
నినాదాలు చేస్తున్న లండన్ టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు
లండన్ : తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు లండన్‌లోని ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే సెల్ ఆధ్వర్యంలో అంగరంగవైభవంగా జరిగాయి. ఈ సెల్ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల అధ్యక్షతన కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి భారీగా తెలంగాణ తెరాస కార్యకర్తలు, ఇతర ప్రవాసులు హాజరయ్యారు.
కేసీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మించే క్రమంలో భగవంతుడు వారికి అన్ని సందర్భాల్లో మనోధైర్యాన్ని, ఆశిస్సులను అందించాలని కోరుకుంటున్నానని ఉపాధ్యక్షులు అశోక్ దూసరి ప్రసంగించారు. నవీన్ రెడ్డి మాట్లాడుతూ..‘మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్‌కు కేసీఆర్, ఎంపీ కవిత ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. ప్రతి తెలంగాణ బిడ్డ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడం చారిత్రక అవసరం’ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల గురించి సెక్రటరీ సృజన్‌రెడ్డి వివరిస్తూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకుని, అందరి సూచనలను తీసుకుని ముందుకు వెళ్తోంది, ఎవరైనా సరే తమ సలహాలు, సూచనలు సోషల్‌మీడియా ద్వారా, వ్యక్తిగతంగానైనా సరే తెలియజేయాలని అన్నారు. అనంతరం ఈస్ట్ లండన్ ఇంచార్జ్ రమేశ్ యెసంపల్లి, ఐటీ సెక్రటరీ వినయ్ ఆకుల ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్‌ఎస్ ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజర్ బోర్డ్ సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి , సత్యం రెడ్డి కంది, సెక్రటరీ సేరు సంజయ్, సృజన్ రెడ్డి , మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, యూకె అండ్ ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి, ఐటీ సెక్రటరీ వినయ్ ఆకుల, ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేశ్ యెసంపల్లి, ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ రవి ప్రదీప్ , వెస్ట్ లండన్ ఇంచార్జ్ బుడగం, ముఖ్య సభ్యులు రవికుమార్ రత్తినేని, అశోక్ కుమార్, అంతగిరి రాఘవేందర్, మహేందర్ రెడ్డి, టాక్ సభ్యులు మట్టా రెడ్డి తదితరులు హాజరయ్యారు.

వేడుకలకు ముస్తాబైన ప్రాంగణం


ఆనందంతో కేక్ కట్ చేస్తున్న దృశ్యం

కలిసి కట్టుగా కేక్‌ను కట్ చేస్తున్న నాయకులు
Comments
Please login to add a commentAdd a comment