తెలంగాణ వ్యాప‍్తంగా దీక్షా దివస్
కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్‌ఎస్ నాయకులు దీక్షా దివస్ నిర్వహిస్తున్నారు.
కరీంనగర్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 2009 నవంబర్ 29న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం దీక్షా దివస్ నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్‌లో దీక్షా దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే శోభ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జెడ్పీ చెర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మేయర్ రాందార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడలో టీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వరంగల్ నగరం హన్మకొండలో కాళోజీ విగ్రహం వద్ద దీక్షా దివస్‌లో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ పాల్గొని నాటి కేసీఆర్ దీక్ష, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వైనం గురించి ప్రసంగించారు.