deeksha divas
-
దమ్ముంటే రా!.. ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలే చెబుతారు: కేటీఆర్
సాక్షి, కరీంనగర్: తెలంగాణకు పునఃర్జన్మనిచ్చింది కరీంనగర్ అని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి జన్మస్థలం కరీంనగర్ అని, ఆనాడు 370 మంది అమరుల సాక్షిగా మొదటిసారిగా 11 సీట్లు బీఆర్ఎస్కు వచ్చాయని తెలిపారు. కరీంనగర్‌లోని అల్గునూర్‌లో దీక్షా దీవస్ సభలో శుక్రవారం కేటీఆర్ మాట్లాడుతూ.. 1956 నుంచి 1968వరకు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందని తెలిపారు. తొలిదశ ఉద్యమంలో 370 మంది బలిదానం అయ్యారని.. 1971 నుంచి 30 ఏళ్ళ పాటు మేధావులు ఉద్యమకారులు ఎదురు చూశారని చెప్పారు. అప్పుడే కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చిన కేసీఆర్.. కరీంనగర్ సింహగర్జనతో ఉద్యమబాట పట్టాడని పేర్కొన్నారు. పదవులు త్యాగం చేసి 2001లో టీఆర్ఎస్ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని రగిల్చారని.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారని తెలిపారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. 2001 నుంచి 2014 వరకు ప్రజా ఉద్యమం సాగించారని చెప్పారు.‘ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంతో విధిలేని పరిస్థితుల్లో అనాడు కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చింది. రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్, తెలంగాణ ప్రజలకు దక్కుతుంది. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ అడుక్కునే పరిస్థితి అంటున్నారు నేడు గద్ధెనెక్కినవారు. వారు కేసీఆర్ కాలి గోరుకు సరిపోరు. ఎక్కడికైనా పోదాం.. ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలు చెబుతారు. దమ్ముంటే రా... పోదాం ఎక్కడికైనా. ఏదో సాధించినట్లు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు లేకుండా పోతే వీపు చింతపండు చేసే పరిస్థితి ఉంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
'దీక్షా' దక్షుడు.. తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు (నాటి చిత్రాలు)
-
చరిత్ర గతినే మార్చిన ఆమరణ దీక్ష
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన మలుపు తిప్పిన రోజు కేసీఆర్ ఆమ రణ నిరాహార దీక్ష చేపట్టిన 2009 నవంబర్ 29వ తేదీ. ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’నని నినదించి 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉద్యమాన్ని విజయ తీరాలకు మరల్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వరాష్ట్ర ఉద్యమ చరిత్రగా నిలిచారు. కట్టలు తెగుతున్న ప్రజాగ్రహాన్నీ, ప్రజాసంఘాల పటు త్వాన్నీ రాజకీయ ప్రక్రియగా మరల్చి, కేంద్రం మెడలు వంచి స్వరాష్ట్ర లక్ష్యం నెరవేర్చిన ఆయన సంకల్ప దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన తెలంగాణ ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్యలకు స్వరాష్ట్ర సాధనే పరిష్కారమని అసెంబ్లీ సాక్షిగా చెప్పి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించాడు. ఉద్యమ ఎగుడు దిగుళ్లను చూసుకుంటూ చివరి ప్రయత్నంగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. తెలంగాణ అంతా భగ్గుమంది. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఉద్యమ నాయకుని ఆమరణ నిరాహార దీక్ష స్వరాష్ట్ర సాధనకు దారి చూపింది. ఆ సత్యాగ్రహి చరిత్రను ఎవ్వరూ చెరిపేయలేరు. వాట్సాప్‌లో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు పంపుకొనే చెత్త వాదనల అభూత కల్పనలు చరిత్ర కాదు. చరిత్ర తెలుసుకోవాలంటే 78 ఏళ్లకు పూర్వమే తెలంగాణ స్వతంత్ర రాష్ట్ర మన్న విషయం తెలిసి ఉండాలి. 1953లో ఆనాటి సీమాంధ్ర నాయకులు కొందరు చేసిన కుతంత్రాలు తెలుసుకోవాలె. పచ్చటి తెలంగాణ ఎడారిగాఎందుకయ్యిందో తెలవాలె. పంట భూముల తెలంగాణ... బీడు భూములై, ముంబై బొగ్గు బాయ్, దుబాయ్ వలస బతుకులుగా ఎట్లా మారిందో; అందుకు కారకులెవరో తెలుసు కోవాలి. కేసీఆర్ ‘జై తెలంగాణ’ అంటే తెలంగాణ సమాజమంతా జై జై అన్నది. ఆయన అడుగుల్లో అడిగేసి నడిచింది. తెలంగాణ విద్రోహుల కుట్రలను ఎప్ప టికప్పుడు కనిపెడుతూ ఉద్యమాన్ని నిత్య నదిలా మార్చి ప్రవాహ పరుగుగా మారాడాయన. గాంధీ మార్గంలో ఆమరణ దీక్షకు దిగి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రకటన వచ్చేలా చేసిన మలిదశ తెలంగాణ ఉద్యమ యోధుడు. తలవంచని, వెన్నుచూపని యోధుల వెంటే తెలంగాణ నిలిచింది. శ్రీకాంతాచారి, యాదయ్య, కానిస్టేబుల్ కిష్టయ్య వంద లాది మంది యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే గుక్క పట్టి ఏడ్చి ‘బిడ్డలారా! మీ కోసమే తెలంగాణ. మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. ఆకాశం బద్దలు కొట్టయినా తెలంగాణ తెస్తానని రాష్ట్రం వచ్చేదాకా మడమ తిప్పన’ని స్వరాష్ట్ర కలను సాకారం చేసిన యోధుడు కేసీఆర్. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ స్వరాష్ట్ర సాధన ప్రకటనయ్యింది. ఇదీ చరిత్ర! ఇది మనమందరం ఉద్యమమై ఉద్యమించిన చరిత్ర. తల్లి స్తన్యం బిడ్డ కందనప్పుడు వేసిన కేక తెలంగాణ. నా తెలంగాణ కోటి రతనాల వీణే కాదు. నా తెలంగాణ కోటి కత్తుల వాన, ఉద్యమ ఉద్విగ్న వీణయని పిడికిలెత్తి నిలిచిన స్వరాష్ట్ర ఉద్యమ సమరయోధుడు సలిపిన ఉద్యమ చరిత్రను మననం చేసుకోవాలి. దగా పడ్డ తెలంగాణకు రాష్ట్ర సాధన ఒక్కటే విముక్తి దారని చెప్పిన యోధుడి చరిత్రను చదవాలి. జలదృశ్యంలో పురుడు పోసుకున్న తెలంగాణ ఉద్యమ పార్టీ పిడికిలిని చూడాలి. ఓ బక్క మనిషి పిలిస్తే తెలంగాణ ఎలా కదిలిందో చరిత్ర. అసెంబ్లీ, పార్లమెంట్లు అచ్చెరువై చూసి స్వరాష్ట్ర సాధన ప్రకటనలు చేసే దాకా తీసుకుపోయిన తెలంగాణ జయుడి కథను రాబోయే తరాలు తెలుసుకోవాలి. ప్రతి ఊరు ఉద్యమ ‘ధూంధాం’గా మారిన చరిత్రను తప్పక తరతరాలు తెలుసుకోవాలి.కరీంనగర్ సింహ గర్జనల సభలు, వరంగల్‌లో పోటెత్తిన లక్షలాదిమంది సభలు, ఆదిలాబాద్ అడవుల్లో ఇంద్రవెల్లి స్తూపాలు పరవశించిన కథలు, గోదావరిలోయ ప్రతి ఘటనా పోరు దారులన్నీ పొంగి పరవశించిన గాథలు, నగారా మోగించిన నల్లగొండ, మహ బూబ్నగర్లు; మెతుకు సీమ మెదక్ బిడ్డల ఆకాంక్షలు, ఖమ్మం తొలిదశ ఉద్యమ నిప్పును రాజేసిన నిజామాబాద్ సకలజనుల సమ్మెలు, సాగర హారాలైన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జనయాత్రలూ.... అన్నింటినీ రాజకీయ ప్రక్రియగా మార్చి స్వరాష్ట్ర ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా మలిచిన ఉద్యమ చరిత్రను కాదన గలరా? ఉద్యమ జ్యోతి ఆగిపోకుండా, ఉద్యమ వేడి తగ్గకుండా పధ్నాలుగేళ్ల స్వరాష్ట్ర ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో నడిపించిన కేసీఆర్‌ను మరుస్తదా బిడ్డా తెలంగాణ గడ్డ? ప్రపంచీకరణ కాలంలో కోట్లమందిని ఒక్కతాటిపైకి తెచ్చిన ఆయన ‘దీక్షా దివస్’ చరిత్రలో చెక్కు చెదరనిది. వ్యాసకర్త తెలంగాణ తొలి బీసీ కమిషన్ సభ్యులు (2009లో స్వరాష్ట్ర సాధనకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు నేడు)-జూలూరు గౌరీశంకర్ -
నాటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసేందుకే దీక్షాదివస్: గంగుల
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేసేందుకే దీక్షాదివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. రేపటి దీక్షాదివస్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని గంగుల కామెంట్స్ చేశారు.రేపటి దీక్షాదివస్ కోసం కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం అల్గునూరులో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కార్యక్రమ ఏర్పాట్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గంగుల మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేసేందుకే దీక్షాదివస్ ని నిర్వహిస్తున్నాం. బీఅర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్న కాంగ్రెస్ నేతలకు కనువిప్పు కలగాలి.తెలంగాణ అంటేనే సెంటిమెంట్.. ఆ సెంటిమెంట్ ను ఎందుకు మర్చిపోతాం?. రేపటి దీక్షాదివస్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. తెలంగాణ తరహా మలిదశ ఉద్యమానికి మరోసారి శ్రీకారం చుట్టబోతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
‘దీక్షా దివస్’పై కేటీఆర్ కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: దీక్షా దివస్‌ను నవంబర్ 29వ తేదీన ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.రేవంత్‌రెడ్డి పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిర్బంధాలు మళ్ళీ వచ్చాయన్నారు. తెలంగాణభవన్‌లో ఆదివారం(నవంబర్ 24) కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.‘కేసీఆర్ స్పూర్తితో కాంగ్రెస్ కబంద హస్తాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకుంటాం. 2009 నవంబర్29 కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగింది.నవంబర్ 29న 33జిల్లా కేంద్రాల్లో దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహిస్తాం.దీక్షా దివస్‌లో కేసీఆర్ పాల్గొనడం లేదు. 26న అన్ని జిల్లా కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తాం.తెలంగాణపై కేసీఆర్ దీక్ష చెరగని ముద్ర వేసింది.కేసీఆర్ దీక్ష విమరణ రోజైన డిసెంబర్ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. దీక్షకు గుర్తుగా 29న నిమ్స్ లో రోగులకు అన్నదానం చేస్తాం.రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మెడలు వంచుతాం.ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్పూర్తితో ముందుకు వెళతాం’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి: అది నోరైతే నిజాలు వస్తాయి: కేటీఆర్ -
మంత్రి కేటీఆర్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ చేస్తున్న దీక్ష దివస్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న టైమ్ లో దీక్ష దివస్ చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తక్షణమే దీక్షా దివస్‌ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ భవన్లో నేడు దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదాన్ని ఇచ్చి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది దీక్షా దివస్‌ను జరుపుతున్నారు. ఎన్నికల సందర్భంగా కార్యక్రమం జరపడంపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వేడుకలు నిర్వహించరాదని సూచించింది. దీంతో, తెలంగాణ భవన్‌కు ఎన్నికల కమిషన్ స్వ్కాడ్ టీమ్ చేరుకుని.. కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరింది. ఇది కొత్త కార్యక్రమం కాదని.. ఎప్పటి నుంచో చేస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు, లీగల్ టీమ్ సూచించారు. అనంతరం, డీసీపీతో కూడా వారు మాట్లాడారు. దీంతో, ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా కాకుండా తెలంగాణ భవన్ లోపల నిర్వహించుకోవాలని వారికి పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో భవన్ లోపలే కార్యక్రమం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక, కమిషన్ సూచనల మేరకు తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించినట్టు సమాచారం. ఇక, వేడుకల కోసం కేటీఆర్ తెలంగాణ భవన్‌కు వెళ్లారు. దీక్ష దివస్ సందర్భంగా కేటీఆర్ రక్తదానం చేశారు. ఇదీ చదవండి: తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు.. -
బక్కపల్చని వీరుడు బందూక్ అయ్యాడు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’నినాదంతో 2009 నవంబర్ 29న ఉద్యమనాయకుడిగా కె.చంద్రశేఖర్‌రావు చేసిన దీక్షకు 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘దీక్షా దివస్’పేరిట సామాజిక మాధ్యమాల్లో టీఆర్ఎస్ నేతల పోస్టులు సందడి చేశాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికలపై ‘దీక్షా దివస్’హ్యాష్‌టాగ్ ట్రెండింగ్‌గా నిలిచింది. ‘మీ పోరాటం అనితర సాధ్యం, ఒక నవశకానికి నాంది పలికినరోజు. ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేల్కొల్పిన రోజు. తెలంగాణ వైపు దేశం దృష్టి మరల్చేవిధంగా తెగించినరోజు. చరిత్రను మలుపుతిప్పిన 29 నవంబర్ 2009 తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు’అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ట్వీట్ చేశారు. ‘తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు. కేసీఆర్ చరిత్రాత్మక దీక్షకు 12 ఏళ్లు. తెలంగాణ రాష్ట్రసాధనకు అలుపెరుగని పోరాటం చేసిన మన ఉద్యమనేత కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్షకు దిగి ఉక్కుసంకల్పాన్ని చాటి చెప్పినరోజు’అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సీఎం కేసీఆర్ అరెస్టు, సిద్దిపేటలో తాను దీక్షకు కూర్చుకున్న ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. My Badge of Honour from 13 years ago on the same Day ✊#DeekshaDiwas pic.twitter.com/biGPdsdvKv — KTR (@KTRTRS) November 29, 2022 కేసీఆర్ దీక్షను గుర్తుచేస్తూ పోస్టులు కోట్లాదిమంది ప్రజలను ఏకతాటిపైకి నడిపి దశాబ్దాల తెలంగాణ కలను నెరవేర్చిన నేత కేసీఆర్ అంటూ పలువురు రాష్ట్రమంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ‘దీక్షాదివస్’ను గుర్తు చేసుకుంటూ ఉద్యమకాలం నాటి కేసీఆర్ ఫొటోలను షేర్ చేశారు. 2009 నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణదీక్ష కోసం కరీంనగర్ నుంచి బయలుదేరిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను కరీంనగర్ జిల్లా అలుగునూరు వద్ద అరెస్ట్ చేసి తొలుత ఖమ్మం జైలుకు, ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్‌లో 11 రోజులపాటు కేసీఆర్ దీక్ష కొనసాగగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాటి యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9న హామీ ఇవ్వడంతో కేసీఆర్ దీక్ష విరమించారు. -
తెరాస మలేషియా ఆధ్వర్యంలో 'కేసీఆర్ దీక్షా దివస్'
కౌలాలంపూర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు దీక్షా దివస్. ఆ మహత్తర సందర్భాన్ని తెలంగాణ ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటున్నారు. దీక్షా దివస్ చేపట్టి నవంబర్ 29తో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా.. మలేషియా ఎన్నారై విభాగం కోఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపు మేరకు 'లైట్ హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోం' అసోసియేషన్‌ని సందర్శించి అక్కడి చిన్నారులకు కావాల్సిన స్టేషనరీ, పండ్లు అందజేశారు. వెల్ఫేర్ హోంలోని పిల్లల ఆర్థిక అవసరాల నిమిత్తం రూ. 20,000 నగదు ఇవ్వడం జరిగింది. కార్యక్రమం ఎన్నారై విభాగం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు అధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నారై విభాగం ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణ రావు నడిపెల్లి, రవితేజ, రఘునాథ్ నాగబండి, రవిందర్ రెడ్డి, హరీష్ గుడిపాటి, ఇతర సభ్యులు ఓం ప్రకాష్ బెజ్జంకి, శ్యామ్, సంతోష్ రెడ్డి, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లండన్‌లో ఘనంగా కేసీఆర్-దీక్షా దివస్
లండన్ : లండన్‌లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్-యూకే ఆధ్వర్యంలో ఏడవ వార్షికోత్సవ, కేసీఆర్-దీక్షా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ చేసిన శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారై టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం వ్యాఖ్యానించారు. నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ తలపెట్టిన దీక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక ఘట్టంగా భావించి, ఆ రోజును దీక్ష దివస్ గా జరుపుకుంటున్నామన్నారు. సరిగ్గా ఏడుసంవత్సరాల క్రితం 'తెలంగాణ వచ్చుడో -కేసీఆర్ సచ్చుడో' అనే నినాదంతో తల పెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలక ఘట్టం అని పేర్కొన్నారు. ఉపాధ్యక్షులు అశోక్ దూసరి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి సకల జనులను ఏకం చేసి, శాంతియుత పోరాటంతో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని తెలిపారు. ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ..నాడు భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీజీ ఎంచుకున్న అహింసా పద్దతిని మన తెలంగాణ గాంధీజీ - కేసీఆర్ పాటించి రాష్ట్ర సాధనోద్యమంలో ఎటువంటి హింసకు తావు లేకుండా తెలంగాణ తీసుకువచ్చారని కేసీఆర్‌ని ప్రశంసించారు. రాబోవు 2019 ఎన్నికల్లో ఒక నిర్థిష్ట మైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, తెరాస ప్రభుత్వం చేప్పట్టిన అభివృద్ధిని, నియోజికవర్గాలుగా ప్రజలకందించిన సేవలను సంక్షిప్తంగా ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించినట్టు తెలిపారు. -
‘కింగ్.. మండేలా.. క్యాస్ట్రో.. గాంధీ.. కేసీఆర్’
హైదరాబాద్: అమెరికాకు మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికాకు నెల్సన్ మండేలా, క్యూబాకు ఫిడెల్ క్యాస్ట్రో, ఇండియాకు గాంధీజీ ఎలాగో తెలంగాణకు కేసీఆర్ అలాంటి వ్యక్తని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అభివర్ణించారు. తెలంగాణ ఏర్పాటును అనివార్యం చేసిన కేసీఆర్ నవంబర్ 29వ తేదీ దీక్ష చరిత్రలో నిలిచిపోయే రోజని ఆయన అన్నారు. కేసీఆర్ దీక్ష చేసి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే జరిగేది కాదన్నారు. ఆయన రాష్ట్రం కోసం అనేక అవమానాలను ఎదుర్కొన్నారని తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలు కేసీఆర్‌ను హేళన చేయటం మానలేదన్నారు. అయితే, విపక్షాల హేళనలను తాము పట్టించుకోమని, కేవలం ప్రజలనే తాము పట్టించుకుంటామని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రభాకర్ ఖండించారు. ఓ వైపు బంద్‌కు పిలుపునిచ్చి వరంగల్‌లో సభ పెట్టుకోవటం సురవరం ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు క్యాపిటలిస్టులుగా మాట్లాడుతుండటం విడ్డూరమన్నా -
‘దీక్షా దివస్ కాదు.. సోనియా కృతజ్ఞతా దివస్’
హైదరాబాద్: కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ వచ్చిందని టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సవాలు చేసుకోవటం సరికాదని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆరు దశాబ్దాల ఉద్యమాన్ని.. సకల జనుల మనసెరిగి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఆయన చెప్పారు. అందుకే దీక్షా దివస్ బదులు.. సోనియా కృతజ్ఞతా దివస్ నిర్వహించి, ఢిల్లీలో సోనియాను కలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని అప్పట్లో అన్న కేసీఆర్.. ఇప్పుడేమో కాంగ్రెస్‌పై బురదజల్లుతున్నారని విమర్శించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియంతృత్వ నిర్ణయాలకు.. ఉద్యమ నేతగా చెప్పుకునే కేసీఆర్ గుడ్డిగా మద్దతు ఇవ్వటం దారుణమని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుపై కేబినెట్లో చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్, సామాన్యుల ఇబ్బందులు పట్టనట్లు మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. కొన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి డబ్బులు వెళుతున్నా.. తెలంగాణకు లిక్విడ్ మనీ తీసుకురావాలన్న ఆలోచన కూడా కేసీఆర్‌కు లేదని విమర్శించారు. నగదు రహిత లావాదేవీలపై గ్రామీణ ప్రజలకు ఎంతమేర అవగాహన ఉందని ప్రశ్నించారు. ఈ అంశంపై కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. -
తెలంగాణ భవన్లో ఘనంగా దీక్షా దివాస్
-
తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్
కరీంనగర్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 2009 నవంబర్ 29న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ నాయకులు మంగళవారం దీక్షా దివస్ నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్‌లో దీక్షా దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే శోభ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జెడ్పీ చెర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మేయర్ రాందార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. బెజ్జంకిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వరంగల్ నగరం హన్మకొండలో కాళోజీ విగ్రహం వద్ద దీక్షా దివస్‌లో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ పాల్గొని నాటి కేసీఆర్ దీక్ష, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వైనం గురించి ప్రసంగించారు. -
29న టీఆర్ఎస్ ‘దీక్ష దివస్’
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ 2009లో ఆమరణ దీక్ష మొదలు పెట్టిన రోజుకు గుర్తుగా టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 29న మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో ‘దీక్ష దివస్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు వెల్లడించారు. మాజీ మంత్రి కడియం శ్రీహరితో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 30 నుంచి డిసెంబర్ 12 వరకు పార్టీ శ్రేణులకు రెండో విడత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు కడియం శ్రీహరి తెలిపారు.