శరీరం తేలికగా కదలటానికి, చురుకుగా ఉండటానికి ఎముకలు బలంగా ఉండటం ఎంతైనా అవసరం ఎముకలు బలహీనపడితే.. విరగడం, ఆస్టియోపోరోసిస్ ముప్పు పెరుగుతుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవన శైలిమార్పులతోపాటు, వ్యాయామాన్ని కూడా క్రమం తప్పకుండా చేయాలి.
ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి, అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదాన్ని నివారించగల శక్తి అధో ముఖానికి ఉంది. రోజూ ఈ ఆసనాన్ని దినచర్యలో భాగం చేస్తూ ఉంటే మైండ్, బాడీ చురుకుదనం పెరుగుతుంది.
ఇలా వేయాలి....
∙మ్యాట్ పైన లేదా నేలపైన నిటారుగా నిల్చొని చేతులను పైకి స్ట్రెచ్ ఉంచాలి. తర్వాత నడుం భాగం వంచుతూ, చేతులను పూర్తిగా నేలమీద ఆనించాలి. ∙చేతులను పాదాలకు దూరంగా తీసుకెళుతూ త్రికోణాకారంలో ఉండాలి.
కాలి వేళ్ల మీద ఉంటూ మడమలను పైకి లేపాలి. శరీర బరువు చేతులు, కాలి ముని వేళ్ల మీద ఉంటుంది.
∙నిమిషం సేపు ఇదే భంగిమలో ఉండాలి. తిరిగి యధాస్థితికి రావాలి. ఇలా ఒకటి నుంచి 3 సార్లు ఈ ఆసనాన్ని పునరావృతం చేయాలి.
ఈ ఆసనం వేయటానికి మొదట్లో కాస్త కష్టంగా వున్నా రోజూ సాధన చేస్తూ ఉంటే సులువవుతుంది. వెన్నెముక, కాళ్ళను బలోపేతం చేస్తుంది. అదే విధంగా ఏకాగ్రత పెంచి, ఒత్తిడి నుండి రిలీఫ్‌ని ఇస్తుంది. అజీర్తి సమస్యలు దూరమవుతాయి. నడుము నొప్పి తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్ సమస్య నుండి రక్షిస్తుంది. సైనస్, ఆస్తమా, పీరియడ్స్‌లో వచ్చే సమస్యల నుంచి రిలీఫ్‌ని ఇస్తుంది. ఇన్ని ప్రయోజనాలని ఈ ఆసనం ద్వారా పొందవచ్చు.
ఎముకలు దృఢంగా ఉండటానికి ఏం చేయాలి?
ఎముకలు దృఢంగా ఉండాలంటే.. సమతుల్య, పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి.
కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు సమృద్ధిగా లభించే ఆహారం తినాలి.
పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు తినాలి.
విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారాలు తినాలి.
బాల్యంలో ఎముకలు దృఢంగా ఉండటానికి పోషకాలు తీసుకోవడం ముఖ్యం.
వ్యాయామం చేయడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.
మెనోపాజ్ దాటిన స్త్రీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎముకలు, కండరాలను బలోపేతం చేసేలా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
ఇదీ చదవండి: టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్‌ఫ్లూయెన్సర్ మృతి
Comments
Please login to add a commentAdd a comment