మాట్లాడుతున్న లోక్‌సభ ప్రత్యేక వ్యయ పరిశీలకులు గోపాల్‌ముఖర్జీ
సాక్షి, నాగర్‌కర్నూల్: ఈ నెల 11న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిఘా బృందాలు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని లోక్‌సభ ప్రత్యేక వ్యయ పరిశీలకుడు గోపాల్‌ముఖర్జీ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అబ్జర్వర్లు, నోడల్ అధికారులు, క్షేత్ర స్థాయి వ్యయ బృందాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛాయుత, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా చేసేందుకు నిఘా బృందాలు సమన్వయంతో పనిచేస్తూ వాహనాలు తనిఖీ చేయాలన్నారు. ఎన్నికల్లో నిలబడిన బీజేపీ అభ్యర్థి కూడా ఎన్నికల్లో నిలదొక్కుకునేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించే బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో నిఘా బృందాలు సమర్థవంతంగా పనిచేశాయని, అదే స్ఫూర్తితో లోక్‌సభ ఎన్నికల్లోనూ సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఇంటెలిజెన్స్, లోకల్ జర్నలిస్టుల ద్వారా సమాచారం పొందాలని, సామాన్య ప్రజలతో మాట్లాడితే ఎన్నికల అక్రమాలపై సమాచారం లభిస్తుందని, అధికారులు ఆ విధంగా పనిచేయాలని సూచించారు. సీ–విజిల్ యాప్‌పై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఏకే.మోరియా, వనపర్తి ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రావణ్‌రాం, వనపర్తి ఎస్పీ అపూర్వరావు, జిల్లా నోడల్ అధికారులు నూతనకంటి వెంకట్, అఖిలేష్‌రెడ్డి, అనిల్ ప్రకాష్, మోహన్‌రెడ్డి, క్షేత్ర స్థాయి వ్యయ బృందాలు పాల్గొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment