Mainpuri
-
ఉప ఎన్నికల ఫలితాలు: ఏడు చోట్ల గెలిచిన అభ్యర్థులు వీరే
Assembly Lok Sabha Bypoll Results దేశంలో ఏడుస్థానాల(ఒక లోక్‌సభతో కలిపి) ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. యూపీ అసెంబ్లీ ఒకటి, బీహార్‌లో ఒకటి మినహాయించి మిగిలిన చోట్ల సిట్టింగ్ క్యాండిడేట్ల మరణంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఏడు చోట్ల గెలుపొందిన అభ్యర్థులను పరిశీలిస్తే.. ► మెయిన్‌పురి లోక్‌సభ స్థానంలో డింపుల్ యాదవ్(ఎస్పీ) విజయం సాధించింది. 2.88 లక్షల మెజార్టీతో డింపూల్ గెలుపొందారు. ► ఖతౌలీ నియోజవవర్గం స్థానాన్ని ఎస్పీ మిత్ర పక్షం రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థి మదన్ భయ్యా విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. ► యూపీలోని రాంపూర్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఆకాశ్ సక్సేనా అనూహ్య విజయం సాధించారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అసిమ్ రాజాపై 33 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఎస్పీ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌పై అనర్హత వేటు పడటంతో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ సదర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికకు కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) దూరంగా ఉన్నాయి. దీంతో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్యే ప్రధాన పోటీ కొనసాగింది. ►బీహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. కుర్హానీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలోకి దిగిన కేదార్ ప్రసాద్ గుప్తా.. మహాఘట్బంధన్ అభ్యర్థిపై 3,645 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జేడీయూతో తెగతెంపులు చేసుకున్న తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా గెలిపొందింది. ►ఒడిశాలోని పదంపూర్ అసెంబ్లీ స్థానంలో బీజేడీ అభ్యర్థి బర్షా సింగ్ బరిహా 42,679 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ ఒడిపోయినప్పటికీ 2019 ఓట్ల శాతాన్ని నిలబెట్టుకోగలిగింది. కాంగ్రెస్ మాత్రం డిపాజిట్ కోల్పోయింది. ► రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ శర్మ 26,852 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ► ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి బ్రహ్మానంద్ నేతమ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి మాండవి 21, 171ఓట్ల తేడాతో గెలుపొందారు. #Mainpuri Lok Sabha by-polls | SP candidate Dimple Yadav leads with a margin of 54,797 votes; counting continues https://t.co/nvB6P1RW7m — ANI (@ANI) December 8, 2022 ► అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గం రామ్‌పూర్‌లోనూ సమాజ్‌వాదీ అభ్యర్థి అసిమ్ రాజా ముందంజలో కొనసాగుతున్నారు. కథౌలీలో ఆర్ఎల్డీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. ► ఒడిషా పదంపూర్‌లో అధికార బీజేడీ అభ్యర్థి బర్షా సింగ్ బరిహా ఆధిక్యంలో ఉన్నారు. ► బీహార్ కుర్హానీలో.. జేడీయూ ఆధిక్యంలో కొనసాగుతోంది. ► రాజస్థాన్ సర్దార్షాహర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ► ఛత్తీస్‌గఢ్(భానుప్రతాప్‌పూర్)లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. న్యూఢిల్లీ: ఒకవైపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలో మరో ఏడుస్థానాల(ఒక లోక్‌సభతో కలిపి) ఉప ఎన్నికల ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది. యూపీ అసెంబ్లీ ఒకటి, బీహార్‌లో ఒకటి మినహాయించి మిగిలిన చోట్ల సిట్టింగ్ క్యాండిడేట్ల మరణంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ప్రత్యేకించి సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్‌పురి పార్లమెంట్ స్థానం ఎవరి కైవసం అవుతుందా? అని ఉత్కంఠ నెలకొంది. గుజరాత్ ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి -
ఉప ఎన్నికలు.. ఏడులో మూడు అక్కడే!
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో ఫేజ్ పోలింగ్.. దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఏడు చోట్ల సైతం ఉప ఎన్నికల పోలింగ్ ఇవాళే(డిసెంబర్ 5, సోమవారం) జరగనున్నాయి. ఇందులో ఒక లోక్‌సభ స్థానం సైతం ఉంది. రాజస్థాన్(సర్దార్‌షాహర్), ఛత్తీస్‌గఢ్(భానుప్రతాప్‌పూర్), ఒడిశా(పదంపూర్)లలో సిట్టింగ్ క్యాండిడేట్ల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక బీహార్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనర్హత వేటు కారణంగా ఖుర్‌హని స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎన్డీయే కూటమికి సీఎం నితీశ్‌కుమార్ గుడ్ బై చెప్పిన తర్వాత జరుగుతున్న.. మొదటి ఎన్నిక ఇది. ఇక మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానం ఎన్నికతో ఉత్తర ప్రదేశ్ ప్రధాన చర్చకు దారి తీసింది. సమాజ్‌వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ములాయం కంచుకోట అయినప్పటికీ.. కిందటిసారి జరిగిన ఎన్నికలో తక్కువ మార్జిన్‌తో గెలుపుతో గెలుపొందారు ములాయం. దీంతో ఎస్పీ గెలుపు అంత ఈజీ కాదనే చర్చ నడుస్తోంది. ఎస్పీ తరపున అఖిలేష్ యాదవ్ భార్య, ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీలో దిగారు. ఇక బీజేపీ మాజీ ఎంపీ రఘురాజ్ సింగ్ శక్య ఈసారి బరిలో నిల్చున్నారు. యూపీలోనే రాంపూర్ సదర్, ఖతౌలీ అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగబోతోంది. డిసెంబర్ 8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే ఈ ఉప ఎన్నికల ఫలితాలను సైతం వెల్లడించనుంది ఎన్నికల సంఘం. -
బాబాయ్ కాళ్లు మొక్కిన అబ్బాయ్.. కలిసి ప్రచారం..
లక్నో: దివంగత ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, తన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ కాళ్లు మొక్కారు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్. మైన్‌పురి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలో ఈ దృష్యం ఆవిష్కృతమైంది. ములాయం సింగ్ యాదవ్ మృతితో మైన్‌పురి ఎంపీ సీటు ఖాళీ అయింది. ఈ ఉపఎన్నికలో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తమ కుటుంబానికి కంచుకోట అయిన మైన్‌పురిలో ప్రజలు తమకే అండగా ఉన్నారని చాటిచెప్పేలా చారిత్రక విజయం అందించాలని అఖిలేశ్ యాదవ్ ప్రజలను కోరారు. అఖిలేశ్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ 2017లో ఎస్పీ నుంచి బయటకు వెళ్లారు. అనంతరం 2018లో ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి అఖిలేశ్‌తో జతకట్టారు. కానీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత బాబాయ్, అబ్బాయ్ మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తమ మధ్య విభేదాలు లేవని చెప్పేందుకు ఇద్దరు కలిసి పచారంలో పాల్గొన్నారు. ఈ ఉపఎన్నిక డిసెంబర్ 5న జరగనుంది. #WATCH | Samajwadi Party chief Akhilesh Yadav meets PSP chief Shivpal Yadav, touches his feet atop the stage while campaigning for the byelections in Mainpuri, UP pic.twitter.com/c82LOivUqb — ANI UP/Uttarakhand (@ANINewsUP) November 20, 2022 -
Dimple Yadav: మామ స్థానంలో బరిలో కోడలు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మరణంతో.. ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఈ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఈ విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ అధికారికంగా ట్విటర్లో ప్రకటించింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. వీటితోపాటే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఫలితాలు.. డిసెంబర్ 8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే ప్రకటిస్తారు. समाजवादी पार्टी द्वारा लोकसभा क्षेत्र मैनपुरी उपचुनाव - 2022 हेतु श्रीमती डिंपल यादव पूर्व सांसद को प्रत्याशी घोषित किया गया है। pic.twitter.com/gZIvtETfLT — Samajwadi Party (@samajwadiparty) November 10, 2022 మామ ములాయంతో డింపుల్ (పాత ఫొటో) మోదీ 2.0 వేవ్‌ను తట్టుకుని ములాయం సింగ్ యాదవ్.. బీజేపీ అభ్యర్థిపై 94వేల ఆధిక్యంతో 2019 ఎన్నికల్లో మెయిన్‌పురి నుంచి నెగ్గారు. అయితే 2014లో ములాయం ఏకంగా మూడున్నర లక్షలకు పైగా మెజారిటీతో నెగ్గడం గమనార్హం. దీంతో మెయిన్‌పురి ఆయన ఇలాకాగా పేరు దక్కించుకుంది. భర్త అఖిలేష్‌తో డింపుల్ మహారాష్ట్రలో పుట్టిపెరిగిన డింపుల్ యాదవ్(44).. లక్నోలో చదువుకునే టైంలో అఖిలేష్‌కు పరిచయం అయ్యారు. ఇద్దరిదీ ప్రేమవివాహం. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. 2009 ఎన్నికల్లో తొలిసారి ఫిరోజ్‌బాద్ నుంచి పోటీ చేసి రాజ్‌బబ్బర్ చేతిలో ఓటమి పాలయ్యారు డింపుల్. ఆపై 2012లో భర్త తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కన్నౌజ్ ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. ఆపై రెండేళ్లకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అక్కడి నుంచే ఎంపీగా నెగ్గారు. 2019లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి.. పదివేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సుభ్రత్ పాథక్ చేతిలో ఓటమి పాలయ్యారు ఆమె. -
ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. యూపీ, ఒడిశా, రాజస్తాన్, బిహార్, ఛత్తీస్‌ఘడ్‌లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ములాయం సింగ్ మరణంతో మెయిన్‌పురీ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 10 నుంచి 17వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహించి, 8న కౌంటింగ్ ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి: (117 ఏళ్ల దేశ తొలి ఓటరు ఇక లేరు.. బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 3 రోజులకే..) -
టీ పొడి అనుకొని పురుగులమందు.. చాయ్ తాగి అయిదుగురు దుర్మరణం
లక్నో: విష రసాయనాలు కలిసిన టీ (చాయ్) తాగి ఇద్దరు చిన్నారులు, వారి తండ్రి సహా ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లా నగ్లా కన్హాయ్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామమూర్తి అనే మహిళ గురువారం తన ఇంట్లో టీ పొడిగా పొరపడి, పొలంలో పిచికారీ చేసిన పురుగులమందు డబ్బాలోని పౌడర్‌ను వేసి టీ కాచింది. దానిని భర్త శివనందన్(35), కుమారులు శివాంగ్(6), దివ్యాన్ష్5)తోపాటు తన తండ్రి రవీంద్ర సింగ్(55), పొరుగునుండే సొబ్రాన్(42)లకు ఇచ్చిది. తాగిన తర్వాత వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రవీంద్ర సింగ్, శివాంగ్, దివాన్ష్ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే చనిపోగా మిగతా ఇద్దరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఎస్పీ చెప్పారు. చదవండి: కదులుతున్న కారుపైకి ఎక్కి టపాసుల కాల్పులు...సీన్ కట్ చేస్తే... -
హనుమాన్ వేషాధారణతో డ్యాన్స్.. ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్పకూలడంతో..
లక్నో: చావు ఎప్పుడు ఎవరిని ఎటునుంచి పలకరిస్తుందో చెప్పడం కష్టం. అప్పటి వరకు బాగానే ఉన్నా.. క్షణకాలంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో హఠాన్మారణాలు ఎక్కువైపోయాయి. కళ్లముందేనవ్వుతూ కనిపించిన వారు ఉన్నట్టుండి ఊపిరి వదులుతున్నారు. కొన్నిసార్లు ఊహించని రీతిలో మృత్యువు మనిషిని తీసుకెళ్లి పోతుంది. తాజాగా గణేష్ ఉత్సవాల్లో నృత్య ప్రదర్శన చేస్తూ ఓ కళాకారుడు ఉన్నట్టుండి ప్రాణాలు విడిచాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా మెయిన్‌పురి కొత్వాలి ప్రాంతంలోని శివాలయంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రవి శర్మ అనేక కళాకారుడు హనుమంతుని వేషధారణలో గణేష్ మండపం వద్ద లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. తన హుషారైన నటనతో అక్కడున్న పిల్లల్ని, పెద్దల్ని అలరించాడు. రవి శర్మ ప్రదర్శన చూసి అక్కడున్నవారంతా అతనిలో ఉత్సాహాన్ని నింపారు. చదవండి: మోదీ ఫొటోలు కనిపించాలా?.. నిర్మలా సీతారామన్‌గారూ ఇదిగో! అయితే స్టేజ్‌పై ప్రదర్శన చేస్తుండగా మధ్యలోనే రవి శర్మ ఉన్నట్టుండి కుప్పకూలి కిందపడిపోయాడు. ఏమైందో తెలుసుకునేందుకు అక్కడున్న వారికి కాస్తా సమయం పట్టింది. ఎంతకీ రవి శర్మ లేవకపోవడంతో అనుమానం వచ్చి అతన్ని లేపగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. దీంతో వెంటనే అతన్ని మెయిన్‌పురి జిల్లా అసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. #मैनपुरी गणेश मूर्ति पंडाल में युवक नाचते समय बेहोश होकर गिरा हनुमान जी का रूप धर नाच रहा था युवक जिला अस्पताल में डॉक्टरों ने मृत घोषित किया मैनपुरी सदर कोतवाली के मोहल्ला बंशीगोहरा का मामला@mainpuripolice #HanumanJi #GaneshUtsav #network10 #ekdarpan pic.twitter.com/clHPTZSWm4 — Network10 (@Network10Update) September 4, 2022 -
షాకింగ్.. ఎస్పీ నేత కారును ఢీకొట్టి 500 మీటర్లు లాక్కెళ్లిన ట్రక్కు డ్రైవర్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మెయిన్‌పురిలో ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ కారును ఢీకొట్టాడు. అనంతరం దాన్ని 500 మీటర్లు ట్రక్కుతోపాటే ఈడ్చుకెళ్లాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. #WATCH A truck dragged the car of SP District President Devendra Singh Yadav for about 500 meters in UP's Mainpuri pic.twitter.com/86qujRmENr — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022 కారును ఢీకొట్టిన అనంతరం ట్రక్కును ఆపాలని అక్కడున్న వారు వెంబడించినా డ్రైవర్ పట్టించుకోలేదు. వాహనాన్ని అలాగే వేగంగా పోనిచ్చాడు. 500 మీటర్ల దూరం వెళ్లాక ఆగాడు. ట్రక్కు డ్రైవర్‌ను యూపీలోని ఇటావాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు వెల్లడించారు. చదవండి: బీహార్ రాజకీయాల్లో ఊహించని మలుపు.. బీజేపీకి నితీశ్ షాక్! -
తేలియాడే రామసేతు రాయి! భక్తుల పూజలు... వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురిలో ఇషాన్ నదిలో తేలియాడే రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఆ రాయిపై ‘రామా’ అనే అక్షరాలు ఉండటం విశేషం. ఈ రాయి రామాయణ కాలంలో భారతదేశం నుంచి లంకకు సముద్రంపై శ్రీరాముడు నిర్మించిన ‘రామసేతు’ వారధిలోనిదే అంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో స్థానికులు తండోపతండాలుగా వచ్చి రాయిని చూసివెళ్తున్నారు. ఈ రాయి దాదాపు ఆరు కేజీల బరువుంది. మెయిన్‌పురీ జిల్లాలోని థానాబేవార్ పరిధిలోని అహిమాల్‌పూర్‌లో తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రాయిని ఆలయంలో ఉంచి స్థానికులు పూజలు జరుపుతున్నారు. -
159 మందితో ఎస్పీ తొలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ బరిలో దిగారు. దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలన్న ప్రతిపక్షాల నుంచి వచ్చిన సవాళ్ళ నేపథ్యంలో మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు సోమవారం పార్టీ ప్రకటించిన 159 మంది అభ్యర్థుల తొలి జాబితాలో అఖిలేశ్ పేరు ప్రథమంగా ఉంది. సమాజ్‌వాదీ పార్టీకి.. ముఖ్యంగా యాదవులకు కంచుకోటగా ఉన్న కర్హల్... మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది. 2002 ఎన్నికల్లో మినహా 1993 నుంచి కర్హల్‌లో సమాజ్‌వాదీ జెండా ఎగురుతోంది. 2017లో ఎస్పీ అభ్యర్థి సోబ్రాన్‌సింగ్ యాదవ్ 38 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. పార్టీకి బలమైన స్థానం కావడంతో అఖిలేశ్ సైతం ఇక్కడి నుంచే పోటీకి మొగ్గు చూపారు. 2012లో ఎస్పీ ప్రభుత్వం ఏర్పడి అఖిలేశ్ సీఎంగా ఉన్నప్పటికీ, శాసనమండలి సభ్యుడిగానే ఉన్నారు. 2000 నుంచి 2012 వరకు కన్నౌజ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన అఖిలేశ్ 2019 ఎన్నికల్లో ఆజంఘఢ్ నుంచి ఎంపీగా గెలిచారు. -
పట్టపగలు బిజీ మార్కెట్లో మహిళపై దారుణం
-
పాసింజర్ ట్రైన్లో బాంబు కలకలం
ఫరుక్కాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ఓ పాసింజర్ ట్రైన్లో బాంబు ఉండటం కలకలం సృష్టించింది. యూపీలోని ఫరుక్కాబాద్లో మెయిన్‌పురి పాసింజర్ ట్రైన్లో బాంబు ఉందని పోలీసులు గుర్తించారు. ట్రైన్ బయలుదేరడానికి 20 నిమిషాల ముందు సంబంధిత సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే వారు ట్రైన్లో పెట్టిన బాంబును తొలిగించడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. -
పరస్పర అంగీకారంతోనే రేప్‌లు జరుగుతున్నాయి
మణిపూరి: ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజవాదీ పార్టీ (ఎస్పీ) నేతలు సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్లో మంత్రి తొతారాం యాదవ్ ... అత్యాచార (రేప్) ఘటనలపై తాజాగా స్పందించారు. యువతీయువకుల పరస్పర అంగీకారంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయని సెలవిచ్చారు. అంతేకాకుండా అత్యాచారాలు రెండు విధములు అని అవి.. బలవంతంగా జరిగేవి... మరోకటి పరస్పర అంగీకారంతో జరిగేవి అంటూ ఆయన వ్యాఖ్యలు చేసి తన నోటి తీటను తీర్చుకున్నారు. శనివారం మణిపూరిలోని జిల్లా జైలులో తోతారాం యాదవ్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో తోతారాం మాట్లాడారు. రాష్ట్రంలో అత్యాచార సంఘటనలు తగ్గుముఖం పట్టాయి కదా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు తోతారం యాదవ్‌పై విధంగా స్పందించారు. -
మెదక్ బైపోల్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది?
-
'ఎన్నికల తర్వాత అన్నయ్యే ప్రధాని'
ఆజమ్ ఘడ్: లోకసభ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి పదవిని ములాయం సింగ్ యాదవ్ చేపడుతారని ఆయన సోదరుడు, సమాజ్ వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ ధీమాను వ్యక్తం చేశారు. అజమ్ ఘడ్ నియోజకవర్గంలోనే కొనసాగుతారని.. మెయిన్ పూరి స్థానాన్ని వదులకుంటారని రాంగోపాల్ యాదవ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని అజమ్ ఘడ్, మెయిన్ పూరి స్థానాల నుంచి లోకసభకు ములాయం పోటీ చేస్తున్నారు. ఆజమ్ ఘడ్ నుంచి గెలిచే ములాయం దేశానికి ప్రధాని అవుతారన్నారు. అయితే ములాయం చెప్పిన దానికి పూర్తి విరుద్దంగా రాంగోపాల్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇటీవల మెయిన్ పూరి స్థానం నుంచి కొనసాగుతానని ములాయం అన్నారు. ఎన్నికల తర్వాత మూడవ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాంగోపాల్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.