వారణాశి కాంగ్రెస్ అభ్యర్థిపై కేసు | EC directs to file complaint against Varanasi Congress candidate | Sakshi
Sakshi News home page

వారణాశి కాంగ్రెస్ అభ్యర్థిపై కేసు

Published Mon, May 12 2014 12:26 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

EC directs to file complaint against Varanasi Congress  candidate

వారణాశి: ఉత్తరప్రదేశ్లోని ప్రతిష్టాత్మక వారణాశి లోక్సభ నియోజవర్గం నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై కేసు నమోదు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సోమవారం జరుగుతున్న చివరి విడత లోక్సభ ఎన్నికల్లో వారణాశికి కూడా నిర్వహిస్తున్నారు. అజయ్ రాయ్ ఓటు వేసిన అనంతరం పోలింగ్ బూతు వద్దే పార్టీ గుర్తు హస్తంను ప్రదర్శించారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల నిబంధనల్న ఉల్లంఘించిన అజయ్ రాయ్పై కేసు నమోదు చేయాలని వారణాశి రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement