![Five Including Two Children Die After Drinking Tea in Uttar Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/28/Drinking-Tea.jpg.webp?itok=-FSSvyId)
లక్నో: విష రసాయనాలు కలిసిన టీ (చాయ్) తాగి ఇద్దరు చిన్నారులు, వారి తండ్రి సహా ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లా నగ్లా కన్హాయ్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామమూర్తి అనే మహిళ గురువారం తన ఇంట్లో టీ పొడిగా పొరపడి, పొలంలో పిచికారీ చేసిన పురుగులమందు డబ్బాలోని పౌడర్‌ను వేసి టీ కాచింది.
దానిని భర్త శివనందన్(35), కుమారులు శివాంగ్(6), దివ్యాన్ష్5)తోపాటు తన తండ్రి రవీంద్ర సింగ్(55), పొరుగునుండే సొబ్రాన్(42)లకు ఇచ్చిది. తాగిన తర్వాత వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రవీంద్ర సింగ్, శివాంగ్, దివాన్ష్ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే చనిపోగా మిగతా ఇద్దరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఎస్పీ చెప్పారు.
చదవండి: కదులుతున్న కారుపైకి ఎక్కి టపాసుల కాల్పులు...సీన్ కట్ చేస్తే...
Comments
Please login to add a commentAdd a comment