
సాక్షి, కరీంనగర్ జిల్లా: కిషన్ రెడ్డి నాయకత్వంలో ఇది నాల్గో విజయం.. సమన్వయంతో పని చేయడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందని కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. మోదీ నీతివంతమైన పాలనను ఓటర్లు గుర్తించారన్నారు.
ఈవీఎంలను తప్పుబడుతున్న రాహూల్ గాంధీ ఈ బ్యాలెట్ విజయంపై ఇప్పుడు మాట్లాడాలి. ఓటుకు 5 వేలు పంచారు కాంగ్రెస్ వాళ్లు. బీజేపీని ఓడగొట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైంది. బీఎస్పీ అభ్యర్థికి బీఆర్ఎస్ సపోర్ట్ చేయడంతోనే ఆయన మూడో స్థానానికి పడిపోయాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కలిసి పన్నిన కుట్రలను ప్రజలు గమనించారు. సొమ్మొక్కడిది సోకొక్కడిదన్నట్టు కేంద్రం నిధులిస్తే ఇక్కడి ప్రభుత్వం తానే గొప్పలు పోతోంది. కాంగ్రెస్ దిగిరావాలి.. మీకు ఐదు ఉమ్మడి జిల్లాల్లో తీర్పునిచ్చారు. మీ ఆరు గ్యారంటీలపై సమాధానం ఏంటో కాంగ్రెస్ ఇప్పటికైనా చెప్పాలి
‘‘శాసనమండలిలో గడగడలాడించేందుకు మా ముగ్గురు ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్‌పై బీసీలు వ్యతిరేకత చూపారు. ముస్లింలను కలపడాన్ని బీసీలు వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment