హెల్త్
మెనోపాజ్ అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన దశ. ఇది సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య కాలంలో సంభవించే రుతుక్రమ ముగింపును సూచిస్తుంది. హార్మోన్లు.. ప్రధానంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి తగ్గుదల వల్ల ఒంట్లో వేడి, మానసిక అలజడి, నిద్ర పట్టకపోవడం, బరువు పెరగడం వంటివి సంభవిస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు చాలామంది ‘ఇది ఈ సమయంలో సహజమే, భరించాలి మరి’ అని చెబుతుంటారు. అయితే, మెనోపాజ్ దశనూ ఆహ్లాదంగా గడిపేయాలంటే నిపుణులు సూచనలను పాటించడం మేలు.
ప్రధానంగా శారీరక శ్రమ వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఎండార్ఫిన్ విడుదల ద్వారా మానసిక స్థితి బాగవుతుంది. ఎముకలను బలోపేతం చేయడం ద్వారా బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో΄÷రోసిస్) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం, ఏరోబిక్స్ వంటివి హాయినిచ్చే నిద్రను, పనిచేయగలిగే సామర్థ్యాన్నీ పెంచుతాయి. మెనోపాజ్ సమయం లో ఉపశమనం కలిగించే ఈ 8 వ్యాయామాలను ఒక అలవాటుగా మార్చుకోవాలి.
1. వాకింగ్..
నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడే ప్రభావ వంతమైన వ్యాయామం ఇది. జీవక్రియలు మందగించినప్పుడు ఇది కీలకంగా పనిచేస్తుంది. ఒత్తిడిని నివారిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
2. యోగా..
ఆందోళనను తగ్గించడంలో యోగా ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని యోగ భంగిమలు కీళ్ల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. విశ్రాంతిని, మంచి నిద్రను ΄÷ందడంలో సహాయపడతాయి.
3. పవర్ ట్రెయినింగ్..
మెనోపాజ్ వల్ల కలిగే కండరాల క్షీణతను ఎదుర్కోవడానికి పవర్ ట్రెయినింగ్ సహాయపడుతుంది. ఎముక సాంద్రత మెరుగవుతుంది. ఆస్టియో΄÷రోసిస్ వంటి ఎముకల వ్యాధి వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువులు ఎత్తడం వల్ల కండరాల శక్తి పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది.
4. ఈత..
మెనోపాజ్ దశలో స్విమ్మింగ్ అనేది శరీరమంతటికీ పనికి వచ్చే వ్యాయామంగా చెప్పుకోవచ్చు. ఇది కీళ్లపై సున్నితంగా పనిచేస్తుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు ఉండి, రుతుక్రమం ఆగిన మహిళలకు చాలా ఉపశమనంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది. శరీరంలో వేడి ఆవిర్లు వచ్చినట్లు అనిపించే భావనను తగ్గించి, శరీరాన్ని చల్లబరచడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది.
5. పిలాటిస్..
శరీర భంగిమలను సరిచేయడానికి ఉపకరించే ఆధునిక వ్యాయామ పద్ధతులను పిలాటిస్ అంటారు. ప్రత్యేక సాధనాల తో ఈ వ్యాయామాలు చేస్తారు. కండరాల బలాన్ని పెంచడానికి, నొప్పులను తగ్గించడానికి సున్నితమైన కదలికల ద్వారా శరీరంపై ఎక్కువ ఒత్తిడిని కలిగించకుండా ఈ వ్యాయామాలు చేస్తారు.
6. నృత్యం..
చురుకుగా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించడానికి డ్యాన్స్ ఒక ఆహ్లాదకరమైన మార్గం. డ్యాన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. సామాజికంగానూ నలుగురిని కలిసేలా చేస్తుంది. ఒంటరితనం భావాలను తగ్గిస్తుంది.
7. తాయ్ – చి..
తాయ్– చి వ్యాయామంలో కదలికలు నెమ్మదిగా ఉన్నా శారీరక ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం రుతుక్రమం ఆగిన మహిళలకు ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
8. సైక్లింగ్..
హిప్ కింది భాగానికి బలం చేకూరుతుంది. ఎండార్ఫిన్ల విడుదల ద్వారా మానసిక స్థితి మెరుగవుతుంది. ఈ వ్యాయామాలు మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
ఇవి చదవండి: ఇంటి రూఫ్.. మొక్కలు సేఫ్..!
Comments
Please login to add a commentAdd a comment