మహిళల్లో, యువతుల్లో ఐరన్ లోపం సమస్య ఆందోళన రేపుతోంది.కానీ దీని గురించిపెద్దగా పట్టించుకోరు. తాజా లెక్కల ప్రకారం 90శాతం యువతులు ఇప్పటికీ ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. నేషనల్ టెక్నికల్ హెడ్, చీఫ్ పాథాలజిస్ట్ అపోలో డయాగ్నోస్టిక్స్ డాక్టర్ రాజేష్ బెంద్రే ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించారు. సమతులం ఆహారం, సప్లిమెంట్లపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాసెస్ చేసిన ఆహారాలపై ఎక్కువగా ఆధారపడటం దీనికి ఒక కారణమన్నారు. ఐరన్‌తో కూడిన ఆహార వనరులు, ఆహార అవసరాలపై అవగాహన లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని డాక్టర్ పేర్కొన్నారు.
ఐరన్ లోపం, లక్షణాలు
► ఐరన్ తగ్గితే పెరిగే పిల్లల్లో పెరుగుదల లోపాలు కనిపిస్తాయి. అనీమియా వస్తుంది.
► తలనొప్పి, విపరీతమైన నీరసం, అలసట, ఏకాగ్రత కుదరక పోవడం, నెలసరి క్రమం తప్పడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది గర్భిణీలు కూడా ఇనుము లోపంతో బాధపడుతున్నారు.
►దాదాపు 50-60 శాతం మంది గర్భిణీ స్త్రీలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు.
► ఐరన్ లోపం పిండం ఎదుగుదలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రసవ సమయంలో ఏదైనా అనుకోని సమస్యలొస్తే ఇబ్బంది అవుతుంది.
► హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోయి, రక్తహీనత, బలహీనత, శ్వాస ఆడకపోవడం, చర్మం పాలిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి
ఐరన్ లోపం అనేది అనేక రోగాలకు పెట్టు. శరీరంలోని అన్ని కణజాలాలకు రక్తం ద్వారా ఆక్సిజన్‌తో పాటు ఇతర పోషకాలు రక్తం ద్వారా అందుతాయి. ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు ఆక్సీజన్ ను రక్తం ద్వారా శరీరానికి అందిస్తాయి. అందుకే ఐరన్ పుష్కలంగా ఉండాలంటే సప్లిమెంట్‌లతో పాటు, పల్లీలు బెల్లం, బెల్లంతో చేసిన పదార్థాలు, బచ్చలికూర, కొత్తిమీర పప్పులు వంటి ఐరన్-రిచ్ ఫుడ్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
బచ్చలి కూర బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
చిక్కుళ్లు: చిక్కుడు జాతి గింజల్లో బీన్స్, బఠానీల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు ఇతర పోషకాలు, ఫైబర్ కూడా అధికం. గుమ్మడి గింజల్లో ఐరన్ మాత్రమే కాదు విటమిన్ కె, జింక్, మాంగనీస్ కూడా ఉంటాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గిస్తుంది.
బ్రకోలి: బ్రకోలిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇందులోని విటమిన్ సీ ఐరన్ ఎక్కువ గ్రహించేందుకు సహాయపడుతుంది. కాలీఫ్లవర్, క్యాబెజీ వంటి క్రూసీఫెరస్ కుటుంబానికి చెందిన అన్ని కాయగూరలు మన ఆహారంలో చేర్చుకోవాలి.
టోఫూ: సోయా నుంచి తయారు చేసే పన్నీర్ టోఫు. ఇందులో నియాసిన్, సెలీనియం వంటి పోషకాలే కాదు విటమిన్ బి12 కూడా పుష్కలంగా ఉంటుంది ఇంకా. థయామిన్, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం లాంటి పోషకాలు, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది.
చేపలు: చేపల్లో ఐరన్‌తోపాటు ఒమెగా 3 ఫాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు చురుకుగా ఉండేందుకు ,మెరుగైన రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు దోహదపడతాయి.
నట్స్ అండ్ ఫ్రూట్స్: బాదం, శనగలు జీడిపప్పు, అలాగే జామ, అరటి పండ్లను తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment