Akhil Akkineni Wants To Go Date With Pooja Hegde, Deets Inside - Sakshi
Sakshi News home page

Akhil Akkineni : నాన్నకు తెలియకుండా ఆ పని చేశా.. ఇప్పటికీ ఆయనకు తెలీదు

May 2 2023 11:38 AM | Updated on May 2 2023 12:11 PM

Akhil Akkineni Wants To Go Date With Pooja Hegde - Sakshi

అక్కినేని అఖిల్‌ నటించిన తాజా చిత్రం ఏజెంట్‌. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఫలితంగా రిలీజైన తొలిరోజే నెగిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా అఖిల్‌ కెరీర్‌లో ఇంకో డిజాస్టర్‌గా ఏజెంట్‌ మిగిలిపోయింది.

చదవండి: (ఏఆర్‌ రెహమాన్‌ లైవ్‌ కాన్సర్ట్‌ను ఆపేసిన పోలీసులు.. వీడియో వైరల్‌)

ఇక సినిమా ఫెయిల్యూర్‌పై స్వయంగా నిర్మాత అనిల్‌ సుంకర కూడా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లాం, తప్పు జరిగింది అంటూ ఓపెన్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రీసెంట్‌గా సుమ షోకి గెస్టుగా వెళ్లిన అఖిల్‌ పలు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఏ హీరోయిన్‌గా డేట్‌కి వెళ్తారు అని అడగ్గా.. ఏమాత్రం ఆలోచన లేకుండా పూజా హెగ్డే అంటూ ఠక్కున సమాధానం చెప్పాడు.

ఇక హీరో రామ్‌చరణ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, హార్ట్‌బీట్‌ అంటూ పేర్కొన్నాడు. ఇక నాగార్జునకు తెలియకుండా గోడదూకి వెళ్లానని, ఇప్పటికీ ఆయనకు ఈ విషయం తెలియదంటూ సీక్రెట్‌ బయటపెట్టేశాడు అఖిల్‌. చదవండి: బ్రేకప్‌ అయినా ఇంకా నేనే కావాలని కోరుకుంటున్నాడు: నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement