లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయ్‌లో జరిగాయి. అంతిమ యాత్రకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. 'నేతాజీ అమర్ రహే' నినాదాలతో సైఫాయ్ గ్రామం మారుమోగింది.
అంతకుముందు భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ములాయం భౌతికకాయాన్ని సందర్శించేందుకు వేలాది మంది వెళ్లారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసుకున్నారు. అనంతరం ములాయం భౌతికకాయాన్ని ఓ వాహనంలో అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ సహా కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
#WATCH | A large sea of people chants "Netaji amar rahein" as a vehicle carries the mortal remains of Samajwadi Party (SP) supremo and former Uttar Pradesh CM #MulayamSinghYadav for his last rites, in Saifai, Uttar Pradesh. pic.twitter.com/RMCzht2uI3
— ANI (@ANI) October 11, 2022
గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ములాయం సోమవారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల దేశంలోని రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ములాయం భౌతికకాయాన్ని హోంమంత్రి అమిత్‌షా సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సందర్శించి నివాళులు అర్పించారు.
చదవండి: పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం
Comments
Please login to add a commentAdd a comment