లండన్ : లండన్‌లో ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్-యూకే ఆధ్వర్యంలో ఏడవ వార్షికోత్సవ, కేసీఆర్-దీక్షా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ చేసిన శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారై టీఆర్ఎస్ విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం వ్యాఖ్యానించారు. నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ తలపెట్టిన దీక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక ఘట్టంగా భావించి, ఆ రోజును దీక్ష దివస్ గా జరుపుకుంటున్నామన్నారు. సరిగ్గా ఏడుసంవత్సరాల క్రితం 'తెలంగాణ వచ్చుడో -కేసీఆర్ సచ్చుడో' అనే నినాదంతో తల పెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కీలక ఘట్టం అని పేర్కొన్నారు.
ఉపాధ్యక్షులు అశోక్ దూసరి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే క్రమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి సకల జనులను ఏకం చేసి, శాంతియుత పోరాటంతో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శమని తెలిపారు. ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి మాట్లాడుతూ..నాడు భారత స్వాతంత్ర ఉద్యమానికి గాంధీజీ ఎంచుకున్న అహింసా పద్దతిని మన తెలంగాణ గాంధీజీ - కేసీఆర్ పాటించి రాష్ట్ర సాధనోద్యమంలో ఎటువంటి హింసకు తావు లేకుండా తెలంగాణ తీసుకువచ్చారని కేసీఆర్‌ని ప్రశంసించారు. రాబోవు 2019 ఎన్నికల్లో ఒక నిర్థిష్ట మైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, తెరాస ప్రభుత్వం చేప్పట్టిన అభివృద్ధిని, నియోజికవర్గాలుగా ప్రజలకందించిన సేవలను సంక్షిప్తంగా ప్రచురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీర్మానించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment