అధిక బరువు ఆరోగ్యానికే కాదు అందానికీ శత్రువే. ఆ బరువును తగ్గించుకోవడానికి మితాహారం.. వ్యాయామాలే మార్గం అంటారు ఫిట్‌నెస్ నిపుణులు. మితాహారం ఓకే.. అతికష్టమ్మీద నాలుకను చంపుకొని కడుపు కట్టుకోవచ్చు. కానీ మైండ్‌ని ఎంత ప్రిపేర్ చేసినా వ్యాయామానికి సిద్ధమవదు. ఓ పక్క బద్ధకం అడ్డొస్తుంది. అందుకే ఈ ఎక్సర్‌సైజ్ కుషన్ చూడండీ.. చాలా యూజ్ అవుతుంది.
పెద్దగా శ్రమ లేకుండానే బాడీని స్లిమ్‌గా మారుస్తుంది. ఇది కాళ్లు, తొడలు, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును ఇట్టే కరిగిస్తుంది. శరీరం సన్నగా, అందంగా అవడానికి సహకరిస్తుంది. దీని సాయంతో వ్యాయామం చేస్తే.. కొవ్వు తగ్గి నాజూగ్గా మారుతారు. ఈ ఎక్సర్‌సైజర్‌కి ఇరువైపులా కాళ్లు పెట్టుకోవడానికి వీలుగా హోల్స్ ఉంటాయి. వాటిలోకి కాళ్లను జొప్పించి.. పడుకుని లేదా కూర్చుని చిత్రంలో చూపించిన విధంగా వ్యాయామం చేసుకోవచ్చు. దానివల్ల.. పొట్ట నుంచి కాళ్ల వరకూ పేరుకున్న కొవ్వు వేగంగా తగ్గుతుంది.
ఈ టూల్‌ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. ఇది ఇంట్లో ఉంటే.. మీకు కావాల్సిందల్లా కాస్త స్థలం.. కొంత సమయం మాత్రమే. అవిరెండూ దొరికితే.. అందం, ఆరోగ్యం మీ సొంతం.
పక్షవాతంతో బాధపడుతున్న కొందరు (కాస్త కదలికలున్నవారు) పేషెంట్స్ కూడా ఈ టూల్‌ని ఉపయోగించి.. వ్యాయామం చేసుకోవచ్చు. రెడ్ లేదా బ్లాక్ కలర్స్‌లో ఈ ఎక్సర్‌సైజ్ కుషన్ అందుబాటులో ఉంది. దీని ధర 51 డాలర్లు. అంటే 4,219 రూపాయలన్న మాట.
ఇవి చదవండి: Naila Grewal: నా యాక్టింగ్‌కి 'టెలివిజనే' నాకు ప్రేరణ!
Comments
Please login to add a commentAdd a comment