Azamgarh
-
‘CAA మోదీ గ్యారెంటీ.. ఎవరూ చెరపలేరు’
లక్నో: మోదీ వెళ్లిపోతే.. సీఏఏ కూడా వెళ్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, సీఏఏ మోదీ గ్యారెంటీ అనిర, దానిని ఎవరూ తొలగించలేరని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఉత్తర ప్రదేశ్ అజాంఘడ్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మోదీ గ్యారెంటీలపై ప్రజలకు నమ్మకం ఉంది. సీఏఏ(CAA) చట్టమే మోదీ గ్యారెంటీకి తాజా ఉదాహరణ. సీఏఏ కింద భారత పౌర సత్వం ఇవ్వడం మొదలైంది. దేశంలో వీరంతా చాలా ఏళ్లుగా శరణార్థులుగా ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోనూ లక్షలమంది శరణార్థులు ఉన్నారు. వాళ్లందరికీ కూడా పౌరసత్వం లభిస్తుంది. మోదీ వెళ్తే సీఏఏ కూడా వెళ్లిపోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, మోదీ గ్యారెంటీని ఎవరూ చెరపలేరు. విపక్ష కూటమి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తోంది. కానీ, ప్రజలంతా బీజేపీ, ఎన్డీయే కూటమితోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఒక్కటే మాట వినిపిస్తోంది. అదే ఫిర్ ఏక్ బార్.. 400 పార్. మోదీ గ్యారెంటీ కశ్మీర్‌లోనూ కనిపిస్తోంది. కశ్మీర్లో శాంతికి గ్యారెంటీ ఇచ్చాం. కశ్మీర్లో తీసుకున్న చర్యలతో విపక్షాల నోళ్లు మూతలు పడ్డాయి. మోదీ వెళ్తే ఆర్టికల్ 370 రద్దు కూడా పోతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ, నాల్గొ దశలో జరిగిన పోలింగ్‌లో శ్రీనగర్ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు అని ప్రధాని మోదీ అన్నారు.దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా ఆజాంఘడ్ గురింంచి చర్చ వచ్చేది. స్లీపర్‌సెల్స్ గురించి చర్చ జరిగేది. సమాజ్‌వాదీ పార్టీ ఎప్పుడూ ఆజాంఘడ్ గురించి ఆలోచించలేదు. ఆజాంఘడ్‌లో కమలం వికసిస్తేనే.. అభివృద్ధి జరుగుతుంది అని ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇండియా కూటమి రిజర్వేషన్లతో రాజకీయం చేస్తోంది. 50 శాతం బడ్జెట్‌ను మైనారిటీలకు కేటాయించాలనుకుంటోంది. 70 ఏళ్లుగా హిందూ, ముస్లిం అంటూ మతాల పేరిట వాళ్లు విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు దేశమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. రామమందిర ప్రారంభం నాడు ఇండియా కూటమి ఎన్నో విమర్శలు చేసింది. పేదల అభివృద్ధి కోసం పగలు రాత్రి కష్టపడుతున్నా. మీ బాధలన్నింటిని తొలగిస్తున్నాం. వివిధ పథకాలతో పేదలను ఆదుకుంటున్నాం అని మోదీ తెలిపారు. -
అజంగఢ్ పోటీని ఆసక్తికరంగా మార్చిన మాయావతి!
యూపీలోని అజంగఢ్ లోక్‌సభ స్థానం రాష్ట్రంలో రాజకీయంగా చాలా ముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది. బహుజన్ సమాజ్ పార్టీ తాజాగా ఈ స్థానం నుంచి తన అభ్యర్థిని నిలబెట్టింది. బీఎస్పీ మహిళా అభ్యర్థి సబిగా అన్సారీ అజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఈ సీటుపై ముక్కోణపు పోరు నెలకొంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 45 ఏళ్ల తర్వాత అజంగఢ్ నియోజకవర్గం నుంచి ఓ మహిళా అభ్యర్థి బరిలో నిలిచారు.అజంగఢ్ నుంచి మహిళా అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీఎస్పీ.. ఈ సీటుకు జరుగుతున్న పోరును మరింత ఆసక్తికరంగా మార్చింది. 1978లో మొహసినా కిద్వాయ్ ఇక్కడ నుండి కాంగ్రెస్ టిక్కెట్‌పై నాటి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా అజంగఢ్ స్థానం నుండి మహిళా అభ్యర్థిని నిలబెట్టలేదు. మహిళా రాజకీయ చైతన్యం ఇక్కడ తక్కువే అనే మాట వినిపిస్తుంటుంది.ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చి, కాంగ్రెస్ నుంచి బీఎస్పీలో చేరిన సబీహా అన్సారీని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి మాయావతి అజంగఢ్‌లో నూతన రాజకీయాలకు తెరలేపారు. ఈ ప్రాంతానికి చెందిన మీరా దేవి మాట్లాడుతూ తమ కష్టాలను అర్థం చేసుకోగల మహిళా అభ్యర్థి ఎన్నికల బరిలో దిగడం సంతోషదాయకమన్నారు. ఇది మహిళలకు గర్వకారణమని మరో మహిళ ఆర్తి అన్నారు. జలంధరి ప్రాంతానికి చెందిన షబీనా కూడా బీఎస్పీ చీఫ్ మాయావతి నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. -
నేను డిఫరెంట్
ఆజంగఢ్: తాను భిన్నమైన వ్యక్తినని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘సాధారణంగా రాజకీయ నాయకులు హామీలిచి్చ, వాటిని అమలు చేయకుండా తప్పించుకుంటూ ఉంటారు. నేను మాత్రం అలా కాదు’’ అని స్పష్టం చేశారు. ‘మోదీ భిన్నమైన (డిఫరెంట్) మట్టితో రూపొందాడు’ అన్నారు. గతంలో అధికారం చెలాయించిన ప్రభుత్వాలు ఎన్నో హామీలిచ్చాయని, కానీ వాటిని నిలబెట్టుకోలేదని విమర్శించారు. పథకాలను ప్రకటించి, వాటిని అమలు చేయకుండా ప్రజల కళ్లకు గంతలు కట్టాయన్నారు. 30–35 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వాలు చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలను తాను సమీక్షించానని, అవి పెద్దగా అమల్లోకి రాలేదని తేలిందని వెల్లడించారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, శంకుస్థాపనలు చేయడం, ఎన్నికల తర్వాత హామీలిచి్చన నాయకులు, ఆ శిలాఫలకాలు కనిపించకుండాపోవడం గతంలో ఒక తంతుగా ఉండేదన్నారు. ఈ విషయంలో తాను విభిన్నమైన వ్యక్తినని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌లో పర్యటించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి రూ.42,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఢిల్లీ, కడప, హుబ్బళ్లి, బెలగావి, కొల్హాపూర్ తదితర విమానాశ్రయాల్లో కొత్త టెరి్మనల్ భవనాలకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో యూపీ కొత్త శిఖరాలకు చేరుకుంటోందని, దాంతో విషం లాంటి బుజ్జగింపు రాజకీయాలు బలహీనపడుతున్నాయని చెప్పారు. బుజ్జగింపు, బంధుప్రీతి రాజకీయాల్లో చాలా ప్రమాదకరమన్నారు. ప్రాజెక్టులకు ఎన్నికలతో సంబంధం లేదు తాను ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు రానున్న లోక్‌సభ ఎన్నికలతో సంబంధముందని ఎవరూ భావించొద్దని మోదీ అన్నారు. 2019 ఎన్నికల వేళ తానెన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని, అవి చాలావరకు పూర్తయ్యాయని గుర్తుచేశారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. అవినీతిని పరమావధిగా భావించే కుటుంబ పారీ్టలు అధికారంలో ఉంటే అభివృద్ధి జరిగేది కాదన్నారు. ఈఎఫ్టీఏ ఒప్పందంపై హర్షం యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో వాణిజ్య ఒప్పందంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అసోసియేషన్‌లో సభ్యదేశాలైన ఐస్‌ల్యాండ్, లీచ్టెన్స్టీన్ నార్వే, స్విట్జర్లాండ్‌తో భారత్ కలిసి పని చేస్తుందని ప్రధాని అన్నారు. లోక్‌పాల్ ప్రమాణస్వీకారం లోక్‌పాల్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖని్వల్కర్ (66) ఆదివారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉపాధ్యాయుడికి బడితపూజ చేసిన మహిళలు.. వీడియో వైరల్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఆజంగఢ్‌లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునికి బడితపూజ చేశారు మహిళలు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో దాడి చేసి చెప్పులతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మహిళలు దాడి చేస్తుండగా.. ఆపేందుకు ఇతర ఉపాధ్యాయుల ప్రయత్నించారు. అయినా వాళ్లు మాత్రం వెనక్కితగ్గలేదు. అయితే ఈ ఉపాధ్యాయుడు పాఠశాలలోని అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన బాలికల దండ్రులు ఆగ్రహంతో అతనిపై దాడికి పాల్పడ్డారు. అక్కుడున్న ఇతర సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. आजमगढ़ के पवई थाना क्षेत्र में स्थित एक प्राथमिक विद्यालय में अध्यापक पर छात्रा के साथ कथित रूप से अश्लील हरकत करने का आरोप। महिला शिक्षकों ने मिलकर अध्यापक की कर दी पिटाई।#Azamgarh #UttarPradesh #Teacher pic.twitter.com/csLvFuc15t — UP Tak (@UPTakOfficial) October 20, 2022 చదవండి: 23వ అంతస్తు నుంచి దూకిన ప్రముఖ బిల్డర్ -
Col Nizamuddin: నేతాజీని కాపాడిన యోధుడు
నేతాజీ ఆంతరంగికులలో ఒకరు కల్నల్ షేక్ నిజాముద్దీన్. వీరి అసలు పేరు సైఫుద్దీన్. వీరు అప్పటి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంగఢ్ జిల్లా ఢక్వా గ్రామంలో 1900లో జన్మించారు. 20 ఏళ్ల ప్రాయంలో బ్రిటిష్ సైన్యంలో చేరారు. కొంతకాలం తర్వాత సింగపూర్‌లో క్యాంటిన్ నడుపుతున్న తన తండ్రి ఇమాం అలీ వద్దకు 1926లో చేరారు. అనంతరం 1943లో నేతాజీ జాతీయ సైన్యాన్ని పునరుద్ధరించి ‘చలో ఢిల్లీ’ అంటూ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన అందులో చేరారు. అప్పటివరకు ఉన్న సైఫుద్దీన్ పేరును నిజాముద్దీన్‌గా మార్చుకున్నారు. నేతాజీ కారు డ్రైవర్‌గా ఉండి, ఆ తరువాత అంగరక్షకుడిగా, వ్యక్తిగత సహాయకునిగా నిజాముద్దీన్ ఎదిగారు. బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా 1943లో జరిగిన యుద్ధంలో నేతాజీతో కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో అడవిలో నేతాజీతో వెళుతుండగా తుప్పల్లోంచి నేతాజీకి గురిపెట్టిన ఒక తుపాకీ గొట్టాన్ని నిజాముద్దీన్ గమనించి ఎదురెళ్ళారు. క్షణాలలో 3 గుండ్లు ఆయన శరీరంలోకి దూసుకుని వెళ్ళి కుప్పకూలారు. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ వైద్యం చేసి నిజాముద్దీన్ శరీరంలోని బుల్లెట్లను తొలగించారు. ఆయన త్యాగనిరతికి నేతాజీ చలించిపోయి కల్నల్ హోదాను కల్పించడంతో వీరు కల్నల్ షేక్ నిజాముద్దీన్‌గా ప్రసిద్ది చెందారు. నాటి నుండి 1945 వరకు నేతాజీ వెన్నంటి ఉన్నారు. సింగపూర్ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారన్న వార్తను ఆయన ఖండించారు. ఆ ప్రమాదం జరిగిన 3 నెలల తర్వాత తాను స్వయంగా నేతాజీని బర్మా–థాయిలాండ్ సరిహద్దుల్లో గల సితంగ్‌పూర్ నదీ తీరాన తీసుకెళ్ళి విడిచిపెట్టి వచ్చానని అనేవారు. నిజాముద్దీన్ తన 117 ఏట 2017లో స్వగ్రామంలోనే కన్నుమూశారు. – షేక్ అబ్దుల్ హకీం జాని, తెనాలి (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) -
లోక్‌సభ సభ్యత్వానికి అఖిలేశ్ రాజీనామా
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ లోక్‌సభ ఎంపీగా ఉన్న ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నుంచి గెలవడం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు అఖిలేశ్ చెప్పారు. ఎస్పీకి అఖిలేశ్ తండ్రి ములాయం సహా లోక్‌సభలో నలుగురు సభ్యులున్నారు. చదవండి: (చిన్నమ్మకు ‘పన్నీరు’ క్లీన్ చిట్) -
బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్ పోస్టర్‌గాళ్
లక్నో: డాక్టర్ ప్రియాంక మౌర్య... యూపీలో ప్రియాంకా గాంధీ వాద్రా రూపొందించిన ‘నేను అమ్మాయిని... పోరాడగలను’ నినాదపు గొంతుక. యూపీలో మహిళా సాధికారతకు ముఖచిత్రం. ప్రియాంకా గాంధీకి కుడిభుజంగా మెలిగిన ఆమె... గురువారం బీజేపీలో చేరారు. ఎన్నికల నేపథ్యంలో యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ. ప్రియాంక మౌర్య... హోమియోపతి డాక్టర్. సామాజిక ఉద్యమకారిణి. అజాంగఢ్‌లో పుట్టి పెరిగారు. గ్వాలియర్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యనభ్యసించారు. 2008లో స్పైస్‌జెట్‌లో చేరి ఎగ్జిక్యూటివ్‌గా రెండేళ్లపాటు పనిచేశారు. 2012లో తిరిగి డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అది మొదలు... ‘నేకీ కి దివార్’, ‘రోటీ బ్యాంక్’ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. కరోనా పాండమిక్ సమయంలోనూ సేవకుగాను పలు అవార్డులు సైతం అందుకున్నారు. 2020 డిసెంబర్లో ఆమె కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఆ తరువాత 2021 నవంబర్‌లో పార్టీ ఆమెను మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. ప్రియాంక మౌర్య... మంచి వక్త. తన మాటలతో యువతను ఇట్టే ఆకట్టుకునే గుణం. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. లక్షల మంది అభిమానులున్నారు. ఐదు కోట్ల మంది మహిళా ఓటర్లున్న యూపీ రాజకీయాల్లో వారి పాత్ర కీలకం. దాంతో ప్రియాంక గాంధీ... . 2021 డిసెంబర్ 8న మహిళా మేనిఫెస్టో ‘శక్తి విధాన్’ను విడుదల చేశారు. మహిళా సాధికారతకు గుర్తుగా ‘మై లడకీ హూ... లడ్ సక్తీ హూ’ స్లోగన్‌కు ప్రియాంక మౌర్యను ప్రచారకర్తగా ఎంచుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తూనే... లక్నోలోని సరోజిని నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రియాంకమౌర్య సీట్ ఆశించారు. అందుకనుగుణంగానే తన కార్యకలాపాలను విస్తరించారు. తీరా సీట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రియాంకను పక్కన పెట్టింది. ఆమె పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ సీటును రుద్రదామన్ సింగ్‌కు కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రియాంక బీజేపీలో చేరారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ ‘‘నా నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందనుకున్నాను. కానీ కాంగ్రెస్‌పార్టీ మోసం చేసింది. వాళ్లు ముందే అనుకున్నట్టుగా మరో వ్యక్తికి సీటిచ్చారు. మహిళలు, మౌర్య, కుష్వాహ, శాక్య, సైనీ కులాల ఓట్లను రాబట్టుకోవడానికి నన్ను వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంకోసం నన్ను, సోషల్‌మీడియాలో నాకున్న లక్షల మంది అభిమానులను ఉపయోగించుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందినదాన్ని, లంచం ఇవ్వలేను కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ. ‘లడకీ హూ... లడ్ సక్తీ హూ’ అనే నినాదమిచ్చారు. నినాదాలు, మాటలతోనే పనవ్వదు. అవకాశాలు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాడటానికి నాకు అవకాశమే ఇవ్వలేదు. ప్రియాంకగాంధీతో సైతం నేను పోరాడగలను అని ఇప్పుడు నిరూపించుకుంటాను. శక్తి, సమయం వెచ్చించి నేను పనిచేసిన ఆ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టే బీజేపీలో చేరాను. నేను హోమియోపతి డాక్టర్‌ను... తీయటి మందులివ్వడమే కాదు.. తీయగా మాట్లాడటమూ వచ్చు. ఇప్పుడా పని బీజేపీ కోసం చేస్తాను. నిత్యం సమాజ సేవలోనే ఉంటా.’’ -
యోగి ఏలుబడి వద్దు.. యోగ్య పాలన కావాలి
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బరిలోకి దిగిన ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడుతున్నాయి. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ అగ్ర నాయకులు శనివారం పరస్పర విమర్శలతో రాజకీయ వేడి రగిలించారు. యూపీకి యోగి పాలన అవసరం లేదని.. ‘యోగ్య’ పాలన కావాలని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. తమ పార్టీ జామ్( జన్‌ధన్, ఆధార్, మొబైల్) పాలన అందిస్తోందని బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీవి విధ్వంసకర రాజకీయాలు గోరఖ్‌పూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ 'రథయాత్ర'లో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. యోగి ప్రభుత్వం హయాంలో ఆజంగఢ్ 'మాఫియా రాజ్'గా మారిందని, ప్రతిష్ట మసకబారిందని విమర్శించారు. బీజేపీ విధ్వంసకర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. సీఎం యోగిపై కేసులు ఉపసంహరించుకుంటున్నారని ఆరోపించారు. ‘జామ్’ పాలన అందించాం సమాజ్‌పార్టీ హయాంలో యూపీలో అభివృద్ధి శూన్యమని అమిత్ షా ధ్వజమెత్తారు. అఖిలేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో సీఎం యోగితో కలిసి స్టేట్ యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము ‘జామ్’ పాలన అందించామని చెప్పుకొచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ అంటే.. జిన్నా, ఆజంఖాన్, ముక్తార్(అన్సారీ) అంటూ ఎద్దేవా చేశారు. ఇటీవల జిన్నాపై అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన నేపథ్యంలో అమిత్ ఈవిధంగా కౌంటర్ ఇచ్చారు. ఆజంగఢ్ పేరు మారుస్తాం ముఖ్యమంత్రులుగా పనిచేసిన ములాయం, అఖిలేశ్ యాదవ్.. ఆజంగఢ్ అభివృద్ధికి చేసిందేమి లేదని సీఎం యోగి విమర్శించారు. ఆజంగఢ్ పేరును ఆర్యగఢ్ గా మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. స్టేట్ యూనివర్సిటీ రాకతో ఆజంగఢ్ కచ్చితంగా ఆర్యగఢ్ మారుతుందని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: 4 గంటల పర్యటన.. రూ.23 కోట్లకు పైగా ఖర్చు) -
Arpita Mukherjee: వహ్వా.. గౌహర్ జాన్ పాత్రలో జీవించిన అర్పిత!
ప్లేబ్యాక్సింగర్గా పరిచితమైన అర్పిత ముఖర్జీ పరకాయ ప్రవేశంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు! కాని రంగస్థలంపై లెజండరీ సింగర్ గౌహర్ జాన్ పాత్రలో జీవించిన తీరు చూస్తే ఆమెకు పరకాయ ప్రవేశం వచ్చునని కాస్త సరదాగా అనుకోవచ్చు. గౌహర్ జాన్ జీవితంపై రూపొందించిన ‘మై నేమ్ ఈజ్ జాన్’ ప్లేలో అర్పిత ముఖర్జీ ప్రేక్షకుల మనసులను దోచుకుంది. నటన–నాట్యం– గానం మేళవింపు ఈ ప్లే. పాపులర్ ఓల్డ్ బెంగాలీ సాంగ్స్, పంజాబీ టప్పా, గుజరాత్ క్లాసికల్... ఒకటా రెండా కనుల విందుకు తోడు వీనుల విందు! ‘రంగస్థల గౌహర్ జాన్’ను చూసే ఇంత అబ్బురపడుతున్న ప్రేక్షక సమూహాలకు వాస్తవజీవితంలోని వ్యక్తి కళ్ల ముందు నిలిస్తే ఎంత అపురూపమో కదా అనిపిస్తుంది. ఈ తరానికి బొత్తిగా పరిచయం లేని పేరు... గౌహర్ జాన్. తొలితరం గ్రామ్‌ఫోన్ రికార్డ్ సింగర్ గా ప్రసిద్ధురాలైన గౌహర్ జాన్ ఎన్నో భాషల్లో 700 పాటలు పాడి ‘ది గ్రామ్‌ఫోన్ గర్ల్’ ‘ది ఫస్ట్ రికార్డింగ్ సూపర్‌స్టార్ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకుంది. భారతీయ భాషల్లోనే కాదు అరబిక్, పర్షియన్, ఫ్రెంచ్.. మొదలైన భాషల్లోనూ పాటలు పాడి మెప్పించింది. ఈకాలంలో గౌహర్జాన్ను గుర్తు చేసుకోవడం అంటే... ఒక గాయని వ్యక్తిగతజీవితం తెలుసుకోవడం కాదు. చరిత్ర లోతుల్లోకి వెళ్లడం. ఆకాలంలో ప్రతిభావంతులైన మహిళలు ఎన్నెన్ని కష్టాలను భరించి, ఆ కష్టాలకు వెరవకుండా, లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నతస్థాయికి ఎలా చేరారో తెలుసుకోవడం. గౌహర్ జాన్ 1873లో ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో జన్మించింది జాన్. ఇంజనీర్ రాబర్ట్ యెవర్డ్, గాయని, నృత్యకారిణి ఎలెన్ విక్టోరియా హెలెన్‌లకు జన్మించిన ఏంజెలినా యెవర్డ్ ‘గౌహర్ జాన్’గా గొప్ప పేరు తెచ్చుకునే స్థాయికి ఎదగడం వరకు నడిచింది నల్లేరుపై నడక కాదు. ముళ్ల కంచెపై ప్రయాణం. గొంతులో దాగిన విషయాన్ని కప్పిపెట్టి...అమృతంలాంటి పాటలు పాడింది. కాళ్లకు గుచ్చుకున్న ముండ్లను తీసేసి... అపురూపమైన నృత్యం చేసింది. ఒకానొకరోజు మిస్టర్ రాబర్ట్ భార్యా పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. ఉన్న ఊరు నుంచి పొట్ట చేతపట్టుకొని బిడ్డను తీసుకొని బెనారస్‌కు వెళ్లింది విక్టోరియా. అక్కడ ఖుర్షీద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కూతురి పేరుని ‘గౌహర్ జాన్’గా మార్చింది. ఈ పేరుతోనే కాకుండా ‘మల్కా జాన్’గా కూడా ప్రసిద్ధురాలైంది ఏంజెలినా. ప్రముఖ ఆడియో కంపెనీ ఒకటి గౌహర్ జాన్ ఆణిముత్యాలను రీ–రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉంది. రేపో మాపో బాలీవుడ్లో గౌహర్ జాన్ బయోపిక్ వార్త కూడా వినవచ్చు! చదవండి: Sheelaa Bajaj: ధీర వనిత.. నానమ్మ కథ -
గ్రామ పెద్ద హత్య.. యూపీలో చెలరేగిన హింస
ఆజంగఢ్ : ఓ గ్రామ పెద్ద హత్య ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ జిల్లాలో హింసకు దారి తీసింది. హత్యకు నిరసనగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసుపై దాడికి దిగి వాహనాలను తగులబెట్టారు. ఆందోళనకారులను అదుపు చేయడం కోసం పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఆజంగఢ్ జిల్లాలోని ఓ గ్రామ పెద్ద సత్యమేవ్ జయతే అలియాస్ పప్పురామ్‌ను శుక్రవారం ఓ దుండగుడు తుపాకితో కాల్చి చంపాడు. అనంతరం ఈ విషయాన్ని పప్పురామ్ ఇంటికి వెళ్లి తెలియజేశాడు. ఈ సంఘటన తెలిసి ఆగ్రహించిన గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వాహనాలను తగులబెట్టారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేయడంతో పాటు బారికేడ్లను తగులబెట్టారు. (చదవండి : కుప్పకూలిన విమానం; ఐదుగురు మృతి) పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో భారీగా పోలీసులు బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నాయి. కాగా, ఈ అల్లర్లలో ఓ చిన్నారి కూడా మృతి చెందాడు. దాడులకు పాల్పడేవారిని వెంటనే అరెస్ట్ చేసి పరిస్థితి అదుపులోకి తీసుకోవాలని పోలీసులు అధికారులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. అలాగే మృతి చెందిన గ్రామ పెద్ద, చిన్నారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అల్లర్లకు కారణమైన పోలీసులు సస్పెండ్ చేయాలని అధికారును ఆదేశించారు. -
ఆన్లైన్ క్లాస్‌లో అశ్లీల చిత్రాలు!
ఆజంగఢ్ : కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ తరగతులు జోరందుకున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌తో విద్యాసంస్థలు మూతపడడంతో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ ఆన్లైన్ క్లాసులు కొన్ని చోట్ల సమస్యాత్మకంగా మారుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో 12వ తరగతి విద్యార్థులకు వాట్సప్ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడికి షాకింగ్ సంఘటన ఎదురైంది. ఆన్లైన్లో క్లాసులు చెబుతున్న సమయంలో వాట్సప్ గ్రూప్‌లో అసభ్య సందేశాలతో పాటు అశ్లీల వీడియో క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశారు ఇద్దరు విద్యార్థులు. దీంతో కంగుతున్న ఉపాధ్యాయుడు గ్రూప్ నుంచి బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి : యోగా కోసం వెళితే.. శృంగారం చేయాలని..) ఎలా జరిగిందంటే.. ఆజంగఢ్‌కు చెందిన ఓ ప్రైవేట్ టీచర్ 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో ఇంగ్లీష్ క్లాసులు చెప్పాలనుకున్నారు. దీని కోసం ఓ వాట్సప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి క్లాసులు చెబుతున్నారు. గత శుక్రవారం క్లాస్ నిర్వహిస్తుండగా పదో తరగతి చదివే ఇద్దరు విద్యార్థినులు తమను కూడా గ్రూప్‌లో చేర్చమని కోరారు. గ్రూప్‌లో చేర్చిన వెంటనే ఓ విద్యార్థిని అసభ్యకర సందేశాన్ని పోస్ట్ చేసింది. అది చూసి ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని మందలించాడు. వెంటనే మరో విద్యార్థిని అశ్లీల వీడియో క్లిప్పింగ్‌ను గ్రూప్‌లో పోస్ట్ చేసింది. దీంతో కంగుతిన్న టీచర్.. వెంటనే గ్రూప్ నుంచి బయటకు వచ్చి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాల యాజమాన్యం ఇద్దరు విద్యార్థినిల తల్లిదండ్రులను పిలిపించి విచారించగా.. తమ పిల్లలు గత 15 రోజులుగా ఇంట్లో లేరని, వారికి ఫోన్లు కూడా అందుబాటులో లేవని చెప్పారు. దీంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసి ఇద్దరు విద్యార్థులు ఒకే ప్రాంతం నుంచి సందేశాలు పంపినట్లు గుర్తించారు. ఆ ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కొత్త జంటకు కరోనా; గ్రామానికి సీల్
లక్నో: పెళ్లి చేసుకున్న జంటకు కరోనా షాకిచ్చింది. తాజా పరీక్షల్లో వధూవరులిద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలడంతో కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఆ కొత్త జంటను రాజస్థాన్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వివాహానికి వేదికగా నిలిచిన అజంఘడ్‌లోని చత్తర్‌పూర్ గ్రామానికి అధికారులు సీల్ వేశారు. వివరాలు.. రాజస్థాన్‌కు చెందిన యువకుడు ఉత్తర ప్రదేశ్‌లోని చత్తర్‌పూర్ యువతిని మార్చి 23న వివాహమాడాడు. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల వారు అదే గ్రామంలో చిక్కుకుపోగా ఏప్రిల్ 14న అక్కడ నుంచి రాజస్థాన్‌కు పయనమయ్యారు. (లాక్డౌన్ నుంచి నిష్క్రమణ ఎలా?) నాలుగు రోజులు ప్రయాణించిన అనంతరం వారు రాజస్థాన్ సరిహద్దుకు చేరుకున్నారు. అయితే సరిహద్దు సిబ్బంది వారిని అక్కడే ఆపేసి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పెళ్లి జరిగిన చత్తర్‌పూర్ గ్రామాన్ని మూసివేశారు. వారి కుటుంబీకులను క్వారంటైన్‌కు తరలించారు. గ్రామస్థులకు స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు ఆ ప్రాంతాన్నంతటినీ శానిటైజింగ్ చేయనున్నారు. (విమానం ఎక్కాలంటే మాస్క్‌లు ఉండాల్సిందే) -
యాదవ్ VS యాదవ్
ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంతంలోని లోక్‌సభ నియోజకవర్గాలు పోలింగుకు సిద్ధపడుతుండటంతో బీజేపీ, గట్బంధన్ (ఎస్పీ, బీఎస్పీ కూటమి)లు తమతమ ఓటు బ్యాంకులను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ప్రత్యర్థుల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు కూడా వ్యూహాలు పన్నుతున్నాయి. గత ఎన్నికల్లో బీఎస్పీ అధినేత మాయావతి విపక్షాల ఓటు బ్యాంకును కొల్లగొట్టడంతో సఫలీకృతురాలయ్యారు. అదే వ్యూహాన్ని ఈ సారి ఇరు పక్షాలు అమలు పరుస్తున్నాయి. ఈసారి బీజేపీ ఎస్పీకి చెందిన యాదవులు, బీఎస్పీకి చెందిన జాటవుల ఓట్లను ఏ మేరకు లాక్కోగలదన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎస్పీ, బీఎస్పీలు రెండూ కులం ప్రాతిపదికగా ఏర్పడిన పార్టీలు. ఆయా సామాజిక వర్గాల గట్టి మద్దతుతో రాష్ట్రంలో ఇవి రెండూ బలంగా వేళ్లూనుకున్నాయి. 2002లో మాయావతి బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొంత కాలానికే ఆ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తాను అధికారంలోకి రావడం కోసం బీఎస్పీని చీల్చారు. దీని వెనుక అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హస్తం ఉందన్న వార్తలు వినిపించాయి. మళ్లీ లోక్‌సభ ఎన్నికలు జరిగేనాటికి ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, కేంద్రంలో వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మాయావతి సరికొత్త రాజకీయ సమీకరణకు శ్రీకారం చుట్టారు. గెలుపోటములను సామాజిక వర్గాలు ప్రభావితం చేసే కొన్ని నియోజకవర్గాల్లో మాయావతి విపక్షానికి చెందిన యాదవ నేతలను తమ పార్టీ తరఫున ఆ నియోజకవర్గాల్లో బరిలో దింపారు. లక్నో వీఐపీ గెస్ట్‌హౌస్‌లో మాయావతిపై దాడి కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్న రమాకాంత్ యాదవ్, ఉమాకాంత్ యాదవ్‌లకు ఆజంగఢ్, మచిలీషెహర్ టికెట్లు ఇచ్చారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మరో బలమైన నేత బాల్‌చంద్ర యాదవ్‌ను ఖలీలాబాద్ నుంచి, మిత్రసేన్ యాదవ్‌ను ఫైజాబాద్ నుంచి ఎన్నికల బరిలో దింపారు. మాయావతి చేసిన ఈ ప్రయోగం ఫలిం చింది. బీఎస్పీ ఓట్లను యాదవ అభ్యర్ధులకు మళ్లించగల సత్తా తనకుందని మాయావతి నిరూపించుకున్నారు. ఈ నియోజకవర్గాలన్నింటిలో ఎస్పీతో జరిగిన ముఖాముఖి పోటీలే మాయావతి అభ్యర్ధులంతా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ నుంచి పది మంది యాదవ ఎంపీలు లోక్‌సభలో అడుగుపెట్టారు. వీరిలో నలుగురు బీఎస్పీ టికెట్‌పై గెలిస్తే, ఐదుగురు ఎస్పీ తరఫున విజయం సాధించారు. ఒక ఇండిపెండెంట్ కూడా గెలిచారు. ఎస్పీ నేతలు ఐదుగురిలో ములాయం, అఖిలేశ్‌లు ఉన్నారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల ఫలితంగా తాజా ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు జత కట్టి బీజేపీపై పోరుకు దిగాయి. ఈ కూటమి దాదాపు డజను మంది యాదవ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. ఎస్పీకి చెందిన యాదవుల ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని చూస్తున్న బీజేపీ కేవలం ఒకే ఒక యాదవుడికి (భోజ్‌పురి గాయకుడు దినేశ్ లాల్ యాదవ్)టికెట్ ఇచ్చింది. ఈయనను ఆజంగఢ్‌లో అఖిలేశ్‌పై పోటీకి దించింది. ఈ సారి కాంగ్రెస్ కూడా ఇద్దరు యాదవ నేతలకు–బాలచంద్ర యాదవ్, రమాకాంత్ యాదవ్– టికెట్లు ఇచ్చింది. వీరు పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో ప్రత్యర్థి బీఎస్పీ. ఇక్కడ మాయావతి ఇద్దరు బ్రాహ్మణ నేతలను రంగంలో దించింది. పొత్తులో భాగంగా బీఎస్పీకి దక్కిన ఈ సీట్లలో తమ ఓట్లను బీఎస్పీకి మళ్లించడం సమాజ్‌వాదీ పార్టీకి సవాలేనని పరిశీలకులు చెబుతున్నారు. -
అఖిలేశ్ ఆస్తులు 37 కోట్లు
ఆజంగఢ్: ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ లోక్‌సభ స్థానానికి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ గురువారం నామినేషన్ వేశారు. తనకు, తన భార్యకు కలిపి రూ. 37 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని అఖిలేశ్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తన పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ. 7.9 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ. 16.9 కోట్లు, తన భార్య డింపుల్ పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ. 3.68 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ. 9.3 కోట్లు ఉందని వెల్లడించారు. నగదు తన వద్ద రూ. 3.91 లక్షలు, తన భార్య వద్ద రూ. 4.03 లక్షలు ఉందని తెలిపారు. 2014లో ఈ దంపతుల ఆస్తుల విలువ దాదాపు రూ. 24 కోట్లు. -
తండ్రి స్థానం నుంచి తనయుడు పోటీ
లక్నో : సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. 2014లో తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ పోటీ చేసి గెలిచిన ఆజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అఖిలేష్ పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ఆదివారంనాడు ప్రకటించింది. ఆదివారం రెండు స్థానాలకు ట్విటర్లో అభ్యర్థులను ప్రకటించగా.. ఆజంగఢ్ నుంచి అఖిలేష్, రాంపూర్ నుంచి పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ పోటీ చేస్తున్నారని ప్రకటించింది. ప్రస్తుతం ఆజం ఖాన్ రాంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ జాబితాతో ములాయం మరోసారి తన స్థానం నుంచే పోటీ చేస్తారన్న పుకార్లకు తెర పడింది. కాగా ఎస్పీ కురువృద్ధుడు ములాయంసింగ్ యాదవ్ మెయిన్‌పురి స్థానం నుంచి ములాయం పోటీ చేయనున్నారు. మొదట అఖిలేష్ తన భార్య డింపుల్ యాదవ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కన్నౌజ్ నుంచి పోటీ చేస్తారని పుకార్లు వెలువడినాయి కానీ, ఆయన తన తండ్రి స్థానాన్ని ఎంపిక చేసుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి ఆజంగఢ్ కంచుకోటగా ఉంది. ఇక ములాయంసింగ్ పోటీ చేయనున్న మొయిన్‌పురి కూడా ఎస్పీకి కంచుకోటగానే చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల్లో ములాయం ఇక్కడ నుంచి గెలిచి రాజీనామా చేశారు. ఇక ఎస్పీ మిత్ర పక్షమైన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అజంగఢ్‌లో మే 12న ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11న జరగనుంది. మే 23న ఫలితాలు ప్రకటిస్తారు. (ఆరు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన) -
బీజేపీ మిత్రపక్షం నుంచి అమర్ సింగ్‌కు ఆహ్వానం
వారణాసి : సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృ నేత అమర్ సింగ్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్దంగా ఉన్నట్టు బీజేపీ మిత్రపక్షం సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ) తెలిపింది. ఆయనకు ఇష్టమైతే 2019 ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయవచ్చని పేర్కొంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్నోలో పర్యటించిన సందర్భంగా అమర్ సింగ్‌కు అనుకూల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమర్ సింగ్ స్పందిస్తూ ప్రధాని మోదీ, సీఎం యోగి అదిత్యనాథ్‌లకే తాను ఒటేస్తానని చెప్పడంతో ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తాజాగా ఎస్బీఎస్పీ కూడా అమర్ సింగ్‌ను తమ పార్టీలోకి ఆహ్వానం పలకడం చూస్తుంటే ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే తరఫున బరిలో నిలువనున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌బార్ మంగళవారం వారణాసిలో మీడియాతో మాట్లాడుతూ.. అమర్ సింగ్ ఒక పెద్ద నాయకుడు. ఒకవేళ ఆయనకు ఇష్టమైతే 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అజాంఘడ్ లోక్‌సభ స్థానం(పొత్తులో భాగంగా తమ పార్టీకి వస్తే) నుంచి పోటీ చేయవచ్చన్నారు. అమర్‌సింగ్ వస్తే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అజాంఘడ్ ఎంపీగా ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ ఉన్నారు. మోదీ, యోగిలకే నా మద్దతు: అమర్‌సింగ్ -
అజామ్‌గఢ్ నుంచి అమెరికా వరకు!
ఫ్రాంక్ ఇస్లామ్ ఉన్నట్టుండి వార్తల్లో వ్యక్తి అయ్యారు. కారణం... అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి ఆయనకు ప్రశంసలు లభించడమే. వాషింగ్టన్‌లోని పొటొమ్యాక్లో ఉన్న ఇంద్రభవనం లాంటి ఇస్లామ్ ఇల్లు... చాలామందితో పాటు ఒబామా మనసును కూడా దోచుకుంది. ఒబామా స్వయంగా ఇస్లామ్‌కు ఫోన్ చేసి తెగ మెచ్చుకున్నారు. ఇస్లామ్ ఇంద్ర భవంతిలో ఎన్నో గదులు, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. అయితే వీటితో పాటు ఫ్రాంక్ ఇస్లామ్ కనిపించని కష్టం కూడా ఆ భవనం పునాదులలో ఉంది. ఇస్లామ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే అందరినీ ఆకట్టుకుంటున్న అతడి ఇంటి గురించి మాత్రమే కాదు... సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్న అతని వ్యక్తిత్వాన్ని గురించి కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి... ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌గఢ్‌లో జన్మించారు ఇస్లామ్. అజామ్‌గఢ్ మురికివాడల్లో నుంచి అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ (ఏయంయు) వరకు... అక్కడి నుంచి అమెరికాకు ఇస్లామ్ ప్రయాణం కొనసాగింది. తనకు బాగా ఇష్టమైన ‘ఏయంయు’ నుంచి యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో (అమెరికా) లో చేరారు ఇస్లామ్. అక్కడ చదువు పూర్తి చేసిన తరువాత ఎన్నో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలలో ఉద్యోగం చేశారు. అయితే తనకు ఎప్పుటి నుంచో ఒక కల ఉండేది - సొంతంగా ఒక కంపెనీ స్థాపించాలని! వ్యాపారవేత్తగా రాణించాలని! చేస్తున్న ఉద్యోగం మానేసి 1994లో తన దగ్గరున్న కొద్ది పెట్టుబడితో ‘క్యూయస్యస్’ అనే ఐటీ కంపెనీ ప్రారంభించారు. ‘‘ఉద్యోగం చేయడమంటే ఆ ఉద్యోగం వరకు మాత్రమే ఆలోచిస్తాం. వ్యాపారం అలా కాదు. అనేక రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. అందుకు నేను సిద్ధపడ్డాను’’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు ఇస్లామ్. ‘‘నా దగ్గర పెద్దగా డబ్బు లేదు. సౌకర్యాలు కూడా లేవు. ఆత్మవిశ్వాసం ఉంది. భవిష్యత్తు ఉంది’’ అని గట్టిగా అనుకొని తనకు తాను ధైర్యం చెప్పుకొని ముందుకు కదిలారు ఇస్లామ్. కంపెనీ ప్రారంభించినప్పుడు... ఒకే ఒక ఉద్యోగి. ఆ ఉద్యోగి తానే! ‘సవాలును ఆహ్వానించేవాడే, విజయాన్ని ఆస్వాదించగలడు’ అనేది ఇస్లామ్ నమ్మిన సిద్ధాంతం. అదే ఆయన్ను విజేతను చేసింది. ఒక్కడితో ప్రారంభమైన కంపెనీ పదమూడు సంవత్సరాల తరువాత వేలాది ఉద్యోగుల స్థాయికి చేరుకుంది. వ్యాపారంలో భారీ విజయం సాధించిన ఇస్లామ్, ఆ స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి మరింత ధనం గడించే అవకాశం ఉన్నా...‘ ఇక చాలు’ అనుకున్నారు. ‘ఈ సమాజం నాకు ఎంతో ఇచ్చింది. నేను కూడా దానికి తిరిగి ఇవ్వాలి’ అనుకున్నారు. విజయవంతంగా నడుస్తున్న తన కంపెనీని 2007లో అమ్మేసి అమెరికా, భారత్‌లలో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నారు ఇస్లాం. తాను స్థాపించిన ‘ఫ్రాంక్ ఇస్లాం అండ్ డెబ్బి డ్రైస్మెన్ ఛారిటబుల్ ఫౌండేషన్’ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు సహాయపడడం ప్రారంభించారు. రాజప్రాసాదాన్ని తలపించే ఇంటిని ఉద్దేశించి ‘‘ఇంత ఆడంబరం అవసరమా?’’ అని ఎవరైన ఇస్లామ్‌ని అడిగితే ఆయన మాత్రం తడుముకోకుండా- ‘‘వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చిన వాడు, నల్లచర్మం ఉన్నవాడు కూడా భారీ విజయాలు సాధించగలడు అని చెప్పడానికి నా భవంతి ఒక ప్రతీక’’ అంటారు నవ్వుతూ. చదువు గురించి ఆయన ఎప్పుడూ గొప్పగా చెబుతారు. అందరినీ సమానీకరించే శక్తి చదువుకు ఉందంటారు. ‘‘విద్య అనేది ఇరవై ఒకటవ శతాబ్దపు కరెన్సీ’’ అంటూ ఒబామా చెప్పే మాటను తరచుగా ఉటంకిస్తారు. అజామ్‌గఢ్ నుంచి అమెరికా యూనివర్శిటీలలో చేరే ఎందరో విద్యార్థులకు ఇస్లామ్ అండగా నిలుస్తున్నారు. అజామ్‌గఢ్‌లో ఒక హైస్కూల్, కాలేజి నిర్మాణానికి ప్రణాళిక వేశారు. చదువులో ప్రతిభ చూపుతున్న ఆలీగఢ్ యూనివర్శిటీ, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్నారు. కేవలం విద్యకు సంబంధించిన కార్యక్రమాలకే పరిమితం కాకుండా కళా, సాంస్కృతిక రంగాలలో కూడా ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలను చేస్తున్నారు. మహిళలకు సంబంధించిన రకరకాల సంక్షేమ పథకాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అజామ్‌గఢ్ చుట్టుపక్కల జిల్లాలలో ఎక్కడా ఆడపిల్లల కోసం ప్రత్యేకమైన ‘ఐటిఐ’లు లేవు. దీనిని దృష్టిలో పెట్టుకొని అజామ్‌గఢ్‌లో ‘ఖమ్రూన్ నిస మెమోరియల్ గర్ల్స్ టెక్నికల్ కాలేజీ’’కి శంకుస్థాపన చేశారు. ‘‘అమెరికా సంపన్నుడు ఇస్లామ్ మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు. తన దేశానికి సంబంధించిన అభిమానాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా... చేతల రూపంలోనూ చూపుతున్నారు’’ అంటారు ఇస్లామ్ సన్నిహితులు మెచ్చుకోలుగా. ఒక కుర్రాడు అమెరికాలో చదవడానికి వెళుతుంటే ‘‘ఇస్లామ్లా పెద్ద పేరు తెచ్చుకోవాలి’’ అని దీవించే తల్లిదండ్రులు, ‘‘మనలో పట్టుదల ఉండాలేగానీ... ఏదైనా సాధించవచ్చు’’ అని పిల్లలకు ఇస్లామ్ జీవితాన్ని వ్యకిత్వ వికాస పాఠంగా చెప్పే ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. -
యూపీఏను భూస్థాపితం చేద్దాం: మోడీ
అజంఘడ్ : అవినీతి కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపాలని దేశమంతా కోరుకుంటుందని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం ఉత్తరప్రదేశ్‌లోని అజంఘడ్‌లో ప్రసంగించారు. యూపీఏ పాలనలో సామాన్యుడికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని...పదేళ్లు పాలించిన అవినీతి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. మనకు మంచి రోజులు రాబోతున్నాయని మోడీ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని నరేంద్ర మోడీ ఆరోపించారు. చివరి మూడు దశల ఎన్నికల్లోనూ ఈసీ పక్షపాతం చూపిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు బీజేపీ పార్టీని గెలిపించి దేశ భవిష్యత్తును మార్చాలని బీమోడీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ ను తండ్రి కొడుకులు, దేశాన్ని తల్లీ కొడుకులు నాశనం చేశారని నిప్పులు ఆయన చెరిగారు. -
రెండవ భార్య కొడుకు కోసమే..
బలియా(ఉత్తరప్రదేశ్): సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ చేస్తున్నారని బీఎస్పీ అధినేత్రి మయావతి ఆరోపించింది. ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ పోటి చేస్తున్న ఆజమ్ ఘర్, మెయిన్ పురి లోకసభ స్థానం నుంచి పోటి చేయడంపై రాజకీయంగా రచ్చ రచ్చ జరుగుతోంది. ఓటమి భయంతోనే అనేక రూమర్లు సృష్టిస్తున్నారని మయావతి విమర్శించారు. మెయిన్ పూరి లో ములాయం గెలిస్తే ఆజమ్ ఘఢ్ స్థానాన్ని వదులుకుంటారని, ఈ నియోజకవర్గంలో వ్యక్తిని కాకుండా ఆయన కుటుంబ సభ్యుడినే పోటికి పెడుతారని మయావతి అన్నారు. తన రెండవ భార్యను బుజ్జగించడానికి..వారి కుమారుడు ప్రతీక్ యాదవ్ కు ఆజమ్ ఘడ్ సీటును కట్టబెట్టేందుకు ములాయం ప్రయత్నిస్తున్నారని మాయవతి ఎద్దేవా చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాజ్ వాదీ దుర్వినియోగం చేస్తున్నారని మయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమిత్ షా తీవ్రవాది: లాలూ ప్రసాద్
పాట్నా: నరేంద్ర మోడీ సన్నిహితుడు, గుజరాత్ మాజీ మంత్రి అమిత్ షాపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమిత్ షా తీవ్రవాది అంటూ మండిపడ్డారు. నరేంద్ర మోడీకి కుడిభుజంగా వ్యవహరించిన అమిత్ షా... గుజరాత్, ముజాఫర్‌నగర్ అల్లర్లకు కారకుడని ఆరోపించారు. మతకలహాలు రెచ్చగొట్టడం ద్వారా దేశాన్ని నాశనం చేయాలని వీరు చూస్తున్నారని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో మోడీ, అమిత్ షా నిజస్వరూపాలు బయటపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ తీవ్రవాదుల అడ్డాగా మారిందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ పైవిధంగా స్పందించారు. కాగా, అమిత్ షా వ్యాఖ్యలతో ప్రత్యర్థి పార్టీలు విరుచుకుపడ్డాయి. ఆయనపై ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. -
'ఎన్నికల తర్వాత అన్నయ్యే ప్రధాని'
ఆజమ్ ఘడ్: లోకసభ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి పదవిని ములాయం సింగ్ యాదవ్ చేపడుతారని ఆయన సోదరుడు, సమాజ్ వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ ధీమాను వ్యక్తం చేశారు. అజమ్ ఘడ్ నియోజకవర్గంలోనే కొనసాగుతారని.. మెయిన్ పూరి స్థానాన్ని వదులకుంటారని రాంగోపాల్ యాదవ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని అజమ్ ఘడ్, మెయిన్ పూరి స్థానాల నుంచి లోకసభకు ములాయం పోటీ చేస్తున్నారు. ఆజమ్ ఘడ్ నుంచి గెలిచే ములాయం దేశానికి ప్రధాని అవుతారన్నారు. అయితే ములాయం చెప్పిన దానికి పూర్తి విరుద్దంగా రాంగోపాల్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇటీవల మెయిన్ పూరి స్థానం నుంచి కొనసాగుతానని ములాయం అన్నారు. ఎన్నికల తర్వాత మూడవ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాంగోపాల్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
ఉత్తరప్రదేశ్ కల్తీ మద్యం సంఘటనలో 37 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 37కు పెరిగింది. అజంగఢ్ జిల్లా ముబారక్‌పూర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మరణించిన వారిలో ఎక్కువగా కార్మికులు, పేదలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మద్యం వ్యాపారులు నీళ్లలో స్పిరిట్‌ను కలిపి చౌక ధరకు విక్రయించడం ద్వారా పరిస్థితి విషమించినట్టు అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. జిల్లా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఓం ప్రకాష్ సింగ్‌తో సహా పదిమంది అధికారుల్ని సస్పెండ్ చేసింది. న్యాయ విచారణకు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదేశించారు. -
యూపీలో ప్రచార పర్వానికి తెర తీయనున్న ములాయం
2014 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార సమాజవాది పార్టీ ప్రచార పర్వానికి తెరతీసింది. అందులోభాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా18 ర్యాలీల(బహిరంగ సభ)ల్లో పాల్గొనున్నారు. అందుకోసం ఈ నెల 29న అజాంఘర్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా ములాయం ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని రైతుల, పేద ప్రజలు, కార్మికుల కోసం అఖిలేష్ సింగ్ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఈ ర్యాలీలు ఉపయోగపడతాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ ర్యాలీలకు సంబంధించిన రోడ్డు మ్యాప్ అంతా ఇప్పటికే పూర్తి అయిందని తెలిపారు. అలాగే వివిధ దేశాల్లోని యూపీకి చెందిన ఎన్నారైల ఓట్లు కూడా సమాజవాది పార్టీకే పడేలా చేపట్టవలసిన చర్యలపై ఓ కొర్ కమిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ములాయం పార్టీ వర్గాలకు సూచించారని చెప్పారు. అయితే దేశంలో అత్యధిక లోక్‌సభ సీట్లు గల రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. ఆ రాష్ట్రంలో ఓట్ల కొల్లగొట్టే పనిలో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌లు ఊహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఈ నెల 29న కాన్పూర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ర్యాలీ నిర్వహించి బీజేపీ ప్రచార కార్యక్రమానికి తెరలేపనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ర్యాలీలు నిర్వహించాలని ఇప్పటికే బీజేపీ నిర్ణయించింది. అలాగే కాంగ్రెస్ 8 ర్యాలీలు నిర్వహించనుంది. అందులోభాగంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం అలీఘర్, రామ్పూర్లలో ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.