సాక్షి,హైదరాబాద్: దీక్షా దివస్‌ను నవంబర్ 29వ తేదీన ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.రేవంత్‌రెడ్డి పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిర్బంధాలు మళ్ళీ వచ్చాయన్నారు. తెలంగాణభవన్‌లో ఆదివారం(నవంబర్ 24) కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘కేసీఆర్ స్పూర్తితో కాంగ్రెస్ కబంద హస్తాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకుంటాం. 2009 నవంబర్29 కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగింది.నవంబర్ 29న 33జిల్లా కేంద్రాల్లో దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహిస్తాం.దీక్షా దివస్‌లో కేసీఆర్ పాల్గొనడం లేదు. 26న అన్ని జిల్లా కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తాం.
తెలంగాణపై కేసీఆర్ దీక్ష చెరగని ముద్ర వేసింది.కేసీఆర్ దీక్ష విమరణ రోజైన డిసెంబర్ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. దీక్షకు గుర్తుగా 29న నిమ్స్ లో రోగులకు అన్నదానం చేస్తాం.రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మెడలు వంచుతాం.ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్పూర్తితో ముందుకు వెళతాం’అని కేటీఆర్ తెలిపారు.
ఇదీ చదవండి: అది నోరైతే నిజాలు వస్తాయి: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment