‘కింగ్.. మండేలా.. క్యాస్ట్రో.. గాంధీ.. కేసీఆర్’
‘కింగ్.. మండేలా.. క్యాస్ట్రో.. గాంధీ.. కేసీఆర్’
Published Tue, Nov 29 2016 4:42 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
హైదరాబాద్: అమెరికాకు మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికాకు నెల్సన్ మండేలా, క్యూబాకు ఫిడెల్ క్యాస్ట్రో, ఇండియాకు గాంధీజీ ఎలాగో తెలంగాణకు కేసీఆర్ అలాంటి వ్యక్తని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అభివర్ణించారు. తెలంగాణ ఏర్పాటును అనివార్యం చేసిన కేసీఆర్ నవంబర్ 29వ తేదీ దీక్ష చరిత్రలో నిలిచిపోయే రోజని ఆయన అన్నారు. కేసీఆర్ దీక్ష చేసి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే జరిగేది కాదన్నారు. ఆయన రాష్ట్రం కోసం అనేక అవమానాలను ఎదుర్కొన్నారని తెలిపారు.
ఇప్పటికీ కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలు కేసీఆర్‌ను హేళన చేయటం మానలేదన్నారు. అయితే, విపక్షాల హేళనలను తాము పట్టించుకోమని, కేవలం ప్రజలనే తాము పట్టించుకుంటామని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రభాకర్ ఖండించారు. ఓ వైపు బంద్‌కు పిలుపునిచ్చి వరంగల్‌లో సభ పెట్టుకోవటం సురవరం ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు క్యాపిటలిస్టులుగా మాట్లాడుతుండటం విడ్డూరమన్నా
Advertisement