exposed
-
వ్యక్తిగత డేటా సేఫ్‌గానే ఉందా?.. తెలియాలంటే..
వ్యక్తిగత డేటా సేఫ్‌గా ఉండకపోతే స్కామర్ల చేతిలో నష్టపోవాల్సి ఉంటుంది. డేటా దొంగిలించడం అనే కారణంతో ఇటీవల సైబర్‌మోసాలు పెరుగుతున్నాయి. మన వ్యక్తిగత డేటాను స్కామర్లు ఏ విధంగా దొంగిలిస్తారు, ఈ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి.. డేటా ఎప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి సాంకేతిక, సంస్థాగత, చట్టపరమైన రక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత డిజటల్ హక్కులలో... యాక్సెస్ పొందే హక్కు, నిర్ధారించే హక్కు, సరిచేసే హక్కు, పోర్టబిలిటీ హక్కు, మర్చిపోవడం, ఆమోదం తెలిపే హక్కు ఉంటాయి. వ్యక్తిగత డేటా సమాచారం వారి ప్రయోజనాల కోసం ఉపయోగపడాలి. వ్యక్తులు, వ్యాపారులు తమకు సంబంధించిన డేటా రక్షణగా ఉంటే ఆర్థిక, పరువు, చట్టపరమైన బాధ్యత వంటి నష్టాలను తగ్గించడంలో సహాపడుతుంది. డేటా ఉల్లంఘనలు, సైబర్ నేరాల సంఘటనలు పెరుగుతున్నందన చట్ట ప్రకారం అవసరమైన జనరల్డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) చర్యలను అమలు చేస్తుంటారు. డేటా దొంగిలించడం జరిగినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు అధికారులకు తెలియజేయడం తప్పనిసరి. జీడీపీఆర్ ప్రకారం డేటా ఉల్లంఘన జరిగితే జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మీ డేటాను వివిధ కంపెనీలు ఎలా తీసుకుంటాయంటే... ఆన్లైన్ షాపింగ్: పేరు, జెండర్, ఇమెయిల్, చిరునామా, డెలివరీ, ఫోన్ నెంబర్, క్రెడిట్‌కార్డ్ వివరాలు, ప్రొడక్ట్ హిస్టరీ, తరుచూ కొనుగోలు చేసే వస్తువులు, షాపింగ్ విలువ, ఎక్కువ శాతంలో బ్రౌజ్ చేస్తున్న ప్రొడక్ట్స్, మీ ఐపీ అడ్రస్... ఈ వివరాలన్నీ వ్యక్తిగత డేటా జాబితాలోకి వస్తాయి. డేటింగ్ యాప్‌లు... పేరు, జెండర్, వయసు, సెక్కువల్ ఓరియెంటేషన్, ఫోన్ నెంబర్, ప్రైవేట్ చాట్, పొలిటికల్ వ్యూస్, వ్యక్తిగత ఫొటోలు, ఇష్టాలు, స్వైప్స్, డిజిటల్ డివైజ్ సమాచారం, ఐపీ అడ్రస్.. ఈ యాప్ ద్వారా బహిర్గతం అవుతాయి. సెర్చ్ ఇంజిన్లు.. ఆన్లైన్ సెర్చింగ్, బ్రౌజింగ్ హిస్టరీ, ఆన్లైన్ ఆసక్తులు, షాపింగ్ అలవాట్లు, ఐపీ చిరునామా, ప్లేస్, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డులు, పరికర సమాచారం, డౌన్లోడ్ చేసిన ఫైల్స్, ఉపయోగించే బ్రౌజర్ యాడ్–ఆన్లు.. ద్వారా జరుగుతుంటుంది. సోషల్ మీడియా.. పోస్ట్‌లు, ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు, ఫైల్స్, ఫోన్ పరిచయాలు, పేరు, జెండర్, ఇమెయిల్, ప్లేస్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, ఫ్రెండ్స్ గ్రూప్, గ్రూప్ చాట్స్, పోస్టులు, ట్యాగ్ చేసిన ఫొటోలు అండ్ వీడియోలు.. సోషల్ మీడియా ద్వారా జరుగుతుంటాయి. గుర్తించదగిన సమాచారం.. మీ పుట్టిన రోజు లేదా ఫోన్ నెంబర్ వంటివి పబ్లిక్ రికార్డ్‌లో ఉండవచ్చు. ఒకసారి మీ వివరాలు బయటకు వచ్చాక దాడి చేసేవారు ఉండవచ్చు. సోషల్ ఇంజనీరింగ్ మోసాలకు వ్యక్తిగత డేటా సులభంగా ఉపయోగించుకోవచ్చు. సురక్షిత చర్యలు.. చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌పై ఆధారపడి డేటా రక్షణ సూత్రాలు కొద్దిగా మారుతూ ఉంటాయి. అవి సాధారణంగా కింది అంశాలను కలిగి ఉంటాయి... ∙చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, పారదర్శకంగా వ్యక్తులకు ప్రయోజనం కలిగేలా ప్రాసెస్ చేయాలి ∙వ్యక్తిగత డేటా విషయంలో కచ్చితత్వం పాటించాలి. అదే విధంగా ఇతరులు యాక్సెస్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ∙అనధికార లేదా చట్టవిరుద్ధమైన ప్రాసెసింగ్ ద్వారా నష్టం కలిగితే నియంత్రణ అధికారులకు తెలపాలి. భారతదేశంలో డేటా రక్షణ కోసం చట్టం.. మన దగ్గర ఉన్న ఏకైక డేటా రక్షణ చట్టం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 (ఐటీ చట్టం). దీని ప్రకారం డేటా చౌర్యం జరిగితే రక్షణ కోసం ఉపయోగించే కొన్ని సెక్షన్లు ఎ)సెక్షన్ 69 బి) సెక్షన్ 69ఎ సి) సెక్షన్ 69 బి.. ఉన్నాయి. అయితే, ముందస్తుగా డేటా గోప్యతను రక్షించడానికి చట్టం లేదు. తమ డేటాను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. అల్ఫాన్యూమరిక్ వర్డ్స్ ఉపయోగించాలి. ప్రత్యేక అక్షరాలను చేర్చాలి ∙రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించాలి ∙ఓటీపీ లేదా అథెంటికేటర్ యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి పేరొందిన సెక్యూరిటీ, యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించాలి. ఫిషింగ్ స్కామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ∙చిన్న లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయరాదు. డేటా కేర్ సాఫ్ట్వేర్/యాప్స్‌ని చట్టబద్ధమైన మూలాల నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి ∙ మీ బ్రౌజర్‌ని అప్డేట్ మోడ్‌లో ఉంచాలి. https//తో ప్రారంభమయ్యే సురక్షిత వెబ్సైట్లను మాత్రమే యాక్సెస్ చేయాలి https://mxtoolbox.com/EmailHeaders.aspx ఉపయోగించి ఇమెయిల్ పూర్తి హెడర్‌ను చెక్ చేయాలి మీ యాప్‌లు మీ డేటాను ఎలా యాక్సెస్ చేస్తున్నాయో చెక్ చేయాలి. అందుకు.. https://reports.exodus-privacy.eu.org/en/, https://smsheader.trai.gov.in/ని ఉపయోగించి ఎసెమ్మెస్ సరైనదేనా అని ధృవీకరించుకోవచ్చు. మీ డేటా చౌర్యం జరిగిందీ లేనిదీ తెలుసుకోవడానికి చెక్ చేయాలంటే.. మీ ఇమెయిల్ లేదా ఫోన్ నెంబర్ డేటా ఉల్లంఘనలో భాగమైందో లేదో తనిఖీ చేయడానికి మీరు ఈ వెబ్‌సైట్‌ల్లో సెర్చ్ చేయచ్చు. (a) https://amibeingpwned.com (b) https://snusbase.com (c) https://leakcheck.net (d) https://leaked.site (e) https://leakcorp.com/login (f) https://haveibeensold.app. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ (చదవండి: ఒక దేశం రెండు పేర్లు.."భారత్" అనే పేరు ఎలా వచ్చిందంటే..) -
Cannes Film Festival: గోస్ టు కాన్స్
పేదరికంతో ఇబ్బందులు పడే ఒక మహిళ కథ.. ఓ బాలుడి తీయని జ్ఞాపకాలు.. భారతీయ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాద బాధితుల ఇబ్బందులు.. ఇంటి కోసం వెతికే ఇద్దరు ట్రాన్స్‌జెండర్ మహిళల పాట్లు.. ఒక జర్నలిస్ట్ మరియు రెండు వర్గాల మధ్య సంఘర్షణ.. ఇవన్నీ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో వీక్షకుల ముందుకు రానున్నాయి. ఈ కథలతో రూపొందిన ఐదు భారతీయ చిత్రాలు కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ‘గోస్ టు కాన్స్’ విభాగంలో ప్రదర్శితం కానున్నాయి. ఈ నెల 17 నుంచి 28 వరకూ ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఫ్రాన్స్ దేశంలో జరగనున్న కాన్స్ ఉత్సవాలకు వెళ్లనున్న ఆ ఐదు చిత్రాల గురించి తెలుసుకుందాం. లైలా... రోషిణి... ఓ ఇల్లు జీవించడానికి ఒక ఇంటి కోసం ఆరాటపడుతుంటారు లైలా, రోషిణి అనే ఇద్దరు స్త్రీలు. ఆ ఇద్దరూ లింగ మార్పిడి చేయించుకున్నవారు కావడంతో అద్దెకు ఇల్లు దక్కించుకోవడం పెద్ద ప్రహసనం అవుతుంది. రిన్ చిన్, మహీన్ మీర్జా రూపొందించిన హిందీ చిత్రం ‘ఏక్ జగహ్ అప్నీ’ కథ ఇది. నిజమైన ఇద్దరు ట్రాన్స్ ఉమెన్ (లింగ మార్పిడి చేయించుకున్న మహిళలు) నటించిన చిత్రం ఇది. ఇద్దరికీ కూడా ఇది తొలి సినిమానే. కథ రాసేటప్పుడు వారి అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఓ బాలుడి జ్ఞాపకాలు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఛత్తీస్‌గఢ్‌లో చదువుకుంటాడు ఆ కుర్రాడు. ఆ నాలుగేళ్ల జీవితం ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ జ్ఞాపకాలకు కొన్ని కాల్పనిక అంశాలు జోడించి దర్శకుడు శైలేంద్ర సాహు తెరకెక్కించిన చిత్రం ‘బైలాడీలా’. శైలేంద్ర సాహు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ఛత్తీస్ గఢ్‌లో చదువుకున్నప్పటి అతని జ్ఞాపకాలే ఈ సినిమా. హిందీ, ఛత్తీస్‌గఢ్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి బడ్జెట్ నిర్ణయించలేదు. శేలైంద్ర స్నేహితులు నటించారు. వాళ్లతో పాటు టెక్నీషియన్లు ఎవరూ పారితోషికం తీసుకోలేదు. ఈ సినిమా ద్వారా డబ్బులొస్తే అప్పుడు ఇస్తానని ఫ్రెండ్స్‌కి మాటిచ్చారు శైలేంద్ర. కాన్స్ చిత్రోత్సవాల్లో తన చిత్రాన్ని మార్కెటింగ్ చేసుకోవాలనే ఆకాంక్షతో అక్కడికి వెళుతున్నారు. నిర్మాతలు ముందుకు రాని ‘ఫాలోయర్’ బెల్గామ్‌లోని ఓ పట్టణానికి చెందిన ఒక జర్నలిస్ట్, రెండు వర్గాల మధ్య సంఘర్షణ చుట్టూ సాగే చిత్రం ‘ఫాలోయర్’. హర్షద్ నలవాడే దర్శకత్వంలో హిందీ, కన్నడ, మరాఠీ, దఖినీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. బెల్గామ్ నేపథ్యం కావడంతో అక్కడి స్థానికులతోనే నటింపజేశారు. రెండు వర్గాల మధ్య సంఘర్షణ నేపథ్యంలోని సినిమా కావడంతో నిర్మాతలెవరూ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రాలేదు. దాంతో తమ పరిస్థితిని వివరిస్తూ ఈ సినిమా టీమ్ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూసి ఆర్థిక సహాయం చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. అలా ‘క్రౌడ్ ఫండెడ్’ మూవీగా ‘ఫాలోయర్’ రూపొందింది. సినిమా షూటింగ్ పూర్తి చేసి, రఫ్ కట్ చేస్తున్న సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఇద్దరు నిర్మాతలు సహాయం చేయడంతో ఈ సినిమా పూర్తయింది. పేదరికాన్ని జయించాలని... ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్నం భోజనం అందించే వంట మనిషి శివమ్మ జీవితం చుట్టూ సాగే కథ ‘శివమ్మ’ చిత్రం. పేదరికాన్ని జయించడానికి ఆమె రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. చివరికి కూతురి పెళ్లికి దాచిన డబ్బుని ఓ వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతుంది. నిజజీవితంలో జరిగిన కొన్ని ఘటనలను జోడించి అల్లిన కాల్పనిక కథతో దర్శకుడు జై శంకర్ ఈ కన్నడ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించినవారందరూ వృత్తిరీత్యా యాక్టర్లు కాదు. కానీ సినిమా సహజత్వానికి దగ్గరగా ఉండాలని నటింపజేశారు. దర్శక–నిర్మాత–నటుడు రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాగ్జాన్ 2020లో అస్సాంలోని తిన్సుకియా జిల్లాలో ఓ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. భారతదేశ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాదంగా నమోదైంది. గ్యాస్ లీకేజ్ కారణంగా చమురు బావిలో ఎగసిపడిన భారీ మంటలను అదుపు చేసేందుకు దాదాపు ఆరు నెలలు పట్టింది. ఈ ఘటన నేపథ్యంలో రూపొందిన అస్సామీ చిత్రం ‘బాగ్జాన్’. తిన్సుకియాలో నిజమైన లొకేషన్లలో చిత్రీకరించారు. అలాగే ఆ దుర్ఘటన బాధితులను కూడా నటింపజేశారు చిత్రదర్శకుడు జైచెంగ్ గ్జయ్. బలమైన కథాంశంతో రూపొందిన ఈ ఐదు చిత్రాలూ ప్రపంచ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటాయని ఊహించవచ్చు. ఇలా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కావడం ఆయా చిత్రబృందాలకు ఉపయోగపడే విషయం. తమ సినిమాని మార్కెటింగ్ చేసుకునే వీలు ఉంటుంది. అలాగే తదుపరి చిత్రానికి ఫండ్ సమకూరే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అప్పటికి సినిమా విడుదల కాకపోతే విడుదలకు సహాయం అందే అవకాశం ఉంది. మేకర్స్‌కి ఇలాంటి ప్రయోజనాలు ఉంటే.. నటీనటులకు అవకాశాలు పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. అందుకే కాన్స్ చిత్రోత్సవాలకు వెళ్లనున్న ఈ ఐదు చిత్రాల యూనిట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. -
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులంటూ ఆన్లైన్ మోసాలు
-
విశాఖ టీడీపీ భూకబ్జాదారుల గుండెల్లో గుబులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ టీడీపీ భూకబ్జాదారుల గుండెల్లో గుబులు మొదలైంది. టీడీపీ నేతల భూబాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీను ఆక్రమణలో 49 ఎకరాలు ఉండగా, నిన్న ఒక్కరోజే రూ.790 కోట్లకుపైగా విలువైన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కబ్జాకు గురైన 430.81 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తుంగ్లాంలో 12.5 ఎకరాల భూమి, కాపు జగ్గరాజుపేటలో 7 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకు రూ.5,080 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గాజువాక పరిసర ప్రాంతాల్లో టీడీపీ నేతల భూకబ్జాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. టీడీపీ నేతల భూకబ్జాలు మరికొన్ని బయటపడే అవకాశం ఉంది. చదవండి: సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్ ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన -
ఆ డాక్యుమెంట్లు బయటపెట్టండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డైరెక్టర్‌గా ఆలోక్‌వర్మను తొలగించడానికి కీలకంగా మారిన అన్ని పత్రాలు, నివేదికలను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు కోరారు. సీబీఐతో పాటు కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) నియామకాల్లో పారదర్శకత పాటించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ‘సీఐసీ నియామకాల నుంచే పారదర్శకత అన్నది ప్రారంభం కావాలి. సీఐసీ, సీబీఐతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు, ఆలోక్ వర్మను తొలగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటైన హైలెవల్ కమిటీ, సమాచార కమిషనర్ల నియామకం సహా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత ఉండేలా చూడాలి’ అని శ్రీధర్ కోరారు. గతేడాది కేంద్ర సమాచార కమిషన్ వార్షిక సమావేశంలో కోవింద్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అధిక సమాచారం అంటూ ఏదీ ఉండదని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం సీవీసీతో పాటు సీబీఐలో జరుగుతున్న నియామకాలకు సంబంధించి తీవ్రమైన సమాచార లోటు ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రజలు తమ సమస్యలను సీఐసీ దృష్టికి నమ్మకంగా, ధైర్యంతో తీసుకెళ్లలేరని స్పష్టం చేశారు. ఆలోక్ వర్మ తొలగింపుపై సీవీసీ నివేదికను, కీలక పత్రాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజలకు సమాచారాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)లోని సెక్షన్ 4 కింద అన్ని నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థ కన్నెర్ర చేసినప్పుడే కేంద్రం సీవీసీ వంటి సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తోందనీ, అయినా ప్రజలకు సమాచారమివ్వడం లేదన్నారు. ప్రధాని, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిక్రీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలు సభ్యులుగా ఉన్న హైలెవల్ కమిటీ వర్మను సీబీఐ డైరెక్టర్‌గా 2–1 మెజారిటీతో తొలగించడం తెల్సిందే. -
సగంమంది జడ్జీల ఆస్తుల వివరాల్లేవు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీలందరూ వారి ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలని స్వయంగా సుప్రీంకోర్టే ఆదేశించిన సగం మంది జడ్జీల ఆస్తుల వివరాలు వెబ్సైట్లో లేవు. సీజేఐసహా సుప్రీంలో 23 మంది జడ్జీలుండగా, 12 మంది ఆస్తుల వివరాలే వెబ్సైట్లో ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, ఆ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తులైన జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఏకే సిక్రీల ఆస్తుల వివరాలు వెబ్సైట్లో ఉన్నాయి. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ అశోక్ భూషణ్‌లు కూడా ఆస్తుల వివరాలను వెల్లడించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా స్వచ్ఛందంగా ఆస్తుల వివరాలు బహిర్గత పరచాలని 2009, ఆగస్టు 26న సుప్రీంకోర్టు ఆదేశించింది. -
వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం
అడవిదేవులపల్లి (మిర్యాలగూడ): నల్లగొండ జిల్లాలో సోమవారం ఓ వికలాంగురాలిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడవిదేవుల పల్లి మండలం చాంప్లాతండా హమ్‌తండాలో ఇటీవల దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆదివారం రాత్రి కోలాట ప్రదర్శన జరిగింది. దీనిని చూసేందుకు పక్కనే ఉన్న గోన్యా తండాకు చెందిన వికలాంగురాలు (40) వెళ్లింది. ఈ క్రమంలో ఆమె చెట్ల పొదల మాటుకు బహిర్భూమికి వెళ్లింది. అడవిదేవులపల్లికి చెందిన గొడుగు సతీశ్, గొడుగు హనుమయ్య, బిల్లకంటి మహేశ్‌లు ఆమెను అనుసరించారు. ఆ వికలాంగురాలిని బలవంతంగా చేలోకి తీసుకువెళ్లి సామూహిక లైంగికదాడి జరిపారు. అభాగ్యురాలిని అక్కడే వదిలేసి తిరిగి కోలాట ప్రదర్శన వద్దకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు కేకలు వేస్తూ కోలాటం వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని రోదిస్తూ బంధువులకు తెలిపింది. అక్కడే ఉన్న గొడుగు సతీశ్‌ను గుర్తించి చూపించడంతో గిరిజనులు అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. -
30లక్షల డెబిట్ కార్డుల సమాచారం లీక్?
ముంబై: దేశంలోని డెబిట్ కార్డుల వివరాలు పెద్దమొత్తంలో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోవడాన్ని అతిపెద్ద ఆర్థిక డేటాల ఉల్లంఘనగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దాదాపు 30 లక్షలకు పైగా (3.2 మిలియన్ ) కార్డుల డాటా తస్కరించబడిందని సమాచారం. వీటిల్లో సుమారు 20 లక్షలకు పైగా (2.6 మిలియన్ల) వీసా, మాస్టర్ కార్డులు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని గుర్తించడానికి సుమారు ఆరు వారాల పట్టిందనీ ఈ సమయంలో హిటాచీ నెట్వర్క్ లో ఉపయోగించిన సుమారు 3.2 మిలియన్ల కార్డుల సమాచారాన్ని హ్యాకర్లు సేకరించారని చెబుతున్నారు. ముఖ్యంగా చైనాలోని వివిధ ఏటీఎం సెంటర్లలో, విక్రయ కేంద్రాల్లో అనధికారిక లావేదేవీలు, కొనుగోలు జరిగినట్టుగా బాధితులు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై విచారణకు ఆదేశించినట్టు నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ)ఎండీ ఏపీ హోతా తెలిపారు. బ్యాంకులనుంచి తమకు ఫిర్యాదులు అందాయనీ, ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎక్కడ జరిగింది అనేది విచారిస్తున్నామని తెలిపారు. బ్యాంకులు, డెబిట్ కార్డుల సమాచారం భారీ ఎత్తున లీక్ అయిందనే అంచనాలతో దాదాపు అన్ని బ్యాంకులు ఏటీఎం పిన్ నంబర్ ను మార్చుకోవాలని సూచిస్తున్నాయి. పిన్ లేకుండా జరిగే అంతర్జాతీయ లావాదేవీలనన్నింటినీ నిలిపివేశాయి ఇప్పటికే ఆరున్నర లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరందరికీ కొత్త కార్డులను ఇవ్వనున్నట్టు తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగానే సుమారు 6 లక్షలకు పైగా కార్డులను బ్లాక్ చేశామని తమ ఏటీఎంలో ఎలాంటి అక్రమాలు జరగడంలేదని ఖాతాదారులకు భరోసా ఇచ్చినట్టు బ్యాంకు సమాచార అధికారి మృత్యుంజయ్ మహాపా త్ర తెలిపారు. ఈ వ్యవహారంలో సుమారు రెండు వారాల క్రితమే చర్యలు తీసుకున్నామని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ తెలిపింది. పిన్ లు మార్చుకోమని సలహా ఇవ్వడంతోపాటు, ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడొద్దని కోరినట్టు బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు. వీసా, మాస్టర్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్, ఎస్ బ్యాంకులనుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. -
పరిశ్రమల ఎంఓయూ బహిర్గత పర్చాలి : ధర్మాన
-
బహిర్గతమైన ఏపీ సర్కార్ మైండ్ గేమ్
-
బాబు నోట పూటకో మాట!