mlc karne prabhakar
-
ఆంధ్రా ఏజెంటుగా ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రాకు ఏజెంటుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి మొదటి శత్రువు కాంగ్రెస్సే అని మరోసారి రుజువైందన్నారు. విభజన చట్టం లో ని హామీలు ఏపీకి అమలు చేస్తే అభ్యంతరం లేదని, ఆ పరిధి దాటి ముందుకెళితే ప్రతిఘటిస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ కష్టపడుతుంటే కాంగ్రెస్ దానికి అడుగడుగునా అడ్డుపడుతోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎండబెట్టి ఏపీకి ప్రయోజనం చేయడమే కాంగ్రెస్ విధానమన్నారు. ఉద్యోగాల నియామకంపై కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. -
తెలంగాణపై ఉత్తమ్‌ది మొసలి కన్నీరు: కర్నె
సాక్షి, హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ కోసం రాజీనామా చేద్దామంటే ఢిల్లీకి పారిపోయి తన మంత్రి పదవిని కాపాడుకున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. -
ప్రజలు సంతోషాన్ని చూడలేకపోతున్నారు!
ప్రతిపక్షాలపై కర్నె ధ్వజం సాక్షి, హైదరాబాద్: కుల వృత్తులను బలోపేతం చేసేందుకు వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోం దని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. వివిధ కులాలకు చెందిన ప్రజలంతా సంతోషంగా ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం బాధపడుతున్నాయన్నారు. గడిచి న రెండు దశాబ్దాల్లో చెరో పదేళ్లు పాలిం చిన కాంగ్రెస్, టీడీపీలు కులవృత్తులను సర్వనాశనం చేశాయన్నారు. ఈ పరిస్థితు ల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుం టోందన్నారు. దీనిలో భాగంగానే మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 1,500 గొర్రెల యూనిట్ల (ఒక్కో యూనిట్‌కు 20+1 గొర్రెలు) పంపిణీ కార్యక్రమం మొదలైందన్నారు. -
‘దయ్యాలు వేదాలు వల్లించడమే... ’
హైదరాబాద్: ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తాండూర్‌లో చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ నేతలు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. భూదందాలు ,అత్యధిక అరాచకాలు చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సంపత్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. తెలంగాణ అభివృద్ధి అడ్డుకోవడమే కాంగ్రెస్ అజెండా అని చెప్పారు. పాలమూర్లో కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులకు అడ్డుపడుతుంటే రంగారెడ్డి లో కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులు కావాలంటూ పాదయాత్రలు చేస్తున్నారు . ఇదేం ద్వంద్వ నీతి అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మీ ఏలుబడిలో దివాళా తీయించారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించేది కేంద్రమే అనే సంగతి కాంగ్రెస్ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. ఉత్తమ్ ,పొన్నాల వంటి వారికి ఈ విషయాలు తెలిసే ధర్నాలు చేస్తున్నారా అని సూటిగా అడిగారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరపతి కోల్పోయిందని, త్వరలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమన్నారు. అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, మన రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానమేమిటో ప్రజలు రుచి చూపించారని అన్నారు. కాంగ్రెస్ లోని అజ్ఞానులు చిల్లర మల్లర ఆరోపణలు చేస్తే పట్టించుకోమని తెలిపారు. సంపత్ ఇక నైనా కేటీఆర్‌పై ఆరోపణలు మానుకో .. లేకుంటే ప్రజలే నీకు బుద్ది చెబుతారని హెచ్చరించారు. టీఆర్ఎస్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు తమ ఆరోపణలు నిరూపించక పోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. కేటీఆర్‌ను విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టేనని అన్నారు. -
‘ఆయన కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్’
హైదరాబాద్: కోదండరాం మొదటి నుంచి రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్టు తేట తెల్లమైందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ విమర్శించారు. పార్టీ పెట్టడంపై తాజాగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు తమ అనుమానాలు నిజమని నిరూపిస్తున్నాయన్నారు. అన్ని వర్గాలు తెలంగాణ ఉద్యమంలో కలిసి రావాలని ఆనాడు కేసీఆర్ టీజేఏసీ ని ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. కోదండరాం ను చైర్మన్ గా చేసింది కేసీఆర్ యే అన్నారు. తెలంగాణ ఏర్పాటుకాగానే జేఏసీ అవసరం తీరిపోయిందని.. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు వైదొలిగినా ప్రజా సంఘాలతో కొనసాగుతున్న జేఏసీ రాజకీయాలే లక్ష్యంగా పనిచేయడం దురదృష్టకరమన్నారు. ప్రొఫెసర్ గా నిజాలు చెప్పాల్సిన కోదండరామ్ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని.. ఉద్యోగ నియామకాల పై ఆయన చేస్తున్న ప్రకటనలు తప్పని నిరూపించేందుకు వాస్తవాలతో కూడిన పత్రం పంపిస్తామన్నారు. దాదాపు 32 వేల ఉద్యోగాలను ప్రభుత్వం ఇప్పటికే భర్తీ చేసిందని, కోదండరాం కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్ గా మారారని విమర్శించారు. ' నాలుగు రోజుల కింద ఉత్తమ్ నోటి నుంచి వచ్చిన మాటలే ఇపుడు కోదండరాం మాట్లాడుతున్నారు.. కోదండరాం ముసుగు తొలిగింది.. ఆయన పట్ల ప్రజల్లో భ్రమలు కూడా తొలిగి పోయాయి. కోదండ రామ్ కు పార్టీ పెట్టె హక్కు ఉంది. పార్టీ పెట్టి కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని కొన్ని సీట్లు తనవారికి ఇప్పించుకోవాలన్నదే కోదండరాం తపన. రాజకీయేతర సంఘాల ముసుగులో కోదండరాం రాజకీయాలు చేయడంమీదే మా అభ్యంతరం.. నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకే కోదండరాం ర్యాలీ కి పిలుపు నిచ్చారు. హింసను ప్రేరేపించేందుకు యత్నిస్తూ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కోదండరాం ర్యాలీ కి అనుమతి ఇవ్వాలా.. వద్దా అనేది పరిస్ధితులను బట్టి డీజీపీ నిర్ణయం తీసుకుంటారు. అబద్దాలతో నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి అశాంతి నెలకొంటున్నదంటూ కోదండ రామ్ మాట్లాడుతుండడం విడ్డూరం. లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది. అంతవరకు కోదండరాం కు తొందరపాటు తగదు' అని కర్నె ప్రభాకర్ ఆరోపించారు. -
'జీవితాంతం ఉత్తమ్ గడ్డంతో ఉండాల్సిందే'
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాల ప్రచారం చేయడంలో దిట్ట అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన విమర్శించారు. అధికారం లేకపోయే సరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వంపై అబద్దాలను మళ్లీ మళ్లీ చెబుతున్నారన్నారు. బుధవారమిక్కడ కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యమున్న అంశాలను అసెంబ్లీలో చర్చించలేదని ఉత్తమ్ పేర్కొనడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ఉత్తమ్ ప్రజా వ్యతిరేకిగా మాట్లాడుతున్నారని, ప్రజలకు ఉపయోగపడే అన్ని అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరిగిందని చెప్పారు. పేదల గృహ రుణాలు 3600 కోట్లు మాపీ చేయడం ప్రాధాన్యతా అంశం కాదా? మైనారిటీలకు చేయూత నివ్వడం, రైతులకు భరోసా ఇవ్వడం ముఖ్యమైన అంశాలు కాదా అని ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకు గడ్డం తీయబోనని ఉత్తం చెబుతున్నారని, వాళ్ల తీరు చూస్తుంటే ఉత్తమ్ జీవితాంతం గడ్డంతో ఉండాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత ఉత్తమ్ హిమాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి రావొచ్చని ఆయన చెప్పారు. -
‘కింగ్.. మండేలా.. క్యాస్ట్రో.. గాంధీ.. కేసీఆర్’
హైదరాబాద్: అమెరికాకు మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికాకు నెల్సన్ మండేలా, క్యూబాకు ఫిడెల్ క్యాస్ట్రో, ఇండియాకు గాంధీజీ ఎలాగో తెలంగాణకు కేసీఆర్ అలాంటి వ్యక్తని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అభివర్ణించారు. తెలంగాణ ఏర్పాటును అనివార్యం చేసిన కేసీఆర్ నవంబర్ 29వ తేదీ దీక్ష చరిత్రలో నిలిచిపోయే రోజని ఆయన అన్నారు. కేసీఆర్ దీక్ష చేసి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే జరిగేది కాదన్నారు. ఆయన రాష్ట్రం కోసం అనేక అవమానాలను ఎదుర్కొన్నారని తెలిపారు. ఇప్పటికీ కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలు కేసీఆర్‌ను హేళన చేయటం మానలేదన్నారు. అయితే, విపక్షాల హేళనలను తాము పట్టించుకోమని, కేవలం ప్రజలనే తాము పట్టించుకుంటామని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రభాకర్ ఖండించారు. ఓ వైపు బంద్‌కు పిలుపునిచ్చి వరంగల్‌లో సభ పెట్టుకోవటం సురవరం ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు క్యాపిటలిస్టులుగా మాట్లాడుతుండటం విడ్డూరమన్నా -
సర్వే ఫలితాలతో కాంగ్రెస్ మైండ్ బ్లాంక్
సాక్షి, హైదరాబాద్ : సర్వే ఫలితాల్లో టీఆర్ఎస్ పాలనకు వస్తున్న ప్రజాధరణను చూసి కాంగ్రెస్ పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అవుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్ రెండున్నరేళ్ల పాలనకు 72 శాతానికిపైగా ప్రజల మద్దతు రావడం చూసి సీఎల్పీ నేత జానారెడ్డి, మండలి నేత షబ్బీర్ అలీ ఏం చేయాలో పాలుపోలేని పక్షంలో ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నోరుపారేసుకుంటున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ కాలంలో లక్షా 50వేల మందిని అరెస్టు చేసి, జైళ్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు సౌకర్యార్థంగా ప్రభుత్వం కొత్త సచివాలయ భవనాన్ని నిర్మిద్దామంటే ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సచివాలయంలో కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం సచివాలయంలో, కనీసం పార్కింగ్ సౌకర్యం లేదని, అందులో కొన్ని భవనాలు నిజాం కాలంలో కట్టినవి కాగా, మరికొన్ని 50 నుంచి 60 ఏళ్ల కిందట నిర్మించినవని పేర్కొన్నారు. ఒక ఆఫీసు సెక్రటేరియట్లో, మరొకటి ఎర్రగడ్డలో, ఇంకొకటి మలక్‌పేటలో ఉంటే ప్రజలకు ఇబ్బంది కాదా.. అని ప్రశ్నించారు. జేఏసీ చైర్మన్ కోదండరాం విపక్షాలా ఎజెండా మోస్తున్నారని, తెలంగాణ ప్రజల్లో తన గౌరవాన్ని తగ్గించుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు వద్దనే రీతిలో వ్యవహరిస్తున్న కోదండరాం రైతు దీక్ష ఎలా చేస్తారని కర్నె ప్రశ్నించారు. రైతులకు మేలు చేసే ప్రాజెక్టులను ఒక పక్క వ్యతిరేకిస్తూ మరో పక్క దీక్ష చేయడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం కాదా అని నిలదీశారు. సమయం కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వం మీద గుడ్డి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కోదండరాం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అభినందించలేక పోతున్నారని విమర్శించారు. -
హైదరాబాద్‌కు శనిలా ప్రతిపక్షాలు: కర్నె
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలు హైదరాబాద్ నగరాభి వృద్ధికి సహకరించకపోగా కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజ మెత్తారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు హైదరాబాద్‌కు శనిలా పట్టాయని అన్నారు. గత టీడీపీ, కాంగ్రెస్‌ల పాలన కాలంలోనే అద్భుత హైదరాబాద్ వికృత నగరంగా మారిందని విమర్శించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఆ రెండు పార్టీలు తమ పాలనలో హైదరాబాద్ భవిష్యత్‌ను పట్టించుకోలేదని, హైటెక్ అంటూ సినిమా చూపించాయే తప్ప పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ, నాణ్యమైన రోడ్ల నిర్మాణం, బస్తీల ప్రగతిని పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీల హయాంలో నాలాలు కబ్జా అయ్యాయని, చెరువులు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను దాదాపు ఆరు దశాబ్దాల పాటు గబ్బిలంలా పట్టుకున్న కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడు నాలాలు, లోతట్టు ప్రాంతాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. -
రైతుల ఉసురు పోసుకుంది కాంగ్రెస్సే
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో పా పాలే రైతుల ఉసురు తీశాయని, ఇప్పుడు తీరిగ్గా వారు రైతు గర్జన పేర నాటకాలు ఆడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నా రు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అధికారంలో ఉండగా నీటిపారుదల రంగాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు. -
తీవ్రవాదుల కంటే ప్రమాదకారులు
కాంగ్రెస్ నేతలపై కర్నె ధ్వజం సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ఎండబెట్టిన కాంగ్రెస్ నాయకులు మల్లన్నసాగర్ రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని, వాళ్లు తీవ్రవాదుల కన్నా ప్రమాదకారులని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. గురువారం ఆయనిక్కడ మాట్లాడుతూ.. ముంపు గ్రామాల ప్రజల సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని విపక్షాలు రెచ్చగొడుతన్నాయిని, ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తై తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే భయంతోనే అడ్డుకోడానికి కుట్రలు చేస్తున్నాయని కర్నె ఆరోపించారు. -
టీడీపీకి పుట్టగతులుండవు: కర్నె
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మోకాళ్లపై యాత్ర చేసినా తెలంగాణలో టీడీపీకి పుట్టగతులుండవని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ వ్యాఖ్యానించారు. అలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ఇంద్రవెల్లి దాకా పాదయాత్ర చేస్తానని ప్రకటించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. సోమవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో కర్నె విలేకరులతో మాట్లాడుతూ, టీటీడీపీ నాయకులు అలీబాబా అరడజను దొంగల్లా మారారని, మహానాడు సందర్భంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రా నేతలకు తాకట్టు పెట్టారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చంద్రబాబు ద్రోహం చేశారని, ఆయన నిర్వాకం వల్లే ఆ జిల్లా నుంచి లక్షలాది మంది వలసలు వెళ్లారని ఆరోపించారు. -
పగ్గాలివ్వండి.. మా పనేంటో చూపిస్తాం
చివరి రోజు ప్రచారంలో ఎంపీ కవిత నాగోల్: ‘రాష్ట్ర పగ్గాలు ఇచ్చారు. అదే చేతులతో నగర పాలనా పగ్గాలూ టీఆర్ఎస్కు ఇవ్వండి. మా పనేంటో చూపిస్తాం. అభివృద్ధితో నగరాన్ని మెరిపిస్తా’మని ఎంపీ కవిత అన్నారు. నగర మేయర్‌గా టీఆర్ఎస్ అభ్యర్థి ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. గతంలో మేయర్‌గా పనిచేసిన వారు ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. పార్టీ నాగోల్ డివిజన్ అభ్యర్థి చెరుకు సంగీతకు మద్దతుగా ఆదివారం బండ్లగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..‘18 నెలల్లోనే సీఎం కేసీఆర్ అనేక సమస్యలు పరిష్కరించారు. గ్రేటర్ పగ్గాలనూ ఆయనకు అప్పగిస్తే నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తారన్నా’రు. ‘గతంలో పాలకులు నగరాన్ని అభివృద్ధి చేయలేదు. మళ్లీ ఓటు వేయమని ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు. కుండ మోయలేని వారు బండను ఎలా మెస్తార’ని విమర్శించారు. డివిజన్లో అనేక సమస్యలున్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 96/1 సర్వే నెంబర్లో గుడిసెవాసులకు ఆమోద యోగ్యమైన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. సర్వే నెంబర్ 58లోని భూమి రిజిస్ట్రేషన్ కాలేదని, సీఎం సహాయంతో ఆ పట్టాలు కూడా ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. బండ్లగూడ, నాగోలు చెరువును మిషన్ కాకతీయ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తామన్నారు. సభలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆటాపాట ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, అభ్యర్థి చెరుకు సంగీత, రాష్ట్ర నాయకులు మల్లేశం, అనంతుల యాదగిరిరెడ్డి, నాగోలు సుధాకరాచారి, చెరుకు ప్రశాంత్, కట్టా ఈశ్వరయ్య, వస్పరి శంకర్, మెట్టు రవీందర్‌గౌడ్, గోల్కొండ మైసయ్య, డప్పు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గత పాలకులు నగరాన్ని ఏం అభివృద్ధి చేయలేదు. మళ్లీ ఓటు వేయమని ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు. కుండ మోయలేని వారు బండను ఎలా మోస్తారు -
'ప్రజలు రద్దు చేసిన పార్టీ.. టీడీపీ'
- ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని రద్దు చేయాలని టీడీపీ నాయకులు రాష్ట్రపతిని కలిశారని, కానీ, తెలంగాణ ప్రజలు టీడీపీని ఎప్పుడో రద్దు చేశారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. నిత్యం తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసమే పనిచేస్తున్న టీఆర్ఎస్ను రద్దు చేయమన్న మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన పార్టీ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతలు ఏ రాష్ట్రానికి చెందుతారో, అసలు మీరు ఏ పార్టీకి చెందినవారో ప్రజలు పూర్తిగా మరిచిపోయారని వ్యాఖ్యానించారు. సర్పంచులపై టీడీపీ నేతలకు అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందని, గతంలో రోడ్లపైకి వచ్చిన సర్పంచులను, ఇందిరాపార్కు వద్ద ధర్నా చే స్తున్న సర్పంచులను కొట్టించిన చరిత్ర వీళ్లదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో విజ్ఞతతో, విచక్షణతో పనిచేసిన దేవీప్రసాద్, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయ న కోరారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన డాక్టర్ శాడగొండ కరుణాకర్‌రెడ్డి పక్కకు తప్పుకుని తమ పార్టీ అభ్యర్థులిద్దరికీ మద్దతు తెలుపుతున్నారని పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
‘నక్సలైట్ల ఎజెండానే సర్కారు అమలు చే స్తోంది’
సాక్షి, హైదరాబాద్: సమ సమాజ నిర్మాణం కోసం పనిచేసిన వేలాది మందిని పొట్టన పెట్టుకున్న అప్పటి టీడీపీ ప్రభుత్వం.. అమాయక యువకుల్ని సైతం నక్సలైట్ల పేరుతో పిట్టల్లా కాల్చి చంపిందని, కానీ, తమ ప్రభుత్వం నక్సలైట్ల ఎజెండానే అమలు చేస్తోందని టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద నక్సలైట్ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. -
'కేసీఆరే అతిపెద్ద నక్సలైటు'
నక్సలైట్లది సామాజిక ఎజెండా అని, వాళ్ల ఎజెండానే తమ సర్కారు అమలు చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని, అసలు కేసీఆరే అతిపెద్ద నక్సలైటని ఆయన అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వాస్తవాలను విస్మరించి తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.