పొత్తులపై టీఆర్‌ఎస్‌లో తర్జనభర్జన!
ఇప్పటికే సగం మందికి టిక్కెట్లు హామీ
ఒంటరి పోరే మేలంటున్న శ్రేణులు
ఎన్నికలయ్యాక చూద్దామంటున్న నేతలు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయంలో టీఆర్‌ఎస్‌లో భిన్నాభిప్రాయూలు వ్యక్తమతున్నారుు. పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుండడంతో దీనిపై టీఆర్‌ఎస్‌లో చర్చ మొదలైంది. కాంగ్రెస్‌తో పొత్తువల్ల ఓట్లు చీలిపోయే ప్రవూదం త గ్గి కొంత లాభం చేకూరినా, వురోరకంగా ఇబ్బందులూ ఉంటాయునే అభిప్రాయూలూ వినిపిస్తున్నారుు. ఇప్పటికే సగం మంది నాయకులకు టిక్కెట్లు ఇస్తామని హామీని కూడా ఇచ్చినందున, పొత్తువల్ల అలాంటి వారికి న్యాయం చేయడం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. మొన్నటి వరకు పొత్తుపై ఎలాంటి ఆవకాశం లేదని భావించిన పార్టీనేతలు, కార్యకర్తలు అన్ని స్థానాల్లో పోటీకి సన్నద్ధమయ్యారు. టిక్కెట్లను ఆశించే వారు తమవంతు ప్రయత్నాలు చేయడంతో కొందరికి కేసీఆర్ నుంచి హామీ కూడా లభించినట్టు సమాచారం. అలాగే ఇతర పార్టీల నుంచి కూడా పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి కూడా టికెట్ల హామీ లభించింది.
ఈ నేపథ్యంలో మళ్లీ పొత్తు విషయం తెరపైకి రావడంతో పార్టీలో కలవరం మొదలయింది. తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా ప్రజల్లో తమకే ఎక్కువ అభిమానం ఉంటుందనే నమ్మకంలో పార్టీ నేతలున్నారు. ఇదే అభిప్రాయంతో ఇతర పార్టీల నుంచి నాయకులే కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పొత్తంటే చిక్కులు వస్తాయుంటున్నారు. పైగా పొత్తుకు సంబంధించి తాము ఎక్కువ ప్రయత్నం చేయకున్నా.. కాంగ్రెస్‌యే ముందుకు వస్తుండడంతో దీనివల్ల లాభం ఆ పార్టీకే అనే విషయాన్ని టీఆర్‌ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, శుక్రవారం దాకా పొత్తులకు సంబంధించి ఎలాంటి పురోగతిలేదని పార్టీలో కీలక నేత ఒకరు వివరించారు. ఒంటరిపోరే లాభమని అత్యధికులు అంటున్నా రు. పొత్తు కుదిరితే, సగంసీట్లలోనే పోటీ చేయాలి.
- 60 స్థానాల్లో పోటీ చేస్తే.. అందులో 75శాతం గెలుస్తారనుకున్నా.. 45 స్థానాలే కదా. ఒంటరిగా పోటీ చేస్తే... ఇంతకంటే ఎక్కువ సీట్లతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
- పొత్తు వల్ల సగం స్థానాల్లో పార్టీ నాయకులకు టికెట్లు దొరకవు. వారు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉంటే అసలుకే మోసం వస్తుంది.
- ఎన్నికలయ్యాక ఏ పార్టీ వారు సీఎం పదవి చేపట్టాలనే విషయంలో కూడా వివాదం తలెత్తుతుంది.
- ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని నడిపించిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. పొత్తు వల్ల ఆ వ్యతిరేకతను కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది.
- వీటిని పరిగణనలోకి తీసుకుని పొత్తు లేకపోతేనే పార్టీకి ప్రయోజనకరమని అభిప్రాయం వస్తోంది.
- అవసరమయితే ఎన్నికల తర్వాత ప్రభుత్వాల ఏర్పాటులో పొత్తుల విషయాన్ని పరిశీలిస్తే సరిపోతుందంటున్నారు.