యోగం.. ఏకాగ్రతకు వారియర్‌పోజ్
యుద్ధానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా ఈ యోగా భంగిమలు ఉంటాయి. అందుకే, దీనిని వారియర్ పోజ్ అంటారు. ఈ యోగ భంగిమలో ఒక కాలి తుంటి భాగం ముందుకి ఉంటుంది. మరొక కాలు వెనక్కి చాపి, మునివేళ్ల మీద ఉంచాలి. చేతులను తలమీదుగా నిటారుగా ఉంచి, నమస్కారం చేసినట్టుగా కలపాలి. దృష్టి రూఫ్ వైపుగా ఉండాలి. కొద్దిగా వెనక్కి వంగడం వల్ల వెన్నెముక సాగుతుంది. భుజాలు, ఇరువైపులా శరీర కదలికలు ఈ భంగిమలో ఉంటాయి.
అంతర్గత సామర్థ్యానికి ప్రతీకగా చెబుతుంటారు కాబట్టి దీనిని వీరభద్ర ఆసనం అని కూడా అంటారు. దీనిని రోజూ సాధన చేయడం వల్ల తుంటి, కాళ్లు, చీలమండలం, పాదాల ఎముకలకు బలం చేకూరుతుంది. కండరాలను టోనింగ్ చేస్తుంది. కాళ్లలో శక్తి సమకూరుతుంది. బలం, ఏకాగ్రత, ధైర్యం వంటి మానసిక స్థైర్యం ఈ ఆసన సాధన వల్ల కలుగుతాయి. శ్వాస తీసుకుంటూ, నెమ్మదిగా వదులుతూ ఐదు సార్లు ఈ ఆసనాన్ని సాధన చేయాలి. అన్ని వయసుల వారు చేయచ్చు. ఆర్థరైటిస్ మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
– జి.అనూష, యోగా నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment