ప్రస్తుతం చాలామటుకు కూర్చొని చేసే డెస్క్ జాబులే. దీంతో గంటలకొద్ది కంప్యూటర్ల ముందు కూర్చొండిపోవడంతో చాలామంది పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో ఎక్కువమంది బాధపడటానికి కూడా కారణం ఇదే అని చెప్పొచ్చు. అలా ఎక్కువసేపు కూర్చొవడంతో పిరుదుల వద్ద కండరాలు బిగిసుకుపోయి ఉండిపోతాయి. దీంతోపాటు కాళ్లు, తొడలు, పొత్తుకడుపులో ఫ్యాట్ కూడా పేరుకుపోతుంటుంది. దీంతో ఊబకాయం, గుండెజబ్బులు, అకాల మరణం వంటి అనారోగ్యం బారినపడుతున్నారు చాలామంది. అయితే ఈసమస్యను అధిగమించడానికి ఎంత సేపు వ్యాయమం చేస్తే మంచిదో తాజా అధయనాల్లో పరిశోధకులు వెల్లడించారు. ఎంత వ్యవధి వ్యాయమాలు మనకు హెల్ప్ అవుతాయో సవివరంగా వివరించారు. అవేంటో చూద్దామా..!.
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను భర్తీ చేయడానికి సరైన వ్యాయామం వ్యవధి జస్ట్ 40 నిమిషాలేనట. ప్రతిరోజూ '40 నిమిషాల వరకు సాధారణమైన వ్యాయమాల నుంచి శక్తిమంతమైన వ్యాయమాలు చేస్తే సరిపోతుందట. పదిగంటలు నిశ్చలంగా ఒకే చోట కూర్చోనేవారు ఇలా జస్ట్ 40 నిమిషాలు వ్యాయమానికి కేటాయిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని ధీమాగా చెబుతున్నారు పరిశోధకులు.
దీనికోసం నాలుగు వేర్వేరు దేశాల్లో మొత్తం 40 వేల మందికి పైగా వ్యక్తులపై ఫిట్‌నెస్ ట్రాక్‌ని విశ్లేషించారు. వారిలో సూమారు 30 నుంచి 40 నిమిషాలు సాధారణ వ్యాయమాలతో మొదలై అధిక తీవ్రత వ్యాయమాలతో పూర్తి చేసిన వ్యక్తుల్లో ఎలాంటి అనారోగ్య ప్రమాదాలు ఉండవని తేలింది. వారిపై దుష్ర్పభావాలు గణనీయంగా తగ్గినట్లు వెల్లడైందని అన్నారు. ఎక్కువ గంటలు కూర్చొని పనిచేసే వ్యక్తుల ముఖ్యంగా సైక్లింగ్, వాకింగ్, తోటపని వంటివి చేస్తే వారిపై ఎలాంటి అనారోగ్యం ప్రభావం ఉండదని అన్నారు.
తప్పనిసరిగా చేయవల్సినవి..
ప్రతి గంటకు 5 నిమిషాలు నడవడం. చిన్న చిన్న విరామాలు తీసుకోవడం.
అలాగే తుంటి, నడుమ భాగాలను సాగదీయడం వంటివి చేస్తే ఎక్కువసేపు కూర్చొవడం వల్ల ఎముకలు పట్టేసినట్లు అనిపించవట.
అలాగే బరువు వ్యాయామాలు చేయడం వల్ల బాడీ తేలికగా ఉంటుందట.
స్క్వాట్‌లు, పుష్ అప్‌లు కండరాలను సక్రియం చేస్తాయి, జీవక్రియనున పెంచుతాయి.
సాధ్యమైనంత వరకు స్టాండింగ్ డెస్క్‌ను ఉపయోగించడం వల్ల ఎక్కువసేపు కూర్చొవడాన్ని నిరోధించొచ్చు
మెట్టు ఎక్కడం వంటివి కూడా మంచి ఫలితాన్ని అందిస్తాయట.
ఈ కొత్త పరిశోధన బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలను మనకున్న పరిమితుల్లోనే సులభంగా అధిగమిద్దాం ఆరోగ్యంగా ఉందాం.
(చదవండి: రాయల్ డెజర్ట్ "మైసూర్ పాక్" ఎవరు తయారు చేశారో తెలుసా..!)
Comments
Please login to add a commentAdd a comment