assets details
-
థాయ్‌లాండ్ ప్రధాని షినవత్రకు రూ.3,431 కోట్ల ఆస్తులు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పెటాంగ్‌తర్న్ షినవత్ర తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. తనకు 400 మిలియన్ డాలర్ల (రూ.3,431 కోట్లు) ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు థాయ్‌లాండ్ జాతీయ అవినీతి నిరోధక కమిషన్(ఎన్‌ఏసీసీ)కు శుక్రవారం డిక్లరేషన్ సమర్పించారు. షినవత్రకు దేశ విదేశాల్లో పెద్ద సంఖ్యలో స్థిరచరాస్తులతోపాటు అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌లు, చేతి గడియారాలు, విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. ఆమె వద్ద 200కుపైగా డిజైనర్ హ్యాంగ్బ్యాగ్లు ఉన్నాయి. వీటి విలువ 2 మిలియన్ డాలర్లు(రూ.17.15 కోట్లు). అలాగే 75 లగ్జరీ చేతి గడియారాల విలువ 5 మిలియన్ డాలర్లు (రూ.42.88 కోట్లు). షినవత్ర 2023 సెప్టెంబర్‌లో 37 ఏళ్ల వయసులో థాయ్‌లాండ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలో అత్యంత పిన్నవయసు్కరాలైన ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఆమె తండ్రి థక్సిన్ షినవత్ర సహా కుటుంబంలో నలుగురు ప్రధానమంత్రులుగా పనిచేశారు. థక్సిన్ థాయ్‌లాండ్‌లో అత్యంత సంపన్నుడిగా రికార్డుకెక్కారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థి: వాహనం, అభరణాలు..గుంట భూమీ లేదు.. కానీ భార్య పేరిట..
సాక్షి, నల్లగొండ: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరిట వాహనాలు ఏమీ లేవు. గుంట భూమి కూడా లేదు. బంగారు ఆభరణాలు లేవు. స్థిర, చరాస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరునే ఉన్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయన ఇచ్చిన అఫిడవిట్లో తన, తన కుటుంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించారు. గోపాలపురం పోలీసు స్టేషన్లో కేసు ఉన్నట్లు తెలిపారు. అలాగే కోర్టుల్లోనూ కేసులు ఉన్నట్లు వివరించారు. తన చేతిలో రూ. 1.5 లక్షలు, తన భార్య వద్ద రూ. 1.08 లక్షలు, అవిభక్త కుటుంబం వద్ద రూ.2,97,026 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరిట రూ. 83 లక్షలకు పైగా వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు ఉండగా, భార్య అరుంధతి పేరిట రూ.1.01 కోట్లు, అవిభక్త కుటుంబం పేరుతో రూ.1.72 కోట్లకుపైగా డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నట్లు వెల్లడించారు. వైడ్ బిజినెస్ సొల్యూషన్స్ పేరుతో రూ.6.4 లక్షలు, హిందూ అవిభక్త కుటుంబం పేరుతో కొత్త పేటలో మహాలక్ష్మి థియేటర్ (ప్రస్తుత విలువ రూ.2.5 కోట్లు), అమిత్ఎంటర్ ప్రైజెస్(రూ.70 లక్షలు) ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున గానీ, తన భార్య పేరున గానీ ఎలాంటి వాహనాలూ లేవని తెలిపారు. తనకు ఆభరణాలు లేవని తెలిపారు. భార్య పేరిట రూ. 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 2.5 లక్షల విలువైన 4 కిలోల వెండి, హిందూ అవిభక్త కుటుంబం పేరిట రూ.8.75 లక్షల విలువైన 175 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు సుఖేందర్‌రెడ్డి వివరించారు. భార్య పేరిట చిట్యాల, కేశంపల్లిలో 7.48 ఎకరాల వ్యవసాయ భూమి, ఫిలీంనగర్‌లో 2389.5 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కలుపుకొని వాణిజ్య భవనం, చిట్యాలలో 3888 చదరపు అడుగుల వాణిజ్య భవనం ఉన్నట్లు పేర్కొన్నారు. పుప్పాలగూడలో 473 చదరపు అడుగుల నివాస భవనం, చిట్యాలలో 3,600 చదరపు అడుగుల నివాస భవనం ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా వాటి విలువ రూ.5,89,13,480గా పేర్కొన్నారు. ఆయనకు చెందిన హిందూ అవిభక్త కుటుంబం పేరుతో ఊరుమడ్ల, దేవరకొండలో 39.72 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు వెల్లడించారు. ఊరుమడ్ల గ్రామకంఠంలో నాలుగు గుంటలు, మామిళ్లగూడ, నందిపహడ్లో 1012 చదరపు గజాల వ్యవసాయేతర భూములు ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తన పేరిట రూ.36,57,500, భార్య పేరిట రూ.1,20,04,000, హిందూ అవిభక్త కుటుంబం పేరుతో రూ.1,32,07,566 లోన్లు తీసుకున్నట్లు తెలిపారు. · భార్య పేరిటనే స్థిరాస్తులు · ఎమ్మెల్సీ నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్న సుఖేందర్‌రెడ్డి -
రూ.301 కోట్లపైనే.. టీఆర్ఎస్ ఆస్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి రూ.301.47 కోట్ల ఆస్తులు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి నివేదిక సమర్పించింది. తమ పార్టీ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన 2019–20 ఆడిట్ నివేదికను గత ఫిబ్రవరి 15న టీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆదాయ వ్యయాలకు సంబంధించిన వార్షిక నివేదికను సీఈసీ ఇటీవల తన వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. 2018–19లో రూ.188.73 కోట్లుగా ఉన్న టీఆర్ఎస్ నిధులు, ఆస్తు ల విలువ ఏడాది కాలంలో రూ.301.47 కోట్లకు చేరింది. ఇందులో జనరల్ ఫండ్ రూపంలో రూ.292.30 కోట్లు, కార్పస్ ఫండ్ రూపంలో రూ.4.76 కోట్లు, ఇతర రూపంలో రూ.4.41 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. పార్టీ పేరిట ఉన్న భవనాలు, వస్తు సామగ్రి విలువ రూ.21.27 కోట్లుగా ఉందని పార్టీ వెల్లడించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జిల్లా కార్యాలయాల స్థలం, భూముల విలువ సుమారు రూ.16.50 కోట్లుగా ఉంటుందని లెక్కలు వేసింది. 2019–20లో స్థిరాస్తుల కొనుగోలు, షెడ్యూలు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ తదితరాల రూపంలో రూ.101 కోట్లు సమకూరాయి. పార్టీ విరాళాలు రూ. 89.55 కోట్లు 2019–20 ఆర్ధిక సంవత్సరంలో టీఆర్ఎస్కు వి విధ మార్గాల్లో రూ.130.46 కోట్లు సమకూరగా, అందులో విరాళాల రూపంలో అత్యధికంగా రూ. 89.55 కోట్లు అందాయి. పార్టీ సభ్యత్వ నమోదు, పార్లమెంటరీ, లెజిస్లేటివ్ పార్టీ, టీఆర్ఎస్వీ విభాగాల నుంచి కలుపుకుని రూ.22.79 కోట్లు, బ్యాంకుల్లో సెక్యూరిటీ డిపాజిట్లు, సేవింగ్ ఖాతా లపై వడ్డీ తదితరాల రూపంలో మరో రూ.18.10 కోట్లు సమకూరాయి. విరాళాల్లో ఎలక్టోరల్ బాం డ్ల రూపంలో రూ.89.15 కోట్లు, వ్యక్తిగత దాతల నుంచి రూ.37.42 లక్షలు వచ్చాయి. ప్రకటనల కు రూ.2.69 కోట్లు, ప్రచారానికి రూ.4.94 కోట్లు కలుపుకుని మొత్తంగా ఎన్నికల కోసం రూ.7.64 కోట్లు ఖర్చు చేసింది. వీటితోపాటు పార్టీ కార్యా లయాల్లో ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులు కలుపుకుని ఏడాది కాలంలో రూ.21.18 కోట్లు పార్టీ అవసరాల కోసం ఖర్చు చేశారు. -
సొంత కారులేదు.. అప్పులూ లేవు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సగటు వేతన జీవిలా తనకు వచ్చే వేతనాన్ని బ్యాంకు ఖాతాల్లో, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో భద్రంగా దాచుకుంటున్నారు. ఆదాయ పన్ను మినహాయింపు కోసం ఆయన ఎక్కువగా తనకి వచ్చే వేతనాన్ని నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), జీవిత బీమా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల రూపంలో ఉంచుతున్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఆయన ఆదాయంలో రూ.36.53 లక్షలు పెరుగుదల కనిపించింది. మోదీ తాజాగా తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి ప్రధాని మొత్తం ఆస్తుల విలువ రూ.2.85 కోట్లుగా ఉంది. గత ఏడాది రూ.2.49 కోట్ల చరాస్తులుంటే ఏడాదిలో 26.26% పెరుగుదల కనిపించింది. ► మోదీ నెల జీతం రూ. 2 లక్షలు. అందులో కరోనా సాయం కింద 30% ఆయన వేతనంలోంచి కట్ అవుతోంది. ► ప్రధాని సేవింగ్స్ అకౌంట్లో రూ. 3.38 లక్షలు ఉన్నాయి. నగదు రూపంలో ఆయన దగ్గర రూ.31,450 మాత్రమే ఉన్నాయి. ► గుజరాత్ గాంధీనగర్‌లోని ఎస్బీఐ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ.1.60 కోట్ల ఉన్నాయి ► నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ రూపంలో రూ. 8.5 లక్షలు. రూ. 7.61 లక్షలు ఉన్నాయి. జీవిత బీమా పథకం కింద రూ.1.51 లక్షలు, రూ.1.90 లక్షలు కడుతూ ఉంటారు. ► నాలుగు బంగారం ఉంగరాలు ఉన్నాయి. 45 గ్రాముల బరువుండే వాటి విలువ రూ1.5 లక్షలుగా ఉంది. ► గాంధీనగర్‌లో పూర్వీకుల నుంచి వచ్చిన ఇల్లు, స్థలం ఉన్నాయి. వాటి విలువ రూ.1.1 కోట్లు. కుటుంబ సభ్యులతో పాటు మోదీకి ఆ ఇంట్లో 25% హక్కు ఉంది. ► ప్రధానికి సొంత కారు లేదు. అప్పులు కూడా లేవు. అమిత్ షా ఆస్తులు తగ్గాయ్ ! కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆస్తుల విలువ గత ఏడాదితో పోల్చి చూస్తే స్వల్పంగా తగ్గింది. షేర్ మార్కెట్లో డబ్బులు ఉంచడంతో ఆయనకి ఉన్న చరాస్తుల్లో తగ్గుదల కనిపించింది. గత ఏడాది అమిత్ షా వద్ద రూ. 32.3 కోట్లు ఉంటే ఈ ఏడాది రూ. 28.63 కోట్లకి తగ్గిపోయాయి. ఇక రూ.13.56 కోట్ల విలువైన స్థిరాస్తులు షా పేరు మీద ఉన్నట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. షా బ్యాంకు ఖాతాలో రూ.1.04 కోట్లు ఉంటే ఆయన దగ్గర నగదు రూపంలో రూ.15,814 ఉన్నాయి. రూ.44.47 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. -
ఐదేళ్లలో పెరిగిన కేజ్రీవాల్ ఆస్తులు..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనకు మొత్తం రూ 3.4 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. 2015లో కేజ్రీవాల్ ఆస్తులు రూ 2.1 కోట్లుగా కాగా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఆస్తులు రూ 1.3 కోట్లు వృద్ధి చెందాయి. న్యూఢిల్లీ స్ధానానికి కేజ్రీవాల్ నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపిన వివరాల ప్రకారం ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ పేరిట ఉన్న నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు 2015లో రూ 15 లక్షల నుంచి 2020కి రూ 57 లక్షలకు పెరిగాయి. సునీతా కేజ్రీవాల్‌కు రూ 32 లక్షల విలువైన నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు వాలంటరీ రిటైర్మెంట్ ప్రయోజనాల కింద రాగా, మిగిలిన మొత్తం ఆమె సేవింగ్స్‌గా చూపారు. ఇక కేజ్రీవాల్ పేరిట 2015లో చూపిన నగదు, ఫిక్స్డ్ డిపాజిట్ల విలువ 2015లో రూ 2.2 లక్షల నుంచి 2020కి రూ 9.6 లక్షలకు పెరిగాయి. గత ఐదేళ్లలో కేజ్రీవాల్ స్ధిరాస్తులు రూ 92 లక్షల నుంచి రూ 1.7 కోట్లకు పెరిగాయి. 2015లో ఆయనకు ఉన్న ఆస్తుల విలువ పెరగడం వల్లే ఇది సాధ్యమైందని ఆప్ నేతలు చెబుతున్నారు. చదవండి : 6 గంటలు కేజ్రీ వెయిటింగ్ -
దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) స్కామ్‌లో నిందితురాలు దేవికారాణి ఆస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఆమె వందకోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్టు అధికారులు వెల్లడించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆమెకు భారీగా స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. దేవికారాణి అక్రమాల్లో ఆమె భర్త గురుమూర్తి (రిటైర్డ్ సివిల్ సర్జన్) సహకరించినట్లు అధికారులు తెలిపారు. ఆస్తులు వివరాలు ఇవే.. నారాయణగూడలోని ఇండియన్ బ్యాంక్‌లో దేవికారాణికి చెందిన రూ. 34లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. వేర్వేరుగా 23 బ్యాంకుల్లో రూ. కోటీ 23 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్టు తెలిపారు. దేవికారాణి ఇంట్లో రూ. 25.72 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఇంట్లో రూ. 8.40 లక్షల నగదు, రూ. 7లక్షల ఎలక్ట్రానిక్ వస్తువులు, రూ. 20 లక్షల ఇన్నోవా కారు, రూ. 60 వేల మోటర్ బైక్‌ను సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు వేర్వేరు చోట్ల రూ.15 కోట్ల అక్రమాస్తులు గుర్తించామని అన్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 100 కోట్లపైగా ఉంటుందన్నారు. పీఎంజే జ్యువెల్లర్స్ కు రూ.7.3 కోట్లు చెల్లించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
సన్నీడియోల్ @ 87 కోట్లు
చండీగఢ్/గురుదాస్‌పూర్: గదర్, ఘాయల్, బోర్డర్ చిత్రాలతో బాలీవుడ్ సినిమాలలో తనదైన ముద్ర వేసిన నటుడు, దర్శకుడు, నిర్మాత సన్నీడియోల్ సోమవారం గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలతోపాటు ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించారు. తన పేరుమీద, తన భార్య పేరు ఉన్న మొత్తం ఆస్తులను రూ. 87.18 కోట్లుగా ప్రకటించారు. రూ. 60.46 కోట్ల చరాస్తులు, రూ. 21కోట్ల స్థిరాస్తులను ఆయన చూపించారు. 2017–18లో ఆదాయాన్ని రూ. 63,82 లక్షలు, 2016–17లో వార్షికాదాయం 96.29 లక్షలు, 2015–16లో వార్షికాదాయం రూ. 2.25 కోట్లుగా ప్రకటించారు. తన బ్యాంకు ఖాతాలో రూ. 26 లక్షలు ఉన్నాయని, తన భార్య లిండా డియోల్ బ్యాంకు ఖాతాలో రూ. 16 లక్షల నగదు ఉందని తెలిపారు. -
ప్రధాని మోదీ ఆస్తులివే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు 2014 నుంచి 2019 వరకూ 52 శాతం పెరిగాయి. వారణాసిలో మోదీ శుక్రవారం నామినేషన్ వేసిన సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో తన ఆస్తులను వెల్లడించారు. చరాస్తుల్లో అధిక భాగం ఎస్బీఐలోని రూ 1.27 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. అఫిడవిట్లో తన ఆస్తుల విలువ మొత్తం రూ 2.51 కోట్లుగా ప్రధాని వెల్లడించారు. వీటిలో చరాస్తులు రూ 1.41 కోట్లు కాగా, స్ధిరాస్తులను రూ 1.10 కోట్లుగా చూపారు. మోదీ చరాస్తులు 2014తో పోలిస్తే 114 శాతం పెరిగాయి. 2014లో ఆయన తన చరాస్తుల విలువ రూ 65.91 లక్షలుగా చూపారు. ప్రధాని ప్రధాన ఆదాయ వనరు వేతనం కాగా, పొదుపు ఖాతాపై వడ్డీల నుంచి ఆదాయం సమకూరుతోంది. ఇక తనపై ఎలాంటి క్రిమినల్ ఆరోపణలు లేవని, అప్పులు కూడా లేవని అఫిడవిల్‌లో పేర్కొన్నారు. చరాస్తుల్లో రూ 38,750 చేతిలో నగదు కాగా, బ్యాంకులో కేవలం రూ 4,143 బ్యాలెన్స్ ఉన్నట్టు చూపారు. ఎస్బీఐలో రూ 1.27 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని అఫిడవిట్లో పొందుపరిచారు. ఇక 2014లో చేతిలో నగదు రూ 32,700, బ్యాంక్ బ్యాలెన్స్ రూ 26.05 లక్షలు, రూ 32.48 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టు అఫిడవిట్లో మోదీ చూపారు. -
అఖిలేశ్ ఆస్తులు 37 కోట్లు
ఆజంగఢ్: ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ లోక్‌సభ స్థానానికి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ గురువారం నామినేషన్ వేశారు. తనకు, తన భార్యకు కలిపి రూ. 37 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని అఖిలేశ్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తన పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ. 7.9 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ. 16.9 కోట్లు, తన భార్య డింపుల్ పేరిట ఉన్న చరాస్తుల విలువ రూ. 3.68 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ. 9.3 కోట్లు ఉందని వెల్లడించారు. నగదు తన వద్ద రూ. 3.91 లక్షలు, తన భార్య వద్ద రూ. 4.03 లక్షలు ఉందని తెలిపారు. 2014లో ఈ దంపతుల ఆస్తుల విలువ దాదాపు రూ. 24 కోట్లు. -
సొంత ఇల్లులేని జస్టిస్ గొగోయ్..
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తనకు ఇల్లు, వాహనం, ఆభరణాలు వంటి ఆస్తులేమీ లేవని ప్రకటించారు. అక్టోబర్ 1న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ దీపక్ మిశ్రా తనకు ఒక ఫ్లాట్, కొన్ని బంగారు ఆభరణాలున్నాయని వెల్లడించగా ఆయన స్ధానంలో ప్రధాన న్యాయమూర్తి పగ్గాలు చేపట్టిన రంజన్ గొగోయ్ మాత్రం తనకెలాంటి ఆస్తులు లేవని ప్రకటించారు. జస్టిస్ రంజన్ గొగోయ్‌చే సుప్రీం కోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గొగోయ్ తన డిక్లరేషన్‌లో తనకు ఇల్లు, వాహనం, బంగారు ఆభరణాలు లేవని, తన పెళ్లి సమయంలో భార్యకు పుట్టింటి నుంచి కొన్ని ఆభరణాలు లభించాయని పేర్కొన్నారు. అసోం మాజీ సీఎం కేశవ్ చంద్ర గొగోయ్ కుమారుడైన రంజన్ గొగోయ్‌కు సొంత వ్యక్తిగత వాహనం లేకపోవడం గమనార్హం. ఆయన పేరుతో ఎలాంటి బ్యాంకు రుణాలు కూడా లేవు. సుప్రీం కోర్టు వెబ్సైట్లో పొందుపరిచిన ఆస్తుల వివరాల ప్రకారం జస్టిస్ గొగోయ్‌కు రెండు బ్యాంకు ఖాతాల్లో రూ 6.5 లక్షల నగదు నిల్వలు, రూ 16 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, 1999లో తీసుకున్న రూ 5 లక్షల విలువైన ఎల్ఐసీ పాలసీలున్నాయి. ఆయనకు ఎలాంటి బంగారు ఆభరణాలు లేకున్నా భార్య పేరిట 150 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
మోదీ ఆస్తి వివరాలు: సొంత కారు కూడా లేదు
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖల ఆస్తుల వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి సామాన్య ప్రజల్లో ఉండటం సహజమే. అదే తనను చాయ్‌వాలాగా చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ గురించి అయితే ఆసక్తి మరి ఎక్కువగా ఉంటుంది. అయితే తాజాగా పీఎంవో మోదీ ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా ప్రకటించింది. మార్చి 31,2018 వరకు ఉన్న లెక్కల ప్రకారం ఈ వివరాలను వెల్లడించింది. మోదీ ఆస్తుల విలువ రెండున్నర కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉన్నట్టు పీఎంవో పేర్కొంది. వివిధ బ్యాంకుల్లో కోటి రూపాయల నగదు ఉండగా.. మోదీ వద్ద 50వేల రూపాయల నగదు ఉన్నట్టు పేర్కొంది. మోదీకి సొంతంగా ఒక కారు గానీ, బైకు గానీ లేవని తెలిపింది. అలాగే ఆయన పేరు మీద ఎటువంటి రుణాలు లేవని స్పష్టం చేసింది. పీఎంవో వెల్లడించిన వివరాలు: మోదీ వద్ద ఉన్న నగదు- రూ. 48,944 గాంధీనగర్ స్టేట్ బ్యాంక్‌లో డిపాజిట్- రూ.11,29,690 మరో ఎస్బీఐ అకౌంట్లో- రూ.1,07,96,288 ఎల్ అండ్ టీ ఇన్ఫ్రా బాండ్(ప్రస్తుత విలువ)- రూ. 20,000 జాతీయ పొదుపు పత్రం బాండ్ విలువ- రూ. 5,18,235 జీవిత బీమా పాలసీ- రూ. 1,59,281 మోదీ వద్ద ఉన్న బంగారం విలువ(కేవలం 4 ఉంగరాలు) - రూ.1,38,060 స్థిరాస్తుల విషయానికి వస్తే.. గాంధీనగర్‌లోని ఓ నివాస గృహంలో మోదీకి నాలుగో వంతు వాటా ఉంది. దీనిని ఆయన 2002లో 1,30,488 రూపాయలకు కొనుగోలు చేశారు. తర్వాత దానిపై 2,47,208 రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం దాని విలువ కోటి రూపాయలు ఉన్నట్టు పీఎంవో తెలిపింది. -
సగంమంది జడ్జీల ఆస్తుల వివరాల్లేవు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీలందరూ వారి ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలని స్వయంగా సుప్రీంకోర్టే ఆదేశించిన సగం మంది జడ్జీల ఆస్తుల వివరాలు వెబ్సైట్లో లేవు. సీజేఐసహా సుప్రీంలో 23 మంది జడ్జీలుండగా, 12 మంది ఆస్తుల వివరాలే వెబ్సైట్లో ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, ఆ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తులైన జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఏకే సిక్రీల ఆస్తుల వివరాలు వెబ్సైట్లో ఉన్నాయి. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ అశోక్ భూషణ్‌లు కూడా ఆస్తుల వివరాలను వెల్లడించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా స్వచ్ఛందంగా ఆస్తుల వివరాలు బహిర్గత పరచాలని 2009, ఆగస్టు 26న సుప్రీంకోర్టు ఆదేశించింది. -
చినబాబు లెక్కలు.. బుస్.. బుస్... బోగస్
సాక్షి, విజయవాడ : ఎవరూ అడగటం లేదు.. ప్రకటన చేశాక ఎవరూ పట్టించుకోరు... అయినాగానీ ఆస్తుల ప్రకటన పేరిట నారా వారి ఫ్యామిలీ చేసే డ్రామా అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఈ ఏడాదికిగానూ నారా లోకేష్ ఆస్తుల వివరాలను వెల్లడించగా.. ఆ ప్రకటన ఎంత చిత్ర-విచిత్రంగా ఉన్నాయో ఓసారి చూద్దాం. వేల కోట్ల రూపాయిలు విలువ చేసే ఆస్తులను వందల కోట్ల లోపే చూపిస్తూ.. పైగా మార్కెట్ విలువ అంటూ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చినబాబు బాగానే చేశాడు. జూబ్లీహిల్స్ లో వందలకోట్ల విలువైన ఇంటి గురించి మాట మాత్రం ప్రస్తావించని లోకేష్.. మదీనా గూడలోని కొన్ని వందల కోట్లు విలువ చేసే పదెకరాల భూమి విలువను కేవలం 73 లక్షల రూపాయలుగా చూపించటం గమనార్హం. ఇక ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా 300 కోట్ల రూపాయాల ఆస్తులను చూపించిన లోకేష్ ఇప్పుడు కేవలం 15 కోట్ల రూపాయిలు అని చెప్పటం ఆశ్చర్యకరమే. తల్లి భువనేశ్వరి పేరు మీద ఉన్న పంజాగుట్టలో ఉన్న ఇల్లు, తమిళనాడులోని కోట్ల విలువైన భవనాలు, భూముల ప్రస్తావన మచ్చుకైనా కనిపించలేదు. భార్య బ్రాహ్మిణి పేరు మీద జూబ్లీహిల్స్, మణికొండ, చెన్నైలో ఉన్న వందల కోట్ల ఫ్లాట్లు, ఫ్లాట్ల విలువ కూడా తప్పుడు లెక్కలతోనే కూడికుని ఉంది. ఇక తనయుడు మూడేళ్ల దేవాన్ష్ ఆస్తి రూ.11.54 కోట్లుగా పేర్కొన్నాడు. వీటన్నింటిని మించి నారా చంద్రబాబు నాయుడు నికర ఆస్తి రూ.2.53 కోట్లు అని ప్రకటించి తమ ఇంట్లో అత్యంత పేద వ్యక్తి తన తండ్రేనని ప్రకటించి సంభ్రమాశ్చర్యాలకు లోను చేశాడు. ముందు హామీలను నెరవేర్చండి : ఎంపీ మిథున్‌రెడ్డి చిత్తూరు : నారా లోకేష్ ఆస్తుల ప్రకటనపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి స్పందించారు. ‘ఆస్తుల వివరాలు ఎవరూ అడగటం లేదు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. అన్నింటికి మించి పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యండి’ అని ఆయన సూచించారు. -
ఆస్తుల వివరాలు ప్రకటించిన లోకేశ్
-
మా ఆస్తులు ఇవే: నారా లోకేశ్
సాక్షి, అమరావతి: తమ కుటుంబానికి ప్రధానంగా హెరిటేజ్ నుంచే ఆదాయం వస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన తమ కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. తన తండ్రి, సీఎం చంద్రబాబు ఆస్తుల్లో పెద్దగా మార్పుల్లేవని ఆయన చెప్పారు. తన తండ్రికి రూ. 4 కోట్ల విలువైన స్తిరాస్థి ఉండగా, రూ. 3.58 కోట్ల అప్పులు ఉన్నాయని అని వెల్లడించారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఆస్తుల విలువ మారుతూ వస్తుందన్నారు. హైదరాబాద్‌లో తమకు ఉన్న ఇల్లు కూల్చి కొత్తది కట్టామని, దీనికి రూ. 4 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) రూ. 30 లక్షలు పెరిగిందని, బ్యాంకు రుణాలు రూ. 5 కోట్లకు పెరిగాయని తెలిపారు. తమపై ఆరోపణలు చేసేవారు ముందుగా వారి ఆస్తులు ప్రకటించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. లోకేశ్ ప్రకటించిన ఆస్తుల వివరాలు చంద్రబాబు నికర ఆస్తుల విలువ రూ. 2.53 కోట్లు భువనేశ్వరి నికర ఆస్తుల విలువ రూ. 25 కోట్లు లోకేశ్ ఆస్తులు రూ.15.20 కోట్లు బ్రాహ్మణి ఆస్తుల విలువ 15 కోట్లు దేవాన్ష్ ఆస్తుల విలువ రూ.11.54 కోట్లు -
పాక్ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల సంఘం తీవ్ర సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్తుల వివరాలు వెల్లడించని మొత్తం 261 మంది ప్రజాప్రతినిధులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌కు గురైన ప్రముఖుల్లో మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అల్లుడు, పాకిస్తాన్ ముస్లిం లీగ్ సభ్యుడు కెప్టెన్ మహ్మద్ సఫ్దర్, పాకిస్తాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన, ఎంపీ అయేషా గులాలయ్ మత వ్యవహారాల శాఖ మంత్రి సర్దార్ యూసఫ్, పార్లమెంట్ మాజీ స్పీకర్ ఫెహ్మిదా మిర్జా కూడా ఉన్నారు. ఈసీ వేటుకు గురైన వారిలో ఏడుగురు సెనేటర్లు, ఎంపీలు 71 మంది, పంజాబ్ అసెంబ్లీ సభ్యులు 84 మంది, సింధ్ అసెంబ్లీ సభ్యులు 50 మంది, ఖైబర్-ఫఖ్తున్‌ఖ్వాకు చెందిన 38 మంది, బలోచిస్తాన్ సభ్యులు 11 మంది ఉన్నారు. ప్రజాప్రతినిధులు, వారి కుటుంసభ్యులు తమ ఆస్తుల వివరాలు సెప్టెంబర్ 30వ తేదీలోగా వారి ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఎన్నికల సంఘం గడువు గతంలో విధించింది. అవినీతిని రూపు మాపుతానంటూ గత పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్ తెచ్చిన ఈ చట్టంతో ఎటువంటి ప్రయోజనం లేదని ఇప్పటికే రుజువైందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులంతా ప్రతి ఏటా తమ ఆస్తుల వివరాలను ఈసీకి వెల్లడించాల్సి ఉంటుంది. అయితే, సస్పెన్షన్‌కు గురైన వారంతా ఎన్నికల సంఘానికి తమ ఆస్తుల వివరాలు అందజేస్తే వారిపై ఎటువంటి చర్యలు ఉండవు. -
‘అమ్మో’ ఆస్తుల చిట్టా
సాక్షి, చెన్నై : అవినీతి కేసులో దోషిగా ముద్ర పడ్డ తమిళనాడు పురట్చి తలైవీ, అందరి నోట అమ్మగా పిలిపించుకునే అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఆస్తుల చిట్టా వెలుగులోకి వచ్చింది. జయ అండ్ కో.. అవినీతి సొమ్ముతో అప్పట్లో చిన్న చిన్న పొదుపు పథకాలు అన్నట్టుగా ఆస్తుల్ని కొనుగోలు చేసి...వాటిని ఇప్పుడు పెద్ద మొత్తాల్లో తమ ఖాతాలో వేసుకుని ఉండటం బయట పడింది. పురట్చి తలైవి జయలలిత అవినీతి కేసులో దోషి అంటూ కర్ణాటక ప్రత్యేక కోర్టు ముద్ర వేసిందో లేదో, తమిళనాట విధ్వంస కాండ ఆరంభమైంది. అన్నాడీఎంకే వర్గాలు ఆగ్రహంతో ఊగిపోతోంటే, జయలలిత అండ్ కో గడించినట్టుగా పేర్కొంటున్న ఆస్తుల చిట్టాను డీఎంకే అనుబంధ మీడియా, కొన్ని వెబ్ మీడియాలు వెలుగులోకి తెచ్చాయి. ఈ చిట్టాను చూసిన వాళ్లంతా...వామ్మో ...అమ్మరూ.మ్మో అంటూ ముక్కు మీద వేలేసుకోక తప్పడం లేదు. కోర్టులో సీబీఐ సమర్పించిన ఆధారాల మేరకు ఆ చిట్టాను బయట పెట్టారా? అన్నది ప్రశ్నార్థకమే. ఆ వివరాల మేరకు సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, బంధవులు సుధాకరన్, ఇళవరసి బృందం చిన్న చిన్న ఆస్తుల్నే లక్ష్యంగా చేసుకుని చాకచక్యంగా కొనుగోలు చేయటం వెలుగు చూసింది. అత్యధికంగా స్థలాల మీద, భవనాల మీదే అవినీతి సొమ్మును పెట్టుబడిగా పెట్టినట్టు కనిపిస్తోంది. చిన్న చిన్న పొదుపు పథకాలే, భవిష్యత్తులో పెద్ద మొత్తాలు అన్నట్టుగా, అప్పట్లో చిన్న చిన్న స్థలాలు, భవనాల మీద తమ పెట్టుబడిని పెట్టి ఉండటం గమనార్హం. ఆ చిట్టా మేరకు వివరాలు. చెన్నై పోయేస్ గార్డెన్లో పది గ్రౌండ్ల స్థలం, ఇళ్లు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో 651.18 చ.మీటర్ల భవనం ఉంది. హైదరాబాద్ సమీపంలోని జీడిమిట్ల, బషీరాబాద్ గ్రామాల్లో రెండు ఫామ్ హౌస్‌లు, కార్మికుల కోసం ఇళ్లు, బషీరాబాద్‌లో 11.35 ఎకరాల్లో ద్రాక్ష తోట ఉంది. అలాగే, మేడ్చల్ సమీపంలోని 3.15 ఎకరాల స్థలం ఉంది. తమిళనాడులో చెయ్యార్ గ్రామం 5.6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. చెన్నై పట్టాల్ మ్మాల్ వీధిలో ఓ నివాస భవనం. శాంతోమ్‌లో ఆర్ఆర్ బహుళ అంతస్తుల భవనం. అన్నా సాలైలో ఓ షాపింగ్‌మాల్‌లో దుకాణం ఉంది. చెన్నై నుంగంబాక్కం ఖాదర్ నవాజ్ కాన్ రోడ్డులో 11 గ్రౌండ్ల స్థలంలో వాటా కలిగిఉన్నారు. చెన్నై సెయింట్ మేరీస్ రోడ్డులో 1,206 చ.అడుగుల భవనం, చెన్నై అన్నా సాలైలో 180 చదరపు అడుగుల దుకాణం, మైలాపూర్ 1,756 చదరపు అడుగుల స్థలం ఉంది. తంజావూరు మనంబూర్ చాడిలో 2400చ.అ., ఆరో వార్డులో 51వేల చ.అ. ఖాళీ స్థలం. మనంబూర్లో చావడి బ్లాక్ రోడ్డులో 8970 చ.అ. ఖాళీ స్థలం ఉంది. తిరుచ్చి పెన్నగరం, అభిషేక పురం గ్రామంలో 3,525 చ.అ స్థలం, గృహాలు, తోటలు ఉన్నాయి. తంజావూరు జిల్లా సుందర కోట గ్రామంలో 3.23 ఎకరాల స్థలం ఉంది. మన్నార్ కుడిలో 25,035. చ.అడుగుల్లో భవనం. చెనై గిండి తిరువికా ఎస్టేట్‌లో 5,658 చ.అడుగుల భవనం, మైలాపూర్‌లో ఒక గ్రౌండ్ స్థలం, చెన్నై పరింగి మలైలో 4804.60 చ.అడుగల్లో భవనం, తిరువికా ఎస్టేట్‌లో ఏడు ఎకరాల స్థలం ఉంది. చెన్నై కాదర్ నవాజ్ ఖాన్ రోడ్డులో 1756. చ.అడుగుల్లో భవనం, నుంగంబాక్కం 532 చ.అ. మరో భవనం ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆంజనేయ తోట్టంలో 222.92 చ. మీ స్థలంలో భవనం ఉంది. గిండి తిరువికా ఎస్టేట్‌లో 12,462,172 చ.అ. స్థలం, భవనం ఉన్నాయి. చెన్నై అన్నానగర్‌లో ఇలవరసి పేరిట ఉన్న భవనం విలువ అప్పట్లో రెండు లక్షల 35 వేలు. తిరువికా ఎస్టేట్‌లో 63 ఎకరాలు, 495 చ.అడుగుల్లో పెంట్ హౌస్, అలాగే, 1155 చ.అడుగుల్లో మరో పెంట్ హౌస్ తరహా ప్లాట్ ఉన్నాయి. చెన్నై అభిరామ పురంలో 1405 చ.అ. భవనం ఉంది. వేలగాపురం, చెయ్యూర్ గ్రామంలో అక్కడక్కడ ఒక్కో సర్వే నెంబర్లో 3 నుంచి 4 ఎకరాల మేరకు వ్యవసాయ స్థలాలు కొనుగోలు చేశారు. చెన్నై ఈక్కాట్టు తాంగల్ రింగ్ రోడ్డులో ఆంజేయ ప్రింటర్స్ నెలకొల్పారు. చెన్నై నీలాంకరైలో 4802 చ.అ.స్థలంలో భవనం నిర్మించారు. టీ నగర్ పద్మనాభ వీధిలో ఒక గ్రౌండ్ స్థలంలో 1086 చ.అ. భవనం, అదే వీధిలో వేర్వేరు సర్వే నెంబర్లలో చిన్న చిన్న భవనాల్ని కొనుగోలు చేశారు. సిరుదావూర్ గ్రామంలో ఓ చోట 11 ఎకరాల 83 సెంట్లు, మరో చోట 11 ఎకరాల 22 సెంట్లు, ఇంకో చోట పది ఎకరాల 86 సెంట్లు స్థలాలు చొప్పున మొత్తంగా 75 ఎకరాలు ఉన్నాయి. కరింగి పల్లం గ్రామంలో 48.2 ఎకరాల స్థలం ఉంది. చెన్నై టీటీకే రోడ్డులో ఒక భవనం, శ్రీరాం నగర్లో 3,705 చదరపు అడుగుల స్థలం ఉంది. ఈజంబాక్కంలో 1.29 ఎకరాలు, షోలింగనల్లూరులో 16.75 సెంట్లు, చెన్నై అడయార్‌లో 6.75 సెంట్ల స్థలం, మరో సర్వే నెంబర్లో 16.50 సెంట్ల స్థలం ఉంది. శ్రీమతి గాయత్రి చంద్రన్ పేరిట 3.35 లక్షలు విలువగల స్థల కొనుగోలుకు డిమాండ్ డ్రాఫ్ట్ ఇచ్చారు. షోలింగ నల్లూరు ఆర్ఎస్వోలో 16.75 సెంట్ల స్థలం ఉంది. అలాగే, ఇక్కడ రూ.2,35,200 విలువతో టికే చంద్ర వదనం పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ ఇచ్చారు. నుంగబాక్కం వాల్టాస్ తోట్టంలో విభజించాల్సిన 1087 చ.అ. ఖాళీ స్థలం, ఓ బంగ్లా ఉంది. వెట్వాంగనిలో 34 సెంట్ల స్థలం, మైలాపుర్ లజ్ రోడ్డులో బంగ్లా, టీ నగర్లో 4800 చ. భవనం ఉన్నాయి. సేరకులం 53 ఎకరాలు ,, కరుంగులి గ్రామంలో పలు చోట్ల స్థలాలు కొనుగోలు చేసి ఉన్నారు. తిరువెంగడం కాలనీలో 4,350 చ. అడుగుల్లో స్థలం, ఇళ్లు, ఈజంబాక్కంలో 37 సెంట్లు, టీటీకే రోడ్డులో 733 చ.అ.ప్లాట్ ఉన్నాయి. పయనూర్ గ్రామంలో 5.87 ఎకారల స్థలం, అరుంబాక్కంలో 3,197 చ.అ.స్థలం, ఊరుర్ గ్రామంలో పరమేశ్వర నగర్లో స్థలాలు ఉన్నాయి. సేరావూర్ గ్రామంలో పలు చోట్ల చిన్న చిన్న స్థలాలుగా 73 ఎకరాలను కొనుగోలు చేశారు. కాంచీపురం జిల్లా ఊత్తుకాడులో 12.70 ఎకరాల స్థలం, మరో చోట 14.42 ఎకరాల స్థలం, చెయ్యారు కలవైలో 6.98 ఎకరాల స్థలం, వల్లకులం 55 ఎకరాలు, అదే గ్రామంలో మరో చోట 57 ఎకరాలు ఉంది. టీ నగర్ హబీబుల్లా రోడ్డులో 4.293 చ.అ., 3472 చ.అ. భవనాలు ఉన్నాయి. సేర కులంలో 48 ఎకరాలు, వల్లకులం 54.98 ఎకరాలు, మీర్ కులం 54.98 ఎకరాలు, సేర కులంలో మరో చోట 130 ఎకరాలు, వందపాళయం 62.63 ఎకరాలు, అదే చోట రామరాజ్ ఆగ్రో మిల్కు చెందిన ఆరు లక్షల వాటాలు, కీల్ వత్తలకులడిలో 1.31 ఎకరాలు, వంద పాళయంలో మరో చోట 5.19 ఎకరాలు, కీల్వాత్తుకుడిలో మరో చోట 1.91 ఎకరాలు చొప్పున స్థలాల మీద పెట్టుబడుల్ని పెట్టి ఉండటం గమనార్హం. -
ఆస్తుల వివరాలు ప్రకటించాలి: పొన్నం
సాక్షి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్, మంత్రులు తమ ఆస్తుల వివరాలు ప్రకటించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండునెలలు దాటినా కరెంట్, సంక్షేమకార్యక్రమాలు, రుణమాఫీ అంశాలపై కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నెలన్నరలో కరెంట్ సమస్య పరి ష్కారమవుతుందని ఒకసారి, కాదు ఏడాదిన్నర అని మరోసారి సీఎం తోచినట్టు మాట్లాడుతున్నారని, తెలంగాణ ఆయన జాగీరేం కాదన్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్చేస్తుంటే పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, విచారణ జరిపిస్తామని సీఎం కేసీఆర్ ఎదురుదాడి చేయడాన్ని తప్పుబట్టారు.