ఏపీ: పీడియాట్రిక్‌ కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నియామకం | AP Govt Appoints Pediatric Covid Task Force Committee | Sakshi
Sakshi News home page

ఏపీ: పీడియాట్రిక్‌ కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నియామకం

Published Sat, May 29 2021 3:48 PM | Last Updated on Sat, May 29 2021 4:38 PM

AP Govt Appoints Pediatric Covid Task Force Committee - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీడియాట్రిక్‌ కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు పెద్దలపైనే తీవ్ర ప్రభావం చూపుతున్న మహమ్మారి.. మూడో దశలో పిల్లలపై అధికంగా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అప్రత్తమైన ప్రభుత్వం ఏపీఎంఎస్‌ఐడీసీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో 8 మందితో పీడియాట్రిక్‌ కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.  పిల్లలకు కోవిడ్‌ సోకితే తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. వారంలోగా ప్రాథమిక నివేదక ఇవ్వాల్సిందిగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. 

చదవండి: చిన్న పిల్లల్లో కోవిడ్‌ చికిత్స విధానానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement