చిరకాలం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం చాలా ముఖ్యం. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. 2025లోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, జీవనశైలి మార్పులు ఆరోగ్యంపై ఎంత ప్రభావితం చేస్తాయనే దానిపై పెరుగుతున్న అవగాహనతో, ప్రోటీన్లు, ఒమేగా-3లు, విటమిన్లు , ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలకు ప్రాధాన్యత గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇదే మన భవిష్యత్ ఆనందానికి, ఆరోగ్యానికి బలమైన పెట్టుబడి.
పోషకాహారం అంటే కేలరీలను లెక్కించడం గురించి మాత్రమే కాదు. అది శరీరానికి ఎంత అవసరమో తెలుసుకోవడం. ఆరోగ్యంగా ఉండటానికి శక్తితోపాటు సూక్ష్మపోషకాల కోసం సరైన మాక్రోన్యూట్రియెంట్లు ఉండేలా చూసుకోవాలంటున్నారు. అబాట్, న్యూట్రిషన్ బిజినెస్, మెడికల్ & సైంటిఫిక్ అఫైర్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి ఠాకూర్.
ఆహారపు అలవాట్ల పట్ల మరింత శ్రద్ధ వహిస్తున్నందున, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇది ఆరోగ్యకరమైన ఆహార విధానాలకు దారితీస్తుంది. ముఖ్యంగా నోటి పోషక పదార్ధాలు (ONS) పోషకాహార లోపాలను పూరించడానికి, పోషకాహార లోపాన్ని నివారించడానికి సహాయపడుతంది. ముఖ్యంగా ఆకలి లేని వారికి, పోషకాహార లోపం ఉన్నవారికి,పోషకాలను గ్రహించడంలో ఇబ్బంది ఉన్న వ్యక్తులకు ఇది సాయపడుతుంది.
పోషకాహారం & అభివృద్ధి చెందుతున్న పోషక అవసరాలను అర్థం చేసుకోవడం
పోషకాహారం అంటే ఏంటి అనేది అస్పష్టంగా ఉండిపోతున్నప్పటికీ, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి పోషకాహారం చాలా అవసర అనేది మనందరికీ తెలుసు. శాకాహారం పాలియో డూట్, గ్లూటెన్-రహిత , కీటో డైట్ వంటివి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇందులో దేన్ని ఎంచుకోవాలనేది కష్టంగా అనిపించినా, సమతుల్యమైన ఆహారం అందరికీ శ్రయస్కరం అనేది అధ్యయనాలతోపాటు అందరూ అంగీకరించే విషయం.
ఎదుగుతున్న క్రమంలో వివిధ దశల ఆధారంగా పోషక అవసరాలు పెరుగుతాయి. ఉదాహరణకు, పిల్లలకు పెరుగుదలకు అధిక మొత్తంలో కొన్ని పోషకాలు అవసరం, పెద్దలు కండబలం, ఎముక సాంద్రతను నిర్వహించడంపై దృష్టి పెట్టాలి. అదే వద్ధులైతే కండరాల నష్టాన్ని నివారించేలా, ఎక్కువ ప్రోటీన్ , అభిజ్ఞా పనితీరును నిర్వహించడానికి విటమిన్‌డీ, బీ 12 అదనపు విటమిన్లు అవసరం పడుతుంది. ఈ మార్పులను గుర్తించడం అనేది చాలా ముఖ్యమైనది.
పెద్దల ఆహారం-ముఖ్యమైన పోషకాలు
ప్రోటీన్: ఇది కండరాల మరమ్మత్తుకు పెరుగుదలకు మద్దతు ఇస్తుంది . పప్పు (కాయధాన్యాలు), చిక్‌పీస్, కిడ్నీ బీన్స్ (రాజ్మా), పనీర్ (కాటేజ్ చీజ్), గుడ్లు ,చికెన్ ద్వారా దీన్ని పొందవచ్చు.
కార్బోహైడ్రేట్లు: శరీరానికి ప్రాథమిక శక్తి వనరు అయిన కార్బోహైడ్రేట్లు సాధారణంగా బియ్యం, గోధుమ రోటీ, పోహా, ఓట్స్, చిలగడదుంపల్లో లభిస్తాయి.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు: గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంతోపాటు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి అవిసె గింజలు (ఆల్సి), వాల్‌నట్‌లు, ఆవనూనె , ఇండియన్ మాకేరెల్ (బంగ్డా) లేదా రోహు వంటి చేపల ద్వారా అందుతాయి.
ఫైబర్: ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్, మిల్లెట్ వంటి తృణధాన్యాలు, జామ ,ఆపిల్ వంటి పండ్లు, పాలకూర , బ్రోకలీ వంటి కూరగాయలు, ఇంకా సైలియం పొట్టు (ఇసాబ్గోల్)లో లభిస్తుంది
విటమిన్లు:
విటమిన్ డి: ఎముకల ఆరోగ్యానికి కాల్షియం శోషణకు సహాయపడుతుంది. పాలు, పెరుగు,సూర్యకాంతి ద్వారా పొందవచ్చు
విటమిన్ ఇ: యాంటీఆక్సిడెంట్, కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. బాదం, పొద్దుతిరుగుడు గింజలు, ఆవ ఆకూరలో ఉంటుంది.
విటమిన్ సి: రోగనిరోధక పనితీరుకు,ఆరోగ్యానికి అవసరం, నారింజ ,యు నిమ్మకాయలు, ఆమ్లా (ఇండియన్ గూస్బెర్రీ), జామ వంటి సిట్రస్ పండ్లలో లభిస్తుంది
విటమిన్ బి6: మెదడు ఆరోగ్యం , జీవక్రియకు ముఖ్యమైనది, అరటిపండ్లు, బంగాళాదుంపలు, పొద్దుతిరుగుడు విత్తనాలలో లభిస్తుంది
విటమిన్ బి12: నాడీ పనితీరుకు, రక్త కణాల ఉత్పత్తికి ముఖ్యమైనది, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు,బలవర్థకమైన తృణధాన్యాలలో లభిస్తుంది
ఖనిజాలు:
కాల్షియం: ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది, పాలు, పెరుగు, రాగి (Finger millets) నువ్వుల గింజల్లో ఎక్కువ లభిస్తుంది.
ఐరన్: జీవక్రియ ప్రక్రియలకు మద్దతు ఇస్తుంది. పాలకూర, మెంతి ఆకులు ((Fenugreek), బెల్లం (గుర్), పప్పుధాన్యాలు (పప్పు) ద్వారా లభిస్తుంది
జింక్: రోగనిరోధకశక్తి, గాయాలను నయం చేయడంలో సాయపడుతుంది. గుమ్మడికాయ గింజలు, చిక్‌పీస్ . బజ్రా వంటి తృణధాన్యాలలో లభిస్తుంది.
రోజువారీ భోజనం ఎలా ఉండాలంటే..
సామెత చెప్పినట్టుగా "రాజులాగా అల్పాహారం, యువరాజులాగా భోజనం, బిచ్చగాడిలా రాత్రి భోజనం’’ ఉండాలి. కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్లు ఎక్కువ ఉండాలి. కొవ్వులు జీర్ణం కావడం కష్టం కాబట్టి, వాటిని అల్పాహారం , భోజనంలో తీసుకోవాలి. అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి భోజనం తేలిగ్గా ఉండాలి. ఆహారానికి మధ్యలోచాలా విరామం తర్వాత తీసుకునే భారమైన అల్పాహారం శక్తివంతమైందిగా ఉండాలి. అయితే పరగడుపున శరీరంలోని మలినాలను బైటికి పంపేందుకు గోరువెచ్చని నీరుతాగిలి. సీజన్‌ను బట్టి కూరగాయలు, పప్పుధాన్యాల నుండి తయారు చేసిన పోహా, ఉప్మా, దోస, ఇడ్లీ లేదా చీలా పవర్‌పేక్డ్ కార్బోహైడ్రేట్స్‌ను తీసుకోవచ్చు.
2025లో చిన్న చిన్న మార్పులు, భారీ లాభాలు
చిన్న మార్పులు మన మొత్తం ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలకు దారితీస్తాయి
సమతుల ఆహారంపై దృష్టిపెట్టడం
ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం
హైడ్రేడెట్‌గా ఉండటం, అంటే రోజుకు సరిపడినన్ని నీళ్లు తాగడం.
పోషకాహారం తీసుకుంటూ ఎముకలు కండరాల బలాన్ని పెంచుకునేందుకు క్రమం తప్పని వ్యాయామం.
ఆరోగ్య సంరక్షణలో శారీరక శ్రమ చాలా కీలకం. వారానికి కనీసం రెండుసార్లు బలమైన వ్యాయామాల వల్ల సమతుల్యత మెరుగుపడుతుంది. నడక, ఈత లేదా యోగా వంటివి ఫిట్‌నెస్‌కు దోహదం చేస్తాయి.
ఈ ఏడాదిలో ఆరోగ్యకరమైన జీవనంపై దృష్టి పెడదాం. శరీరానికి బలాన్నిచ్చే ఆహారాన్ని, చురుకునిచ్చే వ్యాయామాలను, సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించే మార్పులను స్వీకరిద్దాం. తద్వారా సమిష్టిగా జీవితాన్ని ఆరోగ్యకరంగా, సంతోష కరంగా మార్చుకుందాం.
ఇదీ చదవండి: కొత్త బంగారు లోకం.. అనాథ చిన్నారులకు ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment