
అడినాయిడ్స్ ముక్కు లోపలి భాగానికి కాస్త వెనకన, నోటి లోపల అంగిటి పైభాగంలో ఉంటాయి. అవి స్పాంజి కణజాలంతో తయారై మెత్తగా, గుంపులుగా ఉంటాయి. రెండు రకాలుగా వీటి ఉనికి తెలుస్తుంది. మొదటిది... ఎండోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగించడం ద్వారా... ఇక రెండోది తల ఎక్స్–రే తీసినప్పుడు, ఈ తల ఎక్స్–రేలో వాటి పరిమాణం కూడా తెలుస్తుంది. అడినాయిడ్స్ అన్నా, టాన్సిల్స్ అన్నా... ఈ రెండూ ఒకటేనని చాలామంది పొరబడుతుంటారుగానీ... ఈ రెండూ వేర్వేరు. నోరు బాగా తెరచినప్పుడు టాన్సిల్స్ కనిపిస్తాయిగానీ... అడినాయిడ్స్ కనిపించవు. నిజానికి అడినాయిడ్స్ అనేక రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి పిల్లలను కాపాడుతుంటాయి. అయితే వాటికే ఇన్ఫెక్షన్స్ సోకడం కారణంగా అడినాయిడ్స్ వాచినప్పుడు వచ్చే సమస్య గురించి తెలుసుకుందాం.
అడినాయిడ్స్‌లో కొన్ని యాంటీబాడీస్ ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు దేహంలోకి ప్రవేశించగానే... వాటిని శత్రుకణాలుగా గుర్తించి, వాటితో ΄ోరాడుతాయి. ఇలా ΄ోరాటంలో వాటిని తుదముట్టించడం ద్వారా ఇన్ఫెక్షన్‌ల నుంచి కాపాడతాయి. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి సహజంగానే తక్కువగా ఉండటం వల్ల వాళ్ల పసి దేహాలను కాపాడటానికి ప్రకృతి అడినాయిడ్స్ అనే ఏర్పాటు చేసింది.
అయితే పిల్లలు పెరుగుతున్న కొద్దీ... వాళ్ల వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) కూడా పెరుగుతుండటం వల్ల కొంతకాలానికి ఇవి క్రమంగా సైజు తగ్గుతూపోతాయి. ఐదేళ్ల వయసులో దాదాపుగా ఇవి పూర్తిగా కృశించి΄ోతాయి. వారికి యుక్తవయసు వచ్చేనాటికి అవి పూర్తిగా మటుమాయమవుతాయి.
అడినాయిడ్స్‌లో ఇన్ఫెక్షన్లతో వాపు ఇలా...
కొందరు చిన్నారులపైకి బ్యాక్టీరియా లేదా వైరస్ దాడి చేసినప్పుడు అడినాయిడ్స్ కణజాలంలో వాపు వచ్చే అవకాశాలుంటాయి. అలా జరగడం వల్ల ఇక అవి ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు వాటి నుంచి దేహాన్ని కాపాడలేవు. దేహంపై బ్యాక్టీరియా, వైరస్ దాడి పెరిగిన కొద్దీ వాటిలో వాపు కూడా పెరుగుతూపోతుంది.
అలాంటప్పుడు కొన్నిసార్లు పక్కనుండే టాన్సిల్స్‌కు కూడా ఇన్ఫెక్షన్ వచ్చి, వాటిల్లో కూడా వాపు రావచ్చు. ఇలా వాపు వచ్చిన కొద్దీ పిల్లలు గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. దాంతో చిన్నారుల్లో కొన్ని సమస్యలు రావచ్చు. అవి...
ముక్కురంధ్రాలు మూసుకు΄ోయి గాలి పీల్చడం ఇబ్బందిగా మారడంతో నోటితో గాలి పీల్చడం. ∙నిద్ర సమయంలో పిల్లలో గురక రావడం.
గొంతునొప్పిగా ఉండి, మింగడం కష్టం కావడం. ∙కొన్నిసార్లు మెడ్ర ప్రాంతంలోని గ్రంథులకూ వాపు రావడం.
కొంతమందిలో వినికిడి సమస్యలూ లేదా దంత సమస్యలు కనిపించడం.
ఊపిరి సరిగా అందక నిద్రాభంగమై లేచి ఏడ్వటం.
చికిత్స...
అడినాయిడ్స్‌లో వాపు వచ్చిన ప్లిలల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం కారణంగా వారికి తరచూ జ్వరాలు వస్తుంటాయి. అడినాయిడ్స్‌లో వాపు ఉన్నప్పుడు తొలుత యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారు. త్వరగా చికిత్స పొందని పిల్లల్లో వ్యాధి తీవ్రత పెరిగి మందులకు నయమయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు అలాంటప్పుడు అడినాయిడెక్టమీ అనే శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా డాక్టర్లు వాటిని తొలగించాల్సి వస్తుంది.
డా. ఈసీ వినయ కుమార్, ఈఎన్‌టీ నిపుణుల
(చదవండి: పెద్దవాళ్లు జబ్బుపడితే ఎవరు చూడాలి..?)
Comments
Please login to add a commentAdd a comment