
నడివయసుకు చేరుకుంటున్న సమయంలో వయసుతో వచ్చే మార్పుల్లో, శరీరంలోని కండరాల్లో దారుఢ్యం సడలి, కొలతలు మారిపోవడం ప్రధాన సమస్యగా మారుతుంటుంది. శరీర నిర్మాణంలోనే కాదు, ముఖంలోనూ ఆ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జిమ్‌కి వెళ్తే శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవచ్చు. మరి వడలిపోయిన ముఖాన్ని ఎలా తీర్చి దిద్దుకోవాలి? ఇదిగో చిత్రంలోని ఈ ఫేస్ జిమ్ టూల్, ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా నిలుస్తుంది.
మునివేళ్లతో పట్టుకుని వాడుకోగలిగే ఈ పరికరంతో శిల్పాన్ని మలచుకున్నట్లుగా ఎవరికి వారే తమ ముఖాన్ని చక్కగా తీర్చి దిద్దుకోవచ్చు. ఈ పరికరంతో మర్దన చేసుకుంటే ముఖ కండరాల్లో రక్త ప్రసరణ మెరుగుపడి, ముఖం పునర్యవ్వనం పొందుతుంది. సురక్షితమైన నాణ్యమైన మెటీరియల్‌తో రూపొందిన ఈ గాడ్జెట్ ఎలాంటి చర్మానికైనా హాని కలిగించదు. పైగా పట్టుకోవడానికి, మసాజ్ చేసుకోవడానికి అనువుగా ఇది రూపొందింది.
దీనికి ఒకవైపు ఐదు దువ్వెన పళ్లులాంటి ఊచలు, వాటి చివర బాల్స్ ఉండగా.. మరోవైపు మెలితిరిగిన మృదువైన కొన, దానికో గుండ్రటి బాల్ అటాచ్ అయ్యి ఉంటుంది. మీ చర్మానికి సరిపడే సీరమ్ లేదా క్రీమ్ అప్లై చేసుకుని ఈ టూల్‌తో మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిత్రంలో చూపిన విధంగా, చర్మానికి ఆనించి, కింది వైపు నుంచి పైకి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
(చదవండి: 'ఫైట్ ఎగైనెస్ట్ ఒబెసిటీ'కి ప్రధాని మోదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..)
Comments
Please login to add a commentAdd a comment