agent
-
ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?
అక్కినేని హీరో అఖిల్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ సినిమా విడుదలైన ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. పెద్ద పెద్ద సినిమాలే రిలీజైన 50 రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. గతంలో పలుసార్లు డేట్స్ అనౌన్స్ చేసినప్పటికీ స్ట్రీమింగ్కు రాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా.. ఏజెంట్ ఓటీటీ రైట్స్ సోని లివ్ కొనుగోలు చేసింది. ఈ నెలలో ఓటీటీ రావచ్చని ఫ్యాన్స్ భావించారు. కానీ స్ట్రీమింగ్ తేదీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల ఏజెంట్ సినిమాను సెప్టెంబరు 29న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేసింది. దీంతో అఖిల్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ ఆ తర్వాత సోనిలివ్ తమ సోషల్ మీడియాలో ఖాతా నుంచి ఏజెంట్ ప్రీమియర్ పోస్టర్ లను తొలగించింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో స్ట్రీమింగ్ అవుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. మరోవైపు అఖిల్ ధీర అనే చిత్రంలో నటిస్తున్నారు. -
పోస్టల్ బ్యాలెట్లపై భద్రం
సాక్షి, అమరావతి: పెద్ద ఎత్తున పోలైన పోస్టల్ బ్యాలెట్లు ఈసారి ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. పోలింగ్ శాతం పెరగడం, పోస్టల్ బ్యాలెట్లు 4.97 లక్షలకు పైగా పోల్ అయిన నేపథ్యంలో జూన్ 4 జరిగే ఓట్ల లెక్కింపుల్లో అత్యంత కీలకం కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎన్నికల సంఘం చివరి నిమిషంలో నిబంధనలు మార్చినందున లెక్కింపు విషయంలో ఏజెంట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా ఒక ఏజెంట్ పర్యవేక్షించాలని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు, లెక్కింపు విధానంపై ఏజెంట్లు ముందస్తు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.చెల్లనివిగా ఎప్పుడు పరిగణిస్తారంటే?» బ్యాలెట్ పేపరుపై ఓటు ఎవరికి నమోదు కాకపోవడం, ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినా తిరస్కరిస్తారు.» బ్యాలెట్ పేపరు చిరిగినా, గుర్తు పట్టలేనంతగా మారినా, ఓటు ఎవరికి వేశారో తెలిసే విధంగా ఏమైనా గుర్తులు లేదా ఏదైనా రాసి ఉన్నా తిరస్కరిస్తారు.» నకిలీ బ్యాలెట్ పేపర్లను తిరస్కరిస్తారు.» ఇలా తిరస్కరించిన ఓట్లన్నీ ఆర్వో పక్కన పెడతారు.» ప్రతీ దశలో చెల్లని ఓట్లను ఆర్వో విడివిడిగా కట్టలు కట్టి ఉంచాలి» ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థి ఓట్లు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లు కంటే తక్కువ ఉంటే వాటిని ఆర్వో తిరిగి పరిశీలిస్తారు.» తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను ఆర్వో, అబ్జర్వర్లు ఒకొక్కటే పరిశీలించి తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. డిక్లరేషన్ 13 ఏ అత్యంత కీలకం» ఓటరు తన ఓటును కవర్ ‘ఏ’లో పొందుపరచి దానికి డిక్లరేషన్ 13 ఏ జత చేసి ఈ రెండింటినీ కవర్ ‘బీ’లో ఉంచి బ్యాలెట్ బాక్స్‌లో వేస్తారు.» బ్యాలెట్ బాక్స్ నుంచి కవర్ బీ తెరవగానే ముందుగా బ్యాలెట్ పేపర్ ఉండే కవర్ ‘ఏ’ ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు.» కవర్ బీ తెరవగానే అందులో ఫారం 13 సీలో రెండు డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. బ్యాలెట్ పేపర్ (ఫారం 13 బీ) ఉండే కవర్ ఏ, ఓటరు ఇచ్చిన డిక్లరేషన్ 13 ఏ ఫారం ఉండాలి» ఈ రెండూ విడివిడిగా లేకపోతే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించి పక్కన పెట్టాలి.» ఆ తర్వాత 13 ఏ డిక్లరేషన్ సరిగా ఉందా? లేదా? అన్నది పరిశీలించాలి.» ఈ డిక్లరేషన్ ఫారంపై ఓటరు సంతకంతోపాటు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీల్ ఉందో లేదో పరిశీలించాలి.» ఒకవేళ అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, సీల్ లేకపోయినా ఆ ఓటును తిరస్కరించవద్దని ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.» అటెస్టింగ్ అధికారి సంతకంపై అనుమానం ఉంటే ఏజెంట్లు తమ అభ్యంతరాన్ని ఆర్వోకు తెలియచేయాలి.» ఆర్వో తమ వద్ద ఉన్న అటెస్టింగ్ అధికారి సంతకంతో సరి పోల్చి ఒకే విధంగా ఉంటే ఆమోదిస్తారు. లేకపోతే తిరస్కరిస్తారు.» ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాతే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం మొదలవుతుంది.» తొలుత కవర్ ఏ ఓపెన్ చేసి అందులోని ఫారం 13 బీ బ్యాలెట్ పేపర్‌ను ఓపెన్ చేస్తారు.» 13 ఏపై ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్, 13 బీ మీద ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్ సరిపోలాలి.» ఈ రెండు నెంబర్లలో తేడా ఉంటే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించాలి.» ఏజెంట్లు తమ ఫిర్యాదులు ప్రతీది లిఖిత పూర్వకంగా ఇవ్వాలిపోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఇలా» జూన్ 4 ఓట్ల లెక్కింపు తొలుత పోస్టల్ బ్యాలెట్లతోనే మొదలవుతుంది. ఉదయం 8 గంటల కల్లా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో ఏజెంట్లు ఉదయం 6 గంటలలోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. కౌటింగ్ కేంద్రంలో మొత్తం 15 టేబుళ్లు ఉంటాయి. ఒకవైపు ఏడు మరో వైపు ఏడు చొప్పున అమర్చి చుట్టూ కంచె వేస్తారు. ఈ రెండు వరుసల మధ్యలో రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం టేబుల్ ఉంటుంది. ఆర్వో పర్యవేక్షణలోనే మొత్తం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. » పోస్టల్ బ్యాలెట్లలో రెండు రకాలుంటాయి. మిలటరీలో సేవలందించే వారు ఎలక్ట్రానిక్ రూపంలో పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోగా 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, కోవిడ్ బాధితులు, పోలింగ్ రోజు విధులు నిర్వహించిన ఉద్యోగులు సాధారణ విధానంలో పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఈ రెండు విధానాల్లోనూ ఓట్ల లెక్కింపు ఒకే రకంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేసిన వారి క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వివరాలను తెలుసుకుంటారు. » పోస్టల్ బ్యాలెట్లో రెండు రకాల కవర్లు ఏ, బీతో పాటు మూడు రకాల ఫారమ్స్ 13 ఏ, 13 బీ, 13 సీ ఉంటాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్‌ను ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు వినియోగించుకున్నారా? లేదా? అనేది పరిశీలించి లెక్కింపు అర్హతను నిర్థారిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఇదే అత్యంత ప్రధానమైనది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందా? లేదా? ఎలాంటి సందర్భాల్లో ఏజెంట్లు అభ్యంతరం చెప్పవచ్చో ఇప్పుడు చూద్దాం.. -
వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై టీడీపీ మూకల హత్యాయత్నం
మైదుకూరు: పోలింగ్ రోజు ఏజెంట్‌గా కూర్చున్నాడనే అక్కసుతో వైఎస్సార్ జిల్లా మైదుకూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డిపై బుధవారం సాయంత్రం టీడీపీ వర్గీయులు హత్యాయత్నం చేశారు. బాధితుడి కథనం ప్రకారం... చాపాడు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డి సమగ్ర శిక్ష అభియాన్‌లో ఏఈగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన మైదుకూరులోని బద్వేలు రోడ్డులో నివాసముంటున్నారు. ఈ ఎన్నికల్లో స్వగ్రామం విశ్వనాథపురంలో పోలింగ్ సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ తరపున ఏజెంట్‌గా కూర్చున్నారు.అంతకుముందు రోజు టీడీపీ వర్గీయులు ఏజెంట్‌గా కూర్చోవద్దని బెదిరించారు. వారి బెదిరింపులకు తలొగ్గక ఆయన వైఎస్సార్సీపీ ఏజెంట్‌గా కూర్చున్నారు. ఆ కడుపుమంటతో టీడీపీ వర్గీయులు చంద్ర ఓబుళరెడ్డి ప్రొద్దుటూరు రోడ్డులోని బైపాస్ వద్దకు రోజూ వాకింగ్‌కు వస్తుంటారని తెలుసుకుని.. బుధవారం సాయంత్రం అదే రోడ్డులోని ఏవీఆర్ స్కూల్ వద్ద కాపు కాశారు. వాకింగ్ ముగించుకుని వస్తున్న చంద్ర ఓబుళరెడ్డిపై విశ్వనాథపురం గ్రామానికి చెందిన కార్తీక్ రెడ్డి, ఇల్లూరు సుబ్బారెడ్డి, బొచ్చు సుబ్బారెడ్డి, మరో ముగ్గురు దాడి చేసి బీర్ బాటిళ్లతో తలపై కొట్టారు.‘చెప్పినా వినకుండా ఏజెంట్‌గా కూర్చుంటావా...ఇప్పుడే నిన్ను చంపుతాం..’ అంటూ కేకలు వేశారు. వారి దెబ్బలకు తీవ్రంగా గాయపడిన చంద్ర ఓబుళరెడ్డి స్పృహ తప్పి కింద పడిపోయాడు. అయినా విడిచి పెట్టకుండా నిందితుల్లో కొందరు బండరాయిని ఎత్తి తలపై మోదేందుకు ప్రయత్నించారు. సమీపంలో ఉన్న కొందరు మహిళలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అతన్ని వదిలేసి తమ వెంట తెచ్చుకున్న బైకులపై పరారయ్యారు. తలపై తీవ్ర గాయాలైన చంద్ర ఓబుళరెడ్డిని మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు.సంఘటన గురించి తెలియగానే ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌కు ముందు రోజే టీడీపీ వారు బెదిరించారని బాధితుని భార్య, కుమారుడు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేకు తెలిపారు. పథకం ప్రకారమే దాడి చేసి హత్యాప్రయత్నం చేశారని వారు చెప్పారు. దాడి సమాచారం తెలియగానే చాపాడు ఎంపీపీ తెలిదేల లక్ష్మయ్య, మండల నాయకులు, మైదుకూరు సింగిల్ విండో చైర్మన్ మూలె సుధాకర్‌రెడ్డి, ఖాజీపేట వైఎస్సార్సీపీ నాయకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మైదుకూరు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఎంఆర్ఎఫ్ సుబ్బయ్య తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మైదుకూరు డీఎస్పీ వెంకటేశులు, రూరల్, అర్బన్ సీఐలు శ్రీనాథరెడ్డి, ఏపీ మస్తాన్ ఆస్పత్రికి వచ్చి చంద్ర ఓబుళరెడ్డితో మాట్లాడారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. -
లాటరీ ఏజెంట్ జాక్‌పాట్.. అమ్ముడుపోని ఆ టికెట్‌తోనే..
అదృష్టం ఎప్పుడు, ఎలా వరిస్తుందో చెప్పలేం. అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయి. కేరళకు చెందిన ఎన్కే గంగాధరన్, బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ జీవితాలు అలాగే మారిపోయాయి. కోటీశ్వరులయ్యారు. కేరళలో లాటరీ (Kerala Lottery) ఏజెంట్ అయిన ఎన్‌కె గంగాధరన్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఫిఫ్టీ ఫిఫ్టీ లాటరీలో అమ్ముడుపోని లాటరీ టికెట్ విజేత నంబర్‌గా మారడంతో అతనికి అదృష్టవశాత్తూ కోటి రూపాయలు వచ్చాయి. ఈ విజయం ఆయన లాటరీ స్టోర్‌కు మొదటిది కావడంతో పాటు మరింత ప్రత్యేకమైనదిగా నిలిచింది. 33 సంవత్సరాలు బస్ కండక్టర్‌గా పని చేసిన గంగాధరన్ ఆ తర్వాత కోజీకోడ్‌లో లాటరీ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తన దుకాణంలో మొదటి విజేత ఆయనే కావడం గమనార్హం. అమ్ముడుపోకుండా తన మిగిపోయిన లాటరీ టికెట్టే ఆయనకు కోటి రూపాయలను తెచ్చింది. మరో ట్విస్ట్ ఏంటంటే అదే డ్రాలో గంగాధరన్ స్టోర్ నుంచి టిక్కెట్లు కొనుగోలు చేసిన మరో ఆరుగురు కూడా ఒక్కొక్కరూ రూ.5,000 గెలుచుకున్నారు. దీంతో లాటరీ ఏజెంట్‌కి, ఆయన కస్టమర్లకు ఆనందాశ్చర్యాలను కలిగించింది. ఆఫర్లో వచ్చిన టికెట్‌కి రూ. 44 కోట్లు బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ వాటక్కే కోరోత్, అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్‌ల (సుమారు రూ. 44 కోట్లు) గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నాడు. అయితే మొదట్లో ఇది స్కామ్‌గా భావించిన అరుణ్ నంబర్‌ను కూడా బ్లాక్ చేస్తూ కాల్‌ను డిస్కనెక్ట్ చేశాడు. అరుణ్ కుమార్ 'బై టు గెట్ వన్ ఫ్రీ' ఆఫర్లో ఈ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. ఆఫర్ కింద వచ్చిన ఆ టికెట్‌కే జాక్‌పాక్ తగిలింది. -
ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు?
వేర్పాటువాది నిజ్జర్ హత్య అనంతరం భారత్, కెనడాల మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. తాజాగా కెనడాలో నివసిస్తున్న ముస్లింలు ఈ ఉదంతంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు భారత్ తీరును తప్పుపడుతూ, ఖలిస్తానీలకు మద్దతు పలుకుతున్నారు. గతవారంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. నిజ్జర్ హత్యకు భారతదేశమే కారణమని ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మొదలైంది. ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను సస్పెండ్ చేశాయి. క్రమంగా ఈ వివాదం పెరుగుతూ వస్తోంది. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. సోదరభావంతో సిక్కులు, ముస్లింలు తాజాగా కెనడాలో నివసిస్తున్న ఒక ముస్లిం న్యాయవాది మాట్లాడుతూ నిజ్జర్ హత్య ఉదంతం తమను ఆందోళనకు గురిచేసిందన్నారు. సిక్కు నేత హత్య తర్వాత దేశంలోని వాతావరణం అధ్వాన్నంగా మారిందన్నారు. జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు. ఇక్కడ ముస్లింలు, సిక్కులు సోదరభావంతో మెలుగుతుంటారన్నారు. గత జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమైన విషయం విదితమే. భారత్‌పై కఠిన వైఖరి అవలంబించాలి భారత్-కెనడా వివాదం కారణంగా కెనడాలోని పలువురు ముస్లిం కార్యకర్తలు మైనారిటీలకు మరింత రక్షణ కల్పించాలని కోరుతున్నారని ఆ న్యాయవాది తెలిపారు. భారత్‌పై కఠిన వైఖరిని అవలంబించాలని వారు కోరుతున్నారన్నారు. ప్రధాని మోదీ ముస్లింలపై వివక్ష చూపుతున్నారని కొందరు ముస్లిం కార్యకర్తలు ఆరోపిస్తున్నరని ఆ న్యాయవాది తెలిపారు. ట్రూడో ప్రభుత్వం భద్రత కల్పించాలి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కెనడియన్ ముస్లిం (ఎన్సీసీఎం) అడ్వకేసీ గ్రూప్ హెడ్ స్టీఫెన్ బ్రౌన్ మీడియాతో మాట్లాడుతూ ట్రూడో ప్రభుత్వం కెనడియన్ ముస్లింలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కెనడాలో భారత ప్రభుత్వ ఏజెంట్లు చాలా చురుగ్గా వ్యవహరిస్తారని, వారు వలసవాదులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ట్రూడో ప్రభుత్వం తమ భద్రతకు హామీ ఇవ్వాలని, దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని కెనడియన్ ముస్లింలు కోరుతున్నారని బ్రౌన్ తెలిపారు. ‘ఉర్దుస్తాన్’ కూడా ఏర్పాటు చేయాలని.. ఇండియా- కెనడా వివాదం మధ్య ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం ఉగ్రవాది పన్నూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్లాన్ చేశాడు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని భావించాడు. ఖలిస్తాన్ మాత్రమే కాదు, ముస్లింల కోసం ప్రత్యేక దేశంగా ‘ఉర్దుస్తాన్’ కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. కాగా భారతదేశంలో ఉగ్రవాది పన్నూపై డజనుకు పైగా కేసులు నమోదయ్యాయి. అతని ఆస్తులను కూడా జప్తు చేశారు. విద్యార్థుల ఆందోళన ఇదిలా ఉండగా కెనడాలోని భారతీయ విద్యార్థుల బహిష్కరణ అంశం మరింత వేడెక్కుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ, పలువురు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడాలో చదువుకుంటున్నవారిలో ఎక్కువ మంది పంజాబ్‌కు చెందిన విద్యార్థులున్నారు. నకిలీ ఆఫర్ లెటర్ల ద్వారా తమకు కెనడా యూనివర్సిటీలు, కాలేజీల్లో అడ్మిషన్ ఇచ్చారని ఈ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చదువుకుని, భవిష్యత్తును మెరుగుపరుచుకునేందుకు కెనడాకు వచ్చిన ఈ విద్యార్థులు భారత్‌లోని ట్రావెల్ ఏజెంట్లను తప్పుపడుతున్నారు. ఇది కూడా చదవండి: డార్క్ ఎర్త్ అంటే ఏమిటి? శాస్త్రవేత్తలు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? -
ఏజెంట్ బ్యూటీ ధరించిన డ్రస్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే!
ఏజెంట్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాక్షి వైద్య.. తన ట్రెండీ రీల్స్.. ట్రెండీ లుక్స్‌తో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకుంది. నేను హీరోయిన్ అయ్యాను ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను. లాక్డౌన్లో రీల్స్ చేయడం, ఆడిషన్స్ ఇవ్వడం తర్వాత సినిమాలో నటించటం.. వీటన్నింటినీ తలచుకుంటే నా జీవితం నాకే సర్ప్రైజ్గా అనిపిస్తోందని అంటోంది సాక్షి వైద్య. ఆమెకు అంతటి ఫాలోయింగ్‌ని పెంచడంలో ఈ ఫ్యాషన్ బ్రాండ్స్ సృష్టించిన స్టయిల్ రోల్ తక్కువేం కాదు! --సాక్షి వైద్య దేబ్యానీ.. మహారాణిగా మెరిసిపోవాలంటే దేబ్యానీ దుస్తులను ధరించాల్సిందే! నిజాం, మొఘల్స్ రాచరికం ఉట్టిపడేలా వీరి చీరలు, అనార్కలీలు, షరారాలు ఉంటాయి. అదే వీరి బ్రాండ్ వాల్య. ఆఫ్ బీట్ ఫ్యూజన్ వేర్, డ్రేప్, బస్టియర్, బంధనీ ప్రింట్స్, చందేరీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్‌తో లభించే ఈ బ్రాండ్ దుస్తులను సెలబ్రిటీలు తెగ ఇష్టపడతారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోన లభ్యం. ఇంతకీ ఆమె ధరించిన దేబ్యానీ డ్రస్ ధర రూ. 100,000/- కర్ణిక జ్యూయెల్స్.. ష్యాషన్‌కి తగ్గ ఆభరణాలతోనే అందం మరింత పెరుగుతుందన్న మాటను బలంగా నమ్మింది కర్ణిక జ్యూయెల్స్ ఫౌండర్ నిత్యారెడ్డి. అందుకే, ఎప్పటికప్పడు ఆకట్టుకునే అందమైన, వైవిధ్యమైన డిజైన్స్‌ని రపొందిస్త కర్ణిక జ్యూయెల్స్ని టాప్ మోస్ట్ సెలబ్రిటీ బ్రాండ్‌గా నిలిపింది. అన్ని రకాల బంగారు, వెండి, బంగారు పూత నగలతో పాటు, ఫ్యూజన్, నక్షి, నవరతన్, స్వరోవ్స్కీ వంటి ఇతర బ్రాండ్ల నగలూ ఇక్కడ లభిస్తాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా కొనుగోలు చేసే వీలుంది. జ్యూలరీ బ్రాండ్: కర్ణిక జ్యూయెల్స్ రూ. 33,000/- (చదవండి: చీర కట్టుతో మతి పోగొడుతున్న.. ఈ ముద్దుగుమ్మ ధరించిన చీర ఎంతంటే..) -
పాక్ యువతి ట్రాప్‌లో డీఆర్డీఓ సైంటిస్ట్.. కీలక రహస్యాల చేరవేత..
పుణె: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న డీఆర్డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పాక్ ఏజెంట్‌కు రక్షణ రంగ రహస్యాలను లీక్ చేశాడని దర్యాప్తులో తేలింది. అలియాస్ జరా దాస్‌గుప్తాగా పరిచయమైన పాకిస్థాన్ యువతి కురుల్కర్తో వాట్సాప్ చాట్ ద్వారా మిస్సైల్ సిస్టమ్‌లోని నిగూఢమైన రహస్యాలను రాబట్టింది. డీఆర్డీఓలో ఓ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్న కురుల్కర్ని మే 3న ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన కస్టడిలో ఉన్నారు. ప్రదీప్ కురుల్కర్కు పాక్ యువతి జరా దాస్‌గుప్తాగా పరిచయమైంది. యూకేలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పి ప్రదీప్‌కు దగ్గరైంది. అనంతరం వాట్సాప్ చాట్, కాల్స్, అశ్లీల వీడియోలతో పాక్ యువతి ప్రదీప్ కురుల్కర్‌ను లోబరుచుకుంది. దర్యాప్తులో జరా దాస్ ఐడీ పాకిస్థాన్‌గా గురించినట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణి, డ్రోన్, యూసీవీ, అగ్ని క్షిపణి లాంఛర్తో పాటు మిలిటరీ బ్రిగేడ్ సిస్టమ్‌కు సంబంధించిన అనేక రహస్యాలను ప్రదీప్ కురుల్కర్ జరా దాస్‌గుప్తాకు షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వీరివురూ 2022 జూన్ నుంచి 2022 డిసెంబర్ వరకు టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ అధికారులు కురుల్కర్‌పై అనుమానంతో దర్యాప్తు చేపట్టగా.. 2022 ఫిబ్రవరిలో ఆమె నెంబర్‌ను ఫోన్ నుంచి డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి రాగా.. అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: Violence On Elections Voting: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి.. -
ఫ్లాప్స్ తట్టుకోలేక యూ టర్న్ తీసుకున్న అక్కినేని బ్రదర్స్
-
ఓటీటీలో అఖిల్ 'ఏజెంట్' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్ అప్పుడే
అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటించింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్‌గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్‌కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్‌పై మరో కన్ఫ్యూజన్ వచ్చి పడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు(మే19)నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కూడా సోనీలివ్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. చదవండి: షూటింగ్లో ప్రమాదం.. సల్మాన్‌ఖాన్‌కు గాయాలు అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ ఏజెంట్ స్ట్రీమింగ్‌ను వాయిదా వేసింది. థియేటర్ రిలీజ్‌కు, ఓటీటీ విడుదలకు కనీసం 20 రోజుల గ్యాప్ కూడా లేకపోవడంతో మరో వారం పాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. మే26న ఏజెంట్ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. Were is #Agent OTT RELEASE MAY 19 @SonyLIV @SonyLIVHelps pic.twitter.com/gLANHasQ1S — OTTGURU (@OTTGURU1) May 19, 2023 -
ఇప్పటికే డైరెక్టర్ ని వెనకేసుకొస్తున్న ఏజెంట్ ప్రొడ్యూసర్
-
పూజా హెగ్డేతో డేట్‌కు వెళ్లాలనుంది : అఖిల్ అక్కినేని
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఫలితంగా రిలీజైన తొలిరోజే నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా అఖిల్ కెరీర్లో ఇంకో డిజాస్టర్‌గా ఏజెంట్ మిగిలిపోయింది. చదవండి: (ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్‌ను ఆపేసిన పోలీసులు.. వీడియో వైరల్) ఇక సినిమా ఫెయిల్యూర్‌పై స్వయంగా నిర్మాత అనిల్ సుంకర కూడా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లాం, తప్పు జరిగింది అంటూ ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రీసెంట్గా సుమ షోకి గెస్టుగా వెళ్లిన అఖిల్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఏ హీరోయిన్గా డేట్‌కి వెళ్తారు అని అడగ్గా.. ఏమాత్రం ఆలోచన లేకుండా పూజా హెగ్డే అంటూ ఠక్కున సమాధానం చెప్పాడు. ఇక హీరో రామ్‌చరణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, హార్ట్‌బీట్ అంటూ పేర్కొన్నాడు. ఇక నాగార్జునకు తెలియకుండా గోడదూకి వెళ్లానని, ఇప్పటికీ ఆయనకు ఈ విషయం తెలియదంటూ సీక్రెట్ బయటపెట్టేశాడు అఖిల్. చదవండి: బ్రేకప్ అయినా ఇంకా నేనే కావాలని కోరుకుంటున్నాడు: నటి -
ఆ ఆఫర్ స్కామ్ అనుకున్నాను
‘‘తెలుగులో నా తొలి సినిమా ‘ఏజెంట్’. మంచి సినిమాతో పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు సాక్షీ వైద్య. అఖిల్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘ఏజెంట్’. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సాక్షీ వైద్య మాట్లాడుతూ – ‘‘వృత్తి రీత్యా నేను ఫిజియోథెరపిస్ట్‌ని. కోవిడ్ సమయంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చేశాను. అవి వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నా స్నేహితుల సలహా మేరకు కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చినా నచ్చలేదు. కాగా ‘ఏజెంట్’ ప్రొడక్షన్ టీమ్ నుంచి ఒకరు ఫోన్ చేసి హీరోయిన్ చాన్స్ గురించి చెప్పారు. ఈ ఆఫర్‌ను నేను మొదట్లో స్కామ్ అనుకున్నాను. కానీ ముంబైలో ఉన్న ఓ కాస్టింగ్ డైరెక్టర్ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పెద్ద బేనర్ అని, పెద్ద దర్శకుడు, పెద్ద స్టార్ అని చెప్పగానే హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. ‘ఏజెంట్’ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో పైలెట్ పాత్రలో కనిపిస్తాను. ‘ఏజెంట్’ నాకు మంచి అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో ‘గాంఢీవదారి అర్జున’ చేస్తున్నాను’’ అన్నారు. -
డైరెక్షన్ ఆలోచన ఉంది
‘‘ఏజెంట్’ ఒక యాక్షన్ ఫిల్మ్. ముగ్గురు ఏజెంట్స్ మధ్య జరిగే కథ ఇది. కథ భిన్నంగా ఉంటుంది. భావోద్వేగాలు కూడా బలంగా ఉంటాయి. అఖిల్ కెరీర్లో ‘ఏజెంట్’కి ముందు, ‘ఏజెంట్’కి తర్వాత అనేలా ఉంటుంది. విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉంటాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇచ్చే చిత్రం ఇది’’ అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు. అఖిల్ అక్కినేని, సాక్షీ వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు యంగ్ హీరోలు డూప్ లేకుండా చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఒక నిర్మాతగా సేఫ్టీ చూసుకోమని యాక్షన్ కొరియోగ్రాఫర్‌కి చెప్తాను. ఈ మధ్య విజయవాడలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో అఖిల్ దాదాపు 170 అడుగుల ఎత్తు నుంచి దూకాడు. రోప్స్ కట్టినప్పటికీ రిస్క్ ఎందుకని నేను వద్దన్నాను. అయితే అఖిల్ చేస్తానన్నాడు. క్రెడిట్ అంతా తనకే దక్కుతుంది. ‘ఏజెంట్’లో ప్రేక్షకులు ఇలాంటి సాహసాలు చాలా చూస్తారు. ఇది భారీ స్పాన్ ఉన్న సినిమా. ఇందులో గంటన్నర కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటాయి. అందుకే చాలా సమయం పట్టింది. ‘ఏజెంట్’ని ముందు తెలుగులో రిలీజ్ చేసి, రెండో వారం నుంచి ఇతర భాషల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం. హిందీలో ఇప్పటికే డబ్బింగ్ పూర్తయింది. నాకు దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. నా డైరెక్షన్లో స్పై జోనర్లో సినిమా ఉంటుంది. మా 14 రీల్స్ బ్యానర్లో ఈ ఏడాది బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ప్రస్తుతం చిరంజీవిగారితో నిర్మిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదలకి డేట్ ఫిక్స్ చేశాం’’ అన్నారు. -
వరంగల్‌లో ‘ఏజెంట్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక
-
వారి ప్రేమ, అభిమానం గొప్పవి
‘‘అక్కినేని ఫ్యాన్స్ ప్రేమ, ప్రేక్షకుల అభిమానం ఎంతో గొప్పవి. అభిమానుల ఆదరణ లేకుంటే సినిమాలు హిట్ కావు. అఖిల్‌కి చిన్నప్పటి నుంచి కష్టపడే స్వభావం ఉంది. తనలో ఎంతో ఎనర్జీ ఉంది.. ‘ఏజెంట్’ సినిమాతో ఆ ఎనర్జీని సురేందర్ రెడ్డి బయటకు తీశాడు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’’ అని హీరో నాగార్జున అన్నారు. అఖిల్, సాక్షీ వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన ‘ఏజెంట్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘పోరాటాలకు అడ్డా... వీరత్వానికి ఇంటి పేరు వరంగల్. ఓ సినిమా బ్లాక్ బస్టర్ కావాలంటే ఏం కావాలో అవి సమకూర్చుకోవడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు పొందారు. ఈ సినిమాను ఇంత గ్రాండ్‌గా తెరకెక్కించడంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర రాజీ పడలేదు. ‘ఏజెంట్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్న సాక్షీ వైద్యకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ మూవీలో నటించేందుకు నటుడు మమ్ముట్టి ఒప్పుకోవడం గొప్ప విషయం. మా చిత్రం హిట్ చేస్తే మంత్రి దయాకర్రావుగారు చెప్పినట్లు మా ప్రతి సినిమా వేడుకకు తప్పకుండా వరంగల్‌కు వస్తాం. తెలుగు ప్రేక్షకులు గొప్పవాళ్లు.. మంచి సినిమాలను తప్పకుండా హిట్ చేస్తారు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ– ‘‘షూటింగ్.. ఆడియో రిలీజ్.. ప్రీ రిలీజ్.. ఇలా ఏదో ఒక కార్యక్రమం వరంగల్‌లో నిర్వహించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటున్న ‘ఏజెంట్’ కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ– ‘‘నా మైండ్‌లో ఒకటే ఉంది. ‘ఏజెంట్’ ని ఇంత హైలో పనిచేసిన తర్వాత నెక్ట్స్ ఏం చేయాలనే ప్రశ్న నాలో కలుగుతోంది’’ అన్నారు. ఈ వేడుకలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, సాక్షీ వైద్య, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. -
షూటింగ్లో నటితో అసభ్యంగా ప్రవర్తించిన అఖిల్? అసలు విషయమిదే!
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తాజాగా అఖిల్ ఏజెంట్ మూవీలో ఓ ప్రత్యేక సాంగ్‌లో ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు తాను సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా చెప్పుకునే వివాదస్పద సినీ క్రిటిక్ ఉమైర్ సంధుపై బాలీవుడ్ నటి ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను చేసిన ఫేక్ ట్వీట్‌పై ఊర్వశి ఫైర్ అయింది. ఇలాంటి ఫేక్ పోస్ట్ చేసినందుకు అతనిపై పరువునష్టం దావా వేసినట్లు తెలిపింది బాలీవుడ్ బ్యూటీ. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. అసలు ట్వీట్లో ఏముంది? అఖిల్ అక్కినేని.. ఊర్వశి రౌతేలాతో ఏజెంట్ మూవీ షూట్లో అసభ్యంగా ప్రవర్తించాడని ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను చూసిన బాలీవుడ్ భామ ఇది ఫేక్ అంటూ కొట్టిపారేసింది. అంతటితో వదలకుండా అతనిపై విమర్శల దాడి చేసింది. నువ్వు జర్నలిస్టే కాదంటూ చురకలంటించింది. ఇలాంటి ఫేక్ వార్తలు తమ కుటుంబానికి చాలా అసౌకర్యంగా కలిగించాయని ఊర్వశి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంలో ఊర్వశి రౌతేలా అభిమానులు మద్దతుగా నిలిచారు. #AkhilAkkineni “ Harassed ” Bollywood Actress #UrvashiRautela during Item Song Shoot of #Agent in Europe. As per her, He is very immature kind of actor & feeling uncomfortable working with him. pic.twitter.com/4MR48Vtgxc — Umair Sandhu (@UmairSandu) April 18, 2023 View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
తన రిలేషన్ షిప్ స్టేటస్ బయటపెట్టేసిన అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల్ మాట్లాడుతూ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కొంతకాలంగా అఖిల్ పెళ్లిపై పలు వార్తలు వస్తున్నాయి. తాజాగా పెళ్లెప్పుడు అని అభిమాని అడిగిన ప్రశ్నకు అఖిల్ సమాధానిమిస్తూ..“అప్పుడే పెళ్లి చేసుకోమంటారా?” అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానంటూ తన రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ఇచ్చాడు. -
Agent Trailer Launch Event : ఏజెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రిపోర్టర్స్ ముక్కు సూటి ప్రశ్నలకు అఖిల్ స్మార్ట్ ఆన్సర్స్
-
హీరోయిన్ సాక్షి మాటలకూ అఖిల్,సురేందర్ రెడ్డి ఎలా నవ్వుతున్నారో చూడండి..
-
హీరోయిన్ సాక్షిని చాలా సార్లు తిట్టాను ఇంకా కొట్టడం ఏంటి..!
-
మెంటల్ గా, ఫిసికల్ గా నా లైఫ్ ని మొత్తం మార్చేసింది...
-
అఖిల్ ‘ఏజెంట్’ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
గర్ల్‌ఫ్రెండ్ గోవిందా.. బ్రేకప్ అయ్యిందంటున్న అఖిల్ అక్కినేని
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్గా నటించగా, మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘రామకృష్ణ గోవింద.. గోవింద హరి గోవింద...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. ‘ రామ పోయి కృష్ణ వచ్చె, బాధే పోయి హ్యాపీ వచ్చిందా, నైటే పోయి లైటే వచ్చె, ప్రేమే పోతూ పోతూ ఏదో ఏదో నేర్పించిందా.. గోవిందా గోవిందా గర్ల్‌ఫ్రెండ్ గోవిందా.. అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా, పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా, వచ్చిందా వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా..’ అంటూ ఈ పాట సాగుతుంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని రామ్ మిర్యాల పాడగా, శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. -
ఈసారి అఖిల్ అక్కినేనితో ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్
‘ఏజెంట్’ తో ప్రత్యేక స్టెప్పులు వేయనున్నారట హీరోయిన్ ఊర్వశీ రౌతేలా. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ స్పై ఫిల్మ్ ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. అయితే ఈ మూవీలోని ఓ ప్రత్యేక పాటలో ఊర్వశీ రౌతేలా డ్యాన్స్ చేయనున్నారని సమాచారం. అఖిల్, ఊర్వశీల మాస్ స్టెప్స్‌తో ఈ పాట అదిరిపోయే రేంజ్లో ఉంటుందట. ‘ఏజెంట్’ చిత్రం ఈ నెల 28న విడుదలకానుంది. కాగా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో ‘బాస్ పార్టీ..’ అనే స్పెషల్ సాంగ్‌లో తన డ్యాన్స్‌తో అలరించారు ఊర్వశి. అలాగే రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. కాగా ఊర్వశీ రౌతేలా ప్రధాన పాత్రలో నటించిన ‘బ్లాక్ రోజ్’ సినిమా తెలుగులో విడుదల కావాల్సి ఉంది.