కేంద్ర మంత్రుల పోస్టులు.. ఖండించిన కరీంనగర్‌ పోలీసులు | Ministers Kishan Reddy And Sanjay Serious Comments On TG Police | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రుల పోస్టులు.. ఖండించిన కరీంనగర్‌ పోలీసులు

Published Mon, Mar 10 2025 11:38 AM | Last Updated on Mon, Mar 10 2025 1:35 PM

Ministers Kishan Reddy And Sanjay Serious Comments On TG Police

సాక్షి, హైదరాబాద్‌: ఛాంపియన్స్ ట్రోఫీ విజయ సంబురాల్లో జరిగిన పరిణామాలపై కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే లాఠీ ఛార్జ్‌ ఆరోపణలను కరీంనగర్‌ పోలీసులు ఖండిస్తూ ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేశారు.

కరీంనగర్‌లో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీలు ఝళిపించారని కేంద్ర మంత్రులు పోస్టులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలని పేర్కొంటూ.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వాటిని పోస్ట్‌ చేశారు. అయితే.. 

విజయ సంబురాల్లో ఎలాంటి లాఠీ ఛార్జ్‌ జరగలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ కేంద్ర మంత్రుల ట్వీట్స్ ప్రెస్‌ నోట్‌ ద్వారా పోలీసులు వివరణ ఇచ్చారు. అవి ఫేక్‌ వీడియోలంటూ స్పష్టత ఇచ్చారు. 

ఇదిలా ఉంటే.. కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేసి వారిని చెదరగొట్టారంటూ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనలపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ స్పందించారు. కిషన్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా.. భారత జట్టు విజయం సాధించిన సందర్బంగా విజయోత్సవాలను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం, అనుమతి ఇవ్వకపోవడం సిగ్గు చేటు అంటూ మండిపడ్డారు.

బండి సంజయ్‌ కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘కరీంనగర్ పోలీసులు ఏ దేశానికి మద్దతు ఇస్తున్నారు?. భారత విజయాన్ని మనం జరుపుకోలేము.. కానీ, పాకిస్తాన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీని తొలగిస్తారా?. భారత విజయాన్ని జరుపుకోవడం మతపరమైన సమస్యగా ఎలా మారుతుంది?. శాంతిభద్రతల సమస్యలను సృష్టించడానికి ఎందుకు అంత ఆసక్తిగా ఉన్నారో తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement