'ఎన్నికల తర్వాత అన్నయ్యే ప్రధాని'
'ఎన్నికల తర్వాత అన్నయ్యే ప్రధాని'
Published Tue, May 6 2014 3:36 PM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM
ఆజమ్ ఘడ్: లోకసభ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి పదవిని ములాయం సింగ్ యాదవ్ చేపడుతారని ఆయన సోదరుడు, సమాజ్ వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ ధీమాను వ్యక్తం చేశారు. అజమ్ ఘడ్ నియోజకవర్గంలోనే కొనసాగుతారని.. మెయిన్ పూరి స్థానాన్ని వదులకుంటారని రాంగోపాల్ యాదవ్ అన్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని అజమ్ ఘడ్, మెయిన్ పూరి స్థానాల నుంచి లోకసభకు ములాయం పోటీ చేస్తున్నారు. ఆజమ్ ఘడ్ నుంచి గెలిచే ములాయం దేశానికి ప్రధాని అవుతారన్నారు. అయితే ములాయం చెప్పిన దానికి పూర్తి విరుద్దంగా రాంగోపాల్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
ఇటీవల మెయిన్ పూరి స్థానం నుంచి కొనసాగుతానని ములాయం అన్నారు. ఎన్నికల తర్వాత మూడవ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాంగోపాల్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Advertisement