సాక్షి, విశాఖపట్నం: విశాఖ టీడీపీ భూకబ్జాదారుల గుండెల్లో గుబులు మొదలైంది. టీడీపీ నేతల భూబాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీను ఆక్రమణలో 49 ఎకరాలు ఉండగా, నిన్న ఒక్కరోజే రూ.790 కోట్లకుపైగా విలువైన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కబ్జాకు గురైన 430.81 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
తుంగ్లాంలో 12.5 ఎకరాల భూమి, కాపు జగ్గరాజుపేటలో 7 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకు రూ.5,080 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గాజువాక పరిసర ప్రాంతాల్లో టీడీపీ నేతల భూకబ్జాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. టీడీపీ నేతల భూకబ్జాలు మరికొన్ని బయటపడే అవకాశం ఉంది.
చదవండి: సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన
Comments
Please login to add a commentAdd a comment