 నుంచి 90 శాతం మంది రోగులు నిద్రలేమితో బాధపడుతున్నా వారే అని తెలిపింది. ఒక్క రోజు సరిగా నిద్రపోకపోతేనే.. ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. గందరగోళంగా అనిపిస్తుంది. ఈ అలవాటు ఇలానే కొనసాగితే.. ఇది దీర్ఘకాలంలో మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక రాబోయే సంవత్సరంలో నిద్రకు ప్రాధాన్యతనివ్వండి. మీరు బాగా విశ్రాంతి తీసుకోకపోతే, మీ మనస్సు సరిగా పనిచేయదు, ఇది అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది. (చదవండి: ఆనందారోగ్యాలకు పది సూత్రాలు) తగినంత వ్యాయామం లేదు.. మన శారీరక ఆరోగ్యానికి వ్యాయామం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే ఇది మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని మీకు తెలుసా. ఎక్సర్సైజ్ విషయంలో 2020 మమ్మల్ని మరింత బద్దకస్తులుగా మార్చింది. లేచిన దగ్గర నుంచి చాలా మంది మొబైల్ స్క్రీన్లు, కంప్యూటర్లకు అతుక్కుపోయారు. సామాజిక దూరం కారణంగా వ్యాయమాన్ని నిర్లక్ష్యం చేశాము. ఇక రాబోయే సంవత్సరంలో ఈ అలవాటును తప్పక మార్చాల్సిందే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది ఎండార్ఫిన్లను విడుదల చేయడంలో సహాయపడుతుంది. మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మయోక్లినిక్ విడుదల చేసిన ఒక కథనం ప్రకారం, వ్యాయామం “ఫీల్-గుడ్ ఎండార్ఫిన్లు, సహజ గంజాయి లాంటి మెదడు రసాయనాలు (ఎండోజెనస్ కానబినాయిడ్స్), ఇతర సహజ మెదడు రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి మనల్ని మానసికంగా సంతోషంగా ఉంచుతాయి”. జిమ్‌కు వెళ్లడం మరి కొద్ది రోజులు వీలుపడక పోవచ్చు. కానీ వాకింగ్ చేయడం ఒకే కదా. ప్రయత్నించండి.. 21 రోజుల తర్వాత ఎలా ఉందో పరిశీలించండి. 24 గంటలు సోషల్ మీడియానే లోకం.. 2020 మనల్ని సోషల్ మీడియాకు మరింత బానిసల్ని చేసింది. లాక్డౌన్ కారణంగా చాలా రోజుల పాలు అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో ఏం చేయాలో పాలుపోక స్క్రోలింగ్ చేయడం, సెల్ఫీలు పోస్ట్ చేయడం, రోజంతా మీమ్స్‌ను సర్చ్ చేయడం వంటివి చేస్తూ టైం పాస్ చేశారు. సోషల్ ప్లాట్‌ఫామ్‌లపై కొంత సమయం గడపడం మంచిదే. కానీ ప్రతి ఐదు నిమిషాలకోసారి ఎఫ్బీ, ఇన్‌స్టాగ్రామ్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలనే కోరిక ఉంటే, మీ సమస్య తీవ్రమైనట్లే. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. మొబైల్‌కే అతుక్కపోవడం వల్ల శారీరక ఆతోగ్యం కూడా దెబ్బతింటుంది. కష్టమైనా సరే ఈ ఏడాది సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిద్దాం అని నిర్ణయం తీసుకొండి. ఆ సమయాన్ని మీలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకునేందుకు.. కుటుంబంతో గడిపేందుకు.. ఇష్టమైన వ్యాపకాలను కొనసాగించడానికి వినియోగించండి. ఆ తర్వాత మీరే అద్భుతః అంటారు. (చదవండి: మోదీ ఎలా యాక్టివ్‌గా ఉంటున్నారు ?) -
అప్పట్లో 40, ఇప్పుడు నాలుగే కష్టం: తమన్నా
సాక్షి, ముంబై: ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన మిల్కీ బ్యూటీ తమన్నా బ్యాక్ టు ఫిజికల్ ఫిట్ నెస్ అంటూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న హీరోయిన్ తమన్నా మళ్లీ ఫిట్ నెస్ వైపు దృష్టి పెట్టారు. తాజాగా ఎక్సర్ సైజ్ చేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వార్మప్ ఎక్సర్ సైజ్‌లతో స్టామినా పుంజుకునేందుకు ప్రస్తుతం తేలికపాటి వ్యాయామం మాత్రమే చేస్తున్నానని తమన్నా చెప్పారు. (ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యా : తమన్నా) కరోనాకు చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరిన వెంటనే తమన్నా బేబీ స్టెప్స్ అంటూ..నెమ్మదిగా యాక్షన్‌లోకి దిగి పోయారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఫిట్ నెస్ సంతరించుకోవడం చాలా ముఖ్యమని, వ్యాయామం తప్పనిసరి అని ఆమె ఈ వీడియోలో పేర్కొన్నారు. అయితే హడావిడిగా కాకుండా శరీరం చెప్పేది వింటూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతంలో 40 పుషప్స్ చేసే ఆమె ఇప్పుడు నాలుగు చేయడానికే ఇబ్బంది పడుతుండటం ఈ వీడియోలో గమనించవచ్చు. View this post on Instagram It's time to take baby steps and get back my stamina. This is an extremely important step after recovering from coronavirus. Keep going but make sure you listen to your body. @yogeshfitness #BackInAction #SlowAndSteady #DoItEveryday A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on Oct 15, 2020 at 9:47pm PDT -
హీరో విశాల్ తండ్రి ఫిట్నెస్ చూస్తే షాకే!
చెన్నై: ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న హీరో విశాల్ తండ్రి జీకే రెడ్డి తన ఆరోగ్య సహస్యం వెల్లడించారు. 82 ఏళ్ల వయసులో తాను ఆరోగ్యంగా ఉన్నానని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే తన ఆరోగ్యానికి కారణమని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, ఇంట్లోనే ఉండి చిన్న చిన్న ఎక్సర్సైజుల వల్ల శారీరకంగా ధృడంగా తయారవ్వొచ్చని అన్నారు. వ్యాయామానికి సంబంధించి ఆయన వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. అభిమానులు, నెటిజన్లు జీకే రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 82 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా ఉన్నారు. మీ కృషి అభినందనీయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, జీకే రెడ్డికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో విశాల్ దగ్గరుండి సపర్యలు చేశాడు. ఆ క్రమంలోనే తనూ వైరస్ బారినపడ్డాడు. డాక్టర్ల సలహాలు, మనోధైర్యంతో ఇద్దరూ వైరస్‌పై విజయం సాధించారు. ఇదిలాఉండగా.. జీకే గ్రానైట్స్ కంపెనీ అధినేత అయిన జీకే రెడ్డి.. జీకే ఫిట్ అనే సంస్థను స్థాపించారు. దానిద్వారా వ్యాయామంలో మెళకువలు నేర్పిస్తుంటారు. (చదవండి: బీజేపీలోకి హీరో విశాల్?) -
కోపంగా ఉన్నారా.. ఈ సమస్య ఉన్నట్లే
న్యూఢిల్లీ: మన శరీర నిర్మాణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే వేళకు నిద్రిపోవడం ఎంతో అవసరం. ఎన్ని కోట్లున్న నిద్ర కరువయితే జీవితం వ్యర్థం అనే విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిద్ర కరువయి, చాలా మంది సతమవుతున్నారు. కాగా ప్రతి ఒక్కరికీ కనీసం ఏడు గంటల నుంచి 9గంటల సంతృప్తికరమైన, నాణ్యమైన నిద్ర అవసరం అని డాక్టర్ శ్రేయా గుప్తా చెబుతున్నారు. ఆమె నిద్ర అవసరాన్ని వివరించారు. మనం నాణ్యమైన నిద్ర పోగలితే హార్మోన్లు, గుండె, మెదడు తదితర అవయవాలలో రోగనిరోధక శక్తి పెరిగి మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటామని డాక్టర్ చెబుతున్నారు. కాగా ఏకారణంతోనైన సరియైన నిద్ర పోనప్పుడు విపరీతమైన కోపం, ఓపిక లేకపోవడం, భావోద్వేగ నియంత్రణ కోల్పోవడం తదితర చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. నిద్ర సరిగ్గా లేకపోతే మెదడులో కీలకంగా ఉన్న ‘అమిగ్డాలా’ అనే రసాయన పనితనం మందగిస్తుందని ఇటీవలే జర్నల్ ఆఫ్ రీసెర్చ్ తెలిపింది. కోపానికి, నిద్రకు సంబంధం ఉన్నట్లు ఆధారాలతో నిరూపించింది. నిద్ర సమస్యలను అధిగమించాలంటే పౌష్టికాహారం, వ్యాయాయం, మానసిక ప్రశాంతత మూడు కచ్చితంగా పాటించాలని డాక్టర్ ప్రజలకు సూచిస్తున్నారు. -
మానసిక ఆందోళనతో బాధపడ్డా: శ్రుతిహాసన్
హైదరాబాద్: నగరంలో స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ వ్యాయామం చేస్తు ఆశ్చర్యపరిచింది. గత కొంత కాలంగా సినిమాలకు విరామం ప్రకటించిన శ్రుతిహాసన్ తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తన నివాసానికి సమీపాన రన్నింగ్ చేస్తు కనిపించింది. సాయంత్రం రన్నింగ్ చేయడం వల్ల శారీరక, భావోద్వేగ నియంత్రణ సామర్థ్యం పెరుగుతుందని శ్రుతి హాసన్ అభిప్రాయపడింది. ఇటీవల తాను మానసిక ఆందోళన సమస్యతో బాధపడ్డాడని, నిరంతర వ్యాయామంతో అధిగమించానని తెలిపింది. తానెప్పుడు శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తానని, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని పేర్కొంది. తాను మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నానని, ఫైటింగ్ అంటే చాలా ఇష్టమని తన అభిరుచిని వ్యక్త పరిచింది. స్వతహాగా పాటలు పాడే శ్రుతి హాసన్ లాక్డౌన్ సమయంలోను సొంతంగా పాటలు రాశానని తెలిపింది. లాక్డౌన్లో సొంతంగా వంటలు వండానని, మాస్క్‌లను తయారు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. లాక్డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. శ్రుతి హీరోయిన్గా మాత్రమే కాకుండా గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా విభిన్న కోణాలతో తన అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే. -
మాస్కు ధరించి వ్యాయామం చేస్తున్నారా?
న్యూఢిల్లీ: గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని కొందరు శాస్త్రవేత్తలు బల్లగుద్ది చెప్తున్నారు. మొదట దీన్ని అంగీకరించని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గాలి ద్వారా వైరస్ సంక్రమణ జరుగుతుందని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారాలతో సహా లేఖ రాయడంతో ఆ తర్వాత ఒప్పుకోక తప్పలేదు. కాబట్టి ముందుజాగ్రత్తగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాల్సిందేనంటున్నారు నిపుణులు. అయితే వ్యాయామం చేసే సమయంలో మాస్కు పెట్టుకోవాలా? వద్దా? అన్న సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. కానీ వ్యాయామం చేసినప్పుడు మాస్కు పెట్టుకుంటే ఊపిరి ఆడటం కష్టమవుతుంది. (మాస్క్ చాలెంజ్!) కాబట్టి ఎక్సర్సైజ్ చేసేటపుడు మాస్కు పెట్టుకోకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఆ సమయంలో మాస్కు ధరిస్తే వచ్చే ప్రతికూలతలను కూడా వివరించారు. 'వ్యాయామం వల్ల వచ్చే చెమటతో మాస్కు నానిపోతుంది. అది వైరస్ వంటి సూక్ష్మజీవుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు ఒక మీటర్ కన్నా ఎక్కువగా భౌతిక దూరం పాటిస్తే సరిపోతుంద'ని సూచించారు. (కరోనా: ఆ దశకు భారత్ ఇంకా చేరుకోలేదు) Can people wear #Masks while exercising? People should NOT wear masks when exercising, as masks may reduce the ability to breathe comfortably.#IndiaFightsCorona @MoHFW_INDIA pic.twitter.com/5RV0vWvEcP — Dr Harsh Vardhan (@drharshvardhan) July 16, 2020 -
బెల్లీ ఫ్యాట్‌కు ఇలా చెక్ పెట్టండి..
అమ్మాయిలను ఎక్కువగా బాధించే విషయం బరువు, బెల్లీ ఫ్యాట్ (పొట్ట చూట్టు కొవ్వు పేరుకుపోవడం). దీంతో అధిక బరువుతో పాటు పొట్టను తగ్గించుకోవడానికి అమ్మాయిలు జిమ్‌లో గంటలు గంటలు కుస్తీ పడుతుంటారు. అయినప్పటికీ మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల పొట్ట చూట్టూ మళ్లీ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు కసరత్తులు చేయడం లేదా స్ట్రిక్ట్ డైట్‌తో నోరు కట్టేసుకుంటుంటారు అమ్మాయిలు. అయితే అలా చేయడం కూడా ఆరోగ్యానికి హానికరమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జీవక్రియ, శరీరంలోని సమతుల్యతతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చిరిస్తున్నారు. అందుకని వర్కవుట్స్ చేయకుండానే మనకు వంటింట్లో అందుబాటులో ఉన్న సుగంధ ద్రవ్యాలతో మీ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇవి కొవ్వును తగ్గించమే కాకుండా జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాదు శరీరంలో ఇన్సులిన్‌ను సమతుల్యం చేసి ఆరోగ్యంగా ఉంచడంతో పాటు పొట్ట చూట్టూ పేరుకున్న చెడు కొవ్వును కరిగిస్తాయి. ఇక అవేంటో చుద్దాం రండి . (పదే పదే శానిటైజర్ వాడుతున్నారా?) మిరియాలు: ఇది శరీరంలో థర్మోజెనిక్ ప్రభావాలను పెంచుతుందని పరిశోధనలో తెలినట్లు ప్రముఖ పోషకాహార నిపుణులు సుమయ డాల్మియా తెలిపాడు. అంటే ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచడంతో పాటు కొవ్వును కూడా కరిగించడంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేగాక జీవక్రియ రేటును కూడా వేగవంతం చేస్తుంది. మీ ఆహారంలో మిరియాలతో పాటు నిమ్మకాయను కూడా చేర్చండి. ఎందుకంటే నిమ్మకాయలోని సిట్రస్ మీ సిస్టమ్‌ను ఆల్కలీన్గా చేస్తుంది. శరీరంపై కారపు థర్మోజెనిక్ ప్రభావాలను సమతుల్యం చేస్తుంది. సోంపు గింజలు: ఇవి జీర్ణక్రియకు సహాయపడతంతో పాటు ఉబ్బుసం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్క: ఇది మీ ఇన్సులిన్, చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల పేరుకుపోయిన కొవ్వును విచ్చిన్నం చేస్తుంది. ఇంగువ: ఇది శరీరంలో అపానవాయువును తగ్గిస్తుంది. అపానవాయువును సృష్టించే ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీనిని తరచూ మీ ఆహారపు అలవాట్లలో దీనిని చేర్చుకోండని నిపుణులు సూచిస్తున్నారు. . ఆవ పిండి(గింజలు): ఇవి మీ ఆహారానికి సుగంధాన్ని ఇవ్వడమే కాకుండా కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. మెంతులు: ఇది ఆకలిని నియంత్రిస్తుంది. జంక్ ఫుండ్ తినాలన్న మీ ఆహార కోరికలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే మీ ఆహారంలో మెంతులను జోడించండి. పసుపు: ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో సహయపడుతుంది. కొవ్వును కరిగించడంలో సహయపడే హార్మోన్ లెప్టిన్‌ను మరింత విడుదల చేయడానికి జీవక్రియ ప్రక్రియలో అనుమతిస్తుంది. యాలకులు: ఇది ఉబ్బరం, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేసే మెలటోనిన్‌ను కూడా ప్రాసెస్ చేస్తుంది. యాలకులు శరీరంలో పేరుకుపోయిన చెడును కొవ్వును మూత్రవిసర్జన ద్వారా బయటకు పంపిస్తుంది. -
చెమట పట్టడం శరీరానికి మంచిదేనా?
న్యూఢిల్లీ: సాధారణంగా మనిషికి అధికంగా చెమట పట్టిందంటే ఆరోగ్యంగా ఉన్నారని అంటారు. కానీ ప్రస్తుత సమాజంలో అధికంగా చెమట వచ్చినప్పటికి అనారోగ్యానికి కారణమని కొందరు అపోహలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకీ మనిషికి చెమట పట్టడం మంచిదా? కాదా?. మరి ఇందుకు సంబంధించిన వాస్తవాలను విశ్లేషిద్దాం.. మనిషి ఆరోగ్యానికి చెమట ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో విపరీతమైన వేడితో చెమట సాధారణం కంటే అధికంగా వస్తుంది. వేసవిలో శ్వేధం అధికంగా స్రవించడం వల్ల శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ద్రవాలను కోల్పోతాం. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు విపరీతమైన వేడి, తేమ (గాలిలో ఆవిరి) వల్ల జుట్టు పొడిబారుతోంది. ఒత్తయిన జట్టును సొంతం చేసుకోవాలంటే నిత్యం నీటితో శుభ్రం చేసుకోవాలి. కానీ కొన్ని కాస్మోటిక్ కంపెనీలు చమట పట్టడాన్ని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారు. అయితే కంపెనీల ప్రకటనలను చర్మ వ్యాధి నిపుణులు కొట్టిపారేశారు. ఆరోగ్యానికి చెమట ఎంతో మేలు చేకూరుతుందని వైద్యులు తెలిపారు. మనిషికి చెమట రాకపోతే శరీరంలో ఉన్న మలినాలు చర్మం నుంచి బయటకు వెళ్లవని వైద్యులు పేర్కొంటారు. మనిషి చాలినంత చెమటను బయటకు స్రవించడం ద్వారా మొఖం మీద మొటిమలు రాకుండా చెమట గ్రంథులు నిరోధిస్తాయని అంటున్నారు. చర్మ సంరక్షణకు నిరంతర వ్యాయామంతో పాటు సమతుల ఆహారం (balanced diet) ఎంతో ముఖ్యం. జిమ్‌లో నిరంతరం వర్క్‌వుట్ చేసే వారి చర్మం చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో చెమట కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావాలసిన చెమట స్రవించడం వల్ల మనిషికి దాహం వేస్తుంది. దీంతో దాహం తీరడానికి ఎక్కువగా నీళ్లను తీసుకుంటారు. శరీరానికి కావాల్సిన నీరు తీసుకోవడం వల్ల చర్మ సంరక్షణకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మం నుంచి చెమట స్రవించడం వల్ల శరీరానికి ఉపయోగపడే ఖనిజాలు విడుదలవుతాయని.. ఇవి పొడిబారిన చర్మాన్ని, యూరియా, యూరిక్ యాసిడ్, చెడు బ్యాక్టీరియా,అలర్జీ సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడతాయి. వ్యాయాయం పూర్తయిన తర్వాత కచ్చితంగా స్నానం చేయాలని.. ముఖ్యంగా మెడ ప్రాంతంపై చెమట ఎక్కువ వస్తుంది కాబట్టి నిత్యం శుభ్రం చేసుకోవాలని, శరీరాన్ని నిత్యం సున్నితంగా శుభ్రం చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. -
బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఇలా చేయండి
బెల్లి ఫ్యాట్.. ప్రతి ఒక్కరిలో కనిపించే సాధారణ సమస్య. పొట్ట చుట్టూ కొవ్వు బాగా పేరుకుపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. సమయానికి భోజనం చేయకపోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం, ఒత్తిళ్లతో కూడిన జీవితం, జంక్‌ఫుడ్ ఎక్కువగా తినడం. వ్యాయామం చేయకపోవడం ఇలాంటి కారణలతో ఈ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఓ వ్యక్తి, మహిళ చూడటానికి ఎంత అందంగా ఉన్నా తనకున్న బెల్లి ఫ్యాట్ ఆ అందాన్ని తగ్గిస్తుంది. లేదా ఆ అభిప్రాయాన్ని వెంటనే మార్చుతుంది. దీని నుంచి విముక్తి పొందాలనుకుంటే మాత్రం కొంచెం ఒళ్లు వంచి కాలరీలు కరిగించాల్సిందే. రోజూ ఉదయం అయిదు నిమిషాలు చేసే వ్యాయామం ద్వారా మనం బరువు తగ్గించవచ్చు అన్న విషయం మీకు తెలుసా.. లేదా కేవలం రెండు నిమిషాల పాటు చేసే వ్యాయామం మనలోని కొవ్వును అంతం చేస్తుందన్న విషయం తెలుసా.. అవునండి వాస్తవాలే. అలసటను తగ్గిస్తుంది. ఉదయం పూట చేసే వ్యాయామం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నిద్రను మెరుగుపరుస్తుందని పరిశోధనలో రుజువైంది. దీనివల్ల బరువు, బెల్లి ఫ్యాట్ కూడా తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలసటను తగ్గించి రోజంతా మనకు ఉల్లాసాన్ని, శక్తిని అందిస్తుంది. అదే విధంగా మానసిక స్థితి మెరుగుదలకు దోహదపడి ఏకాగ్రతను పెంచుతుంది. ఈ వేళలో ప్రసరించే అల్ట్రా వయోలెట్ కిరణాలు ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికడతాయి. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నందునే ఉదయం వేళలో వ్యాయామం చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తారు. అయితే ఉదయం చేసే వ్యాయామం తమ ఫిట్నెస్ దినచర్యకు అనుగుణంగా ఉంటాలని నిపుణులు సూచిస్తున్నారు. (కరోనా: వర్క్ ఫ్రం హోం వాళ్లు ఇలా చేయండి!) బరువు తగ్గడానికి ఉదయం చేసే ఉత్తమ వ్యాయామాలు బెల్లి ఫ్యాట్, బరువు తగ్గేందుకు అయిదు నిమిషాలు రోజూవారి వ్యాయామం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇది నేర్చుకోవడం కూడా ఎంతో సులభం. ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఎక్కడైన చేయవచ్చు. దీన్ని సులభంగా దినచర్యలో భాగం చేయవచ్చు. ఇది బెల్లి ఫ్యాట్‌ను తగ్గించి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. 1.. పవర్ పుష్-అప్స్ జీవక్రియను పునరుద్ధరించడానికి, బరువు తగ్గడానికి అలాగే కండరాలను బలోపేతం చేయడానికి పుష్అప్స్ సహాయపడతాయి. ఉదయం పూట మీరు చేయగలిగే వ్యాయామాలలో ఇది ఉత్తమైనది. పవర్ పుష్-అప్స్ చేయడం వలన మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. బలమైన ఉదర కండరాలను నిర్మించడంలో ఇది సహాయపడుతుంది. పవర్ పుష్-అప్స్ ఎలా చేయాలి: ► తలక్రిందులుగా ఉన్న ‘V’ భంగిమలో ఉండి, మోకాళ్ళతో వంగి, నడుము వెనక భాగాన్ని పైకి ఉంచి ప్రారంభించండి. ► మీ చేతులను భుజం-వెడల్పు కంటే కొంచెం వెడల్పుగా ఉంచి ఫోటోలో చూపించినట్లు ఉంచండి. ► మీ మోకాళ్ళను వంచి, మీ మోచేతులను పూర్తి పుష్-అప్ స్థానంలో వంచినప్పుడు బరువును ముందుకు ఉంచడి. ► V భంగిమను కొనసాగిస్తూ, మొదట ప్రారంభించినట్లు నడుము వెనక భాగాన్ని పైకి అనండి. ► రెండు భంగిమల మధ్య ముందుకు వెనుకకు బౌన్స్ అవుతూ సుమారు 5 నిమిషాలు వీటిని చేయండి. జంపింగ్ జాక్స్ ఇతర కార్డియో వర్కౌట్ల మాదిరిగా, ఉదయపు వ్యాయామంలో దీని చేర్చడం వల్ల మంచి ఆరోగ్య ఫలితాను ఇస్తుంఇ. ఇది ఆరోగ్యకరమైన గుండెకు ఉపయోగపడుతుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జంపింగ్ జాక్స్ ఎలా చేయాలి: ► మీ పాదాలతో నిటారుగా నిలబడండి. ►ఫోటోలో చూపించినట్టుగా ఒక్కసారిగా పైకి ఎగిరి మీ కాళ్లను కొంచెం దూరంగా విస్తరించడండి. మీ చేతులను మీ తలపైకి తీసుకువచ్చేటప్పుడు భుజం కంటే పైకి తీసుకురండి. ►మళ్లీ మీ చేతులను యధాస్థితికి తీసుకు వచ్చి, మీ కాళ్లను ఒకచోట చేర్చండి. ►ఒకవేళ మీకు ఈ వ్యాయామంలో అనుభవం ఉంటే తక్కువ వేగంతో చేయండి. ఇలా పదిసార్లు కొద్ది కొద్ది సమయం గ్యాప్‌తో చేయండి. ►దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి ప్రతిరోజూ ఈ వ్యాయామం కోసం నిర్ధిష్ట సమయాన్ని కేటాయించండి. కేవలం 10 నిమిషాలు అయినా సరిపోతుంది. ► ఒకవేళ ఉదయం ఈ వ్యాయామం చేయలేకపోతే ఫర్వాలేదు. సాయంత్రం అయినా మీరు ఈ దినచర్యను కొనసాగించండి. -
లాక్డౌన్: ఫిట్నెస్ కోసం ఇంట్లోనే ఇలా ...
లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉంటున్న వారంతా బద్దకంగా తయారవుతున్నారు. రోజూ బిజీబిజీ జీవితాన్ని అనుభవించే వారు ఒక్కసారిగా ఇంటి పట్టున ఉండటంతో ఏం చేయాలో తోచక సతమతమవుతున్నారు. కొందరు తమకు నచ్చిన వ్యాపకాలపై దృష్టి పెడుతుండగా మరికొంత మంది ఏదైనా కొత్తగా నేర్చుకోవడం వంటి పనులతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే లాక్డౌన్ కాలంలో తమ ఫిట్నెస్ను కోల్పోతున్నామని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. జిమ్ములు, ఫిట్నెస్ సెంటర్లు మూత పడటంతో తలబాదుకుంటున్నారు. దీంతో ఇంట్లోనే ఎలా వ్యాయామం చేయాలనే ట్రిక్స్ నేర్చుకుంటున్నారు. వారి కోసం ఫిట్నెస్ ట్రైనర్స్ కొన్ని సూచనలు ఇస్తున్నారు. (మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆరోపణలు ) ఈ క్రమంలో విటమిన్ ఎఫ్ 3 ఫిట్‌నెస ట్రైనర్ రఫిక్ షేక్ ఓ సులభమైన వ్యాయామాన్ని పరిచయం చేశారు. ఎలాంటి శ్రమ లేకుండా చక్కగా ఇంట్లోనే 20 నిమిషాలపాటు చేసుకునే వ్యాయామానికి సంబంధించి కొన్ని టిప్స్‌ను తెలిపారు. ఇందుకు ఫాన్సీ గేర్, ఎలాంటి మెషీన్లు కూడా అవసరం లేదు. కేవలం ఒక బాటిల్ వాటర్, హ్యండ్ టవల్, షూస్‌తోపాటు ఓ చాప ఉంటే సరిపోతుంది. ఇందులో వామ్అప్, డ్యాన్స్ థెరపీ, కండిషనింగ్, కార్డియో కిక్ బాక్సింగ్ వంటివి ఉంటాయి. దీన్ని ఇంట్లో ఏ ప్రదేశంలోనైనా చేయవచ్చు.. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ వీడియో చూసి మీరు కూడా ప్రయత్నించండి. (అత్యవసర ప్రయాణాలకు ఏపీ సరికొత్త నిర్ణయం ) -
వైరస్ భయపడుతుంది!
‘‘మా నాన్నగారు (దర్శక–నిర్మాత, నటుడు రాకేష్ రోషన్) ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. 71 ఏళ్ల వయసులోనూ ప్రతిరోజూ రెండు గంటలు వ్యాయామం చేస్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి ధృడసంకల్పం మనందరికీ ఈ సమయంలో ఉండాలి’’ అంటున్నారు హృతిక్ రోషన్. లాక్డౌన్ నేçపథ్యంలో అందరూ ఇళ్లకు పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ ఖాళీ సమయంలో తండ్రి వ్యాయామం చేస్తున్న వీడియోను షేర్ చేశారు హృతిక్. ‘‘గత ఏడాదే మా నాన్నగారు క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఈ వయసులోనూ క్రమశిక్షణగా వ్యాయామం చేస్తున్నారు. ఆరోగ్యం పట్ల ఆయనకు ఉన్న పట్టుదలను చూసి వైరస్ కూడా భయపడుతుందనిపిస్తోంది’’ అని షేర్ చేసిన వీడియోకు కామెంట్ జోడించారు. ఇదిలా ఉంటే లాక్డౌన్ పూర్తయ్యాక 1980లో వచ్చిన హిందీ చిత్రం ‘ది బర్నింగ్ ట్రైన్’ రీమేక్‌లోను, 1982లో వచ్చిన ‘సత్తే పే సత్తా’ రీమేక్‌లోనూ హృతిక్ నటించే అవకాశాలు ఉన్నాయట. -
దంగల్..కండల్..
మట్టిని నమ్ముకున్నోడికి ఎప్పుడూ నష్టం రాదన్నట్టే... మట్టిలో వ్యాయామ చేసేవారి ఆరోగ్యం ఎన్నటికీ చెక్కుచెదరదు అంటున్నారు పాతకాలం నాటి వ్యయామ ప్రియులు. ఇక్కడ వ్యాయామం చేసేందుకు ఉంచే దంగల్ మట్టిలో వివిధ రకాల ఔషధ గుణాలు ఉన్న పదార్థాలను కలుపుతారు. జల్లెడ పట్టిన చెక్కపొట్టు, నూనె, గంధం పౌండర్, పచ్చ కర్పూరం, నిమ్మకాయ రసం, నెయ్యి వంటి పదార్థాలను కలుపుతారు. దీని ద్వారా మట్టి సుగంధభరితమై అలసటను దూరం చేస్తోంది. ఈ మట్టిలో వ్యాయామాలు చేయడం ద్వారా చర్మవ్యాధులు కూడా దూరమవుతాయని ట్రైనర్స్ చెబుతున్నారు. సనత్‌నగర్: నగరంలో దశాబ్దాల నాటి చరిత్ర కలిగిన వ్యాయమశాలలకు ఆదరణ పూర్తిగా తగ్గలేదు. సరికొత్తగా పుట్టుకొస్తున్న జిమ్‌ల పోటీని ఎదుర్కొంటున్న స్వదేశీ వ్యాయామానికి మరేదీ సాటి లేదు.. రాదు.. అంటున్నారు పాతకాలం నాటి వ్యాయామశాల నిర్వాహకులు. నాలుగ్గోడల మధ్య ఏసీల మధ్య మెత్తని కార్పెట్స్ మీద చేసే వర్కవుట్స్ సిసలైన శారీరక ఫిట్నెస్ను అందివ్వలేవని, దంగల్ మట్టిలో చేసే వ్యాయామానికి తిరుగులేదని అంటున్నారు. బలం.. అ‘పార’ం.. కాయం కష్టిస్తేనే ఆరోగ్యం సిద్దిస్తుందనేది జగమెరిగిన సత్యం. ఇసుక లారీలపై పారలతో పనిచేసే వారిని గమనిస్తే ఆ కాయాకష్టం వారి దేహాన్ని ఏవిధంగా మలుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆనాటి వ్యాయామశాలల్లో మట్టిని నేలపై పోసి పారలతో తవ్వడం, కాళ్లతో దున్నడాన్ని వ్యాయమ ప్రక్రియగా చేర్చారు. పారలతో మట్టిని తవ్వడం ద్వారా కాలి చిటికెన వేలు నుంచి మెదడు వరకు నరాలు ఉత్తేజితమవుతాయి. అలాగే పారకు ఉన్న కర్రను సడలకుండా పట్టుకోవడం అంటే మల్లయుద్ధంలో ప్రత్యర్థిని పట్టుకోవడంలో గ్రిప్‌ను సాధించడమే అన్నమాట. ఈ పారతో వ్యాయామం చేసే మట్టి ప్రాంతాన్ని దంగల్గా పేర్కొంటారు. ఆధునిక వ్యాయామ పద్ధతులకు భిన్నంగా ఇక్కడ కేవలం లంగోటిల మీదనే వ్యాయామం చేస్తారు. దీని ద్వారా శరీరంలో ప్రతి అవయానికి ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది. పాతొక వింత.. ప్రస్తుతం రాజ్యమేలుతున్న ఫిట్నెస్ సెంటర్ల ద్వారా ఫిజిక్ షేపులే తప్ప సిసలైన శారీరక దృఢత్వం రాదని, పాతకాలపు వ్యాయామ స్ట్సైల్స్ ద్వారా సిసలైన ఫిట్నెస్తో పాటు మానసిక దృఢత్వాన్ని కూడా సంతరించుకోవచ్చన్నది నాటి వ్యాయామ నిపుణులు చెబుతున్నారు. నగరంలో బల్కంపేట, ఫతేనగర్, బేగంబజార్, గౌలిగూడ, మూసాపేట్, సనత్‌నగర్, కింగ్‌కోఠి, చిలకలగూడ, ఎర్రగడ్డ, ఎస్ఆర్నగర్ బీకేగూడ తదితర ప్రాంతాల్లో పాతకాలపు శైలిని కొనసాగిస్తున్న వ్యాయామశాలలు ఇంకా రద్దీగానే ఉన్నాయి. దీనికి కారణం వీటి ద్వారా వచ్చే లాభాలే అంటున్నారు వ్యాయామప్రియులు. మట్టిలో చేసే పలు రకాల వ్యాయామాల గురించి ఇలా చెబుతున్నారు. ముగ్దార్.. భుజబలం.. పొడవాటి దుంగ మాదిరిగా గుండ్రంగా ఉండే బరువైన ముగ్దార్ను రెండు చేతులతో తల వెనుక వైపుగా చుట్టూ తిప్పడం ద్వారా మోచేతులు, భుజ కండరాలు బలోపేతం అవుతాయి. ఈ కసరత్తు కూడా దంగల్ మట్టిలో గానీ, నేలపై తమకు అనుకూలమైన ప్రదేశంలో ఎక్కడైనా చేయవచ్చు. అస్లీ.. సత్తా.. రింగ్ ఆకృతిలో దాదాపు 40 కిలోల బరువున్న రాయి(అస్లీ) మెడలో వేసుకుని దంగల్ మట్టిని కాళ్లతో దున్నుతారు. దీనిని మెడకు గర్దన్ వ్యాయామంగా కూడా పేర్కొంటారు. ఈ ప్రత్యేకమైన కసరత్తుతో మెడ భాగంలోని నరాలు చైతన్యమవుతాయి. అలాగే మెడలో అంతటి బరువుతో దంగల్ను దున్నడం ద్వారా కాళ్ల జాయింట్స్ బలంగా మారతాయి. కాలి కండరాల సామర్థ్యం పెరుగుతుంది. క్లైంబ్..రోప్ పాతకాలం నాటి వ్యాయామ ప్రక్రియలో రోప్ క్లైంబింగ్ ఒకటి. తాడును ఎక్కి, దిగడం ద్వారా తన బరువును తాము మోసుకుంటూ పైకి వెళ్లడమే కసరత్తు. దీని ద్వారా చేతుల నరాలు రాటుదేలుతాయి. రోప్ ఎక్కి దిగే క్రమంలో సమయాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటారు. వయస్సును బట్టి నిర్దేశిత టైమ్‌లో రోప్ క్లైంబింగ్ చేయాల్సి ఉంటుంది. దమ్ బై టక్ (సపాయ్).. పాతకాలం వ్యాయామంలో దమ్ బైటక్ ఒకటి. నేలపై అరచేతులు ఉంచి కాలి మునివేళ్లపై నుంచి మొత్తం బాడీని లేపడమే ఈ కసరత్తు. బైటక్(బస్కీలు కొట్టడం) ద్వారా కూర్చొని, లేవడం మరో కసరత్తు. ఇక ‘అతా’ (రెండు వైపులా హ్యాండిల్ కలిగిన పరికరం)పై చేతులు ఉంచి దమ్ బై టక్ చేయడం ఇంకోరకమైన కసరత్తు. ఇది చెస్ట్‌కు మంచి వ్యాయామం. ఆహారమూ.. సహజమే.. ఈ తరహా వ్యాయామశాలల్లో వర్కవుట్ చేసేవారు నేచురల్ డైట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. శెనగలు, బెల్లం, ఎండుకొబ్బరి, మినపప్పు తదితర ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అది కూడా నిర్దేశిత పరిమాణంలో మాత్రమే. బార్ బార్ దేఖో.. సమాంతరంగా ఉన్న రెండు రాడ్ల ఆధారంగా బార్ కసరత్తు జరుగుతుంది. వెనుక వైపుగా సింగిల్ రాడ్‌ను రెండు చేతులతో పట్టుకుని మొత్తం బాడీని మెలితిప్పి రెండో రాడ్‌కు కాళ్లను తాకించడమే ఈ కసరత్తు ప్రత్యేకం. ఇది ఛాతీ కండరాలను బలంగా మారుస్తుంది. ఇదే ఆరోగ్యకరం.. ఆధునిక జిమ్‌ల్లో షూస్, చెప్పులతో చేయిస్తారు. ఇక్కడ చెప్పులకు కూడా అనుమతి ఉండదు. అంతా సహజమైన పద్ధతుల్లో ఉంటుంది. ఇక్కడ వస్తాదుగా ఉన్న లక్ష్మయ్య ఇదే వ్యాయామం చేసి 98 ఏళ్లు జీవించాడు. – రాజు, ఖలీఫ్, శ్రీవీర హనుమాన్ వ్యాయామశాల శరీరం ఉత్తేజితం.. శరీరాన్ని మొత్తం ఉత్తేజితం చేసే వ్యాయాయ పద్ధతులు ఇక్కడ ఉంటాయి. అందుకే పాతకాలం పద్ధతులైనా ఇలాంటి జిమ్‌ను ఎంచుకున్నాను. నాతో పాటు ఎంతోమంది ఈ జిమ్‌కు వస్తున్నారు. – కార్తీక్, శిక్షకులు -
డయాబెటిస్ రోగుల వ్యాయామాలెలా ఉండాలి?
నా వయసు 62 ఏళ్లు. గత పదేళ్లుగా నేను డయాబెటిస్తో బాధపడుతున్నాను. చక్కెర రోగులకు వ్యాయామం అవసరమని డాక్టర్లు చెప్పారు. డయాబెటిస్ రోగుల వ్యాయామం విషయంలో మేమెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి వివరించండి. డయాబెటిస్ ఉన్నవారు వ్యాయామం చేయడం వల్ల మరింత మెరుగైన జీవనాన్ని సాగించగలరు. దీనివల్ల ఇన్సులిన్ పట్ల శరీరం బాగా స్పందించడంతో పాటు ఒంట్లోని చక్కెరపాళ్లు కూడా తగ్గుతాయి. అయితే దీనికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ►వ్యాయామానికి మీ శరీరం సంసిద్ధంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇందుకోసం ముందుగా స్థూలకాయం ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. గుండెజబ్బులు ఏవైనా ఉన్నాయా లేదా అని కూడా తెలుసుకోవాలి. శరీరానికి ఏ మేరకు వ్యాయామం కావాలో, ఏ మేరకు సురక్షితమో కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల కూడా కొన్ని సమస్యలు రావచ్చు. ►వ్యాయామానికి ముందుగా మీ ఒంట్లోని చక్కెర పాళ్లు తెలుసుకోవాలి. అవి మరీ ఎక్కువగా ఉన్నా, లేదా మరీ తక్కువగా ఉన్నా, రక్తంలోనూ, మూత్రంలోనూ కీటోన్స్ ఉన్నా శరీరకంగా ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయకూడదు. డయాబెటిస్ ఉన్నవారిలో ఒక్కోసారి వ్యాయామం వారి పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. ►ఒకవేళ రక్తంలోని చక్కెరపాల్లు 100 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటే వ్యాయామానికి ముందు కాస్త టిఫిన్ తిన్నతర్వాతే మొదలుపెట్టాలి. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే శ్నాక్స్ లేదా ఏదైనా పండు వంటిది తినాలి. ఒకవేళ రక్తంలో చక్కెర పాళ్లు త్వరత్వరగా పడిపోతుంటే తక్షణం చాక్లెట్ లాంటి తీపిపదార్థం ఏదైనా తీసుకోవాలి. ►మన శరీరానికి, మెదడుకు అవసరమైనంత ద్రవాహారం అందేలా చేసుకోవాలి. ఇందుకోసం వ్యాయామానికి ముందర, వ్యాయామం తర్వాత తగినన్ని నీళ్లు తాగాలి. వ్యాయమాన్ని మొదలుపెట్టడానికి తక్షణం ముందుగా, వెంటనే ఆ తర్వాత నీళ్లు తాగకూడదు. ►వాతావరణంలో చాలా ఎక్కువగా వేడి ఉన్నప్పుడు శరీరం వెంటనే అలసిపోయే వ్యాయామాలు చేయకూడదు. ఎందుకంటే కొందరిలో శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధంగా ఉంచేంత సామర్థ్యం ఉండదు. అలాంటి సందర్భాల్లో చెమటను, రక్తప్రసరణను నియంత్రించే అటనామిక్ నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే బాగా వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో ఆరుబయట వ్యాయామం చేయవద్దు. ►డయాబెటిస్ వల్ల ఒక్కోసారి పాదాలకు జరిగే రక్తప్రసరణ తగ్గి వాటిని అయ్యే గాయాలు తెలియకపోవచ్చు. పాదాలకు తిమ్మిర్లు (పెరిఫెరల్ న్యూరోపతి) రావచ్చు. మీ పాదాలకు ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోవాలి. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉత్పన్నమైనా వెంటనే తమకు దగ్గరివారికి తెలియజేసేలా మీ మొబైల్‌ఫోన్‌ను వెంటే ఉంచుకోండి. మీ వ్యాయామం ప్లానింగ్‌లో మీ కుటుంబ సభ్యులనూ భాగం చేసుకోండి. ప్రతిరోజూ ఒకేలాంటి వ్యాయామాలు రిపీట్ కానివ్వకండి. ఒకరోజు బాగా శారీరక శ్రమ ఉన్నవి చేస్తే మరో రోజు తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇలా రోజువిడిచి రోజు వ్యాయామాలను మార్చుకుంటూపొండి. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
వ్యాయామానికి ప్రత్యామ్నాయంగా ప్రొటీన్ సప్లిమెంట్?
వయసులో ఉన్నప్పుడు వ్యాయామం గట్రా చేయడం పెద్ద ఇబ్బందేమీ కాకపోవచ్చు. వద్ధులు... వికలాంగులు, గాయాలపాలైన వారి పరిస్థితి ఏమిటి? వారికి వ్యాయామం అవసరమున్నా.. చేయలేని పరిస్థితి. కొంచెం చిత్రమైన ఈ సమస్యను అధిగమించేందుకు మిషిగన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. కేవలం ఒక ప్రొటీన్ సప్లిమెంటను ఆహారంగా తీసుకోవడం ద్వారా వ్యాయామం తాలూకూ అన్ని ప్రయోజనాలు పొందవచ్చునని వీరు అంటున్నారు. శరీరంలో సహజంగా ఏర్పడే సెస్ట్రిన్ అనే ప్రొటీన్ వ్యాయామం తరువాత కండరాల్లో పేరుకుపోతుందని గతంలోనే గుర్తించారు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని తాము ప్రయోగాలు మొదలుపెట్టామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న జూ హన్ లీ తెలిపారు. ఈగలపై తాము పరిశోధనలు చేశామని ఒక గుంపు సాధారణమైన ఈగలు కాగా.. ఇంకోదాంట్లో సెస్ట్రిన్ ఉత్పత్తి జరక్కుండా చూశామని, మూడోదాంట్లో ఎక్కువ స్థాయిలో సెస్ట్రిన్ ఉత్పత్తి అయ్యేలా చేశామని జూ హన్ లీ వివరించారు. మూడు గుంపుల ఈగలూ శారీరకంగా శ్రమపడేలా చేసినప్పుడు సెస్ట్రిన్ ఎక్కువగా ఉన్న ఈగల సామర్థ్యం బాగా పెరిగినట్లు గుర్తించారు. శారీరక శ్రమ లేనప్పుడు కూడా వీటి సామర్థ్యం తగ్గకపోవడాన్ని బట్టి సెస్ట్రిన్ ద్వారా వ్యాయామం తాలూకూ ఫలితాలు అందుతున్నట్లు గుర్తించారు. భవిష్యత్తులో ఈ సెస్ట్రిన్ ప్రొటీన్‌ను సప్లిమెంట్‌గా ఇవ్వడం ద్వారా శ్రమ లేకుండానే వ్యాయామం తాలూకూ ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుందని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. -
‘ఫిట్ ఇండియా.. ఫిట్ స్కూల్’
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో వ్యాయామ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర యువజన సర్వీసుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఫిట్ ఇండియా ఫిట్ స్కూల్ విధానం అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రతి పాఠశాలలో కచ్చితంగా నిత్యం వ్యాయామం చేయాలని, ఇందుకోసం అనుసరించాల్సిన విధివిధానాలను విడుదల చేసింది. స్కూళ్లలో అమలు చేయాల్సిన కార్యక్రమాలు.. సోమవారం: యోగా, వ్యాయామం చేయడంతో పాటు శారీరక దృఢత్వం కోసం అనుసరించాల్సిన విధానాలు, శరీరం సౌష్టవంగా ఉంటేనే మనసు పూర్తి స్థాయిలో పని చేస్తుందనే విషయాలను నిపుణులతో చెప్పించాలి. మంచి పోషకాహారాన్ని నిత్యం తీసుకోవాలని పోషకాహార నిపుణుల సలహాలు ఇప్పించాలి. మంగళవారం: ప్రార్థన సమయంలో కొంతసేపు కచ్చితంగా కాళ్లు, చేతులు ఆడిస్తూ వ్యాయామం చేయాలి. పాఠశాలల పని వేళల్లో సమయం ఏర్పాటు చేసుకొని శరీరానికి శ్రమ కల్గించే ఆటలు ఆడడం, క్రీడలతో మానసిక ఆరోగ్యం ఎలా సాధ్యమవుతుందో వివరించే ప్రసంగాలు ఇప్పించాలి. ఇందుకోసం అందుబాటులో ఉన్న పేరు పొందిన క్రీడాకారులను పాఠశాలలకు ఆహ్వానించి వారితో తమ ఆరోగ్య రహస్యం వివరించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. బుధవారం: వ్యాయామ ఉపాధ్యాయులు ‘ఖేలో ఇండియా యాప్’ను అనుసరిస్తూ.. అందులో పేర్కొన్న శారీరక దారుఢ్యం పెంపొందించుకునే చిట్కాలను వివరించాలి. వయసుకు తగిన శరీరాకృతితో మంచి ఆరోగ్య సౌభాగ్యం పొందే అంశాలపై వాల్ పోస్టర్ల ద్వారా విద్యార్థులకు వివరించాలి. గురువారం: శరీరంలోని అన్ని అవయవాల్లో చురుకుదనం పెంచేందుకు నృత్యం, ఏరోబిక్స్, ఆత్మరక్షణ విద్యలు, యోగాసనాలు, తాడుతో ఎగురుడు ఆటలు, స్కిప్పింగ్, తోట పని నేర్పించాలి. విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించాలి. వక్తృత్వం, వ్యాసరచన, గేయాల రచన, పాటలు పాడటం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. శుక్రవారం: సాధారణ శరీరాకృతికి సంబంధించిన ఆటలు, వ్యాయమం పట్ల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించాలి. వివిధ పాఠశాలలు అనుసరిస్తున్న కొత్త రకం వ్యాయామ కార్యక్రమాలపై సమాచారం సేకరించి తమ పాఠశాలల్లో అమలు చేయాలి. శనివారం: నిపుణులు సూచించిన వ్యాయామాలు, ఆటలతోపాటు స్థానికంగా బహుళ ప్రచారం పొందిన ఆటలు ఆడించాలి. కబడ్డీ, బొంగరాలు తిప్పడం, దొంగ పోలీస్ ఆట, కుప్పిగంతులాట, వేగంగా నడవడం, పరుగెత్తడం, పుస్తకాలలోని పాఠ్యాంశాలను మనో పఠనంతో వేగంగా చదవడం కంటికి వ్యాయామం కలిగించినట్లవుతుందని, నిపుణులు భావించి వీటిని ఆటవిడుపుగా నిర్వహించాలని పేర్కొంది. -
న్యూ ఇయర్ నిర్ణయాలు కొనసాగాలంటే
కొత్త సంవత్సరం వస్తోందనగానే అదో సందడి, హడావుడి, రంగురంగుల సంబరం. ఆ రోజు వరకు ఉన్న పాత అలవాట్లను విడిచి, కొత్త అలవాట్లతో సరికొత్త జీవితాన్ని అందంగా, ఆనందంగా ప్రారంభించాలని రాత్రికిరాత్రే ఉరుకులుపరుగుల మీద కొత్త కొత్త నిర్ణయాలు తీసేసుకుంటారు. ‘అది మానేయాలి, ఇది మానేయాలి’ అని పెద్ద పెద్ద ఒట్లు పెట్టుకుంటారు. అందరిచేతా మంచి అనిపించుకోవాలనుకుంటారు. ఎక్కువగా తీసుకునే నిర్ణయాలు వ్యాయామం చేయటం, బరువు తగ్గాలనుకోవటం, పద్ధతిగా ఉండాలనుకోవటం, కొత్త నైపుణ్యాలు సాధించాలనుకోవటం, ఆనందంగా ఉండాలనుకోవటం, తక్కువ డబ్బు ఖర్చు చేసి ఎక్కువ దాచాలనుకోవటం, ధూమపానం విడిచిపెట్టాలనుకోటం, కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపాలనుకోవటం, ప్రయాణాలు చేయాలనుకోవటం, పుస్తకాలు చదవాలనుకోవటం. జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకాలజీ స్టడీ ప్రకారం ‘ఈ నిర్ణయాలు తీసుకున్నవారిలో కేవలం 46 శాతం మంది మాత్రమే వాటిని అమలుపరుస్తున్నారు’ అని తెలుస్తోంది. ఆ రోజు నిర్ణయాలు తీసుకోకపోయినా, ఆ తరవాత.. ఏదో ఒకటి సాధించాలని కొందరు అనుకుంటున్నారట. అలా అనుకున్నవారిలో నాలుగు శాతం మంది మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నారట. ఆచరించటానికి పాటించాల్సినవి.. నిర్ణయాలు తీసుకుని, వాటిని ఆచరణలో ఉంచుకోవటానికి కొన్ని మార్గాలు ఉన్నాయని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. ►తప్పనిసరిగా మారాలని మనసును సిద్ధం చేసుకోవాలి. గత సంవత్సరం ఏయే అంశాలను పాటించలేదు? ఎందుకు సాధించలేకపోయాను? అని ఎవరికివారు ప్రశ్నించుకుని, వాటిని సరిచేసుకోవాలి. ►సాధించగలిగే లక్ష్యాలను మాత్రమే ఎంచుకోవాలి. ►తక్కువ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ►నిర్ణయాన్ని పాజిటివ్ కోణంలో తీసుకోవాలి. అంటే.. సిగరెట్ మానేయాలి అనుకోవడం కంటె, ఆరోగ్యంగా ఉండాలి అనుకోవడం మంచిది. ►పెద్ద పెద్ద లక్ష్యాలను బ్రేక్ చేసి చిన్న చిన్న లక్ష్యాలుగా సెట్ చేసుకోవాలి. ఏడాది పాటు ఒకే నిర్ణయానికి కట్టుబడకుండా, వారానికి, నెలకు చొప్పున నిర్ణయాలను నిర్దేశించుకోవాలి. వ్యవధిని తగ్గించుకుని క్రమంగా పెంచుకుంటూ పోవాలన్నమాట. ►లక్ష్యాలను ఒక బోర్డు మీద రాసుకుని, రోజూ టిక్కులు పెట్టుకోవాలి. ►తీసుకున్న నిర్ణయాలను ఇతరులతో పంచుకోవాలి. ►మొబైల్స్‌లో రిమైండర్ ఆప్స్ ఉంటాయి కనుక, అవి సమయానికి తగ్గట్టుగా గుర్తు చేసేలా సెట్ చేయాలి ►ప్రతిరోజూ ఎంతవరకు పాటించామో చూసుకోవాలి. ►నిర్ణయాలు తీసుకున్న వారం తరవాత కూడా ఆచరణలో పెట్టకపోతే, వెంటనే ఆచరణ ప్రారంభించాలి. ఈ చిన్న చిన్న సూచనలను పాటిస్తే, మనం తీసుకున్న నిర్ణయాలను సంపూర్ణంగా ఆచరించగలుగుతాం. ఏ మాత్రం అలసత్వం వహించినా వారం గడిచేసరికల్లా కొత్త ఏడాది పాతబడిపోతుంది. దాంతో నిర్ణయాలు కూడా పాత సామాన్ల అటక మీదకు ఎక్కి హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతాయి. తస్మాత్ జాగ్రత్త!!! – జయంతి -
మెడనొప్పికి చికిత్స ఉందా?
నా వయసు 56 ఏళ్లు. గత కొంతకాలంగా నేను తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. ఆ నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. కొద్దిగా వణుకుతున్నాయి కూడా. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడభాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ►వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ►క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ►వృత్తిరీత్యా అధికబరువులు మోయడం ►ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ►ఎక్కువసేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్వు సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ►ఎత్తైన దిండ్లు వాడటం ►మెడకు దెబ్బతగలడం ►మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు : ►సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ►నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ►మెడ బిగుసుకుపోవడం ►తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ►నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ►చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ►నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ సైనసైటిస్ తగ్గుతుందా? నా వయసు 28 ఏళ్లు. ఇటీవల నాకు రోజూ ఉదయంపూట తలనొప్పి వస్తోంది. రోజూ ముక్కుదిబ్బడ వేసి చాలా అసౌకర్యంగా ఉంటోంది. ముక్కు నుంచి నీరు కూడా అదేపనిగా కారుతూ చాలా ఇబ్బంది కలిగిస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సైనసైటిస్ అన్నారు. ఇంగ్లిషు మందులు వాడినా తగ్గలేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా సైనసైటిస్ సమస్య మొదలువుతుంది. మళ్లీ మళ్లీ వస్తూ దీర్ఘకాలం పాటు వేధించే ఈ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడేవారు మన సమాజంలో చాలామందే ఉంటారు. ఈ సమస్యను మూడు విభాగాలుగా చూడవచ్చు. ఒకటి ఎక్యూట్. ఇది వస్తే వారం రోజులుంటుంది. రెండోది సబ్ఎక్యూట్. ఇది నాలుగు నుంచి ఎనిమిది వారాలుంటుంది. మూడోది క్రానిక్. అంటే దీర్ఘకాలంపాటు బాధించేది అని అర్థం. కారణాలు : బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశవ్యాధులు, ముక్కులో ఎముక పెరగడం, అలర్జీ, పొగ, వాతావరణంలో ఉండే విపరీతమైన కాలుష్యం, అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, ఈత (స్విమ్మింగ్ చేయడం), జలుబు, గొంతునొప్పి, పిప్పిపన్ను, టాన్సిల్స్ వాపు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి సైనసైటిస్‌కు కారణమవుతాయి. వ్యాధి లక్షణాలు: సైనసైటిస్‌తో బాదపడేవారిలో తలనొప్పి, తలంతా బరువుగా ఉండటం, ముఖంలో వాపు, ముఖంలోని సైనస్‌లు ఉండే భాగాల్లో నొప్పి, ముక్కు దిబ్బడ వేస్తూ ఉండటం, ముక్కులో దురద పెడుతూ ఉండటం, ముక్కు నుంచి నీరు కారడం, గొంతులోకి ద్రవాలు స్రవిస్తూ ఉండటం, దగ్గు, జలుబు, చెవిలో చీము వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరచూ జలుబు చేస్తూ ఉండటం, దాంతో చాలా ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్ వ్యాధి ప్రాథమిక లక్షణం. ఆ తర్వాత దశలో జలుబు చేసినప్పుడు ముక్కులు బిగదీసుకుపోతాయి. తీవ్రమైన తలనొప్పి, దగ్గు, శ్వాస దుర్గంధంతో కూడి ఉండటం కూడా జరుగుతుంది. చికిత్స: హోమియో చికిత్సలో శస్త్రచికిత్స అవసరం లేకుండానే సైనసైటిస్‌ను సమూలంగా తగ్గించవచ్చు. ఈ మందులతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇతర చికిత్స వల్ల తాత్కాలింగా ఉపశమనం కలుగుతుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. కానీ హోమియో చికిత్స వల్ల సైనసైటిస్ పూర్తిగా తగ్గిపోతుంది. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వారు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటం వల్ల మళ్లీ మళ్లీ రాకుండా సమర్థంగా చికిత్స చేయవచ్చు. డా‘‘ కె. రవికిరణ్, మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్ -
సైక్లింగ్ వల్ల మోకాళ్లు మరింత దెబ్బతింటాయా?
అపోహ : మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు సైక్లింగ్ చేయడం వల్ల ఆ నొప్పులు మరింత పెరుగుతాయి. వాస్తవం : సైక్లింగ్ ఎక్సర్సైజ్ వల్ల లేదా సైకిల్ తొక్కడం వల్ల మోకళ్లు మరింత దెబ్బతింటాయని చాలా మంది అపోహ పడుతుంటారు. కాని మోకాళ్ల నొప్పుల నివారణకు అది మంచి వ్యాయామం. మామూలు సైకిల్ తొక్కినా, లేక ఒకేచోట స్థిరంగా ఉండే ఎక్సర్సైజ్ సైకిల్ తొక్కినా మీ బరువు మీ శరీరంపై పడదు. కాబట్టి మోకాళ్లపై శరీరం బరువు చాలా తగ్గిపోతుంది. సైక్లింగ్‌లో పెడల్ తొక్కడం వల్ల మోకాళ్లు బాగా కదిలి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇక ఈత (స్విమ్మింగ్)లో కూడా శరీరం బరువు మోకాళ్లపై ఏమాత్రం పడదు కాబట్టి అది కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. -
ఆనందారోగ్యాలకు పది సూత్రాలు
మంచి జీవనశైలి అనుసరించేవారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. దాని తర్వాత రెండో ప్రాధాన్యత క్రమంలో వ్యాయామం ఉంటుంది. వ్యాయామం వల్ల రెండు లాభాలు. మొదటిది ఆకర్షణీయమైన సౌష్టవంతో చూడ్డానికి అందంగా కనిపిస్తారు. అలాగే ఎప్పుడూ ఫిట్నెస్తో ఉంటారు. ఈ రెండూ ఉంటే ఆత్వవిశ్వాసమూ పెరుగుతుంది. ‘సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ’ అనే నానుడి వినే ఉంటారు. మంచి ఆరోగ్యం ఉన్న దేహంలో ఆరోగ్యకరమైన మనసూ ఉంటుందటి దానర్థం.అంటే ఇలా జీవనశైలి, వ్యాయామాలతో కేవలం దేహ ఆరోగ్యమే కాదు... మానసిక ఆరోగ్యమూ సాధ్యమవుతాయన్నమాట. ‘అందమె ఆనందం’ అన్న సూక్తి కూడా మనందరమూ వింటూ ఉంటాం కదా. పైవన్నీ ఉంటే ఇక ఎప్పుడూ ఆనందంగా ఉండమూ సాధ్యమవుతుంది. అలా ఆరోగ్యం, అందం, ఆనందం కోసం ఆచరించాల్సిన సూచనలు చాలా సులువైనవి, తేలిగ్గా సాధ్యమయ్యేవి. అవేమిటో చూద్దాం. 1 ఆహారం : పొద్దు న్నే కాస్త ఎక్కువ మోతాదులోనే ∙మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా... ఓ మోస్తరుగా మధ్యాహ్న భోజనం తినాలి. ఇక రాత్రివేళ మితాహారం తినడం ఆరోగ్యంగా ఉండటానికి మనం అనుసరించాల్సిన ఆరోగ్య సూత్రం. మన ఆహారంలో ఎంత తింటున్నామనే దానికంటే అన్ని రకాల పోషకాలు అందేలా సమతులాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. జంక్‌ఫుడ్‌ను, వీలైనంతవరకు బయటి ఆహారాలను పూర్తిగా మానేయడం మంచిది. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలలోపే ఆహారం తినేయాలి. ఇక రాత్రి 10 గంటలు దాటాక ఆహారం తీసుకోవడం సరికాదు. 2 వ్యాయామం : క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమనే నియమాన్ని అందరూ పాటించాల్సిందే. అయితే కొంతమంది కొద్ది రోజులు చేసి, ఆ తర్వాత మానేస్తుంటారు. ఇది సరికాదు. వ్యాయామాన్ని తప్పకుండా కొనసాగించాలి. రోజూ వీలుకాకపోతే కనీసం వారంలో ఐదు రోజుల పాటు రోజులో 45 నిమిషాల నుంచి గంట సేపు వ్యాయామం చేయాల్సిందేనని గుర్తుపెట్టుకోండి. 3 సాకులు వెతకడం మానేయండి : కొన్ని పనులు పూర్తి చేయడం కుదరనప్పుడు దానికి వెంటనే సాకులు వెతుక్కోవడం మానవ సహజం. పైగా కొన్ని పనులు చేయడానికి ఇష్టం లేనప్పుడు కూడా మనం వెంటనే సాకులు వెతుకుతాం. ఆహారం, వ్యాయామం విషయంలో ఇలా సాకులు వెతకడం చాలా సహజం. మంచిపనులు చేయాల్సి వచ్చినప్పుడు సాకులు వెతకడం పూర్తిగా మానేయండి. వెంటనే పని మొదలుపెట్టండి. మంచి ఫలితం ఉంటుంది. 4 ఇష్టమైన ఆట : మీరు ఇష్టంగా ఆడే ఆటను ఎంచుకోండి. అది కూర్చుని ఆడే ఆట కాకుండా... శరీరానికి కాస్తంత శ్రమ కలిగించేదై ఉండాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలు. ఒకవేళ వ్యాయామం చేయడం కష్టమనిపిస్తే... ఆడటం అన్నది వినోదం కాబట్టి... ఆటోమేటిగ్గా ఇటు వినోదం/ఆనందం అటు వ్యాయామం రెండూ ఆటల వల్ల సమకూరతాయి. ఈ ఆటలో మీకెవరైనా భాగస్వామి ఉంటే వారితో వెళ్లడం వల్ల ఆరోగ్యకరమైన చర్చలతో మానసికంగా ఉల్లాసంగా కూడా ఉంటారు. ఈ బిజీలైఫ్‌లో మనకు ఆటలాడే పార్ట్నర్ దొరకకపోతే కొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల సహాయంతో మీ ఇంటి టీవీపైనే మీ క్రీడా భాగస్వామిని ఎంచుకునేందుకూ, అలాంటి ఎలక్ట్రానిక్ భాగస్వామితో ఇంట్లోనే ఆడుకునేందుకూ ఇప్పుడు వీలుంది. కాబట్టి ఆటలాడేందుకు క్రీడా భాగస్వామి దొరకడం లేదనే సాకుకు ఇప్పుడు తావే లేదు 5 కొత్తవాటిని నేర్చుకుంటూ ఉండండి : మనమెప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండటం వల్ల నిత్యం యంగ్‌గా ఉంటాం. ఒకవేళ మనకంటే చిన్నవాళ్ల నుంచి ఏవైనా కొత్తవి నేర్చుకోవాల్సి వస్తే అహానికి లోనుకావద్దు. ఎందుకంటే... కొన్ని కొత్త విషయాలు పాతతరం వారికంటే కొత్త తరం వారికే ఎక్కువ తెలుసు. 6 ఎప్పుడూ ఆనందంగా ఉండండి: ఎప్పుడూ దిగులుగా, విచారంగా ఉండకండి. మీరు చేసే ప్రతి పనినీ ఆస్వాదిస్తూ చేస్తూ ఉంటే ఆనందంగా ఉండటం తేలిగ్గా సాధ్యమవుతుంది. 7 నిత్యం స్ఫూర్తి పొందుతూ ఉండండి : మీరు పత్రికలు చదువుతున్నప్పుడూ, టీవీ చూస్తున్నప్పుడు ఎవరైనా స్ఫూర్తిదాయకమైన పనులు చేస్తే... వారి నుంచి స్ఫూర్తి పొందండి. ఇలా స్ఫూర్తి పొందడం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. పురోగతికీ తోడ్పడుతుంది. 8 ఓపికగా ఉండండి : మీరు ఏదైనా లక్ష్యాలు నిర్ణయించుకున్నప్పుడు అవి తీరే వరకు ఓపిక వహించండి. మీ పనిలో కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకండి. అవి తొలగేవరకూ ఓర్పుగా ఉండండి. విజయాలు అవే సిద్ధిస్తాయి. 9 ఎప్పుడూ కుంగిపోకండి : కష్టాలు వస్తే కుంగిపోకండి. కష్టమెప్పుడూ శాశ్వతం కాదు. 10 ప్రయత్నాన్ని వదిలిపెట్టకండి : మనం తప్పక ఆచరించగలమనే వాటినే లక్ష్యాలుగా పెట్టుకోండి. ఆ లక్ష్యసాధనలో ఎప్పుడూ వెనక్కు తగ్గకండి. ఎట్టిపరిస్థితుల్లోనూ మీ ప్రయత్నాలు వదలకండి. -
జిమ్‌కు వెళ్లండి... మతిమరపును దూరం చేసుకోండి
మీరు ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లి అక్కడ బరువులు ఎత్తుతూ చేసే వ్యాయామాల వల్ల మతిమరపు (డిమెన్షియా) వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు ఫిన్‌ల్యాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. మరీ ముఖ్యంగా బెంచ్‌ప్రెస్ (బెంచ్‌మీద పడుకొని బరువులు ఎత్తుతూ చేసే వ్యాయామం) చేసే వారికి పెద్దవయసులోనూ మెదడు చురుగ్గా పనిచేస్తుందని వారు పేర్కొంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్రన్ ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు వందలాది మంది పెద్దవయసు వారిపై చాలాకాలంపాటు నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా ఈ విషయాలు తెలిశాయి. -
‘వొకేషనల్’.. ఇక ప్రొఫెషనల్
సాక్షి, హైదరాబాద్: ►కాఫీ ఇష్టపడే వారు ఎక్కువే. అలాంటి కాఫీ ప్రి యుల కోసం 42 రకాల కాఫీలు ఉన్నాయంటే ఆశ్చర్యమే కదా. ఆర్థిక స్థోమత లేక ఇంటర్మీడి యట్ పూర్తికాగానే ఏదో ఉద్యోగమో.. ఉపాధో పొందాలనుకునే వారు కాఫీ మేకింగ్ కోర్సు చదివితే.. ఓ కాఫీ షాప్ పెట్టుకోవచ్చు. ►బేకరీ, ఫ్లవర్ బోకే మేకింగ్.. ఇవీ అంతే. వీటి తయారీలో శిక్షణ పొందడం ద్వారా ఆయా రంగాల్లో స్థిర పడవచ్చు. ►తాజా ట్రెండ్ డ్యూటీ కేర్ మేనేజ్మెంట్. ఉద్యో గులైన భార్యాభర్తలు ఇంట్లో ఉండే తమ వృద్ధు లైన తల్లిదండ్రులను చూసుకునే వారి కోసం వెంపర్లాడుతున్నారు. వేలు చెల్లించి నర్సులను నియమించుకుంటున్నారు. అలా సేవలందించాలనుకునే వారి కోసం వచ్చిన కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి డిమాండ్ ఉంది. ఇంకా.. ఆటోమొబైల్ సర్వీసింగ్, మోటారు వైండింగ్ కమ్ ఎలక్ట్రీషియన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, టాయ్స్ మేకింగ్, అర్బన్ మైక్రో బిజినెస్, సోలార్ ఎనర్జీ వంటి కోర్సులను రాష్ట్రంలోని వొకేషనల్ ఇంటర్మీడియట్లో కోర్సులుగా అమల్లోకి తెచ్చేందుకు ఇంటర్మీయట్ విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు సమూల సంస్కరణలకు ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ శ్రీకారం చుట్టారు. వొకేషనల్ కోర్సు చేసే విద్యార్థి ఉద్యోగంలో లేదా సొంతంగా ఉపాధి పొందేలా ఉండాలన్న లక్ష్యంతో ఈ కోర్సులను మార్చనున్నారు. సెంచూరియన్ వర్సిటీలో అధ్యయనం.. రాష్ట్రంలోని వొకేషనల్ విద్యలో మార్పులు తేవాల ని నిర్ణయించిన ఇంటర్ బోర్డు.. ఇలాంటి వొకేషనల్ కోర్సులను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్న ఒడిశాలోని సెంచూరియన్ వర్సిటీలో అధ్యయ నం చేసింది. అక్కడ అమలు చేస్తున్న కోర్సులు, వాటికి మార్కెట్లో ఉన్న డిమాండ్, విద్యార్థులకు లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నివేదిక సిద్ధం చేస్తోంది. ఉన్నతాధికారుల బృందం ఈ నెల 7న ఆ వర్సిటీలో అధ్యయనం చేసింది. ఒకట్రెండు రోజుల్లో నివేదిక పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆమోదం తీసుకొని వీలైతే వచ్చే విద్యా సంవత్సరంలోనే ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో సమూల మార్పులను, కొత్త కోర్సులను అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ప్రాంతాన్ని బట్టి కోర్సులు.. కాఫీ మేకింగ్, బేకరీ మేకింగ్, ఫ్లవర్ బొకే మేకింగ్ వంటి కోర్సులకు, పనులకు పట్టణ ప్రాంతాల్లోనే డిమాండ్ ఉంటుంది. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ, మష్రూమ్ కల్చర్, మోటార్ వైండింగ్ కమ్ ఎలక్ట్రీషియన్ వర్క్ వంటి కోర్సులకు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అక్కడే వాటి అవసరం ఉంటుంది. అందుకే ఏ ప్రాంతంలో ఏ కోర్సుకు ఎక్కువ డిమాండ్ ఉంటుందో అక్కడ వాటిని నిర్వహించేలా ఇంటర్ విద్యా శాఖ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో డిమాండ్ లేని కొన్ని కోర్సులను తొలగించే అంశాలను పరిశీలిస్తోంది. ప్రాంతాన్ని బట్టి డిమాండ్ ఉన్న కోర్సులను ఆయా ప్రాంతాల్లోనే నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22 రకాల కోర్సులు ఉండగా, అందులో కొన్నింటిని తొలగించి 15 రకాల కొత్త కోర్సులను అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడుతోంది. కనీసంగా 2 లక్షలకు పెంచేలా.. రాష్ట్రంలో 176 ప్రభుత్వ, 401 ప్రైవేటు వొకేషనల్ జూనియర్ కాలేజిల్లో 96,208 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ సంఖ్యను కనీసంగా 2 లక్షలకు పెంచాలన్న లక్ష్యాన్ని ఆ శాఖ పెట్టుకుంది. కోర్సు పూర్తి కాగానే విద్యార్థులకు ఉద్యోగ/ఉపాధి లభించే కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. -
వ్యాయామంతో తీవ్రమైన ఆయాసం
నా వయసు 34. నాకు దుమ్ము సరిపడదు. డస్ట్ అలర్జీ ఉంది. దుమ్ముకు ఎక్స్పోజ్ అయితే ఆయాసం వస్తుంటుంది. వింటర్ వచ్చింది కదా అని వ్యాయామం చేయదలచినప్పుడల్లా నాకు ఆయాసం వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. వ్యాయామ ప్రక్రియ ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలో బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడటంతో పాటు తేమపూరితమవుతుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఈ చల్లగాలి వల్ల ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకేళ్లే మార్గాలన్నీ సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... ►పొడి దగ్గు వస్తుండటం ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ►పిల్లికూతలు వినిపించడం వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ►వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేసినా... 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా) కారణంగా వ్యాయామ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకో డయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు ఉదాహరణకు జలుబు, ఫ్లూ, సైనసైటిస్ వంటివి ఆస్తమాను మరింత ప్రేరేపిస్తాయి. ఇలా నలతగా ఉన్న సమయాల్లో వ్యాయామం చేయకూడదు. ఆస్తమా ఉన్నవారు త్వరగా ముగిసే ఆటల్లాంటివి... అంటే వాలీబాల్, బేస్‌బాల్, వాకింగ్ వంటివి చేయాలి. అంతేగానీ దీర్ఘకాలం పాటు కొనసాగుతూ, దూరాలు పరుగెత్తాల్సి వచ్చే సాకర్, బాస్కెట్‌బాల్, హాకీ వంటివి ఆడకూడదు. అయితే నీరు వేడిగా ఉన్న సమయాల్లో ఈతను అభ్యసిస్తూ, క్రమంగా వ్యవధిని పెంచుకుంటూ పోతే దేహానికి వ్యాయామం సమకూరడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా తగ్గుతుంది. పల్మునరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి? నాకు కొద్దినెలలుగా నెలలుగా దగ్గు, విపరీతమైన ఆయాసం వస్తోంది. చాలామంది డాక్టర్లకు చూపించుకున్నాను. చివరకు ఒక డాక్టర్‌గారు దాన్ని పల్మునరీ ఫైబ్రోసిస్ అని నిర్ధారణ చేశారు. ఆ తర్వాత ‘జబ్బుకు కారణమేమిటో తెలుసుకోవా’లన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. పల్మునరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి? దయచేసి తగిన సలహా ఇవ్వండి. పల్మునరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక జబ్బు. ఇందులో ఊపిరితిత్తుల మీద చారల్లాగా వస్తాయి. ఇలా చార (స్కార్) రావడం పెరిగిపోతే కనెక్టివ్ టిష్యూ అనే కణజాలమంతా ఒకేచోట పోగుబడుతుంది. దాంతో మృదువుగా ఉండాల్సిన ఊపిరితిత్తుల గోడలు మందంగా మారతాయి. ఫలితంగా రక్తానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీని వల్ల రోగులు ఆయాసపడుతూ ఉంటారు. కొంతమంది రోగుల్లో దీనికి కారణం ఏమిటో తెలుసుకుంటారు. అయితే కొందరికి ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలియదు. ఇలాంటి జబ్బును ఇడియోపతిక్ పల్మునరీ ఫైబ్రోసిస్ అంటారు. సాధారణంగా ఆయాసం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు అది మరింత ఎక్కువ కావడం, ఎప్పుడూ పొడిదగ్గు వస్తుండటం, అలసట, ఛాతీలో ఇబ్బంది, కొంతమందిలో ఛాతీనొప్పి, ఆకలి తగ్గడం, నీరసించిపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇది ప్రధాన జబ్బు కాదు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య తర్వాత రెండో (సెకండరీ) సమస్యగా ఇది వస్తుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం (ఆటో ఇమ్యూన్), వైరల్ ఇన్ఫెక్షన్స్, టీబీ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటి కారణాలతో ఇది వస్తుంది. ఇక ఎప్పుడూ ఆస్బెస్టాస్, సన్నటి ఇసుక రేణువులనూ, సిమెంటు నిండి గాలి పీలుస్తుండటం, నిమోనియాను కల్పించే బ్యాక్టీరియా, ఫంగస్‌లతో ఉన్న గాలిని పీల్చడం, కోళ్ల దాణా వంటి వ్యవసాయ పరిశ్రమలకు సంబంధించిన వాసనలు ముక్కుకు తగులుతూ ఉండటం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. సిగరెట్ పొగ ఈ కండిషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. సాధారణంగా దీనికి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే లభ్యమవుతోంది. మంచి మందులు ఇంకా ప్రయోగదశలోనే ఉండి, అందుబాటులోకి రావల్సి ఉంది. ప్రస్తుతం కార్టికోస్టెరాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటర్ మందులు వాడుతూ ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు, నొప్పి, ఎర్రబారే పరిస్థితిని (ఇన్ఫ్లమేషన్ను) అదుపు చేసే స్థితిలోనే వైద్యశాస్త్రం ఉంది. దీనికి తోడు అవసరమైనప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది. మీరు పెద్ద సెంటర్లలో నిపుణులైన పల్మునాలజిస్ట్లను సంప్రదించండి. డాక్టర్ రమణ ప్రసాద్, కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
అక్కడ వ్యాయామం చేస్తే డేంజర్..
లండన్ : రోజూ వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తుండటంతో బిజీ రోడ్లపై ఓ అరగంట నడిచేసి మొక్కుబడిగా ముగిస్తే మొదటికే మోసం వస్తుందని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. ట్రాఫిక్ అధికంగా ఉండే రోడ్లపై వాకింగ్, జాగింగ్ చేస్తే కాలుష్య ప్రభావంతో వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరించింది. డీజిల్ వాహనాలు, వ్యర్థ పదార్ధాలు వెదజల్లే వాయువులతో మనం పీల్చే గాలిలో ప్రమాదకర స్ధాయిలో పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) స్ధాయిలు పెరుగుతాయని, ఉదయాన్నే బిజీబిజీ వీధుల్లో వాకింగ్‌కు బయలుదేరితే ప్రతికూల ఫలితాలే అధికమని దక్షిణ కొరియా నిపుణులు చేపట్టిన అథ్యయనం స్పష్టం చేసింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే వీధుల్లో వాకింగ్ చేసేవారిలో వెంట్రుకల పెరుగుదలకు అవసరమైన ప్రొటీన్ల స్ధాయి తగ్గినట్టు ఈ అథ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. కాలుష్యంతో సహజీవనం ద్వారా ఆస్త్మా, క్రానిక్ బ్రాంకైటీస్, గుండె జబ్బులు, స్ట్రోక్, డిమెన్షియా వంటి వ్యాధుల ముప్పు అధికమని యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్ కాలుష్య నిపుణులు ప్రొఫెసర్ ఇయాన్ కాల్బెక్ విశ్లేషించారు. కాగా, ఈ నివేదికను మాడ్రిడ్‌లో జరిగిన యూరోపియన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ, వెనెరాలజీ కాంగ్రెస్‌లో సమర్పించారు. వాహన రాకపోకలతో బిజీగా ఉండే రోడ్లపై వాకింగ్, వ్యాయామానికి పూనుకోవడం కంటే ఇంటి పరిసరాల్లో లేదా ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేయడం సరైనదని వారు పేర్కొన్నారు. ఇక ఏంజైనా సహా గుండె జబ్బులతో బాధపడేవారు సైతం కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో ఆరుబయట వ్యాయామం చేయడం సరైంది కాదని సూచించారు. కాలుష్య స్ధాయిలు అధికంగా ఉన్న సమయంలో నివాస ప్రాంగణాలు, ఇంటి సమీపంలోని పార్క్‌ల్లో వ్యాయామం చేయడం మేలని నిపుణులు పేర్కొన్నారు. -
వ్యాయామంతో క్యాన్సర్లూ దూరం!
వ్యాయామంతో మంచి ఆరోగ్యం, ఆకర్షణీయమైన శరీర సౌష్టవం మన సొంతమవుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వ్యాయామంతో చాలా రకాల క్యాన్సర్లను సైతం నివారించవచ్చని అంటున్నారు పరిశోధకులు. ఒకటీ రెండు కాదు... ఏకంగా పదిహేను రకాలకు పైగా క్యాన్సర్లను దూరం పెట్టవచ్చని వారి అధ్యయనాల్లో తేలింది. ఇటీవలే కొద్దికాలం క్రితం అమెరికా, యూరప్‌లలో నిర్వహించిన అధ్యయనాలలో ఈ వాస్తవం నిరూపితమైంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే నిత్యం వ్యాయామం చేసేవారికి ఈసోఫేజియల్ ఎడినోకార్సినోమా అనే ఒక తరహా క్యాన్సర్‌తో పాటు కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, మూత్రపిండాల క్యాన్సర్, కడుపునకు సంబంధించిన క్యాన్సర్లు, రక్తానికి సంబంధించిన క్యాన్సర్లు, పెద్దపేగుల క్యాన్సర్, తల, మెడకు సంబంధించిన క్యాన్సర్లు, మలద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్... ఇలా అనేక రకాల క్యాన్సర్లు దూరమవుతాయని ఆ అధ్యయనాలలో స్పష్టంగా తేలింది. వ్యాయామం వల్ల శరీరాన్ని ఉత్తేజపరిచే ఎండోక్రైన్ స్రావాలు తగినంత మోతాదులోనే అవుతుంటాయనీ, దాంతో అన్ని వ్యవస్థలూ పూర్తిగా మంచి అదుపులో ఉంటాయి. దాంతో అన్ని వ్యవస్థల మధ్య మంచి సమతౌల్యత సాధ్యమవుతుందంటూ అధ్యయనవేత్తలు చెబుతున్నారు. ఇన్ని ఈ వివరాలన్నీ ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇన్ని రకాల క్యాన్సర్లను నివారించడం అన్నది కేవలం ఒక వ్యాయామ ప్రక్రియతోనే జరుగుతున్నందున ఇంకెందుకు ఆలస్యం. పైగా ఇది వ్యాయామానికి అనువైన చలికాలం కావడం వల్ల వెంటనే ఎక్సర్సైజ్లు ప్రారంభించండి. -
చిక్కుల చక్కెర
డయాబెటి పేరు వినగానే బెంబేలెత్తిపోతారు. ఆరోగ్య నియమాలు పాటించకుండా, ఆహారం విషయంలో ఇష్టం వచ్చిన రీతిలో ఉంటూ, వ్యాయామం చేయని వారిలో డయాబెటిస్ ఎక్కుగా కనిపిస్తుంటుంది. దీని కారణంగా గుండె జబ్బులూ, కిడ్నీ సమస్యలూ, పక్షవాతం... ఇలా ఇతరత్రా జబ్బులెన్నో వస్తుంటాయి. అన్ని అవయవాలు ప్రభావితమవుతాయి. డయాబెటిస్‌ను గురించి తప్పక తెలుసుకొని, వీలైనంతమేరకు దానిబారిన పడకుండా ఉండాలి. ఈ నెల 14న వరల్డ్ డయాబెటిస్ డే. ఈ సందర్భంగా... డయాబెటిస్‌పై అవగాహన కోసమే ఈ కథనం. ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి బాగా మారిపోవ డం వల్ల డయాబెటిస్ విస్తృతంగా కనిపిస్తోంది. డయాబెటిస్‌లో ప్రధానంగా మూడు రకాలు అనుకుంటారు. టైప్–1, టైప్–2లతో పాటు గర్భవతులకు వచ్చే జస్టేషనల్ డయాబెటిస్ అనే ప్రధాన రకాలను వర్గీకరిస్తుంటారు. కానీ డయాబెటిస్ ప్రధానంగా ఈ మూడు రూపాల్లోనే గాక... లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ (లాడా) అనీ, మెచ్యురిటీ ఆన్సెట్ ఆఫ్ ద యంగ్ (మోడీ) అనీ ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ మూడు రకాల్లోనూ టైప్–1 డయాబెటిస్ అన్నది చిన్నపిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది జన్యులోపం వల్ల వస్తుంది. చిన్నారుల రోగనిరోధక వ్యవస్థ... వారి పాంక్రియాస్‌లోని బీటా సెల్స్‌ను శత్రుకణాలుగా భావించి, వాటిని నాశనం చేస్తుంది. ఫలితంగా పాంక్రియాస్ పనిచేయక దానిలోని ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీనినే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్ అని అంటారు. అలా పాంక్రియాస్ కార్యకలాపాలు మందగించగానే డయాబెటిస్ వస్తుందన్నమాట. ఇక సాధారణంగా కొంత వయసు గడిచాక పాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌కు మన శరీరంలోని జీవకణాలు తగిన రీతిలో స్పందించడం మానేస్తాయి. ఇలా జరిగినప్పుడు తలెత్తే మధుమేహాన్ని టైప్–2 డయాబెటిస్ అంటారు. ఇదే పరిస్థితి చాలాకాలం కొనసాగితే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి దానంతట అది పూర్తిగా నిలిచిపోతుంది. దీనిని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్ లేదా అడల్డ్ ఆన్సెట్ డయాబెటిస్ అంటారు. డయాబెటిస్ రోగుల్లో దాదాపు 90 శాతం మంది ఈ రకానికే చెందుతారు. కొంతమంది మహిళల్లో గర్భం ధరించిన సమయంలో డయాబెటిస్ కనిపిస్తుంటుంది. దాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇలాంటి వారిలో ప్రసవం అయిన తర్వాత డయాబెటిస్ కూడా కనిపించదు. అయితే ఇలా గర్భవతిగా ఉన్నప్పుడు జెస్టెషనల్ డయాబెటిస్ వచ్చిన వారిలో వయసు పెరిగాక అది మళ్లీ వచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చికిత్స : ►డీ ఫర్ డయాబెటిస్, డీ ఫర్ డేంజర్... అందుకే ఈ డేంజరస్ డయాబెటిస్ ట్రబుల్‌ను వీలైనంత దూరంగా ఉంచాలి. ►టైప్–1 డయాబెటిస్‌కు వైద్యుల సూచనపై ఇన్సులిన్ ఇవ్వడం మాత్రమే ఏకైక మార్గం. ►ఎక్కువ మందిలో కనిపించే టైప్–2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్‌ను స్రవింపజేసే క్లోమగ్రంథిని ప్రేరేపించే మందులు ఇస్తుంటారు. అవి కూడా పనిచేయని సమయాల్లో డాక్టర్లు అవసరమైన మోతాదులో ఇన్సులిన్ సిఫార్సు చేస్తుంటారు. ఇలా ఇన్సులిన్ తీసుకోవాల్సి రావడం చాలా తీవ్రమైన దశగా చెప్పుకోవచ్చు. ఇలాంటి దశకు చేరి... ఒంటిని ప్రమాదకరమైన పరిస్థితికి గురిచేయడం కంటే కొద్దిపాటి జాగ్రత్తలతో అది రాకుండానే చాలావరకు నియంత్రించుకోవచ్చు. నివారణ... ►అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌ను మంచి కొవ్వులుగా పరిగణిస్తారు. వీటిలో మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అనే రకాలు ఉంటాయి. ఈ రెండు రకాలూ మంచివే. ►చేపలు, అవిసెగింజలు, వాల్నట్స్లతో పాటు రై స్బ్రాన్ ఆయిల్ వంటి శా కాహార నూనెల్లో మంచి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ►చక్కెరలు మోతాదుకు మించి ఉండే కూల్‌డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్లు వంటి వాటికి దూరంగా ఉండటంతో పాటు పొగతాగడా న్ని మానేయడం ద్వారా కూడా రక్తంలో చక్కెర ల స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. చివరగా... డయాబెటిస్ గురించి ఆందోళన పడాల్సి న పనిలేదు. హెల్దీ లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తూ, వై ద్యుల సలహాలపై మందులు వాడుతూ ఉంటే పూర్తి ఆరోగ్యంతో నిండు నూరేళ్లూ బతకవచ్చు. లక్షణాలు డయాబెటిస్ ఉన్నవారిలో బాగా ఆకలి పెరగడంతో పాటు విపరీతంగా దాహం వేయడం కనిపిస్తాయి. తరచు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు చాలామందిని బాధిస్తుంటాయి. అసలు ఈ లక్షణం నుంచే డయాబెటిస్‌కు ఆ పేరు వచ్చిందని చెబుతుంటారు. ఎందుకంటే... వాస్తవానికి ‘డయాబెటిస్’ అంటే మూత్రపు ఫౌంటేన్ అనే అర్థం కూడా ఉందట. ►డయాబెటిస్ రాగానే చాలామందిలో దాని తాలూకు నిర్దిష్టమైన లక్షణాలేవీ చాలాకాలం పాటు కనిపించకపోవచ్చు. అందుకే 40 ఏళ్లు దాటాక క్రమం తప్పకుండా ఏడాదికి ఒకసారైనా రక్తపరీక్షలు చేయించుకుంటే డయాబెటిస్ గురించీ, దాని ఉనికి ఏదైనా ఉంటే దాని గురించి తెలుస్తుంది. ►డయాబెటిస్ ఉన్నవారికి గాయాలు అంత త్వరగా మానవు. ఎందుకంటే ఒంట్లోని చక్కెర రక్తప్రవాహంలో కలవడం వల్ల హాని చేసే బ్యాక్టీరియాకు ఆ పుండ్లనూ, గాయాలను ఆశ్రయించినప్పుడు ఆ ప్రదేశాలు వాటికి చాలా రుచిగా, తియ్యగా అనిపిస్తాయి. దాంతో ఆ బ్యాక్టీరియా అలాంటి ప్రదేశాలను వదలడానికి ఇష్టపడవు. అంతేగాక డయాబెటిస్ ఉన్నవారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఆ బ్యాక్టీరియా/హానికారక క్రిములను తుదముట్టించే శక్తి లోపిస్తుంది కాబట్టి... ఇలాంటి డయాబెటిస్ ఉన్నవారి దేహాలు ఆ క్రిములకు మంచి ఆవాసమవుతాయి. ఫలితంగా గాయలు ఒక పట్టాన తగ్గవు. అందుకే డయాబెటిస్తో బాధపడుతున్న వారు తమ ఒంటిపైన ఉంటే గాయలు/పుండ్ల వంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గాయమైన సదరు అవయవానికే ముప్పు వాటిల్లి... ఆ అవయవాన్నే తొలగించాల్సిన దుస్థితి రావచ్చు. డయాబెటిస్‌ను నియంత్రించే యోగాసనాలివే... యోగా మన ఆరోగ్య సంరక్షణకు ఉపకరిస్తుందన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రత్యేక యోగాసనాలు సైతం చక్కెర వ్యాధిని నివారిస్తాయి... ఒకవేళ అప్పటికే చక్కెర వ్యాధి ఉన్నప్పటికీ దాన్ని నియంత్రించడానికి చాలావరకు ఉపయోగపడతాయన్నది యోగా నిపుణుల మాట. ఇందులో 1) అర్ధమత్సేంద్రాసనం, 2) చక్రాసనం... డయాబెటిస్ నివారణ/నియంత్రణకు తోడ్పడతాయి. డయాబెటిస్ కనుగొనేందుకు పరీక్షలివి... చక్కెర వ్యాధిని గుర్తించడానికి ఈ కింద పేర్కొన్న కొన్ని రకాల రక్తపరీక్షలు చేస్తారు. ►ఫాస్టింగ్ సుగర్ టెస్ట్ : కనీసం 8గంటల సేపు ఏమీ తినకుండా ఈ పరీక్ష చేయించుకోవాలి. ►పోస్ట్ ఫుడ్ సుగర్ టెస్ట్: ఆహారం తీసుకున్న గంటన్నర లోగా పరీక్ష చేయించుకోవాలి. ►ర్యాండమ్ సుగర్ టెస్ట్ : తిన్నా, తినకున్నా ఏదో ఒకవేళ ఈ పరీక్ష చేస్తారు. ►ఓరల్ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) : బార్డర్‌లైన్‌లో ఉన్నవారికి ఈ పరీక్ష చేస్తారు. ►డయాబెటిస్‌ను తెలుసుకోవడం కోసం హెచ్‌బీఏ1సీ అనే పరీక్షను సైతం చేస్తారు. ఇది 8 నుంచి 12 వారాల వ్యవధిలో చెక్కెర పాళ్లను సగటును తెలిపే పరీక్ష. దీన్ని పరగడుపున చేయాల్సిన అవసరం ఉండదు. ఇది చక్కెర వ్యాధిని నిర్ధారణ చేయడంతోపాటు మందులు వాడుతున్నప్పుడు చికిత్స వల్ల చక్కెర అదుపులోనే ఉంటోందా లేదా అన్న విషయం కూడా తెలుస్తుంది. డయాబెటిస్ తీవ్రత కూడా తెలుస్తుంది. డయబెటిక్ డైట్... మనం గతంలో దంపుడుబియ్యం, రాగులు, జొన్నలు, సజ్జల వంటివి తినేవాళ్లం. పాలిష్డ్ రైస్ తినడం మొదలుపెట్టగానే ప్రపంచంలో ఎక్కడా లేనంతగా డయాబెటిస్ మన దగ్గర కనపించడం మొదలైంది. డయాబెటిస్ నుంచి బయటపడటానికి... ►లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాల్లో బ్రౌన్‌రైస్, క్వినోవా రైస్, దంపుడుబియ్యం, బొంబాయిరవ్వ ఉప్మా వంటివి ముఖ్యమైనవి. కాకపోతే ఇవి అందరికీ నచ్చవు. వీటికి మనం అలవాటుపడటానికి క్రమంగా వాటిని మన రుచిమొగ్గలకు అలవాటు చేయాలి. దీన్నే సిస్టమాటిక్ డీ–సెన్సిటైజేషన్ ఆఫ్ పాలెట్ అని అంటారు. దీనికోసం... మనం పాలిష్‌రైస్ ఒక గిన్నెలో వండాలి. బ్రౌన్‌రైస్ మరో గిన్నెలో వండాలి. మూడో గిన్నె తీసుకొని అందులో మొదట 75% పాలిష్రైస్తో వండిన అన్నం, 25% బ్రౌన్ రైస్‌తో వండిన అన్నం కలిపి... రెండు నుంచి మూడు వారాలు ఇలా తినాలి. దాని తర్వాత 60% పాలిష్‌రైస్, 40% బ్రౌన్‌రైస్... ఇలా మరో మూడు వారాలు తినాలి. ఇలా క్రమంగా పాలిష్‌రైస్ శాతాన్ని తగ్గించుకుంటూ, బ్రౌన్‌రైస్ శాతాన్ని పెంచుకుంటూ వెళుతూ... మూడు నుంచి నాలుగు నెలల తర్వాత మొత్తం బ్రౌన్ రైస్ తినాలి. ఇలా చేయడం వల్ల మన నాలుక బ్రౌన్‌రైస్ రుచికి అలవాటు పడుతుంది. ఇలా చేయడం ద్వారా మనం శాశ్వతంగా బ్రౌన్‌రైస్ మళ్లవచ్చు. (ఇదే పద్ధతి క్వినోవా, దంపుడుబియ్యానికి కూడా వర్తిస్తుంది). ఈ ప్రక్రియతో తెల్లఅన్నం కోసం క్రేవింగ్ కూడా తగ్గుతుంది. ►బ్రేక్‌ఫాస్ట్‌లో తినగలిగేవి : రాగి ఇడ్లీ, రాగి దోశ, పెసరట్టు, గోధుమరవ్వ ఉప్మా, చపాతి, పొట్టుతీయని గింజలతో చేసిన బ్రెడ్, పొట్టుతియ్యని గింజల గారెలు. ►డయాబెటిస్ ఉన్నవారితో పాటు.. దాన్ని నివారించుకోవాలనుకునేవారు తినాల్సిన పండ్లు : జామ, గ్రీన్ ఆపిల్, ఓ మోస్తరుగా పండిన పుచ్చకాయలు, మోస్తరుగా పండిన బొప్పాయి, దానిమ్మ, కివి, ఆరెంజెస్, నేరేడుపండ్లు. తీపి పదార్థాలు తినాలని బాగా అనిపించినప్పుడు బెర్రీస్ (బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీలు తింటే క్రేవింగ్ తగ్గుతుంది. వారానికి రెండున్నర గంటలకు తగ్గకుండా వ్యాయామమూ చేయాలి. ప్రీ–డయాబెటిస్ కండిషన్ అంటే... కనీసం ఎనిమిది గంటలు ఏమీ తినకుండా జరిపే ఫాస్టింగ్ పరీక్షలో రక్తంలో చక్కెర 70–100 స్థాయిలో ఉంటే సాధారణ పరిస్థితిలో ఉన్నట్లు లెక్క. దానికి మంచి 126 వరకు ఉన్నా... ఇక ఆహారం తీసుకున్న గంటన్నర లోగా పరీక్ష చేయించుకునే పోస్ట్ లంచ్ పరీక్షలో చక్కెర పాళ్లు 140 కంటే మించి 180 వరకు ఉన్నా కాస్త జాగ్రత్త పడాలి. ఫాస్టింగ్‌లో రక్తంలో చక్కెర 100–126 లోపు, పోస్ట్ లంచ్ 140–180 లోపు ఉంటే అది డయాబెటిస్ వచ్చేందుకు ముందు దశ (ప్రీ డయాబెటిక్ స్టేజ్)గా చెబుతారు. అలాంటివారు మంచి జీవనశైలి నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తే సాధ్యమైనంతవరకు డయాబెటిస్‌ను నివారించవచ్చు. డాక్టర్ టి.ఎన్.జె. రాజేశ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ ఇంటర్నల్ మెడిసిన్ – ఇన్ఫెక్షియస్ డిసీజెస్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఒకే పని... రెండు లాభాలు
ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న కాలుష్యానికి మున్ముందు మన తెలుగు రాష్ట్రాల నగరాలూ, పట్టణాలూ మినహాయింపు కాదు. కాకపోతే ఇప్పుడు అంతే తీవ్రత ఇక్కడ లేకపోవచ్చు. అటు పర్యావరణం, ఇటు మన వ్యక్తిగత ఆరోగ్యం... ఈ రెండూ బాగుపరచుకుంటూ ఢిల్లీ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా చూసుకోడానికి మనం చేయాల్సిందొకటే. ఆ ఒక్క పనితోనే ఒనగూరే ప్రయోజనాలు రెండు!! మొదటిది మన ఆరోగ్యం.రెండోది మన పర్యావరణ రక్షణ. ఒకే పనితో రెండు ప్రయోజనాలంటే మనకెంత లాభం! డబుల్ బెనిఫిట్ కదా. ఒకే దెబ్బకు రెండు పిట్టలు దొరుకుతుంటే మరెందుకు ఆలస్యం. అనుసరిద్దాం. అటు మన దేహ ఆరోగ్యానికీ... ఇటు మన ధరిత్రి ఆరోగ్యానికీ ప్రయోజనాలు చేకూరేలా చేసుకుందాం. వాకింగ్ ఇలా... వాకింగ్ చాలా మంచి వ్యాయామం అన్నది అందరికీ తెలిసిన విషయమే. వాకింగ్‌ను కేవలం వ్యాయామంలా మాత్రమే గాక... వీలైనంత వరకు చిన్న దూరాలకూ ప్రతి రోజూ చేస్తూనే ఉండాలి. దీంతో మనకు రెండు లాభాలు. మొదటిది మోటార్సైకిల్గానీ, కార్లుగానీ ఉపయోగించనందున కర్బన కాలుష్యం తగ్గుతుంది. ఇక మనలో చాలామంది వాకర్స్ క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తూనే ఉంటారు. ఉదయాన్నే ఆరుబయటకు వెళ్లి వాకింగ్ చేయలేని చాలామంది ట్రెడ్ మిల్ని ఉపయోగిస్తుంటారు. మనం స్విచ్ ఆన్ చేసే ప్రతి విద్యుత్ ఉపకరణం వాతావరణ కాలుష్యానికి దోహదం చేస్తుంటుందన్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి నడక వ్యాయామం చేయాలనుకున్నవారు వీలైనంత వరకు ఆరుబయటే వాకింగ్ చేయడం మంచిది. దీని వల్ల రెండు ప్రయోజనాలు. మొదటిది విద్యుత్ వినియోగం తగ్గి వాతావరణం బాగుపడుతుంది. రెండోది ఆరుబయట నడకతో తాజా ఉదయపు తాజాగాలి పీల్చడం వల్ల దేహ ఆరోగ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం... రెండూ మెరుగవుతాయి. అయితే ఏదైనా కారణాల వల్ల ఆరుబయట వాకింగ్‌కు వెళ్లలేని పరిస్థితి ఉంటే ఎలక్ట్రిసిటీ సహాయం లేకుండా కాళ్లతోనే వెనక్కు నెడుతూ నడిచే ట్రెడ్మిల్ మిషన్‌తోనే వాకింగ్ చేయడం చాలా మంచిది. చిన్న దూరాలకు సైకిల్ ఈమధ్య మనం కొద్దిపాటి దూరాలకు కూడా మోటార్‌సైకిల్ లేదా మోటార్ వాహనాన్ని ఉపయోగించడం బాగా పెరిగిపోయింది. మనం సైకిల్‌ను ఉపయోగిస్తే రెండు లాభాలు చేకూరతాయి. మొదటిది మన దేహానికి మంచి వ్యాయామం. దీనివల్ల మోకాళ్లు, కాలి కండరాలు బలంగా మారతాయి. సైక్లింగ్ వల్ల మోకాళ్ల నొప్పులు పెరుగుతాయని కొందరు అపోహ పడుతుంటారు.సైక్లింగ్‌లో మన బరువు మోకాళ్ల మీద పడదు. కాబట్టి అది వాస్తవం కాదు. అప్పటికే మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు మినహా మిగతావారంతా నిరభ్యంతరంగా సైక్లింగ్ చేయవచ్చు. ఇక మోటారుసైకిల్ /మోటారు వాహనాన్ని ఉపయోగించకపోవడం వల్ల ఇంధన ఆదా అవుతుంది. దాంతో వాతావరణంలోకి వెలువడే కర్బన కాలుష్యాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఒక మొబైలే వాడండి... చాలామంది కొత్త కొత్త ఫీచర్లతో కొత్త బ్రాండ్ మార్కెట్లోకి వచ్చినప్పుడల్లా తమ పాత మొబైల్ మార్చేస్తుంటారు. ఎంతో అవసరమైతేనో తప్ప మీ పాత మొబైల్ మార్చకండి. ఎందుకంటే మీరు వాడి పారేసే ఒక సెల్‌ఫోన్ భూమిలోకి చేరాక దాని నుంచి వచ్చే వ్యర్థాలు కనీసం 1,32,000 లీటర్ల నీటిని కలుషితం చేస్తాయి. అది పూర్తిగా చెడిపోయి వృథా పదార్థంగా మారాక దాంట్లోంచి లెడ్, క్యాడ్మియం, బ్రోమినేటెడ్ వ్యర్థాలు, ఆర్సినిక్ వంటి విషపదార్థాలు పర్యావరణంలోకి కలుస్తాయి. ఒకవేళ మీరు మీ క్రేజ్ కొద్దీ తప్పనిసరిగా సెల్ మార్చాలనుకుంటే ముందుగా దాన్ని ఎవరైనా అవసరం ఉన్నవారికి ఇవ్వండి. త్వరగా నిద్ర పోవాలి మూడు నాలుగు దశాబ్దాల కిందట మనమంతా ఏ ఎనిమిదికో లేదా తొమ్మిదికో పడుకునేవాళ్లం. అయితే ఈ సమయం కాస్తా క్రమంగా వెనక్కుపోతూ ఇప్పుడు రాత్రి ఒంటిగంటకు నిద్రపోవడం అన్నది చాలా సాధారణంగా మారిపోయింది. దీనివల్ల ఆరోగ్యంపై కలిగే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. మనం నిద్రపోయే ఒంటిగంట లేదా రెండు వరకూ కేవలం విద్యుద్దీపాలే కాకుండా కంప్యూటర్లు, టీవీ, మైక్రోఓవెన్, మ్యూజిక్సిస్టమ్ వంటివి కూడా పనిచేస్తుంటాయి. ఫలితంగా విద్యుత్తు వినియోగం పెరగడం, ఆ విద్యుత్తుకు ప్రధాన వనరులైన బొగ్గు, గ్యాస్ వినియోగం పెరిగి పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే నిద్రవేళలు వెనక్కి వెళ్లడం అటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని, ఇటు పర్యావరణ ఆరోగ్యాన్ని భగ్నం చేస్తోంది. నిద్రపోయే వ్యవధి తగ్గడం స్థూలకాయానికి దారితీస్తుంది. స్థూలకాయం కారణంగా కీళ్లనొప్పులు, రక్తపోటు, డయాబెటిస్ వంటి అనేక అనారోగ్యాలు వస్తాయి. పైగా నిద్ర తగ్గడం వల్ల జీవక్రియల్లో సమతౌల్యం దెబ్బతింటుంది. ఇక ఘ్రెలిన్ అనే మరో హార్మోన్ స్రావం పెరుగుతుంది. ఇది ఆకలిని పుట్టించే హార్మోన్. మనం నిద్రపోయే గంటలు తగ్గినప్పుడు ఆకలి పెరిగి అనవసరమైనవన్నీ తింటూ ఉంటాం. దాంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే త్వరగా నిద్రపోవడం మన ఆరోగ్యానికీ, పర్యావరణినికీ మంచిది. నో కూల్ డ్రింక్స్ మీరు పానీయాలు తీసుకోవాలనుకుంటే కూల్‌డ్రింక్స్ బదులు తాజా పళ్ల రసాలే తీసుకోండి. కూల్‌డ్రింక్స్ తయారు చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో నీళ్లను ఉపయోగించాలి. అంతేకాదు... ఇందులో షుగర్స్/ తీపినిచ్చే పదార్థాలు సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్, సిట్రిక్ యాసిడ్, కలర్స్, ఫాస్ఫారిక్ యాసిడ్, నీళ్లు, కొంత కార్బన్ డయాక్సైడ్ ఉంటాయి. వీటిల్లో పురుగుమందుల అవశేషాలుంటాయని రుజువైంది. కూల్‌డ్రింక్స్‌లోని చక్కెర కారణంగా పిల్లలు/పెద్దల్లో ఊబకాయం వస్తుంది. ఇది డయాబెటిస్ వచ్చే రిస్క్‌ను పెంచుతుంది. ఇక కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ దంతాలపై ఉండే అనామెల్ను దెబ్బతీస్తుంది. ఫాస్ఫారిక్ యాసిడ్ ఎక్కువ కావడం వల్ల క్యాల్షియం మెటబాలిజమ్ దెబ్బతింటుంది. ఫలితంగా ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లో ఉండే కృత్రిమ రంగులు శరీరానికి హానికరం. వీటిని బయటకు పంపే ప్రక్రియలో మూత్రపిండాలు చాలా ఎక్కువగా పనిచేస్తాయి. ఫలితంగా మూత్రపిండాలు పాడవుతా యి. కూల్‌డ్రింక్స్‌ను నిల్వ ఉంచే రసాయనాల వల్ల పిల్లల్లో అతి ధోరణులు పెరుగుతాయి.. మన డీఎన్ఏలోని కీలకమైన అంశాలను కూడా ఈ రసాయనం దెబ్బతీస్తుందని కొన్ని బ్రిటిష్ పరిశోధనలు చెబుతున్నాయి. డాక్టర్ జి. నవోదయ కన్సల్టెంట్, జనరల్ మెడిసన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
వ్యాయామం ఇలా చేస్తే మేలు..
లండన్ : బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న తర్వాత వ్యాయామం చేయాలని కొందరు సూచిస్తుండగా ఖాళీ కడుపుతోనే వ్యాయామం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు వ్యాయామం చేస్తే రక్తంలో చక్కెర స్ధాయి నియంత్రణలో ఉంటుందని ఈ పరిశోధన వెల్లడించింది. ఖాళీ కడుపుతో ఎక్సర్సైజ్ చేస్తే శరీరం ఇన్సులిన్ వాడకాన్ని సమర్ధంగా నిర్వహిస్తుందని ఇది టైప్ 2 డయాబెటిస్తో పోరాడటంతో పాటు జీవక్రియల వేగం పెంచేందుకు ఉపకరిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. బాత్ అండ్ బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ చేపట్టిన అథ్యయనంలో వెల్లడైంది. వ్యాయామం చేసే సమయంలో మీరు ఆహారం తీసుకునే సమయంలో చేసే మార్పుల ద్వారా మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని తమ పరిశోధనలో తేలిందని యూనివర్సిటీ ఆప్ బాత్ ప్రొఫెసర్ డాక్టర్ జేవియర్ గోంజలెజ్ చెప్పారు. ఖాళీ కడుపుతో వ్యాయామం చేసిన వారి కండరాలు ప్రొటీన్‌ను మెరుగ్గా సంగ్రహిస్తున్నట్టు తమ అథ్యయనం గుర్తించామని తెలిపారు. బరువు తగ్గే క్రమంలో వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఆహారం తీసుకునే సమయంతో సంబంధం లేకపోయినా వారి ఆరోగ్యంపై మాత్రం ఇది సానుకూల ప్రభావం చూపుతుందని చెప్పారు. -
టీనేజ్ పిల్లల్లో వ్యాయామం ఎత్తు పెరగడానికి అడ్డంకా?
చాలా మంది పిల్లలు తమకు ఇష్టమైన సినీ హీరోల అవయవ సౌష్టవాన్ని చూసి ఎక్సర్సైజ్ చేయడానికి ఉపక్రమిస్తారు. టీనేజ్ దాటకముందే ఎక్సర్సైజ్లు మొదలుపెడితే అది వారిని ఎత్తుపెరగకుండా చేస్తుందనేది చాలామందిలో ఉండే అపోహ. ఇది పూర్తిగా అవాస్తవం. పిల్లల్లో ఎత్తు పెరిగే ప్రక్రియ ఎలా జరుగుతుందంటే... సాధారణంగా పిల్లలు ఎంత ఎత్తుకు పెరగాలన్నది వాళ్ల జన్యువులపై ఆధారపడి ముందుగానే నిర్ణయమవుతుంది. అందుకే తల్లిదండ్రులు ఎత్తుగా ఉంటే వాళ్ల పిల్లలు కూడా కాస్తంత ఎత్తుగానే ఉంటారు. పిల్లలు ఎత్తు పెరగడంలో రెండు దశలుంటాయి. వాటిని లాగ్ ఫేజ్ అనీ, ల్యాగ్ ఫేజ్ అంటారు. ఇందులో లాగ్ ఫేజ్‌లో పిల్లలు ఒక దశలో అంటే పన్నెండు నుంచి పధ్నాలుగు, పదహారేళ్ల వయసు మధ్య చటాలున అకస్మాత్తుగా ఎత్తుగా అవుతారు. ఆ తర్వాతి దశ ల్యాగ్ ఫేజ్.ఈ దశలో పెరుగుదల మందగించి... అది మందకొడిగా సాగుతూ... ఒకటి లేదా రెండు అంగుళాలు మాత్రం పెరిగి ఆ తర్వాత ఆగిపోతుంది. అది సాధారణంగా 18–21 ఏళ్ల మధ్య జరుగుతుంది. అంటే కొందరిలో అది 18 ఏళ్లకే ముగిస్తే... మరికొందరిలో చాలా స్వల్పంగా గరిష్టపరిమితంగా 21 ఏళ్ల వరకు సాగుతుంది. అంటే... ఎవరిలోనైనా ఎత్తు పెరగడం అన్న ప్రక్రియ సాధారణంగా 21 ఏళ్లు వచ్చేసరికి ఎముక చివర ఫ్యూజ్ అయిపోయి పెరుగుదల ఆగిపోతుంది. అందుకే సాధారణ ఆటపాటల్లో భాగంగా జరిగే వ్యాయామం వారిలోని అడ్డుపెంచే ప్రక్రియను అడ్డుకోలేదు. పైగా సాగినట్లుగా, వేలాడబడుతూ చేసే స్ట్రెచింగ్ వ్యామాయాలు వాళ్ల లాగ్ ల్యాగ్ ఫేజ్లను కొంత ప్రభావితం చేస్తూ ఒకింత ఎత్తు పెంచవచ్చు కూడా. అయితే మన ఎముకల్లో పెరిగే భాగాలు ఎముక చివరన ఉంటాయి. వీటిని గ్రోత్ ప్లేట్స్ అంటారు. మనం ఎదిగే వయసులో ఎక్కువ బరువుతో చాలా తీవ్రమైన వ్యాయామాలు చేస్తే అది గ్రోత్ ప్లేట్స్‌ను దెబ్బతీవయచ్చు. అలా గ్రోత్ ప్లేట్స్ దెబ్బతింటే మాత్రం ఎత్తుపెరగడం ఆగిపోవచ్చు. అందుకే ఈ దశలో వ్యాయామం ఆటల్లో భాగంగా ఉండటం లేదా స్ట్రెచింగ్‌కు పరిమితం కావడం లేదా తక్కువ బరువులతో ఎక్కువ రిపిటేషన్స్తో చేస్తుండటం వల్ల అది ఎత్తు ఎదగడానికి ప్రతిబంధకం కాబోదు. అందుకే పిల్లలు ఎక్సర్సైజ్ మొదలుపెడితే ఆందోళన పడకుండా వారిని ప్రోత్సహించాలి. అయితే... మరీ ఎక్కువ బరువులు ఎత్తకుండా తక్కువ బరువులు మాత్రమే ఎత్తుతూ ఎక్కువ రిపిటీషన్స్ చేయమనీ, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలనీ, ఆటలకు ఎక్కువగా ఆడాలని చెప్పాలి. -
ఫిట్ ఫంక్షన్
సిటీ ‘రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్’ అనిపాడేస్తోంది. పెరుగుతున్న ఫిట్నెస్ క్రేజ్‌కి తగ్గట్టుగా వందల సంఖ్యలో వెలుస్తున్న ఫిట్నెస్ స్టూడియోలు జిమ్ కల్చర్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. దీనిలో భాగంగానే నగరవాసులను ఉర్రూతలూగిస్తోంది‘ఫంక్షనల్ ట్రైనింగ్’. సాక్షి,సిటీబ్యూరో: జిమ్ అంటే ట్రెడ్ మిల్, క్రాస్ ట్రైనర్ వంటివాటితో చేసే కార్డియో వాస్క్యులర్ వ్యాయామాలు, వెయిట్స్తో చేసే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కవుట్స్ వంటివే ఉంటాయి. దీనికోసం ఎన్ని మెషిన్లు ఉంటే అంత గొప్ప జిమ్‌గా చెబుతుంటారు. కానీ గత నాలుగైదేళ్లుగా పెరిగిన ఆరోగ్య స్పృహ, మారుతున్న సిటీజనుల ఆసక్తులు వీటికి తోడు అందుబాటులోకి వచ్చిన అంతర్జాతీయ శైలి వర్కవుట్స్ సిటీలో వ్యాయామ సరళి రోజు రోజుకూ మారిపోతోంది. జిమ్స్‌లో కొత్త కొత్త వర్కవుట్స్ పరిచయం చేయడానికి తోడు ప్రత్యేకమైన వ్యాయామ శైలుల కోసమే ఫిట్నెస్ స్టూడియోలు ఏర్పాటవుతున్నాయి. అలాంటి కోవలోనే ఇప్పుడు ‘ఫంక్షనల్ ట్రైనింగ్’ వచ్చి చేరింది. రొటీన్ వర్క్.. నాట్ అవుట్ తమ రోజువారీ పనులను మరింత శక్తివంతంగా, సామర్థ్యంతో చేయాలని, అలసట రాకూడదని సిటీజనులు కోరుకుంటున్నారు. ఇదే ఫంక్షనల్ ట్రైనింగ్‌కి ఊపునిస్తోంది. దీనికోసం డిజైన్ చేసిన వ్యాయామాలు మన రోజువారీ కార్యకలాపాలు మరింత సులభతరం చేసేలా ఉంటాయి. యాక్టివిటీ బియాండ్ వర్కవుట్ అంటే వర్కవుట్‌కి అవతల చేసే యాక్టివిటీ అని ఫంక్షనల్ ట్రైనింగ్‌ని నిర్వచించవచ్చు. బైసప్ వర్కవుట్ అంటే నడుము దగ్గర్నుంచి చేతులతో బరువులు ఎత్తుతాం. అయితే రోజువారీ పనుల్లో అది మనకు ఏ రకంగానూ ఉపకరించదు. అదే నేల మీద పడి ఉన్నవి తీయడం, వంగుని షూ లేస్ కట్టడం, ఒక డోర్‌ని బలంగా తోసి ఓపెన్ చేయడం.. ఇవన్నీ మనకు రోజువారీ పనుల్లో భాగంగా ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ శిక్షణ డిజైన్ చేశారు. ఈ సాధనలో బరువులు ఎత్తడం మీద తక్కువ.. కదలికలపై ఎక్కువగా దృష్టి పెడతారు. దీనిలో భాగంగా మనం రోజూ చేసే వాకింగ్ లాంటివి కూడా మరింత వేగంగా విభిన్నంగా చేయిస్తారు. కాస్త బరువైన వస్తువును లేపుతూ స్క్వాటింగ్ చేయడం, ఒక కుర్చీలోకి ఎక్కి దిగడం, ఒక డోర్‌ను బలంగా తోయడం సైతం ఇందులో సాధన చేయిస్తారు. ఖర్చు లెస్.. లాభం ప్లస్ ఒక క్రీడకు సన్నద్ధం అవడంఎలాగుంటుందో అలాంటి వ్యాయామాలు ఈఫంక్షనల్ ట్రైనింగ్‌లో ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఈ శిక్షణ ఇచ్చే ఫిట్నెస్ స్టూడియోలకు వ్యయం కూడా తక్కువగా ఉంటోంది. దీంతో సభ్యత్వ రుసుం కూడా తక్కువగానే వసూలు చేస్తున్నారు. సిటీలో ఎఫ్ 45, ఫిట్టింగ్ రూమ్ (హై ఇంటెన్సిటీ వర్కవుట్స్),కల్ట్ వంటి ఫిట్నెస్ సెంటర్స్ ఫంక్షనల్ ట్రైనింగ్‌కి చిరునామాగా పేరొందాయి. మల్టీ బెని‘ఫిట్స్’ ఈ ఫంక్షనల్ వర్కవుట్‌లో స్క్వాట్స్, లంజెస్, డెడ్ లిఫ్టŠస్ పుషప్స్, ప్లంక్స్.. వంటివి కలగలసి ఉంటాయి. మల్టీ జాయింట్స్ కదిలేలా అత్యధిక ఫంక్షనల్ ట్రైనింగ్ కదలికలు ఉంటాయి. శరీరం ముందుకీ, వెనక్కీ ఇరు పక్కలకీ కిందకీ పైకీ.. ఇలా విభిన్న రకాల కదలికలు మరింత వేగంగా సులువుగా చేయగలిగేలా ఈ శిక్షణ ఉంటుంది. ఫ్రీ వెయిట్స్తో పాటు కొన్ని ప్రత్యేకమైన పరికరాలు వినియోగిస్తారు తప్ప ఎటువంటి మెషీన్లూ ఉండవు. ‘మెషీన్ల ద్వారా చేసే వ్యాయామాల్లో ఒక రిథమ్ ఉంటుంది. అవి ఒకటి రెండు ప్రత్యేక శరీర భాగాలను మాత్రమే కదలిస్తాయి. ఉదాహరణకు లెగ్ ఎక్సటెన్షన్ మెషిన్ని తీసుకుంటే అది తొడలోని ముందు కండరాలను మాత్రమే కదుపుతుంది. నిజానికి దాన్ని మనం రోజువారీ పనుల్లో ఎక్కువగా వినియోగించం. కోర్ మజిల్స్‌ని బాగా వినియోగిస్తాం. కానీ ఈ మెషీన్ల ద్వారా కోర్ మజిల్‌కి వర్కవుట్ అందదు’ అని ఫిట్నెస్ ట్రైనర్ గంధం విజయ్ చెప్పారు. వ్యాయామం.. జర భద్రం సాక్షి, సిటీబ్యూరో: భుజాలు జారిపోవడం, మోకాళ్లు అరిగిపోవడం, వెన్నుపూస వంగిపోవడం.. వంటి కీళ్ల సమస్యలు ఇప్పుడు నగర వాసుల్లో సాధారణంగా మారిపోయాయంటున్నారు జూబ్లీహిల్స్‌లోని రీజెన్ ఆర్థో స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మొవ్వా వెంకటేష్. ఆధునిక జీవనశైలి తెచ్చిపెడుతున్న సమస్యలు, తాజాగా అందుబాటులోకి వచ్చిన స్టెంసెల్ చికిత్స గురించి ఆయన చెబుతున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. స్లో వర్క్.. స్పీడ్ వర్కవుట్ కీళ్ల సమస్యలు బాగా శారీరక శ్రమకు గురయ్యే వారికి.. ముఖ్యంగా క్రీడాకారులకే వచ్చేవి. అందుకే ‘స్పోర్ట్స్ ఆర్థో’ పేరుతో ప్రత్యేక వైద్యసేవలూ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు క్రీడాకారుల తరహాలోనే నగరంలో ప్రతి ఒక్కరిలోనూ ఆర్థో సమస్యలు సాధారణమయ్యాయి. ఏసీ గదుల్లో దీర్ఘకాలం కూర్చోవడం, శారీరక శ్రమ లేని జీవనశైలితో ఆస్టియో ఆర్థరైటిస్ విజృంభించింది. ఇప్పుడు పెరిగిన ఆరోగ్య స్పృహ సమస్యలకు కారణమవుతోంది. జిమ్‌లో ట్రైనర్ చెప్పాడని ఎలా పడితే అలా వ్యాయామాలు చేయడంతో సంసిద్ధంగా లేని శరీరం ఎదురు తిరుగుతోంది. భుజాలు పట్టు తప్పడం, వెన్నుపూస డిస్క్ అరిగిపోవడం, కీలు అరిగిపోవడం వంటివి వస్తున్నాయి. నివారణకు శరీర పనితీరుతో పాటు చికిత్సలపైనా అవగాహన అవసరం. 29న హాఫ్ మారథాన్ హృద్రోగ సంబంధ వ్యాధులపై నగరవాసుల్లో అవగాహన పెంచేందుకు ఓ ఆంగ్ల దినపత్రిక ఆధ్వర్యంలో ‘హాఫ్ మారథాన్’ తలపెట్టారు. ఈ నెల 29న సంజీవయ్య పార్కులో ఇది జరుగనుంది. తెల్లవారుజామున 4 నుంచి 10 గంటల వరకూ 3 కి.మీ, 5 కి.మీ, 10 కి.మీ, 21 కి.మీ విభాగాల్లో రన్ ఉంటుంది. 28న హెల్త్ అండ్ ఫిట్నెస్ రిట్రీట్ నగరానికి చెందిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ దినాజ్ వర్వత్వాలా ఆధ్వర్యంలో హెల్త్ అండ్ ఫిట్నెస్ రిట్రీట్ బై దినాజ్ ఫిట్నెస్ పేరిట ఈవెంట్ నిర్వహిస్తున్నారు. నగరంలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్స్‌లో ఈ కార్యక్రమం ఉంటుంది. రేపు బూట్ క్యాంప్ నగరంలోని 360 డిగ్రీ జిమ్ ఆధ్వర్యంలో బూట్ క్యాంప్ ఫిట్నెస్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఫ్యాట్ లాస్కి, మెటబాలిజం పెంచడానికి, సామర్థ్యం సానబెట్టడానికి ప్రత్యేక వ్యాయామ శైలులు సాధన చేయించే ఈ క్యాంప్‌ను ఈ నెలాఖరు వరకూ సోమ, బుధ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. ‘స్టెమ్‌సెల్’థెరపీఉత్తమం గతంలో కీళ్ల సమస్య అంటే ప్రాధమిక స్థాయిలో నొప్పి నివారణ మందులు, ముదిరిన తర్వాత సర్జరీ ఏకైక పరిష్కారం. ఇప్పుడు స్టెమ్‌సెల్ (మూల కణాల) థెరపీ రాకతో సర్జరీ అవసరం తప్పుతోంది. గాయాలను శరీరంలో సహజంగానే ఉత్పత్తి అయ్యే స్టెమ్‌సెల్ మాన్పుతుంది. ఈ థెరపీలో తొలుత శరీరంలోని ఏదేని భాగం నుంచి మూల కణాలను సేకరించి ల్యాబ్‌లో పరీక్షించాక రోగి శరీరంలో గాయపడిన/లేదా సమస్యకు గురైన ప్రాంతంలోకి ఎక్కిస్తారు. తద్వారా సహజంగానే సదరు కీళ్ల అరుగుదల తగ్గుతుంది. కీళ్ల సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అవసరం. -
అంత చెమటలు కక్కాల్సిన అవసరం లేదు..
సాక్షి, న్యూఢిల్లీ : కండలు పెంచుకోవడానికి కొందరు, ఆరోగ్యంగా ఉండేందుకు మరికొందరు పోటీలు పడి జిమ్‌లకు వెళుతుంటారు. చెమటలు కక్కుతూ ప్రయాస పడి కసరత్తులు చేస్తుంటారు. ‘అమ్మో! ఆ బరువులు ఎత్తడం మనవల్ల కాదు బాబోయో! ’ ఇంకొందరు జిమ్‌కు వెళ్లాలంటేనే భయపడతారు. అలాంటి వారు ఆరోగ్యం కోసం సహజంగానే జాగింగ్ లేదా వాకింగ్‌ను ఎంచుకుంటారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు అంత చెమటలు కక్కాల్సిన అవసరం లేదని, అంతగా కసరత్తు చేయాల్సిన అవసరం లేదని ఓ అధ్యయనం తెలిపింది. కనీసం రోజుకు 13 నిమిషాల చొప్పున వారానికి 90 నిమిషాలు వ్యాయామం చేస్తే చాలట. వారి ఆయుర్దాయం మూడేళ్లు పెరుగుతుందట. అందుకోసం జిమ్‌లకు, జాగింగ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదట. రోజుకు 13 నిమిషాలకు తగ్గకుండా వారానికి 90 నిమిషాల పాటు ఇంటి పట్టునో, రోడ్డు మీదనో వాకింగ్ చేస్తే, మైదానానికి వెళ్లి చిన్న చిన్న కసరత్తులు చేస్తే ఏమీ చేయని వారికన్నా మూడేళ్ల ఆయుర్దాయం పెరుగుతుందని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆరోగ్య బీమా సంస్థ ‘వైటాలిటీ’ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కనీస వ్యాయామం చేయని వారి నుంచి కనీస వ్యాయామం, ఎక్కువ వ్యాయామం చేసే వారి వరకు 1,40,000 మందిని ఎంపిక చేసుకొని వారి ఆరోగ్యం, ఆయుర్దాయంపై వైటాలిటీ సంస్థ కొన్నేళ్లపాటు అధ్యయనం జరిపింది. ఎలాంటి వ్యాయామం చేయని వారికంటే వారానికి 90 నిమిషాలు వ్యాయామం చేసిన వాళ్లు మూడేళ్లు అధికంగా, అలాగే రోజుకు 25 నిమిషాల చొప్పున వారానికి మూడు గంటలపాటు వ్యాయామం చేస్తే నాలుగేళ్లు అధికంగా జీవిస్తారట. వ్యాయామంలో మంచి ఫలితాల గురించి తెల్సి కూడా దీనికున్న ప్రాధాన్యతను కొందరు ప్రజలు ఇప్పటికీ గుర్తించరని ఈ తాజా అధ్యయనాన్ని పరిశీలించిన ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్’ అధ్యక్షుడు లార్డ్ సబాస్టియన్ కో వ్యాఖ్యానించారు. కేవలం ఆయుర్దాయం పెరగడం కోసమే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు, వత్తిలో అధిక ఉత్పత్తిని సాధించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు. వైటాలిటీ ఆరోగ్య బీమా సంస్థ తన పాలసీదారులపైనే ఈ అధ్యయనం జరిపి, వారిలో ఆరోగ్యం కాపాడుకోవడానికి వ్యాయామం చేస్తున్న వారికి అదనపు రాయతీలను కల్పించింది. పాలసీదారులు ఎంత ఎక్కువ కాలం జీవిస్తే బీమా సంస్థకు అంత లాభాలు గదా! -
కాజల్.. సవాల్
చెన్నై : హీరోయిన్ల ఛాలెంజ్‌లు అధికం అవుతున్నాయి. మొన్న నటి సమంత ఒక్క బక్కెట్ నీరు అంటూ ఛాలెంజ్ విసిరింది. తాజాగా నటి కాజల్‌అగర్వాల్ కూడా సవాల్ అంటోంది. అయితే ఈ అమ్మడి ఛాలెంజ్ చాలా బరువైనదే. దాదాపు ఒకటిన్నర దశాబ్దం నట జీవిత మైలురాయి టచ్ చేయడానికి చేరువలో ఉన్న నటి కాజల్ అగర్వాల్. అదే విధంగా అర్ధ సెంచరీ చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేసింది. అయినా ఈ అమ్మడికి సినీ మోహం ఏ మాత్రం తీరలేదు. స్టిల్ నాటౌట్ క్రేజీ హీరోయిన్గా బరిలో ఉంది. బహు భాషా నటిగానూ రాణిస్తోంది. ఇందుకు కావలసినంత అందాన్ని మెరుగు పరుచుకునే ప్రయత్నాలూ చేస్తోంది. అందుకు కసరత్తులు చాలా అవసరం. ఈ విషయంలో కాజల్ అగర్వాల్ మరింత డోస్ పెంచేసింది. ఇప్పటి వరకూ సాధారణ ఎక్సర్‌సైజ్‌లతో సరిపెట్టుకుంటూ వెయిట్ లిప్ట్ జోలికి పోనీ ఈ బ్యూటీ ఇటీవల ఆ ప్రయత్నాలు మొదలెట్టేసింది. వెయిట్లిప్ట్ల్లో హీరోయిన్లు పోటీ పడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా కాజల్‌అగర్వాల్ తొలి ప్రయత్నంలోనే ఏకంగా 70 కిలోల బరువును చేతులతో లేపేసే ప్రయత్నం చేసింది. తన శిక్షకుడి పర్యవేక్షణలో అంత వెయిట్ లిప్ట్ చేసిన కాజల్ అమ్మో అంటూ ఒక్క సారిగా కింద చతికిల పడిందట. అయితే ఇది ట్రైలరేననీ, మెయిన్ పిక్చర్ ముందు ముందు చూపిస్తాననీ సవాల్ విసిరింది. అయితే ఈ సవాల్‌ను తను విసిరింది అభిమానులకా? లేక ఇతర హీరోయిన్లకా అనే చర్చ సినీ వర్గాల్లో స్టార్ట్ అయ్యింది. అయితే చందమామ వెయిట్ లిప్ట్ కసరత్తుల దృశ్యాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ రెడీ అవుతోంది. ఆయన సరసన మరింత నాజూగ్గా కనిపించాలనే ఈ వెయిట్లిప్ట్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా కాజల్ కసరత్తుల వ్యవహారం ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. -
తిన్నది.. కరిగిద్దామిలా..!
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్: ప్రస్తుతం జీవనం యాంత్రికమైంది. కేవలం ధనార్జన, ఉద్యోగ బాధ్యతలతో బిజీగా మారిపోయి, ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా శారీరక శ్రమకు దూరమవుతున్నారు. తినేది జంక్‌ఫుడ్ అని, ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసినా ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒకటి తిని, సరిపెడుతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు. వివిధ రుగ్మతలకు శారీరక శ్రమ లేమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొం దరు వ్యాయామశాలలకు వెళ్లే సమయం లేక, మ రికొందరు ఇంకోరోజు చేద్దాంలే అని వాయిదాలు వేస్తున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పని విధానాలతో కేలరీలు కరగకపోగా, కొ త్తగా వచ్చి చేరుతున్నాయి. ఇందుకోసం బరువులు ఎత్తడం, జిమ్‌లకు వెళ్లడం, కిలోమీటర్ల నడక లాంటివేకాకుండా కేవలం చిన్న చిన్న పనులతో కూడా తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకో వచ్చు. ఇంటి పనులు, వ్యాయామం చేసిన దాంతో సమానమని, దీనికి తోడు మానసిక ప్రశాంతత లభిం చడంతోపాటు తెలియకుండానే శారీరక శ్రమ పెరగడం వల్ల రెండు రకాలుగా ఉపయోగాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటిని శుభ్రం చేయడంతో.. ఖాళీ సమయాల్లో బయటకు వెళ్లే పనిలేకపోతే ఇంట్లోనే ఉండి దుమ్ము దులపడమే పనిగా పెట్టుకోండి. రోజులో కాసేపు గదుల్లో పట్టిన బూజును శుభ్రం చేస్తే ప్రయోజనం ఉంటుంది. రోజూ 40 నిమిషాలపాటు ఈ తరహా పనులు చేస్తే 128 కేలరీల కొవ్వును కరిగించుకోవచ్చనని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు. ఇంటి పనులు చేస్తే, ఇల్లు శుభ్రపడడంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కాసేపు తోట పనిచేస్తూ.. ఎవరి పనులే వారే చేసుకో వడం ఉత్తమం. ఇంటి గార్డెన్లో మొక్కలను నాటడం, నాటిన మొక్కలకు నీరు పోయడం, పరిసరాలు శుభ్రం చేయడం, బాగా పెరిగిన ఆకులు, కొమ్మలను కత్తిరించడం లాంటి పనులు శరీరానికి శ్రమను కలిగిస్తాయి. రోజు 40 నిమిషాలపాటు ఈ తరహా పనులు చేస్తే సుమారు 200 పైగా కేలరీలు తగ్గించుకోవచ్చు. చెట్లు, పచ్చదనం మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. లిఫ్ట్‌కు దూరంగా.. భవనాల్లో వారి ఇంటికో, కార్యాలయానికో వెళ్లాల్సి వచ్చినప్పుడు లిఫ్ట్ ఆశ్రయిస్తుంటారు. ఈ విధానానికి చెక్ పెట్టాలి. సాధ్యమైనంతవరకు మెట్లు ఎక్కే ప్రయత్నం చేయాలి. కనీసం ఒకటి రెండు అంతస్తులనైనా ఎక్కేందుకు ప్రయత్నం చేస్తే సుమారు 200 కేలరీలు వరకు కొవ్వు కరుగుతుంది. సైకిల్ని వినియోగించడం సైకిల్ తొక్కడం ఎక్కువ మందికి ఇష్టం. వారంలో ఒక్క రోజైనా రోడ్లపైన సైకిల్ తొక్కేందుకు ఆసక్తి చూపాలి. ఇంటికి కాస్త దూరంలో ఉండే పనులు చేసేందుకు ఎక్కువ మంది ద్విచక్రవాహనాలను వినియోగిçస్తుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా సైకిల్‌పై వెళితే మంచిది. రోజూ అరగంటపాటు సైకిల్ తొక్కితే దాదాపు 210 కేలరీలు తగ్గించుకున్నట్లే. 40 నిమిషాలపాటు కూర్చోకుండా నిలబడితే సుమారు 100 కేలరీలు కరుగుతాయట. రోజంతా ఒకే చోట కూర్చొని పనిచేసే వారు కొద్దిసేపు లేచి నిలబడి తిరగడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. స్కిప్పింగ్‌తో ఇంటిలో ఉదయం పూట, వాకింగ్ చేసే మైదానంలో రోజూ కాసేపు స్కిప్పింగ్ చేయండి. 10 నుంచి 15 నిమిషాలు ఎగురుతూ గెంతుతూ స్కిప్పింగ్ చేస్తే వందకుపైగా కేలరీలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. నృత్యంతో .. సంగీతం వినపడగానే కాళ్లు, చేతులు వాటంతట అవే కదులుతుంటాయి. ఇష్టమైన పాటల ను వింటూ వాటికి అనుగుణంగా కాసేపు నృ త్యం చేస్తే మేలు. చెమట చిందించడంతో పాటు కొ వ్వు కరిగే అవకాశం ఉంది. 20 నిమిషాలపాటు డ్యాన్స్ చేస్తే 100 నుంచి 120 వరకు కేలరీలు తగ్గించుకోవచ్చు. డ్యాన్స్ చేశామనే తృప్తి, ఆనందం మిగులుతుంది. -
‘ఓపెన్’ బెని‘ఫిట్’
దైనందిన కార్యక్రమాల్లో వ్యాయామం కూడా ఒకటి. దనికోసమే యువత పోలీస్, ఇతర పరీక్షలకు సిద్ధం కావలంటే శారీరక సౌష్టవం, పటిష్టత కోసం జిమ్స్ అవసరం. మహిళలు, పట్టణ వాసులు కూడా వ్యాయామం వైపు మొగ్గు చూపుతున్నారు. దీని కోసం సిద్దిపేట పట్టణంలో ఇప్పటికే కోమటి చెరువు, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, సిరిసిల్లా కమాన్ ప్రాంతాల్లో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా కోమటి చెరువు అడ్వంచర్ పార్కు, హౌసింగ్‌బోర్డు పార్కు, ఎర్రచెరువు ప్రాంతాల్లో జిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. యువత కోరిక మేరకు సిద్దిపేట నియోజకవర్గంలోని గుర్రాల గొందిలో కూడా ఏర్పాటు చేశారు. దీన్ని చూసిన చిన్నకోడూరు, ఇబ్రహింపూర్, విఠలాపూర్, చంద్లాపూర్, ఇర్కొడు, నంగునూరు మొదలైన గ్రామాల యువకులు తమ గ్రామాల్లో కూడా జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన హరీశ్‌రావు ఆయా గ్రామాల్లో కూడా జిమ్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: నాటి తెలంగాణ ఉద్యమం నుంచి నేడు జిల్లా సమగ్ర అభివృద్ధి వరకు సిద్దిపేట అంటే ఓ ప్రత్యేకత. రాష్ట్రంలో ఏ జిల్లా అభివృద్ధి చెందనంతగా సిద్దిపేట అభివృద్ధిలో దూసుకుపోతోంది. రోడ్లు, కార్యాలయాలు, భవనాలు, ప్రభుత్వ పథకాల అమలులో మందంజలోనే కాకుండా ఇప్పుడు వినూత్న రీతిలో యువతకు ఉపయోగపడే కార్యక్రమాలకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా యువత అతి త్వరగా ఆకర్షితులయ్యే ఓపెన్ జిమ్స్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా సిద్దిపేటలో ప్రతీ కూడలిలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. వీటిని గ్రామాలకు కూడా విస్తరించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. యువతను ప్రోత్సహించేలా.. నేటి బాల బాలికలే రేపటి పౌరులు. వీరే విలువైన మానవ వనరులు.. వీరు సంపూర్ణ ఆరోగ్యంతో పెరిగితే రేపటి ఆరోగ్యవంతమైన సమాజంలో భాగస్వామ్యులు అవుతారనే విధానాన్ని నమ్మిన మాజీ మంత్రి హరీశ్‌రావు యువతకు పదికాలల పాటు ఉపయోగపడే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉపాధ్యాయుల నియామకం కోసం పోటీ పడుతున్న విద్యార్థులకు టెట్, టీఆర్టీతోపాటు, వీఆర్వో, వీఆర్ఏ, గ్రూప్స్‌కు కూడా శిక్షణ ఇప్పించారు. దాతల సహకారంతో విద్యార్థులు ఉచిత భోజనం, వసతులు కల్పించారు. దీంతో వేలాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మార్గం సుగమనం అయ్యింది. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్సై ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఆర్మీ, ఎయిర్‌పోర్స్ నియామకాలు కూడా జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రతీ మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఎదగాలంటే మంచి గాలి, శారీరక వ్యాయామం అవసరం. దీనికోసమే సిద్దిపేట పరిసర ప్రాంతాలతోపాటు మారుమూల ప్రాంతాల్లో కూడా విరివిరిగా చెట్లు నాటే కార్యక్రమాన్ని యజ్ఞంలా ప్రారంభించారు. పచ్చటి సిద్దిపేటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మంచి వ్యాయామం చేయాలంటే వారికి అందుబాటులో జిమ్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రధాన కూడళ్ల వద్ద జిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యాయామంతో క్రమశిక్షణ ‘‘యువత రేపటి విలువైన మానవ వనరులు. చిన్న చిన్న పొరపాట్లు చేసి జీవితాలను ఆంధకారంలోకి పోతున్నారు. వీరిని ప్రోత్సహించాలనే ఆలోచనతోనే అన్ని పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పించాం. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు సన్నద్ధం చేశాం. ఎయిర్‌పోర్స్ సెలక్షన్లు పెట్టడంతో వందలాది మంది ఉద్యోగాలు పొందారు. ఇక సిద్దిపేటలో కోమటి చెరువు అభివృద్ధి చేశాం. ఉదయం వేలసంఖ్యలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వ్యాయామం చేస్తున్నారు. వీరందరికీ జిమ్స్ అందుబాటులో ఉండాలన్నదే ఆలోచన. యువత జిమ్స్‌ను ఉపయోగించుకొని పోలీస్, ఇతర ఉద్యోగాల్లో ఎంపిక కావడం సంతోషకరం. ’’ – తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ‘‘ఒకప్పుడు సిద్దిపేట అంటే మారుమూల గ్రామం. కానీ ఇప్పుడు ఇక్కడి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సిద్దిపేట కోమటి చెరువు, బ్లాక్ ఆపీస్ చౌరస్తా, సిరిసిల్లా కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్తో యువతకు ఉపయోగకరంగా ఉంది. నెలకు వేలాది రూపాయలు ఖర్చుచేసి జిమ్‌కు వెళ్లలేని నిరుపేదలు వీటిని వినియోగించుకొని మంచి క్రీడాకారులుగా ఎదుగుతున్నారు.’’ – మల్లికార్జున్, క్రికెట్ క్రీడాకారుడు ‘‘మా ఊళ్లో మూడు వందలకు పైగా యువత ఉంటారు. జిమ్ చేయాలంటే సిద్దిపేటకు రావాల్సి ఉండేది. యుత అందరం కలిసి మాకు జిమ్ కావాలని మాజీ మంత్రి హరీశ్‌రావును కోరాం. వెంటనే మా ఊళ్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. యువత ఉదయం, సాయంత్రం జిమ్ చేసుకుంటున్నారు. క్రమశిక్షణకు అలవాటు పడుతున్నారు. కొందరు కానిస్టేబుల్, ఎస్సై వంటి ఉద్యోగాలు కూడా పొందుతున్నారు. యువతలో మార్పు వచ్చింది’’. – ఆంజనేయులు, సర్పంచ్, గుర్రాల గొంది -
ఉత్తేజం.. ఉత్సాహం
విజయనగరం మున్సిపాలిటీ: ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒత్తిడి పెరిగిపోతోంది. వేళాపాళా లేని ఆహారపుటలవాట్లతో ఆరోగ్యం పాడవుతోంది. నిద్ర లేమితో ఏకాగ్రత లోపిస్తోంది. వాటన్నిటి నుంచి బయటపడే తారక మంత్రం వ్యాయామం. రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో నడిచేవారు కొందరైతే.. అందుబాటులో ఉన్న జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసే వారు మరికొందరు. ఒక్క రోజు కొద్దిగా వ్యాయామం చేస్తే చాలు కొందరు అలసిపోతుంటారు. మళ్లీ కోలుకోవడానికి రెండు, మూడు రోజులు కావలసిందే. దీంతో విరామం ఇచ్చేస్తారు. ఫలితంగా ఒంటి నొప్పులు మొదలవుతాయి. అలా వారం, రెండు వారాలు సెలవులు ప్రకటిస్తారు. కొన్ని మెలకువలు పాటిస్తే ఎలాంటి సమస్యల్లేకుండా వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. మైదానాల్లో వ్యాయామాలు విజయనగరం రాజీవ్ క్రీడా మైదానం, అయోధ్య మైదానం, విజ్జి స్టేడియంలో రోజూ వందల సంఖ్యలో పట్టణ వాసులు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్, జాకింగ్, ఇతర వ్యాయామాలు చేస్తుంటారు. వీరితో పాటు కాలనీలు, ప్రధాన మార్గాల వెంబడి కొందరు నడుస్తుంటారు. గతంలో పోల్చుకుంటే ఇటీవల కాలంలో పట్టణ ప్రజల జీవన సరళిలో గణనీయమైన మార్పు వచ్చింది. అంతరాయాలు లేని నిద్రతో.. శరీరానికి, మనసుకు తగిన విశ్రాంతి లభించేది నిద్రలోనే. జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. వ్యాయామం చేసేవారు రోజూ 6నుంచి 8గంటలు ఎలాంటి అంతరాయాలు లేకుండా నిద్రపోవాలి. రోజూ ఒక నిర్ణీత సమయం నిద్రకు కేటాయించాలి. దీనివల్ల శరీరం అలసటకు గురవకుండా ఉంటుంది. మర్నాడు కొత్త శక్తిని పుంజుకుంటారు. పౌష్టికాహారం వర్కవుట్స్, జిమ్‌లో కసరత్తులు, నడక చేసే వారు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయామం వల్ల శరీరంలో శక్తి నిల్వలు తగ్గిపోతాయి. తిరిగి పొందాలంటే విటమిన్లు, ఖనిజాలు అవసరమవుతాయి. రోజువారీ తీసుకునే ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. కిలో శరీర బరువుకు 2 నుంచి 2.5 గ్రాముల ప్రోటీన్లు అవసరం. సూక్ష్మ పోషకాలు 150 శాతం ఉండాలి. కొందరు వ్యాయామం తీవ్రంగా చేస్తూ అలసిపోతుంటారు. ఇలా చేయడం వల్ల రోజూ కొనసాగించడం సాధ్యం కాదు. వారంలో ఒకటి రెండు రోజు లు సాధారణ వ్యాయామాలు చేయాలి. తీవ్రతను తగ్గిస్తూ ఉండాలి. దీనివల్ల మర్నాడు కాస్త ఎక్కువగా చేయడానికి సరిపడా శక్తి వస్తుంది. ధ్యానంతో ఉల్లాసం ఏ పరిస్థితులనైనా ప్రశాంతంగా, ప్రణాళికతో ఎదుర్కొంటే ఒత్తిడి దరిచేరదు. ధ్యానం ఇందుకు ఉపకరిస్తుంది. ఇక రోజూ ఉల్లాసంగా ఉంటే మానసిక ఆనందం కలిగి ఎక్కువ శ్రమ పడ్డామనే భావన పోతుంది. కుటుంబంతో సినిమాలు, పార్కుకు వెళ్లడం, విహార యాత్రలు చేయడం ఇందుకు దోహదపడతాయి. మంచి నిద్రతో మేలు వ్యాయామం అలసట నుంచి కోలుకోవాలంటే చక్కని నిద్ర ఉండాలి. సరైన సమయానికి పోషకాహారం తీసుకోవాలి. ఎంతసేపు, ఎలాంటి కసరత్తులు చేశామనే దానిపై ఆధారపడి సమతుల ఆహారం తీసుకోవాలి. కండరాలకు ఎంత శ్రమ కలిగిస్తామో విశ్రాంతిలో అంత మరమ్మతులు జరుగుతాయి. సాధారణంగా వారంలో ఆరు రోజులు కసరత్తులు చేయాలని సూచిస్తాం. ఒక రోజు విశ్రాంతి ఇస్తే ఆ సమయంలో జీవక్రియలు బాగా జరుగుతాయి. 21 రోజులకు ఒకసారి వర్కవుట్‌లో మార్పులు చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి.- ధనుంజయ్, ఫిట్నెస్ శిక్షకుడు, విజయనగరం. ఒంటరి నడక మంచిది బరువు తగ్గాలనుకునే వారు ఒంటరిగా నడిస్తేనే ఎక్కువ క్యాలరీలు తగ్గుతాయి. స్నేహితులతో కలిసి వెళ్ళినా.. నడిచినప్పుడు మాట్లాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. మొక్కుబడిగా నడవడం వల్ల మార్పు ఏమీ కనిపించదు. ప్రారంభంలో నిదానంగా చేస్తూ.. రోజు రోజుకు నడక వేగం, నడిచే దూరం పెంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలసట అనిపిస్తే.. కాసేపు ఆగి నడక వేగాన్ని క్రమక్రమంగా పెంచుకోవాలి. ఒంటరిగా నడవటం వల్ల కొంత ప్రశాంతతో పాటు వేగంగా నడుస్తారు.– కె.కృష్ణ, వాకర్స్ క్లబ్ ప్రతినిధి, కంటోన్మెంట్. దినచర్యలో నడక భాగం రోజూ నడవటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బరువు త్వరగా తగ్గాలనుకునే వారు, ఒత్తిడి నుంచి బయట పడాలనుకునే వారు నడక కోసం క్రమం తప్పకుండా రోజూ అర్ధగంటైనా కేటాయించాలి. దినచర్యలో నడక ఓ భాగం కావాలి. రోజూ నడిస్తే శరీర బరువులో తప్పనిసరిగా మార్పు తీసుకొస్తుంది. మధుమేహ వ్యాధిని సైతం నియంత్రణలో ఉంచుకోవచ్చు. – శివరామకృష్ణ, వాకర్, విజయనగరం ఆహార నియమాలు పాటించాలి నడకతో పాటు ఆహార నియామాల్లో కొద్ది మార్పులు చేస్తే శరీర బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. ఆహారం తీసుకోవడం, సమయపాలన పాటించడం, ఎక్కువ కొవ్వు పదార్థాలను తీసుకోకపోవటం మంచిది. పండ్లు, తాజా కూరగాయలు రోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.– డాక్టర్ భార్గవ్, విజయనగరం -
అయస్కాంతాలతో కండరాలకు శక్తి...
వ్యాయామం చేస్తూ ఉంటే కండరాలు దృఢంగా మారతాయి. చాలాసార్లు విన్నమాటే ఇది. గాయాలై కదల్లేని వారి గతేమిటి? ఎంరెజెన్ వాడితే చాలంటున్నారు సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అయస్కాంత శక్తితో పనిచేసే ఈ ఎంరెజెన్ను రోజూ ఉపయోగిస్తే ఎలాంటి వారికైనా వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుందని అల్ఫ్రెడో ఫ్రాంకో ఒబెర్గన్ అంటున్నారు. కండరాలపై నిర్దిష్ట తీవ్రతతో ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడం ద్వారా ఎంరెజెన్ పనిచేస్తుందని ఫలితంగా ఖర్చయిపోతున్నట్లు భ్రమపడి కండరాలు మళ్లీ దృఢంగా తయారయ్యే ప్రయత్నం చేస్తాయని వివరించారు. వ్యాయామం అస్సలు చేయని లేదా చేయలేని వారి కండరాలు కాలక్రమంలో బలహీనపడుతూ ఉంటాయని.. తద్వారా వచ్చే దుష్ఫలితాలను ఎంరెజెన్ సాయంతో నివారించవచ్చునని చెప్పారు. 2015, 2017లలో తాము ఈ యంత్రాన్ని కొంతమందిపై ప్రయోగించి చూశామని వారానికి ఒక రోజు పది నిమిషాలపాటు.. ఐదు వారాలపాటు ఒక కాలి కండరంపై దీన్ని వాడినప్పుడు కండరాల శక్తిలో 30 నుంచి 40 శాతం వరకూ పెరుగుదల కనిపించినట్లు తెలిపారు. రెండో ప్రయోగంలో మోకాలి శస్త్రచికిత్స చేసిన వాళ్లు కొంతమందిని రెండు గుంపులుగా విడదీశామని.. కొందరికి ఎంరెజెన్.. మిగిలిన వాళ్లకు సాధారణ ఫిజియోథెరపీ ఇచ్చామని యంత్రాన్ని వాడిన వాళ్లు చాలా తొందరగా కోలుకున్నట్లు తెలిపారు. -
విశాఖ బీచ్‌లో ప్రమాదకరంగా మారిన వ్యాయామ పరికరాలు
-
పహిల్వాన్ డోలు
అది చలికాలం. చల్లని నల్లని అమావాస్య రాత్రి. మలేరియా, కలరా రోగాలతో ఆ ఊరంతా భయాక్రాంతుడైన బాలుడి మాదిరి వణికిపోతూ ఉంది. నశించిపోయిన పాత వెదురు బోద గుడిసెల్లో చీకటి– నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఒకటే చీకటి స్తబ్దత.చీకటి రాత్రి కన్నీరు కారుస్తోంది. స్తబ్దత కరుణతో కూడిన వెక్కిళ్లనూ దుఃఖాన్నీ బలవంతంగా తన హృదయంలో నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. భూమిపైన వెలుతురు అనే మాటే లేదు. ఆకాశంలో నుంచి ఊడబడాలని ఏ నక్షత్రమైనా అనుకున్నా దాని వెలుతురూ, శక్తి మార్గమధ్యంలోనే నశిస్తాయి. మిగతా నక్షత్రాలు దాని భావుకత, అసమర్థతను చూసి కిలకిలా నవ్వుకుంటాయి. నక్కల ఊళలు, గుడ్లగూబల భయంకరమైన కూతలు అప్పుడప్పుడూ నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి. ఊరిలోని గుడిసెల నుంచి ఏడుపులు, వాంతులు చేసుకునే శబ్దాలు, ‘‘అయ్యో దేవుడా, ఓరి భగవంతుడా!’’ వంటి కేకలు మాత్రం వినపడుతున్నాయి. అమ్మా, అమ్మా అంటూ నీరసించిన గొంతులతో పిల్లల అరుపులు వినబడుతున్నాయి. కానీ వీటివల్ల రాత్రి స్తబ్దతలో ఎలాంటి మార్పులూ లేవు.పరిస్థితులను పసిగట్టే గొప్ప నేర్పు కుక్కలకుంటుంది. అవి పగలంతా గుట్టలపైన మూటల్లా ముడుచుకుని దిగులుగా పడి ఉంటాయి. రాత్రి వేళల్లో అన్నీ కలిసి ఏడుస్తుంటాయి. రాత్రిళ్లు ఈ విధంగా భయంకరంగా గడిచిపోతూ ఉంటే, దొమ్మరివాడి డోలు మాత్రం నిరంతరం మోగుతూ ఉండేది. సాయంత్రం అయినప్పటి నుంచి తెల్లారేదాకా ‘ఫట్.. థా గిడ్... థా.. ఫట్.. థా గిడ్.. థా.. ’ (అంటే.. రా, ఢీకొను రా, ఢీకొను) అనే శబ్దం ఒకే తాళగతిలో మోగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ‘చటాక్ చట్థా.. చటాక్.. చట్ థా’ (అంటే ఎత్తి కింద పారేయి.. ఎత్తి కింద పారేయి) అనే శబ్దాలు వినిపిస్తాయి. మృత్యుముఖంలో ఉన్న ఆ ఊళ్లో ఆ డోలు శబ్దాలే సంజీవని శక్తిగా పనిచేసేవి.లుట్టన్ సింగ్ పహిల్వాన్‌ను హోల్ ఇండియా ప్రజలకు తెలుసునని అంటూ ఉంటాడు. కానీ అతని హోల్ ఇండియా హద్దు ఒక జిల్లా వరకు మాత్రమే. ఆ జిల్లాలోని ప్రజలకందరికీ అతను తెలుసు.లుట్టన్ తల్లిదండ్రులు అతని తొమ్మిదేళ్ల వయసప్పుడే అతన్ని అనాథగా మిగిల్చి చనిపోయారు. అదృష్టం కొద్దీ అప్పటికే అతనికి పెండ్లి అయింది. లేకపోతే తల్లిదండ్రులతో పాటు అతనూ గతించేవాడు. విధవరాలైన అత్త అతన్ని పెంచి పెద్ద చేసింది. బాల్యంలో ఆవులను మేపుతూ, వాటి పాలు తాగుతూ, కసరత్తు చేస్తూ గడిపేవాడు. పల్లె ప్రజలు అతని అత్తను నానా విధాలుగా బాధించేవారు. వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే అతని బుర్రలో కసరత్తు నేర్చుకోవాలనే బుద్ధి పుట్టింది. క్రమం తప్పకుండా కసరత్తు చేయడం వల్ల బాల్యావస్థలోనే అతని ఛాతీ, బాహువులు బలిష్టంగా తయారయ్యాయి. పుష్టికరమైన కండరాలు ఏర్పడ్డాయి. యవ్వనంలోకి అడుగుపెడుతూనే పల్లెలోకెల్లా మంచి పహిల్వాన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రజలు అతనికి భయపడేవారు తాను రెండు వైపులా చేతులను నలభై ఐదు డిగ్రీల కోణంలో చాపి– పహిల్వాన్ల మాదిరిగా నడిచేవాడు. అతను కుస్తీ కూడా పట్టేవాడుఒకనాడు అతడు కుస్తీ చూడ్డానికి శ్యామ్‌నగర్ జాతరకు వెళ్లాడు. పహిల్వాన్ల కుస్తీలో వాళ్ల పట్టు విడుపులు చూస్తూ ఊరకుండలేకపోయాడు. యవ్వనపు వేడి, మదం వల్ల డోలు శబ్దాలకు అతని రక్తనాళాలు వేడెక్కాయి. ముందు వెనుకా చూడకుండా కుస్తీలో ‘‘సింహం పిల్ల’’తో సవాలు చేశాడుఆ సింహంపిల్ల అసలు పేరు చాంద్ సింగ్. వాడు పంజాబ్ నుంచి తన గురువు బాదల్ సింగ్ వెంట తొలిసారి శ్యామ్‌నగర్ జాతరకు వచ్చాడు. అందమైన యువకుడు. వచ్చిన మూడు రోజుల్లోనే పంజాబ్–పఠాన్ల పహిల్వాన్ల దళంలోని తన సరిజోడు పహిల్వాన్లందరినీ నేల కరిపించి, ‘‘సింహంపిల్ల’’ అనే బిరుదు పొందగలిగాడు. అతను కుస్తీ మైదానంలో లంగోటా బిగించి చెంగు చెంగున విజయగర్వంతో హర్షధ్వనులు చేస్తూ గుర్రంపిల్ల మాదిరిగా ఎగురుతూ ఉండేవాడు. అతని దెబ్బకు అక్కడి యువ పహిల్వాన్లు అందరూ కుస్తీ మాటంటేనే భయపడేవారు. తన బిరుదును నిలుపుకొనేందుకు చాంద్ సింగ్ మధ్య మధ్యలో కుస్తీకి ఎవరైనా ఉంటే రమ్మని కాలు దువ్వేవాడు. వేటలూ, కుస్తీలంటే చెవి కోసుకునే శ్యామ్‌నగర్ వృద్ధ మహారాజా చాంద్సింగ్ను తన దర్బారులో పహిల్వాన్‌గా ఉంచుకోవాలని అనుకుంటుండగానే లుట్టన్ ఆ సింహంపిల్లతో పోటీ పడతానని సవాలు చేశాడు. బిరుదు పొందిన చాంద్ సింగ్.. లుట్టన్ సవాలు విని నవ్వుకున్నాడు. వెంటనే డేగ మాదిరి అతని మీదకు లంఘించాడు.నిశ్శబ్దంగా ఉన్న ప్రేక్షకుల గుంపులో కలకలం మొదలైంది. ‘‘పిచ్చోడు.. పిచ్చి ముండాకొడుకు... చచ్చచ్చ.. చచ్చ’’... ఓహో! గొప్పోడే. లుట్టన్ చాకచక్యంగా దాడిని తప్పించుకుని లేచి నిలబడ్డాడు. మహారాజా కుస్తీని ఆపు చేయించి, లుట్టన్ను తన వద్దకు పిలిపించుకుని సముదాయించాడు. అతని ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ పదిరూపాయల నోటు చేతికందించి ‘‘పో.. జాతర చూసి ఇంటికి పో..’’ అన్నాడు. ‘‘లేదు మహారాజా! కుస్తీ పడతాను. తమరు ఆజ్ఞాపించండి.’’‘‘పో.. పిచ్చోడా’’‘‘శరీరంలో శక్తి లేకపోయినా సింహంపిల్లతో కుస్తీ పట్టవచ్చావుటరా.. రాజావారు ఇంతగా నచ్చచెబుతున్నా కుస్తీ మానుకోకపోతే నీకు పుట్టగతులుండవు’’ అని మేనేజరు, భటులు అతన్ని బెదిరించారు.‘‘మీపై ఒట్టు దొరా! మీ ఆజ్ఞయే తరువాయి మహారాజా... కుస్తీ పట్టనివ్వండి దొరా. లేకపోతే ఇక్కడే ఈ రాతికి తల బద్దలుగొట్టుకుని చస్తాను’’ చేతులు జోడించి వేడుకున్నాడు. గుంపులో కలవరం మొదలైంది. పంజాబ్ పహిల్వాన్ల దళం కోపంతో లుట్టన్పై తిట్ల వర్షం కురిపించసాగింది. ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగింది. వాళ్లల్లో కొందరు లుట్టన్ తరఫున కేకలు చేస్తూ అతన్ని కుస్తీ పట్టనివ్వండి అని అరిచారు. చాంద్ సింగ్ ఒక్కడే మైదానంలో నవ్వుకుంటూ నిలబడ్డాడు. మొదటి పట్టులోనే తన ప్రత్యర్థి శక్తి ఏమిటో అతనికి అర్థమైంది.రాజావారు గత్యంతరం లేక ఆజ్ఞ జారీ చేశారు. ‘‘సరే కుస్తీ పట్టండి.’’డోలు మోగటం మొదలైంది. ప్రేక్షకుల్లో మళ్లీ ఉత్సాహం పెరిగింది. గుంపులో కోలాహలం ప్రారంభమైంది. జాతరలోని దుకాణదారులందరూ దుకాణాలను మూసివేసి ‘‘చాంద్ సింగ్‌కి సమ ఉజ్జీ దొరికాడు. కుస్తీ జరుగుతూంది’’ అని పరుగెత్తుకుంటూ వచ్చారు.‘‘చట్ థా.. గిడ్ థా.. చట్ థా.. గిడ్ థా..’’ ఇంతవరకు మూగబోయిన డోలు పెద్ద శబ్దంతో మోగింది. ‘‘డాక్ డినా, డాక్డినా డాక్ డినా’’ (అంటే వాహా, భలే భలే) శబ్దం చేస్తూ డోలు మోగింది. చాంద్ సింగ్ లుట్టన్ సింగ్‌ను గట్టిగా నొక్కి పట్టాడు.‘‘అయిపోయే! లుట్టన్ సింగ్ బజ్జీ అయిపోయే! సింహంపిల్లతో ఢీకొనడం నవ్వులాటా మరి’’ అని ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ‘చట్ గిడ్థా, చట్ గిడ్థా, థట్గిడ్థా’ (భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు) అంటూ డోలు మార్మోగింది. లుట్టన్ మెడపై మోచేతిని ఆనించి నేల పడేసే ప్రయత్నంలో చాంద్ సింగ్ ఉన్నాడు.‘అక్కడే పడెయ్యి’ అంటూ బాదల్ సింగ్ తన శిష్యుణ్ణి ఉత్సాహపరచాడు.లుట్టన్ కన్నులు బయటకొచ్చాయి. ఉఛ్ఛ్వాశ నిశ్వాసాలు ఎక్కువయ్యాయి. గుంపులోని ఎక్కువమంది జనం చాంద్సింగ్ పక్షం చేరి, అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. లుట్టన్ పక్షాన డోలు మాత్రం మోగుతోంది. డోలు మోత ప్రకారం అతను తన ఉత్సాహాన్ని పెంపొందించుకుంటూ తలపడుతున్నాడు. ఉన్నట్టుండి డోలు నెమ్మదిగా మోగసాగింది.‘‘డక్ డినా– తిర్కిట్తినా, డక్డినా తిర్కిట్తినా’’ (అంటే పోటీ విరమించుకో, బయటకొచ్చేసేయి) అని లుట్టన్ సింగ్‌కు డోలు చేసిన ఈ శబ్దాలు వినపడ్డాయి. ఉన్నట్టుండి లుట్టన్ పట్టు నుంచి జారుకొని బయటకొచ్చి వెంటనే చాంద్సింగ్పైకి ఉరికి మెడ పట్టేశాడు. ‘‘శభాష్, భలే! మట్టిలో మాణిక్యానివిరా!’’‘‘సరే, ఆహా! బయటికొచ్చాడా?’’ అందువల్లనే కదా జనం లుట్టన్ వైపు మొగ్గారు.‘ఛటాక్ ఛట్ థా.. ఛటాక్ ఛట్ థా’ (ఎత్తి పడెయ్యి, ఎత్తి పడెయ్యి) అని గట్టిగా డోలు మోగింది. లుట్టన్ చాలా చలాకీగా ఎత్తుకు పై ఎత్తు వేసి చాంద్ సింగ్‌ను కింద పడేశాడు.‘థిగ్ థినా, థిగ్ థినా’ (వెల్లకిలా పడెయ్యి, వెల్లకిలా పడెయ్యి) అని డోలు మోగింది.లుట్టన్ సింగ్ శక్తినంతా బిగపట్టి చాంద్ సింగ్‌ను వెల్లకిలా పడేసి ఓడించాడు. ‘థాగిడ్ గిడ్, థాగిడ్ గిడ్, థాగిడ్ గిడ్’ (శభాష్ పహిల్వాన్, శభాష్ పహిల్వాన్, శభాష్ పహిల్వాన్) అని డోలు మోగింది.ప్రేక్షకులు ఎవరికి జేజేలు పలకాలో తెలియని స్థితిలో ఉన్నారు. వాళ్ల వాళ్ల ఇష్టానుసారం కొంతమంది ‘దుర్గా మాతకు జై’ అంటే మరికొందరు ‘మహావీరునికి జై’ పలికారు. మరికొందరు శ్యామానంద మహారాజుకు జై పలికారు. ఆఖరికి సామూహికంగా జేజేలతో ఆకాశం మార్మోగింది.విజయోత్సాహంతో లుట్టన్ ఎగురుతూ గంతులేస్తూ, తొడలు చరుస్తూ అందరి కంటే ముందు వాద్యగాళ్ల వద్దకు పరుగున వెళ్లి భక్తిపూర్వకంగా డోలుకు నమస్కరించాడు. తర్వాత పరుగున వెళ్లి రాజాగారిని పైకెత్తుకున్నాడు. రాజావారి విలువైన దుస్తులకు మట్టి అంటుకుంది. ‘అరె, అరే .. ఏమిటిది?’ మేనేజరుగారు మందలించారు. రాజావారు మాత్రం అతన్ని తన హృదయానికి హత్తుకొని ఆనంద పారవశ్యంతో ‘‘వర్ధిల్లు పహిల్వాన్ వర్ధిల్లు! నీవు ఈ రాజ్య గౌరవాన్ని నిలబెట్టావు’’ అన్నారు. పంజాబీ పహిల్వాన్లు చాంద్ సింగ్ కన్నీళ్లు తుడవసాగారు. రాజావారు లుట్టన్ సింగ్‌కు బహుమానాలు ఇవ్వటమేగాక అతన్ని ఆస్థానంలో నియమించుకున్నారు. అప్పటి నుంచి లుట్టన్ రాజాస్థానంలో పహిల్వాన్ అయ్యాడు. రాజావారు గౌరవంగా అతన్ని లుట్టన్ సింగ్ అని పిలువసాగారు. మిగతా ఆస్థాన పండితులకు అది నచ్చలేదు. ‘‘ప్రభూ! వీడి జాతి ఏమిటి? వీడిని సింగ్ అని పిలవడం బాగులేదు’ అన్నారు.మేనేజరు క్షత్రియుడు. తన క్లీన్షేవ్డ్ ముఖాన్ని చిట్లిస్తూ ముక్కులోని వెంట్రుకలను లాగసాగాడు. క్షణంలో ఒక వెంట్రుకను లాగేసి దాన్ని నలుపుకుంటూ ‘‘అవును మహాప్రభూ! ఇది అన్యాయమే’’ అన్నాడు.‘‘అతడు క్షత్రియుడు చేయవలసిన పనే చేశాడు’’ రాజావారు చిరునవ్వుతో అన్నారు. ఆ రోజు నుంచే లుట్టన్ సింగ్ పహిల్వాన్ కీర్తి ప్రతిష్ఠలు దూర తీరాలకు వ్యాపించాయి. కొద్ది సంవత్సరాల్లోనే అతడు పేరుగాంచిన పహిల్వాన్లను ఒక్కొక్కరినే మట్టికరిపించాడు. అప్పుడు కాలాఖాన్ అనే మరో పేరుపొందిన పహిల్వాన్ ఉండేవాడు. కాలాఖాన్ లంగోటీ బిగించి, ఆలే అని ప్రత్యర్థి పైకి ఉరికితే, ప్రత్యర్థికి వణుకు పుట్టేదని ప్రతీతి. లుట్టన్ సింగ్ అతన్ని కూడా ఓడించి వాళ్ల భ్రమలను తొలగించాడు.క్రమంగా అతను ప్రదర్శనశాలలో ఒక వస్తువుగా తయారయ్యాడు. జంతు ప్రదర్శనశాలలో ఇనుపబోను ఊపుతూ పులి గాండ్రించినట్లు అతను హా హూ.. హా హూ అని అరిచేవాడు. అతని అరుపులు విని, రాజావారి పులి అరుస్తోంది అనేవారు. జాతరలో అతను మోకాళ్ల వరకు అంగీ వేసుకుని, చిందరవందరగా తలపాగా కట్టి, మదించిన ఏనుగులా ఊగుతూ నడిచేవాడు. దుకాణదారులు తమ అంగడి వద్దకు పిలిచి, ‘‘పహిల్వాన్ గారూ! వేడి వేడి రసగుల్లాలు రెడీగా ఉన్నాయి.. నాలుగైదు ఆరగించండి’’ అని వేళాకోళం చేసేవారు.లుట్టన్సింగ్ పహిల్వాన్ చిన్నపిల్లాడి మాదిరి నవ్వుకుంటూ ‘అరే నాలుగైదు తింటే ఏమవుతుంది? తీసుకురా ఒకటి, రెండు శేర్లు’ అని అక్కడే కూర్చునేవాడు.రెండుశేర్ల రసగుల్లాలు తిని, పది పన్నెండు పాన్ చిలకల్ని నోట్లో కుక్కుకుని, గడ్డానికి పాన్ రసాన్ని కార్చుకుంటూ జాతరలో తిరిగేవాడు. జాతర నుంచి రాజ దర్బారుకి తిరిగొచ్చేటప్పటికి అతని ఆకృతే మారిపోయేది. కండ్లకు రంగుల అభ్రకపు కళ్లజోడు, చేతుల్లో నాట్యం చేసే బొమ్మ, నోట్లో ఇత్తడి పీకను ఊదుకుంటూ నవ్వుకుంటూ తిరిగొచ్చేవాడు. శారీరక వృద్ధి సామర్థ్యాలు పెంపొందుతున్నాయి గాని, బుద్ధి మాత్రం క్షీణిస్తూ చిన్నపిల్లల స్థాయికి చేరుకుంది. కుస్తీ మైదానంలో డోలు శబ్దం వింటూనే తన స్థూలకాయాన్ని ప్రదర్శించడం ప్రారంభించేవాడు. అతనికి సమ ఉజ్జీ దొరికేవాడే కాదు. ఒకవేళ ఎవరైనా అతనితో పోటీ పడాలంటే రాజావారు అనుమతించేవారు కాదు. అందువల్లే పాపం అతను నిరాశతో లంగోటీ బిగించి, దేహానికి మట్టి పూసుకుని, ఎగురుతూ గంతులేస్తూ ఉండేవాడు. తనను దున్నపోతు, ఆంబోతుగా నిరూపించుకుంటూ తిరిగేవాడు. ముసలివాడైన రాజు అతన్ని చూసి మురిసిపోయేవాడు.ఇలా పదిహేనేళ్లు గడిచిపోయాయి. పహిల్వాన్ మాత్రం అజేయుడిగా నిలిచిపోయాడు. కుస్తీ మైదానంలోకి లుట్టన్ సింగ్ తన ఇద్దరు కుమారులను తీసుకుని వచ్చేవాడు. పహిల్వాన్ అత్త ఎప్పుడో మరణించింది. ఇద్దరు పిల్ల పహిల్వాన్లకు జన్మనిచ్చిన కొద్ది రోజులకు అతని భార్య పరమపదించింది. ఇద్దరు పిల్లలూ తండ్రిని మించిన తనయులు అవుతారు అనేవారు.ఇద్దరినీ పిల్లవాళ్లుగా ఉన్నప్పుడే కాబోయే రాజ మల్లులుగా ప్రకటించారు రాజావారు. అందువల్ల వారి పోషణ భారమంతా రాజదర్బారే చూసేది. ప్రతిరోజూ ప్రాతఃకాలాన్నే పహిల్వాన్ స్వయంగా డోలు వాయిస్తూ పిల్లల చేత కసరత్తు చేయించేవాడు. మధ్యాహ్నంపూట విశ్రమిస్తూనే ఇద్దరికీ ప్రపంచజ్ఞానం బోధించేవాడు.‘‘డోలు ధ్వనులపై దృష్టి కేంద్రీకరించండి. నాకు గురువు ఎవ్వరూ లేరు. ఈ డోలే నా గురువు. ఈ డోలు ధ్వనుల ప్రభావం వల్లనే నేను పహిల్వాన్ కాగలిగాను. కుస్తీ మైదానంలోకి అడుగిడగానే డోలుకు నమస్కారం చేయాలి. తెలిసిందా.’’... ఈ మాదిరి ఎన్నో విషయాలు బోధించేవాడు. ఇవే కాకుండా రాజావారిని ఏవిధంగా సంతోషపరచాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి మొదలైన విషయాలను వారికి బోధించేవాడు.కానీ ఏం లాభం? అతని బోధనలన్నీ వ్యర్థమయ్యాయి. రాజావారు స్వర్గస్తులయ్యారు. రాజ కుమారుడు విదేశాల నుంచి తిరిగొచ్చి రాజ్యపాలనా భారాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. నాన్నగారి కాలంలోని వైఫల్యాలన్నీ తొలగించి, కట్టుదిట్టాలు చేశాడు. కొన్ని కొత్త మార్పులు చేశాడు. ఆ మార్పుల కారణంగా పహిల్వాన్‌గిరీ ఊడిపోయింది. కుస్తీ మైదానాన్ని గుర్రపు పందేలా మైదానంగా మార్చారు.పహిల్వాన్లు కాబోయే రాజమల్లుల దినసరి భోజన ఖర్చు వివరాలు తెలియగానే ‘టెరిబుల్’ అన్నాడు కొత్త రాజు.రాజాస్థానంలో ఇంకెంత మాత్రం పహిల్వాన్ల అవసరం లేదని స్పష్టంగా హుకుం జారీ చేశాడు. పహిల్వాన్‌కు తన గోడు తెలుపుకునే అవకాశం సైతం దొరకలేదు.అదేరోజు డోలును మెడకు తగిలించుకుని కొడుకులను వెంట తీసుకుని పహిల్వాన్ తన ఊరు చేరుకున్నాడు. ఊరిలో ఒక మూల ఊరివారందరూ కలిసి ఒక గుడిసె వేయించి ఇచ్చారు. అక్కడే ఉంటూ ఊరి యువకులకు, పశువుల కాపర్లకు కుస్తీ నేర్పుతూ వచ్చాడు. తిండితిప్పలు ఊరిలో వాళ్లు చూసేవారు. ఉదయం, సాయంత్రం డోలు వాయిస్తూ శిష్యులకు, తన కొడుకులకు కుస్తీలోని పట్టు విడుపులు నేర్పేవాడు .ఆ ఊరిలోని రైతుల పిల్లలకూ, వ్యవసాయ కూలీల పిల్లలకూ సరైన తిండి లేదు. ఇక కుస్తీ ఎలా నేర్చుకోగలరు? క్రమక్రమంగా పహిల్వాన్ స్కూలు ఖాళీ అయింది. ఆఖరికి డోలు వాయిస్తూ తన ఇద్దరు కొడుకులకే కుస్తీలోని పట్టువిడుపులు నేర్పుతూ ఉండేవాడు. దినమంతా ఇద్దరు కొడుకులు కూలి నాలి చేసి సంపాదించిన సొమ్ముతోనే జీవితం గడిపేవాడు.ఉన్నట్టుండి ఆ ఊరికి ఆపద వచ్చిపడింది. అనావృష్టి. తిండి గింజల లేమి. ఆ తర్వాత మలేరియా, కలరా రెండూ కలసి పల్లెను సర్వనాశనం చేయసాగాయి.ఆ ఊరు ఒక విధంగా ఖాళీ అయింది. ఇండ్లకు ఇండ్లు ఖాళీ అయిపోయాయి. ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురు శవాలుగా మారేవారు. పల్లెవాసుల్లో కలవరం మొదలైంది. రోజంతా కలవరం, వ్యాకులత, హృదయాన్ని కరిగించే ఏడుపులతో గడిచిపోగా, ప్రజల ముఖాల్లో సూర్యుని వెలుగుతో పాటు కొంచెం వెలుగు కనపడేది. సూర్యోదయం అవుతూనే ఏడుస్తూ, మొత్తుకుంటూ తమ ఇండ్ల నుంచి బయటికొచ్చి ఇరుగుపొరుగు వారితో, బంధువులతో కలసి పరస్పరం ధైర్యం చెప్పుకొనేవారు.‘‘ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం కోడలా, పోయినవాడు పోయాడు. వాడు నీవాడు కాదనుకో. ముందు జరగవలసిన దానిని గురించి ఆలోచించుకో’’ అని..‘‘తమ్ముడూ! ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఎంతకాలం ఏడుస్తావు? శవంపై కప్పేదానికి గుడ్డ కావాలంటావా, దాని అవసరం ఏమిటి? శవాన్ని నదిలో కలిపేసి రారాదా’’ అనే మాటలు ఊరంతా వినిపించేవి.సూర్యాస్తమయం అవుతూనే ఊరివారంతా తమ తమ గుడిసెల్లో దూరి నిశ్శబ్దంగా పడి ఉంటారు. అప్పుడు వాళ్లకు మాట్లాడే శక్తి కూడా ఉండదు. తల్లి పక్కనే ప్రాణాలు కోల్పోతున్న కొడుకును, కొడుకా అని పిలిచే ధైర్యం తల్లులకు ఉండదు.రాత్రి భీకర నీరవ స్తబ్దతను పహిల్వాన్ డోలు మాత్రమే గట్టిగా మోగుతూ సవాలు చేస్తుంది. సాయంకాలం నుంచి ఉదయం వరకు డోలు ఏదో విధంగా మోగుతూ ఆ పల్లెలో చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్లకు, మందులూ మాకులూ లేక తిండితిప్పలు లేని మనుషులకు సంజీవని శక్తిగా పనికొచ్చేది. పిల్లల యువకుల వృద్ధుల శుష్క నేత్రాలలో అప్పుడప్పుడూ కుస్తీ మైదానంలోని దృశ్యాలు లీలగా తాండవిస్తాయి. స్పందన, శక్తి లేని నరాల్లో విద్యుత్తు ప్రవహిస్తుంది. ఆపే శక్తి లేకపోవచ్చు కాని, చనిపోయేవాళ్లు కళ్లు మూసే సమయంలో వాళ్లకు ఎలాంటి కష్టాన్నీ కలిగించకుండా, మృత్యుకూపంలోకి పోయేటప్పుడు ఎలాంటి భయం కలుగకుండా డోలు శబ్దాలు పనికొచ్చేవి. పహిల్వాన్ కొడుకులు యముని పాశంలో చిక్కుకొని భరించలేని బాధతో కొట్టుమిట్టాడుతూ ‘‘నాన్నా, ఎత్తిపడేయి’’ అన్న తాళాన్ని వాయించండి అన్నారు. ‘‘ఛటాక్– ఛట్థా, ఛటాక్– ఛట్థా’’ తాళాన్ని పహిల్వాన్ రాత్రంతా డోలుపై వాయిస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో పహిల్వాన్ల భాషలో ‘వీరులారా! ప్రత్యర్థిని ఓడించండి’ అని ఉత్సాహపరుస్తున్నాడు.తెల్లవారేసరికి ఇద్దరు కొడుకులూ అపస్మారక స్థితిలో నేలపై పడి ఉండటం చూశాడు. ఇద్దరూ బోర్లా పడి ఉన్నారు. ఒకడు మట్టిలో కూరుకుపోయి ఉన్నాడు. దీర్ఘ ఉఛ్ఛ్వాశ తీసుకుని నవ్వే ప్రయత్నంలో పహిల్వాన్ ‘‘ఇద్దరు వీరులూ మట్టికరిచారా!’’ అన్నాడు.ఆ రోజు పహిల్వాన్ శ్యామానంద మహారాజా ఇచ్చిన పట్టు లంగోటా ధరించి ఉన్నాడు. శరీరమంతా మట్టి పులుముకొని కసరత్తు చేశాడు. తర్వాత ఇద్దరు కొడుకులను భుజాన వేసుకుని నదిలో పారేసి వచ్చాడు. ఈ విషయం విని పల్లెవాసులు ఆశ్చర్యచకితులయ్యారు. భయభ్రాంతులయ్యారు. ఇంత జరిగినప్పటికీ పహిల్వాన్ డోలు శబ్దాలు రోజూ మాదిరిగానే వినబడసాగాయి. ప్రజల్లో ధైర్యం పుంజుకోసాగింది. ‘‘ఇద్దరు కొడుకులు గతించారు. అయినప్పటికీ పహిల్వాన్ ధైర్యం చూడండి. అతని గుండెనిబ్బరం చూడండి’’ అని తమ సంతానాన్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు అనుకున్నారు.నాలుగైదు రోజుల తర్వాత ఒకనాటి రాత్రి డోలు శబ్దాలు వినబడలేదు. డోలు మూగబోయింది. రోగగ్రస్తులైన కొందరు శిష్యులు పోయి చూడగా, పహిల్వాన్ శవం వెల్లకిలా పడి ఉంది. రాత్రి నక్కలు బలిష్టమైన అతని ఎడమ తొడ మాంసం తినేశాయి. కడుపును కూడా చీల్చాయి.‘‘నేను చనిపోతే చితిపైన నన్ను వెల్లకిలా పడుకోబెట్టండి. నేను జీవితంలో ఎప్పుడూ బోర్లాపడలేదు. చితికి నిప్పంటించేటప్పుడు డోలు వాయించండి’’ అని అంటుండేవారు మన గురువుగారు అని కన్నీళ్లు తుడుచుకుంటూ అతని శిష్యుల్లో ఒకడన్నాడు.పక్కనే డోలు పడిఉంది. నక్కలు డోలును తినే వస్తువు కాదనుకొని దాని చర్మాన్ని చీల్చేశాయి. -
చిన్న వ్యాయామం.. రోజుల ప్రయోజనం..
వ్యాయామంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మనం చాలాకాలంగా వింటున్నాం. కానీ ఎంత వ్యాయామానికి ఎంత? ఎలాంటి ప్రయోజనం జరుగుతుందన్నది మాత్రం సౌత్‌వెస్ట్‌ర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ తాజా పరిశోధన ద్వారా లెక్కకట్టారు. దీని ప్రకారం కేవలం ఒక్కసారి వ్యాయామం చేసినా జీవక్రియలపై దాని ప్రయోజనం కొన్ని రోజులపాటు కొనసాగుతుంది. కచ్చితంగా చెప్పాలంటే మెదడులోని న్యూరాన్లను ప్రభావితం చేయడం ద్వారా ఒక్క వ్యాయామం రెండు రోజుల పాటు జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయని అంటున్నారు కెవిన్ విలియమ్స్ అనే శాస్త్రవేత్త. ఎలుకలపై ప్రయోగాలు చేయడం ద్వారా తాము వ్యాయామం చేసిననప్పుడు పీఎంఓసీ, ఏజీఆర్పీ అనే రెండు న్యూరాన్లు ఎక్కువ విడుదలవుతున్నట్లు ఇవి రెండూ కలిసి మెలనోకార్టిన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తున్నట్లు స్పష్టమైందని కెవిన్ చెప్పారు. ఈ మెలనోకార్టిన్స్ మనం ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తూంటుందని చెప్పారు. అరవై నిమిషాలపాటు ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తే పీఎంఓసీ న్యూరాన్ కారణంగా ఆకలి మందగించినట్లు తాము గుర్తించామని, అదేసమయంలో రక్తంలో చక్కెర మోతాదులు కూడా తగ్గాయని కెవిన్ వివరించారు. దీన్ని బట్టి నాలుగు రోజులకు ఒకసారైన ఓ మోస్తరు తీవ్రతతో వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని తెలుస్తున్నట్లు చెప్పారు. -
ఏ టైపు వ్యాయామం గుండెకు మంచిది!
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని అందరికీ తెలుసు. అయితే ఏ రకమైన వ్యాయామంతో ఏ లబ్ధి చేకూరుతుందన్న విషయంలో మాత్రం స్పష్టత తక్కువే. వాకింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలతో పోలిస్తే.. శక్తి కోసం చేసే వ్యాయామాలు (బరువులెత్తడం వంటివి) గుండెకు ఎక్కువ మేలు చేస్తాయని అంటున్నారు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ శాస్త్రవేత్తలు. ఇటీవల పెరూలో జరిగిన ఒక సదస్సులో వీరు తమ అధ్యయనం తాలూకూ వివరాలను ప్రకటించారు. అన్ని రకాలా వ్యాయామాలూ గుండెకు మేలు చేసేవే అయినప్పటికీ బరువులెత్తడం వంటి స్థిరంగా ఉంటూ చేసేవాటి వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తగ్గడమే కాకుండా చికిత్సగా కూడా ఉపయోగపడుతుందని వీరు అంటున్నారు. సుమారు నాలుగు వేల మంది అమెరికన్లపై ఏడాదిపాటు జరిపిన అధ్యయనం ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చామని రెండు రకాల వ్యాయామం చేసే వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 70 శాతం తక్కువని కూర్చుని చేసే ఎక్సర్సైజుల వల్ల ఫలితం బాగా ఉన్నట్లు తెలిసిందని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త మియా పి.స్మిత్ తెలిపారు -
వేడినీటి స్నానంతోనూ వ్యాయామ లాభాలు...
రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించుకునేందుకు మధుమేహులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటారు. ఈ జాబితాలోకి వేడినీటి స్నానం కూడా చేర్చుకుంటే మేలని అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు.. దీనివల్ల శరీరంలో ఏర్పడే మంట/వాపు తీవ్రత కూడా తగ్గుతుందని అమెరికన్ ఫిజియలాజికల్ సొసైటీ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా తేల్చారు. సాధారణంగా వ్యాయామం చేసినప్పుడు శరీరంలో మంట/వాపుకు సంబంధించిన కొన్ని రసాయనాలు ఎక్కువవుతాయి. అయితే తాజా పరిశోధనల ప్రకారం శరీర ఉష్ణోగ్రత పెరిగితే ఈ మంట/వాపు తగ్గుతాయి. ఈ నేపథ్యంలో వ్యాయామానికి ప్రత్యామ్నాయాలు ఏమిటో తెలుసుకునేందుకు అమెరికన్ ఫిజియాలజీ సొసైటీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొంతమంది ఊబకాయులు, వ్యాయామం చేయని వ్యక్తులను ఎన్నుకుని ప్రయోగాలు చేశారు. వీరిని రెండు గుంపులుగా విడగొట్టారు. ఒక వర్గాన్ని వేడిగా ఉండే గదిలో.. ఇంకో వర్గం వారిని వేడినీటిలో కొద్దిసేపు ఉండేలా చేశారు. మూడు రోజుల గ్యాప్‌తో గుంపులు తాము చేసే పనిని మార్చుకున్నాయి కూడా. దశలవారీగా సేకరించిన రక్తనమూనాలను పరిశీలించినప్పుడు మంట/వాపులకు సంబంధించిన ఐఎల్–6 రసాయనం తగ్గినట్లు తెలిసింది. అంతేకాకుండా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మోతాదులు కూడా నియంత్రణలోకి వచ్చినట్లు స్పష్టమైంది. -
ఎక్సర్టైన్మెంట్
ఫేస్బుక్, సోషల్ మీడియా, టీవీ, సినిమా.... మారోగోలి.ఎంటర్టైన్మెంట్ కావాలా?నలుగురితో కలిసి వ్యాయామం చేయండి. ఎక్సర్టైన్మెంట్లో ఉండే మజా టేస్ట్ చేయండి. ఒంటికి పని చెప్పాల్సిన యువత ఇప్పుడు కంటికి పని చెబుతోంది. ఏ స్మార్ట్ఫోన్లోనో ముఖం దాచుకొని కాలం గడిపేస్తోంది. సోషల్ మీడియాలో ముఖం కూరేసి ముచ్చట్లకు పరిమితమైపోతోంది. దీని వల్ల ఊబకాయాలు, ఊకదంపులకు పాల్పడుతోంది. ‘కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు’ అన్నాడు కవి. ఈ పరిస్థితి చూస్తే ‘కొంతమంది కుర్రవాళ్లు వ్యాయామానికి అంధులు’ అనవలసి వస్తోంది. ఈ పరిస్థితిని తప్పించలేమా? తప్పించ వచ్చు. ఫేస్బుక్, సోషల్ మీడియాలలో కనిపించే వినోదం నలుగురితో కలిసి చేసే వ్యాయామంలో వెతుక్కుంటే సరదాకు సరదా ఆరోగ్యానికి ఆరోగ్యం. దానికి చేయాల్సిందల్లా కొద్దిగా శ్రమ. అంతే. యువత ఎక్సర్సైజ్లకు పూనుకుంటే అది యువతను ఎన్నో చెడు వ్యసనాల నుంచి కాపాడుతుంది. పదిమందితో కలిసి సోషలైజ్ అయ్యేలా చేస్తుంది. అసలు ప్రయోజనం బరువు తగ్గడాన్నీ చేకూరుస్తుంది. గతవారం కొన్ని సాధారణ వ్యాయామాలు ఎలా చేయాలో చూశాం. ఇప్పుడు కాస్తంత ముందుకు వెళ్దాం. ఇవి వ్యాయామాల్లో ఒకింత కష్టమైనవి కావడంతో పాటు వీటిని తర్వాతి అంచె (నెక్స్ట్ లెవెల్)గా చెప్పుకోవచ్చు. ‘హిట్’ కొట్టడం ఎలా? సాధారణ వ్యాయామాల తర్వాత కొందరికి అంతకంటే ఎక్కువ స్థాయికి వెళ్లాలని ఆసక్తి ఉంటుంది. అది వారు వ్యాయామాల్లో ‘హిట్’ కొట్టడానికి తోడ్పడుతుంది. ఇంతకీ ఈ హిట్ ఏమిటి? హిట్ కొట్టడం ఎలా? ‘హై ఇంటెన్సివిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్’ (హెచ్ఐఐటీ)కి సంక్షిప్తరూపమే ఈ హిట్. దీనిలో మన సాధారణ వ్యాయామాలనే చాలా తక్కువ వ్యవధిలో పూర్తయ్యేలా లక్ష్యాలు నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు మీరు బ్రిస్క్ వాకింగ్ చేస్తూ మధ్యన చాలా వేగంగా జాగింగ్ చేస్తూ ఉండవచ్చు. ఇలాంటి వ్యాయామాల్లో ‘టబాటా’ అనే వ్యాయామరీతి చాలా ఫేమస్. ప్లయోమెట్రిక్స్ చాలా తక్కువ కాలంలో చాలా వేగంగా కండరాలు పెంచుకోడానికి ఉద్దేశించిందే ‘ప్లయోమెట్రిక్’ వ్యాయామం. ఇందులో పరుగెత్తే సమయంలోనే చాలా ఎత్తుకు ఎగిరి వేగంగా గుంజీళ్లు తీయడానికి అనువుగా కాళ్లు వంచడం, వేగంగా 18 అంగుళలా పెట్టేలోకి గెంతడం మళ్లీ బయటకు రావడం... ఇలాంటి వ్యాయామాలు చేస్తుంటారు. ప్లయోమెట్రిక్ వ్యాయామాల్లో గాయపడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీటిని తప్పకుండా శిక్షకుల పర్యవేక్షణలో మాత్రమే చేయడం మంచిది. కొత్తగా వ్యాయామాలు మొదలుపెట్టినవారికి ఇది అంత ఉపయుక్తం కాదు. ఇంట్లో చేయడానికి వీలుకాదు. ఆరుబయట ట్రైనర్స్ పర్యవేక్షణలోనే చేయాలి. క్రాస్‌ఫిట్ వ్యాయామాలు ఇందులో ఫ్లెక్సిబుల్ వ్యాయామాలతో మొదలుపెట్టి కాసేపు ఏరోబిక్ వ్యాయామాలు, మరికాసేపు మన బరువునే ఉపయోగించి చేసే క్యాలిస్థెనిక్స్, మరికాసేపు ఉపకరణాలతో బరువును ఎత్తుతూ చేసే వ్యాయామాలు కలగలిపి చేస్తుంటారు. ఇందుకోసం డంబెల్స్, పుల్బార్స్, జిమ్నాస్టిక్ రింగ్స్, జంప్రోప్స్, కెటిల్బాల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్స్, తాళ్లు లాగుతూ చేసే రోయింగ్ మెషిన్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి బిగినర్స్‌కు అంత మేలు చేసేవి కాదు. ఇంట్లోనూ చేయవచ్చు కానీ జిమ్‌లో అయితే ఉపకరణాల లభ్యత బాగా ఉంటుంది. జుంబా ఇదొక డాన్స్ లాంటి వ్యాయామ ప్రక్రియ. దీన్ని కొలంబియన్ డాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన అల్బర్టో ‘బీటో’ పెరేజ్ 1990లలో రూపొందించాడు. ఇందులో లయబద్ధంగా డాన్స్ చేయడంతో పాటు ఒంటి కదలికలు సంగీతానికి అనుగుణంగా హాయిగా కదిలిస్తూ చేస్తుంటారు. దీనిలో హిప్–హాప్, సోకా, సాల్సా, మెరెంగ్యూ, మాంబో వంటి నృత్యరీతులు కలగలిసి ఉంటాయి. గుంజీళ్లు తీసినట్లుగా మోకాళ్లు వంచడం జరుగుతుంటుంది. దీని శిక్షణ కోసం జుంబా ట్రైనర్స్ దగ్గరికి వెళ్లాలి కాబట్టి ఖర్చుతో కూడిన వ్యవహారమే. అయితే స్తోమత, ఆసక్తి ఉన్న బిగినర్స్ అనుసరించదగిన పద్ధతే. బరువు తగ్గడానికి బాగా పనికివచ్చే తేలికపాటి ఉత్సాహవంతమైన మార్గం ఇది. టబాటా ఒక్కొక్క వ్యాయామాన్ని చాలా వేగంగా 20 సెకన్లు చేస్తూ... ఆ 20 సెకన్లు పూర్తికాగానే మళ్లీ 10 సెకన్లు విశ్రాంతి తీసుకుంటూ... మళ్లీ మరో 20 సెకన్లు మరో ఏరోబిక్ను ఎంచుకుంటూ... ఇలా నాలుగు నిమిషాలు వ్యాయామాన్ని కొనసాగించడాన్ని ‘టబాటా’ ప్రక్రియ అంటారు. ఇది ఎంతో పాపులర్ ‘హై ఇంటెన్సివిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్’ (హిట్) ప్రక్రియ. ఇందులో కొవ్వు దహనం కావడం మాత్రమే కాదు... భస్మం అవుతుందనడంలో సందేహం లేదు. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే... ఇది కొవ్వును బర్న్ చేయడం కాదు... బ్లాస్ట్ చేస్తుంది. టబాటా ప్రయోజనాలు దీన్ని అప్పుడే వ్యాయామాలు మొదలుపెట్టిన బిగినర్స్ మొదలుకొని ఎవరైనా చేయవచ్చు. ఔట్‌డోర్స్‌లో, ఇంట్లో... ఎక్కడైనా చేయవచ్చు. క్రాస్ ట్రైనింగ్ వ్యాయామాలు క్రాస్ ట్రైనింగ్ అంటే మరేదే ప్రత్యేకమైనవి కాదు... మీకు ఆసక్తి చచ్చిపోకుండా ఉండేందుకు రకరకాల వ్యాయామ రీతులను మార్చి మార్చి చేస్తూ... వ్యాయామం నుంచి గరిష్ఠ ప్రయోజనం పొందేందుకు చేసేవి.ఉదాహరణకు మొదట రెండు నిమిషాలు దూకుతూ మోకాళ్లు పూర్తిగా ఒంచే స్వాట్ జంప్స్ చేసి వెంటనే మరో రెండు నిమిషాలు స్కిప్పింగ్, ఆ తర్వాత ఇంకో రెండు నిమిషాలు మోకాళ్లు నడుము పై వరకు వచ్చేలా హైనీస్, ఇంకో రెండు నిమిషాల రన్నింగ్, తర్వాత పుష్లప్స్ ఇలా... మార్చి మార్చి చేస్తూ పది నిమిషాలు కొనసాగించాలి. రెండు నిమిషాల విశ్రాంతి తర్వాత మళ్లీ ఇదే కొనసాగించాలి. ఇలా చేస్తే గంటలో 5 కాంబినేషన్ సెట్లు పూర్తవుతాయి. ఈ కాంబినేషన్ అన్నది మీరు ఆశించే ప్రయోజనాలకు అనుగుణంగా కూడా రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఏ ఎస్ఐ సెలెక్షన్లో భాగంగా ఎక్కువ దూరం పరుగెత్తేలా శిక్షణ తీసుకోదలిస్తే... వేగంగా పరుగెత్తే వ్యాయామాలను ఎక్కువగా అందులో భాగం చేసుకోవాలి. వీటినీ ఖర్చు లేకుండా ఔట్‌డోర్స్‌లో హాయిగా చేయవచ్చు. బిగినర్స్ కూడా నిరభ్యంతరంగా మొదలుపెట్టవచ్చు. బూట్ క్యాంప్ వ్యాయామాలు ఇవి మిలటరీ తరహా వ్యాయామాలు. అయితే వీటిలో ఒంటి బరువును ఉపయోగించడంతో పాటు ట్రాక్టర్ టైర్ల వంటివి కూడా వాడుతూ చేయవచ్చు. మన ఒంటి బరువుతో పుష్అప్స్, పుల్ అప్స్ చేస్తూ, టైర్లు ఎత్తి ఎత్తి దొర్లిస్తూ, తాళ్ల వంటివాటిని అలల్లా బలంగా కదిలిస్తూ క్రమం తప్పని ఇంటర్వెల్స్‌లో చేసే ఈ వ్యాయామాలను ‘ఇంటెన్సివ్ ఎక్స్‌ప్లోజివ్ ఎక్సర్సైజ్ రెజీమ్’గా చెప్పవచ్చు. వీటిని అప్పుడే వ్యాయామం ప్రారంభించిన బిగినర్స్తో పాటు క్రమం తప్పక కొంతకాలం సాధారణ వ్యాయామం చేసేవారు తమ వ్యాయామరీతులను మరో అంచెకు చేర్చడానికీ వీటిని చేయవచ్చు. ఇవి కాస్త స్థలం ఉంటే ఇంట్లోనూ చేయడం వీలవుతుంది గానీ... ట్రాక్టర్ టైర్ల వంటివి ఎత్తి పడేయడం కోసం ఔట్‌డోర్స్ బాగా ఉపయుక్తం. ఇక ఉపకరణాల విషయానికి వస్తే ప్రత్యేకంగా వ్యాయామ ఉపకరణాలు అవసరం లేదు. ఇంట్లో ఉండే నిరుపయోగమైన బరువైన వస్తువులనూ వాడుకోవచ్చు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ మీ సందేహాలను ఈ కింది ఈమెయిల్‌కి పంపి, నిపుణులచే సరైన సమాధానాలు తెలుసుకోవచ్చు. oobacolumn@gmail.com స్విస్ బాల్... కొత్త దనం కోరుకునే ఫిట్నెస్ ప్రియుల కోసం ఇటీవల ప్రాచుర్యంలో కి వచ్చింది స్విస్ బాల్. దీనిని జిమ్ బాల్ అని కూడా వ్యవహరిస్తున్నారు. ఈ తరహా ఎక్సర్సైజ్బాల్స్ మన దగ్గర జిమ్ లలో వాడుతున్నారు. ఇవి 55సెం.మీ, 65 సెం.మీ, 75 సెం.మీ ల పరిమాణంలో లభిస్తున్నాయి.రీబాక్ హర్బింగర్,నైక్ తదితర కంపెనీలు విభిన్న రకాల ప్రయోజనాలతో వీటిని రూపొందిస్తున్నాయి. కనీసం రూ..2,000 నుంచి రూ..5,000 దాకా అందుబాటులో ఉన్నాయి. మామూలుగా చేసే వ్యాయామాలే బాల్ ఆధారంగా చేయడం ద్వారా మరింతగా కేలరీలు ఖర్చు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీని వల్ల కోర్ మజిల్ పై ఒత్తిడి ఎక్కువ పడుతుంది. స్టెబిలిటీని, బాడీ బ్యాలెన్స్‌ని సరిచూసుకునేందుకు పనికొస్తుంది. ఈ వర్కవుట్లు పక్కటెముకల కింద ఉండే ఆబ్లిక్స్ (ఇంటర్నల్, ఎక్స్ టర్నల్) ను పటిష్టపరుస్తాయి. ప్రారంభంలో దీని మీద కదలకుండా విభిన్న భంగిమల్లో కాసేపు నిశ్చలంగా ఉన్నా కూడా మంచి వర్కవుట్ అవుతుంది. దీనిని ఉపయోగించి యాబ్స్, సిటప్స్, పుషప్స్... వగైరా విభిన్న రకాల వర్కవుట్స్ చేయవచ్చు. స్పిన్నింగ్...కేలరీ బర్నింగ్ మొత్తం ఎక్సర్సైజ్ చేసే హాల్‌ను ఓ డిస్కో«ధెక్లా తలపించే లా చేసే కొత్త వ్యాయామశైలి స్పిన్నింగ్. ఇది వ్యాయామప్రియుల్ని ఉర్రూతలూగిస్తుంది. సైక్లింగ్ తరహాలో ఉండే లేటెస్ట్ స్టైల్ ఎక్సర్సైజ్ ఓ గ్రూప్ యాక్టివిటీ. దీనిని హై కార్డియో వాస్క్యులర్ యాక్టివిటీగా ఫిట్నెస్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. అమెరికా, కెనడాల్లో ఇది అత్యుత్తమ ఇండోర్ ఎక్సర్సైజ్గా ప్రసిద్ధి చెందింది.స్పెషల్‌గా డిజైన్ చేసిన ఎక్సర్సైజ్ బైక్ దీని స్పెషాలిటీ. ఈ స్పిన్నింగ్ బైక్‌కి ఫిక్సడ్ గేర్ రేసింగ్ హ్యాండిల్‌బార్స్, పెడల్స్, ఎడ్జస్ట్బుల్ సీట్... వంటివి ఉంటాయి. వర్కవుట్లోని సామర్ధ్యం హె చ్చుతగ్గులను బైక్ కున్న రెసిస్టెన్స్నాబ్ ద్వారా నియంత్రించుకోవచ్చు. హార్ట్‌రేట్ మానిటర్స్ బైకర్స్‌ను గైడ్ చేస్తుంటాయి. వ్యక్తి ఎత్తు బరువుని బట్టి స్పిన్నింగ్ ఎడ్జెస్ట్‌మెంట్‌కు అవకాశం. ఉంటుంది. ప్రయోజనాలెన్నో... ఈ స్పిన్నింగ్‌తో తొడల ముందు, తుంటి భాగంలో ఉన్న ఫ్యాట్ కరుగుతుంది. మెటబాలిక్ రేట్‌ని పెంచుతుంది. ఊపిరితిత్తుల సామర్ధ్యం పెరుగుతుంది. లాక్టిక్ యాసిడ్ ప్రభావాన్ని అదుపుచేసి మజిల్స్ తొందరగా అలసిపోయే పరిస్ధితిని నివారిస్తుంది. నిమిషంలో 60–80 రౌండ్స్ నుంచి 80–120 వరకూ చేయగల్గితే అద్భుతంగా ఫ్యాట్లాస్కి ఉపకరిస్తుంది. వ్యక్తి బరువును బట్టి 45 నిమిషాల స్పిన్నింగ్ ద్వారా 600 కు పైనే కేలరీలను ఖర్చు చేయవచ్చు. కార్డియో కిక్ బాక్సింగ్... కరాటే పంచ్‌లు, బ్లాక్స్, కిక్స్ వంటివి సంప్రదాయ ఏరోబిక్స్‌తో మిళితం చేసిన అన్ని వయసుల వారికీ అనుగుణమైన ఫిట్నెస్ ప్రోగ్రామ్ కార్డియో కిక్ బాక్సింగ్. అత్యుత్తమ ఫ్యాట్‌ని కరిగించే సాధనంగా చెప్పవచ్చు. బరువు తగ్గడంతో పాటు ఫిట్నెస్ సాధించాలనుకునేవారు రొటీన్‌కి భిన్నంగా ఎంచుకోదగ్గది. ప్రారంభంలో సాధన చేసేవారు 1 గంటలో 400– 500 క్యాలరీలు, కొంత అలవాటైన తర్వాత 800–900 క్యాలరీలు ఖర్చు చేయవచ్చు. మరిన్ని లాభాలు దీని ద్వారా పూర్తి దేహానికి వ్యాయామం అందుతుంది. కంటికి, దేహానికి సమన్వయం పెంచుతుంది. కదలికల్లో వేగం పెంచుతుంది. కిక్స్, పంచెస్ ఇచ్చేపుడు లోయర్బాడీని బ్యాలెన్స్ చేసుకునే అవసరం ద్వారా కాళ్ళకు, నడుం కింది భాగానికి ఫిట్నెస్ లభిస్తుంది. పొట్ట భాగాన్ని సున్నితంగా బిగించి కిక్స్, పంచ్‌లు ఇవ్వడం ద్వారా అబ్డామినల్ మజిల్ బాగా పటిష్టమవుతుంది. అప్పర్కట్, జాబ్, ఎల్బోహుక్, స్నాచ్, రివర్స్కిక్, రౌండ్ కిక్ తదితర పంచ్‌లతో స్వీయరక్షణ కూడా సాధ్యపడుతుంది. మోకాలు, లోయర్బ్యాక్లపై తక్కువ భారాన్ని మోపే వ్యాయామం ఇది. ప్రారంభంలో మంచి కార్డియో కిక్ బాక్సింగ్ ట్రయినర్ని తప్పనిసరిగా ఎంచుకోవాలి. పరిణతి సాధించాక ఒక పంచ్బ్యాగ్ను ఏర్పాటు చేసుకుని స్వంతంగానే సాధన కొనసాగించవచ్చు. ఆక్వా వర్కవుట్స్... పూల్‌లో స్విమ్మింగ్‌తో సరిపెట్టేయకుండా నీళ్ళలోనే కాసేపు గడిపి బోలెడన్ని వర్కవుట్లు చేయాలని ఆశించే వారికి మంచి మార్గం ఆక్వాఏరోబిక్స్. కంఠం వరకూ నీళ్ళలో నిలబడి గాలిలోకి చేతులు జాపుతూ చేసే ఎరోబిక్స్, తక్కువ బరువుతో చేసే వెయిట్ ట్రయినింగ్, స్ట్రెచ్చింగ్... వంటివన్నీ ఇందులో భాగమే. వీటినన్నింటినీ కలిపి ఆక్వా ఏరోబిక్స్ గా వ్యవహరిస్తారు. లాభాలివే నీటిలో వ్యాయామాలతో గాయాలు కావడం జరగదు. నీటికి సాంద్రత ఎక్కువని తెల్సిందే. నీళ్ళలో కదలికలు కాస్త కఠినంగా అన్పించడానికి కారణమిదే. ఫలితంగా దేహంలోని కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. తద్వారా బాడీ టోనింగ్కూ ఉపకరిస్తుంది. నేలమీద చేసే ఏరోబిక్స్‌లో గంట వర్కవుట్కు 250–400 కేలరీలు ఖర్చయితే వాటర్‌లో చేసే ఈ ఏరోబిక్స్‌కు కనీసం 650–700 కేలరీలు ఖర్చవుతాయి.వీటిని చేయడానికి స్విమ్మింగ్ తెల్సి ఉండనక్కర్లేదు. అయితే స్విమ్‌సూట్, నీళ్ళలో ఉండగా స్దిరత్వాన్ని అందించేందుకు ఆక్వా షూస్, తల వెంట్రుకలు ముఖం పై పడి ఇబ్బంది పెట్టకుండా స్విమ్ క్యాప్స్ అదే విధంగా ఆక్వాబ్లాక్స్, ఫ్లోటేషన్ బెల్ట్స్,గ్లోవ్స్,కిక్బోర్ట్స్, ఆక్వాస్టెప్... వంటివి అవసరం. బయట చేసే నడవడం, రన్నింగ్, స్ట్రెచ్చింగ్ వర్కవుట్స్ నీళ్ళలో కూడా చేయవచ్చు. జంపింగ్ జాక్స్ తరహా వ్యాయామాలు దేహంలోని అన్ని మజిల్స్కూ పని కల్పిస్తాయి. స్కైయింగ్ మోషన్ బ్యాక్, ఫోర్త్, లంగ్స్ ఇన్ ఛెస్ట్ డీప్ వాటర్, కిక్ బాక్సింగ్ మూవ్స్... వంటివి కూడా వర్కవుట్‌లో భాగంగా మార్చుకోవచ్చు. ఈ వర్కవుట్ల కోసం ప్రత్యేకమైన పరికరాల్లో ఆక్వా డంబెల్స్ ఒకటి. ఈ డంబెల్స్‌తో చేతులు, బైసప్స్, ట్రైసప్స్, షోల్డర్స్‌కు నీళ్ళలో ఉండే వ్యాయామాలు చేయవచ్చు.వీటిలో దేన్ని ఎంచుకోవాలనుకున్నా... మొదట మీ డాక్టర్‌ను సంప్రదించి మీకు ఏది అనువైనదో నిర్ణయించుకున్న తర్వాత చేయాలి. మీ శరీర సామర్థ్యం, నిర్మాణం, మీకు ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు... వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మీ డాక్టర్ మీకు అనువైన వాటిని సూచిస్తారు. మీరు వాటిని తప్పక అనుసరించడం చాలా మంచిది. ఎమ్. వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్ హైదరాబాద్ -
ఇరవై నిమిషాలకోసారి చిన్న ఎక్సర్సైజ్...
గుండెజబ్బులతో బాధపడే వారు ఇరవై నిమిషాలకోసారి అటు ఇటు తిరగడంగానీ తేలికపాటి వ్యాయామం చేయడం గానీ మంచిదని, తద్వారా ఆయుష్షును పెంచుకునే అవకాశముందని అంటున్నారు శాస్త్రవేత్తలు. కెనడాలో జరుగుతున్న ఓ అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ ఐలర్ రమడీ ఒక పరిశోధన వ్యాసం సమర్పిస్తూ ఈ విషయాన్ని చెప్పారు. గుండెజబ్బుతో ఉన్న వారు రోజులో ఎక్కువభాగం ఏ వ్యాయామం చేయకుండా ఉంటున్నారని, ఇది వారి ఆయుష్షుపై దుష్ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. రోజుకు కనీసం 770 కిలో కేలరీల శక్తిని ఖర్చు చేసేంత వ్యాయామం చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చునని అన్నారు. అయితే రోజులో ఎంత కాలావధితో ఇలా చేయాలన్న అంశంపై తాము ఒక అధ్యయనం చేశామని.. 20 నిమిషాలకోసారి కనీసం ఏడు నిమిషాలపాటు తేలికపాటి వ్యాయామం చేయడం మేలని ఇందులో తేలిందని వివరించారు. వ్యాయామం చేయాలన్నంత మాత్రాన విపరీతమైన శారీరక శ్రమ అవసరం లేదని.. కూర్చుని నుంచోవడం మొదలుకొని మామూలు వేగంతో కొన్ని అడ -
కండ కలిగితే కొవ్వు ఉండదోయ్
బరువుకు కరువు ఏర్పడాలంటే ఒళ్లు వొంచక తప్పదు. తినే ఆహారం, చేసే శ్రమ... ఇవే మన శరీరాన్ని అదుపులోనూ ఆరోగ్యంగానూ ఉంచుతాయి. అంతేకాదు మన మెటబాలిజం (జీవక్రియలు) కూడా చురుగ్గా ఉండాలి. వయసు పెరిగే కొద్ది మెటబాలిజం మందకొడిగా మారుతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం వస్తుంది. వ్యాయామం ద్వారా జీవక్రియలను కూడా చురుగ్గా ఉంచి బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు. రెస్టింగ్ మెటబాలిజమ్ అంటే... జీవక్రియలు జరగాలంటే ఆహారంతో అందే శక్తి కావాలి. రెస్టింగ్ మెటబాలిజమ్ అంటే... మనం ఏ పనీ చేయకుండా విశ్రాంతిగా కూర్చున్నప్పుడు కూడా శరీరంలో జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. అందుకోసం ఒంట్లోని కొవ్వులు దహించుకుపోతుంటాయి. దాన్నే రెస్టింగ్ మెటబాలిజమ్ అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ విశ్రాంతిగా ఉన్నప్పుడు దహించుకుపోయే కొవ్వులు తగ్గుతుంటాయి. అందుకే ఓ వయసు తర్వాత బరువు పెరగడం మొదలవుతుంది. వ్యాయామంతో రెస్టింగ్ మెటబాలిజమ్‌లో చురుకుదనం పెరుగుతుంది. వయసుతో పాటు తగ్గాల్సిన రెస్టింగ్ మెటబాలిజమ్‌ను వ్యాయామం అలా స్థిరంగా ఉండేలా చూస్తుంది. ఫలితంగా కొవ్వుల దహనమూ కొనసాగుతుంది. ఫలితంగా ఒంట్లో కొవ్వు పేరుకోవడం, కొవ్వులు పెరగడం జరగదు. దాంతో బరువు పెరగకపోవడంతో పాటు ఆరోగ్యమూ సమకూరుతుంది.ఇలా వ్యాయామాలు బరువును తగ్గించడానికి, అదుపులో ఉంచడానికి దోహదపడతాయన్నమాట. ఇన్ని రకాల వ్యాయామాలు ఎందుకు? ఇష్టం కదా అంటూ ఆహారంలో వరుసగా మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు లేదా ఏ పిండిపదార్థాలు తీసుకుంటూ ఉంటే బరువు పెరగడం ఖాయం. ఆహారాన్ని ఎలాగైతే భిన్నంగా ఎంచుకుంటూ ఉంటే ప్రయోజనమో వ్యాయామాన్ని కూడా భిన్నంగా ఎంచుకుంటూ ఉంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకున్నట్టే వ్యాయామాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. కలిగించే ప్రధాన ప్రయోజనాల ఆధారంగా వ్యాయామాలను రకరకాలుగా వర్గీకరించవచ్చు. ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు, ఏరోబిక్ వ్యాయామాలు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు, కోర్ ఎక్సర్సైజెస్... ఇవన్నీ ఉన్నాయి. వీటిని మార్చి మార్చి చేస్తూ ఉంటే వ్యాయామాల్లోనూ సమతౌల్యత సాధించవచ్చు. ఎప్పటికీ బరువు పెరగకుండా ఒకేలా ఆరోగ్యంగా, ఫిట్‌గా, చురుగ్గా, ఆకర్షణీయంగా ఉండవచ్చు. ఇన్ని రీతులూ... ఎలా చేయాలి? వ్యాయామాలను గరిష్ట ప్రయోజనం కోసం మార్చి మార్చి చేయడాన్ని ‘ట్రైనింగ్ రెజీమ్’గా చెప్పవచ్చు. మొదట ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలను కనీసం 10, 15 నిమిషాల పాటు చేయాలి. ఆ తర్వాత డైనమిక్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, స్టాటిక్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేయాలి. స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్లోనే మధ్య మధ్య ఏరోబిక్ ప్రక్రియల్లో ముఖ్యమైన జాగింగ్‌ను కొనసాగించాలి. ఇలా చేయడం ద్వారా మీ వ్యాయామం సెషన్లో మీ గుండె వేగాన్ని పెంచడం సాధ్యమవుతుంది. సాధారణంగా 72 సార్లు స్పందించే గుండె వేగాన్ని కనీసం 150 సార్లకు పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. గుండె సామర్థ్యం, ఆరోగ్యం పెరుగుతాయి. (అయితే ఇందుకోసం క్రమంగా వ్యాయామ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోవాలి. గుండెకు కూడా ఇది మంచిది). కాస్త స్ట్రెచింగ్, ఆ తర్వాత ఏరోబిక్ చేసి, స్ట్రెంగ్త్ వ్యాయామాలు చేస్తూనే మధ్య మధ్య ఏరోబిక్ వ్యాయామంగా జాగింగ్ లేదా ఇతర వ్యాయామాలను కొద్ది నిమిషాలు కొనసాగిస్తూ... దాన్నే విశ్రాంతిగా పరిగణిస్తూ మీ మొత్తం అవిశ్రాంత వ్యాయామాన్ని కనీసం 30 నిమిషాల నుంచి 60 నిమిషాలు చేయాలి. తొలుత 30 నిమిషాలు చేస్తూ ఆ సమయాన్ని క్రమంగా 60 నిమిషాలకు పెంచవచ్చు. ఇలా అన్ని రకాల వ్యాయామాలను పూర్తిచేసేలా ఒంటికి వ్యాయామాన్ని అందించడాన్ని సర్క్యూట్ ట్రైనింగ్ అంటారు. మీరు జిమ్‌లోనే చేస్తున్నప్పుడు స్థలాభావం వంటివి ఉంటే స్ట్రెంగ్త్ వ్యాయామ రీతుల మధ్యన ప్రతిసారీ ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు ఉన్నచోటే పరుగు పెట్టవచ్చు. సర్క్యూట్ ట్రైనింగ్‌కు డబ్బు ఖర్చవుతుందా? ఖర్చు : జిమ్‌లో చేరడం లేదా ఉపకరణాలు కొనుక్కోవడానికి డబ్బు ఖర్చు అవుతుంది. అంతగా ఖర్చు చేయలేమని అనుకున్నప్పుడు మీ సొంత శరీర బరువును ఉపయోగించి చేసే పుష్–అప్స్, సిటప్స్, పుల్–అప్స్తోనూ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్లు చేయవచ్చు. పరుగెత్తడానికి ఎలాంటి ఖర్చూ అవసరం లేదు కదా. సర్క్యుట్ ట్రైనింగ్ ఎలా మీకు అనువైన, సంతృప్తికరమైన రీతిలో ఉండే సర్క్యూట్‌ను మీరే రూపొందించుకోవచ్చు. కాస్త అనుభవం తర్వాత దేని తర్వాత ఏది చేస్తే మీకు సంతృప్తి కలుగుతుందో మీరే నిర్ణయించుకొని దాన్ని కొనసాగించుకోవచ్చు. ఔట్డోర్స్లోమీకు జిమ్‌కు వెళ్లే అవకాశం లేదా స్తోమత లేకపోతే ఏదైనా స్కూల్ గ్రౌండ్ లేదా కాలేజీ గ్రౌండ్ లేదా స్థలం ఉంటే మీ ఇంటి పెరట్లోనూ మీరు వ్యాయామాలు చేయవచ్చు.వ్యాయామం చేయాలనే మనసుండాలేగానీ మార్గం ఉంటుంది. బరువూ తగ్గుతుంది. మెడికల్ ఖర్చులకు, మందులకు అయ్యే ఖర్చూ తగ్గుతుంది. కావాల్సిందల్లా కొంచెం సమయాన్ని మాత్రం ఖర్చు చేయడం. (మరికొన్ని వ్యాయామాలు వచ్చే వారం) ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు వీటినే స్ట్రెచింగ్ వ్యాయామాలు అని కూడా అంటారు. యోగాలోని ప్రాథమిక ఆసనాలన్నీ శరీరాన్ని స్ట్రెచ్ చేసే వ్యాయామంగా ఉపయోగపడతాయి. కాళ్లు చేతులు వేగంగా కదలడానికి, చేతులు చురుగ్గా ఉండటానికి స్ట్రెచింగ్ వ్యాయామాలు దోహదపడతాయి. కీళ్లను ఆరోగ్యంగా ఉంచి అవి వేగంగా ప్రతిస్పందించేలా చేస్తాయి. శరీరాన్ని స్ట్రెచ్ చేయకుండా అంటే సాగదీయకుండా అదేపనిగా బరువులెత్తే వ్యాయామాలు చేస్తే శరీరాకృతి కొంత ఆకర్షణీయం అవుతుందేమో కాని చురుకుదనం కలగకపోవచ్చు. తగినంత చురుకుదనంతో ఏ పనినైనా తేలిగ్గా, సులువుగా చేయగలిగితేనే కదా మనం చేసే ఆ పనికి విలువ. అందుకే ఫ్లెక్సిబిలిటీ పెంచే ఈ వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. అందుకే ప్రధాన వ్యాయామాలకు ముందు కనీసం 10 నిమిషాల పాటు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం తప్పనిసరి. వ్యాయామం సెషన్ పూర్తయ్యాక కూడా ఇవే వ్యాయామాలు కామ్డౌట్ వ్యాయామాలుగా చేయడం మరింత మంచిది. యోగా ప్రక్రియలు ఈ స్ట్రెచింగ్ వ్యాయామాలుగా ఎంతగానో ఉపకరిస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే స్ట్రెచింగ్ వ్యాయామాలు ఒంట్లో ఒత్తిడినీ, ఉద్విగ్నతనూ (స్ట్రెస్ అండ్ టెన్షన్‌ను) దూరం చేస్తాయి. అయితే కొంతమంది వీటిపై అంతగా దృష్టి పెట్టరు. పైగా చిన్నచూపు చూస్తారు. బ్యాలెన్స్ ట్రైనింగ్ వ్యాయామాలు సరిగ్గా సాగాలంటే శరీరం బ్యాలెన్స్‌లో ఉండాలి. కనుక శరీరాన్ని బ్యాలెన్స్ చేసే వ్యాయామాలు కూడా ముఖ్యం. ఒక కాలు ముడిచి ఒకే కాలిపై నిలబడటం, ఒంటి కాలిపై చేసే యోగాభ్యాసాలు, ఆసనాలు ఇందుకు ఉపకరిస్తాయి. ఇక ఒంటిని నియమబద్ధంగా ఒంచుతూ చేసే ‘టాయ్ చీ’ కూడా శరీరం బ్యాలెన్స్ తప్పకుండా చేస్తుంది. ఏరోబిక్ ఫిట్నెస్ వీటినే కార్డియో వ్యాయామాలు అనీ, ఎండ్యూరెన్స్ వ్యాయామాలు అని అంటారు. వీటిలో మనం శ్వాస తీసుకోవడం ఎక్కువగా జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో నిండే గాలి పెరుగుతుంది. శరీరం తీసుకునే ఆక్సిజన్ పెరుగుతుంది. గుండె వేగం పెరిగి కణకణానికీ ఆక్సిజన్ అంది మనిషి స్టామినా పెరుగుతుంది. కాబట్టి చాలాసేపు పనిచేసినా అలసట రాని తత్వం అలవడుతుంది. సామర్థ్యం ఉంటేనే కదా ఏదైనా సాధించగలిగేది. సాధారణ వ్యాయామంతో మీరు 50 కిలోల బరువును ఎత్తగలరు. కానీ ఆ బరువును అలా ఎత్తి, ఇలా వదిలేస్తే లాభం ఏముంది? దానిని అరగంట పాటైనా మోసుకుంటూ రాగల సామర్థ్యాలు ఈ వ్యాయామాలతోనే సమకూరతాయి. కాళ్లూ చేతులు వేగంగా కదిలిస్తూ డ్యాన్స్లాగా, డ్రిల్ తరహాలో చేయదగిన ఉత్సాహవంతమైన వ్యాయామాలు ఇవి. వేగంగా నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, వాటర్ ఏరోబిక్స్ అన్నీ ఏరోబిక్ ప్రక్రియలే. కోర్ ఎక్సర్సైజెస్ నడుము ప్రాంతంలో అంటే పొట్ట, వీపు కింది భాగం (లోయర్బ్యాక్)లో ఉండే కండరాలకు వ్యాయామాన్ని ఇచ్చే రీతులను కోర్ ఎక్సర్సైజెస్ అంటారు. శరీరం పై భాగానికీ, కింది భాగానికీ మధ్య అనుసంధానంగా ఉండే భాగాలలోని ఉండే కండరాలను బలంగా చేసే వ్యాయామాలు ఇవి. ఈ కోర్ వ్యాయామాలను బ్రిడ్జెస్, ప్లాంక్స్, ఫిట్నెస్బాల్ వంటి ఉపకరణాలతో మరింత తేలిగ్గా చేయవచ్చు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ రెజీమ్‌లో అందరికీ ఆసక్తి ఉండి, అందరూ చేయాలనుకునే ప్రధాన వ్యాయామ రీతులు ఇవే అని చెప్పవచ్చు. వీటి వల్ల మన ప్రధాన కండరాలు అయిన వీపు భాగంలోని ట్రెపీజ్, లాటిసిమస్ డార్సీ, ఛాతీ భాగంలో బలానికి సూచనగా కనిపించే పెక్టోరాలిస్ మేజర్, చేతుల కండలను చూపించే బైసెప్స్, సిక్స్‌ప్యాక్‌లో కనిపించే రెక్టస్ అబ్డామినిస్, తొడల్లో బలంగా కనిపించే క్వాడ్రసెప్స్, హ్యామ్‌స్ట్రింగ్స్, కాఫ్ మజిల్స్... ఇవన్నీ శక్తిమంతం అయ్యి మంచి షేప్‌లో కనిపిస్తాయి. దాంతో మనిషి ఆకర్షణీయంగా ఆరోగ్యంగా అనిపిస్తాడు. బరువు తగ్గించడంతో పాటు మనిషిని అందమైన సౌష్టవానికి తెచ్చే వ్యాయామలు ఇవి. ఈ వ్యాయామాల్లో బరువులు, ఉపకరణాలు ఉపయోగిస్తారు. నియమబద్ధంగా, నిర్ణీతంగా చేస్తుంటారు. మరికొందరు జిమ్‌లో చేరి చేస్తారు. ఇంకొందరు పిచ్చిగా ఆకర్షితమై వీటికే కట్టుబడతారు. ఒంటి బరువునే ఆధారంగా చేసుకొని పుషప్స్, పులప్స్, అబ్డామినల్ క్రంచెస్, లెగ్ స్క్వాట్స్ వంటి వ్యాయామ రీతులతోనూ వీటిని చేయవచ్చు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ మీ సందేహాలను ఈ కింది ఈమెయిల్‌కి పంపి, నిపుణులచే సరైన సమాధానాలు తెలుసుకోవచ్చు.oobacolumn@gmail.com -
వ్యాయామంతో వ్యాధులకు చెక్
లండన్ : క్యాన్సర్, మధుమేహం, డిమెన్షియా, కుంగుబాటు వంటి జబ్బుల బారిన పడిన వారిని వ్యాయామం చేసేలా వైద్యులు, హెల్త్‌కేర్ సిబ్బంది ప్రోత్సహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దైనందిన జీవితంలో మరింత చురుకుగా ఉండటం ద్వారా ఆయా వ్యాధుల తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు. వైద్యులు తమ రోగుల శారీరక చురుకుదనం గురించి ఆరా తీయాలని, వ్యాయామం ద్వారా చేకూరే శారీరక, మానసిక ప్రయోజనాలను వివరించాలని సూచించారు. డాక్టర్ లేదా నర్సు చెబితే నలుగురు రోగుల్లో ఒక్క రోగైనా శారీరకంగా చురుకుగా ఉండేందుకు చొరవ చూపుతారని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వైద్యుల్లో మూడొంతుల మంది రోగుల శారీరక చురుకుదనం గురించి మాట్లాడటం లేదని తాజా అథ్యయనం వెల్లడించింది. వ్యాయామం ద్వారా స్ధూలకాయం ముప్పును తగ్గించడం ద్వారా జీవనశైలి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని ప్రజారోగ్య నిపుణులు చెబుతున్నారు. చురుకైన జీవనశైలిని పాటించడం ద్వారా టైప్ 2 మధుమేహ ముప్పును తగ్గించుకోవండం ద్వారా అధిక రక్తపోటు ముప్పు నుంచి బయటపడవచ్చని నిపుణులు పేర్కొన్నారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా గుండె జబ్బుల ముప్పును 40 శాతం మేర తగ్గించవచ్చని, స్ర్టోక్, కుంగుబాటు ముప్పును కూడా 30 శాతం మేర తగ్గించవచ్చని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్, స్పోర్ట్ ఇంగ్లండ్ స్పష్టం చేశాయి. -
ఆర్థరైటిస్.. నడవలేం.. కదల్లేం
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంటాయి. అందులో ఆర్థరైటిస్ కూడా ఒకటి. అటు దేశంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గత పదేళ్లలో ఆర్థరైటిస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 50–60 ఏళ్లలో కనిపించే ఆర్థరైటిస్‌ను ఇప్పుడు 35–40 ఏళ్లలోనే చూస్తున్నాం. దీన్ని ముందుగా గుర్తించి నియంత్రణ చర్యలు తీసుకోకపోతే మున్ముందు నడవలేని, కదల్లేని పరిస్థితులు రావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఒక్కోసారి ఎముకలు గుళ్లబారి విరిగిపోయే ప్రమాదమూ ఉంది. అక్టోబర్ 12న ప్రపంచ ఆర్థరైటిస్ దినం సందర్భంగా ఈ అంశంపై ‘సాక్షి’ కథనం. – సాక్షి, హైదరాబాద్ ఆర్థరైటిస్ అంటే..? కీళ్ల అరుగుదలనే ఆర్థరైటిస్ అంటాం. కీళ్ల నొప్పులు అధికంగా తుంటి, మోకాలులో వస్తుంటాయి. చేతి, మోచేతిలోనూ కీళ్ల నొప్పులు రావచ్చు. శరీరంలో మోకాలే పెద్ద కీలు. శరీర బరువును సగానికిపైగా మోకాలే మోస్తుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లలో ఉండే కీలకమైన మృదులాస్థి అనే పదార్థం కరిగిపోతుంది. అది నిరంతరం కరుగుతూ మళ్లీ ఏర్పడుతుండటం దాని ప్రత్యేకత. అయితే 40–45 ఏళ్ల మధ్య మృదులాస్థి పునరుత్పత్తి తగ్గడం మొదలవుతుంది. దీంతో కీళ్లవాపు, నొప్పి, నడవలేకపోవడం వంటివి వస్తాయి. ఈ విధంగా జరగడాన్నే కీళ్ల నొప్పి లేదా ఆర్థరైటిస్ అంటారు. జీవనశైలిలో మార్పుల కారణంగా.. కీళ్లనొప్పికి జన్యుపరమైన కారణాలూ ఉంటాయి. ప్రధానంగా వయసు, జన్యుపరమైన కారణాలతోనే ఆర్థరైటిస్ వస్తుంది. గత దశాబ్ద కాలం నుంచి ఆర్థరైటిస్ కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెరిగినందున డాక్టర్ల వద్దకు వస్తున్నారు. కాబట్టి కేసుల సంఖ్య కూడా అధికంగా కనిపిస్తుంది. గత పదేళ్లలో సాపేక్షికంగా ఆర్థరైటిస్ కేసులు పెరిగాయి. దానికి ప్రధానంగా జీవనశైలిలో మార్పులే కారణం. వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం, ఫలితంగా ఊబకాయం, పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి వంటి కారణాలతో ఆర్థరైటిస్ రావడాన్ని గమనిస్తున్నాం. వ్యాయామం చేయకపోవడం వల్ల మృదులాస్థి పునరుత్పత్తి పూర్తిస్థాయిలో ఏర్పడదు. సరైన ఆహారం, సరైన కదలిక లేకపోవడం వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది. గతంలో 50–60 ఏళ్లకు మాత్రమే మోకాలి నొప్పులు వచ్చేవి. గత 10 ఏళ్లలో 35–40 ఏళ్ల మధ్యలోనూ మోకాలి నొప్పులు చూస్తున్నాం. కింద కూర్చోవడం వల్ల, సాధారణ మరుగుదొడ్లు వాడినా మోకాలి నొప్పులు వస్తాయి. వెస్ట్రన్ కమౌడ్ను వాడకపోవడం వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంది. ముందు నుంచీ కింద కూర్చోవడం, టీనేజీలోనే యోగా వంటి సాధనలు చేస్తే ఇక సరేసరి. లేకుంటే 35 దాటాక కింద కూర్చునే పద్ధతిని కొత్తగా మొదలుపెట్టడం, అదే వయసులో యోగా చేయడంలో భాగం గా కింద కూర్చోవడం వంటివి చేసినా ఈ సమస్య వస్తుంది. మునులు కింద కూర్చొనే ధ్యానం చేసేవారు. వారికి ఎటువంటి సమస్యలు రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచీ వాళ్లు అలా చేయడం వల్ల శరీరం మొత్తం అందుకు అలవాటు పడుతుంది. ఇతర కీళ్ల నొప్పులు.. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎంకైలోడింగ్ ఆర్థరైటిస్ అనే 2 రకాలున్నాయి. సాధారణ ఆర్థరైటిస్‌కు ఈ రెండూ భిన్నం. ఈ రెండింటిలో ఉపశాఖలుగా మరో 15 ఆర్థరైటిస్లు ఉన్నాయి. ఇవి రావడానికి జన్యుపరమైన కారణాలే అధికంగా ఉంటాయి. తల్లిదండ్రులకు లేకపోయినా వారి వంశంలో ఎవరికి ఉన్నా వచ్చే అవకాశం ఎక్కువ. వీరికి మోకాలు, భుజం, తుంటి తదితర చోట్ల ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. వీటిని గుర్తించడానికి రక్త పరీక్షలు చేయాలి. బీపీ, షుగర్ ఎలాగో ఈ 2 రకాల ఆర్థరైటిస్లు వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందే. ఒకసారి తగులుకుంటే వదిలిపెట్టవు. పూర్తిగా నిర్మూలించలేం. స్టెరాయిడ్స్ తదితర మందులు వాడటం వల్ల వీటిని నియంత్రించవచ్చు. ఇక సోరియాసిస్ కూడా ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది. రీటస్ డిసీజ్ అంటే కంటి చూపు మందగించడం ద్వారా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశముంది. ఇలాంటి జబ్బులు వస్తే 20–30 ఏళ్లకే ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి వయసుతో సంబంధంలేదు. ఇటీవల 16 ఏళ్ల టీనేజీ బాలుడికి ఆపరేషన్ చేశారు. 30 ఏళ్లు.. 3 కిలోమీటర్లు.. 30 ఏళ్ల మనిషి రోజుకు కనీసం 3 కిలోమీటర్లు నడవాలి.. 8 గంటలు పనిచేయాలి. అప్పుడు మృదులాస్థి పునరుత్పత్తి జరిగి కీళ్ల నొప్పులు రావు. వ్యాయామం వారానికి కనీసం 3 రోజులు చేయాలి. పొగ తాగకూడదు. బరువు పెరగకుండా చూసుకోవాలి. శరీరానికి తగ్గట్లు బరువుండాలి. ఆర్థరైటిస్‌ను ముందుగా గుర్తించకపోతే పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. ఫలితంగా గుండెకు చేటు తెస్తుంది. అలాగే మెటబాలిజం తగ్గుతుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థరైటిస్ ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. ఆర్థరైటిస్ 4 దశల్లో ఉంటుంది. పరీక్షలు చేయించుకుని అది ఏ దశలో ఉందో గుర్తించాలి. నాలుగో దశలోనే ఆపరేషన్ ఆర్థరైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే కాళ్లు వంగిపోతాయి. బలహీనమై పోతాయి. ఎముకలు విరిగిపోతాయి. ఇలాంటి నాలుగో దశలోనే సాధారణంగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. వయసు ద్వారా వచ్చే కీళ్ల నొప్పులు సాధారణంగా 50–60 ఏళ్లలో కనిపిస్తుంటాయి. రైతులు, భవన నిర్మాణ కార్మికులు, బాగా కష్టపడి పనిచేసే వాళ్లు నొప్పులు ఓర్చుకోగలరు. కాబట్టి వారికి కీళ్ల నొప్పుల తీవ్రత 60–70 ఏళ్ల తర్వాతే అర్థమవుతుంది. ఆడవారు ఎక్కువగా కింద కూర్చోవడం, పూజలు చేయడం వల్ల వారికి ఎక్కువగా కీళ్ల నొప్పులు వస్తాయి. – డాక్టర్ దశరథరామారెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద ఆస్పత్రి ఆర్థరైటిస్ పెరగకుండా చూసుకోవాలి కీళ్ల అరుగుదలను తగ్గించుకోవాలి. 20 శాతం అరుగుదల ఉంటే, దాన్ని పెరగకుండా చూసుకోవాలి. మృదులాస్థి పెరగడానికి మందులు ఇస్తారు. అవి వాడాలి. సైక్లింగ్, ఈత వంటివి చేయాలి. దీని వల్ల కీళ్లపై ప్రభావం చూపదు. నిర్ణీత మోతాదులో డాక్టర్ల సూచన మేరకు నడవవచ్చు. ఏదైనా సమతుల్యమైన శారీరక శ్రమ, వ్యాయామం అవసరం. ఆర్థరైటిస్ ప్రాథమిక దశలో ఉంటే మందులు మాత్రమే వాడాలి. అది ముదిరిపోయి నాలుగో దశకు వచ్చాకే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. – డాక్టర్ మురళీధర్, ఆర్థోపెడిక్ సర్జన్, యశోద ఆస్పత్రి -
కదలండి.. తగ్గుదాం
కదలకపోవడం జడత్వం.కదలడం చైతన్యం.ఊబకాయం ప్రమాదకరమైన శారీరక అవస్థ.అదుపు తప్పిన బరువు అన్ని రుగ్మతలకు హేతువు.కాని ప్రయత్నిస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చు. ఇంట్లోనూ బయటా డబ్బు ఖర్చు కాని పద్ధతిలో వ్యాయామం చేసి బరువు తగ్గవచ్చు.ఉత్సాహకరమైన శరీరమే ఉజ్వలమై భవిష్యత్తు.ఊబగా ఉన్న ఈ గతాన్ని వదిలేయండి.వెలుతురు నిండిన భవిష్యత్తు వైపు అడుగు వేయండి.కదలండి. బరువు తగ్గండి. ప్రమాదకరమైన వ్యాధులనగానే గుండెపోటు, మధుమేహం, క్యాన్సర్ అనుకుంటాం. కాని ఊబకాయం కూడా ప్రమాదకరమైన వ్యాధిలాంటిదే. ఈ వ్యాధికి విరుగుడు బరువు తగ్గడం. అందుకు సరైన మందు వ్యాయామం. దీని కోసం జిమ్‌లు, వ్యాయామశాలల్లో చేరనక్కర్లేదు. ఇంట్లో ఉంటూ బయట నడుస్తూ కూడా వ్యాయామాన్ని పూర్తి చేయవచ్చు. ఫలితంగా బరువు తగ్గవచ్చు. మేలు చేసే వ్యాయామం ► సమతుల ఆహారం తింటూ, సరైన వ్యాయామాలు చేస్తూ ఉంటే బరువు పెరుగుతుందనే భయమే ఉండదు. క్యాలరీల పట్ల మరీ అప్రమత్తంగా ఉండాల్సిన బాధ ఉండదు. రాబోయే వ్యాధులకు అడ్డుకట్ట వేసే శక్తి వ్యాయామానికి ఉంది. బీపీ, కొలెస్ట్రాల్ వంటివి నియంత్రణలో ఉంచి గుండెపోటు రాకుండా నివారిస్తుంది వ్యాయామం. దీని వల్ల దేహం ఆరోగ్యవంతమై వ్యాయామాన్ని ప్రోత్సహిస్తుంది. వ్యాయామం ఎప్పుడు చేస్తామో అప్పుడు బరువు పెరగకుండా ఉంటుంది. ► క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే కొన్ని రకాల క్యాన్సర్ల రిస్క్ కూడా పెరగకుండా ఉంటుంది. ముఖ్యంగా కోలన్, బ్రెస్ట్ క్యాన్సర్లు. ► వ్యాయామం చేయడం వల్ల జరిగే మేలైన ప్రయోజనం ఆత్మస్థైర్యం పెరగడం. డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. దీనివల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. వ్యాయామానికి అనువుగా ఉంటుంది. బరువును నియంత్రణలో ఉంచుకోగలుగుతుంది. ► బరువు తగ్గేందుకే కాదు ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా వ్యాయామం ఉపయోగపడుతుంది. జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తుంది. 30 నిమిషాలు తప్పనిసరి బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారు సులువుగా చేయదగిన ఎరోబిక్ వ్యాయామాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అవి.. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ వంటివి. వీటిని వారంలో కనీసం మూడుసార్లు 30 నిమిషాల చొప్పున చేయాలి. బరువు తగ్గాలి అనుకునేవారు మాత్రం 30 నిమిషాల కన్నా అదనంగా చేస్తేనే అధిక బరువు తగ్గడం ప్రారంభిస్తారు. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందు మోడరేట్ ఎక్సర్‌సైజులతో (ఆధునిక జీవనశైలిలో మార్చుకునేవి) బాడీని వార్మ్అప్ చేయాలి లేదా ఓ పదిహేను నిమిషాలు రెండు కిలోమీటర్లు వాకింగ్ చేయాలి. దీని వల్ల 100 అదనపు క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఆపై 30 నిమిషాల పాటు చేసే ఎరోబిక్ వ్యాయామాల వల్ల 700 క్యాలరీలు ఖర్చు అయ్యి, ఏడాది మొత్తంలో 5 కిలోల అదనపు బరువు తగ్గుతారు. గుండెవేగాన్ని లెక్కించాలి ఒకసారి వ్యాయామానికి అలవాటుçపడ్డాక ఆరోగ్యం బాగుంది అనే భావన కలిగి ఉత్సాహం వస్తుంది. దీంతో ఇంకాస్త అధిక తీవ్రత గల వ్యాయామాలను ఎంచుకుంటారు. అవి ఎంత కష్టమైనవైనా చేయగలుగుతారు. మీ గుండెవేగాన్ని క్రమంగా పెంచుతూ తిరిగి నార్మల్ చేస్తూ వ్యాయం చేస్తే బరువు తగ్గుతారు. ఒక వ్యక్తి తన గుండె వేగాన్ని ఎంత వరకు పెంచాలో ఎలా తెలుస్తుంది?సులభం. మీ వయసును 220 నుండి తీసేసి, ఆ సంఖ్యను 70 శాతంతో లెక్కిస్తే ఎంత సంఖ్య వస్తుందో అంత సంఖ్యకు గుండె వేగాన్ని పెంచాలి. ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తి 126 సార్లు గుండె వేగంగా కొట్టుకునే స్థాయికి వ్యాయామం చేయాల్సి ఉంటుంది. వ్యాయామం వల్ల కలిగే ఫలితాలను మన శరీరం పొందాలంటే వ్యాయామంలో ఒక వేగం పాటించడం అవసరం. ఈ వేగం ద్వారా మన గుండె వేగాన్ని కూడా 135 – 150 స్పందనలకు పెంచాలి. ఆ హార్ట్‌బీట్‌ను కనీసం 40 నిమిషాల సేపు కొనసాగనివ్వాలి. ఒకే వ్యాయామ రీతిని 40 నిమిషాలపాటు కొనసాగినివ్వాలంటే విసుగ్గా అనిపించినప్పుడు వాకింగ్, స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్.. ఇలా మార్చి మార్చి కూడా చేసుకోవచ్చు. బోర్ కొట్టకపోతే ఒకే వ్యాయామరీతిని కొనసాగించవచ్చు. వైద్యులను సంప్రదించాలా? మీకు బలమైన గాయాలు, మధుమేహం లేదా గుండె సమస్యలు ఉంటే వ్యాయామాలు ప్రారంభించడానికి ముందు జనరల్ ఫిజీషియన్‌ను కలిసి మీ ఫిట్నెస్ ప్రోగ్రామ్ని వివరించి, వారి సాయం తీసుకోవడం అవసరం. లేదా వారి సూచన ప్రకారం నిపుణులైన ఫిజియోథెరపిస్ట్ లేదా సర్టిఫైడ్ ఫిట్నెస్ నిపుణులను సంప్రదిస్తే మీకు సరైన వర్కవుట్స్‌ను నిర్ణయిస్తారు. ప్రతి ఇబ్బందికీ ఆల్టర్నేట్ వ్యాయామాలు ఉంటాయి. వాటిని తెలుసుకుని చేయాలి. ఉత్సాహంగా చేస్తున్నారా? ఏ పనైనా ఇష్టంగా చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. వ్యాయామం చేయాలని నిర్ణయించుకున్నాక మీరు దానిని పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతున్నారా లేదా అని ప్రశ్నించుకోవాలి. ‘ఎస్’ అనే సమాధానం వస్తే మీరు ఎక్సర్‌సైజ్‌లను రోజూ చేయవచ్చు. ఎరోబిక్స్ ఎందుకంటే! చాలామంది రెగ్యులర్ జిమ్ వ్యాయామాల కంటే ఎరోబిక్స్ని ఇష్టపడతారు. కారణం దీంట్లో కష్టం అనిపించకపోవడం. పైగా, ఏ వ్యాయామాన్ని చేయాలనే నిబంధన ఎరోబిక్ ఎక్సర్‌సైజుల్లో ఉండదు. ► ఎరోబిక్ ఎక్సర్సైజులు మీ గుండెకు రక్తప్రసరణను వేగవంతం చేస్తాయి. ► వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ వంటివన్నీ చేసినంత ఫలితం ఎరోబిక్ ఎక్సర్‌సైజుల్లో కలుగుతుంది. అంతేకాదు– వర్కవుట్స్‌కి ట్రెడ్మిల్, ఎలిప్టికల్, స్టెయిర్ స్టెప్పెర్ వంటì ఫిట్నెస్ మిషనరీని ఉపయోగించినంత ప్రయోజనమూ చేకూరుతుంది. బరువుకు తగిన శిక్షణ అధిక కొవ్వును తొలగించడానికి, కండరాల వృద్ధికి పెద్ద ప్రయోజనం చేకూర్చేవి వర్కవుట్స్. అందుకు సుశిక్షితులైన నిపుణుల సాయం అవసరం. వీటిని వారానికి మూడుసార్లు చేయడం వల్ల ప్రధాన కండరాల సముదాయం బలపడుతుంది. అవి ఏంటంటే.. ► ఉదరం ► వీపు ► పిరుదులు ► మణికట్టు ► ఛాతీ ► ముంజేతులు ► మోకాలు ► తొడ ► భుజాలు ► బాహువులు ఆరోగ్యకర జీవన అలవాట్లు ► నడవడం లేదా ౖసైకిల్ తొక్కడం లేదా పని చేయడం లేదా పరిగెత్తడం ► లిఫ్ట్ లేదా ఎలివేటర్‌ని ఉపయోగించడానికి బదులు మెట్లు ఎక్కడం ► మీరు చేరుకోవాల్సిన చోటుకు నడవగలిగినంత దూరంలోని పార్కింగ్ ఏరియాలో మీ వాహనాన్ని పార్క్ చేసి, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లడం. రోజులో ఎన్ని క్యాలరీలు కావాలి? పురుషుడికైతే 2,200 క్యాలరీలు రోజుకు అవసరం. అదే మహిళకు 1,800 క్యాలరీలు అవసరం. ఇక కేలరీల ఖర్చు విషయానికొస్తే ఆడ–మగ ఇద్దరి పనులలో తేడాలు ఉంటాయి. అలాగే, ఒక గంటకు క్యాలరీ ఖర్చులో తేడాలుంటాయి. రోజూ చేసే పనుల వల్ల ఖర్చయ్యే క్యాలరీలు: ► బాడ్మింటన్ ఆడటం లేదా ఇంటిని శుభ్రపరచడం వల్ల గంటకు: 240 – 300 క్యాలరీలు ఖర్చు చేస్తారు. ► బ్రిస్క్ వాకింగ్ (12 నిమిషాలకు 1.5 కిలోమీటర్ల లెక్కన), సైక్లింగ్, డ్యాన్సింగ్ (గంటకు) : 370 – 460 క్యాలరీలు ► ఫుట్‌బాల్ ఆడటం, జాగింగ్ (9 నిమిషాలకు 1.5 కిలోమీటర్ల లెక్కన) లేదా స్విమ్మింగ్ : 580 – 730 క్యాలరీలు ► రన్నింగ్ (7 నిమిషాలకు 1.5 కిలోమీటర్ల లెక్కన గంటకు) : 740 – 920 క్యాలరీలు ఇంటిని శుభ్రపరచడం ఒక గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ, ఆ పనిలో మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. కనుక హృదయ స్పందన వేగం పెరగదు. అందుచేత క్యాలరీల ఖర్చు తక్కువ ఉంటుంది. అదేవిధంగా, చాలా మంది ఒక సాధారణ నడకతో ఎక్కువ దూరం ప్రయాణించినప్పటికీ అవసరమైన తీవ్రత లేక హృదయ స్పందన రేటును చేరుకోక బరువు తగ్గరు. కాబట్టి, వ్యాయామం చేసే సమయంలో గుండె వేగం పర్యవేక్షించడం ముఖ్యం. ఎందుకంటే అధిక బరువు తగ్గాలంటే ఒక క్రమ తీవ్రతలో వ్యాయామం చేయాలి. ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్‌లో ► అధికబరువు ఉన్నవాళ్లు ధూమపానం, మద్యపానం వెంటనే మానేయాలి. ► మీరు ఓ కొత్త వ్యాయామాన్ని ప్రారంభించినప్పుడు మీ శరీరం మీకు ఇచ్చే సంకేతాలపట్ల శ్రద్ధ చూపడం ముఖ్యం. మీ ఫిట్నెస్ స్థాయి మెరుగుపరచడానికి మీతో మీరు ఢీకొనాలి. అయితే వ్యాయామ స్థాయిలను పెంచుతూ పోవడం వల్ల ఒక్కోసారి గాయపడవచ్చు. అందుకని నొప్పి, శ్వాసలో తేడాలు వచ్చినప్పుడు వ్యాయామం చేయడం ఆపేయాలి. ఇలాంటప్పుడు వ్యాయామం మరో ఎంపిక తీసుకోవచ్చు. ట్రెడ్మిల్, స్టెప్పర్స్, ఎల్లిప్టికల్స్ ఈ తరహా మెషిన్లు మంచి ఎరోబిక్ వ్యాయామాన్ని అందిస్తాయి. అయితే వీటిలో కూడా సత్ఫలితాలు దుష్ఫలితాలు ఉన్నాయి. ఈ మెషిన్లపై వ్యాయామం అత్యంత చురుగ్గా ఉంటుంది ఆనందాన్ని కూడా అందిస్తుంది. వ్యాయామ ప్రారంభంలో ఉన్నవారికి, అలాగే తక్కువ ఫిట్నెస్ స్థాయిలు ఉన్నవారికి ఇవి సరైన ఎంపిక. వ్యక్తిగత ఫిట్నెస్ స్థాయిలకు తగ్గట్టుగా వీటిలో సెట్టింగ్స్‌ను మార్చుకునే వెసులుబాటు ఉండడం మరొక ఉపయుక్తమైన అంశం. మన సామర్ధ్యానికి తగ్గట్టుగా ఇది నప్పుతుందా లేదా అని తేల్చుకోవడానికి స్టోర్ లేదా ఫిట్నెస్ సెంటర్లో ట్రయల్ రన్‌కు ప్రయత్నించవచ్చు. ఈ మెషిన్ల వల్ల ఉన్న మరో ప్రధాన ఉపయోగం ఏమిటంటే... వాతావరణంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా చేయదగ్గ ఇండోర్ యాక్టివిటీని ఇవి అందిస్తాయి. కాని మోకాలి సమస్య లేదా పిరుదుల సమస్య ఉన్న వ్యక్తులు స్టెయిర్ క్లైంబర్స్, స్టెప్పర్స్కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ మెషిన్లు కీళ్లపై అదనపు భారాన్ని మోపుతాయి. వాకింగ్ మీ ఫిట్నెస్ స్థాయిని, సామర్థ్యాన్ని నడక పెంచుతుంది. ఇతరత్రా ఫిట్నెస్ పరికరాలు దీనికి అవసరం లేదు. ఇంట్లోనూ, బయట ఎప్పుడైనా, ఎక్కడైనా నడవ్వచ్చు. మాల్స్, ఇండోర్ ట్రాక్స్ లేదా ట్రెడ్మిల్.. ఏదైనా నడవడం ప్రధానం. ఆరోగ్యంగా ఉండటానికి రోజూ 10,000 అడుగులు వేయాలి. మీరు అదనపు బరువు కోల్పోవాలనుకుంటే 12,000 అడుగులు వేయాలి. రోజుకు వేసే అడుగుల సంఖ్యను కచ్చితంగా తెలుసుకోవాలంటే పెడోమీటర్ పర్యవేక్షణతో తెలుసుకోవచ్చు. 10,000 అడుగులు అంటే ఉజ్జాయింపుగా 8 కిలోమీటర్లు. యోగా అమెరికాలోని ‘ఫ్రెడ్ హాచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్’ పరిశోధకులు బరువు తగ్గేందుకు యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందనే సంగతి గురించి ఓ అధ్యయనం చేశారు. యోగా ఇతర రకాల వ్యాయామాల మాదిరిగా బరువు తగ్గించడంలో తీక్షణంగా పని చేయకపోయినా దానిని నిత్యం సాధన చేయండం వల్ల ఆహారం, అలవాట్లకు సంబంధించి ఆరోగ్యకరమైన నియమావళి ఏర్పడి ఊబకాయం తగ్గడానికి పరోక్షంగా ఉపయోగపడుతుందని తేల్చారు. స్విమ్మింగ్: ఇది ఒక అద్భుతమైన ఎరోబిక్ వ్యాయమం. అయితే ప్రారంభించే ముందు కొన్ని జాగ్రత్తలు అవసరం. తక్కువ శక్తి–సామర్ధ్యం కలిగిన వారికి గతంలో స్విమ్మింగ్ చేయని వారికి నిర్ణీత 30 నుంచి 60 నిమిషాల పాటు ఈత కష్టం కావచ్చు. అందుకే క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. మొలలోతు నీళ్లలో అటూ ఇటూ నడవడం కూడా వ్యాయామం కిందకే వస్తుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు స్విమ్మింగ్‌కు ముందు తమ ఫిజిషియన్ని సంప్రదించడం మంచిది. జాయింట్ పెయిన్స్ ఉన్నవారికి వాటర్ ఎరోబిక్స్ మంచి ప్రత్యామ్నాయం. నీటికి ఉన్న తేల్చే గుణం కారణంగా కీళ్లపై తక్కువ ఒత్తిడి పడుతుంది. స్విమ్మింగ్ పూల్‌లో రెయిలింగ్ పట్టుకొని పెడలింగ్ చేసినట్టుగా కాళ్లు ఆడించినా స్విమ్మింగ్‌తో ప్రయోజనాలే కలుగుతాయి. సైక్లింగ్ : రోజూ ఇంటికి ఏదో ఒక చిన్న చిన్న కిరాణ సామగ్రి అవసరం పడుతుంది. ప్రతీదానికి బైక్ కాకుండా సైకిల్ వేసుకొని వెళ్లండి. ఎముకలు పెళుసుబారడం, కీళ్లవాతం, కీళ్లనొప్పులు.. వంటి సమస్యలు ఉంటే నడకను ఎంచుకోండి. వాకింగ్, సైక్లింగ్ రెండూ హృదయనాళ వ్యవస్థకు మేలైన ప్రయోజనాలు ఇస్తాయి. అధికబరువు గలవారికి సైక్లింగ్ సరైన ఎంపిక. యాంత్రిక జీవనంలోని స్ట్రెస్ నుంచి గుండెకు రిలీఫ్ లభిస్తుంది. వెన్ను, పిరుదులు, మోకాళ్లు, మడమలలోని ఒత్తిడి కూడా నడక వల్ల రిలీజ్ అవుతుంది. -
మెదడు... మెథడు
బరువు తగ్గడానికి డైట్ ప్లాన్స్ చూశారు. ఆ ప్లాన్స్‌తో పాటు ఇంకో కొత్త ప్లాన్ కూడా ఉంది. అదే లైఫ్‌స్టైల్ ప్లాన్. మీ రోజువారీ లైఫ్‌ని కాస్తంత మార్చుకుంటే కంట్రోల్ చేసుకుంటే, హద్దులు విధించుకుంటే బరువు తగ్గచ్చు. బరువు తగ్గాలంటే శరీరం కంటే ముందు మెదడు అదుపులోకి రావాలి. ఆ మెథడ్ ఏంటో తెలుసుకొని ఆచరించండి. స్లిమ్ అవ్వాలి. ఎలా? రేపట్నించి వ్యాయామం మొదలుపెడదాం!’ అని ఓ నిర్ణయానికి వచ్చేసి రేపటికి వాయిదా వేస్తూనే ఉండి ఉంటారు. తినే ఆహారం ద్వారా ఒంట్లో అదనంగా క్యాలరీలు చేరుతూనే ఉంటాయి. టీవీలో వచ్చే షోస్‌ని గంటల తరబడి చూస్తూ కూర్చునే ఉంటారు. కంప్యూటర్ల ముందు కీ బోర్డ్ నొక్కుతూ పని చేశామనుకుంటారు. కానీ, కాలు కదపక, ఒళ్లు కదలక శరీరంలో చేరిన క్యాలరీలు ఖర్చు కావు. ఫలితం మరింత బరువు. ‘ఈ మధ్య ఒళ్లు చేసినట్టున్నారు..’ అనే సన్నిహితుల మాటలు నిరాశ కల్గిస్తుంటాయి. ‘ఎలాగైనా సరే బరువు తగ్గాల్సిందే అనే లక్ష్యం మీదైతే ఇది మీకోసమే! వ్యాయామం చేయకుండానే అదనపు బరువును తగ్గించుకోవచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా.. మీ రోజువారీ జీవనశైలి ఏవిధంగా ఉందో పరిశీలించాలి. ఓ రకంగా మీకు మీరే పరిశోధకులు. మీ జీవనప్రయాణం ఎలా ఉందో చిన్న చిన్న గమనింపులు చేసుకుంటూ, కొద్దికొద్దిగా మార్పులు చేసుకుంటూ కొనసాగించండి. మీబరువు మీ అధీనంలో ఉంటుంది. మీ ప్రయత్నాలు ఇప్పుడే మొదలుపెట్టండి. అందుకు ఇది ఒక చిన్న అడుగే కావచ్చు. కానీ, రేపు పెద్ద పెద్ద అంగలు వేస్తూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా వేసే అడుగులకు దారులను సుగమం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడేవి నిర్ధారించి, ఫలితం పొందిన సులువైన మార్గాలు 15 ఉన్నాయి. అవి, ఎక్కువగా అటూ ఇటూ తిరుగుతూ ఉండటం, తక్కువ తినడం, మిమ్మల్ని మీరు చూసుకున్న ప్రతీసారి మెరుగైన ఫలితం పొందామన్న అనుభూతిని పొందడం. ఈ రోజువారీ జీవనశైలి మార్పులను కేవలం ఒకటి – రెండు వారాలు పాటించండి. దాదాపు 3 అంగుళాల మేరకు మీ నడుము వెడల్పు తగ్గుతుంది. కొన్నినెలల్లోనే 5 కిలోల బరువు తగ్గుతారు.అంతేకాదు ఈ విధానం మెరుగైన, ఆరోగ్యకరమైన అలవాట్లు మీ జీవితకాలం ప్రయోజనాన్ని పొందేలా చేస్తుంది. వాణిజ్య ప్రకటనల సమయం టీవీలో మీకిష్టమైన షో చూస్తున్న సందర్భంలోనూ ఒకేచోట కూర్చోకుండా అటూ ఇటూ నడుస్తూ చూడండి. వాణిజ్య ప్రకటనలు వచ్చే సమయంలో బయటవరకు వెళ్లడం, కొన్ని మెట్లు ఎక్కి దిగి రావడం, ఉన్న చోట నుంచి ఒక చిన్న పరుగులాంటి నడకతో మరో చోటుకి వెళ్లడం... వంటివి చేస్తూ ఉండండి. వీటివల్ల మీ గుండె వేగం, శ్వాస వేగం పెరగాలి. రోజూ రాత్రి సమయంలో రెండు గంటలపాటు టీవీ చూస్తూ ఉన్నారనుకోండి ప్రతి 2 నిమిషాలకోసారి విరామం తీసుకోండి. దీనివల్ల అదనంగా 270 క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇలా రోజూ చేస్తూ ఉంటే ఏడాదిలో 8 కిలోల బరువు తగ్గవచ్చు. కొవ్వు పదార్థాలు– పరిమితులు అధికం మీకు బాగా నచ్చే ఆహారపదార్థాలలో కొవ్వు అధికంగా ఉండే .. కుకీస్, చాక్లెట్స్, ఐస్‌క్రీమ్, చిప్స్, వేపుళ్లు..వంటివి ఉన్నాయనుకోండి. వీటిని క్రమంగా తగ్గిస్తూ పోండి. అంటే, కొవ్వు పదార్థాలలో వారానికి ఆరు రకాలవి తీసుకుంటున్నట్లయితే ఆ సంఖ్య 5కు పరిమితం చేయండి. ఆ తర్వాత 4. ఇలా వారానికి ఒకటి చొప్పున తగ్గిస్తూ పోతే మీరే ఆ మరుసటి వారానికి రెండు కొవ్వుపదార్థాలను తీసుకోవడం మానేస్తారు.వీటికి బదులుగా క్యారెట్స్, ఆరెంజ్‌లు.. వంటి ఇతర తాజాపండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. బరువు తగ్గడానికి వార్తలు ఫిట్నెస్, ఆహారనియమాలకు సంబంధించిన ఆర్టికల్స్‌ను 16 వారాల పాటు చదువుతూ ఉంటే శారీరక చురుకుదనానికి కావల్సిన మార్పులను తమకు తామే చేసుకోవడానికి సిద్ధం అవుతారని ఒక నివేదికలో తేలింది. ఇలా బరువుకు సంబంధించి హెల్త్ ఆర్టికల్స్ చదివే వారు కొవ్వు పదార్థాలు తగ్గించి తాజాపండ్లు, కూరగాయలు తీసుకోవడం పెరిగింది. ఇవే అలవాట్లు ఎవరైనా 16 వారాల పాటు కొనసాగిస్తే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడినట్టే. అధిక బరువుకు చెక్‌పెట్టినట్టే! బేసిక్‌గా బాడీ వెయిట్ ఎక్సర్సైజులు జిమ్‌లో చేసేవి స్క్వాట్స్, పుషు–అప్స్ వంటి ప్రా«థమిక వ్యాయామాలు ఉన్నాయి. ఇవి ఇంట్లోనూ చేయవచ్చు. నీళ్లు నింపిన బాటిళ్లు, కూరగాయల సంచులు పైకి లేపడం, నెమ్మదిగా వాటిని కిందకుదించడం.. వంటివి చేయవచ్చు. పరిశీలిస్తే ఇంటి వాతావరణంలోనే ప్రాథమిక వ్యాయామాలు చేయడానికి అనువైనవి ఎన్నో ఉన్నాయి. వీటివల్ల నిమిషాల్లో మెటబాలిజం–రివైవింగ్ అయ్యి కండరాల బలం పెరుగుతుంది. దీంతోపాటే ఇవి బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. మెట్లు ఎక్కడం రోజులో 2 – 3 నిమిషాలైనా మెట్లు ఎక్కాలి. కనీసం 3 నుంచి 5 అంతస్తులు ఎక్కాలి. దీనివల్ల ఏడాదిలో పెరిగిన బరువులో 2 కేజీల బరువును తగ్గించుకోవచ్చు. ఇది తగ్గిన మీ నడుము చుట్టుకొలతనే చెబుతుంది. మహిళలకన్నా మగవారు వారంలో 70కి పైగా మెట్లు ఎక్కి వారానికి 20 చొప్పున పెంచుతూ పోవాలి. మెట్లెక్కడం వల్ల 18 శాతం మరణాల రేటు తగ్గినట్టు హార్వర్డ్ విశ్వవిద్యాలయం పేర్కొంది.అందుకని ఈ రోజే మెట్లను అధిరోహించడం ప్రారంభించండి. రోజూ 3 మెట్లు అదనంగా ఎక్కుతూ మీ ట్రెక్కింగ్‌ను ఇప్పుడే మొదలుపెట్టండి. ఇలా చేస్తే బరువు తగ్గింపులో మీరు ఎన్నోమెట్లు ఎక్కినట్టే. మరింత అదనం మీరు ఒక ఏడాది కాలంలో వేలాది క్యాలరీలు డబ్బును పొదుపు చేస్తున్నట్టుగా ఒంట్లో సేవ్ చేస్తూ ఉంటారు. అదెలాగో చూద్దాం.. వారాంతంలో రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ 610 క్యాలరీలు గల ఒక చికెన్ బర్గర్‌ను తిన్నారు. దీంట్లో 40 శాతం కొవ్వు, 1,440 మిల్లీ గ్రాముల సోడియం ఉంటాయి. అదే, మీరు సొంతంగా ఇంట్లోనే చికెన్ బర్గర్‌ని తయారుచేసుకుంటే 230 క్యాలరీలకు మించదు. అంటే, కనీసం దీనివల్ల 400 క్యాలరీలు, 520 మిల్లీగ్రాములు సోడియం కటాఫ్ చేస్తున్నారన్నమాటే. అందుకని మీరు తినే భోజనాన్ని హోటల్స్ వారికి ఆర్డర్ ఇవ్వకుండా మీరే సిద్ధం చేసుకోవడం ఉత్తమం. అలాగే, తినే ఆహారంలో పంచదార, ఉప్పు, కొవ్వులను తగ్గిస్తూ ఉండడం చాలా అవసరం. ఇప్పుడు చెప్పినవన్నీ రెస్టారెంట్ ఫుడ్‌లో ఎక్కువ శాతం ఉంటాయి. కిలోమీటర్ అనే విధానం కచ్చితం చేయాలి మూడు కిలోమీటర్ల కంటే తక్కువ దూరాలుండే అన్ని ప్రయాణాలకు 89 శాతం వాహనాల మీదే వెళుతుంటారు చాలామంది. డ్రైవింగ్‌కి ఖర్చుకు చేసే ప్రతి అదనపు గంటకు బరువు 6 శాతం పెరుగుతుంది.క్యాలరీలను ఖర్చు చేయాలంటే తప్పనిసరి రూల్ పాటించాలి. మీరు వెళ్లాల్సిన చోటు కిలోమీటర్ కన్నా తక్కువ దూరం ఉంటే డ్రైవింగ్‌కి బదులు చురుకుగా నడవాలని ప్రతిజ్ఞ చేసుకోండి. తక్కువ దూరానికి కూడా మీ కారులో ప్రతీసారి వెళ్తూ పార్కింగ్ కోసం టైమ్ వృ«థా చేయకుండా నడక ద్వారా అనేక పనులు సులువుగా చేసుకోవచ్చు అని మీకు మీరే చెప్పుకోండి. ఈ రూల్‌ని మీరు ఇప్పుడు మెదలుపెడితే వచ్చే ఏడాది వరకు కనీసం 6 నుంచి 7 కిలోలు బరువు తేలికగా తగ్గిపోతారు. రోజులో 10 సార్లు కాళ్లు, చేతులే కాదు నోటి కదలికలకు కూడా పని చెబుతూ ఉండాలి. అంటే, ఒకే మొత్తాన్ని ఒకేసారి భుజించడం కాకుండా రోజులో ఎక్కువసార్లు తినాలనే రూల్ పెట్టుకోండి. దీంట్లో మీరు తినబోయే పదార్థాన్ని నిమిషం సేపు గమనించడం, వాసన చూడటం, దాని వల్ల కలిగే ప్రయోజనాన్ని ఆలోచించడం వంటివి చేయండి. ఆ తర్వాత చాలా కొద్దిగా మాత్రం నోట్లో పెట్టుకోండి. దాన్ని నెమ్మదిగా, బాగా నమలాలి. ఎంతగా అంటే ఆ పదార్థం నోరంతా తిరగాలి. రుచిని ఆస్వాదించాలి. లాలాజలం ఊరాలి. ఆ తర్వాత మరొక ముద్ద తినాలి. దీనివల్ల ఆహారం తీసుకోవడంలో ఒక సంతృప్తి భావన కలుగుతుంది. మీకు ఇంకా తిన్న అనుభూతి కలగాలంటే మరో 20 సార్లు నమలడం పెంచండి. దీనిని ఈటింగ్ ఎక్సర్సైజ్ అనవచ్చు. 10 నిమిషాల్లో తినడం ముగించండి. నెమ్మదిగా తినడం వల్ల మైండ్ కూడా ఫుల్ అయ్యిన భావన కలుగుతుంది. పండ్లు తినండి తాగద్దు పండ్లను తినడం వల్ల శరీరానికి తగినంత పీచు అందుతుంది. రోజూ ఒక యాపిల్ తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది. అదే ఒక యాపిల్‌తో చేసిన జ్యూస్ తాగితే పీచు కాకుండా క్యాలరీలే శరీరానికి అందుతాయి(ఒక యాపిల్‌లో 3.5 గ్రాముల పీచు ఉంటే, అదే జ్యూస్‌లో 0.5 గ్రాములు ఉంటుంది). కార్బోహైడ్రేట్స్ ఉండే జ్యూస్‌ల కన్నా ఫైబర్ ఉన్న పండ్ల వల్ల ఎక్కువ సంతృప్తి, ఆరోగ్యం లభిస్తుందని సుదీర్ఘపరిశోధనల ద్వారా స్పష్టమైంది. ఆహారం అంటేనే నమిలి తినాలి. అది మీ లాలాజలంతో కలవాలి. అప్పుడే మైండ్ సంతృప్తి చెందుతుంది. అదే పండును జ్యూస్ చేసి తాగితే ఆ భావన మైండ్‌కు చేరదు. పైగా తీపి కోసం వేసే పంచదార వంటివి యాపిల్ పండు కన్నా 48 శాతం క్యాలరీలను జ్యూస్ చేర్చుతుంది. సహాయం పొందండి వ్యాయామం చేయడానికి ఫ్రెండ్‌ను మించిన ఉత్సాహభరితమైన సపోర్ట్ మరోటి ఉండదు. మీ వీధి చివరన ఉండే ఫ్రెండ్‌ను కలవడానికి కాలినడకన వెళ్లచ్చు. చేసే వర్కవుట్స్ గురించి ముఖాముఖిగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మధ్య భేషజాలు ఉండవు. మహిళలు నలుగురిలో కలిసి ఉండి, చర్చించుకునే గ్రూప్స్ మన సమాజంలో ఎక్కువ. ఇలా ఒకరికి ఒకరు వ్యాయామం, ఆహారపు అలవాట్ల విషయంలో చర్చించుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటూ రోజూ 300 క్యాలరీలు ఆహారంలో తగ్గిస్తూ, నడకను మైలు దూరం కన్నా పెంచుకుంటూ ఉంటే 9 నెలల్లో 6 కిలోల అదనపు బరువు తగ్గుతారు. కప్పు కాఫీ పెంచే బరువు రోజూ 3,000 కప్పులు అమ్మే 115 కాఫీషాప్లను సందర్శించి నిపుణులు ఓ నివేదికను అందించారు. ఎలాగంటే రోజూ ఒక కప్పు కాఫీ లేదా టీ ద్వారా (పాలు + పంచదారతో కలిపి) సగటున 239 క్యాలరీలు సగటున సేవిస్తున్నారు. 2–3 నుంచి కప్పుల కాఫీ లేదా టీ సేవించినా రోజులో ఒక్కొక్కరు సగటున 630 క్యాలరీలు అదనంగా తీసుకుంటున్నారు. ఈ అలవాటును మానుకుంటే ఏడాదిలో 6 కేజీల అదనపు బరువును తగ్గించవచ్చు. పెన్ను తీసుకోండి దాంతో పాటే ఒక చిన్న నోట్ బుక్ తీసుకోండి. దీని మీద ఫుడ్ డెయిరీ లేదా ఫుడ్ లాగ్స్ అని పేరు రాయండి. ఈ రోజు నుంచి కాదు ఇప్పటి నుంచే రోజులో ఏమేం తింటున్నారో ప్రతి అరగంటకోసారి రాస్తూ ఉండండి. అంతేకాదు, ఆ ఆహారంలో ఉండే క్యాలరీలు కూడా ఇంచుమించుగా నోట్ చేస్తూ ఉండండి. ఈ ఫుడ్ డెయిరీ మీరు తీసుకునే అదనపు క్యాలరీలను తీసుకోకుండా మీ నోటికి అడ్డుపడుతూ ఉంటుంది. ఇటీవల పరిశోధనలో తేలిందేమంటే.. ఫుడ్ డెయిరీలో ఆహారం తీసుకునే సమయాలు, క్యాలరీలు నోట్ చేసుకున్నవారు త్వరగా బరువు తగ్గడం గమనించారు. ఫుడ్ డెయిరీని రోజూ రాయడం అలవాటు చేసుకున్నవాళ్లు మితంగా ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడానికి ప్లాన్ చేసుకోవడం..వంటివి ప్రారంభించారు. ఈ విధానాన్ని పాటించినవాళ్లు దాదాపు 6 నెలల సమయంలో 7 కిలోల బరువు తగ్గారు. ఫుడ్ డెయిరీ వల్ల ఆహారపు అలవాట్లు మీలోని అంతర్దృష్టిని మేల్కొలిపి, అవగాహన ³రిచేలా చేస్తుంది. అంటే పెన్ మీ అధిక క్యాలరీలను కాల్చేసే గన్లా ఉపయోగపడుతుందన్నమాట. అదనంగా 5 నిమిషాలు శారీరక శ్రమలో భాగంగా నడకకు రోజూ ఓ 5 నిమిషాల సమయం పెంచుకుంటూ పోవాలి. ఇలా చేస్తుంటే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి నాలుగు నెలల్లో మీ నడుము చుట్టుకొలత 2 1/2 ఇంచులు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు మీ లక్ష్యం 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వాకింగ్ చేయడం అనుకోండి. రోజూ మరో 5 నిమిషాలు అదనంగా వాకింగ్ చేస్తూ ఉండండి. రోజుకు 30 నిమిషాలు వాకింగ్ చేస్తుంటే 120 క్యాలరీలు ఖర్చు అవుతాయి. నిద్రతో తగ్గే బరువు బరువు తగ్గడానికి ఒక అతిముఖ్యమైన పాయింట్ హాయిగొలిపే నిద్ర. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు నిద్రలేమి తక్షణ బరువుకు దారి తీస్తుందని తేల్చారు. 5 రాత్రుల్లో కనీసం 4 రాత్రుళ్లు హాయిగా నిద్రపోయినవారు కిలో బరువు తగ్గినట్టు గుర్తించారు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
స్క్రీన్ టైమ్ తగ్గితే మార్కులు పెరుగుతాయి!
స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టెలివిజన్ల ముందు పిల్లలు గడిపే సమయాన్ని రోజుకు రెండు గంటలకు పరిమితం చేయగలిగితే పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అంటున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు. దీంతోపాటు తగినంత శారీరక వ్యాయామం, నిద్ర కూడా అవసరమేనని వీరు తేల్చారు. అమెరికాలోని దాదాపు ఐదు వేల మందిపై తాము పరిశోధన చేశామని డాక్టర్ జెరెమీ వాల్‡్ష తెలిపారు. అమెరికన్ పిల్లలు రోజుకు 3.6 గంటలపాటు టీవీ, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ల ముందు గడుపుతున్నారని చెప్పారు. ఇలా కాకుండా స్క్రీన్ టైమ్‌ను రెండు గంటలకు పరిమితం చేయడం పిల్లలతోపాటు కౌమార వయసులో ఉన్న వారికీ అత్యవసరమని చెప్పారు. అమెరికాలో ప్రతి 20 మంది పిల్లల్లో ఒక్కరు మాత్రమే ఈ పద్ధతులు పాటిస్తున్నారని చెప్పారు. స్క్రీన్ టైమ్‌ను తగ్గించి నిద్రపోయే సమయాన్ని పెంచడం ద్వారా మెదడు బాగా పనిచేస్తున్నట్లు తెలిసిందని, శారీరక వ్యాయామం ప్రభావం నేరుగా మెదడుపై పెద్దగా లేదని వివరించారు. ఎనిమిది నుంచి 11ఏళ్ల మధ్య వయసు పిల్లలు రోజుకు కనీసం తొమ్మిది గంటలపాటు నిద్రపోవడం మేలని సూచించారు. నిద్ర, స్క్రీన్టైమ్ తగ్గడాల ఫలితం మార్కుల్లో కనిపిస్తూంటే.. వ్యాయామం ప్రభావం దష్టి కేంద్రీకరించే సామర్థ్యం, జ్ఞాపకశక్తి, రియాక్షన్ టైమ్లపై కనిపిస్తున్నట్లు అధ్యయనంలో తెలిసిందని చెప్పారు. -
తేలికపాటి వ్యాయామంతోనూ మెదడుకు ఉత్తేజం
లండన్ : వ్యాయామంతో మెదడులో కొత్త కణాలు ప్రేరేపితమవుతాయని పలు అథ్యయనాలు వెల్లడించగా, తాజాగా రోజుకు కేవలం పదినిమిషాల పాటు తేలికపాటి వ్యాయామంతోనూ త్వరతగతిన ఫలితాలు అందుతాయని తేలింది. కొద్దిపాటి వ్యాయామంతోనూ మెదడు సత్వరమే ఉత్తేజితమవుతుందని కాలిఫోర్నియా, జపాన్ పరిశోధకులు గుర్తించారు. రోజుకు కేవలం పదినిమిషాల పాటు వ్యాయామం చేసినా మెదడులో జ్ఞాపకశక్తి సహా చురుకుదనం ప్రేరేపిస్తుందని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. యోగా, థైచీ వంటి తేలికపాటి వ్యాయామాలతోనూ మెదడులో జ్ఞాపకాలను నిక్షిప్తం చేసే భాగం ఉత్తేజితమవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, జపాన్‌కు చెందిన సుకబా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. గతంలో వ్యాయామంతో మెదడుకు మేలు చేకూరుతుందని పలు అథ్యయనాలు వెల్లడించగా, తాజా అథ్యయనం వ్యాయామంతో మెదడుకు తక్షణ ఫలితాలు చేకూరుతాయని స్పష్టం చేసింది. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండవచ్చని పరిశోధకులు సూచించారు. -
వ్యాయామంతో మెదడుకు ఉత్తేజం
లండన్ : వ్యాయామంతో శారీరక చురకుదనంతో పాటు మెదడు ఉత్తేజితమై ఎదుగుదల సంతరించుకుంటుందని తాజా అథ్యయనం వెల్లడించింది. శరీరానికి మేలు చేసే ఏ పనైనా మెదడుకూ మేలు చేస్తుందని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేయగా వ్యాయామం మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుందని తాజా అథ్యయనంలో విస్పష్టంగా తేలింది. బ్రైన్ పజిల్స్, క్రాస్‌వర్డ్స్ పూరించడంతో పోలిస్తే శారీరక చురుకుదనంతోనే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ కాన్బెర్రా పరిశోధకులు పేర్కొన్నారు. ప్రతిరోజూ ఏరోబిక్ ఎక్సర్‌సైజులతో ఆలోచనా విధానం, చదవడం, రీజనింగ్ వంటి సామర్థ్యాలు మెరుగుపడతాయని గుర్తించారు. వ్యాయామంతో కండరాలు పటిష్టమవడం జ్ఞాపకశక్తి, మెదడు సామర్థ్యం పెరిగేందుకు దోహదపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. వేగంగా నడవడం, తోటపని, స్విమ్మింగ్, మెట్లు ఎక్కడం వంటి శారీరక కదలికలు అధికంగా ఉండే వ్యాయామాలతో మెదడు ఉత్తేజితమవుతుందని గుర్తించారు. శారీరక వ్యాయామంతో పాటు అభిరుచుల మేరకు సంగీతం, నృత్యం వంటి వ్యాపకాల్లో మునిగితేలితే డిమెన్షియా ముప్పును ఎదుర్కోవచ్చని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు వెల్లడించారు. -
వ్యాయామంతో అల్జీమర్స్‌కు చెక్
లండన్ : రోజూ వ్యాయమంతో అల్జీమర్స్‌ను నియంత్రించవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి పరిశోధకులు ఎలుకలపై చేపట్టిన ప్రయోగంలో ఈ ఫలితాలు రాబట్టారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని వాపు ప్ర్రక్రియను నివారించవచ్చని అథ్యయన రచయిత రుడీ తాంజి పేర్కొన్నారు. వ్యాయామంతో మెదడు పనితీరు మెరుగైన క్రమంలో అల్జీమర్స్‌కు దారితీసే కారకాలు తగ్గుముఖం పట్టినట్టు అథ్యయనంలో గుర్తించారు. ఎలుకలపై చేసిన ప్రయోగంలో వ్యాయామంతో ఉత్తేజితమమ్యే మెదడులో కొత్త న్యూరాన్లు ఏర్పడ్డాయని తేలిందన్నారు. మానవుల్లోనూ వ్యాయామంతో ఇలాంటి ఫలితాలు చేకూరతాయని అథ్యయనం అంచనా వేసింది. మెదడు కణాలను ఉత్తేజితం చేసే మందులను రూపొందించే దిశగా పరిశోధన బాటలు వేస్తుందని చెప్పారు. రోజూ 30 నిమిషాల పాటు వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ల ద్వారా మెదడుకు రక్తసరఫరా, ఆక్సిజన్ మెరుగ్గా అందుతాయని, ఫలితంగా మెదడు పనితీరు సామర్ధ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు డాక్టర్ సె హున్ చోయ్ తెలిపారు. అల్జీమర్స్‌తో బాధపడే రోగులు నిత్యం వ్యాయామం చేయడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చన్నారు. -
వాళ్లను అస్సలు ఉపేక్షించను
బాడీ ఫిట్‌గా ఉండాలంటే జిమ్‌లో గంటల కొద్దీ వర్కౌట్లు చేయాలి. మరి సెన్సాఫ్ హ్యూమర్ సరిగ్గా ఉందో లేదో తెలియాలంటే? ఏంటీ సెన్సాఫ్ హ్యూమర్ పెంచుకోవడానికి కూడా వర్కౌట్స్ ఉంటాయా? అంటే.. అవునంటున్నారు తాప్సీ. అంతేకాదు.. రెగ్యులర్‌గా ఆమె చేస్తుంటారట. ఈ వెరైటీ వర్కౌట్స్ గురించి తాప్సీ మాట్లాడుతూ –‘‘సినిమాలు, షూటింగ్స్, ట్రావెలింగ్.. ఇన్ని టెన్షన్స్ మధ్యలో అభిమానులతో కనెక్ట్ అవుదాం అని సోషల్ సైట్స్ ఓపెన్ చేస్తాం. ఎవరో ఓ ఆకతాయి మనల్ని ఏదో అనేసి ఆనందం పొందుదాం అని చూస్తుంటాడు. చాలా మంది నెగటివిటీ జోలికి ఎందుకులే అని వదిలేస్తారు. కానీ, నేను మాత్రం వాళ్లను అస్సలు ఉపేక్షించను. విసిరిన బంతిని తిరిగి అదే వేగంతో పంపించడమే సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి మంచి ఎక్సర్సైజ్ అంటాను. సరదాగా లైట్ హార్ట్‌తో ఉండే ట్రోలింగ్‌ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎవ్వరూ ఫీల్ అవ్వరు. కానీ, అదే పనిగా టార్గెట్ చేద్దాం అనుకునేవాళ్లను వదిలేయకూడదు. ఓ మాట అనేద్దాం అనుకునే వాళ్లకు అదే మాటతీరుతో వెటకారంగా రిప్లై ఇస్తే నా ఫాలోయర్స్‌కు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. నాకూ ఎక్స్‌ర్‌సైజ్’’ అన్నారు. -
పిలాటీస్.. ఫ్రం సింగపూర్
విదేశీ వస్తువులే కాదు..రానురాను వ్యాయామ పద్ధతులు కూడా నగరానికి దిగుమతి అవుతున్నాయి. మారుతున్న జీవన శైలిని ఆసరాగా చేసుకుని ఫిట్నెస్ సెంటర్లు ఎప్పటికప్పుడు సరికొత్త వర్కవుట్స్‌ను పరిచయం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న వ్యాయామాలకు భిన్నంగా మరో సరికొత్త వ్యాయామం నగరంలోకి ప్రవేశించింది. అదే పిలాటీస్. శరీరంలో ఎక్కడో లోతుగా ఉండే కోర్ కండరాలను సైతం పటిష్టపరిచి నవ యవ్వనశక్తిని పునరుత్పత్తి చేసే మహత్తు పిలాటీస్కు ఉందని నగరానికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ జైనెబ్ అలీ చెబుతున్నారు. సింగపూర్‌లో పిలాటీస్పై ప్రత్యేకంగా కోర్సు పూర్తిచేసిన ఆమెసర్టిఫికెట్ను పొందారు. ప్రస్తుతం తిరుమలగిరిలోని స్వర్గం ఆర్కేడ్లోని తన స్టూడియోలో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి పిలాటీస్ గురించి వివరించారు. సనత్‌నగర్ :పిలాటీస్ అనేది మెదడు, శరీర వ్యాయామ ప్రక్రియ. దీనిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పురుషుల కోసం జోసఫ్ పిలాటీ అనే వ్యక్తి ప్రారంభించారు. కాలక్రమంలో దీనిని మహి ళలు కూడా చేయడం మొదలుపెట్టారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న వ్యాయామ రూపా ల్లో పిలాటీస్ ఒకటి. కండరాల కదలికల్లో ఖచ్చితత్వం. నియంత్రణ, కండరాల బలోపేతం చేయడానికి పిలాటీస్ రూపొందించారు. ప్రధానం గా అభివృద్ధి చెందిన దేశాలు యూఎస్, ఆస్ట్రేలి యా, యూరప్, సింగపూర్లలో ఎక్కువగా పిలాటీస్ వ్యాయామ పద్ధతులను అనుసరిస్తారు. అత్యంత సురక్షితమైన వ్యాయామ రూపాల్లో ఒకటిగా పిలాటీస్ను జనరల్ప్రాక్టీషనర్స్, ఫిజియోథెరపిస్ట్, ఆస్టియోపథ్స్ సైతం ఆమోదించారు. ఇప్పుడిప్పుడే ఇది హైదరాబాద్‌లోకి ప్రవేశించింది. ఐదు సూత్రాల వ్యాయామం. ప్రధానంగా పిలాటీస్కు ఐదు సూత్రాలను అనుసరిస్తారు. బ్రీథింగ్, పెల్విక్ ప్లేస్మెంట్, రిబ్ కేజ్ ప్లేస్మెంట్, స్కపులర్ మూవ్మెంట్, స్టెబిలైజేషన్ హెడ్ అండ్ సెర్వికల్ ప్లేస్మెంట్ సూత్రాల ఆధారంగా పిలాటీస్ చేయిస్తారు. ఈ ఐదు సూత్రాల ఆధారంగా రూపొందించబడ్డ దాదాపు 500 రకాల వ్యాయామ పద్ధతుల ద్వారా ఎలాంటి మందులతో పనిలేకుండా శరీరంలోని లోపాలను సరిజేయవచ్చు. పలు ఉపకరణాలు ఉపయోగించి... మ్యాట్‌పై కసరత్తు చేయడంతో పాటు రీఫామర్, స్టెబిలిటీ చైర్, కాడిలాక్, నిచ్చెన బ్యారెల్ వంటి ఉపకరణాలను ఉపయోగించి పిలాటీస్ వ్యాయామ ప్రక్రియను చేయవచ్చు. అయితే ఉపకరణాలపై కంటే ఎక్కువ శాతం వ్యక్తిగత వ్యాయామ పద్ధతులనే పిలాటీస్లో పాటిస్తారు. పిలాటీస్ ఉపయోగాలేమిటంటే.. పార్శ్వగూని ఉన్నవారిని ఆ సమస్య నుంచి బయటపడేయవచ్చు. బోలు ఎముకల వ్యాధి, అర్ధరైటిస్, కీపిసిస్, లోర్డోసిస్, మెడ సమస్యలు, షోల్టర్ సమస్యలు, బ్యాక్ పెయిన్, కీళ్ల నొప్పులు, శ్వాస సమస్యలు వంటి రుగ్మతల నుంచి పిలాటీస్ ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వెయిట్ లాస్, కండరాల టోనింగ్, పోస్టర్ కరెక్షన్ (భౌతికంగా కనిపించే లోపాలను సరిజేయడం), శరీర దృఢత్వం, కోర్ కండరాల పటిష్టత, మెదడు, దేహ కండరాలు శక్తిని పునరుత్పాదించడం, శారీరికంగా, మానసికంగా ఉత్తేజపరచడంలో పిలాటీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఒత్తిడిని జయించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను పెంపొందింపజేస్తోంది. క్రీడకు తగ్గట్టుగా అవయవాలు బలోపేతం క్రీడాకారులకు ముఖ్యంగా కండరాలపై ప్రభావం పడుతుంది. ఒక్కో క్రీడాకారుడు ఒక్కోచోట కండరాలను ఉపయోగించాల్సిన పరిస్థితి ఉం టుంది. ఈత కొట్టేవారు షోల్టర్స్ వద్ద, రన్నింగ్ చేసే వారు మోకాళ్లు, పాదాల వద్ద, ఫుట్‌బాల్ క్రీడాకారులకు పాదాలు, షూటర్స్‌కు షోల్టర్స్, మోచేతులు...ఇలా రకరకాల భాగాల వద్ద కండరాలను ఆ క్రీడకు తగ్గట్టుగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిలాటీస్తో ఆయా క్రీడాకారుల శరీరంలో లోతుగా ఉన్న కోర్ కండరాలను సైతం పటిష్టం చేసి మెరుగైన ఆటకు దోహదం చేయవచ్చు. అన్ని వయసుల వారికీ.. అన్ని వయస్కుల వారు ఎలాంటి సంకోచం లేకుండా పిలాటీస్ వ్యాయామ విధానాలను అనుసరించవచ్చు. పిలాటీస్ వ్యాయామం చేసేవారిలో కేవలం 10 సెషన్స్‌లోనే శరీర మార్పును గమనిం చవచ్చు. 30 సెషన్స్‌లో కొత్త దేహాన్ని చూడవచ్చని జైనెబ్ అలీ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యా యామాలు చేయాలంటే సర్టిఫైడ్ పొందిన నిపుణుల పర్యవేక్షణలోనే చేయాల్సి ఉంటుందన్నారు. -
బరువు సన్నమార్గాలు
ముందు ‘అన్న’ మార్గాలు చెబుతున్నాం అంటే అన్నం మితంగా తినమని చెబుతున్నాం. ఆ తర్వాత ‘ఉన్న’ మార్గాలు చెబుతున్నాం. అంటే జీవనశైలిలో పాటించడానికి ఉన్న మార్గాలివి. ఆ తర్వాత ‘భిన్న’ మార్గాలు చెబుతున్నాం. అంటే... తగ్గడానికి ఉన్నభిన్న భిన్న మార్గాలన్న మాట. ఈ మార్గాల్లో వీలును బట్టి ఏదైనా అనుసరించవచ్చు. ఎందుకంటే... సన్నబడే మార్గాలన్నీ సన్మార్గాలే! మెరుపుతీగలా ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సాధారణం శరీరాకృతితో ఉండటం సగం విజయం అని చెప్పుకోవచ్చు. కాని అధిక బరువుకు శరీరం చేరుకుంటే, కాయం ఊబకాయంగా మారితే జీవితం మందగిస్తుంది. సమస్యలు సంకెలలుగా మారతాయి. కదలికలకు నిరోధం పడుతుంది. నాణ్యమైన జీవితం అనుభవించడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే బరువు తగ్గాలి అధిక బరువు తగ్గాలంటే జీవనశైలి మార్చుకోవడం, లో–కార్బ్ డైట్, వాటర్ థెరపీ, లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ వంటి మార్గాలు చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉండాల్సిన బరువు కంటే లావు ఉన్నవారికి లేదా స్థూలకాయులుగా ఉన్నవారికి. కాని అపాయకర రీతిలో ఊబకాయం ఉన్నవారు అంటే మార్బిడ్ ఒబేసిటీ ఉన్నవారు ఈ మార్గాలన్నింటినీ గాక బేరియాట్రిక్ సర్జరీ వంటి శస్త్రచికిత్సా పద్ధతులను అవలబించే వీలుంది. ఈ బరువు తగ్గే మార్గాలన్నింటి గురించి ఒక పరిచయం ఇది. ముందుగా సర్జికల్ మార్గాలు చూద్దాం. శస్త్రచికిత్సల ప్రక్రియలివి... మీ బరువు ప్రమాదకరమైన స్థాయి దాటితే... సాధారణ జీవనశైలిలో మార్పులు, ఆహారం, వ్యాయామం వంటి స్వాభావిక ప్రక్రియల ద్వారానే సన్నబడటం చాలా కష్టం. పైగా అత్యధిక బరువు ఉన్నవారు తమ బరువు కారణంగానే ప్రాణాపాయాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివారు బరువు తగ్గడానికి కొన్నిసార్లు కొన్ని శస్త్రచికిత్సలను అనుసరించాల్సి రావచ్చు. అలా చేయకపోతే వారి బరువే వారిని కబళించవచ్చు. ఆ శస్త్రచికిత్సలను బేరియాట్రిక్ సర్జన్స్ / సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లు చేస్తారు. ఆ ప్రక్రియల గురించి స్థూలంగా... లాపరోస్కోపిక్ అడ్జస్టబుల్ గ్యాస్ట్రిక్ బ్యాండ్ మనం తినే ఆహారం అన్నకోశం (స్టమక్)లోకి వెళ్తుంది. ఇది ఒక సంచిలా ఉంటుంది. మన పొట్ట నిండగానే తృప్తి (సేషియేషన్) కలుగుతుంది. నడుముకు బెల్ట్లాంటిదాన్ని పెట్టినట్లుగానే... ఒక శస్త్రచికిత్స ద్వారా అన్నకోశం (స్టమక్)కు కూడా బెల్ట్ వంటి దాన్ని అమర్చుతారు. మనిషి లావును బట్టి ఎంత మోతాదు ఆహారం అవసరమో నిర్ణయించి, దాన్ని బట్టి ఒక బ్యాండ్‌ను అమర్చుతారు. అందుకే దీన్ని అడ్జస్టబుల్ గ్యాస్ట్రిక్ బ్యాండ్ అంటారు. దాని కారణంగా స్టమక్ సైజ్ తగ్గుతుంది. ఫలితంగా కొంత తినగానే పొట్టనిండినట్లయి తృప్తి కలుగుతుంది. అనుకూలతలు/ప్రతికూలతలు: కేవలం గ్యాస్ట్రిక్ బ్యాండ్ అమర్చడం వల్ల ఎలాంటి హానీ ఉండదు. అయితే ఎలాగూ బ్యాండ్ అమర్చుకున్నాం కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ప్రొసిజర్ తర్వాత నిపుణులు సూచించిన విధంగా ఆహార నియమాలు పాటించడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. అలా చేయకపోతే దీనివల్ల ఆశించిన ఫలితాలు ఉండవు. అన్నకోశం తొలగింపు బరువు విపరీతంగా పెరిగి అది ప్రాణాపాయంగా పరిణమించినప్పుడు శస్త్రచికిత్సతో 85శాతం మేరకు అన్నకోశాన్ని (స్టమక్‌ను) తొలగిస్తారు. దాంతో అన్నకోశం కాస్తా ఒక పేగు ఆకృతికి మారుతుంది. అనుకూలతలు / ప్రతికూలతలు: బరువు తగ్గించడానికి ఇది చాలా ప్రభావవంతమైన శస్త్రచికిత్స. అయితే అన్నకోశాన్ని తొలగించాక మళ్లీ మునుపటిలాగే తినడం వల్ల అన్నకోశం మళ్లీ మామూలుగా సంచిలా సాగిపోయే అవకాశం ఉంది కాబట్టి వైద్య నిపుణులు సూచించిన జాగ్రత్తలతో పాటు ఆహార మార్గదర్శకాలన్నీ తప్పకుండా పాటించాలి. ల్యాపరోస్కోపిక్ రూ–ఎన్ వై గ్యాస్ట్రిక్ బైపాస్... ఈ శస్త్రచికిత్స ప్రక్రియతో ఆహారాన్ని అన్నవాహిక నుంచి స్టమక్‌లోకి కాకుండా నేరుగా పేగులకు వెళ్లేలా కలుపుతారు. అంటే... అన్నకోశాన్ని (స్టమక్‌ని) బై–పాస్ చేస్తూ... నేరుగా అన్నవాహికను పేగులతో అనుసంధానిస్తారు. అన్నవాహిక దగ్గర ఒక చిన్న సంచిని రూపొందించేలా ఈ సర్జరీ చేస్తారు. మళ్లీ ఈ సంచి నుంచి పేగుల్లోకి ఆహారం వెళ్లేలా దారి ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియనే అనాస్టమోసిస్ అంటారు. అనుకూలతలు / ప్రతికూలతలు: అన్నకోశాన్ని పూర్తిగా బైపాస్ చేయడం వల్ల ఆపరేషన్ తర్వాత విటమిన్ లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కనిపించేందుకు అవకాశం ఉంది. నీరసంగా అనిపించడం, జుట్టురాలడం, విటమిన్లోపాల కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటివి కనిపించవచ్చు. కాబట్టి ఆ మేరకు విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. లాపరోస్కోపిక్ బిలియో–ప్యాంక్రియాటిక్ డైవర్షన్ (+/– డియోడోనల్ స్విచ్) ఇందులో అన్నకోశంతో పాటు కొంతమేర చిన్న పేగులను కూడా తొలగిస్తారు. ఫలితంగా తీసుకునే ఆహారం తగ్గుతుంది. అలాగే జీర్ణమయ్యే ఆహారమూ గణనీయంగా తగ్గిపోతుంది. అయితే ఈ శస్త్రచికిత్సలో కొంతమేర పేగులను తొలగించి ఆహారమార్గాన్ని కుదిస్తారు కాబట్టి దానికి అనుగుణంగా జీర్ణస్రావాలు పొట్టలోకి కాకుండా నేరుగా పేగుల్లోకి వచ్చేలా శస్త్రచికిత్స నిర్వహిస్తారు. లైపోసక్షన్ శరీరంలో కొవ్వు పేరుకోవడం అన్నది ఆయా వ్యక్తుల జన్యువుల ఆధారంగా కొన్ని కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాల్లో జరుగుతుంటుంది. ఉదాహరణకు కొందరికి పొట్ట, మరికొందరికి తొడలు, పిరుదులు వంటి భాగాల్లో ఇలా కొవ్వు పేరుకుంటుంటుంది. వ్యక్తుల్లో వారి వారి వ్యక్తిగత శరీర నిర్మాణాన్ని అనుసరించి, చాలా ఎక్కువగా కొవ్వు పేరుకున్న ప్రదేశం నుంచి కొవ్వును సక్షన్ ప్రక్రియ ద్వారా లాగేయడాన్ని లైపోసక్షన్ అంటారు. అనుకూలతలు/ప్రతికూలతలు: ఈ ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండదు. వ్యక్తుల బరువును బట్టి, వారిలో కొవ్వు పేరుకున్న ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మోతాదుకు మించి ఒకేసారి ఎక్కువ కొవ్వును తొలగించడం అన్నది కొందరిలో తీవ్రమైన ప్రాణాపాయం కలిగించవచ్చు. కొవ్వు తొలగించాక కొంతకాలం ఒంటి నొప్పులు కొనసాగుతాయి. (అయితే కొంతకాలం తర్వాత తగ్గిపోతాయి.) మరో ప్రతికూల అంశం ఏమిటంటే... ఒకసారి కొవ్వును తొలగించాక వదులైన శరీర భాగాలు సంచుల్లాగా వేలాడుతుంటాయి. అవి మామూలుగా శరీరాన్ని అంటుకుని ఉండేలా చేయడానికి మూడు నెలలకు పైగా బాగా బిగుతైన దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ఒకసారి కొవ్వు తొలగించాక బరువు తగ్గినప్పటికీ, ఒకవేళ ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించకుండా, క్రమశిక్షణ లేకుండా మళ్లీ ఎప్పటిలాగే ఆహారపు అలవాట్లు కొనసాగించడమూ, వ్యాయామం చేయకపోవడం వంటివి చేస్తుంటే... మళ్లీ మునపటిలాగే బరువు పెరిగిపోతారు. అంటే ఇది శాశ్వతమైన పరిష్కారం కాదన్నమాట. ఇంతవరకు చెప్పినవన్నీ ప్రమాదకరమైన స్థితిలో బరువు పెరిగినప్పుడు పాటించే పద్ధతులు. అయితే అసలు అంతవరకు రాకుండా కొన్ని పద్ధతులు పాటించడం వల్ల కూడా ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు. ఆ పద్ధతులూ చూద్దాం. జీవనశైలి మార్పులు (లైఫ్‌స్టైల్ టెక్నిక్స్) జీవనశైలి మార్చుకొని బరువు తగ్గడం అంటే కడుపు మాడ్చుకోవడం కాదు... కడుపునిండా తింటూనే లావెక్కకుండా చూసుకోవడం. ఇది దాదాపు నిరపాయకరమైన పద్ధతి. క్రమశిక్షణ ఉన్నవారు క్రమం తప్పకుండా పాటిస్తే చాలావరకు మేలు జరుగుతుంది. అంటే ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఉదాహరణకు కొవ్వులు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ప్రోటీన్లపై ఆధారపడటం, అన్ని పోషకాలు అందేలా తక్కువ క్యాలరీలు ఉండే సమతులాహారం తీసుకోవడం వంటివి చేయాలి. అలా తిన్న ఆహారంతో సమకూరే అదనపు క్యాలరీలను లెక్కించడం, తగ్గించడం అవసరం. అలా తగ్గించడానికి వ్యాయామంతో క్యాలరీలను దహించడం, కొవ్వును కరిగించడం వంటివి చేయాల్సి ఉంటుంది. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, కాయగూరల్లో పోషకాలు ఎక్కువ పాళ్లలో ఉంటాయి. వాటిని భుజించాలి. నీటిపాళ్లు ఎక్కువగా ఉండే కాయగూరలు తింటే పోషకాలు భర్తీ అవడమే కాకుండా... వాటిలోని నీరు త్వరగా కడుపు నింపేలా చేస్తుంది. అందుకే పోషకాలు పుష్కలంగా అందడంతో పాటు కడుపు త్వరగా నిండి తృప్తి కలుగుతుంది తృప్తి కలగడం వల్ల ఎంత ఆహారం కావాలో అంతే తింటారు. బరువు తగ్గడంలో భాగంగా గుడ్డు తినడం కూడా మంచిదే. గుడ్డులో ల్యూసిన్ అనే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ఉంది. శాకాహారం విషయానికి వస్తే గుమ్మడిగింజలు, వేరుశెనగల్లో ల్యూసిన్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి నేరుగా ఉపయోగపడుతుంది. మాంసాహారాన్ని ఇష్టపడేవారు చేపలు తినడం చాలా మంచిది. చేప మాంసంలో కొవ్వులు దాదాపు సున్నా (జీరో). మసాలాలను తగ్గించాలి. ఇక పండ్లలో తక్కువ చక్కెర ఉండే పండ్లు మంచివి. ఇక వ్యాయామంలో భాగంగా ఒళ్లు పూర్తిగా బడలిక చెందనివిధంగా, నీరసపడిపోకుండా మీరు భరించగలిగే పరిమితిలో నడక (బ్రిస్క్ వాక్) చేయడం అన్నింటికన్నా ఉత్తమమైన వ్యాయామం. నెమ్మదిగా పరుగు (స్లో జాగింగ్) వంటి వ్యాయామాలు చేయడం చాలా మేలు చేసే అంశమే. అనుకూలతలు / ప్రతికూలతలు: బరువు తగ్గడానికి అనుసరించే వాటిల్లో ఈ పద్ధతులు చాలా ఆరోగ్యకరం. ప్రతికూలతలు చాలా తక్కువ. ఇక మోకాళ్ల నొప్పులు ఉన్నవారు శరీర భారం ఫీలవ్వని ఈత లేదా మోకాళ్లపై భారం పడని సైక్లింగ్ వంటి వ్యాయామాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. లో కార్బ్ డైట్ ఇందులో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేసి, చాలా తక్కువ మోతాదులో శక్తిని వెలువరించే పిండిపదార్థాలను తీసుకుంటారు. అంటే రిఫైన్ చేసిన పిండిపదార్థాలకు బదులుగా, అంతగా పాలిష్ చేయని పొట్టు ఉన్న గింజలను తీసుకోవడం, కొన్నిసార్లు కార్బోహైడ్రేట్లను దాదాపుగా తగ్గించడం వంటివి అన్నమాట. అయితే దీన్ని నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఇందులోనూ అనేక డైట్ ప్రక్రియలు ఉన్నాయి. ప్రతికూలతలు: ఒక్కోసారి శరీరానికి శక్తిని అందించే కార్బోహైడ్రేట్లు గణనీయంగా తగ్గించడం వల్ల చక్కెర పాళ్లు పడిపోయి సదరు స్థూలకాయుడిని ప్రమాదకరమైన పరిస్థితిలోకి (హైపోగ్లైసీమియా స్థితికి) తీసుకెళ్లవచ్చు. దాన్ని తప్పించాక... ఒకసారి స్థూలకాయులు మళ్లీ మామూలు స్థితికి వచ్చాక మళ్లీ మొదటిలాగే సాధారణ ఆహారపు అలవాట్లను కొసాగించే అవకాశాలు ఉంటాయి. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికే రావచ్చు. వాటర్ థెరపీ ఒక అధ్యయనం ప్రకారం భోజనానికి అరగంట ముందుగా... పూటకు అరలీటరు నీళ్లు తాగితే జీవక్రియల వేగం (మెటబాలిజం రేటు) 30 శాతం పెరుగుతుంది. ఈ అధ్యయానం ‘ద జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజమ్’ అనే వైద్యవిజ్ఞాన జర్నల్‌లో ప్రచురితమైంది. దీన్నిబట్టి ఒక వ్యక్తి తాను తీసుకోవలసిన దాని కంటే ఒక రోజులో 1.5 లీటర్ల నీళ్లు ఎక్కువగా తాగితే అతడు క్యాలరీలను ఎక్కువగా ఖర్చుచేయగలడు. ఇలా చేస్తే ఏడాదిలో దాదాపు రెండున్నర కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉంది. అనుకూలతలు / ప్రతికూలతలు : ఎక్కువ నీళ్లు తాగడం వల్ల తీసుకునే ఆహారం పరిమాణం తగ్గుతుంది. బరువు పెరగకుండా ఉండటానికి ఈ అంశం దోహదపడుతుంది. ఇదొక్కటే అనుకూలత. ఇక ప్రతికూలతల విషయానికి వస్తే ఇది నమ్మకమైన ప్రక్రియ కాదు. ఎందుకంటే... నీళ్లు కొవ్వులను నేరుగా కరిగించలేవు. అందువల్ల కొవ్వు పేరుకోవడంతో పెరిగే బరువు అన్నది వాటర్ థెరపీతో తగ్గేందుకు అవకాశమే లేదు. ఇవీ స్థూలంగా బరువు తగ్గడానికి ఉన్న కొన్ని మార్గాలు, వాటితో ప్రయోజనాలు, ప్రతికూలతలు. ఇవన్నీ కేవలం ప్రాథమిక పరిజ్ఞానం కోసం మాత్రమే. వీటిని కొన్నింటిని నేరుగా ఆచరించడం ప్రమాదకరం కావచ్చు కూడా. ఉదాహరణకు విచక్షణ రహితంగా చేసే డైటింగ్, కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవడం వంటివి. ఇక బరువు తగ్గడానికి కొందరు కొన్ని ఫ్యాట్ బర్నింగ్ ట్యాబ్లెట్లు, మూలికలు, హెర్బ్స్ కూడా ఇస్తుంటారు. ఇవి ఎలాంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు. వాటి వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. గమనిక: ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారు ముందుగా తప్పనిసరిగా మొదట ఫిజీషియన్‌ను సంప్రదించాలి. ఇక బరువు అన్నది ప్రాణాంతకంగా మారినప్పుడే (మార్బిడిటీకి దారితీసినప్పుడే) బేరియాట్రిక్ సర్జన్లు బరువు తగ్గే శస్త్రచికిత్సలను చేస్తారు. అంతే తప్ప బరువు తగ్గాలనుకునే ప్రతివారికీ అవే మార్గాలు కావని గుర్తుంచుకోవాలి. పాఠకులకు మనవి: ఈ కథనంలో విపులంగా చర్చించని కొన్ని అంశాలతో పాటు అనేక ఆహార విధానాలను రాబోయే వారాలలో విపులంగా ఇవే పేజీలలో చూడవచ్చు. కూల్స్కల్ప్టింగ్ కొన్ని చోట్ల ఉన్న కొవ్వు ఎంతగా ప్రయత్నించినా కరగదు. దాన్ని ఎంతకూ లొంగని కఠినమైన కొవ్వుగా పేర్కొంటారు. అలాంటి కొవ్వు కణాలను చాలా ఎక్కువగా చల్లబరచడం ద్వారా చనిపోయేలా చేస్తారు. ఇలా కొవ్వును నియంత్రితమైన రీతిలో (కంట్రోల్డ్‌గా) ఘనీభవించేంతగా చల్లబరచడం ద్వారా లాగేసే నాన్ సర్జికల్ ప్రక్రియే కూల్స్కల్ప్టింగ్. ఇలా చేయడం వల్ల అక్కడి కొవ్వు కణాలు నిర్వీర్యమై అచేతనమవుతాయి. దాంతో అవి ముడుచుకుపోతాయి. ఈ దశలో ఈ కొవ్వుకణాలు సహజ ప్రక్రియలో భాగంగా బయటకు విసర్జితమవుతాయి. ఇలా చేసేందుకు ప్రత్యేకమైన కూల్ స్కల్ప్టింగ్ యంత్రాన్ని వాడతారు. ప్రతికూలతలు: ఇది చాలా సుఖవంతమైన ప్రక్రియలా అనిపించినా కొవ్వు తొలగించిన ప్రాంతంలో బాగా లాగినట్లుగా అనిపించడం, నొప్పి, తాత్కాలికంగా ఆ ప్రదేశం ఎర్రబారడం, కొన్నిసార్లు చిన్న గాయంలా అనిపించడం కూడా జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియలో కొవ్వుకణాలు అంతమైపోవడం వల్ల చాలా సందర్భాల్లో మళ్లీ కొవ్వు పేరుకోకపోవచ్చు. ఒక్క టీకాతో ఊబకాయం పోతుందా? వినడానికి కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే ఇది. ఊబకాయాన్ని తగ్గించడం చిటికెలో పని అంటున్నారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు కొందరు. ఆరోగ్యకరమైన బరువున్న వారితో పోలిస్తే ఊబకాయుల్లో అడినోవైరస్ – 36 అనే వైరస్ నాలుగు రెట్లు ఎక్కువగా కనిపిస్తోందని.. ఈ వైరస్‌ను తొలగిస్తే బరువు పెరక్కుండా అడ్డుకోవచ్చునన్నది వీరి వాదన. ఎలుకల్లో తాము కొన్ని ప్రయోగాలు చేసినప్పుడు పెరిగిన ఒళ్లు బరువులో 15 శాతానికి అడినోవైరస్ – 36 కారణమని తెలిసినట్లు వీరు చెబుతున్నారు. కొవ్వు కణాలను చీకాకుపెట్టి అవి వాచిపోయేలా చేయడం.. చనిపోకుండా అడ్డుకోవడం అనే రెండు పనుల ద్వారా ఈ వైరస్ ఒళ్లు పెరిగేందుకు కారణమవుతున్నట్లు యూనివర్శిటీ ఆఫ్ మసాచూసెట్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. విన్కాన్సిన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ రిచర్డ్ అట్కిన్సన్ ఇప్పటికే ఓ వ్యాక్సిన్‌కు పేటెంట్ కూడా సంపాదించగా.. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు తమదైన వ్యాక్సిన్‌తో జరిపిన పరిశోధనలు విజయవంతమయ్యాయి కూడా. యువకులకు ఈ వ్యాక్సీన్ ఇవ్వడం ద్వారా వాళ్లు బరువు పెరక్కుండా అడ్డుకోవచ్చునని తద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఇంకొందరు శాస్త్రవేత్తలు మాత్రం వ్యాక్సిన్‌ను వాణిజ్యస్థాయిలో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ముందుగానే మరిన్ని పరిశోధనలు నిర్వహించాలని... వైరస్ ద్వారానే ఒళ్లు పెరుగుతున్నట్లు రూఢి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒక అపోహ: తల్లిపాలు పుష్కలంగా తాగిన పిల్లలు పెద్దయ్యాక ఊబకాయులు కారు ఒక వాస్తవం: కొంత కాలం క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా ఈ మాట ప్రకటించడంతో అందరూ ఇది వాస్తవమే అనుకున్నారు. అయితే తరువాతి కాలంలో ఇదే సంస్థ తమ ప్రకటనలో వాస్తవం కొంతేనని, అధ్యయనం జరిగిన తీరులో లోపం కారణంగా ఫలితం అలా వచ్చిందని స్పష్టం చేసింది. తల్లిపాలకు, ఊబకాయానికి మధ్య స్పష్టమైన సంబంధం ఏదీ ఇప్పటివరకూ కనిపించలేదని ఇంకో విస్తృత అధ్యయనం ఆధారంగా తేల్చింది. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. ఊబకాయులు కాకుండా నిరోధిస్తుందా లేదా అన్నది పక్కనపెడితే తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు మాత్రం బోలెడు. అన్ని లాభాలు ఏకరవు పెట్టాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని వారు అంటున్నారు. డాక్టర్ వి.సుధాకర్ ప్రసాద్ సీనియర్ కన్సల్టెంట్, కాస్మటిక్ సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ -
అలర్జీతో ఆయాసం... వ్యాయామం చేయడం ఎలా?
పల్మునాలజీ కౌన్సెలింగ్ పీరియడ్స్ సమయంలో శ్వాస సరిగా ఆడటం లేదెందుకు? నా వయసు 36 ఏళ్లు. గృహిణిని. నాకు పీరియడ్స్ సమయంలో సరిగా శ్వాస అందడం లేదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? – ఎమ్. కవిత, విశాఖపట్నం రుతుక్రమం వచ్చే సమయం మహిళల్లో ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మహిళల భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. దాంతో కొన్నిసార్లు అటు శరీరక, ఇటు మానసిక సమస్యలు కనిపించవచ్చు. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఉన్న సమస్యను కెటామెనియల్ ఆస్తమాగా చెప్పవచ్చు. కెటామెనియల్ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి. పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు. ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాన్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం. ఇక మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి. నా వయసు 33. నాకు డస్ట్ అలర్జీ ఉంది. దుమ్ము అంటే సరిపడదు. దాంతో ఇటీవల నేను వ్యాయామం చేయదలచినప్పుడల్లా ఆయాసం వస్తోంది. ఫిట్నెస్ కోసం వ్యాయామం చేయాలనుకున్నా ఇది నాకు ప్రతిబంధకంగా ఉంటోంది. దయచేసి నేను వ్యాయామం చేయడానికి అవసరమైన సలహా ఇవ్వగలరు. – ఎమ్డీ గియాసుద్దిన్, కర్నూలు వ్యాయామం ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలో బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడుతుంది, అదే సమయంలో ఆ గాలికి తేమ సమకూరుతుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఈ చల్లగాలి వల్ల ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే మార్గాలన్నీ సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... పొడి దగ్గు వస్తుండటం ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙పిల్లికూతలు వినిపించడం ∙వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ∙వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేసినా... 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా) వచ్చినప్పుడు అప్పటికి ఆపేసినా... వ్యాయామాన్ని పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు ఉదాహరణకు జలుబు, ఫ్లూ, సైనసైటిస్ వంటివి ఆస్తమాను మరింత ప్రేరేపిస్తాయి. ఇలా నలతగా ఉన్న సమయాల్లో వ్యాయామం చేయకూడదు. ఆస్తమా ఉన్నవారు త్వరగా ముగిసే ఆటల్లాంటివి... అంటే వాలీబాల్, బేస్‌బాల్, వాకింగ్ వంటివి చేయాలి. అంతేగానీ దీర్ఘకాలం పాటు కొనసాగుతూ, దూరాలు పరుగెత్తాల్సి వచ్చే సాకర్, బాస్కెట్‌బాల్, హాకీ వంటివి ఆడకూడదు. అయితే నీరు వేడిగా ఉన్న సమయాల్లో ఈతను అభ్యసిస్తూ, క్రమంగా వ్యవధిని పెంచుకుంటూ పోతే వ్యాయామానికి వ్యాయామం సమకూరడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా తగ్గుతుంది. అసలు సిగరెట్ మానడానికి ఈ–సిగరెట్ మంచిదేనా? నా వయసు 46. విపరీతంగా సిగరెట్లు తాగుతాను. స్మోకింగ్ మానడం సాధ్యం కావడం లేదు. ఎలక్ట్రానిక్ సిగరెట్ (ఈ–సిగరెట్)ను ప్రయత్నించమని స్నేహితులు చెబుతున్నారు. ఈ–సిగరెట్ వాడడం సురక్షితమేనా? – ఆర్. గౌతమ్, హైదరాబాద్ ఎలక్ట్రానిక్ సిగరెట్లు (ఈ–సిగరెట్స్) అన్నీ ఒకేలా పని చేస్తాయి. అందులో ఒక బ్యాటరీ ఉంటుంది. దాని కాటరిడ్జ్ (మందు నింపే బోలు ప్రదేశం)లో నికోటిన్ ఉంటుంది. మామూలు సిగరెట్‌కూ, ఈ–సిగరెట్‌కూ తేడా ఒక్కటే. ఈ–సిగరెట్లో పొగాకు ఉండదు. అంతే. అయితే కేవలం పొగాకు మాత్రమే గాక... సాధారణ సిగరెట్లో ప్రమాదకరమైన రసాయనాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండి, అవన్నీ ఆరోగ్యానికి చేటు చేస్తాయని నిరూపితమైంది. ఈ–సిగరెట్లో సాధారణ సిగరెట్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాల్లో కొన్నైనా ఉంటాయి. నికోటిన్ అనే పదార్థం రెండింటిలోనూ ఉంటుంది. తనకు బానిస అయ్యేలా చేసుకోవడానికి నికోటిన్ ప్రతీతి. మందుల భద్రత విషయంలో ప్రామాణికమైన అమెరికాలోని అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ విశ్లేషణల ప్రకారం... ఈ–సిగరెట్‌లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలూ, విషపూరిత రసాయనాలూ ఉన్నాయి. ఈ–సిగరెట్లో కాటరిడ్జ్లో డీ–ఇథైల్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల కాలుష్యాలు సైతం ఈ–సిగరెట్ ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. ఈ పొగను లోపలికి పీల్చినప్పుడు అది మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇన్ఫెక్షన్లను (క్రానిక్ ఇన్ఫ్లమేషన్ను) కలిగిస్తుంది. పొగ పీల్చడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఈ–సిగరెట్ పొగ అయినా సరే... బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండెజబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ–సిగరెట్ సురక్షితమేమీ కాదు. పైగా ఏ సిగరెట్ అయినప్పటికీ అందులోని పొగ వల్ల సిరలు, ధమనులు చాలా ఎక్కువగా ధ్వంసమవుతాయి. ఈ పరిణామమే ఆ తర్వాత గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ–సిగరెట్‌లోని పొగలో మామూలు సిగరెట్‌తో పోలిస్తే రసాయనాల సంఖ్య కొంచెం తగ్గుతుండవచ్చు. అంతమాత్రాన అది మామూలు సిగరెట్ కంటే సురక్షితం అని చెప్పడానికి ఆస్కారం లేదు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్‌తో వచ్చే అన్ని రకాల దుష్పరిణామాలూ ఈ–సిగరెట్‌తోనూ వస్తాయి. ఈ–సిగరెట్‌లోనూ ఉండేది నికోటినే కాబట్టి దానికి బానిసై మళ్లీ మీరు ఈ–సిగరెట్‌కు అలవాటు పడతారు. మీరు సిగరెట్ వదిలేయదలిస్తే... ఒక్కసారిగా వదిలేయడమే మార్గం. మానేయగానే కాస్త చిరాకు, కోపం, నిస్పృహ, అస్థిమితంగా ఉండటం వంటి కొన్ని తాత్కాలిక లక్షణాలు కనిపించినా, దీర్ఘకాలంలో సిగరెట్ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాల సంఖ్య చాలా ఎక్కువ. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
రోజుకు అరగంట వ్యాయామం మేలు!
రోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది. బాగానే ఉందిగాని.. ఎన్ని గంటలు చేయాలి? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకే సమాధానం కనుక్కునేందుకు అమెరికా సంస్థ ఒక అధ్యయనం చేసింది. దీని ప్రకారం.. 18 – 64 ఏళ్ల మధ్య వయస్కులు వారానికి కనీసం 150 నిమిషాల పాటు ఓ మోస్తరు తీవ్రత ఉండే గుండె సంబంధిత వ్యాయామాలు చేస్తే పూర్తిస్థాయి ఫలితాలు అందుకోవచ్చునని తేల్చింది. వైద్య పరమైన సమస్యలేని వారికి ఈ మాత్రం వ్యాయామం సరిపోతుందని, ఇందులో సగం కాలం అంటే వారానికి 75 నిమిషాలపాటు కొంచెం శ్రమతో కూడిన వ్యాయామం చేసినా ఓకే అని ఆ సంస్థ చెబుతోంది. ఓ మోస్తరు వ్యాయామం జాబితాలో వేగంగా నడవడం, ఎత్తుపల్లాలు పెద్దగా లేని చోట సైక్లింగ్, ఇంకొకరితో కలిసి టెన్నిస్ ఆడటం వంటివి ఉంటే.. శ్రమతో కూడిన వ్యాయామం జాబితాలో జాగింగ్, పరుగులు, ఈత, ఎత్తుపల్లాలను అధిగమిస్తూ సైక్లింగ్ చేయడం, బాస్కెట్ బాల్, సింగిల్‌గా టెన్నిస్ ఆడటం వంటివి ఉన్నాయి. వీటితోపాటు శక్తిని పెంచే వ్యాయామాలు ఒకటిరెండు చేయాల్సి ఉంటుంది. అరవై ఏళ్లు పైబడినవారు మరింత ఎక్కువకాలం ఎక్సర్సైజులు చేయడం మేలని సూచిస్తున్నారు. -
కడుపు నొప్పి తగ్గాలంటే...
రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పి భరించ లేకుంటే చిన్న చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు.ఈ సమయంలో నీళ్లు మామూలుకంటే ఎక్కువగా తాగాలి. హెర్బల్ టీ తాగినా కూడా ఫలితం ఉంటుంది. పుదీన, అల్లం వేసుకుని టీ తాగినా, మరే ఇతర వేడి పానీయం తాగినా ఈ నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది ∙వేడి నీటిలో చిన్న టవల్ ముంచి కింది పొట్ట మీద వేస్తే ఉపశమనం ఉంటుంది తేలికపాటి ఎక్సర్సైజ్లు, యోగసాధన చేస్తే రక్త ప్రసరణ క్రమబద్ధమవుతుంది, శారీరక వ్యాయామంతో ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది కండరాల మీద ఒత్తిడిని తగ్గించి హాయినిస్తుంది ∙పెల్విక్ కండరాల మీద ఒత్తిడి కలిగి ఎక్సర్సైజ్ చేస్తే కండరాలు వదులై నొప్పి కలగదు ∙ఈ సమయంలో రోజూ పడుతున్న శ్రమ తగ్గించుకోవాలి. వీలయితే కొంత సేపు విశ్రాంతిగా పడుకుంటే మంచిది. ఉదయం కాని సాయంత్రం కాని అరగంట సేపు వాకింగ్ చేస్తే నొప్పికి దూరం కావచ్చు. -
సూపర్ బ్యాలెన్స్
‘వ్యాయామం అంటే శరీరాన్ని బలంగా తయారు చేసుకోవడమే కాదు క్రమశిక్షణను అలవరచుకోవడం’ అని ఓ సందర్భంలో సమంత అన్నారు. అన్నట్లుగానే వర్కౌట్స్ చేయడంలో ఆమె రాజీ పడటంలేదు. ఎంతలా వ్యాయామాలు చేస్తారంటే ఎంత బరువైనా అవలీలగా మోసేంత. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 కేజీల బరువు ఎత్తారు. ఇక్కడున్న ఫొటోలో గమనించవచ్చు. అంత బరువును మోయాలంటే బాడీని ఎంతో బ్యాలెన్స్ చేయాలి, అలాగే చేశారు సమంత. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ఆమె నటించిన ‘రంగస్థలం, మహానటి, అభిమన్యుడు’ చిత్రాలు రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ చిత్రాలు ‘సీమరాజా, సూపర్ డీలక్స్’, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘యు టర్న్’ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అలాగే పెళ్లి తర్వాత భర్త నాగచైతన్యతో కలిసి ఆమె నటించబోయే సినిమా ఈ నెల 23న స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి శివనిర్వాణ దర్శకత్వం వహిస్తారు. ఇలా ఓన్లీ వర్కౌట్స్లోనే కాదు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ సమంత సూపర్ బ్యాలెన్స్ చూపిస్తున్నారు. ∙వెయిట్‌లిఫ్టింగ్ చేస్తూ... -
కొలెస్ట్రాల్‌ను అదుపులో పెట్టుకోవడం ఎలా?
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నా వయసు 47 ఏళ్లు. ఇటీవల ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే రక్తంలో పెరిగిందని రిపోర్డు వచ్చింది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బులు వస్తాయని చాలామంది అంటున్నారు. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? కొలెస్ట్రాల్‌ను ఎలా అదుపు చేసుకోవాలో సలహా ఇవ్వండి. – డి. సరస్వతి, కందుకూరు కొలెస్ట్రాల్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఇందులోని ఎల్డీఎల్ అనే రకాన్ని చెడుకొలెస్ట్రాల్గా చెబుతారు. ఎందుకంటే సాధారణంగా రక్తనాళాలు ఒక మంచి రబ్బర్ ట్యూబ్‌లా ఎటుపడితే అటు ఒంగేలా మంచి ఎలాస్టిసిటీతో ఉంటాయి. కానీ ఈ ఎల్డీఎల్ అనేది రక్తనాళంలోపల గారలాగా పట్టేస్తూ ఉంటుంది. దాంతో ఎటుపడితే అటు తేలిగ్గా ఒంగగలిగే రక్తనాళం బిరుసుగా మారడమేగాక లోపలి సన్నబారుతుంది. ఈ కండిషన్‌ను అథెరోస్కి›్లరోసిస్ అంటారు. దీని వల్ల గుండెకు రక్తం అందక గుండెపోటు రావచ్చు. కానీ ఇందులోనే మరో రకం కొలెస్ట్రాల్ ఉంది. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఇది మంచి కొలెస్ట్రాల్ అన్నమాట. ఇది రక్తనాళంలోపల గారలా పేరుకుపోతున్న చెడుకొలెస్ట్రాల్‌ను తొలుచుకుంటూ, ఒలుచుకుంటూ పోతుంటుంది. అంటే రక్తనాళాల్లోని పూడికను తొలగించే పనిచేస్తుందన్నమాట. అందుకే హెచ్‌డీఎల్ పాళ్లు పెరుగుతున్నకొద్దీ గారలా పేరుకునే చెడుకొలెస్ట్రాల్ చెక్కినట్లుగా తీసేస్తుంటుంది. అందుకే ఇది గుండెపోటు రాకుండా చూసే కొలెస్ట్రాల్ అన్నమాట. ఇక కొవ్వుల్లో మరో రకం కూడా ఉన్నాయి. వాటిని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. మనం తిన్న ఆహారంలో ఎక్కువ శక్తిని నిల్వ చేసుకునే ప్రక్రియలో ఈ రకం కొవ్వు పుడుతుంది. అది మళ్లీ రక్తనాళాలు సన్నబడటానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఇది ప్రమాదకరమైనది. ఇది కేవలం ఆహారపు శక్తిని నిల్వచేసే సమయంలోనే గాక... మన శరీర బరువు పెరిగినా, స్థూలకాయం వచ్చినా, తగినంత శారీరక శ్రమ చేయకపోయినా, సిగరెట్లు, మద్యం తాగినా పెరుగుతాయి. కాబట్టి ఈ కొవ్వు మంచిది కాదు. ఇక మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకునేందుకూ, మన గుండెను హార్ట్ఎటాక్ రిస్క్‌నుంచి తప్పించుకునేందుకు చేయాల్సిన పని ఏమిటంటే... మనం తీసుకునే ఆహారంలో ఎల్డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూసుకోవాలి. అలాగే హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలి. చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించుకొని, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవాలంటే కరిగే పీచు ఎక్కువగా ఉండే సోయాప్రోటీన్ల వంటి ఆహారంతో పాటు వారానికి కనీసం 150 నిమిషాలు (రోజుకు అరగంట చొప్పున ఐదు రోజులు) వ్యాయామం చేయాలి. దీనివల్ల మంచి కొలెస్ట్రాల్ అయినా హెచ్‌డీఎల్ పెరుగుతుంది. అదే వ్యాయామం చెడుకొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్‌లన్నీ ఒకేలాంటివి కావని గ్రహించడంతో పాటు... వ్యాయామం చేయడం అనే ఒకే చర్య అటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని గ్రహించండి. నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌ను. నాకు రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదు. ఒళ్లు అలిసేలా వ్యాయామం చేయమనీ, దాంతో బాగా నిద్రపడుతుందని కొందరు ఫ్రెండ్స్ చెబుతున్నారు. అయితే వ్యాయామం చేసేవాళ్లకు అంతగా నిద్రపట్టదని మరికొందరు చెబుతున్నారు. నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఏది నిజమో చెప్పండి. – ఆర్. కౌశిక్, హైదరాబాద్ మీరు చెప్పిన రెండు అంశాలూ నిజమే. నిద్రకు ఉపక్రమించబోయే మూడు గంటల ముందుగా వ్యాయామం అంత సరికాదు. అలా చేస్తే నిద్రపట్టడం కష్టమే. అయితే రోజూ ఉదయంగానీ లేదా ఎక్సర్‌సైజ్‌కూ, నిద్రకూ చాలా వ్యవధి ఉండేలా గానీ వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఒళ్లు అలిసేలా వ్యాయామంతో ఒళ్లెరగని నిద్రపడుతుంది. ఉదయం చేసే వ్యాయామంతో ఒత్తిడి నుంచి దూరమవుతారు. అయితే ఉదయం వేళ చేసే వ్యాయామం పగటి వెలుగులో అయితే మరింత ప్రభావపూర్వకంగా ఉంటుంది. మీరు ఉదయం వేళలో వ్యాయామం చేయలేకపోతే అది సాయంత్రం వేళ అయితే మంచిది. మీ రోజువారీ పనుల వల్ల అప్పటికి మీ శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరిగి ఉంటుంది. ఇక నిద్రవేళకు మన శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంటుంది. కానీ వ్యాయామంతో మళ్లీ శరీరాన్ని ఉత్తేజపరచడం జరుగుతుంది. ఇక కార్డియోవాస్క్యులార్ వ్యాయామాల వల్ల గుండె స్పందనల వేగం, రేటు పెరుగుతాయి. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. వీటన్నింటి ఉమ్మడి ప్రభావాల వల్ల నిద్ర తగ్గుతుంది. అంతేకాదు... వ్యాయామం ముగిసిన 20 నిమిషాల తర్వాతగానీ గుండె కండరాల రక్తం పంపింగ్ ప్రక్రియ సాధారణ స్థితికి రాదు. అందుకే వ్యాయామానికీ, నిద్రకూ మధ్య వ్యవధి ఉండేలా చూసుకోవాలన్న మాట. ఇక స్ట్రెచింగ్ వ్యాయామాలు, బలాన్ని పెంచుకనే స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ తరహా వ్యాయామాలూ శరీరానికి మేలు చేసినా... అవేవీ కార్డియోవాస్క్యులార్ వ్యాయామాలకు సాటిరావు. యోగా ప్రధానంగా తనువునూ, మనసునూ రిలాక్స్ చేసే ప్రక్రియ. మీ ఫ్రెండ్స్‌లో కొందరు చెప్పినట్లుగా దీర్ఘకాలిక నిద్రలేమికి వ్యాయామం విరుగుడు. అందుకే మరీ తీవ్రంగా (విగరస్‌గా) కాకుండా... మరీ చేసీచెయ్యనట్లు (మైల్డ్)గా కాకుండా... మాడరేట్ ఎక్సర్సైజ్ చేయండి. కంటినిండా నిద్రపోండి. వాకింగ్, జాగింగ్, జంపింగ్, స్విమ్మింగ్, టెన్నిస్ ఆడటం, డాన్స్ చేయడం లాంటి ఏ ప్రక్రియ అయినా వ్యాయామానికి మంచిదే. అయితే మీకు గుండెజబ్బులూ, స్థూలకాయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామాలు మొదలుపెట్టే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, మీకు తగిన వ్యాయామాలు సూచించమని అడగడం మేలు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఆటలా వ్యాయామం...
ఆడుతు పాడుతు పనిచేస్తూంటే అలుపు సొలుపు తెలియదట. మరి ఇది కేవలం పని విషయానికి మాత్రమేనా? వ్యాయామానికి కూడా వర్తిస్తుందా? అయోవా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వెబ్ ఆధారిత ఆటతో ఈ అంశాన్ని పరీక్షకు పెట్టారు. స్మార్ట్ఫోన్తోపాటు ఫిట్‌బిట్ గాడ్జెట్ ఉన్న వారెవరైనా ఈ గేమ్ ఆడవచ్చు. బద్దకిష్టులను కూడా వ్యాయామం చేసేలా చేయవచ్చునని వీరు అంటున్నారు. శరీరానికి కొద్దోగొప్పో పని కల్పించకపోతే ఊబకాయం వచ్చేసి మధుమేహం మొదలుకొని కేన్సర్ల వరకూ అనేక వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నది తెలిసిన విషయమే. వెబ్ గేమ్ ద్వారా వ్యాయామాన్ని చేసేందుకు చాలామంది ఆసక్తి చూపారని.. తొలి పైలెట్ పరీక్షల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని లూకాస్ కార్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ ఆట ఆడటం మొదలుపెట్టిన తరువాత ఒక్కో వ్యక్తి సగటున 2200 అడుగులు ఎక్కువ వేశాడని ఇది ఒక మైలు నడకకు సమానమని చెప్పారు. మ్యాప్ట్రెక్ పేరున్న ఈ గేమ్.. వినియోగదారులకు తరచూ చిన్న చిన్న సవాళ్లు విసురుతూ ఎక్కువ శ్రమ పడేలా చేస్తుందని, ఇరుగుపొరుగు వారి వ్యాయామం తీరుతెన్నులను కూడా కలిపడం ద్వారా గేమ్ మరింత ఆసక్తికరంగా మారిందని కార్ వివరించారు. వారం రోజులు ఒక యూనిట్‌గా చేసి నడకకు సంబంధించిన సవాళ్లు విసిరి ఫలితాలను విశ్లేషించడం ద్వారా తాము ఈగేమ్ సత్ఫలితాలిస్తున్నట్లు నిర్ధారించినట్లు చెప్పారు. -
పెద్దలూ ఒళ్లువంచాల్సిందే..
లండన్ : దీర్ఘకాలం ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే మధ్యవయస్కుల నుంచీ వృద్ధులూ ఓ మాదిరి కఠిన వ్యాయామాలు చేయాల్సిందేనని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. రోజుకు పదివేల అడుగులు నడవడం కూడా సరిపోదని పెద్దలు దృఢంగా, బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మరింత శ్రమించాల్సిందేనని పరిశోధకులు హెచ్చరించారు. పోల్ డ్యాన్స్, థైచీ, టెన్నిస్, క్రికెట్ వంటి ఆటలతో పాటు జిమ్‌లో బరువులు ఎత్తడం, భారీ బ్యాగ్‌లు మోయడం వంటి కఠిన వ్యాయామాలు చేపట్టాలని సూచించారు. పెద్దలు తమ శారీరక ఆరోగ్యానికి అవసరమైన స్ధాయిలో వ్యాయామం చేయడం లేదని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్(పీహెచ్ఈ) పేర్కొంది. స్ర్తీ, పురుషులు వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామంతో పాటు రెండు సెషన్స్ స్ర్టెంథ్ ట్రైనింగ్ చేపట్టాలని ప్రభుత్వ మార్గదర్శకాలను పలువురు విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా వ్యాయామాలతో కండరాలు, ఎముకలు పటిష్టమై శరీరం మంచి సమతూకంతో ఉంటూ తరచూ పడిపోవడం, ఫ్రాక్చర్లు, వెన్ను నొప్పి, అకాల మరణం వంటి ముప్పులను నిరోధిస్తుందని పీహెచ్ఈ, ఛారిటీ ది సెంటర్ ఫర్ ఏజింగ్ బెటర్‌తో కలిసి నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది. వేగంగా నడవడం వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లతో పాటు ప్రతి ఒక్కరూ వారానికి రెండు సార్లు బరువులు ఎత్తడం వంటి కఠిన వ్యాయామాలు చేయాలని పీహెచ్ఈకి చెందిన డాక్టర్ అలిసన్ టెడ్స్టోన్ సూచించారు. ముఖ్యంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు, మొనోపాజ్ దశలో, పురుషులు పదవీవిరమణ అనంతరం ఈ తరహా వ్యాయామాలు చేయడం ద్వారా తదుపరి దశల్లో వారు చురుకుగా ఉంటారని చెప్పారు. -
చర్మం కొన్ని చోట్ల దళసరిగా...నల్లగా...ఎందుకిలా?
డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. నా చర్మం గోధుమ రంగులో ఉంటుంది. అయితే ఏడాదిగా నుంచి నా నుదుటి మీద చర్మం నల్లగా మారుతోంది. మందంగా కూడా అవుతోంది. కణతల వద్ద, మెడ మీద, చంకల వద్ద, నడుము దగ్గర ఇలాగే అవుతోంది. ముఖ్యంగా ఎక్కడెక్కడ చర్మం మడతలు పడ్డట్టుగా ఉంటుందో అక్కడక్కడల్లా ఇలా జరుగుతోంది. నాకు కొంచెం ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎల్. శ్రీనివాసరావు, మదనపల్లె మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘ఆకాంథోసిస్ నైగ్రిక్యాన్స్’ అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వల్ల జరుగుతున్న పరిణామం. సాధారణంగా స్థూలకాయుల్లో ఇలా జరుగుతుంది. దీన్ని ‘హెచ్ఓఎమ్ఏ–ఐఆర్’ అనే పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు. దీనికి చికిత్స ఈ కింది విధంగా ఉంటుంది. ∙బరువు తగ్గించుకోవడం ∙జీవనశైలిని మార్చుకోవడం (అంటే సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం ∙మేని రంగును చక్కబరిచేందుకు మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మేని ఛాయ క్రమంగా మెరుగువుతుంది. ఇందుకోసం పూత మందుగా ఉపయోగించాల్సినవి... – ఆర్బుటిన్ – లికోరైస్ – కోజిక్ యాసిడ్ ∙పైన పేర్కొన్న మందులతో పాటి క్లిగ్‌మెన్స్ రెజీమ్ అనే ప్రక్రియను రోజు విడిచి రోజు రాత్రివేళ అమలు పరచాలి. ∙యాభైకు ఎక్కువగా ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యానం రెండు వరకు రాసుకుంటూ ఉండాలి. ఒంటి లోపలి వ్యవస్థలను చక్కబరచడానికి యాంటీ ఆక్సిడెంట్ మాత్రలు, విటమిన్ సి కాప్సూ్యల్ వంటివాటితో పాటు డాక్టర్ సలహా మేరకు మెట్ఫార్మిన్ –500ఎంజీ ప్రతిరోజూ వాడాలి. ఇతర ప్రక్రియలు : ∙ఫీనాల్, టీసీఏ వంటి మందులతో కెమికల్ పీలింగ్ 4 – 6 సెషన్ల పాటు చేయించుకోవాలి ∙లేజర్ టోనింగ్ కూడా పిగ్మెంట్ను తగ్గించడంతో పాటు మందమైన చర్మం మామూలుగా కావడానికి, నలుపు తగ్గడానికి ఉపయోగపడుతుంది. గీరుకున్నచోట నల్లమచ్చలు.. తగ్గేదెలా? నా రెండు చేతుల మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా అనిపిస్తే చాలాసేపు గీరుకున్నాను. దాంతో నల్లటి మచ్చలు (డార్క్ మార్క్స్) ఏర్పడ్డాయి. అవి తగ్గి, నా చర్మం మామూలుగా అయ్యేందుకు ఏం చేయాలో చెప్పండి. – ఎమ్. నీరజ, సంగారెడ్డి మీరు చెబుతున్న కండిషన్‌ను పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇది తగ్గడానికి ఈ సూచనలు పాటించండి. ∙సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిష్చరైజర్ను డార్క్ మార్క్స్ ఉన్నచోట బాగా రాయండి. ∙ఎండకు ఎక్స్పోజ్ అయ్యే చోట ఎస్పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యానం రాయండి – కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లైటెనింగ్ క్రీములు అప్లై చేయండి. ∙ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను ప్రతిరోజూ తీసుకోండి. ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. అయితే మీ అలర్జీని అదుపులో ఉంచుకునే మందులు కూడా వాడాల్సి ఉంటుంది. వేళ్లకు బొబ్బలు... మచ్చలు రాకుండా మార్గం చెప్పండి నా వయసు 32 ఏళ్లు. రెండు రోజుల క్రితం చూడకుండా వేడిగా ఉన్న పాత్రను చేత్తో పట్టుకున్నాను. వేళ్లు బాగా కాలాయి. బొబ్బలు కూడా వచ్చాయి. అప్పుడు వాటిపై మచ్చలు పడతాయని ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. లక్ష్మీప్రసన్న, కోదాడ మీ అరచేతుల్లో బొబ్బలు వచ్చాయంటే ఆ తీవ్రత సెకండ్ డిగ్రీ బర్న్స్‌ను సూచిస్తోంది. ఒకవేళ ఈ బొబ్బలు చాలా పెద్దవిగా ఉంటే మీరు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలిసి, క్రమం తప్పకుండా డ్రస్సింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు మూడు రోజుల పాటు అజిథ్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇక గాయాలపై రోజుకు రెండుసార్లు మ్యూపిరోసిన్ అనే యాంటీబయాటిక్ పూతమందు వాడాలి. ఇది వారంరోజుల పాటు పూయాల్సి ఉంటుంది. మీ బొబ్బలు ఆ తర్వాత మచ్చలుగా మారకుండా ఉండాలంటే సిల్వర్ సల్ఫాడైజీన్తో పాటు మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ వాడాల్సి ఉంటుంది. గాయం మానిన తర్వాత కూడా మచ్చలు వస్తే క్లిగ్మాన్స్ రెజీమ్ వంటి స్కిన్ లైటెనింగ్ క్రీమ్స్‌ను రెండుమూడు వారాలపాటు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్, నికోటినమైడ్ వంటివి ఉన్న నాన్‌స్టెరాయిడ్ క్రీమ్స్ వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా మచ్చలు వస్తే ఫ్రాక్షనల్ లేజర్ లేదా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
వారికి వ్యాయామమే మందు..
లండన్ : కుంగుబాటుతో సతమతమయ్యే వారు గుండె జబ్బుకు లోనయ్యే ముప్పును తప్పించుకునేందుకు వ్యాయామం దోహదపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. కుంగుబాటు బాధితులకు వ్యాయామం ఔషధంలా పనిచేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు చేపట్టిన అథ్యయనంలో వెల్లడైంది. శారీరకంగా దృఢంగా ఉన్న వారిలో గుండె సమస్యలతో మరణించే ముప్పు 56 శాతం తక్కువగా ఉన్నట్టు అథ్యయనంలో తేలింది. నిరాశావాదాన్ని పారదోలి, కుంగుబాటుకు దూరం కావాలంటే నిత్యం వ్యాయామం చేయడమే మేలని నిపుణులు స్పష్టం చేశారు. డిప్రెషన్‌తో బాధపడేవారికి వ్యాయామం ఔషధంలా పనిచేస్తుందని 17,000 మందిపై నిర్వహించిన ఈ అథ్యయనంలో వెల్లడైంది. మధ్యవయసులో మెరుగైన ఫిట్నెస్ కలిగినవారు తర్వాతి కాలంలో వారు కుంగుబాటుతో బాధపడుతున్నా గుండె జబ్బు కారణంగా మరణించే ముప్పు గణనీయంగా తగ్గినట్టు పరశోధకులు గుర్తించారు. గుండె ఆరోగ్యం, కుంగుబాటుకు సంబంధం ఉన్న క్రమంలో దీర్ఘకాలంలో కుంగుబాటు గుండె జబ్బులు, ఛాతీనొప్పికి దారితీస్తాయని పలు అథ్యనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా కుంగుబాటు రోగులు, గుండె జబ్బుల ముప్పున వారు తమ మానసిక, శారీరక ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ సైకియాట్రీ జర్నల్‌లో అథ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.