దమ్ముంటే రా!.. ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలే చెబుతారు: కేటీఆర్‌ | BRS Working president KTR Comments At Diksha Divas Karimnagar | Sakshi
Sakshi News home page

దమ్ముంటే రా!.. ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలే చెబుతారు: కేటీఆర్‌

Published Fri, Nov 29 2024 2:21 PM | Last Updated on Fri, Nov 29 2024 3:53 PM

BRS Working president KTR Comments At Diksha Divas Karimnagar

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణకు పునఃర్జన్మనిచ్చింది కరీంనగర్‌ అని తెలిపారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి జన్మస్థలం కరీంనగర్‌ అని, ఆనాడు 370 మంది అమరుల సాక్షిగా మొదటిసారిగా 11 సీట్లు బీఆర్‌ఎస్‌కు వచ్చాయని తెలిపారు. 

కరీంనగర్‌లోని అల్గునూర్‌లో దీక్షా దీవస్‌ సభలో శుక్రవారం కేటీఆర్‌ మాట్లాడుతూ.. 1956 నుంచి 1968వరకు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందని తెలిపారు. తొలిదశ ఉద్యమంలో 370 మంది బలిదానం అయ్యారని.. 1971 నుంచి 30 ఏళ్ళ పాటు మేధావులు ఉద్యమకారులు ఎదురు చూశారని చెప్పారు. అప్పుడే కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చిన కేసీఆర్‌.. కరీంనగర్ సింహగర్జనతో ఉద్యమబాట పట్టాడని పేర్కొన్నారు. 

పదవులు త్యాగం చేసి 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్‌ తెలంగాణ పోరాటాన్ని రగిల్చారని.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారని తెలిపారు. కేసీఆర్‌ దీక్షతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. 2001 నుంచి 2014 వరకు ప్రజా ఉద్యమం సాగించారని చెప్పారు.

‘ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంతో విధిలేని పరిస్థితుల్లో అనాడు కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చింది. రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్, తెలంగాణ ప్రజలకు దక్కుతుంది. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ అడుక్కునే పరిస్థితి అంటున్నారు నేడు గద్ధెనెక్కినవారు. వారు కేసీఆర్‌ కాలి గోరుకు సరిపోరు. ఎక్కడికైనా పోదాం.. ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలు చెబుతారు. దమ్ముంటే రా... పోదాం ఎక్కడికైనా. ఏదో సాధించినట్లు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు లేకుండా పోతే వీపు చింతపండు చేసే పరిస్థితి ఉంది’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఉద్యమంతోనే తెలంగాణను సాధించాం: కేటీఆర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement