న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీలందరూ వారి ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలని స్వయంగా సుప్రీంకోర్టే ఆదేశించిన సగం మంది జడ్జీల ఆస్తుల వివరాలు వెబ్‌సైట్‌లో లేవు. సీజేఐసహా సుప్రీంలో 23 మంది జడ్జీలుండగా, 12 మంది ఆస్తుల వివరాలే వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, ఆ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తులైన జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఏకే సిక్రీల ఆస్తుల వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ అశోక్ భూషణ్‌లు కూడా ఆస్తుల వివరాలను వెల్లడించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా స్వచ్ఛందంగా ఆస్తుల వివరాలు బహిర్గత పరచాలని 2009, ఆగస్టు 26న సుప్రీంకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment