సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ చేస్తున్న దీక్ష దివస్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న టైమ్ లో దీక్ష దివస్ చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తక్షణమే దీక్షా దివస్‌ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
తెలంగాణ భవన్‌లో నేడు దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదాన్ని ఇచ్చి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది దీక్షా దివస్‌ను జరుపుతున్నారు. ఎన్నికల సందర్భంగా కార్యక్రమం జరపడంపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వేడుకలు నిర్వహించరాదని సూచించింది. దీంతో, తెలంగాణ భవన్‌కు ఎన్నికల కమిషన్ స్వ్కాడ్ టీమ్ చేరుకుని.. కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరింది. ఇది కొత్త కార్యక్రమం కాదని.. ఎప్పటి నుంచో చేస్తున్నట్టు బీఆర్‌ఎస్ నేతలు, లీగల్ టీమ్ సూచించారు. అనంతరం, డీసీపీతో కూడా వారు మాట్లాడారు.
దీంతో, ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా కాకుండా తెలంగాణ భవన్ లోపల నిర్వహించుకోవాలని వారికి పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో భవన్ లోపలే కార్యక్రమం చేస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు. ఇక, కమిషన్ సూచనల మేరకు తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించినట్టు సమాచారం. ఇక, వేడుకల కోసం కేటీఆర్ తెలంగాణ భవన్‌కు వెళ్లారు. దీక్ష దివస్ సందర్భంగా కేటీఆర్ రక్తదానం చేశారు.
ఇదీ చదవండి: తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..
Comments
Please login to add a commentAdd a comment