bones
-
మోకాళ్లు నొప్పులా? ఎముక పుష్టికోసం ఇలా చేయండి!
వయసు నలభై దాటిందో లేదో చాలామందిలో కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడటం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. జీవన శైలి, ఆధునిక అలవాట్లతో పాటు, ఎండ ఎరగని ఉద్యోగాలు, యుక్తవయసు నుంచీ డైటింగ్ పేరుతో పోషకాహారం తీసుకోకపోవడంతో ఎముకలు బలహీన పడుతున్నాయి. ఫలితగా మోకాళ్ల నొప్పులు రికెట్స్ ,బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఇది పెద్ద వయసులో తూలి పడిపోవడం, కాళ్లు చేతులు, ప్రధానంగా తుంటి ఎముక విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. మరి ఎముకల గట్టిదనం కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. అందుకే ఆరోగ్య కరమైన సమతుల్య ఆహారం చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి. ఇది జీవితాంతం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తు పెట్టుకోవాలి. పెద్దలకు రోజుకు 700మిల్లీగ్రాముల కాల్షియం అవసరం.మెనోపాజ్ఆడవారిలో మెనోపాజ్ తరువాత ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి ఈ విషయాన్ని మరింత అప్రమత్తంగా ఉండాలి. బహిష్టులు ఆగిపోయిన తరువాత ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఆగిపోవడంతో ఇది ఎముకలపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కాల్షియం ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డీ చాలా అవసరం. నిరంతరం వ్యాయామం చేయాలి. ముఖ్యంగా 40 దాటిన తరువాత కాళ్లు, చేతులు, కండరాలు, ఎముకలను పటిష్టం చేసే వ్యాయామాలను చేయాలి. మోకాళ్లు నొప్పులొచ్చిన తరువాత కచ్చితంగా నడక, యోగా తదితర తేలికపాటి వ్యాయామాలు చేయాల్సిందే. ఏదైనా ఎముకలకి సంబంధించి ఏదైనా సమస్యను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స పొందాలి. నిపుణుల సలహా మేరకు సంబంధిత వ్యాయామాలను రెగ్యులర్‌గా చేయాలి. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు తీసుకోవాలి.చేపలు, గుడ్లు, పాలు, బాదం, మొలకెత్తిన ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. బలవర్థకమైన సోయా,నువ్వులతోపాటు విటమిన్ సి లభించే సిట్రస్‌పండ్లను తీసుకుంటే మంచిది. అలాగే విటమిన్ డి కోసం ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చోవాలి. తగినంత నిద్రపోవాలి. -
గుడ్లు ఎక్కువగా తింటున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
గుడ్లు ఎక్కువుగా తింటే అస్సలు భయపడాల్సిన పనిలేదు. పైగా మీ ఆరోగ్యం పదిలం అని ధీమాగా చెబుతున్నారు వైద్యులు. అస్సలు ఆ సమస్యలు బారినపడరని అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు సైతం రావని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఆ అధ్యయనంలో బయటపడ్డ ఆసక్తికర విషయాలేంటంటే.. గుడ్డు ఎముకలు బలంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందట. రోజుకి ఒక గుడ్డు తినడం అనేది ఎంతో మంచిదని, దీని వల్ల ఫోలేట్, బీ విటమిన్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని అన్నారు. అలాగే ఎముకల వ్యాధి రాకుండా నివారిస్తుందని చెప్పారు. ముఖ్యంగా గుండెతో ఎముకల ఆరోగ్యం ముడిపడి ఉందనే ఆసక్తికర విషయం తమ పరిశోధనలో బయట పడిందని హువాజోంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్త తెలిపారు. అందుకోసం నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ దాదాపు 1900 మందిపై అధ్యయనం నిర్వహించింది. పరిశోధకులు గుడ్డు వినియోగం తోపాటు, వారి ఎముకల బలాన్ని కూడా అంచనా వేశారు. ఈ పరిశోధనలో పాల్గొనేవారికి గుడ్డులోని 3.53 ఔన్సుల పోషకాలు వారి తొడలు, వెన్నుముకలోని ఎముకలను దృఢంగా ఉంచాయిని తెలిపారు. వారిలో అధిక బీఎండీ స్థాయిలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో అయితే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గిందని చెప్పారు. వయసు పెరిగే కొద్ది ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. ఆ సమస్య రాకూడదంటే గుడ్డుకి మించిన తగిన పోషకాహారం లేదని ఈ పరిశోధనలో తేలిందని చెప్పారు. అలాగే ఇదే సమయంలో తగినంత పోషకాహారం లేకపోవడం, తక్కువ శారీరక శ్రమ, ధూమపానం, అధిక మొత్తంలో మద్యం సేవించడం, కొన్ని రకాల మందులు దీర్థకాలికంగా వాడడం వంటి ఇతక కారణాల వల్ల కూడా ఈ బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఎముకలను ఎలా ఆరోగ్యంగా ఉంచుతాయంటే.. గుడ్లు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. ఇవి ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అని పిలువబడే శారీరక ఎంజైమ్‌ల సమూహాన్ని సక్రియం చేసి, ఎముకలను బలోపేతం చేస్తుంది. ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అనేది ప్రధానంగా కాలేయం, ఎముకలు, మూత్రపిండాలు మొదలైన వాటిలో ఉండే ఎంజైమ్‌ల సమూహం. ఇది ఎముక జీవక్రియ బయోమార్కర్ గుడ్లు తీసుకోవడం వల్ల ఏఎల్పీ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీంతో తొడ, కటి వెన్నెముక వంటి భాగాల్లోని ఎముకలను బలంగా ఉంచుతుంది. అంటే ఇక్కడ గుడ్లలో డి విటమిన్ పుష్కలంగా ఉంటుందని తేలింది. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం అంది ఎముకలు దృఢంగా ఉండేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: చెఫ్‌గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!) -
Peddapalli: శ్మశానంలో ఎముకల దొంగలు!
సుల్తానాబాద్(పెద్దపల్లి): శ్మశానంలో దొంగలు పడ్డారు.. శవాన్ని దహనం చేయగా మిగిలిన పుర్రెలు, ఎముకల్ని చోరీ చేస్తున్నారు.. వీటిని ఏం చేస్తారో తెలియదు కానీ.. కొందరు యువకుల ముఠా ఈ దురాగతానికి పాల్పడుతోంది.. మంత్రతంత్రాలు, పూజలు, చేతబడులు చేయడం లాంటి మూఢనమ్మకాల్ని ఇప్పటిదాకా చూశాం.. విన్నాం.. కానీ, ఇలాంటి విచిత్రమైన ఘటన జిల్లాలో చోటుచేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. రెండు రోజుల్లో నలుగురి పట్టివేత.. సుల్తానాబాద్‌లోని హిందూ శ్మశానవాటికలో రెండురోజుల వ్యవధిలో నలుగురు వ్యక్తులు ఎముకలు చోరీచేస్తూ స్థానికులకు పట్టుబడ్డారు. శవాలను కాల్చివేయగా మిగిలిన ఎముకలను పోగుచేసుకుని, ఒక సంచీలో వేసుకుని తీసుకెళ్తున్నారు. శుక్రవారం ఇద్దరు యువకులు ఇలా ఎముకలు తీసుకెళ్తుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎముకల్ని అక్కడే వదిలివేయగా, ఆ యువకులను బెదిరించి అక్కడి నుంచి పంపించివేశారు. శనివారం ఇద్దరు మహిళలు కూడా శ్మశానంలో ఎముకలు పోగుచేస్తూ అక్కడి మున్సిపల్ సిబ్బందికి పట్టుపడ్డారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా.. కొన్నిరోజులుగా వైకుంఠధామాల్లోని ఎముకలు మాయమువుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహాల ఎముకలను కుటుంబ సభ్యులు సేకరించి 5, 9, 11వ రోజుల తర్వాత గోదావరి నదిలో కలుపడం సంప్రదాయం. అయితే, కొన్నిరోజులుగా శ్మశానంలో అస్థికలు కనిపించకపోవడంతో చాలామంది అవి కాలిపోయినట్లు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఎముకల దొంగలు పట్టుపడడంతో తమవారి ఎముకలను కూడా వారే ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ముఠాను మున్సిపల్ సిబ్బంది రాజకుమార్, వినోద్ పట్టుకున్నారు. మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్య, బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ సిబ్బందికి సహకరించారు. విచారణ జరుపుతున్న పోలీసులు.. రెండురోజుల వ్యవధిలో నలుగురు ఎముకల దొంగలు పట్టుపడడంతో సుల్తానాబాద్ మున్సిపల్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కాగా, పదేళ్లక్రితం మృతదేహాలను కాల్చిన కట్టెల బొగ్గులు తీసుకుని వచ్చి కంకులు కాల్చేవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలా చేసేవారు. -
స్వలింగ సంపర్కుడి ఇంట్లో మనిషి ఎముకలు!
తమిళనాడు: తంజావూరు సమీపంలో అరెస్టయిన స్వలింగ సంపర్కుడి ఇంటి ఆవరణలో తవ్వగా ఎముకలు బయటపడ్డాయి. వివరాలు.. తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని చోళపురానికి చెందిన నకిలీ సిద్ధ వైద్యుడు కేశవ మూర్తి(47). గతేడాది 3వ తేదీన మందు కోసం వచ్చిన అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్ అశోక్‌రాజ్(27)కు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడి, అతడిని హత్య చేసి మృతదేహాన్ని ఇంటి వెనుక పూడ్చిపెట్టాడు. దీంతో పోలీసులు కేశవమూర్తిని అరెస్టు చేసి, జరిపిన విచారణలో అశోక్‌రాజ్‌ను హత్య చేసి ముక్కలుగా నరికి ఇంట్లోనే మసాలా వేసి కాలేయాన్ని వండి తిన్నట్టు తెలిపాడు. అలాగే నవంబర్ 27, 2021, 30వ తేదీన అదే ప్రాంతానికి చెందిన తప్పిపోయిన ఆటో డ్రైవర్ మహ్మద్ అనస్ (26)ని కూడా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా చేసి ఇంటి పెరట్లో పూడ్చిపెట్టాడు. కొన్ని భాగాలను వండుకుని తిన్నట్టు తెలిపాడు. ఈ ఘటనలో మహ్మద్ అనాస్ మృతదేహాన్ని పోలీసులు ఇంకా వెలికితీయకపోగా.. ఇతడిని కూడా కేశవ మూర్తి హత్య చేసి ఉంటాడని పోలీసులు సందేహించారు. ఈ కేసులో చోళపురంలో ఉన్న సిద్ధ వైద్యుడు కేశవమూర్తి ఇంటిలో, వేలిముద్రల నిపుణులు ఏడీఎస్పీ హేమ, సహాయ సహాయకుడు రామచంద్రన్ (27) సమక్షంలో తిరువిడైందూరు డీఎస్పీ జబర్ సిద్ధిక్ నేతృత్వంలో కేశవ మూర్తి ఇంట్లో విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి పోలీసు జాగిలాలు సోదాలు చేశాయి. ప్రొక్లైన్ సాయంతో ఇంటిపక్కన చెట్లు, ఇంటిముందు పచ్చిమిర్చి మొక్క. అరటి చెట్లను నరికి తొలగించారు. వరుసగా 2 చోట్ల 3 అడుగుల లోతు తవ్వగా 30కి పైగా ఎముకలు బయటపడ్డాయి. వాటిని తంజావూరు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. -
వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు
మనం కొత్తగా ఏదైన డైట్ లేదా వ్యాయామాలకు సంబంధించి మార్పులు తీసుకునేటప్పుడూ సమయపాలనే అనేది ముఖ్యం. అంటే.. ఇక్కడ రోజూ ఒకే టైంలోనే ఏదైనా చేయమని నొక్కి చెబుతుంటారు నిపుణులు. మన చిన్నప్పుడూ కూడా ఈ టైం కల్లా చదువుకోవడం పూర్తి చేసుకుని నిద్రపోండి అని మన పెద్దవాళ్లు పదేపదే చెబుతుంటారు. ఇలానే ఎందుకు? ఇది మన శరీరాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది తదితరాల గురించి తాజా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు గల కారణాలకు సరైన సమాధానం కూడా దొరికింది. మనం చేసే వ్యాయామం లేదా ఏదైన పని రోజూ ఒకే టైంలో చేస్తే చక్కటి ఫలితం ఉంటుందట. ఈ మేరకు మాంచెస్టర్ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో..ఏ వ్యక్తి అయినా వ్యాయామాన్ని ఇష్టారీతిలో తనకు కుదిరిన సమయంలో చేసిన వారి కంటే ఒక నిర్దేశిత టైంలో చేసిన వారిలోనే మెరుగైన పలితాలు కనపడటం గుర్తించారు. దీనికి గల కారణాల గురించి సాగిన పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మానవుని శరీరం బాహ్య వాతావరణంతో ప్రభావితవుతుంది. అందుకు తగ్గట్టుగా మన అంతర్గత శరీరీం స్కిరాడియన్ గడియారాన్ని సెట్ చేసుకుంటుందట. ఇక్కడ స్కిరాడియన్ గడియారం అంటే జీవక్రియ గడియారం. దీని అర్థం ఉదయం మేల్కోనగానే కాసేపు బద్ధకంగా అనిపించటం, తర్వాత ఆకలి.. ఆ తర్వాత రోజూవారి పనుల్లో నిమగ్నమవ్వడం ఒక లయబద్ధంగా మన మెదడు సిగ్నల్స్ పాస్ చేయడంతో ఆటోమెటిక్‌గా చేసుకుంటూ పోతున్న విధానాన్నే జీవగడియారం అంటారు. అంటే..ఇక్కడ మన జీవక్రియ గడియారానికి మన శరీర భాగాలకు మధ్య మెదడు అనే సెంట్రల్ గడియారం సమన్వయంతోనే ఇదంతా సాధ్యమవుతుంది. అందువల్ల సాయంత్రం చీకటి పడగానే ఆటోమెటిక్ నిద్రకు ఉపక్రమించడం, వెలుగు అనగానే బాడీ సెట్ రైట్ అయిపోయి లేవాలనే ఫీల్ కలగడం జరుగుతుంది. కాబట్టి మనిషి ఏదైనా డైట్ లేదా వ్యాయామం చేయాలనుకుంటే..రోజూ ఒక నిర్దేశిత టైంలో చేస్తే రిజల్ట్ బాగుండటమే గాక అనారోగ్యాల బారిన పడకుండా ఫిట్‌గా ఉండగలుగుతారని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడయ్యింది. అంతేగాదు రోజులో 24 గంటలు అనే రోజు చక్రానికి అనుగుణంగా మన బాడీ ప్రతిస్పందిస్తుంది. అదే శరీరంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారడం, రక్తంలో స్థాయిలు మార్పులు, తదితరాలకు కారణం అని పరిశోధకులు పేర్కొన్నారు. మన శరీరంలోని ఇతర భాగాలు గనుక మన జీవ గడియారం, సెంట్రల్ గడియారానికి అనుగుణంగా పనిచేయకపోయినప్పుడే అనారోగ్య సమస్యలు ఉత్ఫన్నమవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితే మన శరీరంలో చెడు కొలస్ట్రాల్‌కు కారణమని అన్నారు. అలాగే పగటిపూట మాగ్జిమమ్ తిరుగుతూ ఏదో ఒక పని చేస్తుంటాం. అందువల్ల మన వెన్నెముకలోని ఇంటర్వర్టెబ్రల్ డిస్క్‌ల నుంచి తుంటి, మోకాళ్లలోని మృదులాస్థి నుంచి నీరు బయటకు వచ్చి రోజూ ముగిసే సమయానికి కాస్త పొట్టిగా కనిపిస్తాం. ఇది రోజు ముగిసే సమయానికి మనల్ని కొంచెం పొట్టిగా కనిపించేలా చేస్తుంది. అదే రాత్రి విశ్రాంత తీసుకునే సమయంలో నీరు తిరిగి మన బాడీకి వస్తుంది మనం యథావిధిగా కనిపిస్తాం అని చెప్పారు. అందుకోసం తాము ఎలుకలపై అధ్యయనం చేయగా.. ఈ ఫలితాలను గుర్తించామని అన్నారు. మన డైట్‌కి సంబంధించి లేదా వ్యాయామం వంటివి చేసేటప్పుడూ వీలు కుదరినప్పుడల్లా చేస్తే డీసింక్రోనైజేషన్కి గురయ్యి ఫలితం సరిగా ఉండదు. పైగా మన ఇతర వ్యవస్థలపై ప్రభావం ఏర్పడి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అన్నారు. కాబట్టి మనం రోజూ శారీరక శ్రమకు సంబంధించి(వ్యాయామం తదితర పనులు) ఒకే సమయానికి చేయడం వల్ల శరీరంలోని ఇతర వ్యవస్థలన్ని సమన్వయం అయ్యి, గాయాల బారినపడకుండా ఉండటమే గాక వయసు రీత్య వచ్చే కీళ్ల సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా తగ్గుతుందని చెప్పుకొచ్చారు మాంచెస్టర్ పరిశోధకులు. (చదవండి: సరికొత్త ఔషధం..ఒక్క డోసు తీసుకుంటే చాలు.. దెబ్బకు కొలస్ట్రాల్ మాయం!) -
పిల్లల ఎముకలు బలంగా పెరగాలంటే..
పిల్లల ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే పెద్దవారితో పోల్చితే పిల్లల ఎముకలు బలహీనంగా ఉంటాయి. దీనివల్ల చిన్న చిన్న దెబ్బలు తాకినా తొందరగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. బాల్యంలోని బలమైన ఎముకలు వారి జీవితకాల ఆరోగ్యానికి అద్భుతమైన పునాదిని అందిస్తాయి. అందువల్ల వారి ఎముకలు దృఢంగా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన ఆహార నియమాలపై అవగాహన కోసం... కాల్షియం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకలను అభివృద్ధి చేయడానికి కాల్షియం అవసరం అని తెలుసు కాబట్టి పిల్లలు రోజుకు కనీసం రెండు గ్లాసుల పాలను తాగేట్టు చూడాలి. అలాగే ఆహారంలో బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలు, బెండ, పొట్ల వంటి కూరగాయలు ఉండేట్టు చూడండి. అలాగే రోజుకు ఒకసారైనా పెరుగును తినేట్టు చూడండి. సోయా పాలు, సోయా పెరుగు వంటి సోయాబీన్ ఉత్పత్తుల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి శరీరానికి కావలసిన కాల్షియంను గ్రహించేందుకు విటమిన్ డి సహాయపడుతుంది. విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా, కొన్ని రకాల ఆహారాల ద్వారా పొందవచ్చు. పిల్లల ఆహారంలో తగినంత విటమిన్ డి లేకపోతే విటమిన్ డి సప్లిమెంట్‌ను తీసుకోవాలి. నవజాత శిశువులకు కూడా విటమిన్ డి సప్లిమెంట్స్ అవసరం. కానీ డాక్టర్లను సంప్రదించిన తర్వాతే ఇవ్వాలి. మెగ్నీషియం, విటమిన్ కె శరీరంలో విటమిన్ కె, మెగ్నీషియం స్థాయిలు ఎక్కువగా ఉంటే ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే రికెట్స్, బోలు ఎముకల వ్యాధితో సహా ఎన్నో ఎముకల సమస్యలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియంతో పాటుగా ఈ విటమిన్లు కూడా మీ పిల్లల ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. బచ్చలికూర, Mక్యాబేజీ, మొలకలు వంటి వాటిల్లో విటమిన్ కె, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు తృణధాన్యాలను పెట్టండి. కార్బోనేటేడ్ పానీయాలు వద్దే వద్దు కార్బోనేటేడ్ పానీయాలలో సాధారణంగా కొన్ని ఫాస్పోరిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇది శరీరం కాల్షియాన్ని గ్రహించకుండా నిరోధిస్తుంది. ఈ ఆమ్లం ఎముకల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కార్భోనేటెడ్ పానీయాలకు బదులుగా నారింజ రసం వంటి హెల్తీ పానీయాలను తాగించండి. ఎముకలను బలోపేతం చేసేవాటిలో ముఖ్యమైనది శారీరక శ్రమ. అందుకే పిల్లలు బాగా ఆటలు ఆడేలా చూడండి. వీలైతే చిన్న చిన్న వ్యాయామాలను చేయించండి. (చదవండి: వాస్తవికతకే రూపం ఇస్తే..పాజిటివ్ ఎమోషన్..) -
ఆ విటమిన్ లోపిస్తే తినాలనే ఆసక్తి కోల్పోతాం!
శరీరానికి అన్ని విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా ఉండగలం. ఏ విటమిన్ లోపించిన దాని దుష్ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందులోనూ మన శరీరానికి ప్రకృతి సిద్ధంగా లభించే విటమిన్ల విషయంలో అజాగ్రత్త వహిస్తే ఆ పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. విటమిన్లలో సహజసిద్ధంగా లభించే విటమిన్ డీ. ఇది మనకు సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. ఆ విటమిన్ లోపం కారణంగా తినబుద్ది కాదని, పూర్తిగా నీరసించి దారుణమైన స్థితికి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు న్యూట్రిషియన్లు. ఐతే విటమిన్ డీ లోపించిదని ఇచ్చే సంకేతాలు, లక్షణాలు ఏంటో చూద్దామా! డీ విటమిన్ లోపం గురించి ఇచ్చే పది సంకేతాలు ఏంటంటే.. అలసిపోవడం మాటిమాటికి అలసట వస్తున్నా లేదా ఎక్కువ సేపు ఏ పనిచేయక మునుపే తొందరగా అలసటతో కూర్చుండిపోతే డి విటమిన్ లోపించిందని అర్థం. ఇది డీ విటమిన్ లోపానికి సంబంధించిన బలమైన సంకేతంలో ప్రధానమైంది నిద్ర పట్టకపోవడం టైంకి పడుకున్నా కూడా నిద్ర పట్టకపోతే అది డీ విటమిన లోపమే కారణం. మెలటోనిన్ అనే హార్మోన్ మానవ సిర్కాడియన్ లయలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఎదురవుతుంది. ఈ డీ విటమిన్ శరీరంలో నిద్ర వచ్చే హార్మోన్‌ని ఉత్పత్తి అయ్యేలా చేసి కంటి నిండా నిద్రపోయేలా చేస్తుంది. కీళ్లపై ప్రభావం దీర్ఘకాలిక కండరాల అసౌకర్యం, బలహీనతకు మూలం విటమిన్ డీ. కాల్షియం శోషణలో సహయపడుతుంది. ఇది లేకపోవడం వల్ల కీళ్లపై ప్రభావం చూపుతుంది. డిప్రెషన్ లేదా విచారం డిప్రెషన్‌కి డీ విటమిన్‌తో ఎలాంటి సంబంధం లేనప్పటికి..పరిశోధనల్లో అలటస కారణంగా మానసికంగా బలం కీణించి అనేక రుగ్మతలకు లోనై డిప్రెషన్‌కి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడం డీ విటమిన్ లోపిస్తే జుట్టు రాలడం, జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపడం వంటివి జరగుతాయి. కొన్ని సందర్భాల్లో ఆ లోపం ఎక్కువగా ఉంటే అలోపేసియాకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. దీంతో తలపై జుట్టు తోపాటు, శరీరంపై ఉండే వెంట్రుకలన్నింటిని పూర్తిగా కోల్పోయేలా ప్రమాదం ఉంది. కండరాల బలహీనత విటమిన డీ ఆరోగ్యకరమైన కండరాల పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే కండరాల సంకోచాన్ని నియంత్రించడానికి కీలకం కూడా. శరీరంలో తక్కువ డీ విటమిన్ స్థాయిలు వివిధ రకాల కండరాల కణాల పనితీరుని ప్రభావితం చేసినట్లు పలు పరిశోధనల్లో తేలింది. డార్క్ సర్కిల్స్ కళ్లు బూడిద రంగులోకి మారడం, కళ్ల కింద ఉన్న చర్మం ఉబ్బడం లేదా మృదువుగా లేనట్లు ఉన్నట్లయితే ఎక్కువసేపు ఎండలో గడపాలని అర్థం. ఆకలి లేకపోవడం ఆహారం పట్ల ఆకస్మికంగా విరక్తి ఏర్పడటం, ఆకలి అనే అనూభూతి లేకపోవడం వంటివి జరుగుతాయి. తరుచుగా అనారోగ్యం రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండి, తరుచుగా అనారోగ్యానికి గురవ్వడం జరుగుతుంది. చర్మం పాలిపోవడం ఆరోగ్యకరమైన చర్మ కణాల ఉత్పత్తికి విటమిన్ డీ అవసరం. కాబట్టి చర్మం పాలిపోయినట్లుగా ఉంటే విటమిన్ డీ లోపం ఉన్నట్లు క్లియర్‌గా అర్థమవుతుంది. కావున ఆయా వ్యక్తులు సూర్యరశ్మీలో గడపడం అత్యంత ముఖ్యం. అంతేగాదు అధిక రక్తపోటు, మధుమేహం, ఫైబ్రోమైయాల్జియా,మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి నాడీ సంబంధిత పరిస్థితులు విటమిన్ డీ లోపంతో సంబంధం కలిగి ఉంటాయి. ఏం చేయాలంటే.. విటమిన్ డీ కి చక్కని సోర్స్ సూర్య రశ్మే. ఆ తరువాత స్థానంలో చేపలు, కాడ్‌లివర్ ఆయిల్, గుడ్డు పచ్చ సొన, ష్రింప్, ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ బ్రేక్ ఫాస్ట్ సెరియల్, ఫోర్టిఫైడ్ యోగర్ట్, ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ ఉంటాయి. (చదవండి: 1990లలో అపహరించిన జీప్ అనూహ్యంగా ఎలా బయటపడిందంటే) -
లక్షమందిలో ఒకరికి సంభవించే వ్యాధి..ఉన్నపళంగా ఎముకలు..
కొన్ని వ్యాధులు చాలా అరుదుగా సంభవిస్తుంటాయి. ఇలాంటి వ్యాధి కూడా ఉంటుందా అనేలా ఉంటాయా ఆ వ్యాధులు. అలాంటి అరుదైన వ్యాధి బారినేపడింది సదరు మహిళ. అసలేం జరిగిందంటే..న్యూయార్క్‌కి చెందిన 24 ఏళ్ల బెథాని ఈసన్ అనే మహిళ జస్ట్ అలా బాత్రూంకి వెళ్లింది అంతే మోకాలి ఎముకలు పెళ పెళ మంటూ విరిగిపోయాయి. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి వెళ్లగా..ఎక్స్‌రే తీయించుకోవాల్సిందిగా సూచించారు వైద్యులు. ఆ తదనంతరం నిర్వహించి వైద్య పరీక్షల్లో ఆమెకు ఎముకల్లో కణితి ఉన్నట్లు తేల్చారు. దీని వల్ల చుట్టుపక్క ఉన్న మృదుకణజాలం బలహీనమై మెకాలి నుంచి తొడ ఎముకలు పెళపెళమని విరగిపోతాయని అన్నారు. వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. ఆ సర్జరీ కూడా అత్యంత క్లిష్టమైనది, విజయవంతమయ్యే అవకాశాలు కూడా తక్కువ. దీంతో బెథానికి ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించినట్లయ్యింది. ఈ వ్యాధి గురించి పలువురిని సంప్రదించింది కూడా అందరూ అదేమాట చెప్పారు. పైగా దీని భారినపడిన వారుకూడా ఇప్పటికీ తాము నడవలేకపోతున్నట్లు ఆమెకు చెప్పారు. అంతేగాదు పలువురు బతికే ఉన్నా కూడా.. నడుం కింద నుంచి శరీరం అంతా చచ్చుపడిపోయే అవకాశం కూడా లేకపోలేదని ఆమెను హెచ్చరించారు కూడా. అయినప్పటికి ధైర్యం తెచ్చుకుని మరీ విజయవంతంగా ఆపరేషన్ చేయించుకుంది. ఆమె మోకాలి నుంచి తొడ ఎముకల వరకు సర్జరీ చేశారు వైద్యులు. ఇంకెప్పుడూ హీల్స్ ధరించకూడదని సూచించారు. అంతేగాదు ఆమె కొత్తగా నడవడం నేర్చుకోవాల్సి ఉంటుందని బెథానికి తెలిపారు వైద్యులు. ఇది చాలా నొప్పితో కూడిని సర్జరీ అని బెథాని చెబుతోంది. ప్రాణాంతకం కాకుడాదంటే.. నొప్పిని భరిస్తూ సర్జరీ చేయించుకోక తప్పదని వాపోయింది. (చదవండి: ఢిల్లీ వెళ్లి చూడండి..భారత్‌లో ప్రజాస్వామ్యం చాలా శక్తిమంతంగా ఉంది: అమెరికా) -
మెడి టిప్
అందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకలు వేగంగా పెరుగుతుంటాయి. మనలో దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు ఎముకలు కాస్త బలంగా గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా పలచబడుతూ, పెళుసుగా మారుతూ ఉంటాయి. ఇలా ఎముకలు పలచబా రుతూ తేలిగ్గా విరిగేలా పెళుసుబారడాన్ని ‘ఆస్టియోపోరోసిస్’ అంటారు. ఈ ముప్పు మహిళల్లో మరీ ఎక్కువ. మహిళలైనా, పురుషులైనా ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం ఈ కింది అక్షరాల సహాయంతో అవలంబించాల్సిన జాగ్రత్తలను గుర్తుపెట్టుకోవచ్చు. అవి... ♦ ‘సి’ ఫర్ క్యాల్షియమ్– ఎక్కువగా తీసుకోవాలి. అంటే క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాలు, ఆకుకూరల వంటివి. ♦ ‘డి’ ఫర్ విటమిన్ డి – శరీరానికి తగినంత అందేలా చూసుకోవాలి. ఇందుకోసం లేత ఎండలో నడక, వ్యాయామం మేలు. ♦ ‘ఈ’ ఫర్ ఎక్సర్సైజ్ – శరీరాన్ని తగినంత వ్యాయామాన్ని అందించాలి. ♦ ‘ఎఫ్’ ఫర్ ‘ఫాల్స్’ – ఫాల్ అంటే ఇంగ్లిష్‌లో పడిపోవడం. వయసు పెరిగినవారికి బాత్రూమ్ల వంటి చోట్ల, ఎక్కడానికి అంత అనువుగా లేని మెట్లు ఉండే చోట్ల పడిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. ఇలా పడిపోయే అవకాశాల్ని తగ్గించుకోవాలి. అంటే ఆయా ప్రదేశాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. -
వెజ్ బిర్యానీలో మాంసం బొక్కలు.. కంగుతిన్న వ్యక్తి ఏం చేశాడంటే..
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటేనే భోజన ప్రియులు కాస్తా వెనకడుగు వేస్తున్నారు. ఒకటి ఆర్డర్ ఇస్తే ఇంకోటి రావడం, భోజనంలో పురుగులు, కుళ్లిన ఆహారం వస్తుందోనని జంకుతున్నారు. తాజాగా రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ శాకాహారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. వెజిటేరియన్ ఫుడ్ ఆర్డరిస్తే.. అందులో మాంసం ముక్కలు దర్శనమిచ్చాయి. ఎంతో ఇష్టంగా తిందామనుకున్న వెజ్ బిర్యానీలో నాన్‌వెజ్ కనిపించడంతో షాకైన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో చోటుచేసుకుంది. అక్షయ్ దూబే అనే వ్యక్తి విజయ్ నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లి వెజ్ బిర్యాని ఆర్డర్ చేశాడు. అసలే ఆకలి మీదున్న అక్షయ్.. టేబుల్ మీదకొచ్చిన ఘుమఘుమలాడే వెజ్ బిర్యానీని ఓ పట్టున లాగేస్తున్నాడు. అయితే ఒక్కసారిగా బిర్యానీలో మాసం బొక్కలు కనిపించడంతో అతడు కంగుతున్నాడు. వెంటనే ఈ విషయాన్ని రెస్టారెండ్ మేనేజర్, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా.. పొరపాటు జరిగిందంటూ వారు క్షమాపణలు తెలియజేశారు. అంతేగాక ఆక్షయ్.. విజయ్ నగర్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశాడు. శాఖాహారులకు మాంసాహారం అందిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రెస్టారెంట్ యజమాని స్వప్నిల్ గుజరాతీపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని.. తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసల్ సంపత్ ఉపాధ్యాయ తెలిపారు. చదవండి: జమ్మూ కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం -
అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధవే.. తేల్చిన డీఎన్ఏ రిపోర్టు
న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. డిల్లీ మెహ్రౌలీ అడవిలో దొరికిన ఎముకలు శ్రద్ధవే అని తేలింది. ఆమె తండ్రి డీఎన్ఏతో ఈ సాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. సెంట్రల్ ఫోరెన్సిస్ సైన్స్ లాబోరేటరీ నివేదిక దీన్ని ధ్రువీకరించింది. అలాగే శ్రద్ద హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా పాలీగ్రాఫ్ టెస్టు పూర్తి నివేదిక పోలీసులకు అందింది. దీంతో అధికారులు ఈ కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయనున్నారు. ఢిల్లీ మోహ్రాలీలో ఈ ఏడాది మేలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య కేసు ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ అప్తాబే ఆమెను గొంతునులిమి చంపాడు. అనంతరం శవాన్ని 35 ముక్కలు చేసి అడవిలో పడేశాడు. పోలీసులు అడవి మొత్తం గాలించి 13 ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. డీఎన్ఏ టెస్టుతో అవి శ్రద్ధవే అని తేలింది. కోర్టు అనుమతితో ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్‌తో పాటు నార్కో టెస్టు కూడా నిర్వహించారు అధికారులు. అతని స్టేట్మెంట్ రికార్డు చేశారు. శ్రద్ధను తానే చంపానని, కానీ చంపినందుకు ఎలాంటి పశ్చాతాపం లేదని అఫ్తాబ్ విచారణలో చెప్పాడు. చదవండి: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు -
వామ్మో! దగ్గితే పక్కటెముకలు విరిగిపోవడమా!
ఏదైన ప్రమాదం బారిన పడితేనో లేక పోట్లాడినప్పుడో ఎముకలు విరగడం జరుగుతుంది. మహా అయితే ఏదైన వ్యాయమం చేసినప్పుడూ ఏదైన ఎముక బెణికి విరిగే అవకాశం ఉంటుంది. అంతేగానీ ఉత్తిపుణ్యానికి అదికూడా కేవలం దగ్గితే ఎముకలు విరగడం గురించి విన్నారా! వాస్తవానికి ఏదైన జన్యులోపంతో ఎముకలు బలహీనంగా ఉండి విరిగిపోవడం జరుగుతుంది. కానీ కేవలం దగ్గితే ఎముకలు విరిగిపోవడం ఏమిటి అని ఆశ్చర్యంగా అనిపించినా అది నిజం. వివరాల్లోకెళ్తే...చైనాలోని షాంఘైకి చెందిన హువాంగ్ అనే మహిళకు దగ్గినందుకు ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయి. ఆమె ఒక రోజు స్పైసీ ఫుడ్ తింటున్నప్పుడూ విపరీతమైన దగ్గు వచ్చింది. అప్పుడూ ఆమెకు ఏదో లోపల విరిగిన శబ్దం వచ్చింది కూడా. ఐతే ఆమె మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత నుంచి ఆమె గాలి పీల్చుకుంటున్న, మాట్లాడుతున్న విపరీతమైన నొప్పి రావడం ప్రారంభమైంది. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ హువాంగ్‌కి స్కాన్ చేయగా మొత్తం నాలుగు పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు వైద్యులు. ఆ తర్వాత ఆమెకు బ్యాడేజ్ వేసి నయం అయ్యేంతవరకు నెలరోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు వైద్యులు. ఐతే స్థానిక మీడియా దగ్గితే పక్కటెముకలు విరగడం ఏమిటని వైద్యులను ప్రశ్నించింది. హువాంగ్ బరువు తక్కువగా ఉండటమే అందుకు కారణమని వైద్యులు తేల్చి చెప్పారు. ఆమె సుమారు 171 సెంటిమీటర్లు పొడవు ఉంటుందని, బరువు కేవలం 57 కిలోగ్రాములే ఉంటుందని చెప్పారు. ఆమె శరీరంలో పైభాగం చాలా బలహీనంగా ఉండటమే గాక శరీరం నుంచి ఎముకలు చాలా స్పష్టంగా కనిపిస్తాయని చెబుతున్నారు. ఎముకలకు మద్దతు ఇచ్చేలా కండ లేకపోవడంతో.. దగ్గినప్పుడల్లా... పక్కటెముకలు సులభంగా విరిగిపోతాయని చెప్పారు వైద్యులు. ఆమె కోలుకున్నాక కచ్చితంగా బరువు పెరిగేందుకు వ్యాయమాలు చేస్తానని చెబుతోంది. (చదవండి: -
శ్రద్ధ హత్య కేసు.. అడవిని జల్లెడ పట్టిన పోలీసులు.. 3 ఎముకలు స్వాధీనం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణను వేగంగా పుర్తి చేస్తున్నారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా మెహ్రౌలీ అడవిలో శ్రద్ధ శరీర భాగాల కోసం ముమ్మరంగా గాలించారు. నవంబర్ 16న మూడుసార్లు ఈ అడవినంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలోనే అక్కడ ఓ పెద్ద ఎముకను గుర్తించారు. అది ఫీముర్(తొడ ఎముక) అయి ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత అడవిలోని ఇతర ప్రాంతాల్లో మరో రెండు ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కచ్చితంగా శ్రద్ధవే అయి ఉంటాయని చెబుతున్నారు. అడవిని గాలించేందుకు నిందితుడు అఫ్తాబ్‌ను కూడా తీసుకెళ్లారు పోలీసులు. ముక్కలు ముక్కలుగా చేసిన శ్రద్ధ శరీర భాగాలను ఎక్కడ పడేశాడో చూపించమన్నారు. అతడు చెప్పిన వివరాల ప్రకారం అడవినంతా వెతికి మొత్తం మూడు ఎముకలను గుర్తించారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు తొలిసారి ఓ సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 18 తెల్లవారుజామున నిందితుడు అప్తాబ్ తన ఇంటి నుంచి ఓ బ్యాగ్ వేసుకుని, సంచిపట్టుకుని బయటకు వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ బ్యాగులో శ్రద్ధ శరీరా భాగాలు ఉండి ఉంటాయని, అప్తాబ్ వాటిని అడవిలో పడేసేందుకు తీసుకెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఢిల్లీ మొహ్రౌలీలో ఆరు నెలల క్రితం జరిగిన శ్రద్ధ హత్య ఘటన ఇటీవలే వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు, శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ అఫ్తాబ్ ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. అయితే పోలీసులు ఇంకా శ్రద్ధ శీరర భాగాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అలాగే ఆమె ఫోన్, నిందితుడు ఉపయోగించిన కత్తిని కనిపెట్టాల్సి ఉంది. చదవండి: షాకింగ్.. ఇంజనీరింగ్ కాలేజ్‌లో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు.. -
అవగాహనతోనే ఆస్ట్రియోపోరోసిస్ నివారణ
ఎముకలు బోలుగా మారే వ్యాధినే ఆస్టియో పోరోసిస్ గా పేర్కొంటారు ఇది మహిళల్లో బాగా కనిపించే వ్యాధి. మధ్య వయసు దాటాక దాడి చేసే ఈ వ్యాధి ఆధునిక జీవనశైలి, తగిన వ్యాయామం లేకపోవడంతో పాటు అవగాహన లేక దీని దుష్ప్రభావాలు ఎదుర్కుంటున్నవారెందరో... ఈ నేపధ్యంలో ఈ వ్యాధి ముందస్తు హెచ్చరిక సంకేతాలు, ఆ వ్యాధికి గురయ్యాక శరీరంలో వచ్చే మార్పులు, తగ్గించుకునే మార్గాల గురించిౖ హెదరాబాద్లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ఆర్థ్రోస్కోపీ సర్జన్ డాక్టర్ వీరేంద్ర ముద్నూర్ ఇలా వివరిస్తున్నారు. బలం నుంచి బోలు వరకూ... శరీరంలోని మస్క్యులోస్కెలెటల్ వ్యవస్థ వందలాది కదిలే మూలకాలను (ఎముకలు, కండరాలు, స్నాయువులు, స్నాయువులు, మృదులాస్థి) కలిగి ఉంటుంది, ఇవి శరీరం సమతుల్యతతో కదలడానికి, సరైన విధంగా పనిచేయడానికి సహకరిస్తాయి. అయితే అన్ని శారీరక అంతర్గత అవయవాలలాగే ఈ భాగాలు గాయపడవచ్చు, కాలక్రమేణా బలహీనపడవచ్చు లేదా అనారోగ్యాలకు గురికావచ్చు. ఎముకలు చాలా బలంగా ఉన్నప్పటికీ, అవి సజీవ కణజాలంతో తయారవుతాయి, ఇవి నిరంతరం విచ్ఛిన్నమవుతూ తిరిగి పునర్నిర్మించబడతాయి. మనిషికి 20 ఏళ్ల వయస్సు వచ్చే వరకు శరీరం ఇప్పటికే ఉన్న ఎముక కణజాలాన్ని విచ్ఛిన్నం చేయడం కంటే త్వరగా కొత్త ఎముకలను నిర్మించగలదు. పెరిగే వయస్సుతో, ఈ ప్రక్రియ మందగిస్తుంది. పాత ఎముక కణజాలం భర్తీ చేయగల దానికంటే వేగంగా క్షీణించవచ్చు. ఇది ఎముకలు మరింత సన్నగా పెళుసుగా మారడానికి ఫలితంగా బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది, ఈ వ్యాధి ఎముక పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉండటానికి, ఆస్టియోపోరోసిస్ వ్యాధికి సంబంధించిన హెచ్చరిక సంకేతాలను గుర్తించడం చాలా అవసరం. లక్షణాలివే... చిగుళ్లు తగ్గుముఖం పట్టడం – దంతాలు సాధారణంగా దవడ ఎముకకు అతుక్కొని ఉంటాయి దవడ ఎముక సన్నబడటం ప్రారంభించిన తర్వాత, చిగుళ్ళు తగ్గడం కూడా గమనించవచ్చు. గ్రిప్ బలం తగ్గడం – వ్యక్తులు కింద పడిపోవడాన్ని నివారించడానికి మంచి పట్టు, సమతుల్యత కండరాల బలం అవసరం. అలాగే, తగ్గిన పట్టు బలం పడిపోయే అవకాశాన్ని పెంచుతుంది. ఒక వ్యక్తి హ్యాండ్‌గ్రిప్ వదులైనప్పుడు, అది ఈ వ్యా«ధికి సంకేతం. ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలకు సంబంధించి చేసిన ఓ అధ్యయనంలో బలహీనమైన హ్యాండ్‌గ్రిప్, తక్కువ ఎముక ఖనిజ సాంద్రత మధ్య సంబంధాన్ని పరిశోధకులు కనుగొన్నారు. తిమ్మిరి/ నొప్పులు – కండరాల తిమ్మిరి, నొప్పులు సాధారణమైనవే అని తరచుగా నిర్లక్ష్యం చేస్తాం, అయితే ఇది బోలు ఎముకల వ్యాధి ప్రారంభ సూచన. కూడా అత్యంత కీలకమైన ఎముక బిల్డర్ అయిన విటమిన్ డిలో గణనీయమైన లోపాన్ని ఇది సూచిస్తుంది. రాత్రి సమయంలో వచ్చే తిమ్మిర్లు రక్తంలో తగ్గిన కాల్షియం, మెగ్నీషియం/ పొటాషియం స్థాయిలను సూచిస్తాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే అధిక ఎముక నష్టం కలిగే అవకాశం ఉంది. ఎత్తు తగ్గుదల ఎముకల వ్యాధి ప్రారంభాన్ని గుర్తించదగిన శారీరక మార్పుల సంకేతాలలో ఒకటి ఎత్తు కోల్పోవడం. ఏ వ్యక్తి అయినా రెండు అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు కోల్పోయినా లేదా వెన్నెముకలో వక్రతను ఆర్థోపెడిక్ ద్వారా గుర్తించినా బోలు ఎముకల వ్యాధికి రిస్క్ జో¯Œ లో ఉన్నట్టే. అంటే ఈ అనారోగ్యం ఇప్పటికే వెన్నుపూసను ప్రభావితం చేసిందని అర్థం. పెళుసుగా ఉండే వేలిగోళ్లు ఆర్థోపెడిక్ ప్రకారం, ఒకరి గోళ్ల బలం ఒకరి ఎముకల ఆరోగ్యాన్ని సూచిస్తుంది. గోరు ఎముక ఆరోగ్యం ఎముక సాంద్రతతో ముడిపడి ఉంటుంది. హ్యాండ్ వాష్ లేదా ఇతర కార్యకలాపాల తర్వాత తరచుగా విరిగిపోయే బలహీనమైన వేలిగోళ్లు ఎముక సాంద్రతలో తగ్గుదలని సూచిస్తాయి. అయితే, గోళ్లపై ప్రభావం చూపే అదనపు అంశాల్లో అత్యంత వేడి లేదా చల్లదనానికి గురికావడం, నెయిల్ పెయింట్ రిమూవర్ లేదా యాక్రిలిక్ నెయిల్లను క్రమం తప్పకుండా ఉపయోగించడం లేదా నీటిలో ఎక్కువసేపు ముంచడం వంటివి కూడా ఉన్నాయి. నివారించడం ఇలా ... తరచుగా వ్యాయామం చేయడం, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, ఆల్కహాల్, ఇతర డ్రగ్స్‌కు దూరంగా ఉండటం ద్వారా బోలు ఎముకల వ్యాధిని నివారించవచ్చు. ఎముక ద్రవ్యరాశికి సహాయపడే మందులు బోలు ఎముకల వ్యాధి చికిత్సలో భాగం. ఈ మందులు సాధారణంగా హార్మోన్ల ప్రభావాలను కలిగి ఉంటాయి, ఎముకల అభివృద్ధిని ప్రేరేపించడానికి ఈస్ట్రోజె¯Œ తో సమానంగా పెరుగుతాయి లేదా పనిచేస్తాయి. ఈ వ్యాధి దాని ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలను కలిగి ఉండదు. ఆస్టియోపెనియాలో తక్కువ ఎముక సాంద్రత, తరచుగా పగుళ్లు, భంగిమలో సమస్యలు బోలు ఎముకల వ్యాధికి సూచికలు. ఏదేమైనా ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడానికి ఎముక ఆరోగ్యం జీవన నాణ్యత రెండింటినీ మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా వ్యాధి పరీక్షలు చేయించడం అవసరం. –డా.వీరేంద్ర ముద్నూర్ కన్సల్టెలంట్ జాయింట్ రీప్లేస్మెంట్,ఆర్థోస్కోపీ సర్జన్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, -
నెల క్రితం కిడ్నాప్.. ఇప్పుడు ఎముకల గూడుగా..
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): సేలం జిల్లాలో గత 6వ తేదీన అదృశ్యమైన ఓ కళాశాల విద్యార్థిని మృతదేహం తలలేకుండా బావిలో తేలుతున్న ఎముకల గూడుగా బయటపడింది. వివరాలు.. సేలం, కారిపట్టి, పిన్నాంపల్లికి చెందిన కాశీ విశ్వనాథన్‌కు చెందిన వ్యవసాయ బావిలో తల లేకుండా ఎముకల గూడుగా తేలుతున్న యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఎముకల గూడును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు ధరించిన దుస్తుల ఆధారంగా గత 6వ తేదీ అదృశ్యమైన మిన్నాంపల్లి ఎంజీఆర్ నగర్‌కు చెందిన కన్మణి కుమార్తె తిత్తిమిలా (19) మృతదేహాంగా గుర్తించారు. ఈమె సేలం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నట్టు తెలిసింది. తల్లిదండ్రులు దుస్తులను చూసి తిత్తిమిలా అని నిర్ధారించారు. తల కనబడకపోవడంతో బావిలో తీవ్రంగా గాలిస్తున్నారు. చదవండి: స్నేహం ముసుగులో యువతులను లొంగదీసుకుని.. ఆతర్వాత -
హైనాల స్థావరం.. గుహ నిండా ఎముకలే
రియాద్ : ఏడు వేల సంవత్సరాల నాటి హైనాల స్థావరాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సౌదీ అరేబియాలోని ఓ లావా గుహలో ఈ స్థావరాన్ని గుర్తించారు. ఈ గుహ మొత్తం ఎముకలతో నిండి ఉంది. ఈ గుహలో దాదాపు 40 రకాల జంతువుల ఎముకలు బయటపడ్డాయి. వీటిలో మనుషులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, మేకలు, జింకలు, ఇతర హైనాల ఎముకలు సైతం ఉన్నాయి. ఈ గుహ కొన్ని వేల సంవత్సరాల పాటు హైనాలు విందు ఆరగించే ప్రదేశంగా ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హైనాలు మాంసం కోసం స్మశాన వాటికలలోని మనుషుల మృతదేహాలను గుహలోకి లాక్కువచ్చుంటాయని అభిప్రాయపడుతున్నారు. 2007లో ఈ గుహను కనుగొన్నప్పటికి లోపలినుంచి జంతువుల అరుపులు వినపడ్డంతో పరిశోధకులు లోపలికి వెళ్లేప్రయత్నం చేయలేదు. ఈ గుహనుంచి పరిశోధనల నిమిత్తం 1,917 ఎముకలు, పళ్లను వెలికి తీశారు. వీటిలో 1,073 ఎముకలు అస్థిపంజరానికి చెందినవిగా గుర్తించారు. 13 శాంపిల్స్‌ను రేడియో కార్బన్ డేటింగ్ టెస్ట్ చేయగా వాటిలో కొన్ని ఎముకలు 6,839 ఏళ్ల నాటి వని తేలింది. హైనాలు ఒకరకంగా చెప్పాలంటే సర్వభక్షకాలు. అయితే, ఎక్కువగా మాంసాహారానికి మొగ్గుచూపుతాయి. ఇతర జంతువుల్ని గుంపుగా వేటాడి, చంపి తింటాయి. ఇతర జంతువులకంటే హైనాల జీర్ణవ్యవస్థ ప్రత్యేకమైనది. జంతువుల అన్ని రకాల ఎముకలను సైతం తిని అరిగించుకోగలవు. -
ముక్కు, నోరు మూసుకుని తుమ్మాడు.. ఆపై
తుమ్మేటప్పుడు ఆటోమెటిక్‌గా కళ్లు వాటంతటవే మూతపడతాయి. ఇక ఏదైనా శుభకార్యాల సమయంలో తుమ్ము వస్తే.. బలవంతంగా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం.. లేదంటే తిట్లు పడతాయి కాబట్టి. అలా బలవంతంగా తుమ్ము ఆపుకుంటే కళ్లలోకి నీళ్లు వస్తాయి. అలాంటిది తుమ్ము వచ్చేటప్పుడు ముక్కు, నోరు మూసుకుంటే.. ఏం జరుగుతుంది?. ఇదిగో ఇలాంటి అనుమానామే ఓ వ్యక్తికి వచ్చింది. దాంతో ఓ సారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో చేరి అపసోపాలు పడుతున్నాడు. మరి అతడి ప్రయోగంలో ఎలాంటి ఫలితం ఇచ్చిందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. ఎందుకు అనిపించిందో ఏమో కానీ ఓ 34 ఏళ్ల వ్యక్తి తుమ్మును ఆపాలనుకున్నాడు. దాంతో తుమ్ము వస్తుండగా ముక్కు, నోరు ఒకే సారి మూసుకున్నాడు. ఈ క్రమంలో ఎముక విరిగిపోయిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత నోట్లో నుంచి రక్తం వచ్చింది. అతడి వాయిస్ మారిపోయింది. గొంతులో నొప్పి.. మింగడంలో ఇబ్బంది పడ్డాడు. బాధ భరించలేక ఆస్పత్రికి వెళ్లాడు. దాంతో వైద్యులు అతడి మెడను స్కాన్ చేయగా అక్కడ ఉన్న ఎముకలు పక్కకు కదిలి విరగడంతోపాటు లోతైన కణజాలం, కండరాల లోపల గాలి బుడగలు వచ్చినట్లు వైద్యులు కనుగొన్నారు. (చదవండి: తుమ్మినందుకు చితక్కొట్టారు..) గాలి నిండిన కణజాలానికి వ్యతిరేకంగా గుండె కొట్టుకున్నప్పుడు కూడా ఎముకల పగుళ్లు ఏర్పడుతున్నందున వైద్యులు అతని మృధువైన మెడ కణజాలం, ఛాతీని స్కాన్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికైతే అతడు కోలుకుంటున్నాడు. ఇక మీదట ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయవద్దని వైద్యులు అతడిని హెచ్చరిస్తున్నారు. -
ఆస్పత్రిలో పుర్రె, ఎముకలు.. పాల్వంచలో కలకలం
సాక్షి, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో మనిషి అవశేషాలున్న డబ్బా సోమవారం కలకలం సృష్టించింది. అందులో పుర్రె, చేతి ఎముక, పళ్లు ఉన్నాయి. ఆస్పత్రి వర్గాల కథనం ప్రకారం.. పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో దుర్వాసన వస్తుండటంతో.. సిబ్బంది పరిశీలించి జనరేటర్ ఉండే ఎలక్ట్రికల్ గది నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఆ గదిలో మూలకు నీలం రంగు లుంగీతో కట్టిన మూట కనిపించింది. శానిటేషన్ సూపర్వైజర్ దుర్గా, వార్డు బాయ్ ఎన్సీపీ.బాబు దాన్ని విప్పి పరిశీలించగా.. అందులో బాక్స్ ఉంది. తెరిచి చూడగా.. ప్లాస్టిక్ డబ్బా, ప్లాస్టిక్ కవర్ కనిపించాయి. ప్లాస్టిక్ డబ్బాలో మనిషి మొండెం నుంచి వేరు చేసిన పుర్రె, చేతి ఎముక ఉన్నాయి. కవర్లో కళ్లు, పళ్లు ఉన్నాయి. నాలుగైదు రోజుల క్రితం మృతి చెందిన శవం అవశేషాలుగా సిబ్బంది భావిస్తున్నారు. ఈ అవశేషాల మూటను మార్చురీ గదికి తరలించారు. పోలీసులు ఆస్పత్రి సిబ్బంది సహకారంతో సీసీ పుటేజీలో నాలుగైదు రోజులుగా ఆస్పత్రికి రాకపోకలు సాగించిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ ఘటనపై సిబ్బంది మాట్లాడుతూ వాటిని పోస్ట్‌మార్టం కోసం తెచ్చామని చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. పోస్ట్‌మార్టం సిబ్బంది మాత్రం అటువంటిదేమీ లేదని పై అధికారులకు తెలిపినట్లు సమాచారం. సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావును వివరణ కోరగా.. తాను మీటింగ్ ఉండటం వల్ల ఆస్పత్రిలో లేనని, వివరాలు తెలుసుకుంటానని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని సిబ్బంది పరిశీలించారని, ఫిర్యాదు ఇస్తే దర్యాప్తు చేస్తామని ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. -
లాక్డౌన్: పుత్తూరు కట్టుకు విశ్రాంతి
ఆకుపసరు.. వెదురు దబ్బలతో విరిగిన ఎముకలకు కట్లు కట్టే పుత్తూరు శల్య వైద్యానికి తాత్కాలికంగా బ్రేక్‌పడింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్డౌన్ ప్రకటించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఫలితంగా వందలాది మంది రోగులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఎంతో విశిష్ట చరిత్ర కలిగిన పుత్తూరు కట్టుకు గతంలో ఎన్నడూ ఇలాంటి అవరోధం కలగలేదు. సాక్షి, పుత్తూరు: దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పుత్తూరు శల్య వైద్యానికి తాత్కాలిక విరామం వచ్చింది. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాళెంలో శతాబ్ద కాలంగా శల్యవైద్యశాల ద్వారా విరిగిన ఎముకులకు ఆకు పసురుతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదే పుత్తూరు కట్టుగా వాసికెక్కింది. సినీ రాజకీయ ప్రముఖుడు ఎన్టీఆర్ మూడుసార్లు ఇక్కడ చికిత్స చేయించుకున్నారు. పల్లెటూరి పిల్ల, సర్దార్ పాపారాయుడు సినిమాల చిత్రీకరణ సమయంలో ఆయన గాయపడగా.. ఆయనకు పుత్తూరు కట్టు కట్టి సమస్యను పరిష్కరించారు. మాజీ ఉప రాష్ట్రపతి వీవీ గిరి, హీరో కృష్ణంరాజుకు కూడా పుత్తూరు శల్యవైద్యులు సేవలు అందించారు. కొంత కాలం క్రితం ప్రముఖ వైద్య సంస్థల అధినేత డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డికి కూడా సేవలు అందించారు. సగటున రోజూ సుమారు 300 మంది రోగులు చికిత్స కోసం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ ఆరుగురు వైద్యులు, 50 మంది సిబ్బంది రోగులకు సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు ఇక్కడి వైద్యులు తిరువనంతపురం, బెంగళూరు, ముంబయి తదితర నగరాలకు నెలకు ఒకసారి వెళ్లి సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ సూరపరాజు ప్రతాప్ రాజు తెలిపారు. కాగా లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 25వ తేదీ నుంచి శల్యవైద్యశాలను మూసివేశారు. ప్రజారవాణాతో పాటు ఇతర రవాణా మార్గాలు మూతబడడంతో రోగుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత తిరిగి ఆస్పత్రిలో వైద్య సేవలను పునరుద్ధరించనున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా.. రోగులతో పాటు వారి బంధువులు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది రోజూ ఆçస్పత్రికి వస్తుంటారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఆçస్పత్రిని మూసివేశాం. లాక్డౌన్ తరువాత పూర్తిస్థాయిలో రోగులకు చికిత్స అందిస్తాం. పరిస్థితిని రోగులు అర్థం చేసుకుని, సహకరించాలి. – డాక్టర్ కృష్ణంరాజు, శల్యవైద్యులు, పుత్తూరు -
తీవ్రమైన వెన్ను నొప్పి... తగ్గేదెలా?
నా వయసు 39 ఏళ్లు. విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? ఇటీవల వెన్నునొప్పి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్న సాధారణమైన సమస్య. ఎక్కువగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. హోమియోలో ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్‌బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. చికిత్స: మెడ ఫ్రీగా తిరగకుండా పట్టేసినట్లుగా ఉన్నవారికి యాసిడ్‌ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పులకు ఆస్క్యులస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
నడుమంత్రపు నొప్పి!
తమ జీవితకాలంలో నడుమునొప్పి రానివారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇది మధ్యవయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా 35 ఏళ్లు పైబడితే ఏదో ఒక సమయంలో నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే సాధారణంగా నడుమునొప్పి అరుదుగా తప్ప అది పెద్దగా ప్రమాదకరం కాదు. దాదాపు అందరూ ఎదుర్కొనే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. నడుమునొప్పికి కారణాలు నడుమునొప్పికి చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకు... కండరాలు, లిగమెంట్లు, టెండన్లు, డిస్క్‌లు, ఎముకలు... ఇలా ఎక్కడ సమస్య ఉన్నా నడుము నొప్పి రూపంలో బయటపడుతుంది. సాధారణంగా నడుమునొప్పికి ఎక్కువగా కారణమయ్యే అంశాలివి... ►నడుము కండరాలు తీవ్రమైన ఒత్తిడికి గురై, స్ప్రెయిన్ కావడం ►లిగమెంట్లు దెబ్బతినడం ►నడుము పరిసరాల్లో ఉండే కండరాలు పట్టేయడం. ►పై కండిషన్లకు కారణమయ్యే అంశాలు... ►ఏదైనా బరువును సక్రమంగా ఎత్తకపోవడం ►ఎక్కువ బరువును అకస్మాత్తుగా ఎత్తడం ►సరైన పోష్చర్‌లో కాకుండా అడ్డదిడ్డంగా కదలడం లేదా నడవడం ►అకస్మాత్తుగా జరిగే ఒంటి కదలికలు... ఇలాంటి సంఘటనలతో ఈ కింద పేర్కొన్న పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవి నడుమునొప్పి కారణమవుతాయి. ►ప్రతి రెండు వెన్నుపూసల మధ్య కుషన్‌లాంటి ఒక డిస్క్ ఉంటుంది. ఏవైనా కారణాల వల్ల డిస్క్ దెబ్బతినడంతో అక్కడి నరం మీద ఒత్తిడి పెరిగి నడుము నొప్పి రావచ్చు ►వెన్నుపూసకు ఇరుపక్కలా ఉండే డిస్క్‌లో వాపు రావడం వల్ల నడుము నొప్పి వస్తుంది. ►సయాటికా: మనదేహంలో అన్నిటి కంటే పెద్ద నరం నడుము దగ్గర మొదలై అది కాలివరకు వెళ్తుంది. ఆ నరాన్ని ‘సయాటిక్’ నరం అంటారు. ఏవైనా కారణాల వల్ల ఆ నరం నొక్కుకుపోతే... నడుము దగ్గర నొప్పి మొదలై అది కాళ్ల వరకు పాకుతుంది. దీన్నే ‘సయాటికా నొప్పి’ అంటారు. ►కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ స్పాండిలోసిస్‌లో రెండు వెన్నుపూసల మధ్య ఉండాల్సిన గ్యాప్ తగ్గి, ఆ రెంటిమధ్యన నరం ఇరుక్కుపోవడంతో నడుమునొప్పి వస్తుంది. ►కొందరిలో వెన్ను అసహజంగా ఉంటుంది. ఈ కండిషన్‌ను ‘ఫ్లాట్ బ్యాక్ సిండ్రోమ్’ అంటారు. ఈ అసహజ భంగిమ వల్ల కొందరిలో నొప్పి రావచ్చు. ఇది ఎక్కువగా తప్పుడు భంగిమల్లో కూర్చున్నవారిలో వస్తుంటుంది. ►మరి పొట్ట ఎక్కువగా ఉన్నా నడుమునొప్పి రావచ్చు. ►కొందరిలో ఎముకలు పెళుసుబారిపోయి తేలిగ్గా విరిగిపోయే ‘ఆస్టియోపోరోసిస్’ కండిషన్ ఏర్పడి వెన్ను కూడా విరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా నడుము లేదా వెన్ను నొప్పికి ఒక కారణం. నడుం నొప్పి ముప్పును పెంచే అంశాలు (రిస్క్ ఫ్యాక్టర్స్) : ►వృత్తులో తీవ్రమైన ఒత్తిడి ఉండటం ►మహిళల్లో గర్భధారణ ∙అదేపనిగా కూర్చొని పనిచేయడం ► పెరిగే వయసు ►ఊబకాయం ►పొగతాగడం ►చాలా ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం లేదా సరిగా చేయకపోవడం ►చాలా ఎక్కువగా చేసే శారీరక శ్రమ ►నిర్ధారణ: నడుమునొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏ కారణం వల్ల ఆ నడుమునొప్పి వస్తుందో తెలుసుకోవడం కోసం కొన్ని పరీక్షలు అవసరం. ఇందుకోసం ఎక్స్‌రే, అవసరాన్ని బట్టి సీటీస్కాన్ లేదా ఎమ్మారై, బోన్‌స్కాన్, ఎలక్ట్రోమయోగ్రఫీ వంటి పరీక్షలు చేయించడం అవసరమవుతుంది. ►చికిత్స: ముందుగా కారణం తెలుసుకోవాలి. దాన్నిబట్టి నొప్పిని దూరం చేయడానికి ఫిజియోథెరపిస్ట్ సహాయంతో అవసరమైన వ్యాయామాలు లేదా (ఇంటర్ ఫెరెన్షియల్ థెరపీ) ఐఎఫ్‌టీ వంటి ప్రక్రియలతో చేసే చికిత్సలు కూడా నడుమునొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనే మాటలకు సంక్షిప్త రూపమైన ‘టెన్స్’ చికిత్స కూడా నడుమునొప్పికి పనిచేస్తుంది. ఇందులో ఎలక్ట్రోడ్ల సహాయంతో చిన్న చిన్న విద్యుత్ ప్రకంపనలను చర్మం కిందికి పంపుతారు. ఫలితంగా ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భవతులు, మూర్ఛ రోగులు, గుండెజబ్బులు ఉన్నవారు లేదా గుండెలో పేస్‌మేకర్ అమర్చిన వాళ్లకు టెన్స్ చికిత్స సరికాదు. ఇలాంటి చికిత్సలు వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే సాగాలి. ►ఇక పై మార్గాలన్నీ విఫలం అయినప్పుడు ఎముకల వైద్య నిపుణులు లేదా న్యూరోసర్జన్లు లేదా స్పైన్ సర్జన్లు అవసరమైన శస్త్రచికిత్సను నిర్వహించి పరిస్థితిని పూర్తిగా చక్కబరుస్తారు. ►తక్షణ నొప్పి నివారణ కోసం: నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కోసం పెయిన్ కిల్లర్స్ అందుబాటులో ఉన్నా... ఇవి కేవలం తక్షణ నొప్పి నివారణ కోసమే పనికి వస్తాయి. వీటిని రెండు వారాలకు మించి తీసుకోవడం సరికాదు. దీనికి బదులు ఉపశమనం కోసం పైపూత మందులు (టాపికల్ మెడిసిన్స్) వాడటం మరింత మంచిది. ►ఒకవేళ నడుమునొప్పి దీర్ఘకాలం పాటు కొనసాగితే మాత్రం వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. మరికొన్ని అసాధారణ కారణాలు కాడా ఈక్వినా సిండ్రోమ్: ప్రతి రెండు వెన్నుపూసల మధ్య నుంచి కొన్ని నరాలు బయటకు వచ్చినట్లుగానే... నడుము కింది వెన్నుపూస నుంచి నరాలన్నీ బయటికి వచ్చి నడుము కింది ప్రాంతమంతా విస్తరిస్తాయి. కొన్నిసార్లు వెన్నుపూస చివరి భాగం నుంచి వచ్చిన నరాలనుంచి ఒక సన్నటి నొప్పి (డల్ పెయిన్) బయల్దేరి... పిరుదులు, జననాంగాలు, తొడల భాగమంతా ఆ నొప్పి విస్తరిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో పిరుదుల కింది భాగమంతా అసలు లేనేలేదేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. దాంతో కొందరిలో అది మల, మూత్ర విసర్జన కలగబోయేముందు వచ్చే ఫీలింగ్ కూడా లేనట్లుగా ఉంటుంది. ఈ కండిషన్‌ను కాడా ‘ఈక్వినా సిండ్రోమ్’ అంటారు. ►వెన్నెముక క్యాన్సర్ : ఇది అరుదైన కండిషన్. ఇలాంటి సమయాల్లో వెన్ను కింది భాగంలో ఎక్కడైనా క్యాన్సర్ గడ్డ ఏర్పడి అది అక్కడి నరాలను నొక్కేయడం వల్ల నడుము నొప్పి రావచ్చు. ►వెన్నెముక ఇన్ఫెక్షన్ : ఏదైనా వెన్నుపూసలో వాపు రావడం వల్ల అక్కడి మృదువైన భాగాల మీద ప్రభావం పడి నడుమునొప్పి రావచ్చు. ఇలాంటి సమయాల్లో జ్వరం కూడా ఉంటుంది. ►ఇన్ఫెక్షన్లు: మహిళల్లో వచ్చే ‘పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్’ వంటి ఇన్ఫెక్షన్లు లేదా యూరినరీ బ్లాడర్ సమస్యలు, కిడ్నీ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. ►నరాలకు వచ్చే ‘షింగిల్స్’ అనే సమస్య ఉన్నప్పుడు కూడా అది ఒకవేళ నడుము భాగంలోని నరాలు దెబ్బతింటే నడుమునొప్పి రావచ్చు. ►పక్క సరిగా లేకపోయినా : కొన్ని సందర్భాల్లో పక్క సరిగా కుదరక... అది ఉండాల్సిన తీరులో లేనందువల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. ►కూర్చోవడంలో తప్పుడు భంగిమలు: కూర్చొని పనిచేసేవారిలో దాదాపు 80 శాతానికి పైగా సరైన భంగిమలో ఎలా కూర్చోవాలో తెలియదు. దాంతో నడుమునొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. దాంతోపాటు నడుమునొప్పికి కారణమయ్యే కొన్ని అంశాలివి... ►అసహజ భంగిమల్లో అకస్మాత్తుగా వంగడం లేదా పక్కకు తిరగడం ►నొక్కడం ►లాగడం ►ఎత్తడం ►చాలాసేపు నిలబడటం ►ముందుకు ఒంగడం ►ఒక్కపెట్టున తుమ్మడం ►దగ్గడం ►అతిగా ఒంగడం ►కంప్యూటర్ను చూస్తూ మెడను అసహజ భంగిమలో చాలాసేపు వంచి ఉంచడం ►చాలా సేపు డ్రైవ్ చేయడం డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
మెడనొప్పి చేతులకూ పాకుతోంది..?
నా వయసు 52 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. మందులు వాడుతున్నంత కాలం బాగానే ఉన్నా అవి ఆపేస్తే మాత్రం మళ్లీ నొప్పి వస్తోంది. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? వివరంగా చెప్పగలరు. వయసు పెరగడం వల్ల వచ్చే మెడ నొప్పికి పూర్తి పరిష్కారం లభించదని చాలామంది అనుకుంటుంటారు. కానీ హోమియోచికిత్స ద్వారా ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది. మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దీనినే సర్వైకల్ స్పైనల్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. దాదాపు 85 శాతానికి పైగా ఇది 60 ఏళ్ల వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది. ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ►వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ►క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ►డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ►వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ►ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ►ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్వు సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ►ఎత్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ►మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ►సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ►నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ►మెడ బిగుసుకుపోవడం ►తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ►నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ►చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ►నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్–రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కళ్లు పచ్చగా ఉన్నాయి...పరిష్కారం చెప్పండి నా వయసు 35 ఏళ్లు. నా కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. మూత్రం కూడా పసుపురంగులో వస్తోంది. ఈ లక్షణాలు చూసి నాకు ఆందోళనగా ఉంది. నా సమస్య ఏమిటి? దీనికి హోమియోలో మంచి చికిత్స ఉందేమో దయచేసి వివరించండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు కామెర్లు సోకినట్లు తెలుస్తోంది. ఇది దీర్ఘకాలంలో కాలేయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మానవ శరీరంలో కాలేయం అతి ముఖ్యమైన భాగం. ఈ అవయవానికి వైరస్ కారణంగా ఇన్ఫెక్షన్ సోకితే ఎన్నో సమస్యలు మొదలవుతాయి. కాలేయం ప్రభావం చూపే వైరస్లలో ముఖ్యమైనవి హెపటైటిస్–బి, హెపటైటిస్–సి. ఈ వైరస్లు సోకగానే బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొంతకాలం పాటు ఆ వైరస్ వారి శరీరాల్లో నిద్రాణంగా ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా కాలేయాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రాణాంతకంగా మారుతుంది. లివర్ క్యాన్సర్ సిర్రోసిస్, వైరల్ హెపటైటిస్ వ్యాధులు రావడానికి కారణమవుతుంది. లక్షణాలు: హెపటైటిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే లక్షణాలు బయటకేమీ కనిపించవు. అవి కనిపించడానికి చాలా ఏళ్లు పడుతుంది. కొంతమందిలో వైరస్ సోకిన కొద్దిరోజులకే కామెర్లు వస్తాయి. దీన్ని ఎక్యూట్ స్టేజ్‌గా చెప్పవచ్చు. ఈ దశలో వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. కొంతమందిలో ఈ వైరస్ తొలగిపోకుండా, శాశ్వతంగా శరీరంలోనే నివాసం ఏర్పరచుకొని బలం పెంచుకుంటూ పోతుంది. దీనిని క్రానిక్ స్టేజ్ అంటారు. ఈ దశలోనే కాళ్లవాపు, పొట్ట ఉబ్బరం, వాంతులు, ఆకలి తగ్గిపోవడం, మూత్రం పచ్చగా రావడం, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స: రోగి శారీరక మానసిక లక్షణాలను పరిశీలించి చికిత్స అందించడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. మీరొకసారి హోమియో వైద్యుడిని సంప్రదించండి. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు వాడితే భవిష్యత్తులో కాలేయానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా పూర్తిగా కాపాడుకోవచ్చు. డా‘‘ కె. రవికిరణ్, మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్ -
లైఫ్ జర్నీకి బోన్ స్ట్రెంగ్త్
కండరాలే కాదు.. ఎముకలూ ముఖ్యమే ప్రత్యేక వ్యాయామాలతో అదనపు శక్తిచూడడానికి మంచి ఫిజిక్. బాడీ టోన్ సరే.. మరి శరీరంలోని బోన్స్(ఎముకల) సంగతి ఏమిటి? అవీ పటిష్టంగా ఉన్నట్టేనా? వ్యాయామం చేస్తూ చక్కని శరీర సౌష్టవం సొంతం చేసుకున్నా కొంత మందికి బ్యాక్ పెయిన్, మోకాలి నొప్పి, మడం నొప్పివగైరాలు ఎందుకు వస్తాయి? అంటే.. ‘బోన్ బలం వేరు.. కండలు తిరగడం వేరు’ అంటున్నారు కూకట్‌పల్లిలోని ప్రతిమ ఆస్పత్రికి చెందిన ఆర్థోపెడిక్ సీనియర్కన్సల్టెంట్ డాక్టర్ సాగి రాధాకృష్ణారావు. వ్యాయామం చేస్తే చాలదని, ఎముకల సామర్థ్యం పెరగడానికి ప్రత్యేకంగా మరికొన్ని వ్యాయామాలు తప్పక చేయాలనిసూచిస్తున్నారాయన. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. అందరికీ ‘లో’.. కొందరికే హై.. ప్రతి అడుగులో ఒక కాలి వెయిట్ పడుతుంటుంది. కాబట్టి వాకింగ్ ఎముకల బలోపేతానికి మేలు చేస్తుంది. అలాగే జాగింగ్ కూడా ఓకే. అయితే రెండు కాళ్ల బరువు ఒకేసారి పడే అవకాశం ఉండేది జంపింగ్స్లోనే. తద్వారా బోన్ క్వాలిటీ బాగా మెరుగవుతుంది. అయితే ఈ తరహా హై ఇంపాక్ట్ వ్యాయామాలు అందరూ చేయలేకపోవచ్చు. అంతేకాక దీనివల్ల గాయపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ‘డీ’ కొట్టాల్సిందే.. వ్యాయామంతో పాటు ఎముకల్లో బలానికి ‘విటమిన్ డి’ అంతకు మించిన అవసరం. కాబట్టి శారీరకంగా చూడడానికి బాగుండడం మాత్రమే కాకుండా మంచి బోన్ స్ట్రెంగ్త్కావాలనుకునేవారు తప్పకుండా సూర్యరశ్మి సోకే చోట ఏదో ఒక వ్యాయామం చేయడం మంచిది. సూర్యరశ్మి సోకడం వల్ల శరీరానికి ‘డి విటమిన్’ లభ్యతతో పాటు అదిశరవేగంగా శక్తిగా మారి ఎముకల్లోనిల్వ అయ్యేందుకు వ్యాయామంతోడ్పడుతుంది. కాబట్టి పైన పేర్కొన్న వ్యాయామాల్లో కొన్నయినా వీలైనంతఎండ పడే చోట చేయడం మంచిది. ప్రభావం చూపేవి ఎంచుకోవాలి ఎముకల బలానికి శారీరక శ్రమ ఉపకరిస్తుందనేది వాస్తవం. అయితే, వీటిలో బోన్స్కి మేలు చేసే వ్యాయామాలను ‘నో ఇంపాక్ట్, లో ఇంపాక్ట్, హై ఇంపాక్ట్’గా విభజించవచ్చు. స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా, స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు, సైడ్స్, క్రంచెస్.. ఇలాంటి వాటిని బోన్స్‌పై నో ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. అలాగే వాకింగ్, పంచెస్, లంజెస్, కిక్స్.. వంటివి లో ఇంపాక్ట్ వ్యాయామాలుగా, స్టెప్ ఎరోబిక్స్, జంపింగ్ జాక్స్, నడుముకి రోప్ కట్టుకుని చేసే జంపింగ్స్, స్కిప్పింగ్.. వగైరాలను హై ఇంపాక్ట్ వ్యాయామాలుగా చెప్పొచ్చు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎముకల బలాన్ని కోరుకునేవారు మరీ ఎక్కువ కాకుండా తగినంత బరువు శరీరం మోయగలిగితే ఆ మేరకు ఎముకల సామర్థ్యం మెరుగవుతుంది. దీనికి వెయిట్స్‌ను లిఫ్ట్ చేయడం ద్వారా చేసే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఒక మార్గం. దీనిలో చేతులు, ఛాతి, కాళ్లు.. ఇలా అన్ని శరీర భాగాలలోని బోన్స్కి వ్యాయామాన్ని అందించేందుకు వీలుంటుంది. -
ఎముకల బలాన్నిచాలాకాలం కాపాడుకుందాం
ఎముక గట్టిగా ఉండాలంటే అందులో ఉండాల్సిన పదార్థాలూ, ఖనిజ లవణాలన్నీ కూరి కూరి నిండి ఉన్నట్లుగా ఉండాలి. అప్పుడే ఎముకకు బలం. అదే కూరినట్లుగా కాకుండా వదులొదులుగా ఉంటే అది పెళుసుగా ఉంటుంది. అంటే... దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... ఎముకలో ఉండాల్సిన ఖనిజాలు, పదార్థాల సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఎముక అంత ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటి ఎముకలు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ జబ్బుల్లాంటివి త్వరగా రావు. అలా ఎముక సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు జబ్బులేమీ రాకుండా చూసుకోవడంతో పాటు వాటిని ఎక్కువ కాలం కాపాడుకోడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే ఎముకలో క్యాల్షియమ్, ఇతర మినరల్స్ వంటివి తక్కువగా ఉంటే అది పెళుసుగా మారిపోతుంది. పెళుసుగా ఉన్నవి త్వరగా విరిగిపోతాయన్న సంగతి తెలిసిందే కదా. ఎముకలు అలా పెళుసుబారకుండా ఉండాలంటే ఎముకలో ఉండాల్సిన పదార్థాల సాంద్రత (బోన్ మినరల్ డెన్సిటీ) ఎంత ఉండాలి, అసలు బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఏమిటి, దాన్ని సమకూర్చుకోడానికి ఏం చేయాలి వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. మన ఎముకలు చిన్నప్పుడు కాస్తంత మెత్తగా ఉంటాయి. మెత్తగా అనడం కంటే ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. మనిషి ఎదిగే కొద్దీ అవి క్రమంగా బలం పుంజుకుని, గట్టిపడుతుంటాయి. అంటే మునుపు ఉన్న ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుందన్నమాట. ఇలా ఎముకలు బలం పుంజుకోడానికి... మనం తీసుకునే ఆహారం నుంచి, సూర్యరశ్మి నుంచి అవి అనేక పోషకాలను గ్రహిస్తుంటాయి. ఆహారం నుంచి క్యాల్షియమ్, సూర్యరశ్మి నుంచి విటమిన్ ‘డి’ గ్రహిస్తాయి. ఈ రెండింటితో పాటు మనం చేసే శారీరక శ్రమ కూడా తోడైతే అవి మరింత బలంగానూ, ఆరోగ్యకరంగానూ తయారవుతాయి. ఇలా ఎముకలు బలం పుంజుకుని, వాటిలో ఉండాల్సిన పదార్థాన్ని, ఖనిజాలను సమకూర్చుకుని పూర్తి సాంద్రతను సమకూర్చుకోడం అన్నది ఎదిగే పిల్లలు ఎదిగే క్రమంలో నిరంతరం జరిగే ప్రక్రియ. ఇలా ఎముకలో ఉండే సాంద్రతను బోన్ మాస్ డెన్సిటీ (బీఎమ్‌డీ) అంటారు. ముప్ఫై ఏళ్ల వయసులో గరిష్ఠ సాంద్రత ఒక మనిషికి 30 ఏళ్లు వచ్చే నాటికి అతడి ఎముకల్లోని సాంద్రత గరిష్టంగా ఉంటుంది. అలా గరిష్టంగా ఉన్న 30 ఏళ్ల వయసు తర్వాత నుంచి... క్రమంగా ఎముకలోని పదార్థాన్ని కోల్పోతూ ఉంటారు. దీన్నే ‘ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ అని వ్యవహరిస్తారు. ఒకవేళ ఎముకలు త్వరత్వరగా తమ సాంద్రత కోల్పోతే అవి చాలా త్వరగా పెళుసుబారి త్వరగా ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. అయితే కొందరిలో ఎముక సాంద్రతను కోల్పోయే ప్రక్రియ చాలా నెమ్మదిగా, ఆలస్యంగా జరుగుతుంది. కానీ ఒక వయసు తర్వాత మాత్రం ఎముక తన సాంద్రతను కోల్పేయే పరిస్థితి క్రమంగా కొనసాగుతూనే ఉంటుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాత... మహిళల విషయానికి వస్తే రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) తర్వాత ఎముక సాంద్రత కోల్పోయే వేగం బాగా పెరుగుతుంది. (అందుకే మెనోపాజ్ ఆగిన మహిళల్లో ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ). కాబట్టి మన ఎముకలోని సాంద్రతను వీలైనంత ఎక్కువ కాలం మనం నిలుపుకోగలిగితే మన ఎముక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎముకల్లో సాంద్రత తగ్గించే రిస్క్ ఫ్యాక్టర్లు ఇవే... ఎముకల్లో సాంద్రత తగ్గేలా చేసే పొగాకు, ఆల్కహాల్ దురలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటి వాటిని మనం ప్రయత్నపూర్వకంగా మార్చుకుని ఆరోగ్యాన్ని సమకూర్చుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని మార్చుకోలేని, తప్పనిసరి రిస్క్ ఫ్యాక్టర్లు కూడా ఉన్నాయి. అవి... మహిళలు ఎముకల సాంద్రత కోల్పోవడం ఎక్కువ (మరీ ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత), పొట్టిదనం (అరవై కిలోల కంటే లోపు ఉండి, 155 సెం.మీ. కంటే తక్కువ ఎత్తున్న మహిళల్లో ఎముక సంద్రత తగ్గడం చాలా త్వరగా, వేగంగా జరుగుతుంటుంది). దీనికి తోడు మన ప్రాంతీయత కూడా ఎముక సాంద్రతకు దోహదం చేస్తుంది. (పాశ్చాత్యులతో పోలిస్తే ఆసియన్లు, చైనీయులు, కాకసాయిడ్స్లో ఎముక సాంద్రత స్వతహాగానే తక్కువ). అలాగే మన కుటుంబ చరిత్ర (కొందరిలో ఎముకలు తేలిగ్గా విరిగే తత్వం ఉంటుంది), మన జీవనశైలి, కాఫీ, ఆల్కహాల్ వంటి అలవాట్లు... ఇవన్నీ ఎముక సాంద్రత త్వరగా తగ్గడానికి దోహదం చేసే అంశాలే. ఎముక సాంద్రతను తక్కువ చేసే జబ్బులివి... ఇక హైపోగొనాడిజమ్, థైరోటాక్సికోసిస్, కుషింగ్ సిండ్రోమ్, అనొరెక్సియా నర్వోజా (తిండిపై ఆసక్తికోల్పోయి అసలు ఆహారం తీసుకోకపోయే రుగ్మత), మాల్ అబ్షార్‌ప్షన్ సిండ్రోమ్ (మనం తీసుకున్న పోషకాలు వంటికి పట్టని రుగ్మత), దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, దీర్ఘకాలిక మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, ఫిట్స్ వస్తున్నప్పుడు తీసుకునే మందులైన యాంటీ కన్వల్సెంట్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ వ్యాధుల వల్ల కూడా ఎముక సాంద్రత తగ్గిపోయి, ఆ తర్వాతి దశలో మొదటి వ్యాధుల ఫలితంగా సెకండరీ ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. ఎముక సాంద్రతపై దృష్టి పెట్టాల్సిన వారెవరు? ►మహిళలు 55 ఏళ్లు దాటిన వారైతే, పురుషులైతే 65 ఏళ్లు దాటినవారైతే ఒకసారి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవాలి. ఇక ఈ కింది కండిషన్స్ గాని ఉంటే 50 ఏళ్ల పైబడ్డవారంతా ఎముక సాంద్రతపై దృష్టిపెట్టాలి. అవి... ►గతంలో ఏదైనా ప్రమాదం జరిగి ఎముక విరగడం వంటి ట్రామా కేసుల వారు. తక్కువ బరువు ఉన్నవారు. ►గతంలో తుంటి ఎముక ఫ్రాక్చర్ అయినవారు ►వెన్నెముకకు సంబంధించిన రుగ్మత లేదా అబ్నార్మాలిటీస్ ఉన్నవారు. ►గ్లూకోకార్టికాయిడ్ స్టెరాయిడ్‌ను ఒక మందుగా తీసుకుంటున్నవారు ►హైపర్ థైరాయిడిజమ్‌తో బాధపడుతున్నవారు ►ఆస్టియోపోరోసిస్ జబ్బుకు మందు తీసుకుంటూ... డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నవారు. ►తినడానికి సంబంధించిన రుగ్మతలు (అంటే తిన్నది సరిగా ఒంటబట్టకపోవడం వంటి) ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవారు... వీరితో పాటు పొగతాగడం, మద్యపానం అలవాటు ఉన్నవారు, విటమిన్ ‘డి’ లోపం ఉన్నవారు తప్పనిసరిగా మీద 50 ఏళ్లు పైబడ్డ నాటి నుంచే డాక్టర్ సలహా మేరకు ఎముక సాంద్రత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఎముక సాంద్రత తెలుసుకోవడం ఎలా..? నిజానికి ఇది ఆస్టియోపోరోసిస్ నిర్ధారణకు చేసే పరీక్ష. దీన్ని ‘డ్యుయల్ ఎనర్జీ ఎక్స్–రే అబ్జార్షియోమెట్రీ’ అంటారు. దీనితో కేవలం ఐదు నిమిషాల్లోనే ఎముక సాంద్రత ఎంత అన్నది తెలిసిపోతుంది. అయితే ఈ విలువను అందరిలో ఒకేలా కాకుండా వయసును పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి దీన్ని ‘టీ’ స్కోర్‌గా చెబుతారు. దీనితో పాటు సీరమ్ లెవల్స్ ఆఫ్ క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్, ఇన్‌టాక్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ (పీటీహెచ్) వంటి పరీక్షలు కూడా అవసరమవుతాయి. ఎముక సాంద్రతను పెంచుకోవాలంటే... ముందు చెప్పుకున్నట్లుగానే ఎముక సాంద్రతకు మంచి బీజం యుక్తవయసులోనే పడాలి. పైగా ఎముక సాంద్రత పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ పెద్దగా ఖర్చు లేకుండానే స్వాభావికంగా జరిగేవే ఎక్కువ. కాబట్టి పిల్లలందరినీ యుక్తవయసులోకి వచ్చే ముందు క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని అంటే పాలు, పెరుగు, బ్రకోలీ వంటి తాజా కూరలు ఎక్కువగా తీసుకునేలా చూడాలి. అలాగే ఆరుబయట ఎండకు ఎక్స్పోజ్ అవుతూ ఎక్కువసేపు ఆడేలా ప్రోత్సహించాలి. దీనివల్ల శరీరంలో విటమిన్ ‘డి’ ఎక్కువగా తయారవుతుంది. మనం తీసుకున్న ఆహార పదార్థాల్లోని క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి ఇంకేలా చేస్తుంది విటమిన్ ‘డి’. అందుకే కేవలం క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నంత మాత్రాన కాకుండా... విటమిన్ ‘డి’ వల్ల కూడా ఎముకలకు బలం చేకూరుతుంది. దీనితో పాటు ఆ సమయంలో వారు తగినంతగా శారీరక శ్రమ, వ్యాయామం చేసేలా చూస్తే పిల్లలు బలంగా మారడమే కాకుండా, వారు మంచి బలంగా తయారవుతారు. చాలాకాలం... అంతెందుకు వృద్ధాప్యంలోనూ వారు ఇంచుమించుగా దాదాపుగా అంతే బలంతో ఉంటారు. ఎముక సాంద్రతను నిర్ణయించే అంశాలు... మనలోని చాలా అంశాలు ఎముక సాంద్రతతో కీలక భూమిక పోషిస్తాయి. ఉదాహరణకు ఒకరి జన్యువుల్లోనే ఎముక సాంద్రత అధికంగా ఉండే గుణం ఉంటుంది. దాంతోపాటు వ్యాయామం / శారీరక శ్రమ, క్యాల్షియమ్ తీసుకోవడం, విటమిన్ ‘డి’ని గ్రహించడం వంటి అంశాలు కూడా ఎముక సాంద్రతకు దోహదపడతాయి. ఇక పొగతాగడం, మద్యపానం, తరచూ జబ్బుపడటం, శారీరక శ్రమ చేయకుండా ఒక చోట కూర్చొని పనిచేయడం లేదా బద్దకంగా ఉండటం, కొన్ని రకాల మందులు (గ్లూకోకార్టికాయిడ్స్, యాంటీ ఎపిలెప్టిక్ మందులు) తీసుకోవడం వంటి అంశాలు ఎముక సాంద్రతను గుల్లబార్చి అవి బలహీనంగా మారేలా చేస్తాయి. యౌవన దశే కీలకం మన బాలలు యౌవన ప్రవేశకాలంలో ఎక్కువగా క్యాల్షియమ్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం, ఆ సమయంలో ఎక్కువగా విటమిన్ ‘డి’ని గ్రహించేలా ఆరుబయట తిరగడం, వ్యాయామం చేయడం వంటివి చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో సమకూర్చుకున్న ఎముక సాంద్రత దాదాపు జీవితకాలమంతా రక్షణ ఇస్తుంది. ఆ సమయంలో ఎంత ఎక్కువ సాంద్రతను గ్రహిస్తే, క్రమంగా కోల్పోయే దశ ప్రారంభమైనా కూడా అది చాలాకాలం ఉండేలా తోడ్పడుతుంది. ఆ సమయంలో దురలవాట్లకు చేరువ కావడం, వ్యాయామం చేయకపోవడం వంటివి చేస్తే అది ఆ తర్వాత కాలంలోనూ నష్టం చేకూరుస్తుంది. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్ -
ఆర్థరైటిస్ నివారణకు తేలిక మార్గాలు
ఒక వయసు దాటాక ఎముకలు అరిగిపోవడం సహజం. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. ఇలా ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చే ఆర్థరైటిస్ సమస్యను కొన్ని సాధారణ జాగ్రత్తల ద్వారా నివారించుకోవచ్చు. అవేమిటో తెలుసుకోండి. చాలాకాలం పాటు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ►స్థూలకాయం వల్ల మీ ఒంటి బరువు ఎముకలపై పడి ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. ►మన శరీర కదలికలు చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. కూర్చుని చేసే వృత్తుల్లో ఉండేవారు వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ 30 నిమిషాలు వేగంగా నడవడం వంటి వ్యాయామాలు చేయాలి. ►మరీ ఎక్కువగా కీళ్లు అరిగే అవకాశం ఉన్నవారు కీళ్లకు తగినంత విశ్రాంతి కల్పించాలి. వేగంగా పరుగెత్తే తరహా వ్యాయామాలు చేసేవారు తమ స్పోర్టింగ్ యాక్టివిటీస్‌ను తగ్గించాలి. దానికి బదులు వేగంగా నడవడం మంచిది. తమ ఒంటి బరువును గణనీయంగా తగ్గించే ఈదడం (స్విమ్మింగ్ ఎక్సర్సైజ్) ఇంకా మంచిది. ►కాళ్లు మడిచి, బాసిపట్లు వేసి కూర్చోవడం (స్క్వాటింగ్) మంచిది కాదు. వీలైనంత వరకు కుర్చీ లేదా బల్ల వంటి వాటి మీద కూర్చోవాలి. ►పాల వంటి క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ►మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ►కీళ్లలో నొప్పి కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.