
ఆజంగఢ్: ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ లోక్‌సభ స్థానానికి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ గురువారం నామినేషన్ వేశారు. తనకు, తన భార్యకు కలిపి రూ. 37 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని అఖిలేశ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ. 7.9 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ. 16.9 కోట్లు, తన భార్య డింపుల్ పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ. 3.68 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ. 9.3 కోట్లు ఉందని వెల్లడించారు. నగదు తన వద్ద రూ. 3.91 లక్షలు, తన భార్య వద్ద రూ. 4.03 లక్షలు ఉందని తెలిపారు. 2014లో ఈ దంపతుల ఆస్తుల విలువ దాదాపు రూ. 24 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment