సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి రూ.301.47 కోట్ల ఆస్తులు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి నివేదిక సమర్పించింది. తమ పార్టీ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన 2019–20 ఆడిట్ నివేదికను గత ఫిబ్రవరి 15న టీఆర్‌ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆదాయ వ్యయాలకు సంబంధించిన వార్షిక నివేదికను సీఈసీ ఇటీవల తన వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. 2018–19లో రూ.188.73 కోట్లుగా ఉన్న టీఆర్‌ఎస్ నిధులు, ఆస్తు ల విలువ ఏడాది కాలంలో రూ.301.47 కోట్లకు చేరింది. ఇందులో జనరల్ ఫండ్ రూపంలో రూ.292.30 కోట్లు, కార్పస్ ఫండ్ రూపంలో రూ.4.76 కోట్లు, ఇతర రూపంలో రూ.4.41 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. పార్టీ పేరిట ఉన్న భవనాలు, వస్తు సామగ్రి విలువ రూ.21.27 కోట్లుగా ఉందని పార్టీ వెల్లడించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జిల్లా కార్యాలయాల స్థలం, భూముల విలువ సుమారు రూ.16.50 కోట్లుగా ఉంటుందని లెక్కలు వేసింది. 2019–20లో స్థిరాస్తుల కొనుగోలు, షెడ్యూలు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ తదితరాల రూపంలో రూ.101 కోట్లు సమకూరాయి.
పార్టీ విరాళాలు రూ. 89.55 కోట్లు
2019–20 ఆర్ధిక సంవత్సరంలో టీఆర్‌ఎస్‌కు వి విధ మార్గాల్లో రూ.130.46 కోట్లు సమకూరగా, అందులో విరాళాల రూపంలో అత్యధికంగా రూ. 89.55 కోట్లు అందాయి. పార్టీ సభ్యత్వ నమోదు, పార్లమెంటరీ, లెజిస్లేటివ్ పార్టీ, టీఆర్‌ఎస్‌వీ విభాగాల నుంచి కలుపుకుని రూ.22.79 కోట్లు, బ్యాంకుల్లో సెక్యూరిటీ డిపాజిట్లు, సేవింగ్ ఖాతా లపై వడ్డీ తదితరాల రూపంలో మరో రూ.18.10 కోట్లు సమకూరాయి. విరాళాల్లో ఎలక్టోరల్ బాం డ్ల రూపంలో రూ.89.15 కోట్లు, వ్యక్తిగత దాతల నుంచి రూ.37.42 లక్షలు వచ్చాయి. ప్రకటనల కు రూ.2.69 కోట్లు, ప్రచారానికి రూ.4.94 కోట్లు కలుపుకుని మొత్తంగా ఎన్నికల కోసం రూ.7.64 కోట్లు ఖర్చు చేసింది. వీటితోపాటు పార్టీ కార్యా లయాల్లో ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులు కలుపుకుని ఏడాది కాలంలో రూ.21.18 కోట్లు పార్టీ అవసరాల కోసం ఖర్చు చేశారు.
రూ.301 కోట్లపైనే.. టీఆర్‌ఎస్ ఆస్తులు
Published Tue, Jun 22 2021 4:01 AM | Last Updated on Tue, Jun 22 2021 4:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment