
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’. ఇటీవలె ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్ మరో హిట్ ఖాతాలో వేసేందుకు తెగ కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడు. షూటింగ్ ప్రారంభించే ముందే తన లుక్స్ కోసం నెలల తరబడి కష్టపడుతున్నాడు. తాజాగా షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మారిన అఖిల్ న్యూ లుక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
జిమ్‌లో కండలు తిరిగిన బాడీతో బీస్ట్ లుక్‌లో అఖిల్ కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment