Pediatric
-
నలుపు తగ్గేదెలా..?
చిన్నారుల ఒంటిమీద, ముఖం మీద పుట్టుమచ్చల్లాంటి నల్లమచ్చలు కనిపిస్తుండటం మామూలే. అయితే కొందరు చిన్నారుల్లో ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో వస్తుంటాయి. ఈ కండిషన్‌ను ‘నీవస్’ అంటారు. ఇలా నల్లమచ్చలు ఎక్కువగా వచ్చే ఈ కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘మల్టిపుల్ నీవస్’ అని పేర్కొంటారు. చర్మంలోని రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలే పుట్టుమచ్చలకూ, ఇలా ఎక్కువ సంఖ్యలో వచ్చే ‘నీవస్’ అని పిలిచే మచ్చలకు కారణం. ఈ మచ్చలు శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ఈ లక్షణమున్న కొందరిలో ఇవి అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా కూడా కనిపిస్తుంటాయి. కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలు రావడంతోపాటు సూర్యకాంతికి చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం వంటి అంశాలు ఇవి వచ్చేందుకు కారణమవుతాయి.రకాలు ...ఈ మచ్చలను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది హానికరం కాని సాధారణ ‘బినైన్’ మచ్చలు. రెండోది హానికరంగా మారే ‘మెలిగ్నెంట్’ మచ్చ. అయితే ఈ మెలిగ్నెంట్ అన్నది చాలా చాలా అరుదు. బినైన్ నీవస్ పెరుగుతున్నప్పుడు ఒకసారి పరీక్షించి, ఆ తర్వాత అది మెలిగ్నెంట్ కాదని నిర్ధారణ చేసుకుని ఆ తర్వాత నిశ్చింతగా ఉండాలి. ఈ మచ్చల్లో కొన్ని పుట్టుకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు 10 నుంచి 30 ఏళ్ల మధ్య కాలంలో రావచ్చు. బినైన్ మచ్చల విషయానికి వస్తే... చాలామంది పిల్లల్లో కనిపించే పుట్టుమచ్చల్లో... హానికరం కాని నీవస్ వాటివల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని తెలిశాక నిశ్చింతగా ఉండవచ్చు. క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్‌లు క్యాన్సర్ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి ఉన్నవారు క్రమం తప్పకుండా డర్మటాలజిస్ట్లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది. కొన్ని సందర్భాల్లో నీవాయిడ్ బేసల్ సెల్ కార్సినోమా అనే కండిషన్ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతోపాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి మచ్చలతోపాటు జన్యుపరమైన అబ్నార్మాలిటీస్నూ డాక్టర్లు చూస్తుంటారు. ఇలాంటి పిల్లల్లో ముఖ ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లో΄ాలు కూడా కనిపించేందుకు ఆస్కారం ఉంది. ఇవన్నీ చాలా అరుదైన కండిషన్స్.మచ్చలు ఉన్నప్పుడు గమనించాల్సిన ఏ, బీ, సీ, డీలు...అది ఎలాంటి నల్లమచ్చ లేదా నీవస్ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాల్ని పిల్లల తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ఇక్కడ ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవం లో ఏదైనా మార్పు కనిపిస్తుంటుందేమో అని గమనించడం, బీ– అంటే బార్డర్... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా అని చూడటం, సీ– అంటే కలర్... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందేమో గమనిస్తుండటం, చివరగా... డీ– అంటే డయామీటర్... అంటే మచ్చ తాలూకు వ్యాసం పెరుగుతోందా అని పరిశీలిస్తూ ఉండటం... ఈ నాలుగు మార్పుల్లో ఏది కనిపించినా తక్షణం డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.నివారణ ఇలా... పిల్లల్లో నల్లమచ్చల నివారణకు... చిన్నారులను మరీ ఎర్రటి ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. చిన్నారుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు అది హానికారక అల్ట్రావయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లేప్పుడు, వారికి కూడా 30 ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ రాయాలి.చికిత్స...ఇక కొన్ని నల్లమచ్చలు హానికరం కాని నీవస్ మచ్చలే అయినప్పటికీ కొన్ని అవి చిన్నారుల లుక్స్‌కు కాస్మటిక్‌గా ఇబ్బంది కలిగిస్తుంటే... నిపుణులు వాటిని షేవ్ ఎక్సెషన్ థెరపీ వంటి ప్రక్రియల ద్వారా తొలగించడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ అవి ప్రమాదకరమైన మచ్చలైతే... సంబంధిత నిపుణుల చేత వాటికి అవసరమైన చికిత్సలు అందించాలి. డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ (చదవండి: ఎక్కువసేపు నిద్రా? ఆందోళన వద్దు...) -
చిన్నారుల ఆరోగ్యానికి రక్ష
-
నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు
లక్డీకాపూల్: గుండె సమస్యలతో బాధపడే చిన్నారులకు నిమ్స్‌లో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. నవజాత శిశువులు మొదలు ఐదేళ్లలోపు చిన్నారుల గుండె వ్యాధులకు చికిత్స అందిస్తామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిటన్‌లోని ఆల్డర్ హే చిల్డ్రన్స్ హాస్పిటల్ కార్డియాక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రమణ దన్నపునేని ఆధ్వర్యంలోని 10 మంది సర్జన్ల బృందం నిలోఫర్ సర్జన్లు, నిమ్స్ కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు, ఇతర వైద్య బృందంతో కలసి నిమ్స్‌లో ఈ శస్త్రచికిత్సలు చేపట్టనున్నట్లు వివరించారు. ‘హీలింగ్ లిటిల్ హార్ట్స్ చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంప్’లో భాగంగా ఉచిత శస్త్రచికిత్సలు జరగనున్నాయని బీరప్ప పేర్కొన్నారు. తమ చిన్నారులకు ఆపరేషన్లు అవసరమైన తల్లిదండ్రులు మరిన్ని వివరాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య 040–23489025 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఆ ఘనత సాధించిన తొలి డాక్టర్‌గా అనస్తీషియాలజిస్ట్ వైభవరి నాయక్
బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అనస్తీషియాలజిస్ట్, ఇంటెన్సివ్ వైద్య నిపుణురాలు డాక్టర్ విభావరి నాయక్ ఏషియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ అనస్తీషియాకు గౌరవ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఈనెల 16 నుంచి 18వరకు జరిగిన మూడు రోజుల కాన్ఫరెన్స్‌లో ఆమెను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు ఆమె ఈ పదవికి ప్రాతినిధ్యం వహిస్తారు. 2010 నుంచి బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో ఆమె పని చేస్తున్నారు. అంతకు ముందు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వేలూరులోని నిమ్స్, హైదరాబాదులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. అంతే కాకుండా యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఎంజిల్స్‌లో ప్రత్యేకమైన రీసెర్చి ఫెలోషిప్ చేశారు. భారత దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో పలు సంస్థలతో కలసి పీడియాట్రిక్ అనస్థీషియాపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇండియన్ సొసైటీ అఫ్ అనస్థీషియాలజిస్టులు, ఇండియన్ ఆసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్ అనస్థీషియాలజీ, ఇండియన్ కాలేజీ ఆఫ్ అనస్థీషియాలజిస్టులు, సొసైటీ ఆఫ్ ఆంకో అనస్థీషియా, పెరీ ఆపరేటివ్ కేర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలయేటివ్ కేర్, ఇండియన్ సొసైటీ అఫ్ క్రిటికల్ మెడిసన్ లాంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలలో ఆమె సభ్యులుగా కొనసాగుతున్నారు. భారత దేశంతో పాటూ పలు దేశాలలో ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా పలు ప్రఖ్యాత మెడికల్ జర్నల్స్ అయిన ఇండియన్ జర్నల్ ఆఫ్ అనస్థీషియా, జర్నల్ ఆఫ్ అనస్థీషియా ,క్లినికల్ ఫార్మకాలజీ, జర్నల్ ఆఫ్ సెల్యులర్ మరియు మాలిక్యులర్ అనస్థీషియా వంటి వాటికి రివ్యూయర్ గా కూడా పని చేస్తున్నారు. 50కి పైగా ఇండెక్సెడ్ ప్రచురణలు ,ఎనిమిది పుస్తకాలలో ప్రత్యేకమైన చాప్టర్లను డా. విభావరి నాయక్ రచించారు. ఇప్పుడు ఏషియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ అనస్తీషియా గౌరవ కార్యదర్శిగా ఎన్నికకావడం పట్ల డా.విభావరి నాయక్ ఆనందం వ్యక్తం చేశారు. ఆసియా ఖండంలోని ప్రతి ఒక్కరితో పని చేసే గొప్ప అవకాశాన్ని తాను పొందానని, మూల ప్రాంతాలకు కూడా వైద్య నైపుణ్యాన్ని చేర్చడానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. -
నిలోఫర్‌లో నిమోనియా కలకలం.. రెండ్రోజుల్లో ఆరుగురు శిశువుల మృతి
సాక్షి, హైదరాబాద్: నవజాత శిశు సంరక్షణ కేంద్రం నిలోఫర్ ఆస్పత్రిలో నిమోనియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నిమోనియా జడలు విప్పుతోంది. నిలోఫర్‌లో ఈ కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. ఏ వార్డులో చూసినా జ్వరం, దగ్గుతో బాధపడే రోగులే దర్శనమిస్తున్నారు. గడిచిన రెండ్రోజుల్లో వ్యాధి సోకిన అయిదేళ్ల లోపు చిన్నారులు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరంతా ఎన్ఐసీయూలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అందక చనిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. వ్యాధి లక్షణాలు ఇవీ.. ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధిని నిమోనియాగా పిలుస్తారు. చిన్న పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. తల్లి పాలు లేకుండా పెరిగే పిల్లల్లో, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే శిశువులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, పౌష్టికాహారం లోపంతో పెరిగే పిల్లల్లో ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. నిమోనియా సోకిన వ్యక్తి దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా కూడా చిన్నారులకు సంక్రమిస్తుంటుంది. శీతాకాలంలో వీచే చలి ప్రభావం శిశువుల ఊపిరితిత్తులను చిత్తు చేస్తోంది. కఫంతో కూడిన దగ్గు చలి జ్వరం, ఛాతి నొప్పితో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. శిశువు బలహీనంగా, నీరసంగా శక్తి తక్కువగా బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ముక్కు నుంచి నీరు కారుతూ.. తేలికపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు కనిపిస్తే నిమోనియాగా గుర్తించాలని వైద్యులు పేర్కొంటున్నారు. చదవండి: ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో కీలక పరిణామం.. పిడియాట్రిక్ కేసులే అధికం. . నిలోఫర్ ఓపీలో జ్వర పీడితుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. ఒక్క పిడియాట్రిక్ విభాగంలోనే ఓపీ రోగుల నమోదు సంఖ్య 1,300కు చేరుకుంది. ప్రతి రోజూ గైనిక్ విభాగంలో 200. సర్జరీ విభాగంలో 100 కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు నిలోఫర్‌ను సిబ్బంది లేమి సమస్య వెంటాడుతోంది. పరికరాల కొరత, సకాలంలో అందని రక్తం, అంబులెన్స్‌లు ఉన్నా అందుబాటులో లేని డ్రైవర్లు, అరకొర స్ట్రెచర్లు, సరిపోని వీల్చైర్లు.. ఒక్కో పడకపై ముగ్గురేసి చొప్పున రోగులు, వాయిదాల పద్ధతిలో ఎక్స్‌రే, స్కానింగ్ పరీక్షలు, వేళకు అందని రక్త నమూనా ఫలితాల నివేదికల వంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఫలితంగా వైద్య సేవలు సరిగా అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వైద్యురాలితో అసభ్య ప్రవర్తన... తండ్రీ కొడుకుల అరెస్ట్
బంజారాహిల్స్: కిరాయి చెల్లించకుండా ఇంట్లో ఉండటమేగాక ఇంటిని ఖాళీ చేయాలని చెప్పిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు, విశ్రాంత ప్రొఫెసర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించి దుర్భాషలాడిన ఘటనలో తండ్రీ కొడుకులను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 7లోని ఉమెన్ కో అపరేటివ్ సొసైటీ ప్లాట్ నెంబర్ 88లో విశ్రాంత ప్రొఫెసర్, ప్రముఖ పీడియాట్రిక్ నిపుణురాలు డా.గంటా కుసుమకు ఇల్లు ఉంది. పదేళ్ల క్రితం ఈ ఇంట్లో మొయ్యా రాఘవేంద్రనాథ్, ఆయన తండ్రి మొయ్యా రవీంద్రనాథ్ కిరాయికి దిగారు. కాగా నాలుగేళ్ల క్రితం తన భర్తతో కలిసి సొంతింట్లో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇంటిని ఖాళీ చేయాలని రాఘవేంద్రనాథ్‌ను కోరారు. అయితే ఇంటిని ఖాళీ చేయ కుండా రోజుకో సాకును చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ఇంటిని ఖాళీ చేయకపోగా గత కొన్నినెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదు. ఇల్లు ఖాళీ చేయాలని డా. కుసుమతో పాటు ఆమె కుటుంబ సభ్యులు రాఘవేంద్రనాథ్‌ను ఈనెల 8న కోరారు. దీంతో తీవ్ర పదజాలంతో వారిని దూషించడంతో పాటు అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించడంతోపాటు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులకు గురిచేశారు. నాలుగేళ్ల వరకు ఇంటిని ఖాళీ చేసే ప్రసక్తే లేదని, కిరాయి కూడా ఇచ్చేది లేదంటూ దబాయించారు. దీంతో బాధితురాలు డా.కుసుమ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఈ మేరకు మొయ్యా రవీంద్రనాథ్, మొయ్యా రాఘవేంద్రనాథ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. గతంలో పార్కు స్థలం కబ్జా కేసులో.. ఇదిలా ఉండగా వృద్ధురాలైన వైద్యురాలి ఇంట్లో కిరాయికి దిగి ఖాళీ చేయకుండా వేధిస్తుండడంతో పాటు బెదిరింపులకు దిగిన నిందితులు మొయ్యా రవీంద్రనాథ్, మొయ్యా రాఘవేంద్రనాథ్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.9లోని సత్వా ఎన్క్లేవ్ కాలనీలో పార్కుస్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసినట్లు సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులిద్దరూ అరెస్టయినట్లు విచారణలో తేలింది. ఫోర్జరీ పత్రాలతో సుమారు రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయడంతోపాటు ఏకంగా జీహెచ్ఎంసీని బురిడీ కొట్టించి నిర్మాణ అనుమతులు తీసుకున్న వ్యవహారంపై కూడా విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. అధికారులను బెదిరించడం, భూములను కబ్జా చేసినట్లు తేలింది. (చదవండి: కోమటిరెడ్డి సోదరులు.. కోవర్టు బ్రదర్స్) -
చిట్టి గుండెకు గట్టి అండ
లక్డీకాపూల్: అంతర్జాతీయ ప్రమాణాలతో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తున్న నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) ఇక నుంచి నవజాత శిశువులకు సైతం హృద్రోగ శస్త్రచికిత్సలు చేయనుంది. పుట్టుకతో ఏర్పడే గుండె సమస్యలకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనుంది. జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్, సువెన్ ఫార్మాసూటికల్స్ సహకారంతో రూ. 5 కోట్లతో నిమ్స్‌లో నూతనంగా నవజాత హృదయ సంబంధ శస్త్రచికిత్సల విభాగం (పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జరీ యూనిట్) ఏర్పాటైంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈ విభాగాన్ని ఇటీవల ప్రారంభించారు. 50 పడకలు.. ఆధునిక సదుపాయాలు 50 పడకలతో కూడిన పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జరీ యూనిట్ విభాగంలో 6 పడకల అత్యాధునిక మాడ్యులర్ కార్డియోథొరాసిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) కూడా ఉంది. నవజాత శిశువుల్లో గుండె మార్పిడి కోసం అనువైన క్లాస్–1 ఎయిర్ కండిషన్డ్ ఐసొలేషన్ వార్డును సైతం నిమ్స్ సమకూర్చుకుంది. అతిసూక్ష్మమైన వైరస్, బ్యాక్టీరియాలను తొలగించే ఆధునిక హెప్పా ఫిల్టర్లు ఉండటం ఈ వార్డు ప్రత్యేకత. అంతేకాకుండా నెలలు నిండని, తక్కువ బరువుతో పుట్టే పిల్లలకు వెచ్చదనం ఇచ్చే వార్మర్లు తదితర సదుపాయాల కోసం పీడియాట్రిక్, నియోనాటల్ సామర్థ్యాలను కూడా నిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. శస్త్ర చికిత్సల సమయంలో శరీరంలో చోటుచేసుకొనే మార్పులను పసిగట్టి వైద్యులను ముందే హెచ్చరించే అధునాతన కార్డియాక్ అవుట్‌పుట్ మానిటర్‌ను సైతం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పిల్లల ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపర్చే నైట్రిక్ ఆక్సైడ్ సరఫరా యంత్రాన్ని సమకూర్చారు. రూ.40 లక్షలతో హార్ట్ లంగ్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫస్ట్.. నిమ్స్ తరహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. నవజాత శిశువుల్లో పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఏర్పడినప్పుడు శస్త్రచికిత్సలు చేయడానికి ఈ విభాగం ఎంతో ఉపయోగపడుతుంది. – డాక్టర్ ఎం. అమరేష్‌రావు, నిమ్స్ సీటీ సర్జన్ (చదవండి: -
ఈ దగ్గుమందు చాలా ప్రమాదకరమైనది, పిల్లలందుకే మృతి చెందారు: డీజీహెచ్ఎస్
న్యూఢిల్లీ: నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్ ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో 13 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారయ్యిన సంగతి తెలిసిందే. ఐతే చిన్నారుల మృతికి హానికరమైన దగ్గు మందే కారణమని విచారణలో తేలింది. డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫీ సిరప్ కారణంగానే చిన్నారులు మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) సోమవారం వెల్లడించింది. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్ ఆసుపత్రిలో కొందరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారికి డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫ్ సిరప్‌ను అందించారు. ఐతే ఈ దగ్గుమందు కారణంగా ముగ్గురు పిల్లలు మృతి చెందగా, మరో 13 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తాజా దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌తో సహా వివిధ డిస్పెన్సరీలలో పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫీ సిరప్ కారణంగానే మరణాలు సంభవించాయని డీజీహెచ్ఎస్ పేర్కొంది. ‘మా పరిశోధనలో అది హానికరమైన దగ్గు మందని తేలింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో నాలుగేళ్లలోపు పిల్లలకు ఆ మందు ఇవ్వకూడదని, మొహల్లా క్లినిక్‌లు, డిస్పెన్సరీలలో పంపిణీ చేస్తున్న ఈ మందును వెంటనే సీజ్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని డీజీహెచ్ఎస్ ఆదేశించింది. చదవండి: Crying Child Playing The Violin: ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న బాలుడి ఫొటో.. ఎందుకో తెలుసా? -
ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్ బేబిగా గిన్నిస్ రికార్డ్
న్యూయార్క్: నిజానికి నెలలు నిండకుండా పుట్టే పిల్లలు బ్రతికి ఉండడం అత్యంత అరుదు. ఒకవేళ బతికినా జీవితాంతం ఏవో అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. కానీ ఇప్పటి వరకు నెలలు తక్కువగా పుట్టడం అంటే మహా అయితే డెలివరీ తేదికి కాస్త ఒక నెల ముందుగా లేదా ఒక నెల రెండు వారాలు అటు ఇటుగా పట్టడం జరుగుతుంది. కానీ అలా ఇలా కాకుండా కేవలం 21 వారాలు 1 రోజుతో జన్మించి ఆరోగ్యంగా బ్రతికి బట్టగలిగాడు యూఎస్‌కి చెందిన కర్టిస్ అనే చిన్నారి. (చదవండి: ఇదో కొత్తరకం కేఫ్... ఇంత వరకు ఎవ్వరూ చూసుండరు!) అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌లోని అలబామాకు చెందిన కర్టిస్ జై-కీత్ మీన్స్ అనే చిన్నారి జూలై 2020లో 21 వారాలు 1 రోజుతో జన్మించి ప్రపంచలోని అత్యంత నెలలు నిండని శిశువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఆ చిన్నారి తల్లి మిచెల్ చెల్లీ బట్లర్‌కి మొదట గర్భం బాగానే ఉంది. అయితే ఒకరోజు అనుకోకుండా ఆమె ఆరోగ్యంలో చిన సమస్య తలెత్తడంతో అత్యవసర శస్త్రచికిత్స నిమిత్తం గతేడాది జూలై 4న ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెను స్థానిక ఆసుపత్రి నుండి బర్మింగ్‌హామ్ (యూఏబీ)లోని అలబామా విశ్వవిద్యాలయానికి మార్చారు. ఆ సమయంలో ఆమెకు అబార్షన్ చేయాలని నిర్ణయించారు. అయితే ఆమె పట్టబట్టడంతో డెలివీరీ తేదికి 19 వారాలు ముందుగా అంటే 21 వారాల 1 రోజు (148 రోజులు) గర్భధారణతో జూలై 5న మధ్యాహ్నాం 1 గంటకు కర్టిస్ జన్మించాడు. అయితే వైద్య సిబ్బంది ఆ వయసు పిల్లలు బతకడం కష్టం అని తేల్చి చెప్పేశారు. కానీ ఆశ్చర్యంగా కర్టిస్ చికత్సకు స్పందించడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ వైద్యులు ఇలా బతకట కష్టం ఈ విధంగా చికిత్స అందించటం చాలా ఒత్తిడితో కూడిని పని అని చెప్పారు. ఈ మేరకు యూఏబీ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రియాన్ సిమ్స్ మాట్లాడుతూ, "ఈ వయస్సులో ఉన్న పిల్లలు బతకలేరనే చాలా కేసులు చెబుతున్నాయి. కానీ ఈ తల్లి ఆశ నెరవేరుతుందో లేదో అనుకున్నాను. పైగా ఇంత నెలల తక్కువ బిడ్డను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్‌కి తరలించడం కష్టమని గ్రహించాం. దీంతో ఆ బిడ్డ ఉన్న ప్రదేశం నుంచే చికిత్స అందించాం. అయితే ఆ చిన్నారి ఆక్సిజన్‌కి స్పందించడం హృదయస్పందన రేటు పెరగడం జరిగింది. అంతేకాతు ఆ చిన్నారికి మూడు నెలల వయసు వచ్చే వరకు వెంటిలేటర్ మీద చికిత్స అందించాం" అని అన్నారు. ఆ తర్వాత ప్రాంతీయ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఆర్ఎన్ఐసీయూ)లో 275 రోజులు గడిపిన తదనంతర చిన్నారి కర్టిస్ ఈ ఏడాది ఏప్రిల్ 6న ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. ఈ మేరకు నియోనాటాలజీ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ కోల్మ్ ట్రావర్స్ చిన్నారి కర్టిస్ 21 వారాల 1-రోజు గర్భధారణ వయస్సులో జన్మించివాడిగా ప్రపంచ రికార్డును నెలకొల్పి ఉండవచ్చన్న అనుమానంతో చిన్నారి తల్లి మిచెల్‌తో గిన్నిస్ రికార్డుకి దరఖాస్తు చేయించారు. అంతేకాదు గిన్నిస్ రికార్డు కూడా ప్రపంచంలోనే అత్యంత నెలలు నిండకుండా జన్మించిన అరుదైన చిన్నారిగా ప్రకటించటం విశేషం. (చదవండి: ఐస్‌క్రీం కొనడానికి వచ్చి ఏం చేశాడో తెలుసా... నవ్వాగదు! -
Nirmala Sitha Raman: థర్డ్ వేవ్ ఎఫెక్ట్.... పిల్లలపై కేంద్రం ఫోకస్
కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉండటంతో ఎమర్జెన్సీ హెల్త్ సిస్టమ్ ప్రాజెక్ట్‌ని కేంద్ర ఆర్థిక మంత్రులు నిర్మల సీతారామన్, అనురాగ్ ఠాకూర్లు ప్రకటించారు. ఈ పథకానికి రికార్డు స్థాయిలో రూ. 23,220 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టులో పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ కేర్‌పై ఎక్కువ ఫోకస్ చేయనున్నారు. థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపువచ్చనే సందేహాలు వ్యక్తం అవుతున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఏరియా, జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా పిల్లల వార్డుల ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న పిల్లల వార్డులో మౌలిక సదుపాయలు మెరుగుపరచడం వంటి చర్యలు యుద్ధ ప్రతిపాదికన చేపట్టనున్నారు. మౌలిక సదుపాయలకు నిధులు ఈ నిధులతో 7929 కోవిడ్ హెల్త్ సెంటర్లు, 9954 కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రస్తుతం కోవిడ్ కోసం ప్రత్యేకంగా పని చేస్తున్న ఆస్పత్రుల సంఖ్యను 25 రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను 7.5 రెట్లు, ఐసోలేటెడ్ బెడ్ల సంఖ్య 42 రెట్లు, ఐసీయూ బెడ్లు 45 రెట్లు పెంచబోతున్నారు. సబ్ సెంటర్ స్థాయి నుంచి జిల్లా ఆస్పత్రి స్థాయి వరకు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తారు. వైద్య విద్యార్థుల సేవలు ఉపయోగించుకునేందుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తామని మంత్రి తెలిపారు. అంబులెన్సుల కొనుగోలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు కొరత తీర్చడంతో పాటు కొత్తగా అంబులెన్సుల కొనుగోలు, టెలి మెడికేషన్, కోవిడ్ టెస్టుల పెంపు తదితర చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. చదవండి : 5 లక్షల టూరిస్టు వీసాలు ఫ్రీ -
ఏపీ: పీడియాట్రిక్ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ నియామకం
సాక్షి, అమరావతి: కరోనా కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీడియాట్రిక్ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు పెద్దలపైనే తీవ్ర ప్రభావం చూపుతున్న మహమ్మారి.. మూడో దశలో పిల్లలపై అధికంగా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్రత్తమైన ప్రభుత్వం ఏపీఎంఎస్ఐడీసీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో 8 మందితో పీడియాట్రిక్ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లలకు కోవిడ్ సోకితే తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. వారంలోగా ప్రాథమిక నివేదక ఇవ్వాల్సిందిగా టాస్క్‌ఫోర్స్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. చదవండి: చిన్న పిల్లల్లో కోవిడ్ చికిత్స విధానానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ -
పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమా..?
పిల్లలకు కరోనా రావడమే తక్కువ. సోకినా మందులతో తగ్గిపోతుంది. మన దేశంలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో 18 ఏళ్లలోపు అంతకంటే తక్కువ అంటే 10–12 ఏళ్లలోపు పిల్లలకు కరోనా సోకడం చాలా తక్కువ. తెలంగాణలోని ప్రధాన పిల్లల ఆసుపత్రి నీలోఫర్‌లో దీనికి సంబంధించి పెద్దగా కేసులు నమోదు కాలేదు. వీరి కోసం ప్రత్యేక వార్డులు పెట్టడం వంటిది కూడా లేదు. ఇదే పరిస్థితి దాదాపుగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఉన్నట్టుగా తెలుస్తోంది. పీడియాట్రిక్ వ్యాధుల్లో కోవిడ్ ఎంతమాత్రం ఆందోళన కలిగించే అంశం కాదు. తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చినప్పుడు టెస్ట్ చేస్తే పిల్లలకు సోకినట్లు తెలుస్తోంది. పెద్దలకు జ్వరం, జలుబు ఇతర లక్షణాలు కనిపించాక 3,4 రోజుల తర్వాత టెస్ట్ చేసుకోవడం, చికిత్స తీసుకోవడం వంటివి చేస్తుండడంతో పిల్లలకు ఇది సోకుతోంది. పిల్లల్లో కూడా ఎక్కువగా అసెంప్టిమ్యాటిక్ (లక్షణాలు లేకుండా)గానే ఉంటున్నారు. దగ్గు, జలుబు వంటివి కూడా ఉండడం లేదు. చాలా స్వల్ప లక్షణాలుంటున్నాయి. ఒకరోజు జ్వరమొచ్చినా పారాసిటమల్, జింకోవిట్, అజిత్రాల్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఇతర దేశాల్లో, ప్రాంతాల్లో ఎలాగున్నా తెలంగాణలో, హైదరాబాద్‌లో ఏ మందులు తీసుకున్నా, తీసుకోకపోయినా చిన్నపిల్లల వ్యాధుల్లో ఇది ఆందోళన కలిగించేదిగా ఎంత మాత్రం లేదన్నది గ్రహించాలి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) విడుదల చేసిన గణాంకాల్లోనూ పీడియాట్రిక్స్‌లో ఏదో ఒక శాతమే కరోనా ఉన్నట్టుగా వెల్లడైంది. అయితే పెద్దల నుంచి పిల్లలకు సోకుతున్నట్లే, పిల్లల వల్ల పెద్దలకు వైరస్ సోకే అవకాశం మాత్రం ఉంది. నీలోఫర్‌లో న్యూమోనియా కేసులకు సంబంధించి టెస్టింగ్‌కు పంపించినా పాజిటివ్ కేసుల నమోదు కావడం లేదు. - డాక్టర్ బి.నరహరి పీడియాట్రిక్ అసోసియేట్ ప్రొఫెసర్, నీలోఫర్ ఆస్పత్రి -
పిల్లలకు చొల్లు కారుతోందా..?
చిన్న పిల్లలకు నోటి నుంచి చొల్లు కారుడం చాలా సహజం. నెలల వయసులో ఉన్నప్పుడు ఇలా చొల్లుకారడం కూడా చాలా అందంగా, మురిపెంగా ఉంటుంది. పిల్లల్లో ఇలా చొల్లు కారుతూ ఉండే కండిషన్‌ను వైద్య పరిభాషలో సైలోరియా అంటారు. చిన్నారుల్లో దాదాపు పద్దెమినిమిది నెలల వరకు చొల్లు కారడం జరుగుతుంది. వారి దవడలోని ఓరల్ మోటార్ ఫంక్షన్స్ అభివృద్ధి చెందవు కాబట్టి అలా జరుగుతుండటం మామూలే. అరుదుగా కొంతమంది పిల్లల్లో పద్దెనిమిది నెలల వయసు దాటాక కూడా తరచూ చొల్లు కారుతుంది. అలా జరుగుతుండటాన్ని సాధారణంగా తీసుకోడానికి మాత్రం వీల్లేదు. అలాంటి పిల్లలకు మానసిక సమస్యలుగాని, ఇతర నరాల సమస్యలు కారణం కావచ్చని అనుమానించాలి. చాలావరకు పిల్లల్లో చొల్లు కారడం అన్నది దానంతట అదే తగ్గిపోయే సమస్య అయితే కొందరు పిల్లల్లో చొల్లు కారడం మరింత ఎక్కువగా ఉంటే... దాన్ని ప్రత్యేకమైన డెంటల్ అప్లయెన్సెస్‌తో ఆ అలవాటు మాన్పించవచ్చు. పద్దెనిమిది నెలలు దాటాక కూడా చొల్లు వస్తుంటే పిల్లలను మీ పీడియాట్రిస్ట్కు గానీ లేదా సైకియాట్రిస్ట్‌కు గానీ చూపించాలి. -
పాపకు ఒంటిపై పులిపిరుల వంటి కాయలు...?
మా అమ్మాయికి ఏడేళ్లు. ఆమెకు ముఖంతో పాటు ఒంటిపైన అక్కడక్కడా చిన్న చిన్న పులిపిరి కాయల్లాంటివి కనిపిస్తున్నాయి. మేం గమనించిన దాని ప్రకారం అవి రోజురోజుకూ పెరుగుతున్నాయి. అవి జీవితాంతం వస్తూనే ఉంటాయని కొందరు ఫ్రెండ్స్ చెబుతున్నారు. దాంతో మాకు ఆందోళనగా ఉంది. మా పాప విషయంలో మాకు సరైన సలహా ఇవ్వండి. - ధరణి, నరసరావుపేట మీరు చెప్పిన కొద్దిపాటి వివరాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్ ములస్కమ్ కంటాజియోజమ్ కావచ్చని అనిపిస్తోంది. ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి. ముఖ్యంగా రెండు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో దీన్ని చాలా ఎక్కువగా చూస్తుంటాం. వ్యాప్తి జరిగే తీరు : చర్మానికి చర్మం తగలడం వల్ల, తువ్వాళ్ల వంటి వాటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల నుంచి వాళ్లకే వ్యాపించడం కూడా ఉంటుంది. దీన్నే సెల్ఫ్ ఇనాక్యులేషన్ అంటారు. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే... బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు. చికిత్స : ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయవచ్చు. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్ మెడిసిన్స్‌తోనూ వీటికి చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు ఇమిక్యుమాడ్ అనే క్రీమ్‌ను లీజన్స్ ఉన్న ప్రాంతంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్ వాడటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి చికిత్సను కొనసాగించండి. మా పాప వయస్సు ఆరేళ్లు. కొన్నాళ్ల క్రితం బాగా జలుబు చేస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. ముక్కు నుంచి చెవికి ఉండే ఎడినాయిడ్ గ్రంథి బ్లాక్ అయిందని ఆయన చెప్పారు. జలుబు తగ్గిపోయింది గానీ... ఇప్పుడు మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. మా పాపకు ఎందుకిలా జరుగుతోంది? - సురేఖ, కొత్తగూడెం మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. చిన్న పిల్లల్లో ఈ కండిషన్‌ను తరచూ చూస్తుంటాం. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. టాన్సిల్స్‌కు వచ్చినట్లే వీటికి కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. ఇలాంటప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది (రెస్ట్‌లెస్ స్లీప్) వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు చాలా దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో మాత్రం చాలా అరుదుగా ఎడినాయిడ్స్‌ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రీషియన్ లేదా ఈఎన్టీ సర్జన్‌ను కలిసి తగు చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఇంకా అలవాటు తప్పలేదు... ఏం చేయాలి?
మా అమ్మాయికి పదేళ్లు. చాలా కాలం నుంచి నిద్రలో మూత్ర విసర్జన చేసే అలవాటు ఉంది. కానీ పాప యుక్తవయసుకు చేరుకుంటున్నా ఇదే సమస్య కనిపిస్తుండటంతో ఆందోళనగా ఉంది. చలికాలం వస్తే సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. - ధనలక్ష్మీ, పొన్నూరు మీ అమ్మాయికి ఉన్న సమస్యను వైద్యపరిభాషలో నాక్టర్నల్ అన్యురిసిస్ అంటారు. సాధారణంగా 95 శాతం మంది పిల్లల్లో ఐదారేళ్లు వచ్చేసరికి నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ (బ్లాడర్‌పై కంట్రోల్) సాధిస్తారు. కానీ 4 శాతం మంది పిల్లల్లో ఇది కొద్దిగా ఆలస్యం కావచ్చు. అయితే ఒక శాతం మందిలో మాత్రం ఈ సమస్యను పెద్దయ్యాక కూడా చూస్తుంటాం. సాధారణంగా ఇది అబ్బాయిల్లో ఎక్కువ. యాభైశాతం మందిలో ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉండటం చూస్తుంటాం. ఇలాంటి సమస్య ఉన్న 20 శాతం మంది పిల్లల్లో సాధారణంగా యూరినరీ ట్రాక్ అబ్నార్మాలిటీస్ దీనికి కారణం కావచ్చు. ఇంకా నిద్రకు సంబంధించిన రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్), యాంటీ డైయూరెటిక్ హార్మోన్ (ఏడీహెచ్) లోపాలు, మానసికమైన కారణాలు , కొన్ని సందర్భాల్లో అడినాయిడ్స్ వల్ల నిద్ర సంబంధమైన సమస్యలు (స్లీప్ ఆప్నియా) వంటివి ఉన్నప్పుడు కూడా రాత్రివేళల్లో తెలియకుండానే మూత్రవిసర్జన చేస్తుంటారు. ఇక జాగ్రత్తల విషయానికి వస్తే ఆమెను కించపరచడం, శిక్షించడం వంటి పనులు అస్సలు చేయకండి. సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్రవాహారం చాలా తక్కువగా ఇవ్వండి. నాలుగు దాటాక కెఫిన్, చక్కెర ఉన్న పదార్థాలు అస్సలు ఇవ్వకూడదు. ఇక పడుకునేముందు ఒకసారి మూత్రవిసర్జన చేయించడం, నిద్రపోయిన గంటలోపు లేపి మళ్లీ ఒకసారి మూత్రవిసర్జన చేయిస్తుంటే... దాదాపు ఈ సమస్య లేనట్లుగానే ఉంటుంది. దాంతో మీ అమ్మాయిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది క్రమంగా ఆమె అలవాటును తప్పించడానికీ మానసికంగానూ దోహదపడే అంశం. చికిత్స : ఇటీవల అందుబాటులోకి వచ్చిన అలారం వంటి పరికరాలతో బ్లాడర్‌పై నియంత్రణ సాధించేలా ప్రాక్టీస్ చేయించాలి. దీంతోపాటు డెస్మోప్రెసిన్, ఇమెప్రమిన్ వంటి కొన్ని మందులు, స్ప్రేలతో ఫంక్షన్స్ వంటి సోషల్ గ్యాదరింగ్స్ సమయంలో ఆమెను నిర్భయంగా బయటకు తీసుకెళ్లవచ్చు. అలాంటి సందర్భాల్లో వాళ్లకు ఆత్మవిశ్వాసం పెరగడం కూడా ఒక అనుకూలమైన అంశమవుతుంది. ఒకవేళ హార్మోన్లోపాలు ఉన్న సమయంలో 3-6 నెలలపాటు మందులు వాడటం వల్ల ఈ సమస్యను 50 శాతం మందిలో సమర్థంగా అదుపు చేయవచ్చు. అయితే మిగతావారిలో మందులు వాడకకూడా సమస్య అదుపులోకి రాకపోవడం లేదా మందులు మానేశాక మళ్లీ సమస్య తిరగబెట్టడం చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్లు మందు మోతాదును పెంచి ఇవ్వడంతోపాటు కాంబినేషన్స్ ఇస్తుంటారు. పిల్లల్లో ఆత్మస్థైర్యం పెంపొందేలా మోటివేట్ చేస్తుంటారు. మీరు మీ పీడియాట్రిక్ స్పెషలిస్ట్ లేదా నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాబుకు తరచూ జ్వరం...
మా బాబుకు మూడు నెలలు. వాడికి ఇటీవల రెండుసార్లు జ్వరం వస్తే డాక్టర్‌కు చూపించాం. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల ఇలా తరచూ జ్వరం వస్తున్నట్లు చెప్పారు. ఇంత చిన్న పిల్లల్లోనూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయా? మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - సావిత్రి, తుని మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ మాటిమాటికీ (రికరెంట్గా) వస్తున్నట్లు చెప్పవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెలల పిల్లల్లో కూడా చాలా సాధారణంగా వస్తుంటాయి. అమ్మాయిల్లో ఇవి 3 నుంచి 5 శాతం ఉండగా, అబ్బాయిల్లో 1 నుంచి 2 శాతం కనిపిస్తుంటాయి. పిల్లలకు వచ్చే ఇన్ఫెక్షన్లలో శ్వాసకోశవ్యాధుల తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లదే అతి పెద్ద స్ధానం. ఏడాది లోపు వయసుండే చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు మగపిల్లల్లోనే ఎక్కువ. అయితే పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ ఈ పరిస్థితి తారుమారై... మగపిల్లల కంటే ఆడపిల్లల్లోనే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. చిన్న పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు అనేక కారణాలుంటాయి. వయసు, జెండర్, అనువంశీకంగా కనిపించడం, వ్యాధి నిరోధక శక్తి, మూత్రకోశానికి సంబంధించి అంతర్గత అవయవ నిర్మాణంలో ఏవైనా తేడాలుండటం, మూత్రవిసర్జన తర్వాత ఎంతో కొంత మూత్రం లోపల మిగిలిపోవడం (వాయిడింగ్ డిస్ఫంక్షన్), మలబద్దకం, వ్యక్తిగత పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వంటి అనేక కారణాలతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. లక్షణాల ఆధారంగా కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నిర్ధారణ (డయాగ్నోజ్) చేయడం ఒకింత కష్టమే. ఎందుకంటే వీటి లక్షణాలు నిర్దిష్టంగా ఉండక వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే... కొన్ని లక్షణాలు సెప్సిస్, గ్యాస్ట్రోఎంటిరైటిస్ వంటి ఇతర జబ్బులను పోలి ఉండవచ్చు. అయినప్పటికీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లల్లో జ్వరం, తేలిగ్గా చిరాకు పడుతుండటం, సరిగా ఆహారం తీసుకోకపోవడం, వాంతులు, నీళ్లవిరేచనాలు, మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వచ్చినప్పుడు దాన్ని నియంత్రించుకోలేకపోవడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తికడుపులో నొప్పి, చుక్కలు చుక్కలుగా మూత్రం పడటం వంటి లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు. పిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను డయాగ్నోజ్ చేసినప్పుడు వారిలో మూత్ర కోశ వ్యవస్థకు సంబంధించి ఏదైనా లోపాలు ఉన్నాయేమో పరీక్షించడం తప్పనిసరి. ఉదాహరణకు ఇలాంటి పిల్లల్లో ఫైమోసిస్, విసైకో యూరేటరీ రిఫ్లక్స్ (వీయూఆర్), మూత్రపిండాల్లో ఏవైనా తేడాలు (కిడ్నీ అబ్నార్మాలిటీస్) వంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్లకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి పిల్లల్లో పదేపదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తే తప్పనిసరిగా కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ విత్ కల్చర్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్, వీసీయూజీ, మూత్రపిండాల పనితీరు తెలుసుకోడానికి న్యూక్లియర్ స్కాన్ వంటి పరీక్షలతో పాటు రీనల్ ఫంక్షన్ పరీక్షలు చేయించడం తప్పనిసరి. పిల్లలకు ఏవైనా అవయవ నిర్మాణపరమైన లోపాలు (అనటామికల్ అబ్నార్మాలిటీస్) ఉన్నట్లు బయటపడితే... వాటికి అవసరమైన సమయంలో సరైన శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది. ఇక ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి తప్పనిసరిగా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం చాలా ముఖ్యం. అలాగే చిన్నపిల్లలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే పదే వస్తున్నప్పుడు... కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించడానికి మూడు నుంచి ఆరు నెలల పాటు తప్పనిసరిగా ప్రొఫిలాక్టిక్ యూరినరీ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొద్దిగా పెద్ద పిల్లల విషయానికి వస్తే వారిలో మలబద్దకం లేకుండా చూడటం, తరచూ మూత్రవిసర్జన చేసేలా చూడటంతో పాటు మంచినీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకునేలా అలవాటు చేయడం అవసరం. మీరు పైన పేర్కొన్న విషయాలను అనుసరిస్తూ తగిన పరీక్షలు చేయించుకుని, మీ పిల్లల వైద్య నిపుణుడి ఆధ్వర్యంలో తగిన చికిత్సను కొనసాగించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బాబుకు చిన్న వయసులోనే కండరాల నొప్పులు..!
మా బాబుకు ఏడేళ్లు. ఇటీవల తరచూ కాళ్లూ చేతుల్లో నొప్పులు అంటున్నాడు. కండరాల నొప్పులు కూడా ఉన్నట్లు వాడి మాటలను బట్టి తెలుస్తోంది. వాడికి ఇతరత్రా ఎలాంటి అనారోగ్యమూ కనిపించడం లేదు. డాక్టర్గారికి చూపిస్తే విటమిన్-డి లోపాల వల్లగాని లేదా ఎదుగుదల సమయంలో వచ్చే నొప్పులు కావచ్చని అంటున్నారు. అయితే ఇటీవల నాకు కూడా కాళ్లూ, చేతుల్లో నొప్పి వస్తే డాక్టర్‌కు చూపించాను. నాకు విటమిన్-డి లోపం ఉన్నట్లు చెప్పారు. దీన్నిబట్టి మా బాబుకు నిశ్చయంగా విటమిన్-డి లోపమేనంటారా? ఇది ఇతర సమస్యలకు దారితీయవచ్చా? దయచేసి వివరంగా సలహా చెప్పండి. - సునంద, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ బాబుకు తీవ్రంగా ఎముకల నొప్పులతో పాటు కండరాల నొప్పులు కూడా ఉన్నట్లు చెప్పవచ్చు. ఇలాంటి లక్షణాలు అనేక కారణాల వల్ల కనిపించినప్పటికీ... ఇతర ఆరోగ్య సమస్యలు... అంటే... తరచూ జ్వరం, బరువులో మార్పులు, ఎదుగుదల సమస్యలు, కడుపుకు సంబంధించిన లేదా కాలేయానికి సంబంధించిన సమస్యలు, కీళ్లలో వాపులు, నడవడంలో తీవ్ర ఇబ్బందులు లేవు కాబట్టి మీ బాబు సమస్యను తీవ్రమైన ఇతర జబ్బులకు సూచనగా భావించలేం. మీ డాక్టర్‌గారు చెప్పినట్లుగా విటమిన్-డి లోపం ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు చాలా ఎక్కువగా చూస్తుంటాం. సాంప్రదాయికంగా ఇప్పటివరకూ బాగా చల్లగా ఉండి, సూర్యరశ్మి తక్కువగా ఉండే పాశ్చాత్య దేశాల్లోనే విటమిన్-డి లోపం ఎక్కువగా ఉంటుందనే అపోహ ఉండేది. అయితే ఇటీవల మన దేశంలాంటి ఉష్ణమండల (ట్రాపికల్) వాతావరణం ఉన్నచోట్ల కూడా విటమిన్-డి లోపాన్ని చాలా ఎక్కువగా చూస్తున్నాం. విటమిన్-డి అనేది అనేక ఆరోగ్య అంశాల నిర్వహణకు చాలా అవసరం. మన ఎముకల ఆరోగ్యానికి, పటిష్టతకు అది దోహదం చేస్తుంది. అలాగే మన దేహంలోని అనేక కీలక అవయవాల సమర్థమైన పనితీరుకు అది అవసరం. ఎండకు తగినంతగా ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల, మనం తీసుకునే ఆహారంలో విటమిన్-డి లోపం వల్ల, శాకాహార నియమాన్ని మరీ ఖచ్చితంగా పాటిస్తుండటం వల్ల, పాలతో అలర్జీ ఉండటం వల్ల విటమిన్-డి లోపం కనిపిస్తుంది. అలాగే కొందరిలో దీర్ఘకాలికంగా కాలేయ వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు ఉండటం, కొన్ని రకాల మందులు వాడుతుండటం జరుగుతుంటే ఈ లోపం కనిపించవచ్చు. ఇప్పుడు విటమిన్-డి లోపం అన్నది పిల్లల్లో, పెద్దల్లో కనిపించడం చాలా సాధారణమైంది. విటమిన్-డి లోపం ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చి స్పృహతప్పడం, కాళ్లూచేతులు వంకర్లు తిరగడం, కండరాల నొప్పులు, నడకలో నిదానం, రికెట్స్ కనిపించవచ్చు. దాంతోపాటు కొద్దిమందిలో వ్యాధినిరోధకశక్తి (ఇమ్యూనిటీ)లో లోపం రావడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ బారిన పడటం, ఆస్తమా, మతిమరపు, డయాబెటిస్, మల్టిపుల్ స్క్లిరోసిస్, గుండెజబ్బుల బారినపడటం వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు లోనయ్యేందుకు విటమిన్-డి లోపం ఒక కారణమని తెలుస్తోంది. మీ అబ్బాయి విషయంలో విటమిన్-డి లోపంతో పాటు బహుశా క్యాల్షియం మెటబాలిజం లోపాల వల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. అలాగే మీలోనూ విటమిన్-డి లోపం ఉన్నట్లు చెబుతున్నారు. కాబట్టి మీరు, మీ అబ్బాయి ఇద్దరూ విటమిన్-డి3తో పాటు క్యాల్షియమ్, ఫాస్ఫరస్ లోపాలు కనుగొనడానికి అవసరమైన వైద్యపరీక్షలతో పాటు థైరాయిడ్, పారాథైరాయిడ్ హార్మోన్ పరీక్షలు, సీబీపీ, సీపీకే పరీక్ష చేయించుకుంటే ఈ నొప్పులకు తగిన కారణాలపై పూర్తి స్థాయి సమాచారం తెలుస్తుంది. ఈ లోపం తొలగడానికి విటమిన్-డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం కంటే... సూర్యుడికి తగినంత ఎక్స్పోజ్ కావడమే చాలా ముఖ్యం. ఇక ఆహారం విషయానికి వస్తే విటమిన్-డి ఎక్కువగా ఉండే పాలు, చేపలు, మాంసాహారం తీసుకోవాలి. దీంతో పాటు విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మీ బాబు సమస్య తప్పక తగ్గుతుంది. అలాగే పైన పేర్కొన్న వాటితో పాటు క్యాల్షియం కూడా తగిన పాళ్లలో అందేలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ లోపం మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలిస్తే విటమిన్-డి ఇంజెక్షన్లను తీసుకోవాల్సి ఉంటుంది. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
పిల్లలు అదేపనిగా ఏడుస్తుంటే...?
మా పాప వయసు మూడు నెలలు. ఈ మధ్య ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటోంది. డాక్టర్గారికి చూపిస్తే ‘ఈ వయసు పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంటుంది, మరేం భయం లేదు’ అని కొన్ని మందులు రాశారు. మందులు వాడినప్పుడు కొద్దిరోజులు తగ్గినా ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. దయచేసి మా పాప సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - ఎస్. దిల్షాద్ బేగం, కర్నూలు పిల్లలు ఇలా అదేపనిగా ఏడవడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా ఎలాంటి ప్రమాదం లేని చిన్న సమస్య మొదలుకొని, చాలా ప్రమాదకరమైన సమస్య వరకూ అన్నింటినీ వారు ఏడుపు ద్వారానే తెలియజేస్తారు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. పిల్లలు అదేపనిగా ఏడ్వటానికి కొన్ని కారణాలు: ఆకలి వేయడం, భయపడటం, దాహం, మూత్ర విసర్జన తర్వాత డయాపర్ తడి కావడం, బయటి వాతావరణం మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండి వారికి అసౌకర్యంగా ఉండటం, భయపెట్టే పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడం (దీపావళి లేదా ఏదైనా సెలబ్రేషన్ సందర్భంగా బాణాసంచా కాల్చినప్పుడు పిల్లలు ఉలిక్కిపడి ఏడ్వటం సాధారణం), వారున్న గదిలో కాంతి మరీ ఎక్కువగా ఉండటం, పొగ వస్తూ ఊపిరి తీసుకోడానికి ఇబ్బందిగా పరిణమించడం, వారికి ఏవైనా నొప్పులు ఉండటం, దంతాలు వస్తుండటం, ఇన్ఫెక్షన్లు ఉండటం, కడుపునొప్పి (ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్) రావడం, జ్వరం, జలుబు, చెవినొప్పి, మెదడువాపు జ్వరం, గుండె సమస్యలు, కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలను పిల్లలు ఏడుపు ద్వారానే తెలియచేస్తారు. ఒకటి నుంచి ఆర్నెల్ల వయసులో ఉన్న పిల్లలు అదేపనిగా ఏడుస్తున్నారంటే దానికి కారణం ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటి సమస్యలు ఉండటం. మీ పాప విషయంలోనూ ఏడుపునకు మీ డాక్టర్‌గారు చెప్పినట్లుగా బహుశా కడుపునొప్పి (ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్) కారణం కావచ్చని అనిపిస్తోంది. ఈ సమస్య సాధారణంగా ఆరువారాల నుంచి మూడు నెలలలోపు పిల్లల్లో వస్తుంటుంది. ఈ వయసు పిల్లలు ఎక్కువగా కడుపునొప్పితో ఏడుస్తుండటం తరచూ చూస్తుంటాం. ఇది ముఖ్యంగా పేగులకు సంబంధించిన నొప్పి. ఇలాంటి పిల్లల్లో ఏడుపు నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేక పోయినప్పటికీ... ఆకలి, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను సరిగా ఎత్తుకోవడం (అప్ రైట్ పొజిషన్), కొద్దిసేపటి కోసం వాళ్ల పొట్టమీద వాళ్లను పడుకోబెట్టడం (ప్రోన్ పొజిషన్), తేన్పు వచ్చేలా చేయడం (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు. కొందరికి యాంటీస్పాస్మోడిక్‌తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే తప్పకుండా మీ పిల్లల డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బాబుకు పదే పదే విరేచనాలు...!
మా బాబుకు పదమూడు నెలలు. రెండు నెలల క్రితం వాడికి విపరీతంగా విరేచనాలు అయ్యాయి. దాంతో హాస్పిటల్లో చేర్చి చికిత్స చేయించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా మాటిమాటికీ తిరగబెడుతున్నాయి. మందులు వాడినప్పుడు తగ్గడం, వెంటనే మళ్లీ పెరగడం జరుగుతోంది. ఇది మినహా వాడికి ఇతరత్రా ఏ సమస్యలూ లేవు. అంటే... ఆడుకోవడం, ఆహారం తీసుకోవడం, పెరుగుదల ఇవన్నీ సక్రమంగానే ఉన్నాయి. మా వాడికి ఉన్న సమస్య ఏమిటి? వాడి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పండి. - శైలజ, చెన్నై మీరు వివరించిన లక్షణాలను బట్టి, మీ అబ్బాయికి దీర్ఘకాలిక (క్రానిక్) డయేరియా ఉన్నట్లు చెప్పవచ్చు. అంటే... ఏ సందర్భంలోనైనా విరేచనాలు రెండు వారాల కంటే ఎక్కువగా కొనసాగితే వాటిని దీర్ఘకాలిక డయేరియాగా పరిగణించవచ్చు. సాధారణంగా మన దేశంలోని పరిసరాలను పరిగణనలోకి తీసుకుంటే దీర్ఘకాలిక డయేరియాకు ప్రధానంగా ఇన్ఫెక్షన్స్ను కారణంగా చెప్పవచ్చు. అదే ఆర్థికంగా బలమైన దేశాలను తీసుకంటే అక్కడ వివిధ వయసుల వారిలో వచ్చే క్రానిక్ డయేరియాలను బట్టి అనేక కారణాలను విశ్లేషించాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్లకు గల కారణాలను పరిశీలిస్తే వైరల్, బ్యాక్టీరియల్, పోస్ట్ ఇన్ఫెక్షియస్, ట్రాపికల్ స్ప్రూ, ఎంజైమ్‌లలో మార్పులు, ఆహారం అరుగుదలలో మార్పులు... అంటే ఇందులోనూ మరీ ముఖ్యంగా చక్కెర పదార్థాలు, ప్రోటీన్ల అరుగుదలలో మార్పులు కూడా కారణం కావచ్చు. వీటితోపాటు ఇమ్యునలాజికల్, అలర్జిక్ వంటి అంశాలు కూడా విరేచనాలకు కారణమవుతాయి. అలాగే పేగుల స్ట్రక్చరల్ లోపాలు, మొటిలిటీలో మార్పులు కారణం కావచ్చు. వీటికి తోడు ఎండోక్రైన్ కారణాలనూ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. పిల్లల్లో వాళ్ల బరువు / ఎదుగుదల నార్మల్‌గా ఉంటే చాలావరకు తీవ్రమైన (సీరియస్) అంశాలు అంటే... ఐబీడీ, ఎంజైముల్లో లోపాలు, అనటామికల్ లోపాలు, ఇమ్యునలాజికల్ సమస్యల వంటివి అందుకు కారణం అయ్యే అవకాశం పెద్దగా లేదు. పిల్లలకు దీర్ఘకాలిక విరేచనాలు అవుతున్న సందర్భంలో కంప్లీట్ స్టూల్ ఎగ్జామినేషన్ (క్రానిక్ డయేరియా వర్కప్), కొన్ని స్పెషల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఎంజైమ్ పరీక్షలు, అవసరాన్ని బట్టి ఇంటస్టైనల్ బయాప్సీ, మైక్రో బయలాజికల్ పరీక్షలు, ఇంటస్టైనల్ మార్ఫాలజీ పరీక్షలు, ఇమ్యునలాజికల్ పరీక్షలు చేయించడం వల్ల నిర్దిష్టంగా కారణాన్ని తెలుసునే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబుకు ‘పోస్ట్ ఎంటరైటిస్’ అనే కండిషన్ ఉన్నట్లుగా చెప్పవచ్చు. అంటే... ఒక ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక లోపల జరిగిన నష్టం (డ్యామేజీ) వల్ల కొన్ని ఆహారాలకు అతడి కడుపు సెన్సిటివిటీని వృద్ధి చేసుకున్నట్లుగా విశ్లేషించవచ్చు. ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ వంటి వాటికి అతడి కడుపు సెన్సిటివ్‌గా మారడం లేదా ఇంకోరకం బ్యాక్టీరియా వల్ల మరోసారి ఇన్ఫెక్షన్ రావడం జరిగి ఉండవచ్చు. అలాగే ఈ వయసు పిల్లల్లో కొన్నిసార్లు రోజుకు 3 నుంచి 6 సార్లు విరేచనాలు కావచ్చు. దీన్ని ‘టాడ్లర్స్ డయేరియా’ అంటారు. మీ బాబు తీసుకున్న ఆహారం అతడి ఆహారకోశంలో ఉండాల్సిన టైమ్ కంటే తక్కువగా ఉండటం (డిక్రీజ్డ్ గట్ ట్రాన్జిట్ టైమ్) కూడా ఒక కారణం కావచ్చు. పై కండిషన్స్ వాటంతట అవే తగ్గిపోతాయి. తీసుకునే ఆహారంలో కొద్దిగా ఫైబర్ తగ్గించడం, చక్కెర పదార్థాలను పూర్తిగా మానేయడం ద్వారా గట్‌ఫ్లోరా పూర్తిగా రీప్లేస్ చేయడం వల్ల ఈ కండిషన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటి పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం, జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్-ఏ ఇవ్వడం, ఇన్ఫెక్షన్ ఉంటే దానికి తగిన చికిత్స చేయడం వల్ల పై కండిషన్లను పూర్తిగా నయం చేయవచ్చు. ఇక ఎలాంటి సందర్భాల్లోనైనా డయేరియా లక్షణాలు తగ్గకుండా ఉంటే ఇతర కారణాలను అన్వేషించి, వాటికి తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మీ బాబు విషయంలో పెరుగుదల, ఆడుకోవడం అంతా నార్మల్‌గా ఉందంటున్నారు కాబట్టి పైన పేర్కొన్న జాగ్రత్తలను తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
చిన్నపిల్లల్లోనూ మూత్రపిండాలలో రాళ్లు..?
మీరు చెప్పిన లక్షణాలను, సమాచారాన్ని బట్టి మీ అబ్బాయికి కిడ్నీలో రాళ్లు (నెఫ్రోలిథియాసిస్) ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్దవాళ్లతో పోలిస్తే ఈ కండిషన్ చిన్నపిల్లల్లో అంత సాధారణం కానప్పటికీ, ఇది అరుదైన విషయం మాత్రం కాదు. పిల్లల కిడ్నీల్లో రాళ్లు తయారుకావడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా కొన్ని జన్యుపరమైన అంశాలు ఇందుకు దోహదపడుతుంటాయి. పిల్లలు తీసుకునే ఆహారం, వాతావరణం, ఆర్థిక-సామాజిక పరిస్థితులు, ఎండోక్రైనల్ సమస్యల వంటివి కూడా ఇందుకు కారణాలే. ఇక పదహారేళ్లలోపు పిల్లల్లో 5 నుంచి 6 శాతం మందిలో కిడ్నీలో రాళ్లు కనిపిస్తుంటాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక పిల్లల్లో తరచూ మూత్రసంబంధ (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్స్ వస్తున్న సందర్భాల్లో... మూత్రపిండాల్లో రాళ్లకు అది ఒక ప్రధాన కారణమవుతుంది. పిల్లల కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు కడుపునొప్పి, మూత్రంలో రక్తం, కొన్నిసార్లు జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఈ రాళ్లలోనూ క్యాల్షియం కార్బొనేట్, ఆక్సలేట్స్, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్, స్ట్రువైట్ స్టోన్, సిస్టీన్ వంటి అనేక రకాలుంటాయి. పిల్లల కిడ్నీలో రాళ్లు కనిపించినప్పుడు వారిలో ఏవైనా జీవక్రియలకు సంబంధించిన లోపాల (మెటబాలిక్ డిజార్డర్స్) వంటివి ఉన్నాయా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ కండిషన్‌ను నిర్ధారణ చేయడానికి రొటీన్ మూత్రపరీక్షలు, రీనల్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ స్కాన్‌తో పాటు కొన్ని మెటబాలిక్ పరీక్షలు చేయించడం అవసరం. రీనల్ స్కాన్, మెటబాలిక్ పరీక్షల ద్వారా రాయి తాలూకు రసాయన స్వభావం తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే దానిపైనే ఆ తదుపరి చికిత్స ఆధారపడి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ రాయి పరిమాణం చిన్నదిగా ఉంటే దానంతట అదే మూత్రంతో పాటు పడిపోతుంది. ఇలాంటి పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగడం, పొటాషియం పాళ్లు ఎక్కువగా ఉండే ద్రవాహారాలు తీసుకోవడం, కొవ్వులు ఎక్కువగా, పిండిపదార్థాలు తక్కువగా ఉంటే కీటోజెనిక్ ఆహారానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వారిలో మూత్రసంబంధమైన (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే చికిత్స చేయించడం, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని పరిమితం గా తీసుకోవడం, ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించడం వంటి జాగ్రత్తలను పాటించాలి. ఇక ఉప్పు తక్కువగా తీసుకోవడం అవసరం. అలాగే ఉప్పు పాళ్లు ఎక్కువగా ఉండే చిప్స్, పచ్చళ్లు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే పాల ఉత్పాదనలు, మాంసాహారం, చీజ్ వంటి ఆహారాలను బాగా తగ్గించాలి. మీ అబ్బాయి విషయానికి వస్తే... అది ఎలాంటి రాయి అన్నది మనకు తెలియదు కాబట్టి దాని రసాయన స్వభావాన్ని తెలుసుకోవడం కోసం అవసరమైన పరీక్ష చేయించాలి. అలాగే ఎవరిలోనైనా రాయి పరిమాణం పెద్దదిగా ఉండి, అది దేనికైనా అడ్డుపడటం వల్ల కనిపించే లక్షణాలను కనబరుస్తుంటే దాన్ని శస్త్రచికిత్స లేదా షార్ట్వేవ్ లిథోట్రిప్సీ ప్రక్రియ ద్వారా తొలగింపజేసుకోవాలి. మీరు పైన పేర్కొన్న వివరాలను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. మూత్రపిండాల్లో రాళ్లు మళ్లీ మళ్లీ కనిపిస్తుంటే మాత్రం తప్పనిసరిగా దాని రసాయన స్వభావాన్ని అధ్యయనం చేయించి, అలాంటి రాయి పెరుగుదలను ప్రేరేపించే ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందుగా పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ నెఫ్రాలజిస్ట్‌ను గాని యూరాలజిస్ట్‌ను గాని సంప్రదించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
పాపకు పదే పదే జ్వరం... ఏం చేయాలి?
మా పాపకు రెండేళ్లు. ఇటీవల తనకు పదే పదే జ్వరం వస్తోంది. మా డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులు వాడుతున్నాం. పాపకు ఇతర సమస్యలేమీ ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మా డాక్టర్‌గారు కూడా అంటున్నారు. అయితే పాపకు తరచూ ఇలా జ్వరం ఎందుకు వస్తోంది? ఇదేమైనా తీవ్రమైన వ్యాధులకు సూచికా? ఆమె ఏమైనా ప్రత్యేకమైన పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉందా? మాకు తగిన సలహా ఇవ్వగలరు. - శ్వామల, కత్తిపూడి మీరు చెప్పిన సమాచారం, లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు మాటిమాటికీ జ్వరం వస్తున్నట్లు తెలుస్తోంది. దానికి ప్రత్యేకమైన కారణం ఇదీ అని చెప్పలేకపోయినప్పటికీ, ఇదంత తీవ్రమైన జబ్బుకు నిదర్శనంగా చెప్పే అవకాశం తక్కువే. ఎందుకంటే... పిల్లల్లో జ్వరంతో పాటు ఇతర లక్షణాలు... అంటే ముఖ్యంగా లింఫ్‌గ్రంథులు వాచడం (గడ్డలు), చర్మంలో మార్పులు, కీళ్లనొప్పులు (జాయింట్ పెయిన్స్), కంటిపొరలో మార్పులు, బరువు పెరగకపోవడం, రక్తహీనత ఉండటం, ఎడతెరిపిలేకుండా దగ్గు, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కూడా ఉంటే తప్పనిసరిగా ఈ జ్వరం ఏదైనా తీవ్రమైన వ్యాధికి సూచికగా చెప్పవచ్చు. అలాగే పిల్లల్లో జ్వరంతో పాటు తీవ్ర అస్వస్థత... అంటే ముఖ్యంగా నీరసంగా ఉండటం లేదా మగతగా ఉండటం లేదా కొంతమంది పిల్లలు చికాకుగా (ఇరిటబుల్గా) ఉండటం వంటి లక్షణాలను కనబరుస్తుంటే అది తీవ్రమైన వ్యాధికి సూచనగా చెప్పవచ్చు. అయితే చాలా మంది పిల్లల్లో జ్వరం అనేది నిర్దిష్టమైన కారణం లేకుండానే కనిపిస్తుంటుంది. వారికి కొన్ని నిర్దిష్టమైన పరీక్షలు చేయించడం ద్వారా ఆ జ్వరానికి కారణం తెలుసుకోవచ్చు. ఇక ఈ వయసులోని ఆడపిల్లల్లో జ్వరం వస్తుందంటే వారికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందేమోనని తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే... ఇలా పదే పదే జ్వరం కనిపించిన సందర్భాల్లో దాదాపు 50 శాతం మందిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండటానికి అవకాశం ఎక్కువ. ఇక కొన్నిసార్లు హెచ్ఎల్హెచ్ సిస్టమ్ అసోసియేటెడ్ కండిషన్స్‌లో కూడా దీర్ఘకాలిక జ్వరాలు రావచ్చు. అయితే వాళ్లలో కనిపించే లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మీ పాప విషయంలో జ్వరానికి కారణం నిర్ధారణ చేయడం కోసం రక్తానికి చెందిన బ్లడ్ పిక్చర్, బ్లడ్ కల్చర్ పరీక్షలతో పాటు ఛాతీ ఎక్స్‌రే, డిటెయిల్డ్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ వంటి సాధారణ పరీక్షలతో పాటు అవసరమైనప్పుడు ఇమ్యునోగ్లోబ్యులిన్ లెవెల్స్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని తెలుసుకోవడం కోసం రొటీన్ యూరినరీ పరీక్షలు, యూరిన్ కల్చర్ పరీక్షతో పాటు అవసరమైతే యూరినరీ ట్రాక్ట్‌లో ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయేమో తెలుసుకోవడం కోసం... అంటే ముఖ్యంగా వెసైకో యూరినరీ రిఫ్లక్స్ (వీయూఆర్) ఉందేమో అని తెలుసుకోవడం కోసం ఎమ్సీయూజీ అనే పరీక్ష కూడా చాలా అవసరం. మీ పాప విషయంలో యూరినరీ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడితో చర్చించి, తగు వైద్య పరీక్షలు చేయించుకొని, దాన్ని బట్టి అవసరమైన చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బాబు కళ్లుతిరిగి పడిపోతున్నాడు... ఏం చేయాలి?
మా బాబుకు ఎనిమిదేళ్లు. ఇటీవల రెండుసార్లు కళ్లు తిరిగిపడిపోయాడు. ఒకసారి స్కూల్లో, మరోసారి ఇంటివద్ద ఆడుకుంటున్నప్పుడు ఇలా జరిగింది. అయితే రెండుసార్లు కూడా వాడంతట వాడే తేరుకున్నాడు. వాడికి ఇప్పటివరకూ ఎలాంటి ఆరోగ్య సమస్యా లేదు. డాక్టర్‌కు చూపిస్తే ‘పర్వాలేదు. పిల్లల్లో ఇది సాధారణంగా ఉండే సమస్యే’ అన్నారు. ఇది మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉందా? మా బాబు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరించండి. - స్రవంతి, ఏలూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను ‘సింకోప్’ అని చెప్పవచ్చు. అంటే అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోవడం. ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. యుక్తవయసులోపు దాదాపు 15 శాతం మంది పిల్లల్లో ఏదో ఒక సమయంలో ఇది కనిపిస్తుంది. సాధారణంగా ఈ సమస్య అంత ప్రాణాపాయకరం కానప్పటికీ, కొన్ని సందర్భాల్లో మాత్రం ఇది ప్రాణాపాయకరమైన వ్యాధులకు సూచికగా చెప్పవచ్చు. మనం తరచూ పిల్లల్లో ఉదయం వేళ స్కూల్ అసెంబ్లీలో లేదా క్లాసులో పడిపోవడం వంటి సందర్భాలను చూస్తుంటాం. అందుకు ఆర్థోస్టాటిక్ / పొజిషనల్ వేరియేషన్స్ లను కారణంగా చెప్పవచ్చు. కొన్నిసార్లు వ్యాసోవేగల్ స్టిమ్యులేషన్స్ అంటే... ఉదాహరణకు తీవ్రమైన నొప్పితో కూడుకున్న మూత్రవిసర్జన, మలవిసర్జన, గాయం కావడం, ఒక్కోసారి గట్టిగా తలదువ్వడం వంటి సందర్భాల్లో కూడా సింకోప్‌ను చూస్తుంటాం. అలాగే గుండెజబ్బులు... ఉదాహరణకు అరిథ్మియా, అయోర్టిక్ స్టెనోసిస్, సైనోటిక్ గుండె సమస్యలు, కార్డియోమయోపతి ఉన్న కండిషన్లలో; అలాగే మైగ్రేన్ ఉన్న పిల్లల్లో కూడా సింకోప్ కనిపించవచ్చు. ఇక ఫిట్స్ / సీజర్స్ ఉన్న పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉండవచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో ఏవైనా విషవాయువులు, మందులకు ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా సింకోప్‌ను గమనించవచ్చు. ఇలా పైన పేర్కొన్న అన్ని కండిషన్లలోనూ పిల్లలు కళ్లు తిరిగి పడిపోతుంటారు. ఇక కొన్నిసార్లు అతి సాధారణమైన కారణాలైన ఆహారం సరిగా తీసుకోకపోవడం, రక్తంలో చక్కెర పాళ్లు తగ్గే హైపోగ్లైసీమియా ఎపిసోడ్స్‌లో కూడా కళ్లు తిరిగిపడిపోవచ్చు. పిల్లల్లో సింకోప్ కనిపించినప్పుడు ఎంత వ్యవధి పాటు అలా స్పృహలో లేకుండా ఉండిపోయారు అన్న విషయంతో పాటు ఆ సమయంలో అతడిలో కనిపించిన లక్షణాలు (అసోసియేటెడ్ సింప్టమ్స్) అంటే ఉదాహరణకు గుండె స్పందనలు తగ్గడం, నీలంగా అయిపోవడం, దీర్ఘకాలం పాటు అలా అపస్మారకంలో ఉండటం కూడా కనిపిస్తే అది కొంచెం తీవ్రమైన జబ్బుకు సూచన కావచ్చేమోనని అనుమానించాలి. పిల్లల్లో పదే పదే సింకోప్ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు (కార్డియాక్ ఇవాల్యుషన్)తో పాటు అవసరమైనప్పుడు న్యూరలాజికల్ ఇవాల్యూయేషన్ కూడా చేయించాలి. ముఖ్యంగా ఈసీజీ, హోల్టర్, ఈఈజీ వంటి పరీక్షల ద్వారా అది తీవ్రమైన జబ్బులకు సూచనా, కాదా అన్న విషయం తప్పనిసరిగా తెలుస్తుంది. ఇక పిల్లలు కూర్చున్నప్పుడు కూడా కళ్లు తిరిగిపడిపోవడం వంటి సంఘటనలు జరిగితే వాళ్లకు తక్షణమే తప్పనిసరిగా తగు పరీక్షలు చేయించి, కారణాలు తెలుసుకోవడం అవసరం. ఇక మీ బాబు విషయంలో ఇది ఆర్థోస్టాటిక్ సింకోప్గా అనిపిస్తోంది. ఇది ముఖ్యంగా నిలబడి ఉన్నప్పుడు మెదడుకు తగినంత ఆక్సిజన్ అందని సందర్భాల్లో కనిపిస్తుంది. ఇలాంటి పిల్లల విషయంలో వాళ్లను కాసేపు ఫ్లాట్‌గా పడుకోబెడితే వాళ్లంతట వాళ్లే తేరుకుంటారు. ఇలాంటి పిల్లలకు నీళ్లు ఎక్కువగా తాగిస్తూ ఉండటం, వాళ్లు ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్లోకి మారుతున్నప్పుడు నింపాదిగా చేయడం లేదా కొద్దిగా సమయం తీసుకోవడం అవసరం. ఉదాహరణకు మంచం మీద పడుకుని ఉన్నవారు అకస్మాత్తుగా కూర్చొని, ఆ వెంటనే పరుగెత్తడం వంటివి చేయకూడదు. అలాగే నిలబడి ఉన్నప్పుడు కాళ్లు కాస్తంత కదుపుతూ ఉండటం వంటివి చేస్తే ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం తక్కువ. మీ అబ్బాయికి మళ్లీ ఇవే లక్షణాలు కనిపిస్తే పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ, ఒకసారి కార్డియాలజిస్టుకు తప్పనిసరిగా చూపించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బాబుకు ఈ వయసులోనే జీర్ణ సమస్య... తగ్గేదెలా?
మా అబ్బాయికి ఐదేళ్లు. ఇటీవల వాడికి ఏం తినిపించినా జీర్ణం కావడం లేదు. ఎప్పుడూ కడుపు ఉబ్బరంగా ఉంటోంది. ఏదైనా తినిపించిన కొద్దిసేపటికే వాంతులు చేసుకుంటున్నాడు. ఎప్పుడూ నీరసంగా ఉంటున్నాడు. వాడి విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి. - ఆర్. కుమార్, విజయవాడ చిన్న పిల్లలు వాంతులు చేసుకోవడం అన్నది తరచూ చూసే సమస్యే అయినా మీరు చెబుతున్నట్లుగా ఈ వయసులో అరుగుదలలో లోపాలు ఉండటం, కడుపు ఉబ్బరంగా ఉండటం, తిన్న వెంటనే వాంతులు కావడం అన్న విషయాలను కాస్త సీరియస్‌గానే పరిగణించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఈ వయసు పిల్లల్లో... గాస్ట్రో ఎంటిరైటిస్, గ్యాస్ట్రో ఇంటస్టినల్ రిఫ్లక్స్, ఎక్కువగా తినేయడం, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, పొట్టలో అల్సర్స్, కొన్ని మెటబాలిక్ కండిషన్స్ వల్ల తరచూ ఈ తరహా లక్షణాలను చూస్తుంటాం. అలాగే మాల్ అబ్జార్ప్షన్ (అంటే తిన్నది సరిగా ఒంటబట్టకపోవడం) కూడా ఒక కారణం కావచ్చు. అయితే మీ అబ్బాయి విషయంలో అతడి సమస్యకు గ్యాస్ట్రో ఇంటస్టినల్ రిఫ్లక్స్ లేదా శరీర నిర్మాణపరమైన అడ్డంకులు (అంటే... పేగు తిరగబడటం లాంటి మాల్రొటేషన్, హయటస్ హర్నియా, కంజెనిటల్ బ్యాండ్) వంటివి కారణాలు కావచ్చా అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని రొటీన్ ఇవాల్యుయేషన్స్తో పాటు బేరియం మీల్ పరీక్షలు చేయించడం కూడా అవసరం. ఆ పరీక్షలతో చాలావరకు సమాచారం తెలుసుకోవచ్చు. పై విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మీరు ఒకసారి మీ పీడియాట్రీషియన్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లను సంప్రదించి తగిన సూచనలు, చికిత్స తీసుకోండి. మా బాబుకు ఏడేళ్లు. పుట్టుకతోనే రక్తంలో తెల్లరక్తకణాలు లేవని డాక్టర్లు చెప్పారు. దాంతో తరచూ రక్తం ఎక్కిస్తూ తెల్లరక్తకణాలను భర్తీ చేయాల్సి వస్తోంది. మా బాబుకు ఇలా ఎన్నాళ్లు ఎక్కించాలి? అతడి కండిషన్‌కు శాశ్వత చికిత్స లేదా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. - ఎమ్. నారాయణరావు, రాజమండ్రి మీరు చెప్పిన లక్షణాలను బట్టి, మీ బాబుకి థ్రాంబో సైటోపీనియా ఉన్నట్లు అందులోనూ... ఏమెగాకారియోసైటిక్ థ్రాంబోసైటోపీనియా అనే కండిషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ కండిషన్ ఉన్నవాళ్లలో సాధారణంగా రక్తం గడ్డకట్టడంలో సమస్యలు ఉంటారుు. ఇది వురికొన్ని జన్యుపరమైన సవుస్యలతోనూ ఇది కలిసి ఉండవచ్చు. ఇలాంటి సవుస్య ఉన్నవారిలో దాదాపు 20 శాతం వుంది పిల్లల్లో ఇది ఎప్లాస్టిక్ అనీమియా అనే వురింత తీవ్రమైన పరిస్థితికి దారితీయువచ్చు. అంటే... సాధారణ అనీమియూలో ఎర్రరక్తకణాలు వూత్రమే తగ్గితే... ఈ ఎప్లాస్టిక్ అనీమియూలో రక్తంలోని అన్ని రకాల కణాలూ తగ్గుతారుు. అరుదుగా ఒక శాతం వుంది పిల్లల్లో ల్యూకేమియూ కూడా రావచ్చు. మీ బాబుకు పీడియూట్రిక్ హివుటాలజిస్ట్ ఆధ్వర్యంలో చికిత్స అందించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బాబుకు కాళ్లు, చేతుల మీద ర్యాష్... ఏం చేయాలి?
మా బాబుకు మూడేళ్లు. వాడికి ఇటీవల కాళ్లు, చేతుల మీద నీటిపొక్కుల్లా వచ్చాయి. ఇదే ర్యాష్ మా ఏడాదిన్నర పాపకు కూడా వచ్చింది. ఇది చికెన్‌పాక్స్ అని చికిత్స చేశారు. అయితే మా వాడికి పోయిన ఏడాది కూడా ఇలాగే ర్యాష్ వచ్చి తగ్గిపోయింది. అలాగే వాడికి చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇలా మళ్లీ మళ్లీ ఎందుకు ర్యాష్ వస్తోంది? అసలిది చికెన్పాక్సేనా? - కేశవనాయుడు, చిత్తూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ బాబుకు జ్వరంతో కలిసి కొద్దిపాటి పాపిలో వెసైకిల్ ర్యాష్ వచ్చినట్లు తెలుస్తోంది. పిల్లల్లో జ్వరంతో పాటు కలిసి ర్యాష్ వచ్చే జబ్బులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మీజిల్స్, రుబెల్లా, చికెన్‌పాక్స్, డెంగ్యూ, హెర్పిస్ సింప్లెక్స్, కాక్సాకీ వంటి వైరల్ జబ్బులు, అలాగే స్టాత్ ఆర్ఎస్, స్టెఫాలోకాకస్, రికెట్షియల్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో పాటు కొన్ని కొల్లాజెన్ డిసీజెస్ వల్ల కూడా శరీరం మీద ఇలా ర్యాష్ వస్తుండవచ్చు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి, మీ అమ్మాయికి కూడా ర్యాష్ రావడం వంటి అంశాన్ని బట్టి, మీరు వివరించిన విస్తృతిని బట్టి చూస్తుంటే మీ పిల్లలకు ఈసారి వచ్చింది చికెన్‌పాక్స్ కాదు. వారిద్దరికీ వచ్చిన జబ్బు ‘హ్యాండ్ ఫుట్ మౌత్ సిండ్రోమ్’లా అనిపిస్తోంది. ఇది కాక్సాకీ వైరస్, ఎంటిరో వైరస్ అనే తరహా వైరస్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. దీన్ని చిన్నపిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల నుంచి ఆరేళ్ల పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఈ పిల్లల్లో నొప్పితో కూడిన ఎర్రటి ర్యాష్ వేళ్ల మీద, కాళ్ల మీద వస్తుంటాయి. నోటిలోపలి భాగంలో అల్సర్స్ రూపంలో కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ర్యాష్‌తో పాటు చాలా కొద్దిశాతం మంది పిల్లల్లో గుండె ఇన్వాల్వ్మెంట్ (మయోకార్డయిటిస్), లంగ్ ఇన్వాల్వ్మెంట్ (నిమోనియా), బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ (ఎన్కెఫలైటిస్) వంటి తీవ్రమైన అంశాలతో పాటు, చాలామందిలో శ్వాసకోశ (రెస్పిరేటరీ) ఇన్ఫెక్షన్లు, చెవినొప్పి వంటి కొద్దిపాటి లక్షణాలు కూడా కనపడుతుండవచ్చు. తీవ్రతను బట్టి ఈ జబ్బు మూడు నుంచి ఐదురోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. వాడినా ప్రయోజనం ఉండదు. కానీ నొప్పి, దురద నుంచి ఉపశమనం పొందడానికి మందులు వాడాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత పెరుగుతున్నప్పుడు లేదా దాని కాంప్లికేషన్లు పెరుగుతున్నప్పుడు యాంటీవైరల్ మందుల వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు. గత కొద్ది నెలలుగా ఈ లక్షణాలున్న పిల్లలను చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి లక్షణాలు నెలల పిల్లల్లో వచ్చినప్పుడు సెప్సిస్ వంటి కారణాలను రూల్ అవుట్ చేయడం చాలా ముఖ్యం. ఇక మీరు చెబుతున్న చికెన్‌పాక్స్ విషయానికి వస్తే... దానికోసం వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ అది మళ్లీ రావచ్చు. కానీ అప్పుడు దాని తీవ్రత తక్కువగా ఉంటుంది. చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వ్యాధి నివారణ, తీవ్రత తగ్గించడానికి వీలవుతుంది. కాబట్టి మీరు మీ బాబు, పాప విషయంలో ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బాబు గుండెలో రంధ్రాలు... ఏం చేయాలి?
మాకు ఇటీవలే బాబు పుట్టాడు. నెల రోజుల తర్వాత బాగా జలుబు చేసినట్లుగా, నెమ్ము చేరినట్లుగా అనిపిస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాం. కొన్ని పరీక్షలు చేసి గుండెలో రంధ్రాలు ఉన్నాయని పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్లి చూపిస్తే గుండెలోపల రెండు రంధ్రాలు ఉన్నాయనీ, బాబుది చిన్నవయసే కాబట్టి అతడు పెరుగుతున్న కొద్దీ వాటంతట అవే పూడుకుంటాయన్నారు. మాకు చాలా దిగులుగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వగలరు. - శ్రీధర్, షాద్‌నగర్ బాబు గుండెలో రంధ్రాలున్నాయంటూ మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ బాబుకు ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ఏఎస్డీ... అంటే గుండె పైగదుల్లోని గోడలో రంధ్రాలు)గాని, వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్డీ... అంటే గుండె కింది గదుల్లోని గోడలో రంధ్రాలు) గాని ఉండవచ్చు. ఇలా గుండె గదుల్లోని గోడలపై రంధ్రాలు ఉన్న సమస్యతో పిల్లలు నీలంగా మారిపోతూ (సైనోసిస్) ఉంటే అలాంటప్పుడు పిల్లలకు తక్షణం శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో గుండె గదుల గోడలకు రంధ్రాలు ఉన్నప్పటికీ, పిల్లలు నీలంగా మారనప్పుడు, శ్వాసకోశానికి సంబంధించిన ఇతరత్రా ఏ సమస్యలు లేకుండా ఉన్నప్పుడు తక్షణం శస్త్రచికిత్స అవసరం ఉండకపోవచ్చు. ఐతే అలాంటి పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి చికిత్స అవసరమన్నది... ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానం మొదలైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయా లేదా అన్నది కూడా ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానాలను బట్టి, ఆ రంధ్రాలు ఉండటం వల్ల వచ్చే ఇతరత్రా సమస్యల (అసోసియేటెడ్ కార్డియాక్ డిఫెక్ట్స్) పై ఆధారపడి ఉంటుంది. గుండె పైగదుల మధ్య ఉన్న గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 60 నుంచి 70 శాతం మందిలో ఆ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయి. గుండె కింది గదుల్లోని గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 30 నుంచి 40 శాతం మందిలోనూ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోవచ్చు. అలాగని గుండె గోడలకు ఉన్న రంధ్రాలన్నీ వాటంతట అవే మూసుకుపోతాయని చెప్పలేం. ఇలా గుండె గదుల మధ్య గోడకు రంధ్రాలు ఉన్న పిల్లలకు తరచూ నెమ్ము రావడం చూస్తుంటాం. అలాంటప్పుడు పిల్లలకు తక్షణ చికిత్స ఎంతైనా అవసరం. మీరు మీ అబ్బాయిని కనీసం ప్రతి ఆర్నెలకూ ఒకసారి పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌కు చూపించాలి. ఒకవేళ గుండె గదుల మధ్యనున్న రంధ్రాలు వాటంతట అవే మూసుకోకపోయినా మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుండె గదుల గోడలపై రంధ్రాలున్న పిల్లలకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్యచికిత్స సహాయంతో - శస్త్రచికిత్స లేదా శస్త్రచికిత్స లేకుండానే ఇంట్రావెన్షన్ ద్వారా దాదాపు 95 శాతం పైగా సక్సెస్ రేట్‌తో సమర్థంగా చికిత్స చేయడానికి అవకాశం ఉంది. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్