ఆంధ్రా ఏజెంటుగా ఉత్తమ్‌ | Uttam is Andhra covert | Sakshi
Sakshi News home page

ఆంధ్రా ఏజెంటుగా ఉత్తమ్‌

Published Thu, Jul 26 2018 5:15 AM | Last Updated on Thu, Jul 26 2018 5:15 AM

Uttam is Andhra covert - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రాకు ఏజెంటుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి మొదటి శత్రువు కాంగ్రెస్సే అని మరోసారి రుజువైందన్నారు. విభజన చట్టం లో ని హామీలు ఏపీకి అమలు చేస్తే అభ్యంతరం లేదని, ఆ పరిధి దాటి ముందుకెళితే ప్రతిఘటిస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ కష్టపడుతుంటే కాంగ్రెస్‌ దానికి అడుగడుగునా అడ్డుపడుతోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎండబెట్టి ఏపీకి ప్రయోజనం చేయడమే కాంగ్రెస్‌ విధానమన్నారు. ఉద్యోగాల నియామకంపై కాంగ్రెస్‌ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement