Akhilesh Yadav Emotional Tweet On His Father Mulayam Cremation - Sakshi
Sakshi News home page

సూర్యుడు ఉదయించని రోజులా ఉంది నాన్నా.. అఖిలేశ్ ఎమోషనల్ పోస్టు

Published Wed, Oct 12 2022 5:53 PM | Last Updated on Wed, Oct 12 2022 7:33 PM

Akhilesh Yadav Emotional Tweet After Father Mulayam Cremation - Sakshi

లక్నో: తండ్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు పూర్తయిన మరునాడే ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్టు పెట్టారు అఖిలేశ్ యావద్. ఆయన లేని తొలి రోజు సూర్యుడు ఉదయించకుండానే తెల్లవారినట్లు ఉందని భావోద్వేగానికి లోనయ్యారు. ములాయం అంత్యక్రియలకు సంబంధించి రెండు ఫోటోలను షేర్ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యావద్(82) సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను స్వగ్రామం సైఫాయ్‌లో మంగళవారం నిర్వహించారు. భారీ జనసందోహం, అశ్రునయానాల మధ్య ఆయన అంతిమయాత్ర సాగింది.

ములాయం అంత్యక్రియలకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. అఖిలేశ్ యాదవ్‌కు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానభూతి తెలిపారు.
చదవండి: ఆమ్‌ ఆద్మీ పార్టీకి షాక్.. తజీందర్‌ బగ్గాకు రిలీఫ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement