బాబాయ్ కాళ్లు మొక్కిన అబ్బాయ్.. కలిసి ప్రచారం.. | Samajwadi Party Chief Akhilesh Yadav Touches Shivpal Yadav Feet | Sakshi
Sakshi News home page

Akhilesh Yadav: బాబాయ్ కాళ్లు మొక్కిన అబ్బాయ్.. కలిసి ప్రచారం..

Published Sun, Nov 20 2022 8:24 PM | Last Updated on Sun, Nov 20 2022 9:05 PM

Samajwadi Party Chief Akhilesh Yadav Touches Shivpal Yadav Feet - Sakshi

లక్నో: దివంగత ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, తన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ కాళ్లు మొక్కారు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్. మైన్‌పురి లోక్‌ సభ ఉపఎన్నికల ప్రచారంలో ఈ దృష్యం ఆవిష్కృతమైంది.

ములాయం సింగ్ యాదవ్ మృతితో మైన్‌పురి ఎంపీ సీటు ఖాళీ అయింది. ఈ ఉపఎన్నికలో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్‌ ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తమ కుటుంబానికి కంచుకోట అయిన మైన్‌పురిలో ప్రజలు తమకే అండగా ఉన్నారని చాటిచెప్పేలా చారిత్రక విజయం అందించాలని అఖిలేశ్ యాదవ్ ప్రజలను కోరారు.

అఖిలేశ్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ 2017లో ఎస్పీ నుంచి బయటకు వెళ్లారు. అనంతరం 2018లో ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి అఖిలేశ్‌తో జతకట్టారు.

కానీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత బాబాయ్, అబ్బాయ్ మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తమ మధ్య విభేదాలు లేవని చెప్పేందుకు ఇద్దరు కలిసి పచారంలో పాల్గొన్నారు. ఈ ఉపఎన్నిక డిసెంబర్ 5న జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement