Iron Deficiency Anemia
-
ఊరికే అలసిపోతున్నారా? గుండె దడగా ఉంటోందా? కారణమిదేనేమో చెక్ చేసుకోండి!
ఐరన్ లోపం, రక్తహీనత లేదా అనీమియా. రక్తంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేని పరిస్థితినే రక్తహీనతగా గుర్తిస్తారు. హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో భాగం. ఐరన్ లోపించినపుడు శరీరం తగినంత హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయదు. దీంతో శరీర కణజాలాలకు ఆక్సిజన్ తగ్గిపోతుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఐరన్ లోపాలను ఎలా గుర్తించాలి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.పోషకాహార లోపం, స్త్రీలు ఋతుస్రావం సమయంలో రక్తాన్ని కోల్పోవడం, గర్భధారణ సమయంలో స్త్రీలలో వచ్చే సమస్యలు, పెప్టిక్ అల్సర్, హయాటల్ హెర్నియా, పెద్దప్రేగు పాలిప్ లేదా కొలొరెక్టల్ కేన్సర్ తదితర వ్యాధుల కారణంగా తీవ్రమైన ఇనుము లోపం వస్తుంది. రక్త పరీక్ష ద్వారా అనీమియాను గుర్తించవచ్చు. తొందరగా అలిసిపోవడం, నీరసం, ఆయాసం లక్షణాలు కనిపిస్తాయి.ఐరన్ లోపం లక్షణాలుగుండె వేగంగా కొట్టుకుంటుంది.రక్తహీనతతో వచ్చిన ఆక్సిజన్ కొరతను భర్తీ చేయడానికి గుండె మరింత రక్తాన్ని పంప్ చేయాలి. ఇది గుండె వైఫల్యానికి దారి తీస్తుంది.మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తలనొప్పిగా ఉంటుంది. తలతిరగడంమట్టి, సున్నం లాంటివి తినాలనిపించడంతొందరగా చికాకు, మనిషి బలహీనంగా మారడం, ఏకాగ్రత లోపించడంచిన్న చిన్న పనులకే ఎక్కువగా అలసిపోవడం.నిద్ర సరిగ్గా పట్టకపోవడం, దురదలు రావడం.తీవ్ర ఆందోళనఐరన్ లోపంతో ఒక్కోసారి థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది ఆకలి మందగించడం, కాళ్లు, చేతులు చల్లగా అనిపించడంజుట్టు ఊడటం, చర్మం పాలిపోవడం, గోళ్లు పెళుసుగా మారడం, నోటిలో పుళ్లు, నాలుక మంటఐరన్ లభించే ఆహారంమాంసాహారం, బచ్చలికూర వంటి ముదురు ఆకుపచ్చ ఆకు కూరలువిటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలుదానిమ్మ,ఎండుద్రాక్ష , ఆప్రికాట్లు వంటి ఎండిన పండ్లు, బెల్లంఐరన్-ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు, రొట్టెలు , పాస్తా, బటానీలురక్తహీనతను గుర్తించినపుడు సాధారణంగా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని సరిచేసుకోవచ్చు. ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. సమస్య మరీ తీవ్రంగా ఉన్నపుడు వైద్యుల సలహా మేరకు ఇంజక్షన్లను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రక్తహీనకు గల కారణాలను తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు , దాన్ని బట్టి చికిత్సలు అవసరం. చికిత్స కంటే ముందు రక్తహీనతకు గలకారణాలను గుర్తించడం ముఖ్యం. అంతర్గతంగా ఏదైనా ప్రమాదకరమైన వ్యాధి, అంతర్గతంగా రక్తస్రావం లాంటి కారణాలను విశ్లేషించుకోవాలి. -
90 శాతం యువతుల్లో ఇప్పటికీ ఆ లోపం, బెస్ట్ ఫుడ్ ఇదిగో!
మహిళల్లో, యువతుల్లో ఐరన్ లోపం సమస్య ఆందోళన రేపుతోంది.కానీ దీని గురించిపెద్దగా పట్టించుకోరు. తాజా లెక్కల ప్రకారం 90శాతం యువతులు ఇప్పటికీ ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. నేషనల్ టెక్నికల్ హెడ్, చీఫ్ పాథాలజిస్ట్ అపోలో డయాగ్నోస్టిక్స్ డాక్టర్ రాజేష్ బెంద్రే ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించారు. సమతులం ఆహారం, సప్లిమెంట్లపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాసెస్ చేసిన ఆహారాలపై ఎక్కువగా ఆధారపడటం దీనికి ఒక కారణమన్నారు. ఐరన్‌తో కూడిన ఆహార వనరులు, ఆహార అవసరాలపై అవగాహన లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని డాక్టర్ పేర్కొన్నారు. ఐరన్ లోపం, లక్షణాలు ► ఐరన్ తగ్గితే పెరిగే పిల్లల్లో పెరుగుదల లోపాలు కనిపిస్తాయి. అనీమియా వస్తుంది. ► తలనొప్పి, విపరీతమైన నీరసం, అలసట, ఏకాగ్రత కుదరక పోవడం, నెలసరి క్రమం తప్పడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది గర్భిణీలు కూడా ఇనుము లోపంతో బాధపడుతున్నారు. ►దాదాపు 50-60 శాతం మంది గర్భిణీ స్త్రీలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ► ఐరన్ లోపం పిండం ఎదుగుదలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రసవ సమయంలో ఏదైనా అనుకోని సమస్యలొస్తే ఇబ్బంది అవుతుంది. ► హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోయి, రక్తహీనత, బలహీనత, శ్వాస ఆడకపోవడం, చర్మం పాలిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి ఐరన్ లోపం అనేది అనేక రోగాలకు పెట్టు. శరీరంలోని అన్ని కణజాలాలకు రక్తం ద్వారా ఆక్సిజన్‌తో పాటు ఇతర పోషకాలు రక్తం ద్వారా అందుతాయి. ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు ఆక్సీజన్ ను రక్తం ద్వారా శరీరానికి అందిస్తాయి. అందుకే ఐరన్ పుష్కలంగా ఉండాలంటే సప్లిమెంట్లతో పాటు, పల్లీలు బెల్లం, బెల్లంతో చేసిన పదార్థాలు, బచ్చలికూర, కొత్తిమీర పప్పులు వంటి ఐరన్-రిచ్ ఫుడ్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బచ్చలి కూర బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. చిక్కుళ్లు: చిక్కుడు జాతి గింజల్లో బీన్స్, బఠానీల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు ఇతర పోషకాలు, ఫైబర్ కూడా అధికం. గుమ్మడి గింజల్లో ఐరన్ మాత్రమే కాదు విటమిన్ కె, జింక్, మాంగనీస్ కూడా ఉంటాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గిస్తుంది. బ్రకోలి: బ్రకోలిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇందులోని విటమిన్ సీ ఐరన్ ఎక్కువ గ్రహించేందుకు సహాయపడుతుంది. కాలీఫ్లవర్, క్యాబెజీ వంటి క్రూసీఫెరస్ కుటుంబానికి చెందిన అన్ని కాయగూరలు మన ఆహారంలో చేర్చుకోవాలి. టోఫూ: సోయా నుంచి తయారు చేసే పన్నీర్ టోఫు. ఇందులో నియాసిన్, సెలీనియం వంటి పోషకాలే కాదు విటమిన్ బి12 కూడా పుష్కలంగా ఉంటుంది ఇంకా. థయామిన్, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం లాంటి పోషకాలు, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. చేపలు: చేపల్లో ఐరన్‌తోపాటు ఒమెగా 3 ఫాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు చురుకుగా ఉండేందుకు ,మెరుగైన రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు దోహదపడతాయి. నట్స్ అండ్ ఫ్రూట్స్: బాదం, శనగలు జీడిపప్పు, అలాగే జామ, అరటి పండ్లను తీసుకోవాలి. -
అతిగా 'టీ' తాగుతున్నారా! ఈ సమస్యలు ఎదుర్కొనక తప్పదు
'టీ' అంటే ఇష్టపడని వారుండరు. చల్లటి ఈ వర్షాకాలంలో ఓ కప్పు చాయ్ ఎంత హాయిగా ఉంటుంది. ఏం తినకపోయిన పర్వాలేదు కానీ.. ఆకలేసినప్పుడల్లా వేడివేడి 'టీ' సిప్ చేస్తుంటూ కొందరికి చాలా హాయి అనిపిస్తుంది. ఆ టీ గొంతులో పడగానే శరీరంలో కాస్త ఉత్సాహం వచ్చి మళ్లీ తమ పనులు యథావిధిగా చేసుకోగలుగుతారు. కప్పు టీ పడితే చాలు అబ్బా} ప్రాణం హాయిగా ఉంది అంటారు చాలామంది. ఇలా భావించే కొందరూ..రోజుకు రెండు మూడు కప్పుల చాయ్ తాగేస్తుంటారు. ఇది చాలా దుష్ప్రభావాలకు దారితీస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో ఉండే కెఫిన్, టానిన్ కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొనక తప్పదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. టీ తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటంటే.. ఐరన్ లోపం.. టీలో కెఫిన్, టానిన్లు అధికంగా ఉంటాయి.అందువల్ల దీన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల ఐరన్ శోషించుకోనీకుండా చేస్తుంది. దీని వల్ల నిద్రలేమి ఏర్పడి తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుందంటున్నారు నిపుణలు. టానిన్లు కొన్ని ఆహారాలలో ఉండే ఇనుమును బంధిస్తాయి. దీంతో మీ జీర్ణవ్యవస్థ శోషించుకునే సమయంలో ఐరన్‌ని అందుబాటులో లేకుండా చేస్తుంది. దీంతో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఇది ప్రపంచంలో ఉన్న అత్యంత సాధారణ పోషకాహార లోపాల్లో ఒకటని చెబుతున్నారు నిపుణులు. అలాగే మీరు గనుక శాఖహారులైతే మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎందుకంటే 'టీ' టానిన్లు జంతు ఆధారిత ఆహారాల కంటే మొక్కల మూలాల నుంచి ఇనుమును ఎక్కువగా గ్రహించడంలో ఆటంకం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి ఏర్పడుట టీలో ఉండే కెఫిన్ కారణంగా నిద్ర చక్రానికి అంతరాయ ఏర్పడుతుంది. మెదుడును నిద్రకు ఉపక్రమించేలా చేసే మెలటోనిన్ అనే హార్మోన్‌ని నిరోధిస్తుంది. ఫలితంగా మంచి నిద్ర పట్టదు. సరిపోని నిద్ర కారణంగా అలసటగా అనిపిస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి తగ్గి..అనేక రకాల మానసిక సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక నిద్రలేమి కారణంగా ఊబకాయం వచ్చే అవకాశం లేకపోలేదు. అలాగే రక్తంలో చక్కెర నియంత్రణ సరిగా ఉండదు. ఈ కెఫిన్ గుండెల్లో మంటకు కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు. చాలామంది వ్యక్తులలో యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను కూడా తీవ్రతరం చేస్తుందని అంటున్నారు. ఈ కెఫిన్ మీ అన్నవాహికను, మీ కడుపును వేరు చేసే స్పింక్టర్‌ను నెమ్మదించేలా చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. తద్వారా కడుపులో ఉత్ఫన్నమయ్యే ఆమ్లాలు అన్నవాహికలోకి సులభంగా వెళ్తాయి. రోజంతా టీ సిప్ చేస్తూ ఉన్నవారు దీర్ఘకాలిక తీవ్రమైన తలనొప్పితో బాధపడతారట. సోడా లేదా కాఫీ వంటి ఇతర కెఫిన్ పానీయాల కంటే టీలో కెఫిన్ తక్కువే అయినా కొన్ని రకాల టీలు ఒక కప్పు టీకి సుమారు 60 మిల్లీ గ్రాముల కెఫిన్ అందిస్తుందని, ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఈ కాక్టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..) -
Health Tips: గుడ్డు, బీట్రూట్, ఉసిరి, పాలకూర.. వీటితో ఐరన్ లోపాన్ని తరిమేద్దాం..!
శరీరంలో తగినంత ఐరన్ ఉత్పత్తికాకపోతే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోతాయి. ఫలితంగా తరచూ మైకం కమ్మడం, శక్తి హీణత వంటి సమస్యలు తలెత్తుతాయి. పిల్లల్లోనైతే పెరుగుదల మందగిస్తుంది కూడా. నిజానికి ఐరన్ అన్ని వయసులవారికి అవసరమే. కాబట్టి ఇతర విటమిన్లు, మినరల్స్ మాదిరిగానే ఐరన్ కూడా తగు మోతాదులో అవసరమేనన్నమాట. ఐరన్ పుష్కలంగా ఉండే కొన్ని ఆహారాలను ఢిల్లీకి చెందిన ప్రముఖ నూట్రీషనిస్ట్ డా. అనిత వర్మా సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. చదవండి: ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా? చెర్రీ, తేనె, అరటి, వేడిపాలు.. ఇవి తిన్నారంటే..! శనగలు మన వంటకాల్లో తరచూ ఉంపయోగించే శనగల్లో ఐరన్ నిండుగా ఉంటుంది. కాయధాన్యాలు లేదా పప్పుదినుసుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిందే! ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం పెసలు, అలసందలు, వులవలు, బీన్స్, చిక్కుడు గింజలు, శనగల వంటి కాయధాన్యాల్లో ఐరన్ స్థాయిలు అధికంగా ఉంటాయని వెల్లడించింది. చదవండి: టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!! గుడ్డు సహజంగానే గుడ్డులో ఐరన్‌తోపాటు అనేక విటమిన్లు, ప్రొటీన్లు నిండుగా ఉంటాయి. కర్రీ, ఫ్రై వంటి వంటకాల రూపంలో ప్రతిరోజూ గుడ్డు మన ఆహారంలో చోటుచేసుకుంటూనే ఉంటుంది. యూఎస్డీఏ ప్రకారం వంద గ్రాముల గుడ్డు తీసుకుంటే ఒక రోజుకు అవసరమైన 1.2 మిల్లీగ్రాముల ఐరన్ అందుతుందని వెల్లడించింది. బీట్రూట్ బీట్రూట్లో పొటాషియం, పాస్పరస్, కాల్షియం, కార్బొహైడ్రేట్ ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మాక్రొబయోటిక్ నూట్రీషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్ శిల్పా అరోరా ప్రకారం మన శరీరంలో తగినంత ఐరన్‌ను అందించడంలో బీట్రూట్ కీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. విటమిన్ ‘సి’ అధికంగా ఉండే ఆహారాల్లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! ఉసిరి ఉసిరికాయలో విటమిన్ ‘సి’తోపాటు శరీరానికి అవసరమైన ఇనుము కూడా పెంచుతుంది. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ప్రకారం ఒకేరకమైన ఆహారంతో విటమిన్ ‘సి’, ఇనుము (ఐరన్) రెండూ పొందుకోవాలంటే ఉసిరి బెస్ట్! అని పేర్కొంది. పాలకూర పాలకూర వంటి ఆకుపచ్చ కూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఇతర నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో పాలకూరను తరచూ తీసుకోవడం ద్వారా ఐరన్ లోపాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: మార్నింగ్ వాక్‌కి వెళ్లింది... కోటీశ్వరురాలైంది!! -
ఐడిఎ తగ్గాలంటే...
గుడ్ ఫుడ్ ఐడిఎ అంటే ఐరన్ డెఫిషియెన్సీ ఎనీమియా. భారతీయ మహిళల్లో ఇది ఎక్కువ. రక్తహీనతకు దారి తీసే కారణాలలో ఐడిఎది ప్రధాన పాత్ర. బికాంప్లెక్స్ విటమిన్...బి12 విటమిన్ ఎనీమియా రాకుండా నివారిస్తుంది. ప్రోటీన్లు, కాపర్, అయోడిన్, సల్ఫర్, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్... తగినంత మోతాదులో తీసుకోవాలి.మెంతిఆకు... టీనేజ్ అమ్మాయిలు, మెనోపాజ్ దశకు చేరిన మహిళలు తరచుగా మెంతిఆకు లేదా మెంతులు తీసుకుంటే రక్తహీనత రాదు. పాలకూర... రక్తహీనతను, రక్తనాళాల్లో అడ్డంకులను తొలగిస్తుంది. నువ్వులు... రోజుకు టీ స్పూన్నువ్వులు తీసుకుంటే ఐరన్‌లోపం కారణంగా వచ్చిన రక్తహీనత తగ్గుతుంది. నువ్వులను పాలలో నానబెట్టి లేదా బెల్లంతో కలిపి తినవచ్చు. నువ్వులు వేడి చేస్తాయనేది అపోహ మాత్రమే. తేనె... ఇందులో ఐరన్, కాపర్, మాంగనీస్ ఉంటాయి. తక్షణశక్తినిస్తుంది, ఎప్పుడు నీరసంగా అనిపించినా గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి తాగవచ్చు. డయాబెటిస్ పేషంట్లు తేనె తీసుకోకూడదు. షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.వీటితోపాటు సాధారణంగా ఆహారంలో అరటిపండ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, కిస్మిస ఉల్లిపాయలు, క్యారట్, ముల్లంగి, టొమాటోలు బాగా తీసుకోవాలి.