అది నోరైతే నిజాలు వస్తాయి.. అదే మూసీ అయితే.. సీఎంపై కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు | Ex Minister Ktr Tweet On Cm Revanth Reddy | Sakshi
Sakshi News home page

అది నోరైతే నిజాలు వస్తాయి.. అదే మూసీ అయితే.. సీఎంపై కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

Published Sun, Nov 24 2024 8:34 AM | Last Updated on Sun, Nov 24 2024 11:22 AM

Ex Minister Ktr Tweet On Cm Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: రేవంత్ రెడ్డి..  నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. అది నోరైతే నిజాలు వస్తాయి.. అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయి’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నావ్’’ అంటూ ఎక్స్‌ వేదికగా నిలదీశారు.

‘‘నీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కొడంగల్ లో భూసేకరణ ఫార్మా విలేజ్‌ల కోసం అని స్పష్టంగా వెల్లడిస్తుంది. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలు మార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేస్తివి. తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతాఖానీ కొడితివి. మీ అన్న తిరుపతి  లగచర్ల చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా?. ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి,జైళ్లకు పంపి అక్రమ నిర్భంధం, అణచివేత కొనసాగించడం లేదా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నలు గుప్పించారు.

‘‘ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నావ్. చెప్పెటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్దాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నావు’’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: కమలదళం.. ద్విముఖ వ్యూహం!

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement