జీవిత భాగస్వామి కోసం తెలిసిన వారికి చెప్పడమో.. ఏ పెళ్లిల పేరయ్య దగ్గరికి వెళ్లడమో.. మ్యాట్రిమోనీ సైట్‌నో ఆశ్రయిస్తారు చాలా మంది మగవాళ్లు.. కానీ లండన్‌లో ఉన్న ఈ ఎన్నారై వీటన్నింటికీ భిన్నమైన పద్దతిని ఎన్నుకున్నాడు. వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు
నాకొక శ్రీమతి కావాలి..అంటూ ఏకంగా లండన్ నగరంలో బిజీగా ఉండే ఏరియాల్లో హోర్డింగులు ఏర్పాటు చేశాడు జీవన్ బచ్చు అనే నాన్ రెసిడెంట్ ఇండియన్. తనకు కుల మత పట్టింపులు లేవని.. అయితే తన జీవిత భాగస్వామిగా వచ్చే అమ్మాయి సంసార పక్షంగా ఉంటూ వినయ విధేయతలు కలిగి మరీ జీవితాన్ని సీరియస్‌గా తీసుకోని వ్యక్తి అయితే చాలంటూ ఆ హోర్డింగులో పేర్కొన్నాడు. అంతేకాదు తను ఎక్కడ పని చేసేంది తన జీతభత్యాలు ఎంత అనే వివరాలు పొందు పరిచాడు.
ఆసక్తి ఉన్న అమ్మాయిలు సంప్రదించేందుకు ఫైడ్‌జీవన్‌ఏవైఫ్ డాట్‌కామ్ పేరుతో ఓ వైబ్‌సైట్ కూడా క్రియేట్ చేశాడు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా నెలకు రెండు వేల యూరోలు సంపాదిస్తూ ఒడ్డు పొడుగు ఉన్న జీవన్ కోసం ఇప్పటికే యాభై మందికి పైగా అమ్మాయిలు అప్రోచ్ అయ్యారట? అయితే ఇందులో కొందరు జెన్యూన్‌గా ఉండగా మరికొందరు ఫేక్ అంటున్నాడు జీవన్.
మొదటి దశలో ఇచ్చిన యాడ్స్‌తో తనకు నచ్చిన వ్యక్తి తారసడలేదంటున్నాడు జీవన్. అయితే తన ప్రయత్నాలు ఆపనంటున్నాడు. రెండో సారి ఇతర ప్రాంతాల్లో హోర్డింగులను అద్దెకు తీసుకుని తన సోల్‌మేట్ కోసం ప్రయత్నిస్తానని చెబుతున్నాడు.
మొత్తంగా జీవన్ బచ్చు ఏర్పాటు చేసిన హోర్డింగులు లండన్‌లో చర్చకు దారి తీశాయి. ఎవరీ వ్యక్తి అంటూ ఆరా తీసేవారు ఎక్కువయ్యారు. కొద్ది రోజుల్లోనే మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ అవుతున్నాడు జీవన్ బచ్చు. అయితే అతను కోరుకున్న పిల్ల మాత్రం ఇంకా దొరకడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment