'టీ' అంటే ఇష్టపడని వారుండరు. చల్లటి ఈ వర్షాకాలంలో ఓ కప్పు చాయ్ ఎంత హాయిగా ఉంటుంది. ఏం తినకపోయిన పర్వాలేదు కానీ.. ఆకలేసినప్పుడల్లా వేడివేడి 'టీ' సిప్ చేస్తుంటూ కొందరికి చాలా హాయి అనిపిస్తుంది. ఆ టీ గొంతులో పడగానే శరీరంలో కాస్త ఉత్సాహం వచ్చి మళ్లీ తమ పనులు యథావిధిగా చేసుకోగలుగుతారు. కప్పు టీ పడితే చాలు అబ్బా} ప్రాణం హాయిగా ఉంది అంటారు చాలామంది. ఇలా భావించే కొందరూ..రోజుకు రెండు మూడు కప్పుల చాయ్ తాగేస్తుంటారు. ఇది చాలా దుష్ప్రభావాలకు దారితీస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో ఉండే కెఫిన్, టానిన్ కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొనక తప్పదని గట్టిగా హెచ్చరిస్తున్నారు.
టీ తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటంటే..
ఐరన్ లోపం..
టీలో కెఫిన్, టానిన్‌లు అధికంగా ఉంటాయి.అందువల్ల దీన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల ఐరన్ శోషించుకోనీకుండా చేస్తుంది. దీని వల్ల నిద్రలేమి ఏర్పడి తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుందంటున్నారు నిపుణలు. టానిన్లు కొన్ని ఆహారాలలో ఉండే ఇనుమును బంధిస్తాయి. దీంతో మీ జీర్ణవ్యవస్థ శోషించుకునే సమయంలో ఐరన్‌ని అందుబాటులో లేకుండా చేస్తుంది. దీంతో ఐరన్ లోపం ఏర్పడుతుంది.
ఇది ప్రపంచంలో ఉన్న అత్యంత సాధారణ పోషకాహార లోపాల్లో ఒకటని చెబుతున్నారు నిపుణులు. అలాగే మీరు గనుక శాఖహారులైతే మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎందుకంటే 'టీ' టానిన్లు జంతు ఆధారిత ఆహారాల కంటే మొక్కల మూలాల నుంచి ఇనుమును ఎక్కువగా గ్రహించడంలో ఆటంకం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేమి ఏర్పడుట
టీలో ఉండే కెఫిన్ కారణంగా నిద్ర చక్రానికి అంతరాయ ఏర్పడుతుంది. మెదుడును నిద్రకు ఉపక్రమించేలా చేసే మెలటోనిన్ అనే హార్మోన్‌ని నిరోధిస్తుంది. ఫలితంగా మంచి నిద్ర పట్టదు. సరిపోని నిద్ర కారణంగా అలసటగా అనిపిస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి తగ్గి..అనేక రకాల మానసిక సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక నిద్రలేమి కారణంగా ఊబకాయం వచ్చే అవకాశం లేకపోలేదు. అలాగే రక్తంలో చక్కెర నియంత్రణ సరిగా ఉండదు. ఈ కెఫిన్ గుండెల్లో మంటకు కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు.
చాలామంది వ్యక్తులలో యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను కూడా తీవ్రతరం చేస్తుందని అంటున్నారు. ఈ కెఫిన్ మీ అన్నవాహికను, మీ కడుపును వేరు చేసే స్పింక్టర్‌ను నెమ్మదించేలా చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. తద్వారా కడుపులో ఉత్ఫన్నమయ్యే ఆమ్లాలు అన్నవాహికలోకి సులభంగా వెళ్తాయి. రోజంతా టీ సిప్ చేస్తూ ఉన్నవారు దీర్ఘకాలిక తీవ్రమైన తలనొప్పితో బాధపడతారట. సోడా లేదా కాఫీ వంటి ఇతర కెఫిన్ పానీయాల కంటే టీలో కెఫిన్ తక్కువే అయినా కొన్ని రకాల టీలు ఒక కప్పు టీకి సుమారు 60 మిల్లీ గ్రాముల కెఫిన్ అందిస్తుందని, ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: ఈ కాక్‌టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..)
Comments
Please login to add a commentAdd a comment