ఆస్టియోపోరోసిస్
ఇంటి వెన్నెముకకు ఎముకలు వీక్
మామూలుగానే భారతీయుల్లో ఆస్టియో పోరోసిస్ కేసులు ఎక్కువ. ఇక మహిళల్లో ఈ రుగ్మత ముప్పు మరింత ఎక్కువ. యాభై ఏళ్లు దాటాక మహిళల్లో దాదాపు 40% నుంచి 50% మందిలో ఆస్టియోపోరోసిస్ కనిపించడం చాలా సాధారణంగా జరిగేదే. అలాగే మెనోపాజ్ దాటిన మహిళల్లో కనీసం 40% మందిలో ఇది కనిపిస్తుందంటే దీని విస్తృతి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆస్టియోపోరోసిస్ వచ్చిన మహిళల్లో మూడింట ఒక వంతు మందికి ఏదో ఒక దశలో తుంటి ఎముక ఫ్రాక్చర్ కేసులు తప్పక కనిపిస్తాయి. వారికి ముప్పుగా పరిణమిస్తూ, వారిలో ఇంత విస్తృతంగా కనిపించే ఆస్టియోపోరోసిస్ గురించి తెలుసుకుందాం.
మానవులందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకల పెరుగుదల సంభవిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. కానీ దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు ఇవి బలంగానే ఉంటూ, ఆ తర్వాత క్రమంగా తమ బలాన్ని కోల్పోతూ పెళుసుగా మారి΄ోతుంటాయి. కానీ మహిళల్లో మాత్రం వాళ్ల ఓవరీల నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్– ఈస్ట్రోజెన్ తగ్గడం మొదలుకాగానే ఎముకలు బలహీనం కావడం ప్రారంభమవుతుంది. ఇక రుతుక్రమం ఆగిపోయాక ఈస్ట్రోజెన్ ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో ఈ అంశమే వాళ్లలో ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారిపోయి, తేలిగ్గా విరిగిపోయే కండిషన్ అయిన ఆస్టియోపోరోసిస్‌కు కారణమవుతుంది.
మహిళల్లోనూ ఈ ముప్పు ఎవరెవరిలో...
వయసు పెరుగుతున్న కొద్దీ ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు అందరికీ ఉన్నప్పటికీ, కొందరిలో మాత్రం ఈ రిస్క్ మరీ ఎక్కువ పోషకాహార లోపాలున్నవారికి... మన దేశంలో మహిళలు పాలు, విటమిన్ డి ఉన్న పదార్థాలు తీసుకోవడం చాలా తక్కువ. అన్ని పోషకాలూ ఉన్న ఆహారాలు తీసుకోవడమూ వాళ్లలో తక్కువే. కాబట్టి మహిళల్లో ఈ రిస్క్ మరింత ఎక్కువ రుతుక్రమం ఆగిన మహిళల్లోనూ, గర్భసంచితో పాటు ఒకటి లేదా రెండు ఓవరీస్ తీయించుకున్న వాళ్లల్లో. చాలాకాలం పాటు స్టెరాయిడ్స్ వాడేవారిలో వ్యాయామం చేయని వారిలో (మన దేశంలో మహిళల్లో వ్యాయామం చాలా తక్కువ)
పొగతాగే అలవాటు ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి స్మోకింగ్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే టమద్యం తీసుకోవడం వల్ల శరీర కణాల (ప్రధానంగా ఎముక కణాల) అభివృద్ధి, పెరుగుదల ప్రభావితం అవుతాయి. ఫలితంగా మద్యం అలవాటు ఉన్నవాళ్లలో ఆస్టియోపోరోసిస్ రిస్క్ పెరుగుతుంది టకుటుంబ చరిత్ర... కుటుంబంలో ఎవరికైనా ఆస్టియో పోరోసిస్ ఉంటే ఆ కుటుంబ సభ్యులకు దీని రిస్క్ ఎక్కువ.
ఆస్టియోపోరోసిస్ – నిర్ధారణ...
రక్తపరీక్ష, ఎక్స్–రే, బీఎమ్‌డీ (బోన్ మాస్, డెన్సిటీ – అంటే ఎముక సాంద్రత నిర్ధారణ చేసే పరీక్షల ద్వారా రోగిలో దీన్ని నిర్ధారణ చేయవచ్చు)
చికిత్స ఇలా...
ప్రాథమిక నివారణ చర్యలు ఆస్టియోపోరోసిస్ కండిషన్‌ను ఆలస్యం చేస్తాయి. ఫలితంగా వయసు రిస్క్ తగ్గుతుంది.
క్యాల్షియమ్, విటమిన్ ‘డి’...
డాక్టర్లు ప్రాథమిక చికిత్సగా క్యాల్షియమ్, విటమిన్ ‘డి’ ఇస్తారు. అంటే... 60 ఏళ్లు దాటిన వారికి ప్రతిరోజూ 1500 ఎంజీ క్యాల్షియమ్‌నూ, విటమిన్–డిని రోజూ 10 నుంచి 15 ఎంజీ ఇస్తారు.
బిస్‌ఫాస్ఫోనేట్స్...
ఇవి ఒక రకం మందులు. వీటినే బిస్‌ఫాస్ఫోనేట్స్ అని కూడా అంటారు. ఎముక తనలోని పదార్థాన్ని కోల్పోయే ప్రక్రియను ఇవి ఆలస్యం చేస్తాయి. ఫలితంగా ఎముక సాంద్రత తగ్గే వేగం మందగిస్తుంది. దానివల్ల ఎముక మరింత కాలం దృఢంగా ఉంటుంది.
హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ
రుతుక్రమం ఆగిన మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను తిరిగి భర్తీ చేసే ఈ చికిత్స ప్రక్రియను కూడా అవసరాన్ని బట్టి డాక్టర్లు చేస్తుంటారు. అయితే ఈ హెచ్‌ఆర్‌టీ వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. అంటే... రొమ్ముల సలపరం, మళ్లీ రుతుస్రావం మొదలుకావడం, బరువు పెరగడం, మూడ్స్ మాటిమాటికీ మారి΄ోవడం, మైగ్రేన్ తలనొప్పి రావడం వంటివన్నమాట. కాబట్టి రోగి కండిషన్ ను బట్టి హెచ్‌ఆర్‌టీ అవసరమా కాదా అన్నది డాక్టర్లే నిర్ధారిస్తారు.
క్యాల్సిటోనిన్: ఈ మందులు ముక్కు ద్వారా పీల్చే మందుగా లభిస్తాయి. అయితే ఇవి తప్పనిసరిగా డాక్టర్ల సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది.
టెరీపారటైడ్: ఇది ఆస్టియోపోరోసిస్ చికిత్స ప్రక్రియలో ఇది కూడా ఒక మందు. ఇది ఎముకలో పెళుసుబారిన చోట కొత్త కణజాలం ఉత్పత్తి అయ్యేలా దోహదపడుతుంది. ఫలితంగా ఎముక ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఈ మందును కడుపు ప్రాంతంలోగాని, తొడల ప్రాంతంలోగాని ఇంజెక్షన్ చేయడం ద్వారా శరీరంలోకి పంపుతారు. దాదాపు ఏడాదిన్నరపాటు ఉపయోగించాల్సి ఉంటుంది. మంచి ప్రభావకారి అయినప్పటికీ ప్రస్తుతం దీని ఖరీదు ఎక్కువ. వికారం (నాసియా), తలనొప్పి, కాళ్లూచేతుల నొప్పి వంటి కొన్ని సైడ్‌ఎఫెక్ట్స్ కూడా కనిపించే ఈ మందుల దీర్ఘకాల ప్రభావాలు ఇంకా తెలియదు.
డోనోసుమాబ్స్: ఇది సరికొత్త మందు. చాలా వేగంగా పనిచేస్తుంది. చవకగా కూడా లభిస్తుంది. తీసుకోవడమూ సులభం.
లక్షణాలు...
ఎముకలు దేహం లోపల ఉంటాయి కాబట్టి ఆస్టియోపోరోసిస్ వచ్చే సూచనలు ముందే కనిపించేందుకు అవకాశం లేదు. ఇది చాప కింద నీరులా వచ్చే పరిణామం. ఎముకలు పలచబారడం దీర్ఘకాలం జరుగుతూ పోతే చిన్న గాయలకే ఎముకలు విరిగే ముప్పు పెరుగుతుంది. చిన్నపాటి ప్రమాదానికే ఎముక తేలిగ్గా విరిగిపోతుంటే దాన్ని ఆస్టియో పోరోసిస్‌గా గుర్తించవచ్చు. ఇక సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు...
ఒళ్లు నొప్పులు (జనరలైజ్‌డ్ బాడీ పెయిన్స్) టఎముకలు, కీళ్ల నొప్పులు (బోన్ అండ్ జాయింట్ పెయిన్స్)
అలసట (ఫ్యాటిగ్‌నెస్)చిన్న ప్రమాదానికే ఎముక విరగడం విపరీతమైన వెన్ను నొప్పి, కాస్తంత వెన్ను ఒంగినట్లయి శరీరం ఎత్తు తగ్గడం
సీ, డీ, ఈ, ఎఫ్, జీ, ఎస్..
ఎముకలు వీక్ ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం ఉపయోగపడే అంశాలను చాలా తేలిగ్గా గుర్తు పెట్టుకోవచ్చు. ఇంగ్లిష్ అక్షరాలు వరుసగా సీ, డీ, ఈ, ఎఫ్, జీ గుర్తు పెట్టుకుంటే చాలు.
‘సి’ ఫర్ క్యాల్షియమ్– అంటే అది ఎక్కువగా తీసుకోవాలి.
‘డి’ ఫర్ విటమిన్ డి – అంటే శరీరానికి తగినంత అందేలా చూసుకోవాలి.
‘ఈ’ ఫర్ ఎక్సర్‌సైజ్ – అంటే శరీరాన్ని కాస్తంత శ్రమపెట్టి ఎక్సర్‌సైజ్ చేయించాలి.
‘ఎఫ్’ ఫర్ ‘ఫాల్స్’ – అంటే ఇంగ్లిష్‌లో పడిపోవడం. కాస్తంత వయసు పైబడ్డాక బాత్‌రూమ్‌ల వంటి చోట్ల, ఇతరత్రా కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి.
‘జి’ ఫర్ గెయిన్ వెయిట్ – అంటే శరీరం బరువు కాస్తంత పెరగాలి. అది ఎత్తుకు తగినట్లుగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment